సాక్షి, హైదరాబాద్: మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ.. ముస్లిం సోదరులకు బుధవారం మిలాద్ ఉన్ నబీ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. మానవ జాతి పట్ల ప్రేమ, సోదరభావం చాటి చెప్పిన మహమ్మద్ ప్రవక్త జీవితం స్ఫూర్తిదాయకమని గవర్నర్ పేర్కొన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినం సమాజంలో శాంతి, సౌహార్థ్ర భావాన్ని పెంపొందిస్తుందన్నారు. సాటి మనుషుల పట్ల విశ్వాసం, ఆదరణ, కరుణ చూపితేనే ప్రవక్త ఆశయాలు నెరవేరుతాయన్నారు. ప్రవక్త్త అడుగు జాడల్లో నడిస్తే ఆదర్శ సమాజాన్ని నిర్మించవచ్చని పేర్కొన్నారు.
ముస్లింలకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు
Published Thu, Dec 24 2015 3:52 AM | Last Updated on Sun, Sep 3 2017 2:27 PM
Advertisement
Advertisement