వాషింగ్టన్: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ షాకిచ్చారు. బంగ్లా ప్రభుత్వానికి అమెరికా సాయాన్ని రద్దు చేస్తూ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో బంగ్లాదేశ్‌లో ఆహారభద్రత, ఆరోగ్యం, విద్య తదితర కీలక రంగాల్లో చేపట్టిన ప్రాజెక్టులు ఆగిపోనున్నాయి.
90 రోజుల పాటు పలు దేశాలకు అమెరికా సాయాన్ని నిలిపివేసే పాలసీలో భాగంగా బంగ్లాదేశ్‌కు సాయం నిలిపివేశారు. ఈజిప్ట్, ఇజ్రాయెల్‌లకు తప్ప ఇతర అన్ని దేశాలకు 90 రోజులపాటు అమెరికా సాయాన్ని నిలిపివేశారు.
ట్రంప్ ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. వలసదారుల విధానాలు, ఫెడరల్ వర్కర్లు ఆఫీసు నుంచి విధులు నిర్వహించడం, లేకెన్ రిలే చట్టం అమలు, పారిస్ ఒప్పందం నుంచి తప్పుకోవడం వంటి నిర్ణయాలు వీటిలో ఉన్నాయి.
వీటికి తోడు అమెరికాలో ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకోవడం కోసం ప్రపంచంలోని ఇతర దేశాలకు సాయాన్ని 90 రోజుల పాటు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో భాగంగా ట్రంప్ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఇదీ చదవండి: 90 వేల మంది ఉద్యోగుల తొలగింపు..ట్రంప్ కఠిన నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment