రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు సెక్షన్‌లు నీట మునిగిన నేపథ్యంలో విజయవాడ డివిజన్ మీదుగా నడిచే రైళ్లను రద్దు చేశారు. ఈ నెల 4న యర్నాకుళం–హతియ (22838), తాంబరం–సంత్రగచ్చి (22842), పుదుచ్చేరి–హౌరా (12868), న్యూ ఢిల్లీ–విశాఖపట్నం (20806), న్యూ ఢిల్లీ–చెన్నై సెంట్రల్ (12622), షిర్డీ సాయినగర్–మచిలీపట్నం (17207), హైదరాబాద్–షాలీమార్ (18046), నాగర్‌సోల్–నర్సాపూర్ (12788), ఈ నెల 5న యర్నాకుళం–టాటా (18190), ఈ నెల 6న కొచ్చివెల్లి–షాలీమార్ (6081), ఈ నెల 7న కన్యాకుమారి–హౌరా (12666), తిరునులివెల్లి–పురులియ రైళ్లను పూర్తిగా రద్దు చేశారు.
ఈ నెల 4న చెన్నై సెంట్రల్– శ్రీమాత వైష్ణోదేవి కాట్రా (16031) వయా విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, రాయ్‌పూర్, నాగ్‌పూర్ మీదుగా దారి మళ్లించి నడపనున్నారు. విశాఖపట్నం–ముంబై ఎల్‌టీటీ (18519), 12805 విశాఖపట్నం–లింగంపల్లి (12805), విశాఖపట్నం–విజయవాడ ప్రత్యేక రైలు (08581)ను మంగళవారం పునరుద్ధరించారు.
Comments
Please login to add a commentAdd a comment