
సాక్షి, కాకినాడ: శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో తమవంతు మానవతా సాయంగా కేంద్ర ప్రభుత్వం 45 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరాకు హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా తొలి దశలో 11 వేల మెట్రిక్ టన్నులు ఎగుమతి చేసేందుకు కాకినాడ జిల్లా కాకినాడలోని ఓ ప్రైవేటు సంస్థకు బాధ్యతలు అప్పగించింది.
కాకినాడ యాంకరేజ్ పోర్టులో గత రెండు రోజులుగా నౌకలో బియ్యం లోడింగ్ ప్రక్రియ సాగింది. అత్యవసర కారణాల దృష్ట్యా 11 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని చెన్‌గ్లోరీ అనే నౌక శుక్రవారం సాయంత్రం కాకినాడ నుంచి శ్రీలంకకు బయల్దేరింది. ఈ నౌక సముద్ర మార్గంలో మూడు రోజులపాటు ప్రయాణించి సోమవారం సాయంత్రానికి శ్రీలంకకు చేరనుంది. అనంతరం అక్కడి నుంచి బియ్యాన్ని శ్రీలంకలో చౌక ధరల దుకాణాలకు తరలిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment