AP CM YS Jagan Release Jagananna Thodu Benefits Updates - Sakshi
Sakshi News home page

పేదలకు మంచి జరిగే యజ్ఞం సత్ఫలితాలను ఇస్తోంది: సీఎం జగన్‌

Published Tue, Jul 18 2023 11:36 AM | Last Updated on Tue, Jul 18 2023 4:52 PM

AP CM YS Jagan Release Jagananna Thodu Benefits Updates - Sakshi

Updates

►జగనన్న తోడు నిధులు విడుదల చేసిన సీఎం జగన్‌

జగనన్న తోడు ఏడో విడత కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్‌ స్పీచ్‌

►దేశంలో ఎక్కడా ఇన్ని లక్షలమందికి ఈ రకంగా మంచి చేయడం లేదు
►ఇన్ని లక్షలమంది చిరువ్యాపారులకు ఎక్కడా ఇంత మేలు జరడం లేదు
►దేశం మొత్తం ఇస్తున్న రుణాలు కంటే ఆంధ్ర రాష్ట్రంలో లబ్ధిదారుల సంఖ్య అంతకన్నా ఎక్కువ ఉంది
►ఈ పథకాన్ని పగడ్బందీగా నడుపుతున్న బ్యాంకర్లు, సచివాలయాల వ్యవస్థ, మెప్మా.. తదితర శాఖలకు అభినందనలు
►పేదవాడికి మంచి జరిగించే యజ్ఞం సత్ఫలితాలను ఇస్తోంది
►ఇంతవరకూ 15.87 లక్షలమంది చిరువ్యాపారులకు మంచి జరిగింది
►హస్తకళాకారులకూ ఈ పథకం ద్వారా మేలు జరిగింది
►ఈవిడతలో 5,10,412 మందిలో 4.54లక్ష లమంది సకాలంలో రుణాలు చెల్లించి…, మళ్లీ రూ.10వేలు, ఆపైన రుణాలుగా అందుకుంటున్నారు
►సకాలానికి కట్టిన వారికి ఇచ్చే రుణాలు రూ.౧౦ వేల నుంచి రూ.13వేల వరకూ పెంచారు
►ఇంతవరకూ 15.87 లక్షలమంది చిరువ్యాపారులకు రూ. 2,955.79 కోట్ల రుణాలు ఇచ్చాం
►వీరిలో తిరిగి చెల్లించి.. మళ్లీ మళ్లీ రుణాలు పొందిన వారు దాదాపుగా 13.29 లక్షల మంది ఉన్నారు
►ఇప్పటివరకూ వీరితరఫున ప్రభుత్వం చెల్లించిన వడ్డీ రూ.74.69 కోట్ల
►చిరు వ్యాపారులు సమాజ సేవ చేస్తున్నారు
►ఒకరి మీద ఆధారపడకుండా… వారు జీవనోపాధిని వారు చూసుకుంటున్నార
►అవకాశం వస్తే మరో ఒకరిద్దరికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు
►అందుకనే వారికి తోడుగా నిలబడాలన్న ఆలోచన చేయాల్సి వచ్చింది
►చేతివృత్తుల వారికీ  పథకం వర్తిస్తోంది
►రూ.10వేల రుణంతో ఈ కార్యక్రమం మొదలైతే.., క్రమం తప్పకుండా చెల్లించేవారికి మరుసటి ఏడాది వేయి పెంచమని, ఆతర్వాత ఏడాది మరో వేయి పెంచమని, రూ.13వేల వరకూ ఇవ్వమని చెప్పాం
►పాదయాత్రలో స్వయంగా నేను కళ్లారా చూశాను.. చిరు వ్యాపారుల కష్టాలు చూశాను..వారిలో కలిసి మాట్లాడ్డం జరిగింది
►వేయి రూపాయలు రోజుకు రుణం ఇస్తే.. వంద కట్‌ చేసుకుని, సాయంత్రానికి మళ్లీ వేయి రూపాయలు తీసుకునే పరిస్థితులు ఉండేవి
►అలాంటి వారికి వ్యాపారాలు చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉండేది..పెట్టుబడి వారికి పుట్టేది కాదు 
►రూ.10ల వడ్డీకి కూడా రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఉండేవి
►ఈ పరిస్థితులన్నీ మార్చాలన్న ఉద్దేశంతో జగనన్న తోడు పథకం పుట్టింది
►జగనన్న తోడుద్వారా లబ్ధిపొందిన వారిలో 80శాతం అక్క చెల్లెమ్మలే
►లబ్ధిదారుల్లో 80 శాతం మంది నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలకు చెందిన వారే ఉన్నారు
►సామాజికంగా అట్టడుగున్న ఉన్న వారికి ఈపథకం ఉపయోగపడుతుంది
►ఈకార్యక్రమం ద్వారా మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను
►ఎవరికైనా ఈ పథకం వర్తించని పరిస్థితి ఉంటే.. వెంటనే సచివాలయ వ్యవస్థను సంప్రదించండి
►అక్కడున్న సిబ్బంది మీకు తోడుగా నిలుస్తారు
►వాలంటీర్లను కోరినా.. వారు దరఖాస్తు చేయడంలో మీకు తోడుగా నిలుస్తారు
►లేదా 1902 నంబర్‌కు ఫోన్‌ చేసినా.. పథకాన్ని మీకు అందుబాటులోకి తీసుకురావడానికి సహాయపడతారు
►ఏ ఒక్కరూ కూడా మిగిలిపోకూడదు, ప్రతి ఒక్కరికీ మంచి జరగాలనే ప్రభుత్వం తపన పడుతోంది

►రాష్ట్రవ్యాప్తంగా చిరువ్యాపారులకు చేయూతనందించడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన ‘జగనన్న తోడు’ ఏడో విడత కార్యక్రమం ప్రారంభం

►చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి రూ. 549.70 కోట్ల వడ్డీ లేని రుణాలు  
►గతంలో తీసుకున్న రుణాన్ని చెల్లించిన వారికి రూ. 11.03 కోట్ల వడ్డీ డబ్బు వారి ఖాతాల్లో జమ 

►ఈ కార్యక్రమం కింద చిరు వ్యాపారులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా తొలిసారి రూ. 10,000 రుణం అందజేయడంతో పాటు తీసుకున్న రుణాన్ని ప్రతి నెలా కిస్తీ రూపంలో సకాలంలో చెల్లించే వారికి ఆ రుణంపై అయ్యే వడ్డీ మొత్తం ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుంది. 

►వారికి మరింత రుణ సాయాన్ని కూడా అందిస్తుంది. కొత్త వారికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తోంది. ఈ పథకం ద్వారా లబ్ది పొందే వారిలో దాదాపు 85% మహిళలే కావడం గమనార్హం. 

ఇప్పటివరకు మొత్తం రూ. 2,955.79 కోట్ల రుణ సాయం 
► ఈ పథకం ద్వారా ఇప్పటికే ఆరు విడతలుగా చిరు వ్యాపారులకు ప్రభుత్వం రుణాలు అందజేసింది. ఇప్పుడు ఏడో విడతలో రుణ పంపిణీ చేయనుంది.
 
► ఒక విడత రుణం తీసుకొని తిరిగి చెల్లించిన వారికి వారి వడ్డీ మొత్తాన్ని ఎప్పటికప్పుడు ఆయా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లోనే ప్రభుత్వం నేరుగా జమ చేస్తోంది. వారికి తిరిగి ఇచ్చే రుణాన్ని పెంచి మళ్లీ కొత్త రుణాలు ఇప్పిస్తోంది. మొదటి విడతలో రూ.10 వేలు రుణం తీసుకొని నిర్ణీత కాలంలో చెల్లించిన వారికి రెండో విడత ఓ వెయ్యి పెంచి రూ. 11 వేలు, రెండో విడత రుణం కూడా చెల్లించిన వారికి మూడో విడతలో రూ. 12 వేలు.. ఇలా ప్రతి ఏటా పెంచుతూ రుణాలు అందజేస్తోంది. 

► ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 15,87,492 మంది ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందారు. వీరిలో 13,29,011 మంది పాత రుణం చెల్లించి రెండు మూడు సార్లు కొత్త రుణాలు పొందారు.  

► గత ఆరు విడతల్లో చిరు వ్యాపారులకు 29,16,504 రుణ ఖాతాల ద్వారా రూ. 2406.09 కోట్ల రుణాలను అందజేయగా.. ఏడో విడతలో అందజేసే రుణ సహాయంతో కలిపి మొత్తం రూ. 2,955.79 కోట్లు రుణ సహాయం పొందినట్టు అవుతుంది.  

► ఇప్పడు ఏడో విడతలో 5,10,412 మందికి ప్రభుత్వం రుణాలు అందజేస్తుండగా.. అందులో 4,54,267 మంది గతంలో ఒకటికంటే ఎక్కువ సార్లు రుణం పొంది తిరిగి చెల్లించిన వారు. ఈసారి కొత్తగా మరో 56,145 మందికి తొలిసారి ఈ పథకం ద్వారా ప్రభుత్వం రుణం అందజేస్తోంది. 

ఇప్పటివరకు రూ. 74.69 కోట్లు వడ్డీ డబ్బు జమ 
జగనన్న తోడు కార్యక్రమంలో రుణాలు తీసుకొని చెల్లించిన వారికి ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు వారి వడ్డీ మొత్తాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తోంది. 

► గత ఆరు నెలల్లో సకాలంలో పాత రుణాలు పూర్తిగా చెల్లించిన 5,03,729 మంది లబ్ధిదారులకు సీఎం వైఎస్‌ జగన్‌ బటన్‌ నొక్కి రూ.11,03,32,202 డీబీటీ విధానంలో వారి బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. 

► మంగళవారం అందజేసే వడ్డీతో కలిపి ఇప్పటి దాకా రూ. 74.69 కోట్ల మొత్తం వడ్డీ డబ్బులు 15.31 లక్షల మంది చిరువ్యాపారుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసినట్టు అవుతుందని అధికారులు వివరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement