
సాక్షి, అమరావతి : మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రవక్త వారసులుగా ఆయన బోధనలను ఆచరించి ఆనందంగా, సానుకూల దృక్పథంతో జీవించాలని ఆకాక్షించారు. ‘మీ అందరికీ మిలాద్–ఉన్–నబీ శుభాకాంక్షలు’ అని సీఎం ట్విటర్‌లో పేర్కొన్నారు. మిలాద్–ఉన్–నబీ హ్యాష్‌టాగ్‌ను సీఎం జతచేశారు.
గవర్నర్ మిలాద్–ఉన్–నబీ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముస్లిం సోదరులకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మిలాద్–ఉన్–నబీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రవక్త జీవితం మానవాళికి ప్రేమ, సోదరభావం, ధర్మంపై స్ఫూర్తి కలిగిస్తోందన్నారు. తోటివారికి విశ్వాసం, నమ్మకం, సంరక్షణ, కరుణతో సేవ చేసినప్పుడే ప్రవక్త లక్ష్యం నెరవేరుతుందని పేర్కొన్నారు. ఈ పర్వదినం మన మధ్య శాంతి, సౌహార్దాలను తీసుకురావాలని ఆకాంక్షించారు.
సీఎం కేసీఆర్ మిలాద్–ఉన్–నబీ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం సమాజానికి మిలాద్–ఉన్–నబీ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సమాజం ప్రవక్త బోధించిన ప్రేమ, శాంతి, సహనాన్ని ఆచరిస్తుందని, సామరస్యతతో జీవిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
May the true spirit of this auspicious occasion that marks the descent of prophet Mohammed, fill your heart with happiness and positivity.
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 10, 2019
Wishing you all a very happy and blessed Eid-e-Milad-Un-Nabi.#EidMiladUnNabi
Comments
Please login to add a commentAdd a comment