సాక్షి, హైదరాబాద్: మిలాద్-ఉన్-నబీ సభలో అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘మగాడికో న్యాయం? ఆడవాళ్లకో న్యాయమా?. ముస్లిం అబ్బాయ్ ఎవరితోనైనా తిరగొచ్చా? ముస్లిం అమ్మాయి మాత్రం అలా కనిపించకూడదా’’ అంటూ వ్యాఖ్యానించారు. ఇది 1969 కాదు. 2021.. కాలానికి తగ్గట్టుగా మారక తప్పదన్నారు. (చదవండి: హుజురాబాద్ ఉప ఎన్నిక: కండువా కప్పుకుంటే ఎంతిస్తావ్?)
‘‘బుర్కా వేసుకోని అమ్మాయితో ముస్లిం అబ్బాయి తిరిగితే పట్టించుకోరు. బుర్కా వేసుకున్న అమ్మాయి.. మరొకరితో కనిపిస్తే దాడి చేస్తారు. అమ్మాయి ఇష్టపూర్వకంగా వెళ్తుంటే ఆపడానికి మనం ఎవరం?’’ అంటూ అసదుద్దీన్ ప్రశ్నించారు.
చదవండి: ఈటల.. జానారెడ్డి కంటే పెద్ద నాయకుడా?
Comments
Please login to add a commentAdd a comment