Milad un Nabi
-
‘మిలాద్ ఉన్ నబి’: మహా ప్రవక్త జననం
అజ్ఞానతిమిరంలో తచ్చాడే మానవజాతికి జ్ఞానకాంతులతో సన్మార్గం చూపిన మహాత్ముడు ఇహలోకం వీడి దాదాపు 1450 సంవత్సరాలు అవుతున్నా ఆ మహనీయుని బోధలు మనవద్ద సురక్షితంగా ఉన్నాయి. వాటిని గనక మనం ఆచరించగలిగితే, నేడు సమాజం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలనూ అధిగమించి ఓ సుందర సత్సమాజాన్ని ఆవిష్కరించు కోవచ్చు. నేటి పరిస్థితుల నేపథ్యంలో ముహమ్మద్ ప్రవక్త(స) బోధనల పట్ల దృష్టి సారించవలసిన అవసరం ఎంతైనా ఉంది.క్రీ.శ. 571 ఏప్రిల్ నెల ఇరవయ్యోతేదీన అరేబియా దేశంలోని మక్కా నగరంలో ముహమ్మద్ ప్రవక్త(స) జన్మించారు. తల్లి దండ్రులు ఆమినా, అబ్దుల్లాహ్. ఈ మహనీయుడు జన్మించక ముందే తండ్రినీ, ఆరేళ్ళ ప్రాయంలో అమ్మనూ కోల్పోయారు. అనాథ అయిన ఆరేళ్ళ బాబును తాతయ్య అక్కున చేర్చుకున్నారు. నీతి, నిజాయితీ, సేవాతత్పరత, సత్యసంధత, విశ్వసనీయత ఆయనకు ఉగ్గుపాలతోనే అలవడ్డాయి. ఈ కారణంగానే ఆయన ప్రజల మనసులు చూరగొని ‘సాదిఖ్ ’గా, ‘అమీన్’ గా పిలవబడ్డారు. ముహమ్మద్కు చదవడం, రాయడం రాదు. అయినా ఆయన బోధలు యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. నాటి యావత్ అరేబియా ద్వీపకల్పమంతా ఆయన బోధనలకు ఆకర్షిత మైంది. ఫలితంగా సమస్త దుర్మార్గాలూ అంతమయ్యాయి. అసత్యం, అవినీతి, అక్రమాలు, దోపిడి, సారాయి, జూదం, వడ్డీ, అంటరానితనం, హత్యలు, అత్యాచారాలు అన్నీ సమసి పోయాయి. స్త్రీ అంగడి సరుకు అన్న భావన నుంచి, స్త్రీని గౌరవించనిదే దైవప్రసన్నత దుర్లభమన్న విశ్వాసం వేళ్ళూనుకుంది. అన్నిరకాల చెడులు, అసమానతలుఅంతమై పొయ్యాయి.బడుగులు, బలహీనుల హక్కులు పరిరక్షించబడ్డాయి. మానవ సమాజంలో అన్ని విధాలా శాంతి, సౌభాగ్యాలు పరిఢవిల్లాయి. అందుకే, ధర్మబోధకులందరిలో అత్యధికంగా సాఫల్యాన్ని పొందిన ప్రవక్త ‘ముహమ్మద్ ’ మాత్రమేనని ఎన్ సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా ఘనంగా కీర్తించింది. అంతేకాదు, ప్రారంభకాలపు మూల గ్రంథాలన్నీ ఆయన్ని విశ్వసనీయమైన వ్యక్తిగా, సత్యసంధుడైన మనిషిగా పరిచయం చేస్తాయని ప్రకటించింది. ప్రపంచ చరిత్రను ప్రభావితం చేసిన మహా పురుషులను గురించి మైకేల్ హెచ్.హార్ట్ ఒక పుస్తకం రాశారు. అందులో రాసిన వందమంది మహాపురుషుల జాబితాలో ‘ముహమ్మద్’ ప్రవక్త పేరు అందరికన్నా అగ్రస్థానంలో మనకు కనిపిస్తుంది. ఇంతమంది ఇన్నిరకాలుగా ప్రశంసించిన ఆమహనీయులు నేడు మనమధ్యలేరు.కాని ఆయన బోధనలు మనవద్ద సురక్షి తంగా ఉన్నాయి. మనం వాటిని ఆచరించ గలిగితే చాలు. ఎందుకంటే, నేటి మన సమాజం అన్నిరకాల అవలక్షణాలతో సతమతమవుతోంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మనం ఎంతప్రగతి సాధించినా, నైతిక, ధార్మిక, మానవీయ రంగాల్లోమాత్రం తిరోగమనంలోనే ఉన్నామన్నది నిజం. నేటి మన సమాజంలో ఏరంగమూ సంతృప్తికరంగాలేదు. ఎంత ప్రగతిపథంలో పయనిస్తున్నా, నేటికీ హక్కుల ఉల్లంఘన జరుగుతూనే ఉంది. స్త్రీలకు రక్షణలేని పరిస్థితి. అవినీతి, అక్రమాలకు కొదవే లేదు. మద్య΄ానం, జూదం, అశ్లీలం, అంటరానితనం, నిరక్షరాస్యత, ఆడసంతానం హత్యలు, అత్యాచారాలు, హత్యా రాజకీయాలు నిరాఘాటంగా సాగిపోతూనే ఉన్నాయి. ఇవన్నీ సమసి΄ోవాలంటే, సమాజం నుండి ఈ దుర్మార్గాలు అంతం కావాలంటే, నీతి, నిజాయితీలతో కూడిన, ఎలాంటి వివక్ష, తారతమ్యాలకు తావులేని, ఉన్నత మానవీయ విలువలతో నిండిన సుందర సౌభాగ్యవంతమైన సమాజం పునర్ నిర్మాణం కావాలంటే ఈ అమృత బోధనలను అధ్యయనం చేయాల్సిన, ఆచరించాల్సిన అవసరం ఉంది.(నేడు ప్రవక్త జయంతి ‘మిలాదున్నబీ’)– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
వైఎస్ జగన్ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు
గుంటూరు, సాక్షి: మిలాద్-ఉన్-నబీని నేడు దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. వైస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రతి ఒక్కరూ ఎదుటివారిపట్ల ప్రేమ, కరుణ కలిగి ఉండాలన్న మహ్మద్ ప్రవక్త బోధనలు మానవాళికి సదా అనుసరణీయం. నేడు ఆయన జన్మదిన సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు అని ఎక్స్ ఖాతాలో సందేశం ఉంచారాయన.ప్రతి ఒక్కరూ ఎదుటివారిపట్ల ప్రేమ, కరుణ కలిగి ఉండాలన్న మహ్మద్ ప్రవక్త బోధనలు మానవాళికి సదా అనుసరణీయం. నేడు ఆయన జన్మదినం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు.— YS Jagan Mohan Reddy (@ysjagan) September 16, 2024 -
ఆ ఘనత ముహమ్మద్ ప్రవక్తకే దక్కింది, మానవాళికి ఆదర్శమయ్యారు
మానవుల మార్గదర్శనం కోసం అల్లాహ్ అన్ని కాలాల్లో, అన్నిజాతుల్లో తన ప్రవక్తలను ప్రభవింప జేశాడు. గ్రంథాలనూ అవతరింప జేశాడు. హజ్రత్ ఆదం (అ) మొదలు, ముహమ్మద్ ప్రవక్త (స) వరకు అనేక మంది సందేశహరులు భూమండలంపై జన్మించారు. వారిలో చిట్టచివరి దైవప్రవక్త ముహమ్మద్ (స). ఆయనపై అవతరించిన చివరి గ్రంథం పవిత్ర ఖురాన్ . ఇక ప్రళయకాలం వరకూ ప్రవక్తలూ రారు, గ్రంథాలూ అవతరించవు. కనుక మానవులు ప్రళయకాలం వరకు ఆయనను అనుసరించవలసిందే. ముహమ్మద్ ప్రవక్త తనంత తాను ఏమీ బోధించలేదు. మానవుల సంక్షేమం కోసం, సాఫల్యం కోసం దైవం అవతరింపజేసిన హితోపదేశాలనే ఆయన మానవాళికి అందజేశారు. మనిషి పుట్టింది మొదలు మరణించే వరకు వివిధ దశల్లో, వివిధ రంగాల్లో ఎలా నడుచుకోవాలో, ఏది హితమో, ఏది హితం కాదో ఆచరణాత్మకంగా ఆయన విశద పరిచారు. అందుకే ఆయన ప్రపంచ మానవాళికి సంపూర్ణ మార్గదర్శిగా పరిచయమయ్యారు. ఈ నేపథ్యంలో ఆ మహనీయుని పవిత్ర జీవనానికి సంబంధించిన కొంత సమాచారాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. దాదాపు 1450 సంవత్సరాల క్రితం అరేబియా దేశంలోని మక్కానగరంలో ముహమ్మద్ ప్రవక్త (స) జన్మించారు. ఆమినా, అబ్దుల్లాహ్ తల్లిదండ్రులు. పుట్టకముందే తండ్రినీ, ఆరేళ్ళ ప్రాయంలో అమ్మనూ కోల్పోయారు. తాతయ్య ఆయన్ని పెంచారు. చిన్నతనం నుంచే అనేక సుగుణాలను పుణికి పుచ్చుకున్న ముహమ్మద్ ప్రవక్త, ‘అమీన్’గా, ‘సాదిఖ్’గా వినుతికెక్కారు. ఆయన గొప్ప మానవతావాది. సంస్కరణాశీలి. ఉద్యమనేత. అతి సాధారణ జీవితం గడిపిన సామ్రాజ్యాధినేత. జ్ఞానకిరణాలు ప్రసరింపజేసిన విప్లవజ్యోతి. ప్రాణశత్రువును సైతం క్షమించిన కారుణ్య కెరటం. సుమారు వెయ్యిన్నర సంవత్సరాలంటే.. ఆ సమాజం ఎంత అనాగరికంగా ఉండేదో నేటి ఆధునికులకు తెలియనిదేం కాదు. ప్రవక్త జననానికి ముందు నాటి సమాజంలో ‘కర్రగలవాడిదే బర్రె’ అన్నట్లుగా బలవంతుడు బలహీనుణ్ణి పీక్కుతినేవాడు. స్త్రీల హక్కుల విషయం కాదుగదా అసలు వారికంటూ ఓ వ్యక్తిత్వం ఉన్న విషయాన్నే వారు అంగీకరించే వారు కాదు. స్త్రీని విలాస వస్తువుగా, అంగడి సరుకుగా భావించేవారు. అలాంటి జాతిని అన్ని విధాలా సంస్కరించి, వారిని మంచి మనుషులుగా తీర్చిదిద్దిన ఘనత ముహమ్మద్ ప్రవక్తకే దక్కింది. నాటి సమాజంలో లేని దుర్మార్గమంటూ లేదు. అలాంటి ఆటవిక సమాజాన్ని నిరక్షరాస్యులు అయిన ముహమ్మద్ ప్రవక్త సమూలంగా సంస్కరించి, ఒక సత్సమాజంగా ఆవిష్కరించారు. ప్రవక్త బోధనల ప్రకారం... మానవులు తమ సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి. ఆయనకు మాత్రమే భయపడాలి. తోటిమానవుల్ని, సమాజాన్ని ప్రేమించాలి. స్త్రీలను గౌరవించాలి. ఎలాంటి స్థితిలోనూ నీతినీ, న్యాయాన్ని విస్మరించకూడదు. అనాథలను, వృద్ధులను ఆదరించాలి. తల్లిదండ్రులను సేవించాలి. వారిపట్ల విధేయత కలిగి ఉండాలి. బంధువులు, బాటసారులు, వితంతువులు, నిస్సహాయుల పట్ల తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి. సంఘంలో ఒక మనిషికి మరో మనిషిపై పడే విధ్యుక్త ధర్మాల పట్ల ఉపేక్ష వహించకూడదు. అన్యాయం, అధర్మ సంపాదనకు ఒడికట్టవద్దు. ధనాన్ని దుబారా చేయవద్దు. వ్యభిచారం దరిదాపులకు పోవద్దు. దానికై పురిగొలిపే అన్నిరకాల ప్రసార ప్రచార సాధనాలను రూపుమాపాలి. నిష్కారణంగా ఏ ప్రాణినీ చంపవద్దు. ప్రజల ధన, మాన, ప్రాణాలు సురక్షితంగా లేని సమాజం ప్రగతిని సాధించలేదు. సదా సత్యమే మాట్లాడాలి. చేసిన వాగ్దానాలు నెరవేర్చాలి. వాగ్దాన భంగానికి పాల్పడకూడదు. పలికే ప్రతి మాటకూ, చేసే ప్రతి పనికీ సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. వ్యాపార లావాదేవీల్లో, ఇచ్చి పుచ్చుకోవడాల్లో లెక్కాపత్రాలు, కొలతలు, తూనికలు చాలా ఖచ్చితంగా, నికార్సుగా ఉండాలి. స్వార్థాన్ని, అహాన్ని త్యజించాలి. తోటి మానవ సోదరులను తమకన్నా తక్కువగా చూడకూడదు. స్త్రీ జాతిని గౌరవించాలి. ఆమె మీకు జన్మనిచ్చిన తల్లి. ఆత్మీయత కురిపించే చెల్లి. ప్రేమించే ఇల్లాలు. అమ్మ పాదాల చెంత స్వర్గం ఉంది. వితంతువుల్ని చిన్నచూపు చూడకూడదు. సమాజంలో వారికి గౌరవప్రదమైన స్థానం దక్కాలి. శుభకార్యాల్లో వారినీ ఆహ్వానించాలి. వితంతువుల పునర్వివాహం వారి హక్కు. అజ్ఞానకాలపు దురాచారాలు, దుర్మార్గాలన్నింటినీ నేను అంతం చేస్తున్నాను. ఒక మనిషికి మరో మనిషిపై ఎలాంటి ఆధిక్యతా లేదు. మానవులంతా ఒక్కటే. విద్యార్జన స్త్రీలు, పురుషులు అందరి విధి. జ్ఞానం జీవితం.. అజ్ఞానం మరణం. కళ్ళున్న వాళ్ళు, గుడ్డివాళ్ళు సమానం కానట్లే, జ్ఞాన సంపన్నులు, జ్ఞాన విహీనులు సమానం కాలేరు. ప్రతి తల్లీదండ్రీ తమ సంతానానికి విద్య నేర్పాలి. భావితరాల సంక్షేమానికి ఇది చాలా అవసరం. అధికార దుర్వినియోగం చేయకూడదు. పరిపాలన అంటే కేవలం ప్రజాసేవ మాత్రమే... పాలకుడు అంటే ప్రజలకు సేవకుడు అని భావించాలి. ప్రతినిత్యం ప్రజలకు జవాబుదారుగా దైవానికి భయపడుతూ జీవించాలి. ఇక్కడ మనం పలికే ప్రతి మాటకు, చేసే ప్రతిపనికీ రేపు దైవం ముందు సమాధానం చెప్పుకోవాలన్న భావన కలిగి ఉండాలి. ఇలాంటి భావనలే మానవులను మంచివారుగా, నిజాయితీ పరులుగా, సౌశీల్యవంతులుగా తీర్చిదిద్దుతాయి. ఇటువంటి బాధ్యతాభావాన్ని, జవాబుదారీ తనాన్ని ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం ప్రజల మనసుల్లో నూరిపోసి, మానవీయ విలువలతో తులతూగే ఓ చక్కని సత్సమాజాన్ని ఆవిష్కరించారు. అందుకే ఆయన మానవాళికి ఆదర్శమయ్యారు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు వాయిదా
సాక్షి,హైదరాబాద్: పాతబస్తీ మతపెద్దల సంచలన నిర్ణయం తీసుకున్నారు. మిలాద్ ఉన్ నబీ ర్యాలీ వాయిదా వేశారు. ఈ నెల 28వ తేదీన గణేష్ నిమజ్జనం ఉన్నందునే.. ఈ నిర్ణయం తీసుకున్నారు. గణేశ్ నిమజ్జనం ఉన్నందున.. వచ్చే నెల ఒకటో(అక్టోబర్ 1వ) తేదీన మిలాద్ ఉన్ నబీ ర్యాలీ నిర్ణయించాలని మత పెద్దలు నిర్ణయించారు. -
అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
-
అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: మిలాద్-ఉన్-నబీ సభలో అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘మగాడికో న్యాయం? ఆడవాళ్లకో న్యాయమా?. ముస్లిం అబ్బాయ్ ఎవరితోనైనా తిరగొచ్చా? ముస్లిం అమ్మాయి మాత్రం అలా కనిపించకూడదా’’ అంటూ వ్యాఖ్యానించారు. ఇది 1969 కాదు. 2021.. కాలానికి తగ్గట్టుగా మారక తప్పదన్నారు. (చదవండి: హుజురాబాద్ ఉప ఎన్నిక: కండువా కప్పుకుంటే ఎంతిస్తావ్?) ‘‘బుర్కా వేసుకోని అమ్మాయితో ముస్లిం అబ్బాయి తిరిగితే పట్టించుకోరు. బుర్కా వేసుకున్న అమ్మాయి.. మరొకరితో కనిపిస్తే దాడి చేస్తారు. అమ్మాయి ఇష్టపూర్వకంగా వెళ్తుంటే ఆపడానికి మనం ఎవరం?’’ అంటూ అసదుద్దీన్ ప్రశ్నించారు. చదవండి: ఈటల.. జానారెడ్డి కంటే పెద్ద నాయకుడా? -
రేపు జరగాల్సిన ‘జగనన్న తోడు’ బుధవారానికి వాయిదా
సాక్షి, విజయవాడ: రేపు(మంగళవారం) జరగాల్సిన ‘జగనన్న తోడు’ కార్యక్రమం బుధవారానికి వాయిదా వేసినట్లు గ్రామ, వార్డు సచివాలయ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మిలాద్-ఉన్-నబీ పండగ సెలవు కావడంతో ‘జగనన్న తోడు’ కార్యక్రమాన్ని వాయిదా వేశామన్నారు. ఎల్లుండి ఉదయం 11 గంటలకు లబ్ధిదారుల వడ్డీ సొమ్ము బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే కార్యక్రమం యథావిధిగా నిర్వహించడం జరుగుతుందని అజయ్జైన్ తెలిపారు. చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త! -
సీఎం జగన్ మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజైన మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మహమ్మద్ ప్రవక్త బోధనలైన దాతృత్వం, కరుణ, ధార్మిక చింతన, సర్వ మానవ సమానత్వం, ఐకమత్యం మానవాళికి సదా అనుసరణీయమని పేర్కొన్నారు. భక్తి, శ్రద్ధలతో ఈ పండుగ జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. చదవండి: సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం -
హైదరాబాద్లో నేడు ట్రాఫిక్ మళ్లింపులు
సాక్షి, హైదరాబాద్: మిలాదున్నబి ర్యాలీ నేపథ్యంలో శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. ఈ మేరకు సిటీ ట్రాఫిక్ చీఫ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు పాతబస్తీ సహా కొన్ని చోట్ల ట్రాఫిక్ మళ్లిస్తారు. చార్మినార్, శాలిబండ, మోతిగల్లీ, మదీన, డబీర్పుర, అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్, చెత్తబజార్ ప్రాంతాల్లో ఇవి ఉండనున్నాయి. నేడు రక్తదాన శిబిరం మహ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా అవసరం ఉన్న వారికి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడటం పుణ్యకార్యమని మౌలానా హఫేజ్ అహెసన్ అల్ హుముమీ చేప్పారు. మిలాదున్నబిని పురస్కారించుకొని ఈ నెల30న రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గత పదేళ్ల నుంచి సంస్థ తరుపున ప్రతిఏటా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మిలాద్ ఉన్ నబీ సందడి మిలాద్ ఉన్ నబీని పురస్కరించుకుని గురువారం రాత్రి నగరంలోని పలు ప్రధాన ప్రాంతాలను ఆకుపచ్చ తోరణాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. చౌరస్తాల్లో రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరిచారు. నెలవంక పచ్చ జెండాల విక్రయాలు ఊపందుకున్నాయి. పాతబస్తీతో పాటు ముస్లింలు అధికసంఖ్యలో నివసించే ప్రాంతాలు కళకళలాడుతున్నాయి. -
సీఎం జగన్ మిలాద్–ఉన్–నబీ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి : మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రవక్త వారసులుగా ఆయన బోధనలను ఆచరించి ఆనందంగా, సానుకూల దృక్పథంతో జీవించాలని ఆకాక్షించారు. ‘మీ అందరికీ మిలాద్–ఉన్–నబీ శుభాకాంక్షలు’ అని సీఎం ట్విటర్లో పేర్కొన్నారు. మిలాద్–ఉన్–నబీ హ్యాష్టాగ్ను సీఎం జతచేశారు. గవర్నర్ మిలాద్–ఉన్–నబీ శుభాకాంక్షలు సాక్షి, హైదరాబాద్: మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముస్లిం సోదరులకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మిలాద్–ఉన్–నబీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రవక్త జీవితం మానవాళికి ప్రేమ, సోదరభావం, ధర్మంపై స్ఫూర్తి కలిగిస్తోందన్నారు. తోటివారికి విశ్వాసం, నమ్మకం, సంరక్షణ, కరుణతో సేవ చేసినప్పుడే ప్రవక్త లక్ష్యం నెరవేరుతుందని పేర్కొన్నారు. ఈ పర్వదినం మన మధ్య శాంతి, సౌహార్దాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ మిలాద్–ఉన్–నబీ శుభాకాంక్షలు సాక్షి, హైదరాబాద్: మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం సమాజానికి మిలాద్–ఉన్–నబీ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సమాజం ప్రవక్త బోధించిన ప్రేమ, శాంతి, సహనాన్ని ఆచరిస్తుందని, సామరస్యతతో జీవిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. May the true spirit of this auspicious occasion that marks the descent of prophet Mohammed, fill your heart with happiness and positivity. Wishing you all a very happy and blessed Eid-e-Milad-Un-Nabi.#EidMiladUnNabi — YS Jagan Mohan Reddy (@ysjagan) November 10, 2019 -
మిలాదునబి సెలవుల్లో మార్పు
సాక్షి, హైదరాబాద్ : ఈద్ మిలాదునబి సందర్భంగా ఇంతకు ముందు ప్రకటించిన సెలవులో తెలంగాణ ప్రభుత్వం మార్పు చేసింది. వచ్చే నెల 2వ తేదీన నెలవంక కనిపించే అవకాశం ఉన్నందున ఆ రోజునే సెలవు ప్రకటించాలని రాష్ట్ర వక్ఫ్ బోర్డు ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు స్పందించిన ప్రభుత్వం.. ముందుగా ప్రకటించిన ఒకటో తేదీ(శుక్రవారం) కాకుండా శనివారం 2వ తేదీన సాధారణ సెలవుగా ప్రకటించింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలకు శుక్రవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. -
ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు
చార్మినార్: హైదరాబాద్లో ముస్లింలు గురువారం మిలాద్ ఉన్ నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహ్మద్ ప్రవక్త పుట్టిన రోజును మిలాద్ ఉన్ నబీగా ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. జంటనగరాల్లో సందడి వాతావరణం కనిపించింది. పలు ప్రాంతాల్లో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలతో పాటు భారీ ర్యాలీలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిటీ పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. -
ముస్లింలకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ.. ముస్లిం సోదరులకు బుధవారం మిలాద్ ఉన్ నబీ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. మానవ జాతి పట్ల ప్రేమ, సోదరభావం చాటి చెప్పిన మహమ్మద్ ప్రవక్త జీవితం స్ఫూర్తిదాయకమని గవర్నర్ పేర్కొన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినం సమాజంలో శాంతి, సౌహార్థ్ర భావాన్ని పెంపొందిస్తుందన్నారు. సాటి మనుషుల పట్ల విశ్వాసం, ఆదరణ, కరుణ చూపితేనే ప్రవక్త ఆశయాలు నెరవేరుతాయన్నారు. ప్రవక్త్త అడుగు జాడల్లో నడిస్తే ఆదర్శ సమాజాన్ని నిర్మించవచ్చని పేర్కొన్నారు. -
పాతబస్తీలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు