సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ శనివారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌తో ప్రగతి భవన్‌లో సమావేశం కానున్నారు. కొత్త సచివాల యం నిర్మాణం కోసం పాత సచివాలయ భవనాలను కూల్చినప్పుడు అక్కడి రెండు మసీదులను సైతం కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మసీదుల పునర్నిర్మాణం విషయం చర్చించేందుకు ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, ఇతర ముస్లిం సంస్థల ప్రతినిధులతో కలిసి సీఎం కేసీఆర్‌ను కలుస్తున్నట్టు అసదుద్దీన్ ట్విట్టర్‌లో వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment