సాక్షి, తాడేపల్లి: ‘జగనన్న తోడు’ రేపు (సోమవారం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేతుల మీదుగా అమలు కానుంది. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి లబ్ధిదారుల అకౌంట్లలో సీఎం వైఎస్ జగన్ నగదు జమ చేయనున్నారు. చిరు వ్యాపారులకు రోజు వారీ పెట్టుబడి కోసం వడ్డీ లేని రుణాలు అందించనున్నారు. వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితికి చెక్ పెట్టనున్నారు. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కక్కరికీ రూ. 10 వేల రుణం అందించనుంది. మొత్తం 5.10 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ. 510 కోట్ల వడ్డీ లేని రుణం అందించనున్నారు.
వడ్డీ రీఎంబర్స్ మెంట్ రూ. 16.16 కోట్లు కలిపి మొత్తం 526 కోట్ల పంపిణీ జరగనుంది. ఇప్పటి వరకూ 14.16 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 1,416 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించిన విషయం తెలిసిందే. లబ్ధిదారుల తరపున ప్రభుత్వం బ్యాంక్‌కు చెల్లించిన వడ్డీ మొత్తం రూ.32.51 కోట్లు. నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సాంప్రదాయ చేతివృత్తుల వారికి ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment