వాషింగ్టన్: పాకిస్తాన్‌కు 300 మిలియన్ల డాలర్ల ఆర్థిక సహాయం అందజేయాలంటే షరతులు విధించాలనే సెనేట్ ప్రతిపాదనను శ్వేతసౌధం వ్యతిరేకించింది. ఇటువంటి షరతులు ద్వైపాక్షిక సంబంధాలకు ప్రతిబంధకాలుగా మారతాయని, ఇలా చేయడం జాతి ప్రయోజనాలకు వ్యతిరేకమని ఒబామా యంత్రాంగం స్పష్టం చేసింది.