
సాక్షి, విజయవాడ: కృష్ణా నదిలో బోటు బోల్తాపడిన దుర్ఘటన నేపథ్యంలో విజయవాడలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ప్రమాదం జరిగిన ఫెర్రీ ఘాట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించిన తర్వాతే ఇతరులు వెళ్లాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ మేరకు వైఎస్సార్సీపీ ముఖ్యనేతలను పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. సీఎం చంద్రబాబు ఫెర్రీ ఘాట్‌కు వెళ్లేవరకు మీరు వెళ్లొద్దంటూ వారిని నిలువరించారు.
పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులను పరామర్శించడానికి కూడా పోలీసుల అనుమతి కావాలా? అని నిలదీశారు. సీఎం ఫెర్రీ ఘాట్‌కు రావడానికి ఇంకా గంట సమయం పడుతుందని, అప్పటిలోగా తాము ప్రమాద స్థలాన్ని పరిశీలించి.. బాధితులను పరామర్శిస్తామని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదని, సీఎం వెళ్లిన తర్వాత ఇతరులు వెళ్లాలంటున్న పోలీసుల తీరు దారుణంగా ఉందని వైఎస్సార్సీపీ నేతలు ఖండించారు.
కాగా, సీఎం చంద్రబాబు ఫెర్రీ ఘాట్‌ను సందర్శించి.. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం నిలదీసేందుకు మృతుల బంధువులు ప్రయత్నించారు. కాగీ, మీడియాతో మాట్లాడకుండానే సీఎం చంద్రబాబు వెళ్లిపోయారు. ఈ ఘటనపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటన చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment