
సాక్షి, కాకినాడ : గోదావరిలో లాంచీ ప్రమాద ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేయూత అందించనుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మృతుల కుటుంబీల వద్దకు వెళ్లి ఆర్థిక సాయం అందచేయనున్నట్లు పార్టీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. ఈ దుర్ఘటనలో మరణించిన పెద్దలకు, రూ.50వేలు, చిన్నారులకు రూ.25వేలు నష్టపరిహారం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు వైఎస్‌ఆర్ సీపీ నేతలు ఏలూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, తెల్లం బాలరాజు, కారుమూరి నాగేశ్వరరావు, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, అనంత ఉదయభాస్కర్ తదితరులు సంఘటనా స్థలంలో బాధితులను పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment