బంగాళాఖాతంలో ఏడు రోజులు
150 కిలోమీటర్లు ఈదిన తెలుగు మహిళ
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన 52 ఏళ్ల గోలి శ్యామల అరుదైన ఘనతను సాధించారు. విశాఖపట్నం (వైజాగ్) నుండి కాకినాడ వరకు బంగాళాఖాతంలో 150 కిలోమీటర్లు ఈది చరిత్రకెక్కారు. ఐదు రోజుల పాటు సాగిన శ్యామల సాహస యాత్ర సాగింది. డిసెంబర్ 28న ఆర్.కె. వైజాగ్‌లోని బీచ్ నుంచి మొదలై కాకినాడలోని ఎన్టీఆర్ బీచ్‌లో జనవరి 1న ముగిసింది. ఇలాంటి విజయాలను అలవోకంగా అందుకోవడం ఆమెకు కొత్తేమీ కాదు.
వైజాగ్-కాకినాడ ఛాలెంజ్
ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న శ్యామలకు సముద్రాలను ఈదడం హాబీ. తాజాగా బంగాళాఖాతంలో విశాఖపట్నం నుంచి కాకినాడ వరకూ 150 కిలోమీటర్ల దూరాన్ని విజయవంతంగా ఈదారు. వారం రోజుల తరువాత సూర్యారావుపేట ఎన్టీఆర్ బీచ్‌కు చేరుకోవడంతో ఆమె సాహస యాత్ర ముగిసింది. ఆమె భద్రత, విజయాన్ని నిర్ధారించేందుకు ఒక డాక్టర్, ఫిజియోథెరపిస్ట్, ఫీడర్‌లు, స్కూబా డైవర్లు , కయాకర్‌లతో సహా 12 మంది సభ్యుల, రెండు పెద్ద పడవలు ఒక చిన్న నౌక ఆమె వెంట సాగాయి.
52-Year-Old woman Goli Shyamala Swims 150 km from #Visakhapatnam to #Kakinada, Inspiring Generations
Goli #Shyamala, a 52-year-old #WomanSwimmer from Samalkot in Kakinada district, #AndhraPradesh successfully completed an adventurous swim of 150 kilometers in the sea from… pic.twitter.com/DenfvFaHgr— Surya Reddy (@jsuryareddy) January 4, 2025
అంతకుముందు- తమిళనాడు- శ్రీలంక నార్త్ ప్రావిన్స్‌ను అనుసంధానించే పాల్క్ స్ట్రెయిట్‌ను 13 గంటల 43 నిమిషాల్లో అధిగమించి ఈ ఘనతను సాధించిన రెండో మహిళగా శ్యామలనిలిచారు. గతంలో రామసేతు సమీపంలో అలవోకగా ఈ సాహసాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. అమెరికాలోని కాటలినా ఐలండ్ నుంచి లాస్ ఏంజిలిస్ వరకు ఇలాంటి సాహసాన్ని పూర్తి చేశారు. కాటలినా ఐలండ్ నుంచి లాస్ ఏంజిలిస్ వరకు గల 36 కిలోమీటర్ల దూరాన్ని 12 డిగ్రీల టెంపరేచర్‌లో 19 గంటల్లో అధిగమించారు. లక్షద్వీప్‌లో కీల్టన్ ఐలండ్- కడ్మట్ ఐలండ్, హుగ్లీ, గంగ, భాగీరథీ నదుల్లో రికార్డు సమయాల్లో ఈది రికార్డు సృష్టించిన చరిత్ర శ్యామలది.
శ్యామల సృజనాత్మక దర్శకురాలు, రచయిత కూడా. అయితే తన యానిమేషన్ స్టూడియో సక్సెస్‌కాకపోవడంతో ఆమె స్విమ్మింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వేసవి ఈత శిబిరాల్లో పాల్గొనడం ద్వారా మరింత ఆసక్తి పెరిగింది. ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ గురించి అవగాహన కల్పించడం, ప్రజలను ప్రోత్సహించడం ఆమె లక్ష్యంగా మారింది.
ఓపెన్ వాటర్ స్విమ్మింగ్‌లో విజయాలు
పాక్ స్ట్రెయిట్: 13 గంటల 43 నిమిషాల్లో 30 కిలోమీటర్లు ఈదుతూ, ఈ ఘనత సాధించిన రెండో మహిళగా నిలిచింది.కాటాలినా ఛానల్: కాటాలినా ద్వీపం నుండి లాస్ ఏంజిల్స్ వరకు 36 కిలోమీటర్లు 19 గంటల్లో గడ్డకట్టే 12°C ఉష్ణోగ్రతల మద్య స్విమ్మింగ్ చేశారు.
లక్షద్వీప్ : లక్షద్వీప్ టూరిజంను ప్రోత్సహించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుతో స్ఫూర్తి పొంది కిల్టన్ ద్వీపం నుండి కద్మత్ ద్వీపానికి 18 గంటల్లో 48 కిలోమీటర్లు ఈదారు.
ఆమె స్విమ్మింగ్ చేసిన నదులు
•కృష్ణా నది: 1.5 కి.మీ
•హూగ్లీ నది: 14 కిలోమీటర్లు
•గంగా నది: 13 కి.మీ
•భాగీరథి నది: 81 కి.మీ
Comments
Please login to add a commentAdd a comment