
సాక్షి, విజయవాడ: రేపు(మంగళవారం) జరగాల్సిన ‘జగనన్న తోడు’ కార్యక్రమం బుధవారానికి వాయిదా వేసినట్లు గ్రామ, వార్డు సచివాలయ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మిలాద్-ఉన్-నబీ పండగ సెలవు కావడంతో ‘జగనన్న తోడు’ కార్యక్రమాన్ని వాయిదా వేశామన్నారు. ఎల్లుండి ఉదయం 11 గంటలకు లబ్ధిదారుల వడ్డీ సొమ్ము బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే కార్యక్రమం యథావిధిగా నిర్వహించడం జరుగుతుందని అజయ్‌జైన్ తెలిపారు.
చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త!
Comments
Please login to add a commentAdd a comment