aid
-
అమెరికా కార్చిచ్చు పెద్ద కుట్ర..?
-
‘బుడమేరు వరద సాయం ఇదేనా బాబూ?’
విజయవాడ, సాక్షి: ఏపీలో చంద్రబాబు పాలన ఎంత అధ్వానంగా ఉందో చెప్పే పరిస్థితి ఇది. విజయవాడ ఎంపీతో పాటు కూటమి ఎమ్మెల్యేలు బహిరంగంగా ప్రభుత్వంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. బుడమేరు వరద సాయం ఇంకా పూర్తి స్థాయిలో అందలేదంటూ బహిరంగంగానే పెదవి విరిచారు. ఈ క్రమంలో.. ఇవాళ జరిగిన తొలి డీఆర్సీ సమావేశంలో సమస్యలను ఏకరువు పెట్టారు వాళ్లు.బుడమేరు వరద సాయం ఇంకా చాలామందికి అందలేదంటూ డీఆర్సీలో ఎంపీ కేశినేని శివనాధ్(చిన్ని),ఎమ్మెల్యేలు నిజాలు ఒప్పుకున్నారు. బుడమేరు వరద ముంపు బాధితుల్లో బాధితులకు ఇంకా నష్టపరిహారం అందలేదు. మరోమారు ఎన్యుమరేషన్ చేయాలి అని ఎంపీ కేశినేని శివనాధ్(చిన్ని) అన్నారు. కొండచరియలు విరిగిపడి చనిపోయిన వారికి పరిహారం ఇవ్వలేదు. కొండ ప్రాంత ప్రజలను ఆదుకోవాలి అని ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు.వరద బాధితులను ఇంకా కొంత మందికి నగదు అందలేదు. మేము బయటకు వస్తుంటే ప్రజలు అడుగుతున్నారు. అన్ని ప్రాంతాల్లో వాటర్ డ్యామేజ్ జరిగింది. బుడమేరు డైవర్షన్ చర్యలు తీసుకోవాలి. పట్టి సీమ నీళ్లు వదిలినప్పుడు బుడమేరులోకి వస్తున్నాయి. బుడమేరు వల్ల మైలవరం నియోజకవర్గం పూర్తిగా దెబ్బతింది. జి.కొండూరులో 13,800 ఎకరాల రైతులు ఇబ్బది పడుతున్నారు. 1 కోటి 20 లక్షల మోటార్లు రిపేర్లు ఉన్నాయి అని మైలవరం ఎమ్మెల్యే,వసంత కృష్ణప్రసాద్ అన్నారు.నందిగామ ఎమ్మెల్యే,తంగిరాల సౌమ్య మాట్లాడుతూ.. నందిగామలో పంట పూర్తిగా దెబ్బతింది. రైతులకు నష్ట పరిహారం అందించాలని అన్నారు.గన్నవరం ఎమ్మెల్యే,యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. విజయవాడ, అంబాపురం , గన్నవరంలో 200 కోట్లు అభివృద్ధి పనులు చేయాలి. అభివృద్ధి పనులకు నిధులు కేటాయంచాలి. విజయవాడ రూరల్ మండలంలో అభివృద్ధి చేయాలి అని అన్నారు.ఇక జగ్గయ్యపేట ఎమ్మెల్యే,శ్రీరామ్ రాజగోపాల్ మాట్లాడుతూ.. త్రాగునీరు విషయంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ సమస్యను తక్షణమే పరిష్కరించాలని అన్నారు.ధాన్యం కనుగోలు విషయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తిరువూరు,ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఆలోచన చేయాలి. తిరువూరులో పత్తి పంట కొనేవారు లేదు. పత్తి పండుతున్నా ఇక్కడ కొనుగోలు కేంద్రం లేదు..గుంటూరులో ఉంది అని గుర్త చేశారాయన.ఇక.. పీడీఎఫ్ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ.. కండ్రిక, జక్కంపూడి ప్రాంతంలో ఇంకా ఆటో డ్రైవర్లకు పరిహారం అందలేదన్నారు. అలాగే.. ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా దెబ్బతిన్నాయని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. -
‘వరద’ సాయం పంపిణీలో హాహాకారాలు!
పాయకాపురం (విజయవాడరూరల్): వరద బాధితుల సహాయార్థం ప్రభుత్వం ఏర్పాటు చేసిన పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. కుక్కర్లు, గ్యాస్ స్టవ్‌ల పంపిణీ ప్రారంభించి.. ఒక్కసారిగా గేట్లు తీయడంతో బాధితులంతా కల్యాణ మండపంలోకి ప్రవేశించడంతో జరిగిన తొక్కిసలాటలో వృద్ధులు, మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడ కార్పొరేషన్ పరిధిలోని 64వ డివిజన్ కండ్రికలోని కల్యాణమండపంలో వరద బాధితుల సహాయార్థం టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి గ్యాస్‌స్టవ్‌లు, కుక్కర్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు.అయితే గురువారం రాత్రే టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలకు కూపన్లు పంపిణీ చేశారు. సర్వం కోల్పోయిన బాధితులంతా అక్కడికి చేరుకుని క్యూలైన్లలో నిలబడ్డారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే బొండా ఉమా, అధికార ప్రతినిధి పట్టాభి, బుద్ధా వెంకన్న పంపిణీ ప్రారంభించారు. కల్యాణ మండపం గేట్లు తెరవడంతో బాధితులంతా ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో భారీ ఎత్తున తోపులాట జరిగింది. వృద్ధులు, మహిళలు కిందపడిపోయారు. వారిపై బారికేడ్లు పడడం, వెనుక నుంచి వచ్చే వారు తొక్కుకుంటూ వెళ్లడంతో ఊపిరాడక హాహాకారాలు చేశారు. ఆ ప్రాంతమంతా బాధితుల ఆర్తనాదాలతో మార్మోగిపోయింది. వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయకపోవడంతో వారు తోపులాటలో చిక్కుకుని గాయపడ్డారు. పోలీసులు అదుపు చేయలేక చేతులెత్తేశారు. మహిళా పోలీసులు బారికేడ్లను తొలగించడంతో ప్రాణ నష్టం తప్పింది. టీడీపీ జనసేన కార్యకర్తలకే టోకెన్లు పంచుకున్నారు. ముఖాలు చూసి మరీ టోకెన్లు ఇచ్చారు. టీడీపీ జనసేన కార్యకర్తలే వరద బాధితులా? మేం బాధితులం కాదా అంటూ కండ్రిక వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
'బుడమేరు వరద' సాయం స్వాహా
విజయవాడస్పోర్ట్స్: బుడమేరు ముంపు వల్ల సర్వం కోల్పోయిన బాధితులకు దాతలు అందిస్తున్న సాయాన్ని టీడీపీ నాయకులు స్వాహా చేస్తున్నారు. వరద వల్ల ఈ నెల ఒకటో తేదీ నుంచి పది రోజులపాటు విజయవాడ నగర శివారులోని కొత్త రాజరాజేశ్వరిపేట, వాంబేకాలనీ, సుందరయ్యనగర్, శాంతినగర్, ప్రశాంతినగర్, కండ్రిక, రాజీవ్‌నగర్, ఉడా కాలనీ తదితర ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. బాధితుల ఆకలి తీర్చేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ఎంతోమంది ముందుకొచ్చారు. ఆటోలు, ట్రాక్టర్లు, లారీల్లో ఆహారం, నీళ్లు, దుప్పట్లు, సరుకులు తీసుకొచ్చారు. వాటిపై టీడీపీ నేతల కళ్లు పడ్డాయి. చాలావరకు సింగ్‌నగర్ ఫ్లై ఓవర్ ప్రాంతంలోనే వాటిని ఎగరేసుకుపోయారు. అంతటితో ఆగకుండా తమ పలుకుబడి ఉపయోగించి స్వచ్ఛంద సంస్థలు, దాతలు తెచ్చిన సరుకులు, దుప్పట్లు, దుస్తులు వంటివి సింగ్‌నగర్ కృష్ణా హోటల్ సమీపంలోని ఎమ్మెల్యే బొండా ఉమా కార్యాలయానికి తరలించారు. వాటిని పసుపు సంచుల్లో వేసి టీడీపీ పంపిణీ చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. ఈ సరుకుల పంపిణీకి కూడా పలు ప్రాంతాల్లో ముందుగా టోకెన్లు ఇస్తున్నారు. టోకెన్ల కోసం వాంబేకాలనీలోని ఫంక్షన్ హాలు వద్దకు గురువారం అధిక సంఖ్యంలో పేదలు చేరడంతో గందరగోళం నెలకొంది. అక్కడి నుంచి టోకెన్లు తీసుకుని టీడీపీ కార్యాలయానికి వెళితే షట్టర్ మూసి ఉందని పలువురు వరద బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. సాయం చేస్తామని చెప్పి వారం నుంచి టోకెన్లు, సరుకులు అంటూ తిప్పుకుంటున్నారని వాంబేకాలనీకి చెందిన మహిళలు కె.జయలక్ష్మి, ఎస్.కనకదుర్గ, ఎ.నాగమణి, కె.దుర్గాభవాని, వి.లక్ష్మి, బి.నాగరాణి, శాంతి, ఎస్.సన్యాసమ్మ తదితరులు ఆగ్రహం వ్యక్తంచేశారు.మహిళ పేరు బాణావతు మల్లేశ్వరి. టీడీపీ నాయకురాలు. 20 ఏళ్లుగా కొత్త రాజరాజేశ్వరిపేటలో నివసిస్తూ టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. బుడమేరు వరద కారణంగా ఆమె నివాసం ఉంటున్న కొత్త రాజరాజేశ్వరిపేట అంతా మునిగిపోయింది. తమ పేటలోని బాధితులకు దాతలు అందిస్తున్న సాయాన్ని టీడీపీ నేతలు స్వాహా చేస్తున్న విషయాన్ని తేల్చుకునేందుకు పలువురు మహిళలతో కలిసి మల్లేశ్వరి గురువారం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కార్యాలయం వద్దకు వెళ్లారు. అయితే కార్యాలయం షట్టర్ మూసి ఉంది. ‘మా ప్రాంతానికి ఇప్పటి వరకు టీడీపీ తరఫున ఎటువంటి సాయం చేయలేదు. స్వచ్ఛంద సంస్థలు, దాతలు ఇచ్చే సాయాన్ని కూడా మా పార్టీకే చెందిన మాజీ కార్పొరేటర్ యరబోతు రమణ పక్కదారి పట్టిస్తున్నాడు. సాయం చేసేందుకు వచ్చేవారిని మా పార్టీ నాయకులు వారి ఇళ్ల వద్దకు పిలిపించుకుని సరుకులు, దుస్తులు కాజేస్తున్నారు’ అని మల్లేశ్వరి ఆవేదన వ్యక్తంచేశారు. వరద నష్టం అంచనాలు కూడా కొందరి ఇళ్లకే పరిమితం చేశారని, సామాజిక పింఛన్లు ఇంకా ఇవ్వలేదని పలువురు మహిళలు ఆగ్రహం వ్యక్తంచేశారు.నీచమైన బతుకులు అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు మాకు ఎలాంటి సాయం చేయలేదు. సాయం చేసేందుకు వచ్చిన వారి నుంచి సరుకులన్నీ టీడీపీ నాయకులే తీసుకుంటున్నారు. వాటిని బయటపెట్టడం లేదు. ఎవరికీ పంచడం లేదు. మాకు అందాలి్సన వాటిని కాజేస్తూ నీచాతినీచమైన బతుకు బతుకుతున్నారు. ఎమ్మెల్యే బొండా ఉమా ఆఫీసుకు వెళ్లి అడిగితే రోడ్డు పక్కన పడేసే చిరిగిన దుస్తులు పంపించారు. వాటనీ్నంటినీ బుధవారం రాత్రి మా వీధిలో పడేసి తీసుకువచ్చిన టీడీపీ నాయకుల ముందే తగలబెట్టేశాం. – రాజులపాటి తిరుపతమ్మ, న్యూఆర్ఆర్పేటసాయం అడిగితే పార్టీలు అంటగడుతున్నారుఇంట్లో సామాన్లు అన్నీ పోయి ఇబ్బందులు పడుతున్నాం. సాయం చేయాలని అడుగుతుంటే టీడీపీ నాయకులు పార్టీలను అంటగడుతున్నారు. మా పార్టీకి ఓటు వేయలేదు... మీకు ఇవ్వం అని ముఖం మీదే చెప్పేస్తున్నారు. రెండు రోజుల క్రితం జగన్ పార్టీ వాళ్లు వచ్చి అందరికీ సాయం అందించారు. టీడీపీ వాళ్లు మాత్రం పార్టీల పేరుతో వేరు చేసి మాట్లాడుతున్నారు. వాళ్లు సాయం చేయకపోగా, సాయం చేసే వాళ్లని మా వరకు రానివ్వడం లేదు. – గుడిసే నాగమణి, న్యూఆర్‌ఆర్‌పేట -
ఉదారంగా సాయం చేయండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల ఊహించని విపత్తు తలెత్తిందని.. అపార నష్టాన్ని, కష్టాన్ని కలిగించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రజలను ఆదుకునేందుకు ఉదారంగా సాయం చేయాలని కేంద్రాన్ని కోరారు. వరద నష్టాలపై అంచనాల కోసం రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందం గురువారం సచివాలయంలో సీఎం చంద్రబాబుతో సమావేశమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో వచ్చిన ఈ విపత్తును సాధారణంగా.. గతంలో వచ్చిన వరదల్లా చూడొద్దు. రికార్డు స్థాయి వర్షాలు, ఆకస్మిక వరదలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేశాయి. రెండు రోజుల వ్యవధిలో 50 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కృష్ణా బ్యారేజీ చరిత్రలో ఇంత పెద్ద వరద ఎప్పుడూ రాలేదు. 11.90 లక్షల క్యూసెక్కుల వరదకు అనుగుణంగా ప్రకాశం బ్యారేజీ నిర్మాణం జరగ్గా.. మొన్న కురిసిన వర్షాలకు 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. 14 లక్షల క్యూసెక్కుల వరద వస్తే పరిస్థితి ఏంటనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. పంటలు నీట మునిగి రైతులు కుదేలయ్యారు. ప్రాణ, ఆస్తి నష్టంతో పాటు.. తాగడానికి నీళ్లు, తినడానికి తిండి లేక ప్రజలు ప్రాణభయంతో తీవ్ర క్షోభను అనుభవించారు. ప్రజలను తిరిగి నిలబెట్టేలా కేంద్రం సాయం చేసేలా చూడండి’ అని కేంద్ర బృందాన్ని కోరారు. ‘బుడమేరు’కు శాశ్వత పరిష్కారం కావాలన్నారు..అనంతరం కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సుబ్రహ్మణ్యం వరద ప్రాంతాల్లో తమ అనుభవాలను సీఎంకు వివరించారు. ‘భారీగా పంట నష్టం జరిగిందని, మౌలిక సదుపాయాలపరంగా తీవ్ర నష్టం జరిగిందని గుర్తించాం. బుడమేరు వరదలపై ప్రజలు తమ బాధలు చెప్పుకున్నారు. ఈ సమస్య నుంచి శాశ్వత పరిష్కారం చూపించాలని వారు కోరారు. తమకు ప్రభుత్వం సాయం చేస్తుందనే నమ్మకంలో ప్రజలున్నారు. మా పరిశీలనకు వచ్చిన అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి తగిన సాయం అందేలా కృషి చేస్తాం’ అని కేంద్ర బృందం తెలిపింది. ఎంఎస్ఎంఈలతో డ్వాక్రా సంఘాల అనుసంధానంరాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలను ఎంఎస్ఎంఈలతో అనుసంధానం చేసి, ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. డ్వాక్రా సంఘాల ఉత్పత్తులకు విలువ జోడించడం, ప్యాకింగ్ వంటి ఉమ్మడి సౌకర్యాల వినియోగంతో పాటు మార్కెటింగ్, టెక్నాలజీని అందుబాటులోకి తేవాలన్నారు. సీఎం చంద్రబాబు గురువారం సచివాలయంలో ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రోసెసింగ్ రంగాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష వివరాలను ఎంఎస్ఎంఈ మంత్రి కె.శ్రీనివాస్ విలేకరులకు వివరించారు. రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులను ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ద్వారా విక్రయించాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. విశాఖలోని ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ తరహాలోనే అమరావతిలో మరొకటి ఏర్పాటు చేసి, దానికి అనుబంధంగా 10కి పైగా వివిధ రంగాల హబ్ అండ్ స్పోక్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఎంఎస్ఎంఈ క్రెడిట్ గ్యారంటీ స్కీం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ అందిస్తోందని, కేంద్రం రూ.5,000 కోట్లు గ్యారంటీ ఇవ్వడంతో చిన్న పరిశ్రమలకు ఎటువంటి తనఖా అవసరం లేకుండా రుణాలు లభిస్తాయని అన్నారు.ఎంఎస్ఎంఈలకు ఇవ్వాల్సిన రూ.1,500 కోట్ల ప్రోత్సాహక బకాయీలను కూడా త్వరలోనే విడుదల చేస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో రైతుల భాగస్వామ్యంతో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుపై కసరత్తు చేయాలని సీఎం సూచించినట్లు తెలిపారు. రాజధానిలో రైతులకు లబ్ధి చేకూర్చిన విధానాన్నే ఈ ఎంఎస్ఎంఈ పార్కులకూ అవలంభించాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. రైతులు పండించే పంటలకు వారే విలువను పెంచుకునేలా పాలసీ తేవాలని సీఎం సూచించారు. విజయవాడ వరదల్లో దెబ్బతిన్న పరిశ్రమలను ఏ విధంగా ఆదుకోవాలన్నదానిపై కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు.సీఎం చంద్రబాబుతో తెలంగాణ మంత్రి ఉత్తమ్ భేటీతెలంగాణ రాష్ట్ర మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి, ఎమ్మెల్యే పద్మావతీరెడ్డి సీఎం నారా చంద్రబాబునాయుడును మర్యాద పూర్వంగా కలిశారు. వారు గురువారం మధ్యాహ్నం సచివాలయానికి వచ్చి సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. -
వరద సాయంపై వదిన-మరిది.. తలోమాట!
అమరావతి, సాక్షి: తెలుగు రాష్ట్రాలకు కేంద్ర సాయం విషయంలో తీవ్రమైన గందరగోళం నెలకొంది. తక్షణ సాయం కింద కేంద్రం మూడు వేల కోట్ల రూపాయలు ప్రకటించిందని ఓ ప్రచారం జరగ్గా.. కాసేపటికే అతి ఉత్తదని చంద్రబాబు ప్రకటనతో తేలిపోయింది. భారీ వర్షాలు, వరదల కారణంగా అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాలకు విపత్తు నిర్వహణ నిధి (ఎస్డీఆర్ఎఫ్) నుంచి రూ.3,448 కోట్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందని, తక్షణ సహాయక చర్యల కోసం ఈ నిధులు కేటాయిస్తున్నట్టు ఒక ప్రచారం మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర బృందాలతో పాటు పర్యటించిన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఈ మేరకు ప్రకటన చేశారన్నది ఆ ప్రచారసారాంశం. అయితే..ఒకవైపు.. కేంద్రం ఆ సాయాన్ని విడుదల చేసిందంటూ తన ఎక్స్ ఖాతాలో ఏకంగా ఓ పోస్ట్ చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి. త్వరగతిన సాయం విడుదల చేసినందుకుగానూ ఏపీ ప్రజల తరఫున నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్రానికి కృతజ్ఞతలు తెలియజేశారామె. మరోవైపు.. ఏపీ తెలంగాణకు తక్షణ సహాయం కింద ఎస్డీఆర్ఎఫ్ నుంచి 3,448 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తున్నామని, ఈ నిధులలో కేంద్ర ప్రభుత్వ వాటా ఉంటుందని, తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని, వరద నష్టం పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యవేక్షిస్తున్నారని శివరాజ్ సింగ్ పేరిట ఒక ప్రకటన విడుదలైంది. అయితే కాసేపటికే అది ఉత్తప్రచారం అని తేలింది.కేంద్రం ఇంకా సాయం ప్రకటించలేదు. అదంతా రూమర్ మాత్రమే. అసలు ఇంకా నష్టంపై నివేదికను కేంద్రానికి పంపనే లేదు. రేపు(శనివారం) ఆ రిపోర్టును పంపుతాం అని స్పష్టత ఇచ్చారు చంద్రబాబు. అధికారులపై మళ్లీ చిందులువరద బాధితులకు రేషన్ పంపిణీ విషయంలో సీఎం చంద్రబాబు.. మరోసారి అధికారులపై చిందులు తొక్కారు. ‘‘ఎక్కువ వాహనాలు పెట్టారు. మా వాళ్ళు పద్ధతి లేకుండా చేశారు.ప్యాకింగ్ కూడా సక్రమంగా చెయ్యలేదు. ఈరోజు రేషన్ పంపిణీ చేయలేకపోయాం అని యంత్రాంగంపై ఆక్రోశం ప్రదర్శించారు. ఇవాళ 80 వేలు కుటుంబాలకు ఇవ్వాలి అనుకున్నాం. ఈరోజు కేవలం 15 వేలు కుటుంబాలకే ఇచ్చాం. రేపు మరో 40 వేల కుటుంబాలకు అందించే ప్రయత్నం చేస్తాం. ఎల్లుండి నుండి సరుకులను రేషన్ షాపుల్లో మాత్రమే పంపిణీ చేస్తాం అని చంద్రబాబు వెల్లడించారు. -
స్వాతి మలివాల్‌పై దాడి కేసు.. కేజ్రీవాల్ సహాయకుడికి రిమాండ్
న్యూఢిల్లీ:ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) ఎంపీ స్వాతిమలివాల్‌పై దాడి కేసులో ప్రధాననిందితుడైన బిభవ్కుమార్కు కోర్టు 4 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో పోలీసులు బిభవ్‌కుమార్‌ను రిమాండ్‌కు తరలించారు. ఇటీవల తమ పార్టీ అధినేత కేజ్రీవాల్‌ను కలిసేందుకు సీఎం నివాసానికి వెళ్లినపుడు తనపై దాడి జరిగిందని స్వాతిమలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్‌కుమార్ తనను కింద పడేసి తన్నారని ఫిర్యాదులో తెలిపారు. ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ మలివాల్‌పై దాడి ఘటనపై రాజకీయ దుమారం పెద్దదవుతూనే ఉంది. -
Bihar: ఎన్నికల వేళ ఈడీ దూకుడు.. లాలూ సన్నిహితుడి అరెస్టు
పాట్నా: లోక్‌సభ ఎన్నికల వేళ బిహార్‌లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు ప్రదర్శిస్తోంది. ఆర్జేడీ పార్టీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్య అనుచరుడు, ఇసుక మైనింగ్ వ్యాపారి సుభాష్‌యాదవ్‌ను ఈడీ శనివారం(మార్చ్ 9) రాత్రి అరెస్టు చేసింది. మనీలాండరింగ్ కేసులో శనివారం తెల్లవారుజాము నుంచే సుభాష్‌యాదవ్‌కు చెందిన ఇళ్లు, ఆఫీసుల్లో మొత్తం ఆరు చోట్ల ఏకకాలంలో ఈడీ సోదాలు జరిపింది. ఈ సోదాలు ముగిసిన తర్వాత సుభాష్‌యాదవ్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. సోదాల్లో రూ.2.30కోట్ల నగదుతో పాటు పలు డాక్యుమెంట్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఇసుక అక్రమ మైనింగ్, అమ్మకాల ద్వారా రూ.161 కోట్లు ఆర్జించినట్లు సుభాష్‌యాదవ్‌కు చెందిన కంపెనీపై గతంలో కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని ఈడీ అరెస్టు చేసింది. కాగా, 2019లోక్‌సభ ఎన్నికల్లో సుభాష్ యాదవ్ ఆర్జేడీ టికెట్‌పై జార్ఖండ్‌లోని ఛాత్రా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. పాట్నాలోని గాంధీమైదాన్‌లో మార్చి 3న జరిగిన మహాబంధన్ జనవిశ్వాస్ మహా ర్యాలీలో సుభాష్ యాదవ్ చురుగ్గా పాల్గొన్నారు. ఈ ర్యాలీకి ప్రజల నుంచి భారీ స్పందన రావడం గమనార్హం. రాష్ట్రంలో ఇటీవలే ఆర్జేడీతో సంకీర్ణాన్ని వీడిన సీఎం నితీశ్‌కుమార్ నేతృత్వంలోని జేడీయూ పార్టీ బీజేపీతో జట్టుకట్టి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్రంలో ఆర్జేడీ ప్రస్తుతం ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనుండటంతో ఆర్జేడీ నేతలపై ఈడీదాడులు చరచర్చనీయాంశమయ్యాయి. ఇదీ చదవండి.. యూపీలో రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి -
ఉక్రెయిన్‌కు ఈయూ భారీ సాయం
బ్రస్సెల్స్: రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్‌కు సాయం చేసేందుకు యూరోపియన్ యూనియన్ సిద్ధంగా ఉంటుందని యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ చార్లెస్ మైకేల్ చెప్పారు. గురువారం బ్రస్సెల్స్‌లో సమావేశమైన ఈయూలోని 27 సభ్య దేశాల నేతలు ఉక్రెయిన్‌కు 54 బిలియన్ డాలర్ల (సుమారు రూ.4.48 లక్షల కోట్లు)సాయం ప్యాకేజీని అందించేందుకు అంగీకరించినట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన తీర్మానంపై కేవలం గంటలోపే చర్చించి ఆమోదించినట్లు వివరించారు. సాయానికి సంబంధించిన తీర్మానాన్ని వీటో చేస్తామంటూ సభ్య దేశం హంగెరీ ప్రధాని విక్టర్ ఓర్బాన్ కొంతకాలం చేస్తున్న హెచ్చరికలను కూడా పట్టించుకోలేదన్నారు. -
పాలస్తీనాకు భారత్ రెండోదఫా మానవతా సాయం
ఢిల్లీ: యుద్ధంతో అతలాకుతలం అవుతున్న పాలస్తీనాకు భారత్ రెండోసారి మానవతా సహాయాన్ని అందించింది. ఈజిప్టులోని ఎల్-అరిష్ ఎయిర్‌పోర్ట్‌కు 32 టన్నుల సాయంతో రెండో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సి17 విమానం బయలుదేరింది. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి జైశంకర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. పాలస్తీనాకు కావాల్సిన అన్ని రకాల మానవతా సహయాన్ని అందిస్తామని స్పష్టం చేశారు. భారతదేశం అక్టోబర్ 22న పాలస్తీనాకు వైద్య, విపత్తు సహాయాన్ని మొదటిసారి పంపించింది. గాజా స్ట్రిప్‌కు చేరుకోవడానికి చేరుకోవడానికి అల్-అరిష్ ఎయిర్‌పోర్టు అతి దగ్గరగా ఉంటుంది. ఇది రఫా బార్డర్ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో ప్రస్తుతం రఫా సరిహద్దు సమీపంలో పరిస్థితులు భీకరంగా తయారయ్యాయి. నిత్యం బాంబుల మోతతో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం అక్టోబర్ 7న ప్రారంభం అయింది. హమాస్ అంతమే ధ్యేయంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. రాకెట్ దాడుల అనంతరం భూతల యుద్ధం చేపట్టింది. హమాస్ మూకలను మట్టికరిపిస్తూ ఇప్పటికే ఉత్తర గాజాను ఆక్రమించింది. అటు దక్షిణ గాజాను కూడా ఖాలీ చేయాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు చేసింది. అటు అల్-షిఫా ఆస్పత్రిని రక్షణ కవచంగా హమాస్ మూకలు ఉపయోగించుకుంటున్నాయని ఆరోపిస్తూ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ సేనలు దాడులు చేస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ వైపు 1,200 మంది మరణించగా.. పాలస్తీనా వైపు 12,500 మంది మరణించారు. ఇందులో 5,000 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఇదీ చదవండి: దక్షిణ గాజాను వీడండి.. పాలస్తీనాకు ఇజ్రాయెల్ హెచ్చరికలు -
ఈజిప్ట్ గ్రీన్‌సిగ్నల్ .. గాజాకి అందనున్న మానవతా సాయం
గాజా ప్రాంతమంతా ఇజ్రాయెల్ దాడులతో ధ్వంసమైంది. వందల మంది ప్రాణాలు కోల్పోగా.. ఆవాసాలు కోల్పోయి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న వాళ్లు లక్షల్లోనే ఉన్నారు. ఆకలితో అలమటిస్తూ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మానవతా సాయం అందించేందుకు ఈజిప్ట్ అంగీకరించింది. ఇజ్రాయెల్‌కి తాజా పర్యటనలో గాజాకి రూ. 832 కోట్ల సాయం ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. అయితే, ఈ సాయం గాజాలోకి ప్రవేశించాలంటే గాజా-ఈజిప్ట్ సరిహద్దులోని రఫా క్రాసింగ్ దాటాల్సి ఉంటుంది. ఇప్పటికే మానవతా సాయం కింద సామగ్రితో కూడిన వందలాది ట్రక్కులు రఫా సరిహద్దు వద్ద బారులుతీరి ఉన్నాయి. కానీ, భద్రతా కారణాలను చూపిస్తూ ఈజిప్ట్ ఈ మార్గాన్ని మూసివేసింది. గాజా ప్రజలు తమ దేశంలోకి ప్రవేశించి స్థిరపడే అవకాశముందని, అలాగే ఉగ్రవాదులు తమ దేశంలోకి చొరబడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీంతో బైడెన్.. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసి Abdel Fattah El Sisi తో చర్చించి రఫా బార్డర్ క్రాసింగ్ తెరిపించేందుకు ఒప్పించారు. అయితే గాజాకు సాయం చేయడానికి మార్గం సుగమమైనప్పటికీ.. అది పరిమితంగానే ఉంటుందని ఈజిప్ట్ చెబుతోంది. పైగా హమాస్ దాడుల్లో రోడ్లు దెబ్బ తినడంతో.. వాటి పునరుద్ధరణకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అదే సమయంలో మరిన్ని దాడులు జరగవచ్చనే ఆందోళనను వ్యక్తం చేసింది. దీంతో శుక్రవారం నుంచి సాయం అందించేందుకు అనుమతిస్తామని ఈజిప్ట్ తెలిపింది. ఇదే విషయంపై జో బైడెన్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఈజిప్ట్ అధ్యక్షుడితో మాట్లాడాను. రఫా బార్డర్ తెరిచి మానవతా సాయం కింద ఇచ్చే సామగ్రితో కూడిన దాదాపు 20 ట్రక్కులను గాజాలోకి పంపించడానికి ఒప్పుకొన్నారు’’అని తెలిపారు. మరోవైపు అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌజ్ ప్రకటన ప్రకారం.. ‘‘గాజాకు మానవతా సాయం చేయడం కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసితో చర్చలు జరిపారు. ఐక్యరాజ్యసమితి అభ్యర్థన మేరకు ఇరు దేశాలు గాజాకు సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. అమెరికా, ఈజిప్ట్ దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతానికి ఇరుదేశాల అధినేతలు కట్టుబడి ఉన్నారు’’ అని పేర్కొంది. క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి -
సీఎం జగన్ మానవత్వం.. చిన్నారి వైద్యానికి రూ.41.5 లక్షల సాయం
అమలాపురం రూరల్: బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారి ప్రాణాన్ని కాపాడేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించారు. ఆమె వైద్యానికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.41.50 లక్షలు మంజూరు చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలుకు చెందిన తొమ్మిదేళ్ల బాలిక పలివెల బ్లెస్సీ కొన్నాళ్లుగా తలనొప్పితో బాధపడుతోంది. తల్లిదండ్రులు వైద్యులకు చూపించగా.. బ్రెయిన్ క్యాన్సర్‌గా వైద్యులు నిర్ధారించారు. చికిత్సకు రూ.41.50 లక్షలు అవుతుందని చెప్పారు. బిడ్డకు చికిత్స చేయించే స్తోమత లేకపోవడంతో తండ్రి రాంబాబు తల్లడిల్లిపోయారు. ఈ నేపథ్యంలో ఈ నెల 11న అమలాపురం పర్యటనకు వచ్చిన సీఎం జగన్ దృష్టికి తన బిడ్డ సమస్యను రాంబాబు.. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ద్వారా తీసుకువెళ్లారు. ఆ చిన్నారి సమస్య విని చలించిపోయిన సీఎం జగన్ రూ.41.50 లక్షలు మంజూరు చేశారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును మంత్రి విశ్వరూప్ భార్య బేబీమీనాక్షి, కుమారుడు డాక్టర్ శ్రీకాంత్ సోమవారం ఆ కుటుంబానికి అందజేశారు. చదవండి: దమ్ము లేకనే.. దత్తపుత్రుడు -
అమెరికా కంపెనీలకు మహీంద్రా సాయం
న్యూఢిల్లీ: వాహన రంగంలో ఉన్న కంపెనీలకు సాయం చేసేందుకు మహీంద్రా గ్రూప్ ఒక ప్రత్యేక వేదికను యూఎస్‌లో ఏర్పాటు చేసింది. యూఎస్ కంపెనీలు భారత్‌లో తయారీని విస్తరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు మహీంద్రా గ్రూప్ ఎండీ, సీఈవో అనీష్ షా సోమవారం తెలిపారు. నియంత్రణ, విధానపర అంశాల్లో తమకు అపార అనుభవం ఉందని ఆయన చెప్పారు. అమెరికన్ కంపెనీలు భారత్‌లో తయారీ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు.. సంస్థకు చెందిన నిపుణుల బృందం తయారీ మౌలిక వసతులు, సరఫరా వ్యవస్థ, సాంకేతిక వంటి అంశాల్లో తమ నైపుణ్యాన్ని అందజేస్తారని మహీంద్రా వెల్లడించింది. -
అమెరికా సాయం పొందిన దక్షిణ కొరియా ఏ స్థాయికి చేరింది?
పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం అక్కడ చదువుకున్న యువతను నేడు ఉపాధి కోసం విదేశాలకు వలసపోయేలా చేస్తోంది. మెరుగైన జీవనశైలి, మరింత నాణ్యత గల ఉన్నత విద్య కోసం భారతదేశం నుంచి యువతీ యువకులు అమెరికా, ఐరోపా తదితర పారిశ్రామిక దేశాలకు వెళుతున్నారు గాని స్వదేశంలో అవకాశాలు లేకకాదు. ఉద్యోగాలు లేక కాదు. 1971లో బంగ్లాదేశ్ అవతరణకు దారితీసిన భారత-పాకిస్తాన్ యుద్ధ సమయంలో పాకిస్తానీయులు ఏ స్థాయిలో విదేశాలకు తరలిపోయారో ఇప్పుడు అంత కన్నా ఎక్కువ మంది ఇతర దేశాలకు ఉపాధి కోసం వెళ్లిపోతున్నారు. 2022లో పాక్ నుంచి చదువుకున్న యువత 8,32,339 మంది విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించి వెళ్లిపోయారు. 2021తో పోల్చితే పాక్ నుంచి చదువుకున్నవారి వలస 189 శాతం పెరిగింది. 2023 మొదటి ఐదు నెలల్లో ఇలా ఇతర దేశాల్లో ఉపాధి కోసం వలసపోయినవారి సంఖ్య 3,15,787కు చేరుకుందని వలసలు, ఇతర దేశాల్లో ఉపాధి బ్యూరో (బీఈఓఈ) వెల్లడించింది. పాక్ అంతర్గత సంక్షోభ పరిస్థితుల కారణంగా ప్రతిభాపాటవాలున్న విద్యావంతులైన యువకులు విదేశాలకు వలసపోవడం ఎప్పటి నుంచో సాగుతోంది. ఇదే ధోరణి కొనసాగితే భవిష్యత్తులో అక్కడ ఉత్పత్తి, సేవల కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోయి స్థూల దేశీయ ఉత్పత్తి గణనీయంగా పడిపోతుంది. మరో పక్క పాక్ మాదిరిగానే కొన్ని దశాబ్దాలు సైనిక పాలనలో మగ్గిన దక్షిణ కొరియా గత 30 ఏళ్లలో అనూహ్య పారిశ్రామిక ప్రగతి సాధించింది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసే వరకూ జపాన్ పాలనలో మగ్గిన దక్షిణ కొరియా దేశ విభజనతో మరింత కుంగిపోయింది. అయితే, మహాయుద్ధంలో జపాన్ ను ఓడించిన అమెరికా దక్షిణ కొరియా ప్రగతి బాధ్యత తీసుకుంది. సైనిక నియంతల పాలనలో ఉన్న ఈ ఆసియా దేశానికి అన్ని విధాలా ఈ అగ్రరాజ్యం సాయపడింది. కోట్లాది డాలర్ల ఆర్థిక సాయంతోపాటు సాంకేతిక పరిజ్ఞానం అందించింది. రెండు దేశాలకూ అమెరికా డాలర్లు అందినా ప్రజాస్వామ్యం, ప్రగతి కనపడని పాక్! ఈ క్రమంలో 1990ల నాటికి సైనిక పాలనకు తెరపడి దక్షిణ కొరియాలో ప్రజాస్వామ్య వ్యవస్థ వేళ్లూనుకోవడం మొదలైంది. 21 శతాబ్దం ఆరంభ సమయానికి శాంసంగ్, హ్యుందయ్, ఎల్జీ, కియా, పోస్కో వంటి అనేక అంతర్జాతీయ ప్రసిద్ధిపొందిన బ్రాండ్లతో ప్రపంచీకరణలో కీలక పాత్ర పోషించే స్థాయికి దక్షిణ కొరియా చేరుకుంది. పైన వివరించిన పాకిస్తాన్ కూడా తన భౌగోళిక స్థితిగతుల కారణంగా మొదటి నుంచీ పాశ్చాత్య దేశాల నుంచి భారీ స్థాయిలో సాయం పొందింది. ఇంకా పొందుతూనే ఉంది. అప్పట్లో పూర్వపు సోవియెట్ యూనియన్ ఉనికి కారణంగా దాన్ని తట్టుకోవడానికి పాకిస్తాన్ ను అమెరికా తన సైనిక అవసరాలకు వీలుగా మలుచుకుంది. అత్యధిక కాలం సైనిక పాలనలో కునారిల్లిన పాక్ ప్రభుత్వాలకు ఆర్థిక సాయంతోపాటు అత్యంత ఆధునిక ఆయుధాలు కూడా సమకూర్చింది అమెరికా. అయితే, పాక్ పాలకులు అమెరికా సాయాన్ని తమ దేశ పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధికి ఉపయోగించు కోలేకపోయారు. ఆర్థికాభివృద్ధితోపాటు ప్రజాస్వామ్య పంథాలో పయనించిన దక్షిణ కొరియా తరహాలో పాకిస్తాన్ ను అక్కడి పాలకులు నడిపించలేకపోవడం పాక్ ప్రజల దురదృష్టం. పాకిస్తాన్ లో మాదిరిగా సైనిక పాలన కొనసాగిన దేశమైనా దక్షిణ కొరియా ఆర్థికరంగంలో వినూత్న విజయాలు సాధించింది. టెక్నాలజీ రంగంలో కొత్తపుంతలు తొక్కింది. ఏభయి సంవత్సరాల క్రితమే భూసంస్కరణలు అమలు చేయడం ద్వారా దేశంలో పారిశ్రామికీకరణకు మార్గం సుగమం చేసింది దక్షిణ కొరియా. అమెరికా ఆర్థిక సాయాన్ని ఉన్నత విద్యకు, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి చక్కగా వాడుకున్నారు దక్షిణ కొరియా పాలకులు. చాలా కాలం సాగిన సైనిక పాలన, ప్రజాస్వామ్యం బలహీనంగా ఉండడం పాకిస్తానీయులకు శాపాలుగా మారాయి. జనాభాలో, వైశాల్యంలో బాగా చిన్నదైన దాయాది దేశం పాకిస్తాన్ ఇలా ఎదుగూబొదుగూ లేకుండా విఫలరాజ్యంగా మారడం భారతదేశానికి ఏమాత్రం వాంఛనీయ పరిణామం కాదు. తన సైజుకు మించి అతిపెద్ద సైన్యం ఉన్న పొరుగుదేశంలో సుస్థిరతనే ఇండియా ఎప్పుడూ కోరుకుంటుంది. విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సీపీ, రాజ్యసభ సభ్యులు -
జగన్ దూకుడు.. పచ్చ బ్యాచ్‌కి కడుపులో మంట
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో అరుదైన ఘనత సాధించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆయన పోలవరం ప్రాజెక్టుకు ఒకేసారి 12, 911 కోట్ల రూపాయల నిధులు ఇవ్వడానికి కేంద్ర ఆర్దిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి కేంద్రమంత్రి వర్గం ఆమోదించడమే తరువాయి. కొద్ది కాలం క్రితం జగన్ ప్రధాని మోదీని, ఆర్దిక మంత్రి నిర్మల సీతారామన్ లను కలిసి పోలవరం నిధులు గురించి చర్చించారు. ఒకేసారి అడ్ హాక్ గా పదివేల కోట్లు ఇస్తే ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకు వెళ్లవచ్చని ఆయన వివరించారు. దీనిపై కేంద్ర పెద్దలు కూడా ఆలోచన చేసి, జగన్ ప్రతిపాదనకు ఓకే చేశారు. ఇందుకు జగన్ తో పాటు ,మోదీని, నిర్మలా సీతారామన్ ను అభినందించాలి. ✍️ వాస్తవానికి ఈ ప్రాజెక్టు ఈసారికే పూర్తి కావల్సి ఉంది. కానీ.. వివిధ కారణాల వల్ల జాప్యం అవుతూ వస్తోంది. ఏపీ విభజన చట్టం ప్రకారం ఇది పూర్తిగా కేంద్ర ప్రాజెక్టు. కానీ, గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాను వదలుకోవడానికి సిద్దపడి, ప్యాకేజీకి అంగీకరించారు. దీంతో పాటు పోలవరం ప్రాజెక్టును రాష్ట్రానికి ఇవ్వాలని కోరగా కేంద్రం అంగీకరించింది. అదే ప్రమాదంగా మారింది. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసి, సంబంధిత బిల్లులను పోలవరం ప్రాజెక్టు అధారిటీ ద్వారా కేంద్రానికి పంపి వసూలు చేసుకోవలసి ఉంటుంది. దీనివల్ల రాష్ట్రంపై ఒత్తిడితో పాటు ,కేంద్రం వేసే కొర్రీల వల్ల సమస్యలు వచ్చేవి. తానైతేనే ప్రాజెక్టును నిర్మించగలుగుతానని కేంద్రం భావించిందని చంద్రబాబు గొప్పలు చెప్పేవారు. ఆ తర్వాత అంతవరకు ఉన్న కాంట్రాక్టర్ టాల్ స్ట్రాయును మార్చి నవయుగ కు అప్పగించారు. తదుపరి పలు కాంట్రాక్టు పనులను తమకు కావల్సినవారికి అప్పగించారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ✍️ ఇక పోలవరం ప్రాజెక్టులో ఏ చిన్నపరిణామం జరిగినా శంకుస్థాపన, ప్రారంభోత్సవం అంటూ హడావుడి చేసేవారు. నిజానికి 2014 లో ఎన్నికలు పూర్తి అయి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టును చేపట్టి ఉంటే ఈపాటికి పూర్తి అయిపోయి ఉండేదేమో!. కానీ చంద్రబాబు ఈ ప్రాజెక్టుకన్నా పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై అధిక శ్రద్ద పెట్టారు. పోలవరం ప్రాజెక్టుపై ఆ నిధులు వ్యయం చేసి ఉంటే బాగుండేది. కానీ, ఆయన లక్ష్యం వేరు. చంద్రబాబుకు భారీ ప్రాజెక్టులపై ఉన్ననమ్మకం తక్కువే. అవి అయితే సత్వరమే పూర్తి కావని , ఎన్నికల టైమ్ లో ఉపయోగం ఉండదని ఆయన భావించేవారు. తర్వాత కాలంలో ఆయన మాట మార్చి పోలవరం తన కల అని కొత్త పాట పాడారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పోలవరం ప్రాజెక్టుపై పూర్తి దృష్టి పెట్టారు. ఆయన చేసిన కృషి వల్లే ఇప్పటికైనా ఈ ప్రాజెక్టు ఒక రూపానికి వచ్చిందన్నది పచ్చి వాస్తవం. ✍️ 2019లో వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్ అధికారంలోకి రావడంతో ఆయనకు ఈ ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశం వచ్చింది. మధ్యలో రెండేళ్ల కరోనా సంక్షోభం, తదుపరి వరదలు, డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంతో తీసుకోవలసిన జాగ్రత్తలపై నిర్ణయాలకు టైమ్ పట్టడం వంటి కారణాల వల్ల ఈ ప్రాజెక్టు మరికాస్త ఆలస్యం అయింది. స్పిల్ వే, ఎగువ,దిగువ కాఫర్ డామ్ నిర్మాణాలు పూర్తి కావడంతో , ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డామ్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఏడాదిలోగా ఇది తొలి దశను పూర్తి చేసుకుని 41.5 మీటర్ల లెవెల్ లో నీటిని నిల్వచేసుకోవడానికి అవకాశం వస్తుంది. ప్రస్తుతం అన్ని విఘ్నాలు అధిగమించి ప్రాజెక్టు పురోగమించే ఆశాభావ వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ పోలవరం వెళ్లి అన్ని పరిస్థితులను స్టడీ చేసి వచ్చారు. ప్రాజెక్టు వేగంగా పూర్తి కావడానికి అవసరమైన చర్యలపై ఆదేశాలు ఇచ్చారు. ✍️ ఇక అసలు విషయానికొస్తే.. కేంద్రం ఇలా ఒకేసారి 13 వేల కోట్ల రూపాయలు ఇస్తుందని ప్రతిపక్ష తెలుగుదేశం కాని, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి మీడియా సంస్థలు కాని ఊహించి ఉండరు. ఇప్పటికే పదివేల కోట్ల రూపాయల మేర రెవెన్యూలోటు కింద ఆర్దిక సాయం సాధించిన జగన్ ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకు ఈ స్థాయిలో నిధులు తీసుకురావడం వారికి అర్దంకాని పరిస్థితిగా మారింది. చంద్రబాబు అప్పట్లో నిత్యం కేంద్రం ఏమీ ఇవ్వడం లేదని, రాష్ట్రం ఆర్ధిక కష్టాలలో ఉందని చెబుతుండేవారు. కేంద్రం ఆశించిన స్థాయిలో సహకరించడం లేదని, తానే శ్రమిస్తున్నానని కలరింగ్ ఇచ్చేవారు. అదే జగన్ అయితే ఈ నాలుగేళ్లలో ఎన్నడూ రాష్ట్రం ఆర్దిక సమస్యలలో ఉందని , అందువల్ల తాను అది చేయలేకపోతున్నా..ఇది చేయలేకపోతున్నా.. అన్నమాటలే చెప్పకుండా తన ప్రణాళిక ప్రకారం పనులు చేసుకుపోతున్నారు. ప్రతి దానికి కేంద్రంపై విమర్శలు చేయకుండా.. వారిని ఒప్పించి పనులు చేసుకుంటూ వస్తున్నారు సీఎం జగన్. ఈ క్రమంలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి కూడా తగు భూమిక పోషిస్తున్నారు. ఈ నేపధ్యంలో దీనిని చెడగొట్టడానికి , ఈ ఆర్దిక సాయం పై కూడా వ్యతిరేక కధనాలు రాయడానికి టీడీపీ పత్రికలు వెనుకాడకపోవడం దురదృష్టకరం. ✍️ కేంద్ర ఉత్తర్వులలో తొలి దశ అని పేర్కొనలేదని, 41.5 మీటర్ల వద్దే ప్రాజెక్టు నిలిపివేస్తారేమోనన్న అనుమానం కలిగేలా ఈనాడు కధనం ఇస్తే, పోలవరానికి 12 వేల కోట్లే అంటూ ఆంధ్రజ్యోతి వార్త ఇచ్చింది. వారు ఎక్కడ జగన్ ఈ నిధులను సాధించారని , అది గొప్ప విషయమని రాయని జర్నలిజం వారిది. పైగా స్ట్రక్చర్ తో సంబంధం లేని కట్టకు ఏదో చిన్నసమస్య వచ్చింది. గైడ్ వాల్ అనే కట్టడం కొంచెం కుంగిందనే కథనాలు ఇచ్చాయి. ఆ వార్త ఇవ్వడం తప్పుకాదు. కానీ.. అదేదో ప్రాజెక్టు దెబ్బతినిపోయిందేమో అన్న భావన పాఠకులలో కలిగించేలా బ్యానర్ కధనం ఇచ్చారు. ✍️ పోలవరం సందర్శనలో జగన్ కూడా దీని గురించి ప్రస్తావించి చిన్న సమస్యను బూతద్దంలో చూపుతున్నారని అన్నారు. అదే డయాఫ్రమ్ వాల్ కూలిన విషయంలో మాత్రం కాఫర్ డామ్ లో గ్యాప్ లు ఉంచిన గత ప్రభుత్వ నిర్వాకం అని రాయలేదు. దానిని కూడా జగన్ ప్రభుత్వానికి అంటకట్టే యత్నం చేశారు. ఇప్పుడు వారికి అసలు కడుపు నొప్పి వచ్చి ఉండాలి. జగన్ కోరిన వెంటనే ప్రధాని మోదీ పోలవరం ప్రాజెక్టుకు పదమూడు వేల కోట్లు ఇవ్వడం వారికి షాకింగ్ గా ఉంటుంది.అందుకే ఇక ఎన్ని వ్యతిరేక కథనాలు రాస్తారో చూడాల్సి ఉంది. కేంద్రం ఇచ్చిన నిధులు ఫలానా పనికే ఖర్చు చేయాలని నిబంధన పెట్టకుండా ఎక్కడ అవసరమైతే అక్కడ వెచ్చించడానికి వీలుగా కేంద్రం ఆదేశాలు ఇవ్వడం మరింత వెసులుబాటు వస్తుంది. ఈ ఏడాది కాలం చాలా క్రూషియల్ అని చెప్పాలి. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి 41.15 మీటర్ల లెవెల్ లో నీటిని నిలబెట్టగలిగితే గొప్ప విషయమే అవుతుంది. ఆ స్థాయి వరకు పునరావాస చర్యలకు కూడా ప్రభుత్వం పూనుకుంటుంది. తదుపరి క్రమేపీ నీటి మట్టం పెంచుకుంటూ వెళతామని ప్రభుత్వం చెబుతున్నా, ఎల్లో మీడియా మాత్రం అది జరగదేమో అన్న అనుమానం కలిగించాలని యత్నించింది. ✍️ కొద్ది రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తను అధికారంలో ఉంటే పోలవరం పూర్తి అయ్యేదని డాంబికంగా చెప్పారు.2018 నాటికే పూర్తి అవుతుందని అధికారంలో ఉన్నప్పుడు అనేవారు. మరి ఏమైంది! ఆయన హయాంలో ఎన్నడైనా ఈ స్థాయిలో నిధులు వచ్చాయా?కరోనా, వరదలు వంటివాటిని కూడా ఆపి ఆయన ప్రాజెక్టు పూర్తి చేసేవారా? కబుర్లు చెప్పడం తేలిక. పని జరిగినా, జరగకపోయినా జయము,జయము చంద్రన్న అంటూ పాటలు పాడించుకోవడం అలవాటైతే ఇలాగే మాట్లాడతారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి జగన్ ఈ ప్రాజెక్టు తొలి దశను విజయవంతంగా పూర్తి చేసి,తనకు, ఈ ప్రాజెక్టు కోసం విశేష కృషి చేసిన తన తండ్రి రాజశేఖరరెడ్డికి మంచి పేరు తెస్తారని ఆశిద్దాం. :::కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ -
మామిడి రైతుకు వైఎస్ జగన్ ప్రభుత్వం అండ
సాక్షి ప్రతినిధి, ఏలూరు: అకాల వర్షం, ఈదురు గాలులకు నష్టపోతున్న మామిడి రైతులను ఆదుకునేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకొచ్చింది. అకాల వర్షాలు, ఈదురు గాలులకు రాలిపోయిన, దెబ్బతిన్న మామిడి కాయలను కొని, వాటి నుంచి పౌడర్ తయారు చేసే సరికొత్త మామిడి ప్రాసెసింగ్ యూనిట్‌కు శ్రీకారం చుట్టింది. అది కూడా స్థానికంగా ఉండే మహిళా రైతులను యజమానులుగా మార్చి వారి భాగస్వామ్యంతోనే మామిడి పౌడర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయిస్తోంది. రూ. 5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే ఈ యూనిట్లో వెయ్యి మంది మహిళలు రూ. 50 లక్షల భాగస్వామ్యం కలిగి ఉంటారు. మిగిలిన రూ.4.50 కోట్లు సబ్సిడీగా లభిస్తుంది. ఏలూరు జిల్లా నూజివీడులోని మార్కెట్ యార్డులో ఈ పరిశ్రమ ఏర్పాటు కానుంది. నూజివీడు మామిడికి ప్రసిద్ధి. ఏలూరు, కృష్ణా జిల్లాల్లో 1.40 లక్షల ఎకరాల్లో ఈ రకం మామిడి సాగవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో దీనికి మంచి డిమాండ్ ఉంది. ఈ ఏడాది మామిడికి మంచి ధర ఉన్నప్పటికీ అకాల వర్షాలకు కాయకు మంగు రావడం, మచ్చలు ఉండటం, ఇతర కారణాలతో మార్కెట్ పూర్తిగా పతనమైంది. ప్రధానంగా నూజివీడులో పెద్ద రసాలు, చిన రసాలు, జలాలు, సువర్ణరేఖ, హిమామ్‌పసంగ్, బంగినపల్లి, తొతాపూరి తదితర వెరైటీలు సాగవుతుంటాయి. అయితే ఎక్కువగా తొతాపూరి, చిన్న రసాలు, పెద్ద రసాలు 90 శాతం మార్కెట్లో ఉంటాయి. ఈ ఏడాది అకాల వర్షాలు, ఈదురు గాలలకు కాయ రాలిపోవడంతో మామిడి రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. వీటికి పరిష్కారం చూపే విధంగా పంటకు మంచి ధర ఉండేలా స్ధానికంగా మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూజివీడు మార్కెట్ యార్డ్‌లో ఎకరం విస్తీర్ణంలో మామిడి ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గుజ్జు (పల్ప్) సేకరించే యూనిట్ కాకుండా పచ్చడి మామిడికాయ నుంచి పౌడర్ తీసే యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. స్థానికంగా వెయ్యి మంది మహిళా రైతులను గుర్తించి ఇప్పటికే వారితో ఒక సమాఖ్య రిజి్రస్టేషన్ చేయించారు. ఒక్కొక్కరు రూ. 5 వేల మూలనిధితో రూ. 50 లక్షలు సమకూర్చుకోగా మిగిలిన రూ. 4.50 కోట్లు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ యార్డులో స్ధలం కేటాయించింది. పథకం అమలు కోసం జిల్లా కలెక్టర్ ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. మరో నెల రోజుల్లో ప్రభుత్వ ఆమోదముద్రతో పనులు ప్రారంభమై మూడు నెలల్లో ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభం కానుంది. డీఆర్డీఏ నేతృత్వంలో మహిళా సమాఖ్య దీన్ని నిర్వహించనుంది. ప్రత్యేకంగా చెట్టు నుంచి కోసిన కాయలతో పాటు, రాలిపోయిన కాయలు, వర్షానికి దెబ్బతిన్న కాయలను కూడా సమాఖ్య మార్కెట్ ధరకు కొంటుంది. రైతుకు వెంటనే డబ్బు చెల్లిస్తుంది. కాయల నుంచి మామిడి పౌడర్‌ను తయారు చేసి క్యాండీ, జెల్లీలు తయారు చేసే పరిశ్రమలకు విక్రయించేలా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మొదటి ప్రాసెసింగ్ యూనిట్ రాష్ట్రంలోనే మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మొట్టమొదటి మ్యాంగో పౌడర్ యూనిట్ ఇది. నూజివీడులోని మార్కెట్ యార్డులో ఎకరం స్ధలంలో రూ. 5 కోట్లతో ఏర్పాటు చేస్తున్నాం. నూజివీడులో 12 వేల ఎకరాలు, ఆగిరిపల్లిలో 20 వేల ఎకరాల్లో మొత్తంగా 32 ఎకరాల్లో రైతులకు ప్రాసెసింగ్ యూనిట్ ఉపయుక్తంగా ఉంటుంది. మహిళలే యజమానులుగా దీన్ని డీఆర్డీఏ పర్యవేక్షణలో నిర్వహిస్తారు. – ప్రసన్న వెంకటేష్, జిల్లా కలెక్టర్, ఏలూరు చదవండి: బాలికను కాపాడిన ‘దిశ’ -
పాక్, చైనాలకు విదేశీ సాయం కట్ చేస్తా
రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి నిక్కీ హేలీ అమెరికా అధ్యక్ష బరిలోకి దిగుతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తాను అదికారంలోకి వస్తే ఏం చేయాలనుకుంటుందో చెబుతూ.. ప్రచారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే నిక్కీ అమెరికా విదేశాంగ విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలోకి వస్తే పాక్, చైనాతో పాటు అమెరికాను ద్వేషించే శత్రు దేశాలకు విదేశీ సాయంలో కోత విధిస్తానని చెప్పారు. గర్వించదగ్గ అమెరికా ఎప్పుడూ ప్రజల సొమ్మును వృధా చేయదన్నారు. అమెరికా గతేడాది విదేశీ సహాయం కోసం 46 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. అది ఇతర దేశాల కన్నా ఎక్కువ అని కూడా చెప్పారు. అంతేగాదు ఆ డబ్బు ఎక్కడికి వెళుతుందో పన్ను చెల్లింపుదారులు తెలుసుకునే హక్కు ఉందన్నారు. వాస్తవానికి ఆ సొమ్ము అంతా అమెరికాను వ్యతిరేకించే దేశాలకు నిధులు సమీకరించడానికి వెళ్తుందని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. తాను అధికారంలో ఉంటే మాత్రం అమెరికా విరోధులకు అందించే సాయంలోని ప్రతి పైసాలో కోత విధిస్తానని కరాకండీగా చెప్పారు. బైడెన్ ప్రభుత్వం పాక్‌కి మళ్లీ సైనిక సాయాన్ని ప్రారంభించిందన్నారు. ఉగ్రవాదులకు నిలయమైన ఆ దేశ ప్రభుత్వం అమెరికాను వ్యతిరేకించే చైనాకు లోబడి ఉంది. అంతేగాదు పాలస్తీనా ప్రజల కోసం అని అమెరికా యూఎన్ అవినీతి ఏజెన్సీని అర బిలియన్ డాలర్లతో పునురుద్ధరించిందన్నారు. అలాగే ఇరాన్‌కి యూఎస్ సుమారు రెండు బిలయన్ డాలర్లు సాయం అందిస్తే..అది యూఎస్ దళాలపైనే దాడులకు దిగింది. అంతేగాదు యూఎన్‌లో అమెరికాకు అత్యంత వ్యతిరేకంగా ఓటింగ్ వేసే దేశాల్లో ఒకటైన జింబాబ్వేకు కూడా వందల బిలయన్ డాలర్లు అందించింది. అత్యంత హాస్యాస్పదమైన విషయమేమిటంటే. .చైనా నుంచి అమెరికాకు తీవ్ర స్థాయిలో ముప్పు ఉన్నప్పటికీ పర్వావరణ కార్యక్రమాల పేరుతో చైనాకు డాలర్లు అందిస్తోంది. అంతేగాదు రష్యన్ నియంత వ్లాదిమర్ పుతిన్ అత్యంత సన్నిహితమైన బెలారస్‌కి కూడా సాయం అందించాం. అలాగే క్యూబాకి కూడా సాయం అందించాం. " అంటూ విరుచుకుపడ్డారు నిక్కీ హేలీ. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ విధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఆమె నొక్కి చెప్పారు. కేవలం అధ్యక్షుడు జో బైడెన మాత్రమే కాదు ఇరు పార్టీల అధ్యక్షులు దశాబ్దాలుగా విదేశీ సాయం విషయంలో ఇలాగే కొనసాగారు. వారంతా మా సహాయన్ని స్వీకరించే దేశాల ప్రవర్తనను పరిగణలోకి తీసుకోలేదన్నారు. తాను అధికారంలోకి వస్తే అమెరికా వ్యతిరేక దేశాలకు సాయం చేసి డాలర్లను వృధా చేయనని చెప్పారు. మన ప్రజలు కష్టపడి సంపాదించిన సొమ్మును అలాంటి దేశాలకు నిధులుగా అందించేదే లేదని తెగేసి చెప్పారు నిక్కీ హేలీ. (చదవండి: పాపం శ్రీలంక.. తిందామంటే జనాలకు తిండి లేదు.. ఇక ఎన్నికలు ఎలా?) -
బుద్ధిమారని పాక్.. టర్కీకి భారత్ సాయం అందకుండా మోకాలడ్డు!
న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధి చాటుకుంది. భూకంపంతో విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న టర్కీకి సాయం అందించేందుకు వెళ్తున్న భారత యుద్ధ విమానాలు తమ గగనతలం మీద నుంచి వెళ్లకుండా అడ్డుకుంది. దీంతో భారత సీ-17 యుద్ధ విమానం వెనక్కి వచ్చి వేరే దేశం మీదుగా టర్కీకి చేరుకోవాల్సి వచ్చింది. ఈమేరకు భారత మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే భారత యుద్ధవిమానాలు అసలు పాకిస్తాన్ గగనతలం మీదుగా వెళ్లలేదని, ఇందుకు సంబంధించి ఎలాంటి అనుమతులు కూడా పాకిస్తాన్‌ను భారత్ అడగలేదని అధికారిక వర్గాలు తెలిపాయి. భారత్‌లోని టర్కీ రాయబారి ఫిరత్ సునెల్ కూడా ఈ విషయంపై స్పందించారు. భారత యుద్ధవిమానాలు ఎగిరేందుకు పాకిస్తాన్ అనుమతి నిరాకరించిందనే విషయంపై తనకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. 2021లో కూడా అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నప్పుడు భారతీయులను ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తీసుకొచ్చింది కేంద్రం. అప్పుడు కూడా మనం పాక్ గగనతలాన్ని వినియోగించుకోలేదు. మన విమానాలు అఫ్గాన్ నుంచి ఇరాన్ మీదుగా భారత్ చేరుకున్నాయి. రెండు యుద్ధవిమానాలు.. భూకంపం అనంతరం టర్కీకి భారత్ తనవంతు సాయం చేస్తోంది. ఇప్పటివరకు రెండు యుద్ధ విమానాల్లో సహాయక సిబ్బంది, పరికరాలు, ఔషధాలను పంపింది. మొదటి యుద్ధ విమానం సోమవారం రాత్రే టర్కీ చేరుకోగా.. రెండో యుద్ధ విమానం మంగళవారం వేకువజామున టర్కీకి వెళ్లింది. ఈ విమానాల్లో జాతీయ విపత్తు నిర్వహణ దళాలు, ప్రత్యేక శిక్షణ తీసుకున్న డాగ్ స్క్వాడ్లు, డ్రిల్లింగ్ మెషీన్లు, ఔషధాలు, పరికరాలు సహా ఇతర సామగ్రిని భారత్ టర్కీకి పంపింది. First Indian C17 flight with more than 50 @NDRFHQ Search & Rescue personnel, specially trained dog squads,drilling machines, relief material, medicines and other necessary utilities & equipment reaches Adana,Türkiye. Second plane getting ready for departure. @MevlutCavusoglu pic.twitter.com/sSjuRJJrIO — Dr. S. Jaishankar (@DrSJaishankar) February 7, 2023 చదవండి: భూకంపం తర్వాత టర్కీలో పరిస్థితి ఇదీ..! డ్రోన్ వీడియో వైరల్.. -
ఉక్రెయిన్‌కు చేసేది సాయం కాదు.. పెట్టుబడి..
వాషింగ్టన్: రష్యా తమపై దండయాత్ర చేపట్టిన తర్వాత తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్లారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. బుధవారం అమెరికా కాంగ్రెస్‌లో ప్రసంగించారు. అగ్రరాజ్యం తమ దేశానికి అందిస్తున్న భారీ సాయానికి కృతజ్ఞతలు చెప్పారు. అలాగే ఉక్రెయిన్‌కు అమెరికా అందిస్తుంది సాయం కాదని, ప్రాజాస్వామ్యం, అంతర్జాతీయ భద్రతకు అగ్రరాజ్యం పెడుతున్న పెట్టుబడి అని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. 2023లోనూ తమకు సాయాన్ని కొనసాగించారని కోరారు. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలపై అమెరికా విజయం సాధించినట్లు తాము కూడా వెనుకడుగు వేయకుండా రష్యాపై పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని జెలన్స్కీ స్పష్టం చేశారు. ఆయన ప్రసంగాన్ని అమెరికా కాంగ్రెస్ అభినందించింది. సభ్యలందరూ లేచి నిలబడి కరత్వాల ద్వనులతో జెలెన్స్కీ పోరాట స్ఫూర్తిని మెచ్చుకున్నారు. అగ్రరాజ్యం ఇప్పటికే ఉక్రెయిన్‌కు 50 బిలియన్ డాలర్లకుపైగా సాయం అందించింది. త్వరలో పేట్రియట్ మిసైల్స్ కూడా పంపిస్తామని హామీ ఇచ్చింది. అయితే అమెరికా అందిస్తున్న సాయాన్ని జెలెన్స్కీ పెట్టుబడి అనడం వెనుక కారణం లేకపోలేదు. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి అమెరికా ప్రతినిధుల సభ రిపబ్లికన్ల చేతిలోకి వెళ్లనుంది. ఉక్రెయిన్‌కు భారీ ప్యాకీజీపై వారు సుముఖంగా లేరు. డెమొక్రాట్లు భారీ మొత్తాన్ని యుద్ధ సాయంగా సమకూర్చడంపై ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పుడు దిగవ సభ వాళ్ల నియంత్రణలోకే వస్తుంది కనుక కచ్చితంగా ప్యాకీజీ బిల్లును అడ్డుకుంటారు. ఈ నేపథ్యంలోనే రిపబ్లికన్ల మనసు మార్చే విధంగా జెలెన్స్కీ మాట్లాడారు. కాంగ్రెస్‌లో ప్రసంగించడానికి ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో శ్వేతసౌధంలో భేటీ అయ్యారు జెలెన్స్కీ. ఇద్దరూ కలిసి ఓవల్ ఆఫీస్‌లో కన్పించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. చదవండి: వరదలో చిక్కుకున్న పిల్లలు.. ప్రాణాలకు తెగించి కాపాడిన రియల్ హీరో.. -
చైనా దిమ్మ తిరిగిపోయేలా నిర్ణయం
ఒక దెబ్బకు రెండు పిట్టలు. డ్రాగన్ కంట్రీ దిమ్మ తిరిగిపోయేలా నిర్ణయం తీసుకుంది ఉత్తర అమెరికా దేశం కెనడా. ఈ మేరకు ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఓ కీలక ప్రకటన చేసింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వాణిజ్య సంబంధాల బలోపేతం కోసం భారీగా వెచ్చించ్చనున్నట్లు కెనడా ప్రకటించింది. తద్వారా ఈ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని బాగా తగ్గించాలనే ఆలోచనలో కెనడా ఉన్నట్లు స్పష్టమవుతోంది. అంతేకాదు.. ఈ ప్రభావంతో ఈ రీజియన్‌లో తమ బలాన్ని పెంచుకోవాలని కూడా భావిస్తోంది. ఈ మేరకు విదేశాంగ మంత్రి మెలానీ జోలీ ఆదివారం ఉదయం కీలక ప్రకటన చేశారు. కెనడా తన పసిఫిక్ వాణిజ్య సంబంధాలను చైనాకు మించి విస్తరించడానికి చాలా కష్టపడుతోంది. ఈ క్రమంలో అమెరికా తర్వాత చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. ఇప్పుడు ఆ స్థానంపై కెనడా కన్నేసినట్లు స్పష్టమవుతోంది. తాజాగా ఇండో-పసిఫిక్ వ్యూహంలో భాగంగా కెనడా తరపున 1.7 బిలియన్ డాలర్ల ఖర్చు చేయబోతున్నట్లు మెలానీ జోలీ ప్రకటించారు. ఆ డబ్బును ఇండో-ఫసిఫిక్ రీజియన్‌లో మరింత నౌకాదళ గస్తీ కోసం, మెరుగైన నిఘా కోసం, సైబర్ సెక్యూరిటీ చర్యలకు ఉపయోగించనున్నట్లు ఆమె తెలిపారు. అంతేకాదు.. తూర్పు-దక్షిణ చైనా సముద్ర ప్రాంతాల్లో ప్రాంతీయ భాగస్వాముల మధ్య సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. చైనా లక్ష్యంగా.. ఈ ప్రకటనకు ముందు ఆమె బ్లూమ్‌బర్గ్ న్యూస్‌తో గంటకు పైగా ఇంటర్వ్యూ ఇచ్చారు. యూరప్‌తో సుదీర్ఘకాలంగా తమ అనుబంధం కొనసాగుతోందని.. ఇక ఇప్పుడు ఫసిఫిక్‌పై దృష్టిసారించాల్సిన అవసరం వచ్చిందని ఆమె అభిప్రాయపడ్డారు. తద్వారా చైనా తీరును ఖండిస్తూ.. ఆ దేశానికి వ్యతిరేకంగానే తమ చర్యలు ఉండబోతున్నాయంటూ ఇంటర్వ్యూలో దాదాపుగా మాట్లాడారామె. అంతకు ముందు శుక్రవారం ఆమె మాంట్రియల్లో మాట్లాడుతూ.. ‘‘ చైనా విషయానికి వస్తే.. యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉందని మాకు తెలుసు. కాబట్టి మేము మా ఆటను కొనసాగిస్తాం’’ అంటూ ఆమె దూకుడు ప్రకటన చేశారు. ఇండోనేషియా బాలి జీ20 సదస్సు సందర్భంగా.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్-కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. వాళ్ల మధ్య జరిగిన భేటీ సారాంశం మీడియాకు లీక్ కావడంపై జిన్‌పింగ్ అసంతృప్తి వ్యక్తం చేయగా.. అందులో తప్పేం ఉందంటూ స్ట్రాంగ్‌కౌంటర్ ఇచ్చారు ట్రూడో. -
పెద్ద మనసు చాటుకున్న సీఎం జగన్
అమలాపురం రూరల్(కోనసీమ జిల్లా): తలసేమియా వ్యాధితో బాధపడుతోన్న బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నారాయణపేటకు చెందిన బాలుడు దంగేటి యశ్వంత్(7) చికిత్సకు సీఎం వైఎస్ జగన్ సహాయం అందించారు. బాలుడు హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్యానికి రూ.22 లక్షల ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. చదవండి: ఈ పరిశ్రమలే రుజువు.. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? శుక్రవారం గోకవరం మండలం గుమళ్లదొడ్డిలో ఇథనాల్ ప్రాజెక్ట్ శంకుస్థాపనకు వచ్చిన సీఎంను గోదావరి సెంట్రల్ డెల్టా బోర్టు చైర్మన్ కుడుపూడి వెంకటేశ్వరబాబు కలిశారు. బాలుడు తండ్రి ఆర్థిక పరిస్థితిని విన్నవించారు. దీనిపై చలించిన సీఎం వెంటనే స్పందించారు. సీఎం సహాయ నిధి నుంచి రూ. 22 లక్షలు మంజూరు చేస్తున్నట్లు సంతకం చేసి కార్యదర్శి జవహర్‌రెడ్డికి అందజేశారు. -
Anganwadi teacher: చిరుద్యోగి పెద్ద మనసు
సేవ చేయడానికి ధనవంతులే కానక్కర్లేదు. నలుగురికి సేవ చేసే భాగ్యం లభించడం కూడా అదృష్టమే! ఇదే విషయాన్ని తన చేతల ద్వారా నిరూపిస్తోంది తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలో పదేళ్ల నుంచి అంగన్వాడీ టీచర్‌గా పనిచే స్తున్న ఉమర్ సుల్తానా. తన సంపాదనలో సగ భాగం సేవా కార్యక్రమాలకే ఉపయోగిస్తూ చుట్టూ ఉన్నవారికి ఆదర్శంగా నిలుస్తున్న సుల్తానా గురించి.. మహ్మద్ ఉమర్ సుల్తానా ఓ సాధారణ అంగన్వాడి టీచర్. పదేళ్లుగా విధులను నిర్వర్తిస్తోంది. ఉన్న ఊళ్లోనే కాదు, మండలంలోని మిగతా ఊళ్లలోనూ సుల్తానాకు మంచి పేరుంది. మా మనసున్న టీచరమ్మ అంటుంటారు స్థానికులు. ఏ ఆధారం లేనివారికి ఓ దారి చూపడమే కాదు ఏ ఆసరా లేదని కుంగిపోయేవారికి ధైర్యం చెబుతూ, అండగా నిలబడుతోంది. ‘మన మాట మంచిదయితే చాలు అందరూ మనవాళ్లే’ అంటుంది ఉమర్ సుల్తానా. దౌల్తాబాద్ మండల పరిధిలోని ఇందూప్రియాల్ గ్రామంలో సుల్తానా అంగన్వాడీ టీచర్‌గా విధులను నిర్వర్తిస్తుంటే ఆమె భర్త మహ్మద్ ఉమర్ గజ్వేల్‌లో ఓ మెకానిక్ షాపు నడిపిస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. వీరేమీ ధనవంతులు కాదు, కానీ ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు తమకు చేతనైన సాయం అందించడమే కర్తవ్యంగా భావిస్తారు. గ్రామం నుంచి మొదలు... దౌల్తాబాద్, రాయపోల్, మిరుదొడ్డి, దుబ్బాక, గజ్వేల్ మండలాలలో వందకు పైన బాధిత కుటుంబాలకు సాయం అందించింది సుల్తానా. కరోనా సమయంలో గ్రామంలోని నిరుపేదలకు నిత్యవసర సరుకులు అందజేసింది. జిల్లా వ్యాప్తంగా 108 సిబ్బంది అందిస్తున్న సేవలకు గాను వారికి సన్మానం చేసింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అత్యవసరమైన వస్తువులను అందజేస్తుంది. వివిధ రకాల కారణాలతో చదువు మధ్యలోనే ఆపేసిన బాలికలకు నచ్చజెప్పి, వారి తల్లిదండ్రులను ఒప్పించి తిరిగి వారు బడిలో చేరేలా ప్రోత్సహిస్తుంది. బాలికలకు అవసరమైన పుస్తకాలు, యూనిఫారమ్ కొనిస్తుంది. రక్తదానం... అత్యవసర సమయంలో తన కుటుంబంలోని వారు రక్తదానం కూడా చేస్తుంటారు. లేదంటే, తెలిసిన మిత్రుల నుండి బాధితులకు సహాయం అందేలా చేస్తుంటారు. తాము సంపాదిస్తున్న కొద్ది మొత్తంలోనే సగ భాగాన్ని సమాజ సేవకు వినియోగిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ దంపతులు. సంపాదన కన్నా ఎప్పటికీ నిలిచి ఉండేది నలుగురికి ఉపయోగపడే పనే. పెద్ద మొత్తంలో డబ్బు సాయం చేయలేకున్నా, పిడికెడు ధైర్యం ఇవ్వగలిగితే చాలు అదే కొండంత అండ అనుకుంటాను. నా ఆలోచనలకు తగినట్టు నా భర్త కూడా సహకారం అందిస్తున్నారు. ఎంత సంపాదించినా రాని తృప్తి, నలుగురి కష్టాలను పంచుకోవడంలోనే ఉంటుంది. ఆ ఆలోచనతోనే మా జీవన ప్రయాణం కొనసాగిస్తున్నాము. – సుల్తానా, అంగన్వాడి టీచర్ ఆమె సాయం మరువలేనిది అనారోగ్య కారణంతో నా భర్త మరణించాడు. తట్టుకోలేక మా అత్తమ్మ తనువు చాలించింది. ముగ్గురు పిల్లలతో దిక్కుతోచని స్థితిలో ఉన్న మాకు మొదటగా సాయం అందించింది సుల్తానా. ఆమె ముందుకు రావడంతో మరికొంతమంది మేమూ ఉన్నామని సాయంగా వచ్చారు. మాకు ఆమె ఇచ్చిన భరోసా కొండంత బలాన్ని ఇచ్చింది. కష్టకాలంలో మా కుటుంబానికి తోడుగా నిలిచింది. –షేక్ జానీ బి, సయ్యద్ నగర్ అమ్మలా తోడైంది అమ్మా నాన్నలను కోల్పోయి అనాథగా మిగిలిన నాకు ఒక అమ్మలా తోడైంది. నాలో బాధ పోయేవరకు రోజూ పలకరించింది. ఆమె అందించిన భరోసాతోనే ఇప్పుడు నా జీవితాన్ని నిలబెట్టుకోగలిగాను. – బండారు రేణుక, మంథూర్, రాయపోల్ మండలం – గజవెల్లి షణ్ముఖ రాజు, సాక్షి, సిద్దిపేట -
సునీత చదువుకు సాయం అందిస్తా: కేటీఆర్
హైదరాబాద్: తన ఇంట్లో పని చేసే మహిళను అత్యంత పైశాచికంగా హింసించిన ఉదంతంలో జార్ఖండ్ బీజేపీ సస్పెండెడ్ నేత సీమా పాత్రా అరెస్ట్ అయ్యింది. బాధితురాలు సునీతకు సంబంధించిన ఓ వీడియో వైరల్ కావడం, అందులో ఆమె సీమ చేతిలో ఎంత దారుణంగా హింసించబడిందో వివరించడంతో దుమారం రేగింది. ఇదిలా ఉంటే.. ఈ ఉదంతంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. కోలుకుంటే.. తనకు చదువుకోవాలని ఉందంటూ బాధితురాలు చెప్పిన వీడియో ఒక దానిని ప్రముఖ జర్నలిస్ట్ బర్ఖా దత్ పోస్ట్ చేశారు. ‘‘ఆమె పళ్లు విరిగిపోయాయి. ఎనిమిదేళ్లుగా నరకం అనుభవించింది. సీమాపాత్ర ఆమెను క్రూరంగా హింసించింది. కోలుకున్నాక చదువుకోవాలని బాధితురాలు చెబుతోంది’’ అంటూ దత్ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. దీనికి ట్విటర్లో స్పందించారు కేటీఆర్. తాను వ్యక్తిగతంగా ఆమె చదువుకు అవసరమయ్యే సాయం అందించేందుకు సిద్ధమని కేటీఆర్ పేర్కొన్నారు. అంతేకాదు ఆమె కుటుంబ సభ్యుల వివరాలను పంపాలంటూ బర్ఖా దత్‌ను కోరారాయన. కేటీఆర్ బదులును అభినందించిన దత్.. అలాగే చేద్దాం అంటూ బదులిచ్చారు. Barkha, I would be happy to contribute in my personal capacity to the young girl’s education Please send me her family’s details https://t.co/bZ3VLO5EmF — KTR (@KTRTRS) August 31, 2022 రాంచీ అశోక్ నగర్‌లోని తన లగ్జరీ ఇంటి పనుల కోసం గిరిజన మహిళ సునీతను ఎనిమిదేళ్ల కిందట తెచ్చుకుని.. దారుణంగా హింసించింది సీమా పాత్ర. ఈ ఉదంతం సంచలనం సృష్టించగా.. ఎట్టకేలకు ఇవాళ ఉదయం పారిపోతున్న సీమను వెంబడించి అరెస్ట్ చేశారు పోలీసులు. మరోవైపు ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది కూడా. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సీమపై కఠిన చర్యలు తీసుకోవాలని జార్ఖండ్ డీజీపీని ఆదేశించింది. ఇదీ చదవండి: పనిమనిషిని చిత్రహింసలు పెట్టిన బీజేపీ నేత అరెస్టు -
పాకిస్తాన్‌కి అమెరికా రూ. 200 కోట్ల మానవతా సాయం
ఇస్లామాబాద్: గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వరదలు సంభవించి పాకిస్తాన్ అల్లకల్లోలంగా మారిపోయింది. గతంలో ఎన్నడూ లేనంతగా పాకిస్తాన్లో ప్రకృతి విలయం సృష్టించింది. దీంతో వేలాదిమంది చనిపోయారు, లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం ప్రపంచ దేశాలను సాయం చేయాల్సిందిగా పిలుపునిచ్చింది. ఈ మేరకు అమెరికా పాకిస్తాన్‌కి సుమారు రూ. 200 కోట్ల మానవతా సాయాన్ని ప్రకటించింది. యునైటెడ్ స్టేట్స్ యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నెషనల్ డెవలప్మెంట్ ద్వారా పాకిస్తాన్‌లోని వరద బాధితుల కోసం అందిస్తున్నట్లు వెల్లడించింది. ఇది వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను ఆదుకోవడానికి, ప్రాణాలను రక్షించేందుకు ఈ మానవతా సాయాన్ని అందిస్తున్నట్లు ఇస్లామాబాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది (చదవండి: అఫ్గాన్ పైలెట్లకు శిక్షణ ఇస్తున్న యూఎస్...ఐ డోంట్ కేర్ అంటున్న రష్యా) -
జగనన్న తోడు: నగదు జమ చేసిన సీఎం జగన్