విజయవాడ, సాక్షి: ఏపీలో చంద్రబాబు పాలన ఎంత అధ్వానంగా ఉందో చెప్పే పరిస్థితి ఇది. విజయవాడ ఎంపీతో పాటు కూటమి ఎమ్మెల్యేలు బహిరంగంగా ప్రభుత్వంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. బుడమేరు వరద సాయం ఇంకా పూర్తి స్థాయిలో అందలేదంటూ బహిరంగంగానే పెదవి విరిచారు. ఈ క్రమంలో.. ఇవాళ జరిగిన తొలి డీఆర్సీ సమావేశంలో సమస్యలను ఏకరువు పెట్టారు వాళ్లు.
బుడమేరు వరద సాయం ఇంకా చాలామందికి అందలేదంటూ డీఆర్సీలో ఎంపీ కేశినేని శివనాధ్(చిన్ని),ఎమ్మెల్యేలు నిజాలు ఒప్పుకున్నారు. బుడమేరు వరద ముంపు బాధితుల్లో బాధితులకు ఇంకా నష్టపరిహారం అందలేదు. మరోమారు ఎన్యుమరేషన్ చేయాలి అని ఎంపీ కేశినేని శివనాధ్(చిన్ని) అన్నారు. కొండచరియలు విరిగిపడి చనిపోయిన వారికి పరిహారం ఇవ్వలేదు. కొండ ప్రాంత ప్రజలను ఆదుకోవాలి అని ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు.
వరద బాధితులను ఇంకా కొంత మందికి నగదు అందలేదు. మేము బయటకు వస్తుంటే ప్రజలు అడుగుతున్నారు. అన్ని ప్రాంతాల్లో వాటర్ డ్యామేజ్ జరిగింది. బుడమేరు డైవర్షన్ చర్యలు తీసుకోవాలి. పట్టి సీమ నీళ్లు వదిలినప్పుడు బుడమేరులోకి వస్తున్నాయి. బుడమేరు వల్ల మైలవరం నియోజకవర్గం పూర్తిగా దెబ్బతింది. జి.కొండూరులో 13,800 ఎకరాల రైతులు ఇబ్బది పడుతున్నారు. 1 కోటి 20 లక్షల మోటార్లు రిపేర్లు ఉన్నాయి అని మైలవరం ఎమ్మెల్యే,వసంత కృష్ణప్రసాద్ అన్నారు.
నందిగామ ఎమ్మెల్యే,తంగిరాల సౌమ్య మాట్లాడుతూ.. నందిగామలో పంట పూర్తిగా దెబ్బతింది. రైతులకు నష్ట పరిహారం అందించాలని అన్నారు.
గన్నవరం ఎమ్మెల్యే,యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. విజయవాడ, అంబాపురం , గన్నవరంలో 200 కోట్లు అభివృద్ధి పనులు చేయాలి. అభివృద్ధి పనులకు నిధులు కేటాయంచాలి. విజయవాడ రూరల్ మండలంలో అభివృద్ధి చేయాలి అని అన్నారు.
ఇక జగ్గయ్యపేట ఎమ్మెల్యే,శ్రీరామ్ రాజగోపాల్ మాట్లాడుతూ.. త్రాగునీరు విషయంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ సమస్యను తక్షణమే పరిష్కరించాలని అన్నారు.
ధాన్యం కనుగోలు విషయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తిరువూరు,ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఆలోచన చేయాలి. తిరువూరులో పత్తి పంట కొనేవారు లేదు. పత్తి పండుతున్నా ఇక్కడ కొనుగోలు కేంద్రం లేదు..గుంటూరులో ఉంది అని గుర్త చేశారాయన.
ఇక.. పీడీఎఫ్ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ.. కండ్రిక, జక్కంపూడి ప్రాంతంలో ఇంకా ఆటో డ్రైవర్లకు పరిహారం అందలేదన్నారు. అలాగే.. ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా దెబ్బతిన్నాయని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment