
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభు త్వం చేపట్టిన పలు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి తగిన సాయం చేయాలని ఆ పార్టీ లోక్ సభాపక్ష నేత ఏపీ జితేందర్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. ప్రకృతి విపత్తుల అంశంపై బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడా రు. రైతు సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని కోణాల్లో సంక్షేమ చర్యలు చేపట్టిందని, సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిందన్నారు. మిషన్ కాకతీయ ద్వారా 46వేల చెరువులను పునరుద్ధరిస్తోందన్నారు.