పశ్చిమ గోదావరి: ఉండి మండలం యండగండి గ్�...
గుంటూరు/YSR జిల్లా, సాక్షి: వైఎస్సార్స�...
విశాఖపట్నం, సాక్షి: పశ్చిమ మధ్య బంగాళ�...
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్�...
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన తదనంత...
సాక్షి, ప్రకాశం: ఏపీలో మరోసారి భూ ప్రక...
పూణే: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్ర�...
ఆఫ్రికా దేశం ఉగాండాలో వింత వ్యాధి అక�...
అట్టావా: వచ్చే ఏడాది ఎన్నికలు జరుగబో�...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫార్ము�...
‘‘కష్టం నాన్నా.. నాకు ఇవేం అర్థం కావడం...
సాక్షి, తాడేపల్లి: నేడు మాజీ ముఖ్యమంత�...
సాక్షి, తిరుపతి: ఏపీలో కూటమి పాలనలో కక...
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఉన్న అటవీ ప్�...
Published Wed, Aug 3 2022 8:25 AM | Last Updated on Wed, Aug 3 2022 12:19 PM
చిరు వ్యాపారులకు ‘జగనన్న తోడు’: అప్డేట్స్
‘జగనన్న తోడు’ పథకం కింద వడ్డీ లేని రుణాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి సీఎం జగన్ జమ చేశారు. 3.95 లక్షల మందికి ఈ పథకం ద్వారా కొత్తగా రూ.395 కోట్ల వడ్డీ లేని రుణాలను సమకూర్చడంతోపాటు గత ఆర్నెల్లకు సంబంధించి రూ.15.96 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను సీఎం జమ చేశారు.
గతంలో లోన్లు తీసుకోవాలంటే బ్యాంకులు చుట్టూ తిరిగేవాళ్లమని.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దరఖాస్తు చేసిన ఒక్కరోజులోనే రుణాలు మంజూరవుతున్నాయని, ఆ ఘనత సీఎం జగన్‌కే దక్కాలని లబ్ధిదారులు అన్నారు. గతంలో వచ్చే లాభం అంతా వడ్డీకే సరిపోయేదన్నారు. ‘జగనన్న తోడు’తో వడ్డీ భారం తగ్గిందన్నారు.
చిరు వ్యాపారులు చేసేది గొప్ప సేవ అని సీఎం జగన్ కొనియాడారు. చిరు వ్యాపారుల కష్టాలు తన పాదయాత్రలో చూశానన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీ భారం లేకుండా లక్షల కుటుంబాలను ఆదుకున్నామని సీఎం అన్నారు. చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, చేతి వృత్తుల వారికి వడ్డీకి లేని రుణాలు ఇస్తున్నామన్నారు. ఏటా రూ.10వేల చొప్పున వడ్డీ లేని రుణం అందిస్తున్నామన్నారు. 3.95 లక్షల మందికి ఈ పథకం ద్వారా కొత్తగా రూ.395 కోట్ల వడ్డీ లేని రుణాలను సమకూర్చడంతోపాటు గత ఆర్నెల్లకు సంబంధించి రూ.15.96 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను జమ చేస్తున్నామన్నారు.
స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. తమకు తాము ఉపాధి కల్పించుకోవడమే కాకుండా మిగతా వారికి కూడా ఉపాధి కల్పిస్తున్నారని సీఎం అన్నారు.
నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తిదారులకు ఏటా రూ.10 వేల చొప్పున వడ్డీ లేని బ్యాంకు రుణాలను అందచేస్తూ స్వయం ఉపాధికి రాష్ట్ర ప్రభుత్వం ఊతం అందిస్తున్న విషయం తెలిసిందే. వడ్డీ భారాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తోంది 3.95 లక్షల మందికి బ్యాంకుల ద్వారా కొత్తగా రూ.395 కోట్ల వడ్డీ లేని రుణాలను సమకూర్చడంతోపాటు గత ఆర్నెల్లకు సంబంధించి రూ.15.96 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కాసేపట్లో తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
లబ్ధిదారులు బ్యాంకులకు చెల్లించిన వడ్డీ మొత్తాన్ని ప్రతి ఆర్నెల్లకు ఒకసారి నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు ప్రభుత్వం జమ చేస్తోంది. రుణం తీరిన లబ్ధిదారులకు బ్యాంకులు తిరిగి వడ్డీలేని రుణాలిస్తాయి. అర్హత కలిగి ఉండీ జాబితాలో పేర్లు నమోదు కానివారు గ్రామ, వార్డు వలంటీర్లను సంప్రదించవచ్చు లేదా సమీప సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పథకం ద్వారా బుధవారం అందించే రూ.395 కోట్లతో కలిపి ఇప్పటివరకు 15,03,558 మంది లబ్ధి దారులకు అందించిన వడ్డీ లేని రుణాలు రూ.2,011 కోట్లు. సకాలంలో రుణాలు చెల్లించిన 12.50 లక్షల మందికి ప్రభుత్వం తిరిగి చెల్లించిన వడ్డీ రూ.48.48 కోట్లు. చిరు వ్యాపారులు రోజువారీ పెట్టుబడి ఖర్చుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన దుస్ధితి లేకుండా అర్హులందరికీ ఈ పథకం ద్వారా వడ్డీ లేని బ్యాంకు రుణాలను ప్రభుత్వం సమకూరుస్తోంది.
గ్రామాలు, పట్టణాల్లో సుమారు 5 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు స్థలంలో శాశ్వత లేక తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్న వారు, ఫుట్‌పాత్‌ల మీద, వీధుల్లో తోపుడు బండ్ల మీద వస్తువులు, కూరగాయలు, పండ్లు, ఆహార పదార్థాలు విక్రయిస్తూ జీవించే వారు, రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహించే వారు, గంపలు, బుట్టల్లో వస్తువులు అమ్మేవారు, సైకిల్, మోటర్ సైకిళ్లు, ఆటోలపై తిరిగి వ్యాపారం చేసుకునేవారు, చేనేత, సంప్రదాయ చేతివృత్తి కళాకారులైన ఇత్తడి పని చేసేవారు, బొబ్బిలివీణ, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, కలంకారీ, తోలుబొమ్మలు, ఇతర సామగ్రి తయారీదారులు, లేస్ వర్క్స్, కుమ్మరి తదితర వృత్తులపై ఆధారపడ్డ వారు లబ్ధిపొందనున్నారు.
3.95 లక్షల మందికి బ్యాంకుల ద్వారా కొత్తగా రూ.395 కోట్ల వడ్డీ లేని రుణాలను సమకూర్చడంతోపాటు గత ఆర్నెల్లకు సంబంధించి రూ.15.96 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
చిరు వ్యాపారుల ఉపాధికి ఊతం కల్పించే జగనన్న తోడు పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తిదారులకు ఏటా రూ.10 వేల చొప్పున వడ్డీ లేని బ్యాంకు రుణాలను అందచేస్తూ స్వయం ఉపాధికి రాష్ట్ర ప్రభుత్వం ఊతం అందిస్తున్న విషయం తెలిసిందే. వడ్డీ భారాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment