Jagananna Thodu Scheme
-
‘జగనన్న తోడు’ పథకం కింద 8వ విడతలో లబ్ధిదారుల ఖాతాల్లో 431 కోట్ల రూపాయలు జమ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి...ఇంకా ఇతర అప్డేట్స్
-
AP: మరో మహిళా విప్లవం
‘జగనన్న తోడు’ ద్వారా మహిళా సాధికారత, సామాజిక సాధికారతలో మరో విప్లవాన్ని సాధించాం. పథకం ద్వారా లబ్ధి పొందిన మొత్తం 16.73 లక్షల మంది చిరువ్యాపారుల్లో 87.13 శాతం మంది నా అక్క చెల్లెమ్మలే కావడం, అందులోనూ 79.14 శాతం మంది నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే ఉండటం దీనికి నిదర్శనం. పారదర్శకంగా రుణాలిప్పించడంతో పాటు అంతే స్థాయిలో సకాలంలో తిరిగి చెల్లింపులు చేయించ గలుగుతున్నాం. తద్వారా రుణాల రికవరీ 95 శాతానికిపైగా ఉంది. రికవరీ బాగుండటంతో మళ్లీ రుణాలు అందుతున్నాయి. ఇదంతా ఒక చక్రం మాదిరిగా కొనసాగుతోంది. సాధికారత విషయంలో ఇది చాలా పెద్ద అచీవ్మెంట్. ఇందులో సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థలది కీలకపాత్ర. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘జగనన్న తోడు’ ద్వారా చిరువ్యాపారులకు ప్రభుత్వం తోడుగా నిలుస్తూ మానవత్వానికి మరో పేరుగా నిలిచిందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ పథకం దేశానికే దిక్సూచిలా నిలిచిందన్నారు. దేశం మొత్తం మీద ‘పీఎం స్వనిధి’ ద్వారా ఏడు శాతం వడ్డీకి రూ.10,220 కోట్ల రుణాలు ఇవ్వగా ఏపీలో జగనన్న తోడు కింద 16.73 లక్షల మంది చిరువ్యాపారులకు వడ్డీ లేకుండా రూ.3,373 కోట్లు రుణాలు అందజేశామన్నారు. జగనన్న తోడు ద్వారా వరుసగా 8వ విడత చిరు వ్యాపారుల ఉపాధికి ఊతం ఇస్తూ, పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికి రూ.10,000, అంతకు పైగా కలిపి 3,95,000 మంది చిరు వ్యాపారులకు రూ.417.94 కోట్ల వడ్డీలేని కొత్త రుణాలను సీఎం జగన్ అందచేశారు. మొత్తం 16,73,576 మంది లబ్ధిదారుల్లో ఈ విడతలో వడ్డీ రీయింబర్స్ కింద 5.81 లక్షల మందికి రూ.13.64 కోట్లను కూడా ప్రభుత్వం అందచేస్తోంది. ఈ రెండూ కలిపి మొత్తం రూ.431.58 కోట్లను సీఎం జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసి లబ్ధిదారులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం ఏంమాట్లాడారంటే.. దశాబ్దాల దుస్థితికి పరిష్కారం.. లక్షల మంది చిరు వ్యాపారులకు మేలు చేసే మంచి కార్యక్రమమిది. చిరువ్యాపారుల బతుకులు ఎలా ఉంటాయో మన కళ్లముందే కనిపిస్తున్నా ఆ కష్టాలను ఎలా కడతేర్చాలని ఎప్పుడూ, ఎవరూ ఇంతలా మనసుపెట్టి, ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోలేదు. నా పాదయాత్రలో ప్రతి జిల్లాలో వారి కష్టాలను చూశా. వ్యాపారం చేసుకోవడానికి కూరగాయలు, పనిముట్లు, ముడిసరుకు కోసం కనీసం వెయ్యి రూపాయిలు పెట్టుబడి అవసరం. రూ.1,000 అప్పు ఇస్తే ప్రైవేట్ వ్యాపారులు అప్పటికప్పుడే వడ్డీ కింద రూ.100 మినహాయించుకుంటారు. ఇలా రూ.10 వడ్డీకి వెయ్యి రూపాయలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. అలా తీసుకుంటే కానీ వారి జీవితాలు ముందుకు సాగని దుస్థితి. దశాబ్దాలుగా ఇలాంటి పరిస్థితి కనిపిస్తున్నా దీనికి పరిష్కారం చూపేందుకు ఎవరూ ముందుకు రాలేదు. మానవత్వానికి చిరునామా.. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పరిస్థితి గురించి బ్యాంకర్లతో మాట్లాడాం. బ్యాంకర్లను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా చేస్తూ ఎలాంటి హామీ లేకుండా రూ.10 వేలు అప్పు ఇచ్చేలా ఏర్పాట్లు చేశాం. సకాలంలో తిరిగి చెల్లించేలా లబ్ధిదారులను ప్రోత్సహిస్తూ వడ్డీ భారం మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని ఒక భరోసా కల్పించాం. ఇవన్నీ చేస్తూ ఇవాళ 8వ దఫా కింద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మన ప్రభుత్వం మానవత్వానికి చిరునామాగా నిలిచిందని గర్వంగా చెబుతున్నాం. ఇతరులకూ ఉపాధి చూపుతున్నారు.. చేతి వృత్తిదారులు, ఫుట్‌పాత్ విక్రేతలు, తోపుడు బండ్లపై కూరగాయలు అమ్ముకునేవారు, రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు, గంపలు, బుట్టలపై అమ్మకాలు చేసేవారు, ఆటోలు, సైకిళ్లపై చిన్న చిన్న వస్తువులు అమ్ముకునేవారు, వివిధ వృత్తుల కళాకారులంతా స్వయం ఉపాధితో తాము జీవించడమే కాకుండా మరికొందరికి కూడా ఉపాది కల్పిస్తున్నారు. ఇలాంటి వారికి జగనన్న తోడు కార్యక్రమం ఉపయోగపడుతుంది. లబ్ధిదారులకు రూ.10 వేలు ఎలాంటి గ్యారంటీ లేకుండా అందించి సకాలంలో చెల్లించిన వారందరినీ ప్రోత్సహిస్తూ ప్రభుత్వం తరపున వడ్డీని వెనక్కి ఇచ్చాం. ఏటా రూ.1,000 చొప్పున ఈ మొత్తాన్ని పెంచుతూ రూ.13,000 వరకూ తీసుకుని వెళ్లేలా పథకాన్ని అమలు చేయడం సంతోషాన్నిస్తోంది. రుణాలైనా.. రీయింబర్స్మెంటైనా రాష్ట్రంలో గొప్ప విప్లవాత్మక అడుగులు పడుతున్నాయన్నది ఒక అంశం కాగా రెండోది మన ప్రభుత్వం దేశానికి దిక్సూచిగా ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కేంద్రం 7% వడ్డీకి 58,65,000 మందికి ‘పీఎం స్వనిధి’ పేరుతో రూ.10,220 కోట్ల రుణాలు ఇవ్వగా ఒక్క ఏపీలోనే 16,74,000 మందికి రూ.3,373 కోట్ల మేర వడ్డీలేని రుణాలివ్వగలిగాం. మనం ఎలా చేయగలిగాం? మిగిలిన రాష్ట్రాలు ఎందుకు చేయలేకపోయాయో ఆలోచిస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. కేంద్రం అన్ని రాష్ట్రాలకు కలిపి 7%వడ్డీ మొత్తం కింద రూ.138 కోట్లు చెల్లిస్తే ఒక్క ఏపీలోనే చిరు వ్యాపారులకు రూ.88 కోట్లను వడ్డీ రీయింబర్స్మెంట్ కింద తిరిగి అందచేశాం. జీవనోపాధి కల్పిస్తూ అడుగులు.. మన ప్రభుత్వం రాకముందు పొదుపు సంఘాల రుణాలకు సంబంధించి 18% ఎన్పీఏలుగా ఉంటే మనం వచ్చిన తర్వాత అది 0.3% లోపే ఉంది. పరివర్తన అనేది ప్రతి అడుగులోనూ జరిగింది. అక్కచెల్లెమ్మలు, మహిళా సాధికారత విషయంలో గొప్ప అడుగులు పడుతున్నాయి. వారికి జీవనోపాధి కల్పించేలా అడుగులు వేశాం. అమూల్, రిలయెన్స్, ఐటీసీ, పీ అండ్ జీ లాంటి పెద్ద పెద్ద కంపెనీలను తీసుకొచ్చి వారికి వ్యాపార అవకాశాలు కల్పించడంతోపాటు బ్యాంకులతో అనుసంధానించి రుణాలతో తోడ్పాటు కల్పించాం. వైఎస్సార్ ఆసరా, చేయూత, సున్నా వడ్డీ లాంటి పథకాల ద్వారా అన్ని రకాలుగా తోడుగా నిలిచి మహిళ సాధికారత దిశగా అడుగులు వేయించగలిగాం. గత నాలుగున్నరేళ్ల పాలనలో చేకూర్చిన లబ్ధి అందుకు నిదర్శనం. ఎలా సాధ్యమైందంటే..? మిగిలిన రాష్ట్రాలకు – మనకు ఎందుకు ఇంత తేడా వచ్చింది? మన ఫెర్ఫార్మెన్స్ (పనితీరు) మిగిలిన రాష్ట్రాల కన్నా ఎందుకని మెరుగ్గా, భిన్నంగా ఉంది? దేశానికి మార్గనిర్దేశం చేసే విధంగా ఎలా అడుగులు పడ్డాయి? అనేది ఒకసారి గమనిస్తే మన దగ్గర ఉన్న గొప్పవైన సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థలే దానికి కారణం. వీటి ద్వారా మనం పారదర్శకంగా రుణాలిప్పించడంతో పాటు అంతే స్థాయిలో సకాలంలో తిరిగి చెల్లింపులు చేయించగలుగుతున్నాం. అందులో సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థలది కీలకపాత్ర. రుణాల రికవరీ 95 శాతానికిపైగా ఉంది. సాధికారత విషయంలో ఇది చాలా పెద్ద అచీవ్మెంట్. కొత్త వారికి వడ్డీలేని రుణాలు.. రెన్యువల్ ఇవాళ జగనన్న తోడు 8వ విడతలో మరో 86,084 మంది చిరువ్యాపారులకు రూ.86 కోట్లు వడ్డీ లేని రుణాలుగా అందిస్తున్నాం. వీరితో పాటు గతంలో ఈ స్కీమ్ ద్వారా రుణాలు పొందిన 3.09 లక్షల మంది చిరువ్యాపారులకు రూ.332 కోట్ల రుణాలను రెన్యువల్ కూడా చేస్తున్నాం. మొత్తంగా ఈ కార్యక్రమం ద్వారా దాదాపు రూ.418 కోట్లను 3,95,000 మందికి ఇవాళ కొత్త రుణాలుగా అందిస్తున్నాం. అంతేకాకుండా గతంలో జగనన్న తోడు స్కీం ద్వారా రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 5,80,968 మంది లబ్ధిదారులకు వడ్డీ కింద రూ.13.64 కోట్లను తిరిగి వారికి ఇస్తున్నాం. మొత్తంగా ఇవాళ దాదాపు రూ.430 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చుతూ చిరు వ్యాపారులకు మంచి చేస్తున్నాం. ఇప్పటిదాకా రూ.3,373 కోట్లు వడ్డీ లేని రుణాలు జగనన్న తోడు పథకం ద్వారా తాజాగా చేకూరుస్తున్న లబ్ధితో కూడా కలిపి ఇప్పటివరకు 16,73,576 మంది చిరువ్యాపారులకు రూ.3,373 కోట్లు వడ్డీ లేని రుణాలుగా ఇచ్చాం. దీంతో పాటు వారు కట్టిన వడ్డీలు రూ.88.33 కోట్లను మళ్లీ తిరిగి వెనక్కి ఇచ్చే గొప్ప అడుగులు ఈ నాలుగున్నరేళ్లలో పడ్డాయి. ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందిన వారి వివరాలను గమనిస్తే మొత్తం లబ్దిదారుల్లో 73,072 మంది చిరువ్యాపారులు ఇప్పటికే నాలుగుసార్లు డబ్బులు కట్టి తీసుకున్నారు. 5,10,241 మంది మూడుసార్లు డబ్బులు కట్టి తీసుకున్నారు. 3,98,229 మంది చిరువ్యాపారులు రెండు దఫాలు రుణాలు పొంది వాటిని తిరిగి చెల్లించి మళ్లీ తీసుకున్నారు. గడప గడపలో సంతోషాన్ని చూశాం చిరు వ్యాపారులు, కుల వృత్తులపై ఆధారపడే కుటుంబాలు గతంలో అప్పు తీసుకుంటే ప్రైవేట్ వ్యాపారులు ఖాళీ పేపర్లపై సంతకాలు పెట్టించుకుని రూ.6 నుంచి రూ.10 వడ్డీ వసూలు చేసేవారు. రూ.10,000 రుణానికి రూ.9,000 మాత్రమే ఇచ్చి రూ.వెయ్యి తిరిగి వసూలు చేసేవారు. ఆ పరిస్థ్ధితుల నుంచి ఇప్పుడు ఒక్కొక్కరికీ రూ.10,000 చొప్పున అందచేస్తూ వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తోంది. వడ్డీ లేని మొత్తాన్ని ఏటా పెంచుతూ ఇప్పుడు రూ.13,000 వరకూ అందిస్తోంది. ఆ కుటుంబాలన్నీ మేం గడప గడపకూ వెళ్లినప్పుడు సంతోషంతో సీఎంకు ధన్యవాదాలు తెలిపాయి. – బూడి ముత్యాల నాయుడు, డిప్యూటీ సీఎం (పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) ఇన్ని ఆలోచనలు.. మీకెలా సాధ్యం? నేను పూల వ్యాపారం, టైలరింగ్ చేస్తున్నా. మా ఆయన మెకానిక్. కరోనా సమయంలో డబ్బుల కోసం చాలా ఇబ్బందులు పడ్డాం. రూ.10 వేలు అప్పు తీసుకుంటే వెయ్యి తగ్గించుకుని రూ.9,000 మాత్రమే ఇస్తామన్నారు. ఆ సమయంలో వలంటీర్ జగనన్న తోడు గురించి చెప్పడంతో దరఖాస్తు చేసుకున్నాం. ఎవరి సిఫారసు లేకుండా నా ఖాతాలో రూ.10 వేలు పడ్డాయి. ఆ తర్వాత సకాలంలో తిరిగి కట్టడంతో వడ్డీ వెనక్కి వచ్చింది. ఇది చాలా గొప్ప ఆలోచన. దేశంలో ఎవరూ ఇలాంటి ఆలోచన చేసి ఉండరు. నాకు వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ కూడా వచ్చింది. గతంలో మా సంపాదనంతా వడ్డీలు కట్టడానికే సరిపోయేది. వైఎస్సార్ చేయూతకు కూడా నేను అర్హత పొందడంతో నేరుగా రూ.18,750 నా ఖాతాలోకి వచ్చాయి. ఇలా మూడు విడతల్లో లబ్ధి పొందా. ఇప్పుడు నాలుగో విడత కూడా వస్తుంది. ఇలా నాకు అన్ని పథకాలు అందడంతో మా కుటుంబం చాలా సంతోషంగా ఉంది. నా కోడలు కాన్పు సమయంలో సిజేరియన్ కోసం ప్రైవేట్ ఆస్పత్రిలో రూ.1.50 లక్షలు ఖర్చవుతుందన్నారు. ఆరోగ్యశ్రీ కింద చేరడంతో ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదు. పైగా తిరిగి రూ.5,000 ఓ అన్నలా ఆర్థిక సాయం అందచేశారు. ఇన్ని ఆలోచనలు మీకెలా వస్తున్నాయి అన్నా? మా అమ్మ గతంలో ఫించన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగేది. ఇప్పుడు వలంటీర్ ఇంటి వద్దే ఇవ్వడంతో చాలా సంతోషంగా ఉంది. ఈసారి రూ.3,000 పెన్షన్ తీసుకుంది. మిమ్మల్ని నా పెద్ద కుమారుడు అని గర్వంగా చెబుతోంది. నాకు ఇల్లు కూడా వచ్చింది. మీరు కులం, మతం, రాజకీయం చూడకుండా అన్నీ గొప్పగా చేస్తున్నారు. మమ్మల్ని ఇప్పుడు వ్యాపారస్తులుగా గుర్తించి గౌరవిస్తున్నారు. గతంలో పేదలను ఎవరూ గుర్తించలేదు. ఈరోజు మేం బ్యాంకులకు వెళ్లి ధైర్యంగా కూర్చుని లోన్ కావాలని అడుగుతున్నామంటే మీరే కారణం. మీరు సీఎంగా రావడం మా అదృష్టం. మిమ్మల్ని తిరిగి గెలిపించుకుంటాం. – లక్ష్మీదేవి, చిరువ్యాపారి, అనంతపురం మీ చిరునవ్వుతో రాష్ట్రంలో వెలుగులు ఎవరి పూచీకత్తు లేకుండా బ్యాంకులో రూ.10 వేలు ఇచ్చారు. మళ్లీ చెల్లించడంతో వడ్డీ తిరిగి ఇచ్చారు. టైలరింగ్ ద్వారా నెలకు రూ. 6,000కిపైగా సంపాదిస్తున్నా. నాకు అమ్మ ఒడి వస్తోంది. విద్యా దీవెన ఇస్తున్నారు. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్లు ఖాళీ అయ్యాయి. గవర్నమెంట్ స్కూళ్లలో సీట్లు లేవని బోర్డు పెట్టే పరిస్థితి వచ్చింది. మీరు మా నుంచి వచ్చారు కాబట్టి ఇన్ని పథకాలు ఇస్తున్నారు. మీరు మాకు దేవుడిచ్చిన గిఫ్ట్. మా గ్రూప్ ద్వారా బ్యాంకులో రూ.10 లక్షలు లోన్ తీసుకున్నాం. వైఎస్సార్ సున్నా వడ్డీ వస్తోంది. ఆసరా ద్వారా రూ.3.60 లక్షలు మా గ్రూప్ మొత్తానికి ఇవ్వగా నాకు రూ.36 వేలు వచ్చాయి. నవరత్నాలలో భాగంగా ఇల్లు కూడా వచ్చింది. మా నాన్నకు హార్ట్ ఎటాక్ రావడంతో రూ.5 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. ఇంటిల్లిపాదీ బాధపడుతున్న సమయంలో మీరు డాక్టర్ రూపంలో కనిపించారు. ఆరోగ్యశ్రీ కింద వెంటనే ఉచితంగా ఆపరేషన్ చేశారు. నాన్న క్షేమంగా ఇంటికి వచ్చారు. అంతేకాకుండా ఏడాది వరకూ ప్రతి నెలా చెకప్, ఉచితంగా రూ.3,000 మందులు ఇస్తున్నారు. గతంలో వయసు మళ్లిన వారు ఎందుకు బతుకుతున్నామా అని భారంగా గడిపేవారు. ఇవాళ వారంతా ఇంటివద్దే పెన్షన్ ఇస్తున్న మిమ్మల్ని తమ బిడ్డలాగా భావిస్తున్నారు. మా నాన్న కూడా నేను ఇక్కడికి వచ్చేటప్పుడు జగనన్న నాకు దేవుడని చెప్పారు. ఉదయం నిద్ర లేవగానే మా ఇంట్లో మేమంతా మీ ఫోటో చూస్తాం. మీరిచ్చిన పథకాల ద్వారా నేను రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షలు వరకు లబ్ధి పొందా. మా అత్తమ్మకు ఆసరా సాయం అందడంతో రెండు ఆవులు కొనుగోలు చేశారు. మా మామకు రైతు భరోసా వస్తోంది. ఏపీలో మీ పథకం అందని ఇల్లంటూ లేదు. ఒక్కొక్కరు నాలుగైదు పథకాలు పొందుతున్నారు. గ్యారెంటీగా ఒక్కో ఇంటికి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు దాకా ప్రయోజనం పొందుతున్నారు. ఇంతకంటే ఏం కావాలన్నా? మరెవరూ ఇన్ని పథకాలు అందజేయలేదు. మాకు ఏం కావాలో మీకు తెలుసు. మీ చిరునవ్వుతో ఏపీ వెలిగిపోతుంది. – గౌరి, చిరువ్యాపారి, విజయనగరం రుణమాఫీ మోసంతో చెవి పోగులు పోయాయి.. రోడ్డు పక్కన కాయలు విక్రయిస్తూ జీవిస్తున్నాం. కరోనా సమయంలో వ్యాపారం లేక, అప్పులు ఇచ్చిన వారు నానా మాటలు అంటుంటే చావాలో బతకాలో తెలియని పరిస్ధితి ఎదుర్కొన్నాం. అలాంటప్పుడు జగనన్న తోడు ద్వారా రూ.10 వేలు అందాయి. ఏటా పెంచుతూ ఇప్పుడు రూ.13,000 ఇచ్చారు. సకాలంలో తిరిగి చెల్లిస్తున్నాం. మాకు వడ్డీ భారం లేకుండా తిరిగి వెనక్కి ఇస్తున్నారు. గతంలో రోడ్డు పక్కన వ్యాపారం చేయడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇప్పుడు మీరు అందించిన సాయంతో సొంతంగా షాప్ పెట్టుకుని ఓనర్‌గా నిలబడ్డాం. గత సర్కారు డ్వాక్రా రుణమాఫీ అంటే నమ్మి మోసపోయాం. వడ్డీల మీద వడ్డీ వేసి నోటీసులు పంపారు. నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు. దీంతో బంగారం తాకట్టు పెట్టి కట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎన్నిసార్లు తిరిగినా లోన్ ఇవ్వలేదు. గత ప్రభుత్వం నన్ను చాలా మోసం చేసింది. నాడు చెవిదిద్దులు కూడా లేని నేను ఈరోజు గొలుసు వేసుకున్నానంటే నిజంగా మీ దయవల్లే జగనన్నా! అలాంటిది మిమ్మల్ని ఎందుకు వదులుకుంటామన్నా! మాకు వేరే సీఎం, వేరే గవర్నమెంట్ ఎందుకన్నా! మాకు మీరుంటే చాలు. నేను ఇక్కడికి వచ్చే ముందు అమ్మా నువ్వు జగన్‌గారితో మాట్లాడాలని మా పాప ముద్దు పెట్టి పంపింది. టెన్త్ చదువుతున్న మా పాప గతంలో సంక్రాంతి సెలవులు వస్తే ఊరికి వెళ్లేది. ఇప్పుడు ఆన్లైన్ క్లాస్‌లు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు హోమ్‌వర్క్‌లు చేసి సార్లకు పంపాలట. ఇప్పుడు చదువులు చాలా బాగున్నాయి. నాడు – నేడు ద్వారా స్కూళ్లు ఎంతో బాగున్నాయి. స్కూల్‌కు ఒక్క పూట మానేస్తే ఎందుకు రాలేదని అడుగుతున్నారు. ఆరోగ్యం బాగోలేదంటే తగ్గిందా లేదా అని తరువాత విచారిస్తున్నారు. నా భర్తకు గుండె పోటు రావడంతో ఆరోగ్యశ్రీ కింద రూపాయి ఖర్చు లేకుండా విజయవాడ ఆసుపత్రిలో వైద్యం చేశారు. మా అమ్మమ్మ విజయవాడ ఆసుపత్రిలో క్యాన్సర్ చికిత్స పొందుతోంది. ఆమె దగ్గర ఎవరూ లేకపోయినా ఆసుపత్రిలో వారే దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు. మందులు ఇచ్చి కోలుకున్న తర్వాత మాకు ఫోన్ చేసి చెబుతున్నారు. ఇదంతా ఆరోగ్యశ్రీ వల్లే! మా అమ్మమ్మ జగన్‌గారికి చూపించమని తన వీడియో కూడా పంపింది. ఆవిడ తరపున కూడా మీకు ధన్యవాదాలు అన్నా! ఇంతవరకు ఏ ముఖ్యమంత్రీ కాపులను గుర్తించలేదు. మీరు కాపు మహిళలకు సాయం చేస్తున్నారు. ఆ డబ్బులతో చీరల వ్యాపారం చేస్తున్నా. రొటేషన్‌తో రూ.50 వేలకు పెంచగలిగా. నేను అమ్మ ఒడి కూడా తీసుకుంటున్నా. నా భర్తకు పెన్షన్ వస్తోంది. కలెక్టర్ పక్కన కూర్చుని మీతో మాట్లాడే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. – అడబాల సత్యవతి, చిరువ్యాపారి, కృత్తివెన్ను, కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి -
జగనన్న తోడు నిధులను పంపిణీ చేసిన సీఎం వైఎస్ జగన్
-
ఇది మరో విప్లవం.. దేశానికే ఏపీ రోల్ మోడల్
-
మన ప్రభుత్వం గర్వంగా చెప్పే అంశం ఇది: సీఎం జగన్
-
జగనన్న తోడు– చిరువ్యాపారుల ఉపాధికి ఊతం (ఫొటోలు)
-
చిరువ్యాపారులకు అండగా సీఎం జగన్
-
జగనన్న తోడులో మూడు విషయాలు
-
వరుసగా 4వ ఏడాది జగనన్న తోడు పథకం అమలు
-
‘జగనన్న తోడు’ దేశానికే ఆదర్శం: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో ఎనిమిదో విడతలో జగనన్న తోడు పథకం కింద నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి విడుదల చేశారు. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ 3,95,000 మందికి ఒక్కొక్కరికి రూ. 10 వేలు, అంతకుపైన కలిపి రూ. 417.94 కోట్ల వడ్డీ లేని కొత్త రుణాలు సీఎం జగన్ ప్రభుత్వం అందిస్తోంది. మొత్తం 16,73,576 మంది లబ్ధిదారుల్లో ఈ విడతలో వడ్డీ రీయింబర్స్మెంట్ కింద 5.81 లక్షల మంది లబ్ధిదారులకు రూ.13.64 కోట్లు చెల్లించనున్నారు. ఈ రెండూ కలిపి మొత్తం రూ.431.58 కోట్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ..‘మన ప్రభుత్వం మానవత్వానికి మారుపేరుగా నిలబడింది. రాష్ట్రంలో 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ.417.94 కోట్ల వడ్డీలేని రుణాలు. నాలుగున్నరేళ్లలో గొప్ప అడుగులు పడ్డాయి. ఈ పథకం ద్వారా చిరు వ్యాపారులు నాలుగు సార్లు లబ్ధి పొందారు. చిరు వ్యాపారులకు ఈ పథకంతో ఎంతో మేలు జరిగింది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందే వారిలో దాదాపు 87 శాతం మహిళలే ఉన్నారు. ఇది మరో మహిళా సాధికారతకు నిదర్శనం. జగనన్న తోడు ద్వారా 79.174 శాతం వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు లబ్ధి జరిగింది. సామాజిక సాధికారతను ఇది నిదర్శనం. దేశంలోనే జగనన్న తోడు పథకం ఆదర్శంగా నిలిచింది. మిగతా రాష్ట్రాలకు ఏపీ రోల్ మోడల్‌గా నిలిచింది. వలంటీర్ వ్యవస్థ ద్వారా ఇది సాధ్యమైంది. ప్రతీ అడుగులోనూ పారదర్శకంగా పాలన. చేయి పట్టుకుని నడిపిస్తూ మహిళా సాధికారత దిశగా అడుగులు. ఇంకా మంచి చేసే అవకాశం కలగాలి’ అని ఆకాంక్షించారు. ఇదీ ‘జగనన్న తోడు’ పథకం సీఎం వైఎస్ జగన్ నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారు వారి కాళ్ల మీద వారు నిలదొక్కుకొనేలా జగనన్న తోడు పథకం కింద ఆర్థిక చేయూతనిస్తున్నారు. ఒక్కొక్కరికి ఏటా రూ.10 వేల రుణం సున్నా వడ్డీకే అందిస్తున్నారు. రుణాలను సకాలంలో చెల్లించినవారికి ఏడాదికి మరో రూ.1,000 చొప్పున జోడిస్తూ రూ.13,000 వరకు వడ్డీలేని రుణం అందిస్తున్నారు. ఇలా ఇప్పటికి ఏడు విడతలు రుణాలు, వడ్డీని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. 8వ విడతగా గురువారం అందిస్తున్న రూ.417.94 కోట్ల రుణంతో కలిపి ఇప్పటివరకు చిరువ్యాపారాలు చేసుకునే 16,73,576 మంది లబ్ధిదారులకు అందించిన వడ్డీ లేని రుణాలు రూ. 3,373.73 కోట్లు. అదే విధంగా ఈ విడతలో అందించే వడ్డీతో కలిపి ఇప్పటివరకు 15.87 లక్షల లబ్ధిదారులకు తిరిగి చెల్లించిన వడ్డీ రూ.88.33 కోట్లు. సకాలంలో రుణాలు చెల్లించిన చిరు వ్యాపారులు బ్యాంకులకు చెల్లించిన వడ్డీని ఆరు నెలలకోసారి సీఎం జగన్ ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తోంది. వీరందరికీ ‘జగనన్న తోడు’ 10 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు స్థలంలో శాశ్వత లేక తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్నవారు, తోపుడు బండ్లపై వస్తువులు, కూరగాయలు, పండ్లు, ఆహార పదార్థాలు అమ్ముకుని జీవించే వారు, రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహించేవారు, సైకిల్, మోటార్ సైకిల్, ఆటోలపై వెళ్లి వ్యాపారం చేసుకునేవారు, గంపలు, బుట్టలతో వస్తువులు అమ్మేవారు, చేనేత, సంప్రదాయ చేతివృత్తుల కళాకారులకు ఈ పథకం అందిస్తున్నారు. దేశానికే ఆదర్శంగా ఏపీ చిరు వ్యాపారులను ఆదుకోవడంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ‘జగనన్న తోడు‘ ద్వారా పూర్తి వడ్డీ రాయితీ (7.32% నుండి 15.85% వరకు) కల్పిస్తోంది జగనన్న ప్రభుత్వం. దేశవ్యాప్తంగా ‘పీఎం స్వనిధి‘ ద్వారా 58,65,827 మంది చిరు వ్యాపారులకు రుణాలు అందిస్తే, ఏపీలో సీఎం వైఎస్ జగన్ ఏకంగా 16,73,576 మందికి ‘జగనన్న తోడు‘ ద్వారా వడ్డీ లేని రుణాలు అందించారు. -
Jagananna Thodu Scheme: చిరు వ్యాపారులకు నేడు ‘జగనన్న తోడు’
సాక్షి, అమరావతి: ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధితో జీవిస్తూ, మరో ఒకరిద్దరికి సైతం ఉపాధి కల్పిస్తున్న చిరు వ్యాపారులు అధిక వడ్డీల బారిన పడకుండా వారికి అండగా నిలుస్తూ, వారి ఇళ్లలో ముందుగానే పండగ సంతోషాలు వెల్లివిరిసేలా వరుసగా 8వ విడత జగనన్న తోడు పథకం అమలుకు సీఎం వైఎస్ జగన్ గురువారం శ్రీకారం చుడుతున్నారు. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ 3,95,000 మందికి ఒక్కొక్కరికి రూ. 10 వేలు, అంతకుపైన రూ. 417.94 కోట్ల వడ్డీ లేని కొత్త రుణాలు సీఎం జగన్ ప్రభుత్వం గురువారం అందిస్తోంది. మొత్తం 16,73,576 మంది లబ్ధిదారుల్లో ఈ విడతలో వడ్డీ రీయింబర్స్మెంట్ కింద 5.81 లక్షల మంది లబ్ధిదారులకు రూ.13.64 కోట్లు చెల్లించనున్నారు. ఈ రెండూ కలిపి మొత్తం రూ.431.58 కోట్లను సీఎం వైఎస్ జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇదీ ‘జగనన్న తోడు’ పథకం సీఎం వైఎస్ జగన్ నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారు వారి కాళ్ల మీద వారు నిలదొక్కుకొనేలా జగనన్న తోడు పథకం కింద ఆర్థిక చేయూతనిస్తున్నారు. ఒక్కొక్కరికి ఏటా రూ.10 వేల రుణం సున్నా వడ్డీకే అందిస్తున్నారు. రుణాలను సకాలంలో చెల్లించినవారికి ఏడాదికి మరో రూ.1,000 చొప్పున జోడిస్తూ రూ.13,000 వరకు వడ్డీలేని రుణం అందిస్తున్నారు. ఇలా ఇప్పటికి ఏడు విడతలు రుణాలు, వడ్డీని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. 8వ విడతగా గురువారం అందిస్తున్న రూ.417.94 కోట్ల రుణంతో కలిపి ఇప్పటివరకు చిరువ్యాపారాలు చేసుకునే 16,73,576 మంది లబ్ధిదారులకు అందించిన వడ్డీ లేని రుణాలు రూ. 3,373.73 కోట్లు. అదే విధంగా ఈ విడతలో అందించే వడ్డీతో కలిపి ఇప్పటివరకు 15.87 లక్షల లబ్ధిదారులకు తిరిగి చెల్లించిన వడ్డీ రూ.88.33 కోట్లు. సకాలంలో రుణాలు చెల్లించిన చిరు వ్యాపారులు బ్యాంకులకు చెల్లించిన వడ్డీని ఆరు నెలలకోసారి సీఎం జగన్ ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తోంది. వీరందరికీ ‘జగనన్న తోడు’ 10 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు స్థలంలో శాశ్వత లేక తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్నవారు, తోపుడు బండ్లపై వస్తువులు, కూరగాయలు, పండ్లు, ఆహార పదార్థాలు అమ్ముకుని జీవించే వారు, రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహించేవారు, సైకిల్, మోటార్ సైకిల్, ఆటోలపై వెళ్లి వ్యాపారం చేసుకునేవారు, గంపలు, బుట్టలతో వస్తువులు అమ్మేవారు, చేనేత, సంప్రదాయ చేతివృత్తుల కళాకారులకు ఈ పథకం అందిస్తున్నారు. దేశానికే ఆదర్శంగా ఏపీ చిరు వ్యాపారులను ఆదుకోవడంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ‘జగనన్న తోడు‘ ద్వారా పూర్తి వడ్డీ రాయితీ (7.32% నుండి 15.85% వరకు) కల్పిస్తోంది జగనన్న ప్రభుత్వం. దేశవ్యాప్తంగా ‘పీఎం స్వనిధి‘ ద్వారా 58,65,827 మంది చిరు వ్యాపారులకు రుణాలు అందిస్తే, ఏపీలో సీఎం వైఎస్ జగన్ ఏకంగా 16,73,576 మందికి ‘జగనన్న తోడు‘ ద్వారా వడ్డీ లేని రుణాలు అందించారు. దేశవ్యాప్తంగా ‘పీఎం స్వనిధి‘ కింద ఇప్పటివరకు చిరు వ్యాపారులకు ఇచ్చిన రుణాలు రూ.10,220.47 కోట్లు. రాష్ట్రంలో ‘జగనన్న తోడు‘ ద్వారా అందించిన రుణాలే అక్షరాలా రూ.3,373.73 కోట్లు. దేశవ్యాప్తంగా ‘పీఎం స్వనిధి‘ కింద చిరు వ్యాపారులకు రీయింబర్స్ చేసిన వడ్డీ రూ. 138.49 కోట్లు కాగా, ‘జగనన్న తోడు‘ ద్వారా మన రాష్ట్రంలో రీయింబర్స్ చేసిన వడ్డీ రూ.88.33కోట్లు. -
పండగ సంతోషాలు వెల్లివిరిసేలా.. జగనన్న తోడు
సాక్షి, తాడేపల్లి: ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధితో జీవిస్తూ, మరో ఒకరిద్దరికి సైతం ఉపాధి కల్పిస్తున్న చిరువ్యాపారులు అధిక వడ్డీల బారిన పడకుండా వారికి అండగా నిలబడుతూ, వారి ఇంట ముందుగానే పండగ సంతోషాలు వెల్లివిరిసేలా.. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ, ఒక్కొక్కరికి రూ.10,000, అంతకు పైగా.. 3,95,000 చిరువ్యాపారులకు రూ.417.94 కోట్ల వడ్డీలేని కొత్త రుణాలు, మొత్తం16,73,576 మంది లబ్ధిదారుల్లో ఈ విడతలో చెల్లించాల్సిన 5.81లక్షల మంది లబ్ధిదారులకు రూ.13.64 కోట్ల వడ్డీ రీయింబర్స్మెంట్ కలిపి మొత్తం రూ.431.58 కోట్లను రేపు (గురువారం) సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సాంప్రదాయ చేతివృత్తుల వారిని వారి కాళ్లమీద వారిని నిలబెడుతూ.. ఒక్కొక్కరికి ఏటా రూ.10,000 రుణం సున్నా వడ్డీకే అందిస్తూ, రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించినవారికి ఆ రూ.10,000కు అదనంగా ఏడాదికి మరో రూ.1,000 చొప్పున జోడిస్తూ రూ.13,000 వరకు వడ్డీలేని రుణం అందించనున్నారు. రేపు(గురువారం) అందిస్తున్న వడ్డీ రీయింబర్స్ మెంట్ రూ.13.64 కోట్లతో కలిపి సకాలంలో రుణాలు చెల్లించిన 15.87 లక్షల లబ్ధిదారులకు ఇప్పటివరకు మన ప్రభుత్వం తిరిగి చెల్లించిన వడ్డీ రూ.88.33 కోట్లు. రేపు(గురువారం) అందిస్తున్న రూ.417.94 కోట్ల రుణంతో కలిపి ఇప్పటివరకు చిరువ్యాపారాలు చేసుకునే 16,73,576 మంది లబ్ధిదారులకు అందించిన వడ్డీ లేని రుణాలు రూ.3,373.73 కోట్లు.సకాలంలో రుణాలు చెల్లించిన మీ తరపున వడ్డీని సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం భరించనుంది. లబ్దిదారులు బ్యాంకులకు కట్టిన వడ్డీ మొత్తాన్ని ప్రతి ఆరు నెలలకోసారి నేరుగా ఆ లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా తిరిగి ప్రభుత్వం చెల్లిస్తుంది. వీరందరికీ ‘‘జగనన్న తోడు’’.. 10 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు స్థలంలో శాశ్వత లేక తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్నవారు. తోపుడు బండ్ల మీద వస్తువులు, కూరగాయలు, పండ్లు, ఆహార పదార్థాలు అమ్ముకుని జీవించే వారు, రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహించేవారు. సైకిల్, మోటార్ సైకిల్, ఆటోలపై వెళ్లి వ్యాపారం చేసుకునేవారు. గంపలు, బుట్టలతో వస్తువులు అమ్మేవారు. చేనేత మరియు సాంప్రదాయ చేతివృత్తుల కళాకారులు. చిరువ్యాపారులను ఆదుకోవడంలో దేశానికే ఏపీ ఆదర్శంగా నిలుస్తోంది. ‘‘జగనన్న తోడు’’ ద్వారా పూర్తి వడ్డీ రాయితీ (7.32% నుండి 15.85% వరకు) ప్రభుత్వం కల్పించింది. దేశవ్యాప్తంగా ‘‘పీఎం స్వనిధి’’ ద్వారా 58,65,827 మంది చిరు వ్యాపారులకు రుణాలు అందిస్తే, ఆంధ్రప్రదేశ్ ఏకంగా 16,73,576 మందికి ‘‘జగనన్న తోడు’’ ద్వారా వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాము. దేశవ్యాప్తంగా ‘‘పీఎం స్వనిధి’’ క్రింద ఇప్పటివరకు చిరు వ్యాపారులకు ఇచ్చిన రుణాలు రూ.10,220.47 కోట్లు అయితే రాష్ట్రంలో ‘‘జగనన్న తోడు’’ ద్వారా అందించిన రుణాలే అక్షరాల రూ.3,373.73 కోట్లు. దేశవ్యాప్తంగా ‘‘పీఎం స్వనిధి’’ క్రింద చిరు వ్యాపారులకు రీయింబర్స్ చేసిన వడ్డీ రూ.138.49 కోట్లుగా ఉంటే ‘‘జగనన్న తోడు’’ ద్వారా రీయింబర్స్ చేసిన వడ్డీ రూ.88.33కోట్లుగా ఉంది. చదవండి: APSRTC: మహిళలకు ఉచిత ప్రయాణంపై క్లారిటీ.. గురువారం నుంచి డోర్ పిక్ అప్ అండ్ డోర్ డెలివరీ -
చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారిని వారి కాళ్లమీద నిలబడేలా జగనన్న తోడు
-
చిరు వ్యాపారులకు సాయం చేయాలనే ఆలోచన నుంచి పుట్టిందే ‘జగనన్న తోడు’ పథకం
-
జగనన్న తోడుతో ఆ జీవితాల్లో వెలిసిన వెలుగులు
-
ఆంధ్రప్రదేశ్‌లో జగనన్న తోడు పథకం కింద 5 లక్షల చిరు వ్యాపారులకు రూ.550 కోట్ల వడ్డీలేని రుణాల అందజేత.. ఇంకా ఇతర అప్డేట్స్
-
స్వయం ఉపాధికి ‘తోడు’
పేదలకు మేలు చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన మహాయజ్ఞంలో ‘జగనన్న తోడు’ ఒక విప్లవం లాంటిది. అందరం కలసికట్టుగా ఒక్కటైతే పేదవాడికి మంచి జరిగే ఈ మహాయజ్ఞం సత్ఫలితాలనిస్తుంది. ఈ రోజు అదే జరుగుతోంది. చిరువ్యాపారులైన నా 15,87,000 మంది అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు ఇప్పటిదాకా మంచి జరిగింది. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ఒకరిపై ఆధారపడకుండా స్వయం ఉపాధితో జీవించడమే కాకుండా మరో ఒకరిద్దరికి సైతం ఉపాధి కల్పిస్తున్న చిరువ్యాపారులు అధిక వడ్డీల బారిన పడకుండా వడ్డీ లేని రుణాలతో ఆదుకుంటున్నట్లు సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ‘జగనన్న తోడు’ పథకం ద్వారా తాజా లబ్ధిదారులతో కలిపితే ఇప్పటివరకు 15,87,000 మంది చిరు వ్యాపారులకు ప్రయోజనం చేకూరుస్తూ వడ్డీ లేని రుణం కింద రూ.2,955.79 కోట్లు ఇవ్వగలిగామన్నారు. పథకం ద్వారా సున్నా వడ్డీ కింద మరో రూ.74.69 కోట్లు చెల్లించి వారికి మేలు చేసినట్లు చెప్పారు. వరుసగా నాలుగో ఏడాది జగనన్న తోడు పథకం అమలు సందర్భంగా వడ్డీలేని రుణాలు, వడ్డీ రీయింబర్స్మెంట్ నిధులను మంగళవారం బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడారు. ఆ పరిస్థితులను మార్చాలనే ఆరాటంతో నా సుదీర్ఘ పాదయాత్రలో చాలాచోట్ల ఫుట్‌పాత్‌లపై చిరు వ్యాపారులు, బండ్లపై టిఫిన్లు విక్రయిస్తూ పొట్ట పోసుకునే వారి కష్టాలను స్వయంగా చూశా. రోజువారీ పెట్టుబడికి కావాల్సిన రూ.1,000 కోసం అధిక వడ్డీలకు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి. రూ.వెయ్యి తీసుకుంటే ముందుగానే రూ.100 కట్ చేసుకుని సాయంత్రానికి తిరిగి రూ.1,000 వెనక్కి ఇవ్వాలని ప్రైవేట్ వ్యాపారులు షరతు విధించేవారు. చిరు వ్యాపారులకు గత్యంతరం లేక ఆ వడ్డీ వ్యాపారుల మీదే ఆధారపడాల్సిన దుస్థితిని నాడు చూశా. ఐదారు రూపాయల వడ్డీకి దొరికితే అదే అదృష్టంగా భావించే దారుణ పరిస్థితిని అప్పట్లో గమనించా. అవన్నీ చూశాక ఆ పరిస్థితులను మార్చాలన్న ఆరాటం నుంచి ‘జగనన్న తోడు’ పథకం పుట్టింది. వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిరు వ్యాపారులందరికీ మేలు.. పుట్‌పాత్‌ల మీద, వీధుల్లో తోపుడుబండ్ల మీద పండ్లు, కూరగాయలు, వస్తువులు, ఆహార పదార్థాలను అమ్ముకునేవారు, రోడ్ పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహిస్తున్నవారు, గంపలు, బుట్టలతో వస్తువులు అమ్మేవారు, ఆటోలు, సైకిళ్లపై వెళ్లి వ్యాపారం చేసేవారితో పాటు చేనేత కార్మికులు, సంప్రదాయ చేతివత్తుల కళాకారులు, ఇత్తడి పనిమీద బతికేవారు, బొబ్బిలి వీణలు తయారు చేసేవారు, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, కళంకారీ, తోలుబొమ్మల తయారుదారులు, లేసు వర్కర్స్.. అందరికీ ఈ పథకం ఉపయోగపడుతుంది. ఒక్కొక్కరికి ఏటా రూ.10 వేలు అందిస్తూ సకాలంలో కిస్తీలను చెల్లించినవారికి అదనంగా ఏటా రూ.వెయ్యి చొప్పున జోడిస్తూ రూ.13,000 వరకు వడ్డీలేని రుణాలను అందజేస్తున్నాం. ఈ పథకం కింద ఇవాళ వరుసగా నాలుగో ఏడాది 5,10,412 మంది చిరు వ్యాపారులకు రూ.549.70 కోట్ల వడ్డీలేని రుణాలతో పాటు రుణాలపై కిస్తీలను సకాలంలో చెల్లించిన వారికి రూ.11.03 కోట్ల వడ్డీ రీయింబర్స్మెంట్ డబ్బులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. దేశం మొత్తం కంటే ఏపీలోనే ఎక్కువ లబ్ధిదారులు.. దేశంలో ఎక్కడా ఇన్ని లక్షల మంది చిరువ్యాపారులకు మంచి చేసే కార్యక్రమం జరగడం లేదు. లబ్ధిదారుల సంఖ్యలో దేశం మొత్తం ఒకవైపు ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో అంతకంటే ఎక్కువ మంది ఉండటం అరుదైన ఘటన. ఈ స్థాయిలో సత్ఫలితాలు సాధించేలా పథకాన్ని నడిపిస్తున్న సచివాలయ వ్యవస్ధ, వలంటీర్లు, వివిధ ప్రభుత్వ శాఖలతో పాటు ప్రధానంగా ఈ కార్యక్రమానికి తోడ్పాటు అందిస్తున్న బ్యాంకర్లకు ధన్యవాదాలు. లబ్ధిదారుడికి మొదటి విడత రూ.10 వేలతో ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఇదొక రికరింగ్ అకౌంట్. సకాలంలో డబ్బులు చెల్లించిన వెంటనే బ్యాంకులు వారికి మళ్లీ రుణాలు మంజూరు చేసి తోడుగా నిలబడతాయి. ఈ క్రమంలో వారు కట్టిన వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి ఆయా ఖాతాల్లోకి చెల్లిస్తుంది. అక్కచెల్లెమ్మలే అత్యధికం.. జగనన్న తోడు పథకం ద్వారా లబ్ధి పొందిన 15.87 లక్షల మందిలో 80 శాతం మంది అక్కచెల్లెమ్మలే ఉన్నారు. ఇది నిజంగా ఒక విప్లవం. ఇందులోనూ 80 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే కావడం మరొక విప్లవం. సామాజికంగా అట్టడుగున ఉన్నవారందరికీ ఇది ఉపయోగపడుతుంది. అక్కచెల్లెమ్మలందరికీ మేలు చేసే గొప్ప కార్యక్రమమిది. దీనిద్వారా అందరూ బాగుపడాలని మనసారా కోరుకుంటున్నా. అందరి మేలు కోసం తపించే ప్రభుత్వమిది.. చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారిలో ఎవరికైనా ఈ పథకం పొరపాటున రాని పరిస్థితి ఉంటే వెంటనే మీ సమీపంలోని సచివాలయంలో సంప్రదించండి. అక్కడ సిబ్బంది మీకు అందుబాటులో ఉంటూ తోడుగా నిలుస్తారు. వలంటీర్‌ని అడిగినా దగ్గరుండి దరఖాస్తు చేయించి వెరిఫై అనంతరం పథకం అందేలా చేస్తారు. లేదా 1902 నెంబర్‌కు ఫోన్ చేసినా మీకు ఈ పథకం అందించేలా సహాయపడతారు. అర్హత ఉన్నవారు ఏ ఒక్కరూ మిగిలిపోకూడదు.. ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని తాపత్రయ పడే ప్రభుత్వం మనది. ప్రతి రెండు సచివాలయాలకు చెందిన సిబ్బంది, వలంటీర్లు ఒక బ్యాంకుతో అనుసంధానమై జగనన్న తోడు ద్వారా రుణాలు ఇప్పించడంతో పాటు లబ్ధిదారులతో తిరిగి కట్టించేలా అంతే ప్రాధాన్యతగా కార్యక్రమాన్ని చేపట్టాలి. బ్యాంకర్లకు నమ్మకం పెరిగే కొద్దీ సంఖ్య పెరుగుతుంది. లబ్ధిదారుల సంఖ్య పెరగాలంటే క్రమశిక్షణతో సకాలంలో రుణాలను తిరిగి చెల్లించాలి. దీన్ని ప్రోత్సహించేందుకే సున్నా వడ్డీ కింద ఆర్నెళ్లకు ఒకసారి ప్రయోజనం చేకూరుస్తూ పథకాన్ని అమలు చేస్తున్నాం. ఈ రుణం తీర్చుకోలేనిది ఇంటి వద్దే చీరల వ్యాపారం నిర్వహించే నాకు చేయూత, ఆసరా, జగనన్న తోడు పథకాలతో ప్రభుత్వం అండగా నిలిచింది. కుట్టు మిషన్‌కు మోటర్ అమర్చుకుని రోజుకు రూ.800 వరకు సంపాదిస్తున్నా. నా భర్తకు ప్రైవేట్ ఆస్పత్రిలో గుండె ఆపరేషన్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేశారు. జగనన్న తోడు పథకం కింద అందిన డబ్బులతో నా భర్త ఇంటి వద్దే టీ దుకాణం ఏర్పాటు చేశారు. ఉన్నతి, సీఐఎఫ్ రుణాల ద్వారా అందిన డబ్బులతో టీ దుకాణాన్ని కిరాణా షాపుగా మార్చుకుని నా కుటుంబం ఎంతో సంతోషంగా జీవిస్తోంది. మాకు ఇంత అండగా నిలిచిన జగనన్న రుణం తీర్చుకోలేనిది. – జే లలితకుమారి, మద్దులూరు, సంతనూతలపాడు మండలం, ప్రకాశం జిల్లా -
మా పేరు నిలబెట్టారు అన్న
-
ఈ మహిళ స్పీచ్‌కు చలించిపోయిన సీఎం జగన్
-
టీ కొట్టు టూ కిరాణాకొట్టు.. థ్యాంక్యూ జగనన్న
-
జగనన్న తోడు నిధులు విడుదల చేసిన సీఎం జగన్
-
దేశంలో ఎక్కడ జరగడం లేదు.. అరుదైన ఘటన..!
-
నా కళ్లతో చూశా..! 1000 రూపాయలకు.. ఒక రోజుకు 100 రూపాయలు వడ్డీ: సీఎం జగన్
-
పేదలకు మంచి జరిగే యజ్ఞం సత్ఫలితాలను ఇస్తోంది: సీఎం జగన్
Updates ►జగనన్న తోడు నిధులు విడుదల చేసిన సీఎం జగన్ జగనన్న తోడు ఏడో విడత కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ స్పీచ్ ►దేశంలో ఎక్కడా ఇన్ని లక్షలమందికి ఈ రకంగా మంచి చేయడం లేదు ►ఇన్ని లక్షలమంది చిరువ్యాపారులకు ఎక్కడా ఇంత మేలు జరడం లేదు ►దేశం మొత్తం ఇస్తున్న రుణాలు కంటే ఆంధ్ర రాష్ట్రంలో లబ్ధిదారుల సంఖ్య అంతకన్నా ఎక్కువ ఉంది ►ఈ పథకాన్ని పగడ్బందీగా నడుపుతున్న బ్యాంకర్లు, సచివాలయాల వ్యవస్థ, మెప్మా.. తదితర శాఖలకు అభినందనలు ►పేదవాడికి మంచి జరిగించే యజ్ఞం సత్ఫలితాలను ఇస్తోంది ►ఇంతవరకూ 15.87 లక్షలమంది చిరువ్యాపారులకు మంచి జరిగింది ►హస్తకళాకారులకూ ఈ పథకం ద్వారా మేలు జరిగింది ►ఈవిడతలో 5,10,412 మందిలో 4.54లక్ష లమంది సకాలంలో రుణాలు చెల్లించి…, మళ్లీ రూ.10వేలు, ఆపైన రుణాలుగా అందుకుంటున్నారు ►సకాలానికి కట్టిన వారికి ఇచ్చే రుణాలు రూ.౧౦ వేల నుంచి రూ.13వేల వరకూ పెంచారు ►ఇంతవరకూ 15.87 లక్షలమంది చిరువ్యాపారులకు రూ. 2,955.79 కోట్ల రుణాలు ఇచ్చాం ►వీరిలో తిరిగి చెల్లించి.. మళ్లీ మళ్లీ రుణాలు పొందిన వారు దాదాపుగా 13.29 లక్షల మంది ఉన్నారు ►ఇప్పటివరకూ వీరితరఫున ప్రభుత్వం చెల్లించిన వడ్డీ రూ.74.69 కోట్ల ►చిరు వ్యాపారులు సమాజ సేవ చేస్తున్నారు ►ఒకరి మీద ఆధారపడకుండా… వారు జీవనోపాధిని వారు చూసుకుంటున్నార ►అవకాశం వస్తే మరో ఒకరిద్దరికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు ►అందుకనే వారికి తోడుగా నిలబడాలన్న ఆలోచన చేయాల్సి వచ్చింది ►చేతివృత్తుల వారికీ పథకం వర్తిస్తోంది ►రూ.10వేల రుణంతో ఈ కార్యక్రమం మొదలైతే.., క్రమం తప్పకుండా చెల్లించేవారికి మరుసటి ఏడాది వేయి పెంచమని, ఆతర్వాత ఏడాది మరో వేయి పెంచమని, రూ.13వేల వరకూ ఇవ్వమని చెప్పాం ►పాదయాత్రలో స్వయంగా నేను కళ్లారా చూశాను.. చిరు వ్యాపారుల కష్టాలు చూశాను..వారిలో కలిసి మాట్లాడ్డం జరిగింది ►వేయి రూపాయలు రోజుకు రుణం ఇస్తే.. వంద కట్ చేసుకుని, సాయంత్రానికి మళ్లీ వేయి రూపాయలు తీసుకునే పరిస్థితులు ఉండేవి ►అలాంటి వారికి వ్యాపారాలు చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉండేది..పెట్టుబడి వారికి పుట్టేది కాదు ►రూ.10ల వడ్డీకి కూడా రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఉండేవి ►ఈ పరిస్థితులన్నీ మార్చాలన్న ఉద్దేశంతో జగనన్న తోడు పథకం పుట్టింది ►జగనన్న తోడుద్వారా లబ్ధిపొందిన వారిలో 80శాతం అక్క చెల్లెమ్మలే ►లబ్ధిదారుల్లో 80 శాతం మంది నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలకు చెందిన వారే ఉన్నారు ►సామాజికంగా అట్టడుగున్న ఉన్న వారికి ఈపథకం ఉపయోగపడుతుంది ►ఈకార్యక్రమం ద్వారా మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను ►ఎవరికైనా ఈ పథకం వర్తించని పరిస్థితి ఉంటే.. వెంటనే సచివాలయ వ్యవస్థను సంప్రదించండి ►అక్కడున్న సిబ్బంది మీకు తోడుగా నిలుస్తారు ►వాలంటీర్లను కోరినా.. వారు దరఖాస్తు చేయడంలో మీకు తోడుగా నిలుస్తారు ►లేదా 1902 నంబర్‌కు ఫోన్ చేసినా.. పథకాన్ని మీకు అందుబాటులోకి తీసుకురావడానికి సహాయపడతారు ►ఏ ఒక్కరూ కూడా మిగిలిపోకూడదు, ప్రతి ఒక్కరికీ మంచి జరగాలనే ప్రభుత్వం తపన పడుతోంది ►రాష్ట్రవ్యాప్తంగా చిరువ్యాపారులకు చేయూతనందించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన ‘జగనన్న తోడు’ ఏడో విడత కార్యక్రమం ప్రారంభం ►చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి రూ. 549.70 కోట్ల వడ్డీ లేని రుణాలు ►గతంలో తీసుకున్న రుణాన్ని చెల్లించిన వారికి రూ. 11.03 కోట్ల వడ్డీ డబ్బు వారి ఖాతాల్లో జమ ►ఈ కార్యక్రమం కింద చిరు వ్యాపారులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా తొలిసారి రూ. 10,000 రుణం అందజేయడంతో పాటు తీసుకున్న రుణాన్ని ప్రతి నెలా కిస్తీ రూపంలో సకాలంలో చెల్లించే వారికి ఆ రుణంపై అయ్యే వడ్డీ మొత్తం ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుంది. ►వారికి మరింత రుణ సాయాన్ని కూడా అందిస్తుంది. కొత్త వారికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తోంది. ఈ పథకం ద్వారా లబ్ది పొందే వారిలో దాదాపు 85% మహిళలే కావడం గమనార్హం. ఇప్పటివరకు మొత్తం రూ. 2,955.79 కోట్ల రుణ సాయం ► ఈ పథకం ద్వారా ఇప్పటికే ఆరు విడతలుగా చిరు వ్యాపారులకు ప్రభుత్వం రుణాలు అందజేసింది. ఇప్పుడు ఏడో విడతలో రుణ పంపిణీ చేయనుంది. ► ఒక విడత రుణం తీసుకొని తిరిగి చెల్లించిన వారికి వారి వడ్డీ మొత్తాన్ని ఎప్పటికప్పుడు ఆయా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లోనే ప్రభుత్వం నేరుగా జమ చేస్తోంది. వారికి తిరిగి ఇచ్చే రుణాన్ని పెంచి మళ్లీ కొత్త రుణాలు ఇప్పిస్తోంది. మొదటి విడతలో రూ.10 వేలు రుణం తీసుకొని నిర్ణీత కాలంలో చెల్లించిన వారికి రెండో విడత ఓ వెయ్యి పెంచి రూ. 11 వేలు, రెండో విడత రుణం కూడా చెల్లించిన వారికి మూడో విడతలో రూ. 12 వేలు.. ఇలా ప్రతి ఏటా పెంచుతూ రుణాలు అందజేస్తోంది. ► ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 15,87,492 మంది ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందారు. వీరిలో 13,29,011 మంది పాత రుణం చెల్లించి రెండు మూడు సార్లు కొత్త రుణాలు పొందారు. ► గత ఆరు విడతల్లో చిరు వ్యాపారులకు 29,16,504 రుణ ఖాతాల ద్వారా రూ. 2406.09 కోట్ల రుణాలను అందజేయగా.. ఏడో విడతలో అందజేసే రుణ సహాయంతో కలిపి మొత్తం రూ. 2,955.79 కోట్లు రుణ సహాయం పొందినట్టు అవుతుంది. ► ఇప్పడు ఏడో విడతలో 5,10,412 మందికి ప్రభుత్వం రుణాలు అందజేస్తుండగా.. అందులో 4,54,267 మంది గతంలో ఒకటికంటే ఎక్కువ సార్లు రుణం పొంది తిరిగి చెల్లించిన వారు. ఈసారి కొత్తగా మరో 56,145 మందికి తొలిసారి ఈ పథకం ద్వారా ప్రభుత్వం రుణం అందజేస్తోంది. ఇప్పటివరకు రూ. 74.69 కోట్లు వడ్డీ డబ్బు జమ జగనన్న తోడు కార్యక్రమంలో రుణాలు తీసుకొని చెల్లించిన వారికి ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు వారి వడ్డీ మొత్తాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తోంది. ► గత ఆరు నెలల్లో సకాలంలో పాత రుణాలు పూర్తిగా చెల్లించిన 5,03,729 మంది లబ్ధిదారులకు సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి రూ.11,03,32,202 డీబీటీ విధానంలో వారి బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. ► మంగళవారం అందజేసే వడ్డీతో కలిపి ఇప్పటి దాకా రూ. 74.69 కోట్ల మొత్తం వడ్డీ డబ్బులు 15.31 లక్షల మంది చిరువ్యాపారుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసినట్టు అవుతుందని అధికారులు వివరించారు. -
చిరువ్యాపారులకు అండగా జగనన్న తోడు
-
Jagananna Thodu: నేడు ‘జగనన్న తోడు’
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా చిరువ్యాపారులకు చేయూతనందించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన ‘జగనన్న తోడు’ ఏడో విడత కార్యక్రమం మంగళవారం జరగనుంది. ఈ కార్యక్రమంలో 5,10,412 మందికి ప్రభుత్వం మరో విడత వడ్డీ లేని రూ. 549.70 కోట్ల రుణాలను అందజేయడంతో పాటు గతంలో ఈ పథకం ద్వారా రుణాలు పొంది, సకాలంలో చెల్లించిన వారికి రూ. 11.03 కోట్ల వడ్డీ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేయనుంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభిస్తారు. రాష్ట్రంలో తోపుడు బండ్లు, రోడ్ల వెంబడి చిన్న దుకాణాల్లో పండ్లు, కూరగాయలు వంటివి అమ్ముకోవడం, టీ, టిఫిన్ సహా పలు రకాల వ్యాపారాలు చేసే చిరు వ్యాపారులు రోజువారీ పెట్టుబడికి అవసరమయ్యే రూ. 5000 కూడా స్థానిక వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకొనేవారు. ఇందుకోసం రోజుకు ప్రతి వంద రూపాయలకు రూ. 3 నుంచి రూ. 10 వరకు వడ్డీ చెల్లించేవారు. వారి సంపాదనలో అత్యధిక భాగం వడ్డీలకే సరిపోయేది. అధిక వడ్డీలతో కుదేలైపోతున్న చిరువ్యాపారుల దుస్థితిని చూసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. వారికి చేయూతనందించడానికి 2020 నవంబరు 25వ తేదీన ‘జగనన్న తోడు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం కింద చిరు వ్యాపారులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా తొలిసారి రూ. 10,000 రుణం అందజేయడంతో పాటు తీసుకున్న రుణాన్ని ప్రతి నెలా కిస్తీ రూపంలో సకాలంలో చెల్లించే వారికి ఆ రుణంపై అయ్యే వడ్డీ మొత్తం ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుంది. వారికి మరింత రుణ సాయాన్ని కూడా అందిస్తుంది. కొత్త వారికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తోంది. ఈ పథకం ద్వారా లబ్ది పొందే వారిలో దాదాపు 85% మహిళలే కావడం గమనార్హం. ఇప్పటివరకు మొత్తం రూ. 2,955.79 కోట్ల రుణ సాయం ► ఈ పథకం ద్వారా ఇప్పటికే ఆరు విడతలుగా చిరు వ్యాపారులకు ప్రభుత్వం రుణాలు అందజేసింది. ఇప్పుడు ఏడో విడతలో రుణ పంపిణీ చేయనుంది. ► ఒక విడత రుణం తీసుకొని తిరిగి చెల్లించిన వారికి వారి వడ్డీ మొత్తాన్ని ఎప్పటికప్పుడు ఆయా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లోనే ప్రభుత్వం నేరుగా జమ చేస్తోంది. వారికి తిరిగి ఇచ్చే రుణాన్ని పెంచి మళ్లీ కొత్త రుణాలు ఇప్పిస్తోంది. మొదటి విడతలో రూ.10 వేలు రుణం తీసుకొని నిర్ణీత కాలంలో చెల్లించిన వారికి రెండో విడత ఓ వెయ్యి పెంచి రూ. 11 వేలు, రెండో విడత రుణం కూడా చెల్లించిన వారికి మూడో విడతలో రూ. 12 వేలు.. ఇలా ప్రతి ఏటా పెంచుతూ రుణాలు అందజేస్తోంది. ► ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 15,87,492 మంది ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందారు. వీరిలో 13,29,011 మంది పాత రుణం చెల్లించి రెండు మూడు సార్లు కొత్త రుణాలు పొందారు. ► గత ఆరు విడతల్లో చిరు వ్యాపారులకు 29,16,504 రుణ ఖాతాల ద్వారా రూ. 2406.09 కోట్ల రుణాలను అందజేయగా.. ఏడో విడతలో అందజేసే రుణ సహాయంతో కలిపి మొత్తం రూ. 2,955.79 కోట్లు రుణ సహాయం పొందినట్టు అవుతుంది. ► ఇప్పడు ఏడో విడతలో 5,10,412 మందికి ప్రభుత్వం రుణాలు అందజేస్తుండగా.. అందులో 4,54,267 మంది గతంలో ఒకటికంటే ఎక్కువ సార్లు రుణం పొంది తిరిగి చెల్లించిన వారు. ఈసారి కొత్తగా మరో 56,145 మందికి తొలిసారి ఈ పథకం ద్వారా ప్రభుత్వం రుణం అందజేస్తోంది. ఇప్పటివరకు రూ. 74.69 కోట్లు వడ్డీ డబ్బు జమ జగనన్న తోడు కార్యక్రమంలో రుణాలు తీసుకొని చెల్లించిన వారికి ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు వారి వడ్డీ మొత్తాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తోంది. ► గత ఆరు నెలల్లో సకాలంలో పాత రుణాలు పూర్తిగా చెల్లించిన 5,03,729 మంది లబ్ధిదారులకు సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి రూ.11,03,32,202 డీబీటీ విధానంలో వారి బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. ► మంగళవారం అందజేసే వడ్డీతో కలిపి ఇప్పటి దాకా రూ. 74.69 కోట్ల మొత్తం వడ్డీ డబ్బులు 15.31 లక్షల మంది చిరువ్యాపారుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసినట్టు అవుతుందని అధికారులు వివరించారు. -
ఆరోవిడతలో 4.90 లక్షల మందికి ‘జగనన్న తోడు’
సాక్షి, అమరావతి: చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే 4,90,376 మందికి జగనన్న తోడు పథకం ద్వారా ఆరో విడతలో మళ్లీ రుణాలు ఇప్పించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు బుధవారం నుంచి 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మండల, మునిసిపాలిటీల వారీగా బ్యాంకర్లు, లబ్ధిదారుల సమావేశాలు నిర్వహించనుంది. 25న జిల్లాల స్థాయిలో డీసీసీల సమావేశాలు నిర్వహించి బ్యాంకుల వారీగా నిర్దేశించిన లక్ష్యాల మేరకు రుణాల పంపిణీ కార్యక్రమాలను సమీక్షించనున్నారు. దీనికి సంబంధించి గ్రామవార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ షాన్మోహన్ జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్డీఏ పీడీల ఆధ్వర్యంలోనూ, మునిసిపాలిటీల్లో మెప్మా ఆధ్వర్యంలో ఈ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో 3,28,402 మందికి, పట్టణ ప్రాంతాల్లో 1,61,974 మందికి కలిపి మొత్తం ఈ విడతలో 4,90,376 మందికి ప్రభుత్వం రుణాలు ఇప్పిస్తోంది. తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసుకునేవారు, రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహించేవారు, గంపల్లో వస్తువులు అమ్మేవారు, సైకిళ్లు, మోటారు సైకిళ్లు, ఆటోలపై సరుకులు పెట్టుకుని వ్యాపారం చేసే వారితో పాటు చేనేతలు, సంప్రదాయ చేతివృత్తిదారులకు ఎలాంటి ష్యూరిటీ అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సున్నావడ్డీకే జగనన్న తోడు పథకం ద్వారా రూ. 10 వేలు చొప్పున బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తుంది. ఇప్పటికే ఐదు విడతల్లో లబ్ధిదారులకు రుణాలు తీసుకోగా.. ఆరో విడత రుణ పంపిణీ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ఈ నెల 11న లాంఛనంగా ఈ కార్యక్రమం ప్రారంభించిన విషయం తెలిసిందే. చిరు వ్యాపారులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు సంబంధించి గత 6 నెలలకు వడ్డీ రూ. 15.17 కోట్ల మొత్తం లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం అదేరోజు జమ చేసింది. రుణాలు సకాలంలో చెల్లించిన వారికి బ్యాంకులు రుణ మొత్తాన్ని పెంచి మళ్లీ రుణాలిచ్చేలా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. -
చిరు వ్యాపారుల జీవనోపాధికి అండగా జగనన్న తోడు పథకం
-
పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలు చూశాను
-
Jagananna Thodu: ఆ కష్టం రావొద్దనే ఈ పథకం తీసుకొచ్చాం
సాక్షి, తాడేపల్లి: చిరు వ్యాపారులు వాళ్ల కష్టంపైనే ఆధారపడతారని, అందుకే వాళ్లకు అండగా నిలిచామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. బుధవారం క్యాంప్ కార్యాలయంలో జగనన్న తోడు పథకంలో భాగంగా.. చిరువ్యాపారులకు వడ్డీలేని రుణాల నగదు జమ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చిరు వ్యాపారులు వారి కష్టంపైనే ఆధారపడతారు. వాళ్లు సమాజానికి గొప్ప మేలు చేస్తున్నారు. అందుకే వాళ్ల పెట్టుబడికి భరోసా కల్పిస్తున్నాం. చిరు వ్యాపారుల జీవనోపాధికి అండగా జగనన్న తోడు పథకం నిలుస్తోంది. ఒక్కో వ్యాపారికి ఎలాంటి గ్యారెంటీ లేకుండానే రూ.10వేల వరకు వడ్డీలేని రుణం అందిస్తున్నాం. కొత్తగా 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు కొత్తగా రూ.395 కోట్ల రుణాలు అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఇప్పటిదాకా 15,31,347 మందికి.. రూ.2,406 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించినట్లు వివరించారాయన. గత ఆరు నెలలకు సంబంధించి రూ.15.17 కోట్లు వడ్డీ రీయింబర్స్మెంట్ చేసినట్లు తెలిపారు. లబ్ధిదారుల్లో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారని ఉద్ఘాటించారాయన. ‘‘పాదయాత్రలో.. తోపుడు బండ్ల వ్యాపారుల కష్టాలు చూశాను. వాళ్లు సమాజానికి గొప్ప మేలు చేస్తున్నారు. అందుకే వాళ్ల పెట్టుబడి కష్టం కావొద్దనే జగనన్న తోడు పథకం తీసుకొచ్చాం. లబ్ధీదారుల పూర్తి వడ్డీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో ఈరోజే ఈ వడ్డీని జమ చేస్తున్నాం’’ అని సీఎం జగన్ వెల్లడించారు. అర్హత ఉండి కూడా పథకం అందుకోని వారు ఉంటే.. వారికి కూడా లబ్ధి చేకూరుస్తామని స్పష్టం చేశారు సీఎం జగన్. ఏపీలో చిరువ్యాపారులకు సంక్రాంతి ముందుగానే వచ్చేసింది. పెట్టుబడి రుణంతో అండగా నిలుస్తూ.. ఆర్థికంగా వాళ్లు నిలదొక్కుకునేందుకు జగనన్న తోడు పథకం ఎంతగానో ఆసరాగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఆరో విడుత నగదును సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి జమ చేశారు. అంతకు ముందు పలువురు చిరువ్యాపారులు ఈ పథకం వల్ల తాము ఎలా బాగుపడ్డామనేది వివరించగా.. సీఎం జగన్ సంతోషించారు. ఇక ఈ కార్యక్రమంలో సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత నాలుగేళ్లలో సీఎం జగన్ ప్రభుత్వం.. చిరువ్యాపారులకు జగనన్న తోడు పథకం ద్వారా ఎలా అండగా నిలబడిందనేది ఈ సందర్భంగా వాళ్లు సీఎం జగన్‌కు వివరించారు. వివిధ జిల్లాల కలెక్టరేట్ల నుంచి కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కే ఎస్ జవహర్ రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, గ్రామ, వార్డు సచివాలయాలశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, ఇతర ఉన్నతాధికారులు, ఎస్ఎల్బీసీ కన్వీనర్ (ఏపీ) నవనీత్ కుమార్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు హాజరు అయ్యారు. -
చిరు వ్యాపారుల పెట్టుబడికి భరోసా
సాక్షి, అమరావతి: చిరు వ్యాపారుల కోసం ప్రభుత్వం మహత్తర కార్యక్రమం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా నడ్డి విరిచే వడ్డీలకు చెల్లుచీటీ చెబుతూ చిరు వ్యాపారులకు అండగా నిలబడుతూ జగనన్న తోడు పథకం అమలు చేస్తోంది. పూర్తి వడ్డీ భారాన్నీ ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికీ రూ.10 వేలు చొప్పున 3.95 లక్షల మంది చిరు వ్యాపారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారికి బ్యాంకుల ద్వారా కొత్తగా రూ.395 కోట్ల కొత్త రుణాలు అందించడంతో పాటు, గత 6 నెలలకు సంబంధించిన రూ.15.17 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను అందించనుంది. సీఎం జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్లో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేయనున్నారు. వారి కష్టాన్ని చూశారు.. ఆదుకున్నారు.. తన సుదీర్ఘ పాదయాత్రలో ఈ చిరు వ్యాపారుల కష్టాలను చూసి, వారి కడగండ్లను స్వయంగా విన్న వైఎస్ జగన్.. సీఎం కాగానే ఆ పరిస్థితులను మారుస్తూ, నిత్యం కష్టంపైనే ఆధారపడి గౌరవంగా జీవిస్తున్న వారిని ఆదుకోవడం కోసం సున్నా వడ్డీకే రుణాలు అందిస్తూ జగనన్న తోడు పథకం అమలు చేస్తున్నారు.దేశంలో అత్యధికంగా వడ్డీలేని రుణాలు అందిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. బుధవారం అందిస్తున్న రూ.395 కోట్ల రుణంతో కలిపి ఇప్పటి వరకు రూ.15,31,347 మంది చిరు వ్యాపారాలు చేసుకునే లబ్ధిదారులకు రూ.2,406 కోట్లు వడ్డీ లేని రుణాలు అందించింది. వీరిలో సకాలంలో రుణాలు చెల్లించి రెండోసారి రుణం పొందిన వారు 8,74,745 మంది. నేడు అందిస్తున్న వడ్డీ రీయింబర్స్మెంట్ రూ.15.17 కోట్లతో కలిపి సకాలంలో రుణాలు చెల్లించిన 13.28 లక్షల లబ్ధిదారులకు ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.63.65 కోట్లు వడ్డీ చెల్లించింది. ముఖ్యమంత్రి తీసుకున్న చురుకైన చర్యల కారణంగా సకాలంలో రుణాలు చెల్లించిన వీధి వ్యాపారులు, సంప్రదాయ చేతివృత్తుల వారికి నిత్యం మూలధనం అందుబాటులో ఉంటోంది. ఏ ఏడాదికి ఆ ఏడాది రుణాల మొత్తాన్ని రూ.10 వేల నుంచి రూ.11 వేలకు, రూ.11 వేల నుంచి రూ.12 వేలకు, రూ.12 వేల నుంచి రూ.13 వేలకు పెంచుతూ బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు అందించేలా చర్యలు తీసుకుంది. వీరందరికీ జగనన్న తోడు.. గ్రామాలు, పట్టణాల్లో సుమారు 5 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు స్థలంలో శాశ్వత లేక తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్న వారు, పుట్‌పాత్‌ల మీద, వీధుల్లో తోపుడు బండ్లపై వస్తువులు, కూరగాయలు, పండ్లు అమ్మకుని జీవించేవారు.. రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహించేవారు.. గంపలు, బుట్టలలో వస్తువులు అమ్మేవారందరికీ జగనన్న తోడు పథకం వర్తిస్తోంది. సైకిల్, మోటారు సైకిల్, ఆటోలపై వెళ్లి వ్యాపారం చేసే వారితో పాటు, సంప్రదాయ చేతి వృత్తుల కళాకారులు, ఇత్తడి పని చేసేవాళ్లు, బొబ్బిలి వీణ, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మల తయారీ, లేస్ వర్క్స్, కలంకారీ, తోలుబొమ్మలు, కుమ్మరి తదితర వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారు కూడా ఈ పథకానికి అర్హులే. -
జగనన్న తోడు పథకం కింద వడ్డీ లేని రుణాల పంపిణీ
-
జగనన్నతోడు లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేసిన సీఎం జగన్
-
అప్పుడు ఈ పథకాలు ఎందుకు లేవు? అసలు కారణం చెప్పిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: చిరు వ్యాపారులు చేసేది గొప్ప సేవ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొనియాడారు. చిరు వ్యాపారుల కష్టాలు తన పాదయాత్రలో చూశానన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీ భారం లేకుండా లక్షల కుటుంబాలను ఆదుకున్నామని సీఎం అన్నారు. బుధవారం ఆయన ‘జగనన్న తోడు’ పథకం కింద వడ్డీ లేని రుణాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశారు. చదవండి: జగనన్న తోడు: నగదు జమ చేసిన సీఎం జగన్ ఈ సందర్భంగా ఆయన సీఎం మాట్లాడుతూ, చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, చేతి వృత్తుల వారికి వడ్డీకి లేని రుణాలు ఇస్తున్నామన్నారు. జగనన్న తోడు సాయం పొందుతున్న వారిలో 80 శాతం మహిళలేనని సీఎం జగన్ అన్నారు. మహిళా సాధికారితకు, సామాజిక న్యాయానికి ఇదే నిదర్శనమన్నారు. మన పాలనలో డీబీటీ.. డైరెక్ట్ బెన్ఫిట్ ట్రాన్స్ఫర్ అమలవుతోందన్నారు. వివిధ పథకాల ద్వారా నేరుగా రూ.1.65 లక్షల కోట్లు అందించామన్నారు. సీఎం ఏమన్నారంటే... ♦స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ వారికి అండగా నిలుస్తున్నాం ♦తమకు తాము ఉపాధిని ఇవ్వడమే కాకుండా మరి కొంతమందికి కొద్దోగొప్పో ఏదో రూపంలో మిగతా వారికీ ఉపాధినిస్తున్నారు ♦నామమాత్రపు లాభాలతో చిరు వ్యాపారులు గొప్ప సేవలు అందిస్తున్నారు ♦వీరు చేసేది వ్యాపారం అనే కన్నా.. గొప్ప సేవ అనడంలో ఏమాత్రం సంకోచించాల్సిన అవసరంలేదు ♦ఇలాంటి చిరు వ్యాపారులతోపాటు సంప్రదాయ చేతివృత్తులవారికీ ఇస్తున్నాం ♦వడ్డీ వ్యాపారులమీద ఆధారపడకుండా, అధిక వడ్డీల భారాన్ని మోసే అవసరం లేకుండా వీరికి తోడుగా నిలుస్తున్నాం ♦వేయి రూపాయలకు రూ.100లు రోజు వడ్డీగా కట్టాల్సిన పరిస్థితులు గురించి నాకు పాదయాత్రలో చెప్పారు ♦నడ్డి విరిచే వడ్డీల భారాన్ని తప్పించి వీరికి అండగా నిలవడానికి ఈ పథకాన్ని వర్తింపు చేస్తున్నాం ♦చెప్పిన మాటకు కట్టుబడి జగనన్న తోడు పథకంద్వారా చిరువ్యాపారులు, హస్తకళాకారులు, సంప్రదాయ చేతివృత్తుల వారిని వారికాళ్లమీద వారిని నిలబెట్టేలా వడ్డీలేని రుణాలు ఇస్తున్నాం ♦దేశవ్యాప్తంగా 34 లక్షలమంది వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకులద్వారా తోడ్పాటు పొందితే.. అందులో దాదాపు సగంమందికి మన రాష్ట్రంలోనే రుణాలు పొందుతున్నారు ♦దీనికి సహకరించిన ప్రతి బ్యాంకుకూ మనస్ఫూర్తిగా కృజ్ఞతలు పొందుతున్నాం ♦సకాలంలో చెల్లించి రెండోసారి కూడా రుణం తీసుకున్నవారు 5.08 లక్షలమంది ఉన్నారు ♦వీరిందరి వడ్డీ భారాన్ని ప్రభుత్వంమే భరించింది ♦ప్రతి ఆరు నెలలకు ఒకసారి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి వడ్డీని జమచేస్తున్నాం ♦రుణం తీరిన తర్వాత తిరిగి రుణం పొందడానికి అర్హులవుతారు ♦ఒకసారి రుణాన్ని సకాలంలో చెల్లించి మళ్లీ తిరిగి రుణం పొందడానికి అర్హులు, ఇలా రుణం పొందేటప్పుడు రుణం మొత్తాన్ని ప్రతి విడతకూ రూ.వేయి చొప్పున పెంచేదిశగా బ్యాంకులతో మాట్లాడుతున్నాను ♦సకాలంలో రుణాలు చెల్లించిన వారికి రూ.48.48 కోట్లు వడ్డీలకింద ప్రభుత్వమే చెల్లించింది ♦గత ఆరునెలలకు సంబంధించిన రూ.15.96 కోట్ల వడ్డీని బటన్ నొక్కి రీయింబర్స్ చేస్తున్నాం ♦నేరుగా వారి ఖాతాల్లోనే జమచేస్తున్నాం ♦జగనన్న తోడు ద్వారా లబ్ధి పొందినవారిలో 80శాతం మంది అక్క చెల్లెమ్మలే ఉన్నారు ♦ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్క చెల్లెమ్మలే మరో 80శాతం మంది ఉన్నారు ♦ఇది మహిళా సాధికారితకు, సామాజిక న్యాయానికి కూడా నిదర్శనం ♦గత ప్రభుత్వంలో ఇలాంటి కార్యక్రమాలు జరగలేదు ♦చిరు వ్యాపారులకు తోడుగా నిలవాలన్న ఆలోచన ఏరోజూ కూడా గత ప్రభుత్వంలో చేయలేదు ♦గత ప్రభుత్వ పాలకులకు మనసు అనేది లేదు కాబట్టి.. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ చేయలేదు ♦వారిది పెత్తందారీ మనస్తత్వం వారు బాగుంటే చాలు.. దుష్టచతుష్టయానికి మంచి జరిగితే చాలు: ♦దోచుకో.. పంచుకో.. తినుకో.. పద్థతి వారిది ♦ఇప్పుడు మనం డీబీటీ అమలు చేస్తున్నాం ♦లంచాలకు ఆస్కారం లేకుండా ప్రత్యక్ష నగదు బదిలీ చేస్తున్నాం ♦నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే జమచేస్తున్నాం ♦జగనన్న తోడు ద్వారా లబ్ధి పొందుతున్న చాలామందికి కూడా మన ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలు అందుతున్నాయి ♦ప్రతి కుటుంబానికీ కనీసం 3-4 పథకాలు అందుతున్నాయి ♦అప్పుడూ అదే బడ్జెట్.. ఇప్పుడూ అదే బడ్జెట్.. ♦కాని ఈ పథకాలు గత ప్రభుత్వంలో ఎందుకు లేవు? ♦అప్పుల్లో చూసినా.. గత ప్రభుత్వంతో పోలిస్తే.. అప్పులు తక్కువే సీఏజీ ప్రకారం ♦ఇప్పుడు పథకాలు ఎందుకు అందుతున్నాయంటే.. ఎక్కడా లంచాలు లేవు, వివక్షలేదు, అవినీతి లేదు -
చిరు వ్యాపారులకు జగనన్న తోడు
-
జగనన్న తోడు: నగదు జమ చేసిన సీఎం జగన్
-
చిరు వ్యాపారులకు గుడ్‌న్యూస్.. ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో 3.97 లక్షల మంది చిరు వ్యాపారులకు ‘జగనన్న తోడు’ పథకం ద్వారా ఒకొక్కరికి రూ.10 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం వడ్డీలేని రుణాలను ఇవ్వాలని సంకల్పించింది. ఈ నెల 2న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జరిగిన సమావేశంలో చర్చించిన మేరకు లబ్ధిదారులను గుర్తించాలంటూ గ్రామీణ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలు సెర్ప్, మెప్మాలతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లలకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ తాజాగా ఆదేశాలు జారీచేసింది. చదవండి: AP: కనికట్టొద్దు..‘కళ్లు’ పెట్టి చూడు.. విషం చిమ్ముతున్న ‘ఈనాడు’ అంతకుముందు.. ఈ పథకం ద్వారా రుణం పొంది, సకాలంలో అసలు మొత్తాన్ని చెల్లించిన వారితో పాటు కొత్త వారికి వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు అందేలా తగిన చర్యలు చేపట్టాలని సూచించింది. ఇందుకు తోడ్పాటునందించాలని కూడా రాష్ట్ర బ్యాంకర్ల కమిటీకి లేఖ రాసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న రాష్ట్రవ్యాప్తంగా 5.08 లక్షల మంది చిరు వ్యాపారులకు సీఎం జగన్ చేతుల మీదుగా వడ్డీలేని రుణాలు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. -
జనమే సాక్షి - జగనన్న పథకాలు.. మా జీవితాల్లో వెలుగులు
-
జగనన్న తోడుతో మా జీవితాలు మారిపోయాయి
-
కోవిడ్ కష్టాల్లో ‘తోడు’ నీడగా
సాక్షి, అమరావతి: కోవిడ్ అవస్థల నుంచి రాష్ట్రంలో ప్రతి నిరుపేద కుటుంబాన్ని ఆదుకుని ఆర్థికంగా నిలదొక్కుకునేలా రెండున్నరేళ్లలో దాదాపు రూ.1.29 లక్షల కోట్లు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసినట్లు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. దేశంలో దాదాపు 82% మంది చిరు వ్యాపారులు కరోనాతో ఆదాయాన్ని కోల్పోయి కుటుంబాలను పోషించుకునేందుకు అవస్థలు ఎదుర్కొన్నట్లు పలు నివేదికల్లో వెల్లడైందన్నారు. ఇటీవల డన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్ అనే సంస్థ చేసిన సర్వేలో కూడా ఇవే అంశాలను చూశామన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితిని అధిగమించి రాష్ట్రంలో ప్రతి నిరుపేద కుటుంబాన్ని ఆదుకునేందుకు పారదర్శకంగా నేరుగా నగదు జమ చేసినట్లు చెప్పారు. పేదలను దేశంలో మిగతా రాష్ట్రాల కంటే మన ప్రభుత్వమే అక్కున చేర్చుకుందని సగర్వంగా తెలియజేస్తున్నామన్నారు. జగనన్న తోడు పథకం మూడో విడత కింద పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున 5,10,462 మంది చిరు వ్యాపారులకు రూ.510.46 కోట్ల వడ్డీ లేని రుణాలు, రూ.16.16 కోట్ల వడ్డీ రీయింబర్స్మెంట్ కలిపి మొత్తం రూ.526.62 కోట్లను ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసి మాట్లాడారు. మీ అన్నగా.. తమ్ముడిగా దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ప్రతి చిరు వ్యాపారికీ వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ జగనన్న తోడు ద్వారా రూ.10 వేలు రుణం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. తాజా లబ్ధిదారులతో కలిపి ఇప్పటిదాకా 14,16,091 మందికి రూ.1,416 కోట్లు వడ్డీలేని రుణాలిచ్చి మంచి చేయగలిగామని మీ అన్నగా, తమ్ముడిగా, మీ కుటుంబ సభ్యుడిగా సంతోషంగా చెబుతున్నా. క్రమం తప్పకుండా వడ్డీ కట్టినవారందరికీ దాదాపు రూ.32.51 కోట్లు రీయింబర్స్మెంట్ కూడా చెల్లించాం. అరకొర ఆదాయంతోనే స్వయం ఉపాధి నిజానికి ఈ వ్యాపారాలతో పెద్దగా ఆదాయాలు వచ్చే పరిస్థితులు కూడా లేవు. అయినప్పటికీ తమకు తాము ఉపాధి కల్పించుకుంటూ నామమాత్రపు లాభాలతో సేవలందించే గొప్ప వర్గం చిరు వ్యాపారులు. నిజానికి అది వ్యాపారం అనేకంటే మనకు అందిస్తున్న గొప్ప సేవ అనడం సమంజసం. రకరకాల వస్తువులు, దుస్తులు, టీ, కాఫీ, టిఫిన్స్, కూరగాయలు, పండ్లు... తదితరాలను పుట్‌పాత్ మీద, తోపుడు బళ్ల మీద, రోడ్ల పక్కన, మోటార్ సైకిళ్ల మీద, ఇళ్ల వద్ద విక్రయించి పొట్ట పోసుకుంటున్నారు. అక్కచెల్లెమ్మలైతే ఆకుకూరలను నెత్తిమీద గంపల్లో పెట్టుకుని అమ్ముతున్నారు. మనం చేస్తున్న ఈ సహాయం లక్షల మంది చిరు వ్యాపారులు సొంత కాళ్లమీద నిలిచేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. ఆ కష్టాలను దగ్గరగా చూశా.. చిరు వ్యాపారులు తమ పొట్ట పోసుకుంటూనే అనేకమందికి మేలు చేస్తున్నారు. సరుకులు రవాణా చేసే ఆటోల వారికి, మూటలు ఎత్తే కూలీలకు, మిగతా వారికి కూడా ఉపాధి కలిగే గొప్ప వ్యవస్ధ ఇది. చిరు వ్యాపారుల జీవితాలను నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో దగ్గరగా చూశా. అసంఘటిత రంగం కావడంతో బ్యాంకు రుణాలు దక్కని పరిస్థితులను, కష్ట నష్టాలు, అవసరాలను చాలా దగ్గర నుంచి స్వయంగా చూశా. బ్యాంకు రుణాలిస్తే గ్యారంటీ ఎవరు ఇస్తారనేది పెద్ద మీమాంస. తోడుగా నిలబడాలనే జగనన్న తోడు... ఇటువంటి పరిస్థితుల్లో ఈ చిరువ్యాపారులకు తోడుగా నిలబడాలి.. వారికి మంచి జరగాలి.. అండగా ఉండాలనే ఆలోచనల నుంచి జగనన్న తోడు పథకాన్ని తీసుకొచ్చాం. ప్రభుత్వమే పూచీకత్తు వహించి బ్యాంకులతో మాట్లాడి రుణాలు ఇప్పించాం. లబ్ధిదారులు క్రమం తప్పకుండా వడ్డీ చెల్లించి తిరిగి రుణం పొందేలా ప్రోత్సహిస్తున్నాం. వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరించి రీయింబర్స్ చేసి తోడుగా నిలుస్తోంది. నడ్డి విరిచే వడ్డీలకు చెల్లు చిరు వ్యాపారులు రోజువారీ విక్రయాలు సాగించేందుకు ఇన్నాళ్లూ మరో మార్గం లేక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించేవారు. వంద రూపాయలు తీసుకుంటే సాయంత్రానికి రూ.10 వడ్డీతో కలిపి తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి. రూ.10 వడ్డీతో వ్యాపారాలు నిర్వహించాల్సిన దారుణ పరిస్థితుల్లో ఈ రంగం ఉండేది. ఆ దుస్థితిని తొలగించి చిరు వ్యాపారులందరికీ మంచి చేయాలనే సంకల్పంతో ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇతర పథకాలతోనూ లబ్ధి జగనన్న తోడు ద్వారా 14.16 లక్షల మందికిపైగా మంచి జరుగుతోంది. అంతేకాదు వారికి జగనన్న అమ్మఒడి, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న సంపూర్ణ పోషణం, వైఎస్సార్ పెన్షన్ కానుక, ఇళ్ల పట్టాలు లాంటి వాటిలో ఒక్కొక్కరికి కనీసం మూడు, నాలుగు పథకాల ద్వారా మేలు జరిగే ఉంటుందని నా ప్రగాఢ నమ్మకం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే... వీటన్నింటి ద్వారా మార్పు రావాలి. వారి జీవితాలు మారాలి, మెరుగైన పరిస్థితుల్లో ఉండాలనే తపనతో చేస్తున్నాం. సంప్రదాయ చేతి వృత్తులవారికీ... చిరు వ్యాపారులను మాత్రమే కాకుండా, సంప్రదాయ చేతివృత్తుల కళాకారులైన ఇత్తడి పనిచేసేవారు, బొబ్బిలి వీణల తయారీదారులు, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు తయారీదారులు, కళంకారీ, తోలుబొమ్మలు, లేస్ వర్కర్లు, కుమ్మర్లు.. ఇలా చేతివృత్తుల మీద ఆధారపడి జీవించేవారందరినీ కూడా జగనన్న తోడు పథకం కింద తీసుకొచ్చాం. వారికి కూడా వడ్డీ లేకుండా రూ.10 వేలు రుణమిచ్చే పథకాన్ని తీసుకొచ్చాం. పొరపాటున ఎవరైనా మిగిలిపోతే ఇంకా ఎవరికైనా పొరపాటున రాకపోతే కంగారు పడొద్దు. గతంలోనే చెప్పినట్లు.. ప్రతి ఒక్కరికీ మంచి చేయాలి, అర్హులెవరూ మిస్ కాకూడదని ఆరాటపడే ప్రభుత్వం మనది. ఏ ఒక్కరికైనా పొరపాటున రాకపోతే వలంటీర్‌ని సంప్రదించండి. సచివాలయంలో మళ్లీ దరఖాస్తు చేసుకోండి. జగనన్న తోడు పథకాన్ని సెర్ఫ్, మెప్మాల ద్వారా అమలు చేస్తున్నాం. నిరంతర పర్యవేక్షణ కోసం www.gramasachivalayam.ap.gov.in పోర్టల్ కూడా ఏర్పాటు చేశాం. బ్యాంకర్లతో సమన్వయం కోసం చిరువ్యాపారులకు స్మార్ట్ కార్డులు కూడా ఇచ్చాం. బ్యాంకు ఖాతాలు తెరవడం నుంచి రుణాలు ఇప్పించడం వరకు వలంటీర్లు పూర్తిగా అన్ని రకాలుగా చేయి పట్టుకుని నడిపిస్తారు. లబ్ధిదారులకు ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే 0891 2890525 నంబరుకు ఫోన్ చేస్తే అధికారులు మీ సమస్యను పరిష్కరిస్తారు. ఒక్క విషయం మరువద్దు.. ఈ సందర్భంగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కార్యక్రమం ద్వారా ఒక గొప్ప వ్యవస్ధను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ వ్యవస్ధను నీరుగారనివ్వొద్దు. ఇది కనుక నీరుగారిపోతే... మనం తీసుకున్న రుణాలను మళ్లీ బ్యాంకులకు తిరిగి కట్టకపోతే వ్యవస్ధే కుప్పకూలిపోతుంది. కట్టిన ప్రతి ఒక్కరికీ బ్యాంకులు మళ్లీ కచ్చితంగా రుణాలిస్తాయి. ఎందుకంటే ప్రభుత్వం ఆ మేరకు గ్యారంటీ ఇస్తుంది. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం కూడా ఉంది. ఇదొక రివాల్వింగ్ ఫండ్ మాదిరిగా అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు డబ్బులు తీసుకోండి.. ఆ తర్వాత టైం ప్రకారం కట్టండి. అలా చేస్తే ప్రభుత్వమే మీరు కట్టిన వడ్డీ మొత్తాన్ని మీకు వెనక్కి తిరిగి ఇస్తుంది. వడ్డీ లేకుండా రుణం పొందే గొప్ప సౌకర్యం మీ చేతుల్లోనే ఉంటుంది. కానీ మనం తిరిగి కట్టకపోతే బ్యాంకులు వెనుకడుగు వేస్తాయి. ఇంకా ఇతర లబ్ధిదారులకు మంచి జరిగే అవకాశాన్ని కూడా మనం అడ్డుకున్నట్లవుతుందని అందరూ గుర్తెరిగి మనసులో పెట్టుకోవాలని మీ కుటుంబ సభ్యుడిగా కోరుతున్నా. నిశ్చింతగా వ్యాపారాలు వడ్డీలు, చక్రవడ్డీలు కట్టలేక అవస్థలు ఎదుర్కొంటున్న కుటుంబాలను గుర్తించి జగనన్న తోడు అమలు చేస్తుండటంతో 14 లక్షల మందికి పైగా లబ్ధి చేకూరింది. సెర్ప్, మెప్మా అధికారులు లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ సకాలంలో రుణాలు చెల్లించేలా ప్రోత్సహిస్తున్నారు. చిరు వ్యాపారులు ఇప్పుడు హాయిగా తమ వ్యాపారాలను నిర్వహించుకుంటున్న పరిస్ధితి రాష్ట్రంలో నెలకొంది. ఇతర రాష్ట్రాలు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకుంటున్నాయి. కేంద్రం కూడా ఈ పథకాన్ని మోడల్‌గా తీసుకుని పట్టణ ప్రాంతాల్లో ప్రవేశపెట్టింది. మన ప్రభుత్వం గ్రామాలు, పట్టణాలు రెండు చోట్లా అమలు చేస్తోంది. ప్రభుత్వ తోడ్పాటుతో చిరు వ్యాపారులు తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. – మంత్రి బొత్స సత్యనారాయణ తోడుతోపాటు ఇతర పథకాలు కూడా.. మా ఆయన ఫ్యాక్టరీలో కూలీ పనులకు వెళ్తుండగా నేను ఇంటిదగ్గర టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నా. గతంలో రూ.ఐదు, రూ.పది చొప్పున అప్పు చేసి తెచ్చిన డబ్బంతా వడ్డీలకే సరిపోగా ఏమీ మిగిలేది కాదు. ఇక కరోనాతో అంత వడ్డీకి కూడా డబ్బులు దొరకలేదు. పెట్టుబడికి డబ్బుల్లేక వ్యాపారం నిలిపివేసిన సమయంలో జగనన్న తోడు గురించి వలంటీర్ చెప్పాడు. ఇప్పుడు మళ్లీ వ్యాపారం చేసుకుంటూ నెలకు రూ. ఆరు వేలు సంపాదిస్తున్నా. నాకు ఆసరా సాయం అందింది. సున్నా వడ్డీ వచ్చింది. గతంలో మాకు రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులు లేవు. ఇప్పుడు వలంటీర్లు అన్నీ తెచ్చి ఇచ్చారు. జగనన్న ఇంటి పట్టా కూడా వచ్చింది. మా నాన్నకు ఆరోగ్యశ్రీ ద్వారా రూపాయి ఖర్చు లేకుండా మంచి చికిత్స అందింది. – సయ్యద్ రుబియా బేగం, లబ్ధిదారు, శింగరాయకొండ, ప్రకాశం జిల్లా ఆ పేరు ఎవరు పెట్టారో కానీ.. మీరు ఇచ్చిన మాట ప్రకారం వడ్డీ చెల్లించారు. నా భర్త తాపీ మేస్త్రి. పనులు లేక కుటుంబం గడవడం కష్టంగా ఉండేది. ఇంట్లోనే ఉంటూ ఏదైనా వ్యాపారం చేద్దామనుకుంటే పెట్టుబడికి డబ్బులు లేవు. ప్రైవేట్ వ్యాపారుల వద్దకు వెళ్తే రూ.10 వేలు తీసుకుంటే రూ.వెయ్యి వడ్డీ కింద ముందే మినహాయించుకుని రూ.తొమ్మిది వేలు ఇస్తానన్నాడు. ఆ సమయంలో జగనన్న తోడు గురించి వలంటీర్ చెప్పాడు. బ్యూటీ పార్లర్ నిర్వహిస్తూ నెలకు రూ.5 వేల నుంచి పది వేలు సంపాదిస్తున్నా. మీరు మాకు ష్యూరిటీ లేకుండా డబ్బులు ఇప్పించారు. ఈ పథకానికి జగనన్న తోడు అని ఎవరు పేరు పెట్టారో కానీ మాకు మాత్రం ఎంతో తోడుగా ఉంది. ఆసరాతోపాటు వివిధ పథకాల ద్వారా కూడా మా కుటుంబం లబ్ధి పొందింది. – కె.కళ్యాణి, లబ్ధిదారు, రేఖవానిపాలెం, విశాఖ జిల్లా నాలుగు రెట్లు ఆదాయం మేం పండ్ల వ్యాపారం చేస్తాం. బయట అధిక వడ్డీలకు డబ్బులు తీసుకుంటే రోజూ రూ.200 – రూ.300 మాత్రమే మిగిలేవి. జగనన్న తోడు చిరు వ్యాపారులకు ఎంతో అండగా నిలుస్తోంది. బ్యాంకు ద్వారా ఎలాంటి ష్యూరిటీ లేకుండా రుణం అందుతోంది. మీ ఆలోచనకు పాదాభివందనం. ఇప్పుడు రోజూ రూ.700 నుంచి రూ.800 సంపాదిస్తున్నాం. డిగ్రీ చదివినా పట్టుదలతో వ్యాపారం చేసుకుంటున్నాం. మాకు సున్నా వడ్డీ అందింది. మా కుటుంబానికి చాలా పథకాలు అందాయి. – శారద, లబ్ధిదారు, రుద్రంపేట, అనంతపురం జిల్లా -
జగనన్న మాకు కొండంత అండ
-
చిరు వ్యాపారులకు అండగా నిలవడమే జగనన్న తోడు లక్ష్యం
-
ఆ సమయంలో జగనన్న తోడు మాకు అండగా నిలిచింది
-
ఎటువంటి షూరిటీ లేకుండా రూ.10వేలు రావడం చాలా సంతోషంగా ఉందన్నా
-
కరోనా వచ్చిన తర్వాత ఇళ్లు గడవడం కూడా కష్టమయ్యేది
-
చిరువ్యాపారులకు అండగా నిలవడమే జగనన్న తోడు లక్ష్యం : సీఎం జగన్
-
‘జగనన్న తోడు’మాకు చాలా తోడుగా ఉందన్నా..
సాక్షి, తాడేపల్లి: రోడ్ల పక్కన, తోపుడు బండ్లపై పండ్లు, కూరగాయలు అమ్ముకునే చిన్న చిన్న వ్యాపారులు మరో 5,10,462 మందికి ప్రభుత్వం రూ.510.46 కోట్ల వడ్డీ లేని రుణాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. మూడో విడత రుణాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలానికి చెందిన లబ్ధిదారు రుబియా బేగం మాట్లాడుతూ.. ‘కరోనా వచ్చిన తర్వాత ఇళ్లు గడవడం కూడా కష్టమయ్యేది. రూ. 5, 10 రూపాయల వడ్డీకి కూడా రుణం దొరికేది కాదు. అటువంటి సమయంలో జగనన్న తోడు మాకు అండగా నిలిచింది. దాంతో మళ్లీ మా వ్యాపారం కొనసాగిస్తున్నాం. ఇప్పుడు మా ఆర్థిక పరిస్థితి కూడా మెరుగైంది. జగనన్న తోడు కింద రూ.10 వేలు, అలాగే ఆసరా కింద రూ.12 వేలు జమ అయ్యాయి. మీరు ఇలా సంక్షేమ పథకాలు పెట్టడంతో మాలాంటి వాళ్లం బతుకుతున్నాం. ఇది వరకు ఆరోగ్య శ్రీ లేదు. రేషన్ కార్డు లేదు. ఇప్పుడు మాకు అవన్నీ ఉన్నాయి. మీరు పెట్టిన వాలంటరీ వ్యవస్థతో వాళ్లే మమ్మల్ని అడిగి మాకు ఏదైతే అవసరమే వాటిని ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు. మీ పథకాలన్నీ మేము పొందాము. మీరు పెట్టిన సంక్షేమ పథకాలు ప్రతీ ఒక్కరికీ ఏదో రకంగా ఉపయోగపడుతున్నాయి. మాలాంటి వాళ్లు బ్రతక గల్గుతున్నాం. మీకు రుణపడి ఉంటాము’ అని తెలిపారు. విశాఖ జిల్లాకు చెందిన మరో లబ్ధిదారు కల్యాణి మాట్లాడుతూ.. ‘అన్నా నమస్కారమన్నా.. నా పేరు కల్యాణి. జగనన్న తోడు ద్వారా రూ.10 వేలు లబ్ధి పొందాను. నా భర్త తాపీమేస్త్రీ. కుటుంబానికి అండగా ఉండాలనే ఏదైనా చేయాలనుకున్నా. దాంతో ఒక ఫైనాన్షియర్‌ను ఆశ్రయించాను. రూ.10 వేలకు గాను రూ. 9వేలు ఇస్తానన్నారు. కట్టకపోతే ఇబ్బందులు ఉంటాయని కూడా చెప్పారు. ఈ విషయం చెబితే నా భర్త అలా తీసుకోవద్దని అన్నాడు. ఆ సమయంలో జగనన్న తోడు మాకు అండగా నిలిచింది. ఈరోజు మీరిచ్చిన రూ.10 వేలతో బ్యూటీ పార్లర్ వ్యాపారం ప్రారంభించాను. నా వ్యాపారాన్ని గుర్తించి బ్యాంకులు రూ.70 వేలు రుణం ఇచ్చాయి. మీరిచ్చిన రూ.10వేలతో నెలకు 5వేల రూపాయల నుంచి 10 వేల రూపాయల వరకూ వస్తుంది. షూరిటీ లేకుండా మాకు డబ్బులు ఇచ్చారు. రెండోసారి కూడా జగనన్న తోడు ద్వారా రూ. 10 వేల రూపాయలు పొందాను. అది నా వ్యాపారానికి పెట్టుబడి పెట్టాను. మీరు పెట్టిన పథకాలు వైఎస్సార్ ఆసరా ద్వారా రూ. 6 వేలు, సున్నా వడ్డీ ద్వారా 18 వందల రూపాయలు వచ్చింది. మా అబ్బాయికి రూ. 15 వేల అమ్మఒడి కూడా వచ్చింది. మా అత్త గారికి పింఛన్ కూడా వచ్చింది. ఈ పథకానికి ‘జగనన్న తోడు’ అని ఎవరు పేరు పెట్టారో తెలియదు గానీ మాకు చాలా తోడుగా ఉందన్నా. మాకు మీరు అండగా ఉన్నందుకు ధన్యవాదాలు అన్నా’ అని సీఎం జగన్‌కు తెలిపారు. అది మీరు పెట్టిన ప్రాణభిక్షే అన్నా.. మరో లబ్ధిదారు మాట్లాడుతూ.. ‘నా పేరు శారద. అనంతపురం జిల్లా రుద్రంపేట గ్రామం. పండ్ల వ్యాపారం చేస్తున్నాం. జగనన్న తోడు మీరు ఎందుకు పెట్టారో కానీ మాలాంటి చిరు వ్యాపారులకు తోడుగా ఉందన్నా. ఎటువంటి షూరిటీ లేకుండా రూ.10వేలు రావడం చాలా సంతోషంగా ఉందన్నా. నేను డిగ్రీ, నా భర్త ఎంబీఏ చదువుకున్నాడు. ఒకరి దగ్గర పని చేయకూడదనే పండ్ల వ్యాపారం చేసుకుంటున్నాం. మా అత్తకి ఇళ్ల పట్టా కూడా వచ్చింది. మా మావకు వృద్ధాప్య పింఛన్ కూడా వచ్చిందన్నా. అది మీ దయ అన్నా. గతంలో ఈ పరిస్థితి లేదన్నా. పింఛన్ కోసం వెళితే ఏ టైమ్‌కి వచ్చేవాళ్లమో తెలిసేది కాదు. వార్డు వాలంటీర్లే ఇప్పుడు ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తున్నారు. కిడ్నీ ప్రాబ్లమ్‌తో చాలా బాధపడేదాన్ని. ఆరోగ్య శ్రీతో దానికి చికిత్స కూడా తీసుకున్నా. అది మీరు పెట్టిన ప్రాణభిక్షే. మీరు చాలా మంచి పరిపాలన చేస్తున్నారు. ఇలాగే పాలన కొనసాగించాలని కోరుకుంటున్నా’ అని తెలిపారు. -
చిరు వ్యాపారులకు అండగా నిలవడమే మా లక్ష్యం: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: రోడ్ల పక్కన, తోపుడు బండ్లపై పండ్లు, కూరగాయలు అమ్ముకునే చిన్న చిన్న వ్యాపారులు మరో 5,10,462 మందికి ప్రభుత్వం రూ.510.46 కోట్ల వడ్డీ లేని రుణాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి మూడో విడత రుణాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చిరు వ్యాపారులకు అండగా నిలవడమే జగనన్న తోడు లక్ష్యమని తెలిపారు. చిరు వ్యాపారులు తమకు తాము ఉపాధి కల్పించుకోవడం గొప్ప విషయమని అన్నారు. లక్షల మంది చిరు వ్యాపారులు స్వయం ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. వారి కాళ్లమీద వారు నిలబడడానికి ఎంతగానో ఈ పథకం ఉపయోగపడుతుందని అన్నారు. పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలు చూశా పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలు చూశానని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. చిరు వ్యాపారులకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే జగనన్న తోడు పథకం తీసుకొచ్చామని అన్నారు. రుణాలు క్రమం తప్పకుండా చెల్లిస్తుంటే మీకు మళ్లీ రుణం ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకూ 14 లక్షల మందికి మంచి చేయగలిగామని అన్నారు. మూడో విడత కింద 5,10,462 మంది చిరు వ్యాపారులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. గ్రామ సచివాలయంలో అన్ని రకాల సహాయం పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికి రూ.10వేల రుణం అందజేస్తోందని తెలిపారు. వడ్డీ రీఎంబర్స్మెంట్ రూ.16.16 కోట్లు కలిపి మొత్తం రూ.526.62 కోట్లు లబ్ధి చేకూరుతుందని అన్నారు. అర్హులై ఉండి రుణం రాకపోతే.. గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారులకు సందేహాలుంటే 08912890525కు కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. గ్రామ సచివాలయంలో అన్ని రకాల సహాయం దొరుకుతుందని అన్నారు. ఎటువంటి అవినీతికి తావులేకుండా లబ్దిదారులకు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఎవరికైనా డబ్బులు రాకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పేదలను ప్రభుత్వం అక్కున చేర్చుకుంది కోవిడ్ కారణం చిరు వ్యాపారులు బాగా దెబ్బతిన్నారని సర్వేల్లో చూశానని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. నిరుపేదల కుటుంబాలను కాపాడేందుకు సంక్షేమ పథకాలను అమలు చేశామని అన్నారు. అవినీతికి తావులేకుండా పేదలకు రూ. 1.29 లక్షల కోట్లు అందించామని తెలిపారు. మిగతా రాష్ట్రాల్లో కంటే పేదలను మన రాష్ట్ర ప్రభుత్వం అక్కున చేర్చుకుందని అన్నారు. ఈ పథకం కింద ఇప్పటికే తొలి విడత 5,35,112 మందికి, రెండో విడత 3,70,517 మందికి.. రెండు విడతల్లో మొత్తం 9,05,629 మందికి రుణాలను అందజేసింది. చిరు వ్యాపారులను ఆదుకునేందుకు 2020 నవంబర్ 25న ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ‘జగనన్న తోడు’ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. -
మరో మారు చిరువ్యాపారులకు అండగా నిలువనున్న సీఎం జగన్
-
చిరు వ్యాపారులకు తోడుగా..
సాక్షి, అమరావతి: రోడ్ల పక్కన, తోపుడు బండ్లపై పండ్లు, కూరగాయలు అమ్ముకునే చిన్న చిన్న వ్యాపారులు మరో 5,10,462 మందికి ప్రభుత్వం సోమవారం రూ.510.46 కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేయనుంది. ఐదారు వేల రూపాయలకు మించి పెట్టుబడి అవసరం లేని వ్యాపారాలకు సైతం రోజుకు మూడు నుంచి పది రూపాయల వడ్డీకి అప్పు తెచ్చుకుంటూ పలువురు తమ ఆదాయాన్ని వడ్డీ వ్యాపారులకు ధారపోస్తున్నారు. ఈ పరిస్థితి నుంచి చిరు వ్యాపారులను ఆదుకునేందుకు 2020 నవంబర్ 25న ప్రభుత్వం ప్రత్యేకంగా ‘జగనన్న తోడు’ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా ఎటువంటి పూచీకత్తు లేకుండా ఒక్కో లబ్ధిదారునికి రూ. పది వేల చొప్పున రుణాలు ఇప్పిస్తోంది. లబ్ధిదారుడు ఆ రుణాన్ని 12 నెలల సులభ వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఆ రుణంపై వడ్డీని ప్రభుత్వం నేరుగా లబ్ధిదారులకు చెల్లిస్తోంది. ఈ పథకం కింద ఇప్పటికే తొలి విడత 5,35,112 మందికి, రెండో విడత 3,70,517 మందికి.. రెండు విడతల్లో మొత్తం 9,05,629 మందికి రుణాలను అందజేసింది. ఇప్పుడు మూడో విడత రుణాల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ విడతలో అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లో చిరు వ్యాపారాలు చేసుకునే 3.56 లక్షల మందికి ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను పంపిణీ చేస్తోంది. జమ కానున్న రూ.16.16 కోట్ల వడ్డీ డబ్బు గత రెండు విడతల్లో జగనన్న తోడు పథకం కింద రుణాలు పొంది, సకాలంలో చెల్లించిన వారికి సంబంధించిన రూ.16.16 కోట్ల వడ్డీ డబ్బులను సోమవారం సీఎం వైఎస్ జగన్.. లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. 2020లో తొలి విడతలో ఈ పథకం ద్వారా రుణాలు పొందిన వారికి 2021 సెప్టెంబర్ 25న రూ.16.35 కోట్ల వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం జమ చేసింది. రెండు విడతల్లో రుణాలు పొందిన వారికి సంబంధించి 2021 డిసెంబర్ ఆఖరు వరకు అయిన వడ్డీని తాజాగా సోమవారం వారి ఖాతాల్లో జమ చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలు 68 శాతం గత రెండు విడతలతో పాటు ప్రస్తుత మూడో విడతలో కలిపి మొత్తం 14.16 లక్షల మంది చిరు వ్యాపారులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. వీరిలో అత్యధికంగా 6.30 లక్షల మంది బీసీలు ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరో 2.74 లక్షల మంది ఎస్సీలకు లబ్ధి చేకూరింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలు 68 శాతం మందికి, 12.46 శాతం మంది కాపులకు ప్రయోజనం కలిగింది. మరో 12 శాతం మంది కాపుయేతర ఓసీ లబ్ధిదారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందారని అధికారులు తెలిపారు. ఈ పథకం లబ్ధిదారుల్లో 30 శాతం మంది బడ్డీ కొట్టు చిరు వ్యాపారులు కాగా, మిగతా వారంతా పండ్లు, కూరగాయలు అమ్ముకునే వారు ఉన్నారు. -
‘జగనన్న తోడు’ అమలు చేయనున్న సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ‘జగనన్న తోడు’ రేపు (సోమవారం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా అమలు కానుంది. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి లబ్ధిదారుల అకౌంట్లలో సీఎం వైఎస్ జగన్ నగదు జమ చేయనున్నారు. చిరు వ్యాపారులకు రోజు వారీ పెట్టుబడి కోసం వడ్డీ లేని రుణాలు అందించనున్నారు. వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితికి చెక్ పెట్టనున్నారు. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కక్కరికీ రూ. 10 వేల రుణం అందించనుంది. మొత్తం 5.10 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ. 510 కోట్ల వడ్డీ లేని రుణం అందించనున్నారు. వడ్డీ రీఎంబర్స్ మెంట్ రూ. 16.16 కోట్లు కలిపి మొత్తం 526 కోట్ల పంపిణీ జరగనుంది. ఇప్పటి వరకూ 14.16 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 1,416 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించిన విషయం తెలిసిందే. లబ్ధిదారుల తరపున ప్రభుత్వం బ్యాంక్‌కు చెల్లించిన వడ్డీ మొత్తం రూ.32.51 కోట్లు. నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సాంప్రదాయ చేతివృత్తుల వారికి ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తోంది. -
AP: ‘జగనన్న తోడు’ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..
సాక్షి, అమరావతి: మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మరణంతో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నిర్వహించతలపెట్టిన ‘జగనన్న తోడు’ మూడో విడత సాయం అందజేత కార్యక్రమాన్ని ఈనెల 28వ తేదీకి వాయిదా వేసింది. చదవండి: స్నేహశీలీ.. సెలవిక! -
9.05 లక్షల మందికి మూడో విడత ‘జగనన్న తోడు’
సాక్షి, అమరావతి: ‘జగనన్న తోడు’ పథకంలో చిరు వ్యాపారులకు ప్రభుత్వం మూడో విడత కింద లబ్ధి చేకూర్చేందుకు ఇప్పటికే 9,05,023 మంది లబ్ధిదారులను గుర్తించినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. జగనన్న తోడు, వైఎస్సార్ చేయూత, ఆసరా, వైఎస్సార్ సున్నా వడ్డీ, స్వయం సహాయక సంఘాలు, వైఎస్సార్ పెన్షన్ కానుక తదితర పథకాల అమలుపై సోమవారం మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ..జగనన్న తోడు మూడో విడత కార్యక్రమాన్ని ఈ నెల 22న సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తారని మంత్రి చెప్పారు. బ్యాంకుల ద్వారా గత రెండు విడతలుగా రుణాలు పొందిన 6,91,530 మందితో పాటు కొత్తగా మరో 1,57,760 మందికి మూడో విడతలో బ్యాంకు రుణాలు అందించనున్నట్లు వివరించారు. సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సెర్ప్ సీఈవో ఇంతియాజ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. మూడో విడత సున్నా వడ్డీ పథకం కోసం.. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద మొదటి విడతలో దాదాపు 81 లక్షల మంది పొదుపు సంఘాల మహిళలకు రూ.1,207.14 కోట్లు, రెండో విడతలో 97 లక్షల మంది మహిళలకు రూ.1,081.23 కోట్ల మేర ప్రభుత్వం లబ్ధి చేకూర్చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. మూడో విడత కింద పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ ద్వారా లబ్ధి చేకూర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెన్షన్ లబ్ధిదారుల జాబితాలను ఆధార్ లింక్‌తో అనుసంధానం చేసి మరింత పారదర్శకంగా పింఛన్ల పంపిణీ చర్యలు చేపట్టాలని సూచించారు. పొదుపు సంఘాలకు సంబంధించి గ్రామ సమాఖ్యలో నిధుల దుర్వినియోగంపై అధికారులు దృష్టి సారించాలని.. గ్రామ సమాఖ్యల కార్యక్రమాలపై పర్యవేక్షణ, పరిశీలన కోసం ఒక జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. -
లబ్ధిదారుల తరఫున వడ్డీని చెల్లిస్తున్న వైఎస్ జగన్ సర్కార్
-
జగనన్న తోడు పథకం లబ్ధిదారులు వడ్డీ చెల్లింపు
-
సున్నా వడ్డీ పొందేలా చూసుకోండి
ఇంకా రుణం చెల్లించని వాళ్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కచ్చితంగా డిసెంబర్‌లోగా రుణాలు చెల్లించండి. ఆటోమేటిక్‌గా మీరు కట్టిన వడ్డీ ప్రభుత్వం మీకు చెల్లిస్తుంది. మళ్లీ మీకు రూ.10 వేలు బ్యాంకు రుణం ఇస్తుంది. మీరు మీ వ్యాపారాలు చక్కగా చేసుకోవచ్చు. ఈ విషయాలన్నీ మీకు చెప్పాలన్నదే మా తపన, తాపత్రయం. అలా చెప్పకపోతే ఇది తెలియక మీరు అన్యాయమైన పరిస్థితుల్లోకి పోతారనేది మా భయం. అలాంటి పరిస్థితి రాకూడదన్న ఆత్రుతతో ఈ కార్యక్రమం ద్వారా పిలుపునిస్తున్నాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘జగనన్న తోడు’ కింద రుణాలు తీసుకున్న చిరు వ్యాపారులు సకాలంలో రుణం చెల్లించి, సున్నా వడ్డీ రాయితీ పొందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. సకాలంలో కిస్తీలు కట్టడం ద్వారా బ్యాంకర్ల విశ్వాసం పొందాలని సూచించారు. నెల నెలా కిస్తీలు కట్టకపోతే సున్నా వడ్డీ రుణం పొందడానికి వీలుండదని, అటువంటి పరిస్థితిని తెచ్చుకుని మళ్లీ వడ్డీ వ్యాపారుల బారిన పడవద్దని విజ్ఞప్తి చేశారు. సకాలంలో రుణం చెల్లించిన చిరు వ్యాపారులు సున్నా వడ్డీ రాయితీ పొందడమే కాకుండా మళ్లీ సున్నా వడ్డీకి కొత్త రుణం పొందవచ్చని స్పష్టం చేశారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి జగనన్న తోడు పథకం కింద 2020 నవంబర్ నుంచి 2021 సెప్టెంబర్ 30 వరకు రూ.10 వేలు చొప్పున రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 4,50,546 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.16.36 కోట్ల వడ్డీని కంప్యూటర్లో బటన్ నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా జిల్లాల్లోని లబ్ధిదారులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. 2021 జూన్‌లో రెండో దఫా కింద రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించే లబ్ధిదారులందరికీ కూడా వారి రుణ కాల పరిమితి ముగియగానే వడ్డీని తిరిగి చెల్లిస్తామని చెప్పారు. ఇక నుంచి ప్రతి ఏటా రెండు దఫాలుగా ఈ కార్యక్రమాన్ని ప్రాధాన్యత అంశంగా భావించి అమలు చేస్తామన్నారు. రుణం తీసుకున్న వారి కాల పరిమితి డిసెంబర్ నాటికి పూర్తయితే, ఆ లోన్ క్లోజ్ చేసి.. వారి వడ్డీ డబ్బులు వెనక్కిస్తామని తెలిపారు. ఒకసారి డిసెంబర్లో, మరోసారి జూన్ నెలలో ఇలా చేస్తామని స్పష్టం చేశారు. రుణాలు చెల్లించిన వారికి వడ్డీ సొమ్ము వెనక్కు ఇవ్వడంతో పాటు అదే రోజు మళ్లీ కొత్తగా రుణాలిచ్చే కార్యక్రమాన్ని కలిపి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. రుణాలు కట్టకపోతే ఇప్పుడైనా చెల్లించండి ► ఈ పథకానికి సంబంధించి ఎవరైనా రుణాలు కట్టకపోతే ఇప్పుడైనా కట్టండి. మళ్లీ డిసెంబర్లో, జూన్‌లో తిరిగి వడ్డీ లేని రుణాలు పొందడానికి అవకాశం ఉంటుంది. వడ్డీ విషయంలో కానీ, రుణాలు పొందే విషయంలో కానీ ఎవరికైనా సందేహాలుంటే 0891 2890525 నంబరుకు ఫోన్ చేస్తే అన్ని సందేహాలను పూర్తిగా నివృత్తి చేస్తారు. ► తాజాగా బ్యాంకర్ల నుంచి అందుతున్న డేటా చూస్తే.. దాదాపు 5 శాతం ఎన్పీఏలు, 11 శాతం ఓవర్ డ్యూస్గా ఉన్నాయని బ్యాంకర్లు చెప్పారు. ఇటువంటి మంచి కార్యక్రమంపై అందరికీ పూర్తి అవగాహన కలగాలి. ఇది నలుగురికి మంచి చేసే కార్యక్రమం అని, అవగాహన కల్పించడం కోసం అక్టోబర్‌లోనే వడ్డీ జమ చేస్తున్నాం. ఇందులో 100 శాతం రికవరీ ఉండాలి. అప్పుడే బ్యాంకర్లకు మన మీద నమ్మకం పెరుగుతుంది. అప్పుడే బ్యాంకర్లు మరో నలుగురికి రుణాలివ్వడానికి ముందుకు వస్తారు. ► గ్రామ సచివాలయం, వలంటీర్లు, కలెక్టర్లు అందరూ భాగస్వాములై ఈ విషయం లబ్ధిదారులందరికీ తెలిసేలా చెప్పాలి. ప్రతి నెలా ఈఎంఐ కట్టకపోతే గడువు దాటినట్లే. అంటే ఓవర్ డ్యూ అయినట్లే లెక్క. అలా 90 రోజులు కట్టకపోతే ఎన్పీఏ (నాన్ ఫెర్ఫార్మింగ్ అసెట్) కింద మారుస్తారు. ఈ విషయాలన్నీ వారికి వివరించాలి. ఏ ఖాతా అయినా ఎన్పీఏ అయిందంటే ప్రభుత్వం నుంచి సున్నా వడ్డీ అందని పరిస్థితి ఉంటుందనేది చాలా స్పష్టంగా చెప్పాలి. వీళ్ల పరిస్థితి మారాలనేదే లక్ష్యం ► చిరు వ్యాపారుల పరిస్థితి మార్చి, వీళ్లకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేశాం. వారి ద్వారా వడ్డీ లేకుండా రూ.10 వేలు రుణం ఇప్పించేలా ఒప్పించి ఈ పథకాన్ని గతేడాది ప్రారంభించాం. వాళ్లు కట్టిన వడ్డీని ప్రభుత్వం తిరిగి వారికి వెనక్కు ఇస్తుంది. ► దాదాపు 9,05,458 మందికి రూ.10 వేలు చొప్పున రూ.905 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇప్పించాం. గత ఏడాది నవంబర్ 25 నుంచి 5 లక్షల 35 వేల మందికి మొదటి విడతలో రుణాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ ఏడాది జూన్ 8 నుంచి రెండో విడతగా మరో 3 లక్షల 70 వేల మందికి రుణాలు పంపిణీ చేశాం. ► ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గతంలో ఏ ప్రభుత్వం వీరిని పట్టించుకోలేదు ► తోపుడు బండ్ల మీద పండ్లు, సామాన్లు అమ్ముకునే వారు, నగరాల్లో ఫుట్‌పాత్‌ల మీద ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్లు అమ్ముకునే వారు, రోడ్డు పక్కన చిన్న బంక్ పెట్టుకుని చిన్న, చిన్న వ్యాపారాలు చేసేవాళ్లు, కూరగాయలు, పండ్లు, పూలు అమ్ముకునేవాళ్లు, చిన్న మోపెడ్ మీద వీధుల్లో తిరుగుతూ సామాన్లు అమ్ముకునే వాళ్లు.. ప్రతి ఊళ్లో కనిపిస్తుంటారు. ► ఇలాంటి వాళ్లకు ఏ రోజు కూడా బ్యాంకుల దగ్గర నుంచి వీళ్ల అవసరాలు తీర్చేందుకు సహాయ, సహకారాలు అందని పరిస్థితి. ఎందుకంటే సెక్యూరిటీ ఇచ్చే స్తోమత వీళ్లకు ఉండదు. గతంలో ఏ ప్రభుత్వమూ వీళ్లను పట్టించుకోని పరిస్థితి. లోన్లు అందక వీరి జీవితాలు తల్లడిల్లిపోయాయి. ► అలాంటి వాళ్లు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర రూ.1,000 వర్కింగ్ క్యాపిటల్ కింద అప్పు తీసుకుంటే రూ.900 మాత్రమే చేతికిస్తారు. అయితే రోజుకు రూ.100 చొప్పున మొత్తం రూ.1,000 కట్టాలి. ఇలాంటి పరిస్థితులను నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో కళ్లారా చూశాను. దుకాణం ఏర్పాటు చేసుకున్నా.. వీధుల్లో తిరుగుతూ వ్యాపారం చేసే స్థాయి నుండి కూరగాయల దుకాణం ఏర్పాటు చేసుకునే స్థాయికి ఎదిగాను. రోజుకు నాలుగు ఐదు వందల రూపాయల ఆదాయం లభిస్తోంది. నెలకు రూ.15 వేల ఆదాయం వస్తోంది. ఆసరా పథకం ద్వారా వచ్చిన సొమ్ముతో ఆవును కొనుగోలు చేశాను. దాని ద్వారా కూడా ఆర్థికంగా అండ లభించింది. మీ మేలు మరవలేను. – పిలకా పద్మ, సీహెచ్ రాజాం, రణస్థలం మండలం, శ్రీకాకుళం జిల్లా అధిక వడ్డీల భారం తప్పింది అన్నా.. నాకు ఇద్దరు పిల్లలు. అధిక వడ్డీలకు డబ్బులు తీసుకొని పెట్టుబడిగా పెట్టి వచ్చిన ఆదాయం మొత్తాన్ని వడ్డీలకే కట్టేదాన్ని. మీరు ప్రారంభించిన జగనన్న తోడు పథకం ద్వారా నాకు పది వేల రూపాయలు రుణం వస్తుందని మా వలంటీరు చెప్పాడు. అలా రుణం తీసుకుని వ్యాపారంలో పెట్టుబడి పెట్టాను. అధిక వడ్డీ చెల్లించే బాధ తప్పింది. దీంతో రోజుకు 500 రూపాయల వరకు ఆదాయం పొందుతున్నాను. మీ వల్ల మా స్కూలు బాగుపడిందని మా పాప చెబుతోంది. మా లాంటి వాళ్లందరం సంతోషంగా ఉన్నాం. –మాధవి, లబ్ధిదారు, వెంకటాచలం, నెల్లూరు జిల్లా అన్నా.. నేను ఫ్యాన్సీ షాపు పెట్టుకున్నా జగనన్నా.. మీరు ప్రవేశపెట్టిన జగనన్న తోడు పథకం ద్వారా స్టేట్ బ్యాంక్‌లో రూ.10 వేల రుణం పొందాను. వార్డు వలంటీర్ ద్వారా ఈ పథకం గురించి తెలుసుకొని దరఖాస్తు చేసుకున్నాను. బ్యాంకు ఇచ్చిన రుణంతో ఫ్యాన్సీ దుకాణం పెట్టుకున్నాను. కరోనా సమయంలో ఇది నాకు చాలా మేలు చేసింది. మీరు అమలు చేస్తున్న ఇతరత్రా పథకాల ద్వారా మేము ఎంతగానో లబ్ధి పొందుతున్నాం. ఆరోగ్యశ్రీ, దిశ యాప్, సచివాలయ వ్యవస్థ ఎంతో అద్భుతం. – కె.నాగజ్యోతి, ఆర్ ఆర్ పేట, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా -
ప్రజల ఆప్యాయతను జీర్ణించుకోలేని ప్రతిపక్షం
అంతా నావాళ్లే.. అన్ని ప్రాంతాలు నావే.. ప్రతి ఒక్కరూ నా కుటుంబ సభ్యులే.. అన్న భావనతో రెండున్నరేళ్ల పరిపాలన సాగుతూ వచ్చింది. మీరిచ్చిన అధికారంతో ఇప్పటికే సచివాలయ, వలంటీర్ వ్యవస్థ ద్వారా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి కలిగిస్తున్నాం. గ్రామ స్థాయి నుంచి కూడా ఎక్కడా వివక్ష, అవినీతి లేకుండా, నేరుగా లబ్ధిదారుని ఖాతాలోకి నగదు వెళ్లేటట్టుగా (డీబీడీ ద్వారా) చర్యలు తీసుకున్నాం. కులం, మతం, ప్రాంతం, వర్గం.. చివరకు పార్టీ కూడా చూడకుండా, ఎవరికి ఓటేశారన్న మాట కూడా అడగకుండా అర్హులందరికీ మంచి జరిగేలా ప్రతి అడుగులోనూ చేయి పట్టుకుని ప్రభుత్వం నడిపిస్తోంది. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అగ్రవర్ణాల్లో ఉన్న నిరుపేదలకు కూడా అన్ని రకాలుగా న్యాయం చేస్తూ అడుగులు ముందుకు వేస్తున్నాం. ఇవన్నీ జీర్ణించుకోలేని ప్రతిపక్షం విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూడటం దారుణం. సీఎం జగన్ సాక్షి, అమరావతి: ప్రభుత్వం పట్ల ప్రజలు చూపుతున్న ప్రేమ, ఆప్యాయత, ఆదరణను ప్రతిపక్షంతో పాటు ఎల్లో మీడియా జీర్ణించుకోలేకపోతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వాన్ని ఆదరించి ప్రతిపక్షానికి స్థానం లేకుండా చేశారన్నారు. దీంతో ప్రతిపక్ష నాయకులు వ్యక్తిగతంగా బూతులు తిడుతూ విద్వేషాలు, వైషమ్యాలను రెచ్చగొడుతున్నారని అన్నారు. సకాలంలో రుణాలు చెల్లించిన జగనన్న తోడు లబ్ధిదారులైన చిరు వ్యాపారులకు బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వడ్డీని జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యక్తిగతంగా తనను బూతులు తిట్టడం, అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు స్పందించడం, ఎల్లో మీడియా వక్రీకరణ రాతలపై ఆయన స్పందించారు. వాడరాని భాషతో బూతులు తిట్టడంతో వాటిని వినలేక, భరించలేక అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా స్పందించి ఖండిస్తే కూడా ఇష్టానుసారం మాట్లాడుతున్నారని చెప్పారు. ప్రతిపక్షంతో పాటు ఎల్లో మీడియా కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి.. అన్యాయమైన రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. రాజకీయ లబ్ధికి ఆరాటం ► దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో సాగిన పరిపాలన మీ అందరికీ నచ్చింది కాబట్టే పంచాయతీ ఎన్నికలు మొదలు.. మున్సిపల్ ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నిక, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు.. ఇలా ప్రతి ఎన్నికల్లో కూడా ప్రతిపక్షానికి స్థానమే లేకుండా ప్రతి అక్కా, చెల్లెమ్మ, ప్రతి సోదరుడు, స్నేహితుడు కూడా నన్ను సొంత బిడ్డగా, అన్నగా భావించి అన్ని రకాలుగా తోడుగా నిలబడుతున్నారు. ► మీరు ఇంత ప్రేమ, ఆప్యాయతలు చూపుతుండటాన్ని జీర్ణించుకోలేని విధంగా ప్రతిపక్షం తయారైంది. దీనికి తోడు ఎల్లో మీడియా.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఏ రకంగా తయారయ్యిందో మీరే చూస్తున్నారు. ఈ ప్రతిపక్ష నేతలు ఎవరూ కూడా మాట్లాడలేని విధంగా అన్యాయమైన మాటలు మాట్లాడతారు. దానికి ఈ ఎల్లో మీడియా వంత పాడుతుంది. నేను ప్రతిపక్షంలో ఉండగా.. ఏ రోజు కూడా ఇటువంటి మాటలు ఎవరూ మాట్లాడి ఉండరు. ► అంతగా బూతులు తిట్టినప్పుడు.. ఆ టీవీల్లో ఆ దృశ్యాలు చూడలేక, ఆ తిట్లు వినలేక మనల్ని అభిమానించే వాళ్లు, మనల్ని ప్రేమించే వాళ్ల రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఆ రకంగా కావాలని తిట్టించి, వైషమ్యాలను సృష్టించి, తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలన్న ఆరాటం మన కర్మ కొద్దీ ఈ రాష్ట్రంలోనే కనిపిస్తోంది. అబద్ధాలు, అసత్యాలు.. ► అబద్ధాలు ఆడతారు.. అసత్యాలు ప్రచారం చేస్తారు.. వంచనా కనిపిస్తుంది.. ప్రతి మాటలోనూ, ప్రతి రాతలోనూ అబద్ధాలతో మోసం చేసే వక్రబుద్ధే కనిపిస్తుంది. మత విద్వేషాలను కూడా రెచ్చగొట్టడానికి ఏ మాత్రం వెనుకాడరు. కులాల మధ్య, మతాల మధ్య కూడా చిచ్చు పెడతారు. ఇష్టమొచ్చినట్లు కార్యక్రమాలు చేస్తారు. వ్యవస్థలను పూర్తిగా మేనేజ్ చేస్తున్న పరిస్థితులు మన కళ్లముందే కనిపిస్తున్నాయి. ► పేదవాడికి మంచి జరగకూడదు. అలా జరిగితే ఎక్కడ జగన్‌కు మంచి పేరు వస్తుందేమోనని ఆ మంచి పనులు ఆపడం కోసం రకరకాలుగా కోర్టులో కేసులు వేయిస్తారు. ► ఇటువంటి అన్యాయమైన పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో ఈ రెండున్నరేళ్ల పరిపాలనను మనస్ఫూర్తిగా, సంతృప్తినిచ్చే విధంగా చేయగలిగాను. ఇంకా మంచి చేయడానికి కూడా వెనుకడుగు వేయను. -
రుణాలు చెల్లించిన వారికి కొత్త లోన్లు ఇస్తాం: సీఎం జగన్
-
సంక్షేమ పాలనను చూసి టీడీపీ ఓర్వలేకపోతోంది: సీఎం జగన్
సాక్షి, అమరావతి: సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి.. కుల,మత, ప్రాంతం, పార్టీలతో నిమిత్తం లేకుండా పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. 'జగనన్న తోడు' కార్యక్రమంలో బుధవారం ఆయన మాట్లాడుతూ, సంక్షేమ పాలనను చూసి టీడీపీ ఓర్వలేకపోతోందన్నారు. ప్రతిపక్షం ఎలా తయారయిందో ప్రజలు చూస్తున్నారు.బూతులు తిడుతూ ప్రతిపక్ష నేతలు రాజకీయాలు చేస్తున్నారు. ఎవరూ మాట్లాడని బూతులను ప్రతిపక్షం మాట్లాడుతోంది. గతంలో మేం కూడా ప్రతిపక్షంలో ఉన్నాం. ఇలాంటి బూతులు మేం ఎప్పుడూ మాట్లాడలేదు. టీడీపీ నేతలు కావాలనే వైషమ్యాలు సృష్టించి రెచ్చగొడుతున్నారు. ప్రతిమాటలోనూ, రాతలోనూ వంచన కనిపిస్తోంది. మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కూడా టీడీపీ వెనకాడదని సీఎం అన్నారు. లబ్ధిదారుల వడ్డీ సొమ్ము జమ చేసిన సీఎం జగన్ 'జగనన్న తోడు' కార్యక్రమంలో భాగంగా లబ్ధి దారుల వడ్డీ సొమ్మును బ్యాంక్ ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జమ చేశారు. బుధవారం క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి రూ.16.36 కోట్లు లబ్ధి దారుల ఖాతాల్లో జమ చేశారు. తొలి విడత ‘జగనన్న తోడు’ కింద రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 4.5 లక్షల మంది చిరు వ్యాపారులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటివరకు 9.05 లక్షల మందికి రూ.950 కోట్ల రుణాలను ప్రభుత్వం అందించింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సుదీర్ఘ పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలను కళ్లార చూశానని సీఎం అన్నారు. చిరు వ్యాపారులు, తోపుడు బండ్లు, హస్తకళా వ్యాపారులు, సంప్రదాయ చేతి వృత్తుల కళాకారులకు ‘జగనన్న తోడు’ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. వడ్డీ వ్యాపారుల చెర నుంచి చిరు వ్యాపారులకు ఈ పథకం ద్వారా విముక్తి కలుగుతుందన్నారు. ‘‘ప్రతి ఒక్కరికీ ఏటా రూ.10వేల వడ్డీలేని రుణం అందిస్తున్నాం. ఇప్పటివరకు 9.05 లక్షల మందికి రూ.905 కోట్లు పంపిణీ చేశాం. ఇప్పటివరకు సకాలంలో చెల్లించిన 4.50 లక్షల మందికి రూ.16.36 కోట్ల వడ్డీ జమ చేస్తున్నాం. ఏడాదిలో రెండుసార్లు డిసెంబర్, జూన్‌లో ‘జగనన్న తోడు’ కార్యక్రమం నిర్వహిస్తాం. రుణాలు చెల్లించిన వారికి కొత్త లోన్లు ఇస్తాం. కొత్త రుణాలతో పాటు కట్టిన వడ్డీని వాపసు ఇస్తామని’’ సీఎం తెలిపారు. -
Jagananna Thodu: లబ్ధి దారుల ఖాతాల్లో వడ్డీ జమచేయనున్న సీఎం జగన్
-
Jagananna Thodu: లబ్ధి దారుల ఖాతాల్లో వడ్డీ జమచేయనున్న సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: 'జగనన్న తోడు' కార్యక్రమంలో భాగంగా లబ్ధి దారుల వడ్డీ సొమ్మును బ్యాంక్ ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జమ చేయనున్నారు. బుధవారం క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి రూ.16.36 కోట్లు లబ్ధి దారుల ఖాతాల్లో జమ చేస్తారు. మొదటి విడత జగనన్న తోడు కింద రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన (సెప్టెంబర్ 30లోగా) 4.5 లక్షల మంది చిరువ్యాపారులకు లబ్ది చేకూరనుంది. ప్రభుత్వం ఇప్పటి వరకు 9.05 లక్షల మందికి రూ. 950 కోట్ల రుణాలను అందించింది. చిరు వ్యాపారులు, తోపుడు బండ్లు, హస్తకళా వ్యాపారులు, సంప్రదాయ చేతివృత్తుల కళాకారులకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుతుంది. ఈ పథకం కింద ప్రతి ఒక్కరికి ఏటా రూ.10వేల వడ్డీ లేని రుణాలను అందిస్తోంది. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. వడ్డీ వ్యాపారుల చెర నుంచి చిరు వ్యాపారులకు ఈ పథకం ద్వారా విముక్తి లభించునుంది. అయితే తీసుకున్న రుణం చెల్లిస్తేనే తిరిగి రుణం తీసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. చదవండి: (‘కోవిడ్’ కారుణ్య నియామకాలు) -
రేపు జరగాల్సిన ‘జగనన్న తోడు’ బుధవారానికి వాయిదా
సాక్షి, విజయవాడ: రేపు(మంగళవారం) జరగాల్సిన ‘జగనన్న తోడు’ కార్యక్రమం బుధవారానికి వాయిదా వేసినట్లు గ్రామ, వార్డు సచివాలయ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మిలాద్-ఉన్-నబీ పండగ సెలవు కావడంతో ‘జగనన్న తోడు’ కార్యక్రమాన్ని వాయిదా వేశామన్నారు. ఎల్లుండి ఉదయం 11 గంటలకు లబ్ధిదారుల వడ్డీ సొమ్ము బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే కార్యక్రమం యథావిధిగా నిర్వహించడం జరుగుతుందని అజయ్‌జైన్ తెలిపారు. చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త! -
చిరు వ్యాపారుల జీవితాల్లో వెలుగు
సాక్షి, అమరావతి: జగనన్న తోడు కింద చిరు వ్యాపారులకు ఇచ్చిన వడ్డీ లేని రుణాలు వారి జీవితాల్లో వెలుగులు నింపాలని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షించారు. పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలను చూసిన తర్వాతే వారికి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని, ఇదే విషయాన్ని మేనిఫెస్టోలో పెట్టామని చెప్పారు. ఈ రోజు దానిని సంతృప్త స్థాయిలో అమలు చేస్తుండటం సంతోషం కలిగిస్తోందన్నారు. కరోనా కష్ట సమయంలో చిరు వ్యాపారులకు అండగా నిలవడంలో భాగంగా ‘జగనన్న తోడు’ పథకం కింద రెండో విడతలో 3.70 లక్షల మంది అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ముల ఖాతాలకు రూ.10 వేల చొప్పున రూ.370 కోట్ల వడ్డీ లేని రుణాలను మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్లో బటన్ నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రెండో విడతతో కలిపి (తొలి విడతలో 5.35 లక్షల మందికి రూ.535 కోట్లు) ఈ పథకం కింద 9.05 లక్షల మంది చిరు వ్యాపారులైన అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములకు వడ్డీ లేని రుణం కింద రూ.905 కోట్లు అందించామని తెలిపారు. తిరిగి రుణాలను వడ్డీతో సహా సకాలంలో బ్యాంకులకు చెల్లిస్తే, ఆ వడ్డీని లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వమే నేరుగా జమ చేస్తుందని వెల్లడించారు. దీనివల్ల రుణం తీసుకున్న వారిలో సకాలంలో తిరిగి చెల్లించాలనే క్రమశిక్షణ వస్తుందన్నారు. ఆ తర్వాత బ్యాంకులు తిరిగి వారికి రుణం ఇస్తాయని చెప్పారు. ఈ రకంగా ఈ పది వేల రూపాయలు రివాల్వింగ్ పద్దతిలో చిరు వ్యాపారులకు అందుబాటులో ఉంటుందన్నారు. అర్హులకు ఎవరికైనా రాకపోతే కాంగారు పడొద్దని, గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే మూడు నెలల్లో తనిఖీలు పూర్తి చేసి, ఆరు నెలల్లో వడ్డీ లేని రుణాలు అందిస్తామని తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలను చూశాను – వ్యవస్థలను, బ్యాంకులను పేదవాడికి ఉపయోగపడే పరిస్థితిలోకి తీసుకు రాలేకపోతే ప్రభుత్వాలు ఫెయిల్ అయినట్లు కచ్చితంగా భావించాలి. నా పాదయాత్రలో పేదల కష్టాలను స్వయంగా చూశాను. – చిన్న చిన్న వ్యాపారులకు తక్కువ వడ్డీకి, వడ్డీలేని రుణాలు వారికి దొరుకుతాయా అంటే.. ఎక్కడా అటువంటి పరిస్థితి కనిపించ లేదు. బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. గత్యంతరం లేని స్థితిలో ప్రైవేటు వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తీసుకుంటున్నారు. – దేవుడు వీరి తలరాతలు మార్చే అవకాశం ఇస్తే, కచ్చితంగా మారుస్తాను అని మేనిఫేస్టోలో పెట్టాను. ఈ రోజు దానిని సంతృప్త స్థాయిలో అమలు చేస్తున్నాం. – జగనన్న తోడు కింద మొత్తం 9.05 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే, తొలి విడతలో 5.35 లక్షల మందికే బ్యాంకుల నుంచి రుణాలు వచ్చాయి. మిగిలిన 3.70 లక్షల మంది గురించి బ్యాంకులతో మళ్లీ మాట్లాడి, వారిపై ఒత్తిడి తెచ్చాం. బ్యాంకుల నుంచే కాకుండా ఆప్కాబ్, స్త్రీ నిధి వంటి బ్యాంకులను కూడా రంగంలోకి తీసుకువచ్చి ఈ రోజు రుణాలు ఇప్పిస్తున్నాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ జగనన్న తోడు – గ్రామాలు, పట్టణాల్లో సుమారు పది అడుగుల పొడవు, పది అడుగుల వెడల్పు స్థలం, అంతకన్నా తక్కువ స్థలంలో శాశ్వత, తాత్కాలిక షాప్‌లు ఏర్పాటు చేసుకున్న వారు ఈ పథకానికి అర్హులు. – పుట్ పాత్‌లు, వీధుల్లో తోపుడు బండ్ల మీద వస్తువులు, కూరగాయలు, పండ్లు అమ్ముకునే వారు, రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు, గంపలు, బుట్టల్లో వస్తువులు అమ్ముకునేవారు, సంప్రదాయ చేతివృత్తుల కళాకారులు, ఇత్తడి పని చేసేవారు, బొబ్బిలివీణ, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు చేసేవారు, లేస్, కళంకారీ, తోలు బొమ్మలు, కుమ్మరి తదితర వృత్తులపై ఆధారపడిన చిరు వ్యాపారులందరికీ జగనన్న తోడు కింద పదివేల రూపాయలు వడ్డీలేని రుణంగా అందజేస్తున్నాం. – రుణం మొత్తం తీర్చిన వారికి బ్యాంకులు మళ్లీ వడ్డీ లేని రుణాలు ఇస్తాయి. ఆ వడ్డీని ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేస్తుంది. తొలి విడతలో 5.35 లక్షల మందికి ఇచ్చిన రుణాలకు సంబంధించి వారు సకాలంలో బ్యాంకుకు చెల్లించిన వడ్డీ సొమ్మును నేరుగా వారి ఖాతాల్లో ఇవాళో, రేపో జమ చేస్తాం. ఈ కార్యక్రమం నిరంతర ప్రక్రియ – 9.05 లక్షల మంది చిరు వ్యాపారులకు ఈ వడ్డీ లేని రుణం ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో ఎటువంటి సందేహాలు, సమస్యలు ఉన్నా 1902 అనే నంబర్‌కు ఫోన్ చేస్తే పరిష్కరిస్తారు. అర్హత ఉన్న వారెవరైనా సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే నిబంధనల ప్రకారం వెరిఫికేషన్ జరుగుతుంది. – ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం కింద ఎన్ని దరఖాస్తులు వచ్చాయో చూసి, వాటిని పరిశీలించి, ఆరు నెలలకు ఒకసారి వారికి రుణాలు ఇప్పించే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతూనే ఉంటుంది. తమకు ఈ పథకం రాలేదని ఎవరూ కంగారు పడాల్సిన పనిలేదు. – ఈ కార్యక్రమం వల్ల 9.05 లక్షల మంది పేదింటి అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. చిరు వ్యాపారులకు పెద్ద సాయం ప్రజలకు ఇచ్చిన మాట మీద గౌరవం ఉన్న వ్యక్తి అధికారంలోకి వస్తే ఏ విధంగా మంచి పాలన సాగుతుందో అందరం చూస్తున్నాం. రెండేళ్ల పాలనలో సీఎం జగన్ ఏం చేసినా, అది పేదల కోసమే ఆలోచించి చేస్తారనే మాట మరోసారి రుజువవుతోంది. ఇలాంటి వినూత్న కార్యక్రమాల ద్వారా దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా సీఎం జగన్ పాలన ఆదర్శంగా నిలుస్తోంది. జగనన్న తోడు ద్వారా అందే రుణం చిన్నదిగా కనిపిస్తున్నా.. చిరు వ్యాపారులకు మాత్రం చాలా పెద్ద సహాయం. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చిరు వ్యాపారులైన పేద అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు ఏ విధంగా కష్టాలు పడుతున్నారో నా పాదయాత్రలో స్వయంగా చూశాను. చిన్న చిన్న మొత్తాలు అధిక వడ్డీతో అప్పుగా పొంది.. ఆ మొత్తంతో పండ్లు, కూరగాయలు కొనుక్కొని తలపై పెట్టుకుని వీధి వీధి తిరుగుతూ ఎందరో తారసపడి వారి బాధలు చెప్పుకున్నారు. రూ.5 వేలు.. రూ.10 వేలు తక్కువ వడ్డీకి లభిస్తే మా జీవితాలు సాఫీగా సాగుతాయని ఆశ పడ్డారు. వారి కష్టం చూసి ఆ నాడు మాటిచ్చాను. ఆ మాట మేరకు ఇవాళ మొత్తంగా 9.05 లక్షల మందికి రూ.10 వేల చొప్పున వడ్డీ లేని రుణాలు అందించామని సగర్వంగా చెబుతున్నాను. బ్యాంకులు ఇచ్చే రుణాలకు ప్రభుత్వమే గ్యారెంటీగా ఉంటుంది. మీరు రుణాలు ఇస్తే.. వారు సకాలంలో చెల్లిస్తారని చెప్పాను. అర్హత ఉంది అని తేలిన ప్రతి ఒక్కరికీ సహాయం చేస్తూ అడుగులు ముందుకు వేస్తున్నాం. చిన్న చిన్న వ్యాపారుల జీవితాలను మార్చడానికి ఈ సాయం ఎంతగానో ఉపయోగ పడుతుంది. మాకు సాయం చేస్తున్న మొదటి వ్యక్తి మీరే జగనన్నా.. కరోనా కష్టకాలంలో మీరు అందరినీ ఆదుకుంటున్నారు. తోపుడు బండ్ల మీద వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులకు సాయం చేస్తున్న మొదటి వ్యక్తి మీరే. మేం వడ్డీ వ్యాపారులకు భయపడి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న సమయంలో మీరు ఆదుకున్నారు. పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చారు. మీ పథకాల వల్ల పిల్లలు, పెద్దలు అందరూ సంతోషంగా ఉన్నారు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటామన్నా. – సరళాదేవి, తాడికొండ, గుంటూరు జిల్లా -
లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్
-
జగనన్న తోడు: లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: జగనన్న తోడు పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 3.70 లక్షల మంది చిరు వ్యాపారుల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున రూ.370 కోట్లను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చిరువ్యాపారులకు మేలు చేసే మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలు చూశానని, వారి కోసం జగనన్న తోడు ద్వారా వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని తెలిపారు. చిరు వ్యాపారులకు రూ.10 వేల వరకు వడ్డీ లేని రుణం ఇస్తున్నామని పేర్కొన్నారు. గత ఏడాది జగనన్న తోడు ద్వారా 5.35 లక్షల మంది రుణ సౌకర్యం పొందారని సీఎం వైఎస్ జగన్ గుర్తుచేశారు. రెండో విడతలో 3.7 లక్షల మంది చిరువ్యాపారులకు రూ.370 కోట్ల రుణ సౌకర్యం అందించామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. మొత్తం 9 లక్షల 5 వేల మంది చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణం ఇచ్చినట్లు తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో చిరు వ్యాపారాలు చేసుకునేవారికి లబ్ధి చేకూరుతుందన్నారు. అర్హత ఉన్నవారందరికీ సాయం చేస్తున్నామని, సకాలంలో వడ్డీ చెల్లించేవారికి తిరిగి వారి ఖాతాల్లోకే జమ చేస్తామని సీఎం జగన్ తెలిపారు. నిరుపేద చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతివృత్తుల వారిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఏటా జగనన్న తోడు పథకం కింద వడ్డీ లేకుండా (సున్నా వడ్డీ) రూ.10 వేలు చొప్పున రుణాన్ని ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది నవంబర్ 25న ఈ పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా 5.35 లక్షల మంది లబ్ధిదారులకు సున్నా వడ్డీకే రూ.10 వేల చొప్పున రుణాలను అందించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అందించిన 3.70 లక్షల మందిని కూడా కలిపితే మొత్తం 9.05 లక్షల మంది లబ్ధిదారులకు రూ.905 కోట్లను ఇచ్చారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: PMAY: ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ లేఖ -
9.05 లక్షల మందికి జగనన్న తోడు
సాక్షి, అమరావతి: జగనన్న తోడు పథకం కింద మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 3.70 లక్షల మంది చిరు వ్యాపారుల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున రూ.370 కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. నిరుపేద చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతివృత్తుల వారిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఏటా జగనన్న తోడు పథకం కింద వడ్డీ లేకుండా (సున్నా వడ్డీ) రూ.10 వేలు చొప్పున రుణాన్ని ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది నవంబర్ 25న ఈ పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా 5.35 లక్షల మంది లబ్ధిదారులకు సున్నా వడ్డీకే రూ.10 వేల చొప్పున రుణాలను అందించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇస్తున్న 3.70 లక్షల మందిని కూడా కలిపితే మొత్తం 9.05 లక్షల మంది లబ్ధిదారులకు రూ.905 కోట్లను ఇచ్చినట్లు అవుతుంది. కమర్షియల్ బ్యాంకులు ముందుకు రాకపోయినా.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చిరు వ్యాపారాలు చేసుకునే వారిని ప్రభుత్వమే వలంటీర్ల ద్వారా గుర్తించింది. వలంటీర్లు 9,05,630 మందిని గుర్తించగా.. వీరిలో ఇప్పటికే 5,35,172 మందికి రుణాలు అందించారు. కరోనా కారణంగా మారిన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో పలు వాణిజ్య బ్యాంకులు పరిమిత సంఖ్యలోనే రుణాలు ఇస్తున్నాయి. దీంతో ప్రస్తుతం రెండో విడతలో రాష్ట్ర సహకార బ్యాంక్ (ఆప్కాబ్), స్త్రీనిధి సహకార సమాఖ్య ద్వారా రుణాలు అందజేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ విడతలో 3,70,458 మందికి రుణాలు ఇస్తుండగా.. ఇందులో అత్యధికంగా స్త్రీనిధి ద్వారానే 2.81 లక్షల మందికి రుణమిస్తున్నారు. మరో 75 వేల మందికి ఆప్కాబ్ రుణం అందిస్తుండగా.. కమర్షియల్ బ్యాంకులు కేవలం 14 వేల మందికే రుణమిస్తున్నాయని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కమిషనర్ ఎన్.భరత్ గుప్తా తెలిపారు. ఈ జాబితాలో పేరు లేని వారు కంగారుపడాల్సిన అవసరం లేదని, వలంటీర్‌ను సంప్రదించినా లేక గ్రామ సచివాలయంలో దరఖాస్తు అందజేసినా.. మూడు నెలల్లో అర్హులకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తామన్నారు. చిరు వ్యాపారులను ఆదుకోవడమే లక్ష్యం పుట్‌పాత్‌లు, వీధుల్లో తోపుడు బండ్లు, గంపలు, బుట్టల్లో కూరగాయలు, పండ్లు, ఇతర వస్తువులు అమ్ముకునేవారితోపాటు రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహించుకునేవారు, సంప్రదాయ చేతివృత్తుల కళాకారులు, ఇత్తడి పనిచేసేవాళ్లు, బొబ్బిలి వీణ, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, లేస్ వర్క్స్, కలంకారీ, తోలుబొమ్మల తయారీ, కుమ్మరి తదితర వృత్తులపై ఆధారపడి జీవించేవారికి ప్రభుత్వం జగనన్న తోడు కింద సున్నా వడ్డీకే రుణాలు అందజేస్తోంది. వీరిలో అత్యధికులు తమ వ్యాపార పెట్టుబడి కోసం రూ.3 నుంచి రూ.10 వరకు రోజువారీ వడ్డీకి ప్రైవేటు వ్యాపారుల వద్ద అప్పు తెచ్చుకుంటున్నారు. తమ ఆదాయంలో అధిక మొత్తాన్ని వడ్డీ చెల్లింపులకే వెచ్చిస్తూ కుదేలవుతున్నారు. తన సుదీర్ఘ పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలను చూసి చలించిన సీఎం వైఎస్ జగన్ వారిని ఆదుకోవడం కోసం జగనన్న తోడు పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. దీని ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించి.. రుణంపై అయ్యే వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తోంది. -
2 Years Of YS Jagan Rule In AP: 86 శాతం ఇళ్లకు లబ్ధి
సాక్షి, అమరావతి: ఈ రెండేళ్ల పాలనలో రాష్ట్రంలో 86 శాతం ఇళ్లకు ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి కలిగేలా అడుగులు ముందుకు వేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ రెండేళ్ల కాలంలో తమకు తోడుగా నిలబడినందుకు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. దేవుడి దయతో ఈ రెండేళ్ల పరిపాలన సంతృప్తికరంగా చేయగలిగామన్నారు. రాబోయే మూడు సంవత్సరాలు కూడా ప్రతి ఆశను నెరవేరుస్తూ ప్రజా శ్రేయస్సు, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పరిపాలనలో అడుగులు ముందుకు వేయడానికి బలం ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. రెండేళ్ల పాలన పూర్తి అయిన సందర్భంగా ఆదివారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ‘రెండో ఏటా.. ఇచ్చిన మాటకే పెద్ద పీట’ పేరుతో బుక్‌లెట్‌తో పాటు ‘మలి యేడు –జగనన్న తోడు, జగనన్న మేనిఫెస్టో 2019’ డాక్యుమెంట్‌ను పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెండేళ్లలోనే 94.5 శాతం హామీలు అమలు చేశామని తెలిపారు. ప్రజలకు ఏ కష్టమొచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇవ్వగలిగామని అన్నారు. ప్రతి ఒక్కరి సహకారంతోనే సుపరిపాలన అందించగలిగామని సీఎం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారంటే.. ఏకంగా రూ.1,31,725 కోట్లు ► ఇవాళ రూ.95,528 కోట్లు డీబీటీ ద్వారా.. అంటే నగదు బదిలీ ద్వారా, మరో రూ.36,197 కోట్లు పరోక్షంగా (నాన్ డీబీటీ) ప్రజలకు చేరాయి. అంటే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, జగనన్న తోడు, గోరుముద్ద, సంపూర్ణ పోషణ, విద్యా కానుక, ఇళ్ల స్థలాలు, వైఎస్సార్ కంటి వెలుగు వంటి పథకాల ద్వారా అందాయి. ► ఇవన్నీ లెక్క వేసుకుంటే మొత్తం రూ.1,31,725 కోట్లు నేరుగా ప్రజలకు అందాయి. వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చి.. లంచాలు, వివక్ష లేకుండా.. నేరుగా ప్రతి పథకం ప్రజల గడప వద్దకే వెళ్లి అందించగలిగాం. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ఇంత గొప్పగా చేయగలిగామని సగర్వంగా తెలియజేస్తున్నాను. ► గ్రామ సచివాలయ వ్యవస్థలో పని చేస్తున్న ప్రతి చెల్లెమ్మ, ప్రతి సోదరుడు.. గ్రామ వలంటీర్లుగా లాభాపేక్ష లేకుండా అంకిత భావంతో పని చేసిన ప్రతి చెల్లెమ్మ, ప్రతి తమ్ముడు మొదలు కలెక్టర్ల వరకు ప్రతి ఒక్కరి సహాయ, సహకారాలతో ఈ స్థాయిలో ఇంత మంచి చేయగలిగాము. ఇంటింటికీ లేఖ, డాక్యుమెంట్.. ► వలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికీ బుక్లెట్, డాక్యుమెంట్ (లేఖ) చేర్చడానికి ఇవాళ శ్రీకారం చుడుతున్నాం. ఒక డాక్యుమెంట్.. వారి పేరుతోనే అందజేస్తాం. ► ఇప్పుడు నా దగ్గర ఉన్న డాక్యుమెంట్.. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం వండ్రంగి గ్రామంలోని కంది ఆదిలక్ష్మి అక్కకు చెందినది. ఇందులో ఆ అక్కకు, ఆ కుటుంబానికి దేవుడి దయతో ఏయే పథకాలు ఇవ్వగలిగాము.. ఆ కుటుంబానికి ఎంత మంచి చేయగలిగామో చెబుతూ ఆ అక్కకు ఈ లేఖ రాస్తున్నాము. ► మనం ఎన్నికలప్పుడు ఈ మేనిఫెస్టోను ప్రకటించాము. దాన్నే భగవద్గీత, ఖురాన్, బైబిల్లా భావించి, అందులో చెప్పిన ప్రతి అంశాన్ని పూర్తి చేయడానికి ఈ రెండు సంవత్సరాలు అడుగులు ముందుకు వేశాం. ఎన్నికల సమయంలో కేవలం రెండు పేజీల మేనిఫెస్టో మాత్రమే ఇచ్చాము. అందులో చెప్పిన వాటిలో ఏమేం అమలు చేశాము? ఎన్నింటికి అడుగులు పడ్డాయి? ఏమేం ఇంకా అమలు కావాలి? ఆ వివరాలతో పాటు, మేనిఫెస్టోలో చెప్పనివి కూడా ఏమేం చేశామన్నది వివరిస్తూ ప్రతి ఇంటికి ఒక డాక్యుమెంట్, లేఖ పంపిస్తున్నాము. రెండేళ్లలో 94.5 శాతం హామీల అమలు ► మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో ఈ రెండు సంవత్సరాలలో దాదాపు 94.5 శాతం అమలు చేశాం. అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో దాదాపు అన్ని వాగ్దానాలు పూర్తి చేశామని, ఇంకా చేయాల్సిన వాటి కోసం అడుగులు వేస్తున్నామని గర్వంగా చెబుతున్నాము. ప్రతి అక్క చెల్లెమ్మకు రాసే లేఖతో ఈ డాక్యుమెంట్ కూడా పంపిస్తున్నాము. పథకాల్లో దాదాపు 66 శాతం అక్క చెల్లెమ్మలకు పోతున్నాయనే వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. ► రాబోయే మూడు సంవత్సరాలు కూడా ప్రతి ఆశను నెరవేరుస్తూ అడుగులు ముందుకు వేయడానికి తగిన బలం ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నాను. ► ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, (వైద్య ,ఆరోగ్య శాఖ) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని), కె.నారాయణ స్వామి (ఎక్సైజ్), అంజాద్ బాషా (మైనార్టీ వెల్ఫేర్), హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్) జీవీడీ కృష్ణమోహన్.. గ్రామ, వార్డు సచివాలయాల సలహాదారు ఆర్.ధనంజయ్‌రెడ్డి, ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యేలు జోగి రమేష్, విడదల రజని, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
జూన్ 8న జగనన్న తోడు పథకం అమలు
-
5.01 లక్షల మంది చిరు వ్యాపారులకు జగనన్న తోడు
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటి వరకు ‘జగనన్న తోడు’ పథకం కింద 5.01 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ.10వేల వరకు వడ్డీ లేని రుణాలు అందాయి. ఈ పథకాన్ని గత ఏడాది నవంబర్ 25న సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ పథకం పురోగతిపై ఆయన ఈ నెల 18వ తేదీన సమీక్ష నిర్వహించారు. సుమారు 5.82 లక్షల మంది చిరు వ్యాపారులకు బ్యాంకులు వడ్డీ లేని రుణాలను మంజూరు చేశాయి. ఇందులో 5.01 లక్షల మంది చిరు వ్యాపారులకు రుణాలను కూడా అందజేశారు. అర్హులైన మొత్తం 9.65 లక్షల మందికి దరఖాస్తులను బ్యాంకర్లకు పంపించారు. అర్హత ప్రమాణికంగా లబ్ధిదారులను గ్రామ, వార్డు వలంటీర్లు గుర్తించి వారి దరఖాస్తులను బ్యాంకులకు సమర్పించారు. అర్హులైన మిగతావారికి కూడా మార్చి నెలాఖరులోగా రుణాలను మంజూరు చేయిస్తామని గ్రామ, వార్డు సచివాలయాల ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. ఇటీవల సీఎం సమీక్ష సందర్భంగా మిగతా దరఖాస్తులకు కూడా బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలను మార్చి ఆఖరుకు మంజూరు చేయించాలని ఆదేశించారని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సంబంధిత బ్యాంకు బ్రాంచ్‌లను తరచూ జిల్లా అధికారులు సందర్శించి, బ్యాంకు అధికారులతో మాట్లాడి చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేసేలా చూస్తున్నామన్నారు.ప్రతివారం జేసీలతో సమీక్షిస్తున్నట్లు చెప్పారు. ప్రైవేట్ అప్పుల నుంచి ఉపశమనం ► అసలు చిరు వ్యాపారులు చెల్లిస్తే వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. వడ్డీ లేని రుణం కోసం గుర్తించిన చిరు వ్యాపారులకు గ్రామ, వార్డు సచివాలయ వలంటీర్లు గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తున్నారు. ► ఫుట్ పాత్లపై చిన్న చిన్న వస్తువులు అమ్ముకునే వారు, తోపుడు బండ్లపై కూరగాయలు అమ్ముకునే వారు, రహదారుల పక్కన తినుబండారాలు అమ్ముకునే వీరు, కలంకారీ పనులు, ఏటి కొప్పాక బొమ్మలు, మట్టి పాత్రలు, తోలుతో బొమ్మలు చేసే వారు, బొబ్బిలి వీణల తయారీదారులు వంటి సంప్రదాయ హస్తకళలపై ఆధారపడి జీవిస్తున్న వారికి ఈ పథకం కింద పది వేల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలను మంజూరు చేస్తున్నారు. ► ఇలాంటి చిరు వ్యాపారులు రోజు వారీగా ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల నుంచి ఎక్కువ వడ్డీకి పెట్టుబడి తీసుకోవడం వల్ల.. వారు రోజంతా పడిన శ్రమ, సంపాదనలో ఎక్కువ మొత్తం వడ్డీలు చెల్లించేందుకే పోతోంది. వీరి కష్టాన్ని స్వయంగా పాదయాత్రలో గమనించిన వైఎస్ జగన్ వారి కష్టాన్ని తీర్చేందుకు ఈ పథకం ప్రారంభించారు. రుణాలు మంజూరైన చిరు వ్యాపారుల వివరాలు -
అత్యధికులకు జీవనోపాధి
వైఎస్సార్ చేయూత కింద ఏర్పాటు చేస్తున్న రిటైల్ షాపులకు ప్రాముఖ్యత కల్పించడం చాలా అవసరం. ఈ పథకాలు ఏ మేరకు అమలవుతున్నాయో పరిశీలించాలి. మరింత పక్కాగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఒక అధ్యయనం చేయాలి. వీటి ద్వారా లబ్ధిదారుల జీవితాల్లో వచ్చిన మార్పులపై సమగ్ర అధ్యయనం చేసేందుకు అంతర్జాతీయ సంస్థల సహకారం తీసుకోవాలి. నాడు–నేడు ద్వారా జరుగుతున్న విద్యా, వైద్య రంగాల్లో మార్పులను కూడా ఈ తరహా సంస్థల దృష్టికి తీసుకెళ్లి అధ్యయనం చేయించాలి. ప్రతి రంగంలోనూ ఉన్నత స్థాయిలో ఉన్న కంపెనీలతో మాట్లాడి.. చేయూత లబ్ధిదారులకు వారిని అనుసంధానం చేయాలి. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చూడాలి. సాక్షి, అమరావతి: జగనన్న తోడు, వైఎస్సార్ చేయూత, ఆసరా, బీమా పథకాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంబంధిత అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ పథకాల లబ్ధిదారులకు రుణాల మంజూరు ప్రక్రియ మార్చి ఆఖరుకల్లా పూర్తి చేయాలని సూచించారు. వైఎస్సార్ చేయూత కింద చేపడుతున్న వివిధ ఉపాధి కల్పనా కార్యక్రమాలకు లబ్ధిదారుల ఎంపికపై మరింత దృష్టి సారించాలన్నారు. ఇటువంటి మంచి వ్యవస్థ ఎప్పటికీ కొనసాగాల్సిన అవసరం ఉందని, రెండో విడత చేయూత అందించే సమయానికి మరింత మంది ఈ కార్యక్రమంలోకి వచ్చేటట్లు చేయాలని చెప్పారు. వైఎస్సార్ చేయూత, ఆసరా, బీమా, జగనన్న తోడు పథకాలపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన మొత్తాన్ని వ్యక్తిగత అవసరాల కోసం ఖర్చు చేయడం కన్నా, ఉపాధి కల్పించే దిశగా పెట్టుబడి పెట్టేలా చేస్తే బాగుంటుందని.. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనివల్ల ఆ కుటుంబం జీవనోపాధి మెరుగు పడుతుందని, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఆయా పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు పాడి పశువులు, గొర్రెలు, మేకల పంపిణీతో పాటు, రిటైల్ స్టోర్స్ ఏర్పాటు అంశాలపై లోతుగా సమీక్షించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏం చెప్పారంటే.. ఫీడ్ నుంచి అమ్మకం దాకా.. ► వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్బీకే) పాల వెల్లువ, జీవక్రాంతి లబ్ధిదారులు ఆర్డర్ చేస్తే పశుదాణా, మందులు ఇచ్చే ఏర్పాటు చేయాలి. ఈ పథకం కింద సరఫరా చేస్తున్న పశువులకు యూనిక్ ఐడీ నంబర్‌తో పాటు జియో ట్యాగింగ్ చేయడానికి ఉన్న అవకాశాలను కూడా పరిశీలించాలి. ► లబ్ధిదారులు పశువులను అమ్మాలనుకుంటే కూడా ఆర్బీకేల ద్వారా అది జరిగేలా చూడాలి. పశువులకు సంబంధించిన పూర్తి హెల్త్ రికార్డు నిర్వహించాలి. విత్తనం నుంచి విక్రయం దాకా తరహాలో.. ఫీడ్ నుంచి అమ్మకం దాకా అన్నట్లు అన్ని సేవలు ఆర్బీకేలలో అందుబాటులో ఉండాలి. ► జగనన్న తోడు పథకానికి సంబంధించి అర్హత ఉన్న మిగిలిన లబ్ధిదారులకు కూడా బ్యాంకులు రుణాలు మంజూరు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. ► వైఎస్సార్ బీమా పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను మరింత వేగవంతం చేయాలి. బ్యాంకర్లతో సమన్వయం చేసుకుని అందరికీ లబ్ధి జరిగేలా చూడాలి. బీమా పథకం అమలుపై ప్రతి 15 రోజులకొకసారి సమావేశమై సమీక్షించాలి. 2022 మార్చికి ఏపీ అమూల్ ప్రాజెక్టు విస్తరణ ► ఏపీ అమూల్ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటి వరకు 3 జిల్లాల్లో (ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్ కడప) అమలవుతున్న ప్రాజెక్టును ఫిబ్రవరి మొదటి వారంలో గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు విస్తరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ► 2022 మార్చి 31 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా ఈ ప్రాజెక్టును విస్తరిస్తామని అధికారులు పేర్కొన్నారు. పాలసేకరణకు సంబంధించి డెయిరీల సామర్థ్యం, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాల గురించి వివరించారు. ► పశు సంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న వెటర్నరీ వైద్యుల పోస్టుల భర్తీ ప్రతిపాదనలకు, పశువుల చికిత్స కోసం కొత్త టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటుకు సీఎం జగన్ ఆమోదం తెలిపారు. పశువుల ఆస్పత్రులను కూడా నాడు–నేడు తరహాలో ఆధునికీకరించాలని సీఎం ఆదేశించారు. ► ఈ సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
జగమంత అండ
కరోనా వచ్చింది... ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. నెలకు లక్షలు ఖర్చు చేసే వాళ్లు కూడా బ్యాంకు అకౌంట్‌ను భయం భయంగా చూసుకోవాల్సి వచ్చింది. బ్రాండెడ్ షర్టు కోసం వేలాది రూపాయల ఖర్చు చేసే వాళ్లు వెయ్యి రూపాయల కోసం వెతుక్కోవాల్సి వచ్చింది. వెయ్యి రూపాయలు చేతిలో ఉంటే వడ్డీ వ్యాపారి ముందు చేయి చాచాల్సిన దుస్థితి ఉండదనే చిరు వ్యాపారి బతుకు దాదాపుగా ఛిద్రమై పోయింది. హోల్‌సేల్ మార్కెట్ నుంచి టోకున కూరగాయలు, పండ్లు కొనుక్కుని కాలనీల్లో అమ్ముకుని రోజుకింత అన్నం తినేవాళ్లకు బతకడమే కష్టమైపోయింది. వెయ్యి రూపాయలు అప్పు ఇచ్చే వడ్డీ వ్యాపారి పొద్దున తొమ్మిది వందలే ఇస్తాడు. సాయంత్రం వచ్చి వెయ్యి రూపాయలు దండుకుంటాడు. పదివేల అప్పు కోసం చెయ్యి చాస్తే ఇచ్చేది తొమ్మిది వేలే. పండ్లు అమ్మగా వచ్చిన రాబడిలో వడ్డీ వ్యాపారికి చెల్లించాల్సింది చెల్లించుకోగా మిగిలిన దాంతో రోజులు నెట్టుకురావాలి. అధిక వడ్డీ కోరల నుంచి చిరు వ్యాపారులను రక్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. చిరు వ్యాపా రుల రక్తాన్ని పీలుస్తున్న వడ్డీని మాఫీ చేయడానికి నిర్ణయించుకున్నారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ‘జగనన్న తోడు’ పథకంతో చిరు వ్యాపారుల జీవితాలలో చిరుదివ్వెలను వెలిగిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా 10 లక్షల పైగా దీపాలవి. రాష్ట్రవ్యాప్తంగా ‘జగనన్న తోడు’ లబ్ధిదారులు 10 లక్షలమంది. ప్రాణానికి హాయి ఇరవై ఏళ్లుగా దోశలు, పొంగనాలు వేసుకుని బతుకున్నాను. గత ఏడాది కరోనా వల్ల మొత్తం వ్యాపారం దెబ్బతినింది. ఐదు నెలలు వ్యాపారం లేదు. చేతిలో రూపాయి కూడా లేదు. కరోనా పోయిన తర్వాత వ్యాపారం మొదలుపెట్టే ధైర్యం లేకపోయింది. ‘జగనన్న తోడు’ ద్వారా బ్యాంకులో లోన్ తెచ్చుకుని మళ్లీ పని మొదలుపెట్టాను. వడ్డీ లేని రుణం కావడం వల్ల సులభంగా వాయిదాలు చెల్లించగలుగుతున్నా. నిమ్మళంగా వ్యాపారం చేసుకుంటున్నా. ప్రాణానికి హాయిగా ఉంది. – జి. తులశమ్మ, అనంతపురం పట్టణం నేను కలెక్టర్ ఆఫీసు ముందు బండి మీద పండ్లు అమ్ముకుంటాను. ఇంతకు ముందు మాకు బ్యాంకుల్లో రుణం వచ్చేది కాదు. బయట ఐదు రూపాయల వడ్డీకి తెచ్చుకునేదాన్ని. ఇప్పుడు పదివేల లోన్ వచ్చింది. బండికి చిన్న మరమ్మతులు చేయించుకున్నాను. పండ్లు ఎక్కువగా తెచ్చుకుంటున్నాను. – నారాయణమ్మ,అనంతపురం పట్టణం బ్యాంకు లోన్ వచ్చింది కరోనాతో దాదాపు నాలుగు నెలలపాటు టిఫిన్ సెంటర్ తెరవడం కష్టమైంది. తెరిచిన తర్వాత కూడా నెలపాటు వ్యాపారం మునుపటిలా జరగలేదు. టిఫిన్ సెంటర్ సరుకులు కొనడమే కష్టంగా మారింది. ‘జగనన్న తోడు’ పథకం ద్వారా పదివేల రూపాయల రుణం ఇవ్వడంతో మా ఇబ్బందులు తీరాయి. కావల్సినన్ని సరుకులు కొన్నాను. వ్యాపారం పుంజుకుంది. నెల నెలా కిస్తీలు కట్టి రుణాన్ని చెల్లిస్తాను, అవసరమైనప్పుడు మళ్లీ రుణం తీసుకుంటాను. – నోముల మరియమ్మ, గుంటూరు పట్టణం నేను సోడాలు అమ్ముకుని జీవిస్తున్నాను. గతంలో వ్యాపారానికి పెట్టుబడి కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద రుణాలు తీసుకునే వాడిని. ఎంత కష్టపడినా ఇంటి ఖర్చులు గడిచేవి కాదు. నా శ్రమంతా ఏమవుతోందని, ఇల్లు గడవాలంటే ఇంకా ఎంత కష్టపడాలో అని దిగులుగా ఉండేది. కేవలం వడ్డీలు చెల్లించడం కోసమే వ్యాపారం చేస్తున్నానా అని కూడా అనిపించేది. మరో పని తెలియదు. కుటుంబ పోషణకోసం వేరే మార్గం ఉండేది కాదు. ప్రస్తుతం ‘జగనన్న తోడు’ ద్వారా బ్యాంకులో వడ్డీలేని రుణాలు దక్కడంతో నా కష్టానికి ప్రతిఫలం దక్కుతోందనే సంతోషం కలుగుతోంది. ముఖ్యమంత్రి జగనన్నే నాకు, నా కుటుంబానికి తోడుగా ఉన్నారు. – ఎ. బాబులు, ఏలూరు పట్టణం ముప్పై ఏళ్లుగా పండ్ల వ్యాపారం చేసుకుంటున్నా. ప్రభుత్వ ప్రోత్సాహంతో మొదటి సారి అప్పు కోసం బ్యాంకు వైపు చూసాను. ఇలాంటి పథకాన్ని సద్వినియోగం చేసుకుని సకాలంలో వాయిదాలు చెల్లిస్తాను. తనఖా లేకుండా వడ్డీ ఇచ్చేలా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. మేము తిరిగి కట్టగలం అని నమ్ముతున్నాయి. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. – మాబు, అనంతపురం పట్టణం కష్టకాలంలో ఆదుకుంది కరోనా లాక్‌డౌన్‌తో నా పిండిమర వ్యాపారం దెబ్బతిని ఆర్థికంగా ఇబ్బందుల్లో పడ్డాను. బయట అధిక వడ్డీలతో అప్పు తీసుకోవాలంటే భయం. రోజంతా కష్టపడి అసలు, వడ్డీ చెల్లించిన తర్వాత చేతిలో ఏమీ మిగలదు. కష్టమంతా వడ్డీకి ధారపోయాల్సిందే. అటువంటి సమయంలో ‘జగనన్న తోడు’ పథకం ఆదుకుంది. – పి రమేష్, గుంటూరు పట్టణం -
ఇది పేదల మేలు కోరే ప్రభుత్వం
ఆర్థిక వ్యవస్థలోనే కాదు ప్రజల అవసరాలు తీర్చడంలోనూ చిరు వ్యాపారులు కీలకం. తోపుడు బండ్లపై తిను బండారాలు, కూరగాయలు, వస్తువులు అమ్మేవారు లేకపోతే చాలా మంది కడుపు నిండదు. వీరివల్లే అందరికీ ఇంటి ముంగిటే సరుకులు అందుతున్నాయి. వారు ఎండనకా, వాననకా, చలనకా వ్యాపారాలు సాగించకపోతే వారి బతుకుబండి మాత్రమే కాదు, మన ఆర్థిక వ్యవస్థ కూడా నడవదు. అందుకే వారికి తోడుగా నిలుస్తున్నాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చాలని ఆరాటపడే ప్రభుత్వం మనది. – సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బడ్డీ కొట్టు కల నెరవేరనుంది నేను బుట్టలో కూరగాయలు పెట్టుకుని అమ్ముకుంటున్నాను. బడ్డీకొట్టు పెట్టుకోవాలన్నది నా కల. అప్పు కోసం బ్యాంకుకు వెళితే రుణం ఇవ్వలేదు. ఇప్పుడు మీరు ఇప్పించే రూ.10 వేల రుణంతో బడ్డీ కొట్టు పెట్టుకుని నా కల నెరవేర్చుకుంటా. మా పాపకు అమ్మఒడి, మా అమ్మకు చేయూత, నా భర్తకు వాహనమిత్ర వల్ల లబ్ధి కలిగింది. – స్వాతి, పద్మనాభం, విశాఖ సాక్షి, అమరావతి: చిరు వ్యాపారులు, సంప్రదాయ వృత్తిదారులను ఆదుకునే గొప్ప కార్యక్రమం ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని, ఇది పేదల మేలు కోరే ప్రభుత్వమని సీఎం వైఎస్ జగన్ అన్నారు. చిరు వ్యాపారులకు రూ.పది వేల వరకు వడ్డీలేని రుణం అందించే ‘జగనన్న తోడు’ పథకాన్ని బుధవారం ఉదయం ఆయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్లో బటన్ నొక్కి ప్రారంభించారు. ‘నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలు స్వయంగా చూశాను. లక్షల సంఖ్యలో ఉన్న వారందరికి మంచి జరగాలని మనసారా కోరుకున్నాను. ఈరోజు దేవుడి దయ, మీ చల్లని ఆశీర్వాదంతో ఒక మంచి కార్యక్రమం చేయగలిగే అవకాశం వచ్చింది’ అని చెప్పారు. పల్లెల నుంచి పట్టణాల వరకు వీధుల్లో చిరు వ్యాపారాల ద్వారా జీవిస్తున్న లక్షలాది మంది అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ముల కోసం మనందరి ప్రభుత్వం ఇవాళ్టి నుంచి ‘జగనన్న తోడు’ ప్రారంభిస్తోందన్నారు. ‘వారిని చిరు వ్యాపారులు అనడం కంటే ఆత్మగౌరవంతో అమూల్యమైన సేవలందిస్తున్నారని చెప్పాలి. ప్రతి రోజు వారి జీవితాలు తెల్లవారుజామున 4 గంటలకే మొదలవుతాయి. బండ్లపై టిఫిన్లు అమ్మాలన్నా, కూరగాయలు తెచ్చుకుని విక్రయించుకోవాలన్నా తెల్లవారుజాము నుంచే వారి పని ప్రారంభమవుతుంది’ అని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం ఇంకా ఏమన్నారంటే.. ‘జగనన్న తోడు’ ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన కళాకృతులను పరిశీలిస్తున్న సీఎం జగన్ అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ► వారు చిరు వ్యాపారులు కాబట్టి, ఆదాయం అంతంత మాత్రమే. కానీ శ్రమ మాత్రం చాలా ఉంటుంది. అసంఘటిత రంగంలో పని చేస్తున్న వారు కావడం వల్ల బ్యాంకుల నుంచి రుణాలు అందవు. అందువల్ల వారు రూ.3, రూ.4 నుంచి రూ.10 వరకు వడ్డీతో ప్రైవేట్ వ్యాపారుల వద్ద అప్పు తెచ్చుకుని వ్యాపారం చేసుకుంటున్నారు. ► వారంతా స్వయం ఉపాధి పొందడమే కాకుండా, మరి కొందరికి కూడా ఉపాధి కల్పిస్తున్నారు. వస్తువులు తెచ్చుకునేటప్పుడు ఆటోల వారికి, సరుకులు దించే కూలీలకు కూడా పని కల్పిస్తున్నారు. అలా వారు మన సమాజానికి మేలు చేస్తున్న మహానుభావులు. గతానికి, ఇప్పటికి తేడా చూస్తే.. ► గతంలో వారికి తోడుగా ఎవరూ నిలబడలేదు. ఇవాళ గ్రామ, వార్డు సచివాలయాల వలంటీర్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లు తోడుగా నిలుస్తున్నారు. దరఖాస్తు తీసుకోవడం మొదలు అన్ని రకాల సేవలందిస్తున్నారు. సచివాలయాల్లోని సంక్షేమ సహాయకులు ఎంతో సేవ చేస్తున్నారు. ► వారి దరఖాస్తులు పంపడంతో పాటు, జిల్లా అధికారులతో, బ్యాంకర్లతో మాట్లాడుతున్నారు. పూర్తి పారదర్శకంగా పని చేస్తున్నారు. వారి తరఫున నిలబడి, రుణాలపై ప్రభుత్వమే వడ్డీ కడుతుందనే నమ్మకం కలిగిస్తున్నారు. బ్యాంకర్ల సమన్వయంతో చిరు వ్యాపారులకు ఇప్పటికే స్మార్ట్ కార్డులు జారీ చేశాం. ► ఒక అన్నగా, తమ్ముడిగా అండగా ఉండి చేయూత ఇవ్వాలని, వారి జీవితాల్లో మార్పు తేవాలని ఎప్పుడూ అనుకునే వాణ్ని. ఇవాళ ఆ పని చేస్తున్నాను. జగనన్న తోడు అనే పథకం ద్వారా వారికి తోడుగా నిలవగలుగుతున్నాను. వడ్డీ భారం ప్రభుత్వానిదే ► సుమారు 10 లక్షల మందికి దాదాపు రూ.1,000 కోట్ల రుణాలిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం ఏటా రూ.60 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు వడ్డీ చెల్లిస్తుంది. దాన్ని పదేళ్లకు తీసుకుంటే రూ.1,000 కోట్లు అవుతుంది. ► అలా వారి జీవితాలు బాగు చేయడం కోసం ప్రభుత్వం బ్యాంకర్లతో కలిసి ఈ పథకం అమలు చేస్తోంది. విప్లవాత్మక మార్పులతో వారందరికి తోడుగా నిలుస్తోంది. వారం నుంచి 10 రోజుల్లో బ్యాంకులు 10 లక్షల మంది ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ చేస్తాయి. ► చిరు వ్యాపారులతో పాటు, కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక, బొబ్బిలి వీణ, ఇత్తడి పాత్రల తయారీదారులు, కలంకారీ పనులు చేసే వారికి కూడా రూ.10 వేల వరకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాం. వీరి తరఫున వడ్డీని ప్రభుత్వమే భరిస్తుంది. ప్రతి మూడు నెలలకు వడ్డీ జమ ► వారంతా గుర్తింపు కార్డులు తీసుకుని, రుణాలను ఏడాదిలోగా తిరిగి చెల్లిస్తే, మన ప్రభుత్వం ఆ వడ్డీని ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తుంది. స్వయం సహాయక బృందాలు, పొదుపు సంఘాల లాగే ఇవాళ్టి నుంచి చిరు వ్యాపారులు, సంప్రదాయ వృత్తిదారులకు కూడా అండగా నిలబడి వడ్డీలేని రుణాలు ఇస్తాం. ► అర్హులెవరైనా ఇంకా మిగిలిపోతే, వెంటనే సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోండి. వెరిఫికేషన్ పూర్తి కాగానే నెల, రెండు నెలల్లో వారికీ పథకం అమలు చేస్తాం. అందువల్ల ఇప్పుడు రుణం రాని వారెవ్వరూ ఆందోళన చెందవద్దు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే 1902 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయండి. చిరు వ్యాపారం చేసుకుంటున్న దాదాపు 10 లక్షల మంది అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములకు ఇంకా మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నాను. ► కార్యక్రమంలో మంత్రులు ఎం.శంకర నారాయణ, కొడాలి నాని, ఆదిమూలపు సురేష్ తదితరులు పాల్గొన్నారు. మాట చెబితే అమలు చేసే ప్రభుత్వం మనది మాట చెబితే తప్పనిసరిగా అమలు చేసే ప్రభుత్వం. చంద్రబాబు 100 పేజీల మేనిఫెస్టోలో 600కు పైగా అబద్ధాలు చెప్పారు. మన సీఎం జగన్ మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించి అమలు చేస్తున్నారు. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి అర్హులందరికీ ప్రయోజనం చేకూర్చాం ఈ పథకం ద్వారా 10 లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అయితే ఎంత మంది దరఖాస్తు చేసుకున్నా, అర్హత ఉన్న వారందరికీ రుణం అందేలా చూస్తాం. – బొత్స సత్యనారాయణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఈ మేలు మరువలేం కరోనా కష్ట కాలంలో రూ.వందకు నెలకు రూ.10 వడ్డీ ఇస్తామంటేగానీ రుణం దొరకని పరిస్థితి. వ్యాపారం జరిగినా, జరగకపోయినా వాళ్లకి వడ్డీ డబ్బు ఇవ్వాల్సిందే. అలాంటి సమయంలో మీరు జగనన్న తోడు పథకం ప్రవేశపెట్టి మాకు వడ్డీ లేని రుణం ఇచ్చి చాలా సహాయం చేస్తున్నారు. మీ మేలు మరువలేం. – శ్యామల, కలంకారీ నిపుణురాలు, శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లా మీగురించి గర్వంగా చెప్పుకుంటున్నాం నేను మసాల దినుసుల వ్యాపారం చేస్తుంటాను. నా పుట్టింటి నుంచి నా జగనన్నే వచ్చి నన్ను ముందుకు నడిపిస్తున్నాడని మీ గురించి ప్రతిరోజూ చాలా గర్వంగా చెప్పుకుంటున్నా. కడుపులో కన్ను కూడా తెరవని బిడ్డ మొదలు.. వృద్ధాప్యంలో ఉన్న అవ్వా తాతల వరకు మీ నుంచి అందని పథకం లేదు.. అందుకోని గడపా లేదు. ఇప్పుడు నాకు జగనన్న తోడు కూడా అందింది. మా రాష్ట్రానికి మీరు సీఎం అయినందుకు చాలా గర్వంగా ఉంది. – జి.సత్య, వలసపాకుల, తూర్పుగోదావరి ష్యూరిటీ లేకుండా అప్పు ఇచ్చారు నేను రెండేళ్లుగా అగరుబత్తీలు తయారు చేస్తున్నాను. గతంలో బ్యాంకులో అప్పు కోసం వెళితే ష్యూరిటీ అడిగారు. ఈ రోజు మా జగనన్న మంచి మనసు వల్ల ష్యూరిటీ లేకుండానే అప్పు ఇచ్చారు. మీరే మమ్నల్ని నడిపిస్తున్నారు. వాహనమిత్ర, విద్యాదీవెన పథకాల వల్ల మాకు లబ్ధి కలిగింది. మేమున్నంత వరకు మీరే సీఎంగా ఉండాలి. – మధులత, అనంతసాగర్ కాలనీ, అనంతపురం జిల్లా -
జగనన్న తోడు పథకం ప్రారంభం
-
పదేళ్లలో రూ. వెయ్యి కోట్లు చెల్లిస్తాం : సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో పథకానికి శ్రీకారం చుట్టారు. చిరు వ్యాపారులను ఆదుకునేందుకు ‘జగనన్న తోడు’ పథకాన్ని ప్రారంభించారు. సీఎం వైఎస్ జగన్ బుధవారం తన క్యాంప్ కార్యాలయం నుంచి 9.05 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ.905 కోట్ల మేరకు వడ్డీలేని రుణాలను ఆన్లైన్లో బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, శంకర్‌నారాయణ, ఆదిమూలపు సురేష్ సహా ఇతరు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈరోజు గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని హర్షం వ్యక్తం చేశారు. పలెల్లో, పట్టణాల్లో, వీధివీధికీ చిన్న చిన్న విక్రయ సేవలు అందిస్తున్న వారి కోసమే జగనన్న తోడు పథకం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ‘‘పాదయాత్రలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అవస్థలు పడుతున్నవారిని దగ్గరగా గమనించాను. టిఫిన్ అమ్మకునేవారు, కూరగాయలు అమ్ముకునేవారు తెల్లవారుజామున 4 గంటలకే సేవలు అందిస్తారు. ఎండకు, వానకు, చలికి తట్టుకుని కూరగాయలు, పూలు అమ్మేవాళ్లు... ఆత్మగౌరవంతో అమూల్యమైన సేవలు అందిస్తన్నవారికి ఈ స్కీం. మోపెడ్లపై దుస్తులు, సామాన్లు అమ్ముకునేవారు గానీ, బండ్లపై టిఫిన్లు అమ్ముకునేవారి సేవలు లేకపోతే అనేకమందికి గ్రామాల్లో, పట్టణాల్లో కడుపునిండని పరిస్థితి ఉంటుంది. ఇంటిముందుకే వస్తువులు, సరుకులు వచ్చే పరిస్థితి ఉండదు. వారి బతుకు బండే కాదు, మన ఆర్థిక వ్యవస్థకూడా నడవదు. అందుకే వీరిని మహనీయులుగా చూడాలి. పోటీ ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద లాభాలు ఉండవు. శ్రమ మాత్రం విపరీతంగా ఉంటుంది. ఈ వ్యాపారాలకు లోన్లు దొరక్క పెద్ద పెద్ద వడ్డీలకు వ్యాపారాలు చేసుకునే పరిస్థితి. వీరంతా స్వయం ఉపాధి పొందేవాళ్లే. అంతేకాదు వీలైతే ఒకరికో, ఇద్దరికో ఉపాధి కల్పిస్తారు. వస్తువులు, సరుకులు తెచ్చుకునే క్రమంలో ఆటోలు లాంటి వాటికి, కూలీలకు పని కల్పిస్తారు. పరోక్షంగా ఎంతోమందికి ఉపాధి చూపిస్తున్నారు. అసంఘటిత రంగంలో వీరు పనిచేస్తున్నారు కాబట్టి, బ్యాంకులనుంచి కూడా రుణాలు అందే పరిస్థితి లేదు. పెట్టుబడికి డబ్బులు కావాలి అంటే వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి. తక్కువ వడ్డీకి పెట్టుబడి దొరికే పరిస్థితి కూడా లేదు. పెట్టుబడికి 3,4,5, కొన్ని సందర్భాల్లో 10 రూపాయల వడ్డీకి వ్యాపారాలు చేసుకునే పరిస్థితి. ఇలాంటి వారందరి జీవితాల్లో మార్పులు రావాలని పాదయాత్రలో వారిని చూసినప్పుడు అనుకున్నా. వీరికి అన్నగా, తమ్ముడిగా... చేయూత నివ్వాలని అనుకున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా జగనన్న తోడు కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. గతంలో వీరి చేయిపట్టుకుని నడిపించే పరిస్థితి లేదు. వార్డుల్లో , గ్రామాల సచివాలయాల్లో వాలంటీర్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లు వీరికి తోడుగా నిలబడుతున్నారు. లబ్ధిదారులను గుర్తించండం దగ్గర నుంచి, వీరి దరఖాస్తులు తీసుకోవడం దగ్గరనుంచి, బ్యాంకులతో మమేకం కావడం, రాష్ట్రస్థాయిలో బ్యాంకర్లతో మాట్లాడ్డం, వారిని ఒప్పించడం, పారదర్శక విధానంలో లబ్ధిదారులను గుర్తించాం. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని వడ్డీ చెల్లించే బాధ్యత తీసుకుంటూ... నమ్మకం కలిగింది. బ్యాంకులు దాదాపుగా 10 లక్షలమందికి రూ.1000 కోట్లు ఇస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం 60 నుంచి 100 కోట్ల రూపాయలు వడ్డీ కింద ఏడాదికి చెల్లిస్తుంది. పదేళ్లలో 1000 కోట్లు చెల్లిస్తుంది. అప్పులు పాలవుతారు, ఇబ్బందుల పాలు అవుతారని చిరు వ్యాపారులను అదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పు తీసుకొచ్చి వారికి తోడుగా నిలిచే కార్యక్రమం చేసింది. 10 లక్షల మందికి దాదాపుగా రూ.1000 కోట్ల రూపాయలను వడ్డీలేని రుణాలకింద బ్యాంకుల ద్వారా ఇప్పిస్తున్నాం. 7 నుంచి 10 రోజుల్లోనే దాదాపు 10లక్షలమంది బ్యాంకు ఖాతాల్లోకి ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున జమ అవుతుంది. కొండపల్లి, ఏటికొప్పాక, బొబ్బలి వీణ, బుడి ఇత్తడి, కళంకారీ, ఇతర హస్త కళలల్లో ఉన్నవారికి కూడా రూ.10వేల చొప్పున వడ్డీలేని రుణాలు ఇస్తుంది. గడువులోగా తిరిగి చెల్లిస్తే.. బ్యాంకులకు, చిన్న వ్యాపారాలకు, హస్తకళాకారులకు ప్రతి మూడు నెలలకోసారి లబ్ధిదారుల ఖాతాల్లో వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుంది. ఒక్కసారి చెల్లించిన వారు తిరిగి వడ్డీలేని రుణాలు పొందడానిక అర్హులు. ఏడాదిలోగా కట్టేసిన వారికి తిరిగి వడ్డీలేని రుణాలు వస్తాయి. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది: అర్హత ఉన్నవాళ్లందరికీ ‘‘లబ్ధిదారుల జాబితాను ఇదివరకే ప్రకటించాం. ఈ పథకంలో ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే.. ఎవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మీపేరు ఉందో, లేదో చూసుకోండి. లేకపోతే దరఖాస్తు చేసుకోండి, పరిశీలన చేసి నెలా, 2 నెలల్లోపే వీరందరికీ కూడా న్యాయం జరుగుతుంది. నెలరోజుల వరకూ ఈస్కీం పొడిగించబడుతుంది. ఎవ్వరికీ కూడా ఎగరగొట్టాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇవ్వాలన్నదే ఆలోచన’’ అని సీఎం జగన్ స్పష్టం చేశారు.