Greetings
-
Eid al-Fitr: దేశ ప్రజలకు ప్రధాని మోదీ ఈద్ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: నేడు ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈద్ వేడుకలను(Eid celebrations) అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. వివిధ మసీదులలో సందడి వాతావరణం నెలకొంది. ముస్లిం సోదరులు ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుంటూ, వేడుకలలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ ఈద్ శుభాకాంక్షలు తెలిపారు.ప్రధాని మోదీ తన ‘ఎక్స్’ పోస్ట్‌లో ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ఈ పండుగ మన సమాజంలో ఆశ, సామరస్యం, దయ మొదలైన గుణాల స్ఫూర్తిని పెంపొందించాలి. మీరు చేసే అన్ని మంచి ప్రయత్నాలలో విజయం దక్కాలని కోరుకుంటున్నాను. ఈద్ ముబారక్’ అని రాశారు. పవిత్ర రంజాన్ మాసం(holy month of Ramadan) ముగిసిన అనంతరం ముస్లింలు ఈద్-ఉల్-ఫితర్ జరుపుకుంటారు. ఇది ముస్లింలకు ప్రత్యేకమైన రోజు. ఆదివారం దేశంలో ఈద్ చంద్రుడు కనిపించాడు. దీంతో సోమవారం ఈద్ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు.ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర ప్రజలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ వేళ ప్రతి ఒక్కరూ సమాజంలో సద్భావన, సామాజిక సామరస్యాన్ని మరింతగా బలోపేతం చేసేందుకు ప్రతిజ్ఞ చేయాలని అన్నారు. ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారని ముఖ్యమంత్రి కార్యాలయం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో తెలియజేసింది. ఢిల్లీతో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం ఆకాశంలో ఈద్-ఉల్-ఫితర్ చంద్రుడు కనిపించాడు. దీనితో పవిత్ర రంజాన్ మాసం ముగిసింది. అనంతరం నేడు (సోమవారం) దేశవ్యాప్తంగా ఈద్ జరుపుకుంటున్నారు.ఇది కూడా చదవండి: Eid al-Fitr: ఢిల్లీ నుంచి ముంబై వరకూ.. అంతటా ఈద్ సందడి -
మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క
-
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
-
రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు
-
ఫ్యాన్స్ కు తలైవా విషెస్.
-
సీఎం రేవంత్ రెడ్డి.. న్యూ ఇయర్ మెసేజ్
-
వైఎస్ జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు
-
మత్స్యకారులసంక్షేమానికి పెద్దపీట వేశాం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేశామని.. వారి స్థితిగతులను మెరుగుపరిచేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తు చేశారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని గంగపుత్రులందరికీ వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు గురువారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘మత్స్యకారుల సంక్షేమం కోసం మన ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. సముద్రంపై వేటకు వెళ్లే మత్స్యకారుల స్థితిగతులను మెరుగుపరచాలనే లక్ష్యంతో రూ.3,767.48 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. వేట నిషేధ సమయంలో దాదాపు 1,23,519 మత్స్యకార కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం చేశాం. సబ్సిడీపై డీజిల్ అందించాం. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని గంగపుత్రులందరికీ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. -
విషెస్ చెప్పి విమర్శలపాలైన పాక్ ప్రధాని
ఇస్లామాబాద్: ప్రజలకు సుద్దులు చెప్పే నేతలు తాము మాత్రం నిబంధనల్ని బేఖాతరు చేస్తూ వ్యవహరిస్తారన్న విమర్శలు నిజమని పాక్ ప్రధాని నిరూపించారు. వేర్పాటువాద శక్తులు విరివిగా ఉపయోగిస్తూ దేశంలో అస్థిరకతకు కారణమవుతున్నారని, అందుకు పరోక్షంగా కారణమైన ‘ఎక్స్’సోషల్ మీడియాపై నిషేధం విధిస్తున్నట్లు పాక్ ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. దానిని అమలుచేస్తోంది కూడా. అయితే ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయనాదం చేసిన ట్రంప్‌కు శుభాకాంక్షలు చెప్పేందుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ‘ఎక్స్’వేదికను వినియోగించుకోవడం విమర్శలకు తావిచ్చింది. స్వయంగా ప్రభుత్వాధినేతనే సొంత నిర్ణయాలకు విలువ ఇవ్వనప్పుడు ప్రజలేం పట్టించుకుంటారని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. -
మనల్ని నడిపించే మార్గదర్శి గురువు: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘విద్య, వివేకం, జ్ఞానం, దీక్ష, దక్షత అన్నీ నేర్పేది గురువు. జీవిత లక్ష్యాన్ని సాధించే దిశగా నడిపించే మార్గదర్శి గురువు. అనునిత్యం మనలో స్ఫూర్తి నింపే గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు ఘన నివాళిమాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి వైఎస్ జగన్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, పెనమలూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి పాల్గొన్నారు.విద్య, వివేకం, జ్ఞానం, దీక్ష, దక్షత అన్నీ నేర్పేది గురువు. జీవిత లక్ష్యాన్ని సాధించే దిశగా నడిపించే మార్గదర్శి గురువు. అనునిత్యం మనలో స్ఫూర్తి నింపే గురువులందరికీ ఉపాధ్యాయదినోత్సవ శుభాకాంక్షలు.#TeacherDay pic.twitter.com/M7LwkkTawA— YS Jagan Mohan Reddy (@ysjagan) September 5, 2024 -
రాష్ట్ర ప్రజలందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు: మాజీ సీఎం జగన్
-
రక్షాబంధన్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు
నేడు (ఆగస్టు 19) దేశవ్యాప్తంగా రక్షాబంధన్‌ను ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య ఉండే అనుబంధం విశిష్టమైనదని, దీనికి ప్రతీకగా రాఖీ జరుపుకుంటారని అన్నారు. మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి రక్షాబంధన్ ఒక ప్రతీక అని, ఈ పండుగను మతపరమైన సరిహద్దులను దాటి జరుపుకోవడం విశేషమన్నారు.మహిళలకు గౌరవం అందించడంతోపాటు, వారి హక్కులను పరిరక్షించాలనే సంకల్పాన్ని బలోపేతం చేయడానికి ఈ పండుగ దోహదపడుతుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీ మెట్రో రక్షాబంధన్ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈరోజు (సోమవారం) అదనంగా మెట్రో రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. ఇదేవిధంగా ఉత్తర ప్రదేశ్ రవాణా శాఖ కూడా అదనంగా బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. President Droupadi Murmu extends Raksha Bandhan greetingsRead @ANI Story | https://t.co/NeXkXdRoLO#PresidentMurmu #RakshaBandhan #DroupadiMurmu pic.twitter.com/OFYFbD2UXm— ANI Digital (@ani_digital) August 18, 2024 -
మహిళలకు వైఎస్ జగన్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు
-
రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
-
మొహర్రం సందర్భంగా ముస్లింలకు వైఎస్ జగన్ సందేశం..
-
ముస్లిం సోదరులకు ఏపీ సీఎం చంద్రబాబు బక్రీద్ శుభాకాంక్షలు
-
ముస్లింలకు మాజీ సీఎం వైఎస్ జగన్ బక్రీద్ శుభాకాంక్షలు
-
మోదీకి దేశాధినేతల శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: మూడోసారి అధికార పగ్గాలు స్వీకరిస్తున్న ప్రధాని మోదీకి పలు ప్రపంచ దేశాల అధినేతలు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రిటన్ ప్రధా ని రిషి సునాక్, జర్మనీ చాన్స్‌లర్ ఓలాఫ్ స్కోల్జ్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలానీ ఇలా 75 దేశాలకు చెందిన అగ్రనేతలు మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రజాపాలనలో మహిళల భాగస్వామ్యం పెరిగింది: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ప్రజా పాలనలో మహిళల ప్రాతినిథ్యం, భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అన్ని రంగాల్లో మహిళలను అభివృద్ధి, ప్రగతి పథంలో తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోందన్నారు. మహిళల సాధికారితతో పాటు ఆర్థిక స్వాలంబనకు మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, ఇంటింటికీ రూ.500 గ్యాస్ సిలిండర్ గ్యారంటీలను కొత్త ప్రభుత్వం అమల్లోకి తెచ్చామని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు, సమాన హక్కులు దక్కాలి. మహిళల అభ్యున్నతి లక్ష్యంగా రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల ద్వారా త్వరలోనే మరిన్ని వినూత్న కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. మహిళలకు అండగా ఉండేలా తమ ప్రభుత్వం మరిన్ని కొత్త పథకాలు అందుబాటులోకి తెస్తుందన్నారు. మహిళా సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం తప్పకుండా దేశమందరి దృష్టిని ఆకర్షిస్తుందనే నమ్మకం ఉందని సీఎం అన్నారు. ఇదీ చదవండి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఈ ఏడాది ప్రత్యేకత ఏంటి? -
దేశ ప్రజలకు రాష్ట్రపతి కొత్త ఏడాది శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సమసమాజ స్థాపనకు, దేశం సర్వతోముఖాభివృద్ధిని సాధించేందుకు పౌరులంతా ప్రతిజ్ఞచేయాలని ఆమె పిలుపునిచ్చారు. కొత్త ఆశలు, ఆకాంక్షల సాధన కోసం సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని ముందడుగువేయాలని ఆమె అభిలషించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఆదివారం ఒక ప్రకటన విడుదలచేసింది. ‘‘ కొత్త ఏడాదిలో దేశ పౌరులందరికీ సంతోషం, శాంతి, సౌభ్రాతృత్వాలు దక్కాలి. దేశ పురోగతికి మనందరం పాటుపడదాం. అభివృద్ధి భారత్ కోసం కొత్త తీర్మానాలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. నూతన సంవత్సరం సందర్భంగా దేశ, విదేశాల్లో నివసిస్తున్న భారతీయులందరికీ నా శుభాకాంక్షలు’’ అని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. -
క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దేశ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘క్రిస్మస్ను పురస్కరించుకుని ప్రజలు కరుణ, దయ నుంచి ప్రేరణ పొందాలి. క్రిస్మస్ పర్వదినం ప్రేమ, దయాగుణం విశిష్టతను మరోసారి మనకు గుర్తుచేస్తుంది. మానవాళికి నిస్వార్థంగా ఎలా సేవ చేసి తరించాలో ఈ పండుగ మనకు చాటి చెబుతుంది. సమాజంలో శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివిరియాలంటే మనం ఎలాంటి ఆదర్శమయ జీవితం గడపాలో ఏసు క్రీస్తు బోధనలు మనకు విడమరిచి చెబుతాయి. ఇంతటి పర్వదినాన తోటి పౌరులు, ముఖ్యంగా క్రైస్తవ సోదర, సోదరీమణులకు నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు’’ అని రాష్ట్రపతి ఆదివారం తన సందేశంలో పేర్కొన్నారు. -
ప్రజలకు సీఎం వైఎస్ జగన్ దీపావళి శుభాకాంక్షలు
-
Indian Air Force Day: ఐఏఎఫ్ అత్యుత్తమమైందిగా ఉండాలి
ప్రయాగ్‌రాజ్: ఎప్పటికప్పుడు కొత్తగా ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో భారత వైమానిక దళం(ఐఏఎఫ్) అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలని ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి పిలుపునిచ్చారు. దేశ ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించేందుకు, శత్రువులను దీటుగా ఎదుర్కొనేందుకు ఐఏఎఫ్ కట్టుబడి ఉంటుందని ఆయన నొక్కిచెప్పారు. ఎయిర్ ఫోర్స్‌డేను పురస్కరించుకుని ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఐఏఎఫ్ అవతరించి 2032 నాటికి 100 ఏళ్లు పూర్తవుతుందని చెబుతూ ఆయన ప్రపంచంలోనే అత్యుత్తమ వైమానిక దళాల్లో ఒకటిగా ఐఏఎఫ్ అవతరించాలని అన్నారు. వ్యూహాలను మెరుగుపరుచుకోవడం, సామర్థ్యాలను సమకూర్చుకోవడం వంటివి భవిష్యత్ యుద్ధాల్లో పైచేయి సాధించడంలో ఐఏఎఫ్‌కు ఎంతో కీలకమన్నారు. ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా ప్రధాని మోదీ యుద్ధ వీరులకు శుభాకాంక్షలు తెలిపారు. వారి నిరుపమాన సేవలు, త్యాగాల వల్లే మన గగనతలం సురక్షితంగా ఉందని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. -
రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం సీఎం జగన్ నిర్ణయాన్ని బలపరుద్దాం
సీతమ్మధార(విశాఖపట్నం): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దసరా నుంచి విశాఖ కేంద్రంగా పరిపాలన ప్రారంభించనున్న సందర్భంగా శుభాకాంక్షలు చెబుతున్నట్లు పరిపాలన వికేంద్రీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ హనుమంతు లజపతిరాయ్ అన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతంతో పాటు రాష్ట కుట్రంలోని అన్ని జిల్లాలూ అభివృద్ధి చెందాలని, ముఖ్యమంత్రికి అన్ని మతాల దేవుళ్లు ఆశీర్వాదాలు అందించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో విశాఖ వందనం పేరిట ప్రచార రథాన్ని ఏర్పాటు చేశారు. సంపత్ వినాయగర్ ఆలయం వద్ద శనివారం ప్రచార రథానికి పూజలు నిర్వహించి ప్రారంభించారు. అనంతరం కనకమహాలక్ష్మి ఆలయంలో పూజలు చేశారు. లజపతిరాయ్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలు తమ జెండా, అజెండాలను పక్కన పెట్టి రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సీఎం తీసుకున్న నిర్ణయాన్ని బలపర్చాలని విన్నవించారు. కార్యక్రమంలో మేయర్ గొలగాని హరివెంకటకుమారి, గాజువాక ఎమ్మెల్యే తిప్పలనాగిరెడ్డి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, నెడ్ క్యాప్ చైర్మన్ కేకే రాజు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, పార్టీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్, హ్యూమన్ రైట్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్రావు, ఏయూ ప్రొఫెసర్ షారోన్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఆధునిక తెలుగుభాషా వేత్తలలో అగ్రగణ్యుడు గిడుగు వెంకట రామమూర్తి గారు. తన ఉద్యమం ద్వారా తెలుగుభాషను సామాన్యుల దగ్గరకు చేర్చి.. వ్యవహారిక భాషను మాధ్యమంగా తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి. భాషా నైపుణ్యాలను వృద్ధిచేయడం ద్వారా అక్షరాస్యత పెంపు.. తద్వారా మానవాభివృద్ధికి విశేషంగా కృషిచేశారు’’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. గిడుగు వారి జన్మదినాన్ని పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు’’ అని సీఎం ట్వీటర్లో పేర్కొన్నారు. ఆధునిక తెలుగుభాషా వేత్తలలో అగ్రగణ్యుడు గిడుగు వెంకట రామమూర్తి గారు. తన ఉద్యమం ద్వారా తెలుగుభాషను సామాన్యుల దగ్గరకు చేర్చి, వ్యవహారిక భాషను మాధ్యమంగా తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి. భాషా నైపుణ్యాలను వృద్ధిచేయడం ద్వారా అక్షరాస్యత పెంపు, తద్వారా మానవాభివృద్ధికి విశేషంగా కృషిచేశారు.… pic.twitter.com/Ie0WoIsL0z — YS Jagan Mohan Reddy (@ysjagan) August 29, 2023 చదవండి: సీఎం జగన్ మానవత్వం.. చిన్నారి వైద్యానికి రూ.41.5 లక్షల సాయం -
చంద్రయాన్-3 ప్రయోగం.. సీఎం వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: ప్రతిష్టాత్మక చంద్రయాన్–3 మిషన్‌ను చంద్రుని దక్షిణ ధ్రువంపైకి పంపేందుకు సర్వం సిద్దమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) రెండో ప్రయోగవేదిక నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు ఇస్రో బాహుబలి రాకెట్‌గా పేరొందిన ఎల్వీఎం3–ఎం4 ఉపగ్రహ వాహక నౌక ద్వారా ఈ ప్రయోగం జరగనుంది. ఈ సందర్భంగా చంద్రయాన్-3 రాకెట్ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. జాబిల్లిపై ఇప్పటిదాకా ఎవరూ అడుగు పెట్టని దక్షిణ దిశను ముద్దాడాలన్న చిరకాల లక్ష్యాన్ని సాధించేందుకు ఇస్రో మరోసారి సన్నద్ధమవుతోంది. చదవండి: ఆవలి దిక్కున... జాబిలి చిక్కేనా! చంద్రయాన్–3 మిషన్‌ను నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి మోసుకెళ్లేందుకు ఇస్రో గెలుపు గుర్రం, బాహుబలి రాకెట్ ఎల్వీఎం–3 సిద్ధమవుతోంది. ఈ మిషన్‌ను దిగ్విజయంగా పూర్తి చేసి నాలుగేళ్ల నాటి చంద్రయాన్–2 వైఫల్యం తాలూకు చేదు జ్ఞాపకాలను చెరిపేయాలని ఇస్రో పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో భారత్‌తో పాటు ప్రపంచ దేశాలన్నింటి కళ్లూ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రయోగంపైనే నిలిచాయి. చదవండి: కూకట్పల్లి: మామకు మనమూ చుట్టాలమే My best wishes to the entire team at @isro on the scheduled launch of Chandrayaan-3 from Sriharikota in our very own #AndhraPradesh today. — YS Jagan Mohan Reddy (@ysjagan) July 14, 2023 -
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి శుభాకాంక్షలు
-
రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
-
రెండు పదాలతోనే ట్వీట్.. అభిమానుల్లో అంతులేని సంతోషం
టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా జట్టుకు దూరమై ఐదు నెలలు కావొస్తుంది. గతేడాది ఆసియా కప్‌లో భాగంగా మోకాలి గాయంతో జడ్డూ టీమిండియాకు దూరమయ్యాడు. అనంతరం బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలో రీహాబిలిటేషన్ సెంటర్లో ఉన్న జడేజా మోకాలికి వైద్యులు సర్జరీ నిర్వహించారు. అప్పటి నుంచి విశ్రాంతి తీసుకున్న జడేజా తాజాగా కోలుకొని రంజీ ట్రోఫీ ఆడేందుకు చెన్నైకు వచ్చాడు. సౌరాష్ట్ర తరపున తమిళనాడుతో చివరి రౌండ్ మ్యాచ్ ఆడనున్నాడు. కాగా ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో మొదలవనున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం జడేజాను బీసీసీఐ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇక చెన్నైలో ఉన్న జడేజాకు ఈ ప్లేస్‌తో మంచి అనుబంధం ఉందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐపీఎల్లో జడేజా చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సుదీర్ఘకాలంగా సీఎస్కేతో కొనసాగుతూ జట్టు విజయాల్లో జడ్డూ కీలక పాత్ర పోషించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. చాలా రోజుల తర్వాత చెన్నైకి రావడంతో జడేజా తన ట్విటర్లో అభిమానులకు..''వణక్కం చెన్నై(నమస్కారం చెన్నై)'' అంటూ విష్ చేశాడు. కేవలం రెండు పదాలతోనే ట్వీట్ చేయడం సీఎస్కే అభిమానులను సంతోషపెట్టింది. ఈ క్రమంలో జడేజా ట్వీట్ కు చెన్నై జట్టు అభిమానులు ఉత్సాహంగా స్పందిస్తున్నారు.''జడేజాకు చెన్నై స్వాగతం పలుకుతోంది. సీఎస్కే అభిమాన ప్లేయర్ నువ్వు'' అని ఒక అభిమాని పేర్కొనాడు. ''నా అభిమాన రోల్ మోడల్‌కు వణక్కమ్. మైదానంలోకి తిరిగి సింహం అడుగు పెడుతోంది'' అని మరొక అభిమాని కామెంట్ చేశాడు. ''చెన్నై సూపర్ కింగ్స్‌కు తిరిగి స్వాగతం.. జడ్డూ నీ రాకింగ్ ప్రదర్శన కోసం వేచి చూస్తున్నాం..'' అంటూ కొందరు కామెంట్లు పెట్టారు. Vanakkam Chennai..👋 — Ravindrasinh jadeja (@imjadeja) January 22, 2023 చదవండి: ఫుట్‌బాల్ చరిత్రలోనే తొలిసారి.. ఆర్సీబీకి షాక్.. ట్విటర్‌ను కూడా వదల్లేదు -
కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి
-
అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు : సీఎం వైఎస్ జగన్
-
చదువు, విలువలు ఇవే పిల్లలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి: సీఎం జగన్
-
చిన్నారులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: నేడు బాలల దినోత్సవం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘చదువు, విలువలు ఇవే పిల్లలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి. సమాజ వికాసానికి వారే పట్టుకొమ్మలు. ప్రేమ, స్నేహం, సమభావంతో పిల్లలు ఎదగాలి. చిన్నారులందరికీ బాలలదినోత్సవ శుభాకాంక్షలు’ అని ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. చదువు, విలువలు ఇవే పిల్లలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి. సమాజ వికాసానికి వారే పట్టుకొమ్మలు. ప్రేమ, స్నేహం, సమభావంతో పిల్లలు ఎదగాలి. చిన్నారులందరికీ బాలలదినోత్సవ శుభాకాంక్షలు. #ChildrensDay — YS Jagan Mohan Reddy (@ysjagan) November 14, 2022 -
తెలుగు రాష్ట్రాల ప్రజలకు సీఎం జగన్ దసరా శుభాకాంక్షలు
-
సీఎం కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పండుగ బతుకమ్మ ఆఖరి రోజు.. సద్దుల బతుకమ్మ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నిండిన చెరు వులు, పచ్చని పంట పొలాల పక్కన ప్రకృతితో మమేకమై, తొమ్మిది రోజుల పాటు సాగిన ఆడబిడ్డల ఆట పాటలతో, పల్లెలు పట్టణాలు ప్రత్యేక సాంస్కృతిక వాతావరణాన్ని సంతరించుకున్నాయని పేర్కొన్నారు. విజయాలనందించే విజయ దశమిని స్వాగ తిస్తూ ముగిసే 9 రోజుల బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు విజయవంతమయ్యాయని చెప్పారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా, ప్రజలంతా సుఖ శాంతులతో జీవించేలా దీవించాలని అమ్మవారిని ప్రార్థించారు. చదవండి: బతుకమ్మ బంగారం.. విదేశీ పూల సింగారం -
మంచి మాట: పలకరింపు ఎంత మధురం!
తీయని పలకరింపు మదిలో చక్కని భావనను రేపుతుంది. ఒక చల్లని అనుభూతినిస్తుంది. ఓ హాయిని చేకూరుస్తుంది. పలరింపు పెద్ద ఓదార్పు. కొన్ని సందర్భాలలో అద్భుతమైన ఊరటను, కొండంత బలాన్నిస్తుంది . ‘తోడుగా నీకు నేనున్నాను‘ అనే ఆత్మీయత, ఆప్యాయతలతో నిండిన పలకరింవు గొప్ప భరోసా నిస్తుంది. మన దుఃఖాన్ని, నిర్వేదాన్ని, నిరాశను, నిçస్పృహను అమడ దూరంలో పెట్టే ఔషధమై మనసుకు సాంత్వననిస్తుంది. బీటలుబారిన భూమికి ఎంతో హర్షాన్నిస్తుంది వర్షం. అదే విధంగా, చక్కని పలకరింపు శోకంతో ఛిద్రమైన మనోక్షేత్రాన్ని ఏకం చేసే ప్రేమజల్లు అవుతుంది. కొందరికి పలకరింపంటే మాటల మూట అనే భావన ఉంది. పలకరింపు అంటే అద్భుతమైన పదవిన్యాసము కాదు. భాషా సొబగులు చూపటం, భాషా సౌందర్యాన్ని ఒలికించటమూ అంతకన్నా కాదు. సమాసాల హోరు, జోరు కానే కాదు. పలకరింపు ఒక లాలిత్యం... ప్రేమ ధ్వనించాలి. స్నేహం తొంగి చూడాలి. పెదవుల చివర నుంచి కాక మనసులోంచి రావాలి. అపుడే అది ఎదుటివారి మనసును తాకి ఆహ్లాదాన్నిచ్చే మలయమారుతమవుతుంది. చక్కని పులకరింపై మనసుకు ఓ ప్రశాంతతనిచ్చి మన పలకరింపును స్వీకరించిన వారి ముఖాన చిరునవ్వును వెల్లి విరిసేటట్టు చేస్తుంది. కొందరు నోరు విప్పి పలుకరించటానికి ముందే వారి ముఖం మీద చిరునవ్వు పుడుతుంది. ఆ తరువాతే మాటలు. అటువంటి వారి మాటకు మృదు మధురంగానే ఉంటాయి. శ్రీరాముడు స్మిత పూర్వ భాషి అన్నారు. చిరునవ్వుతో తానే ముందు అందరిని పలకరిస్తాడు. పదాల అర్థం వాటి పర్యవసానం, వాటి పయనం, వాటి ప్రభావాల గురించి మన అంచనా శక్తి మనకు తెలియాలి. మన పలకరింపు ఎదుటివారికి చేరేది మాటల రూపంలోనే కదా. అది మన గొంతు నుండి పెదవులను దాటి స్వరరూపంలో బయటకు వస్తుంది. స్వరం స్థాయి, మాటల ఊనిక చాలా అవసరం. మనం ఎన్నుకున్న మాటల అర్థాన్ని, ఉద్దేశాన్ని ఎదుటివారికి తెలియజెప్పేది మాటల రూపంలో వ్యక్తమయ్యేది పలకరింపే. అందుకనే ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ఒకరకంగా ఇది అతి సులువు గా కనిపించే అత్యంత క్లిష్టమైన విషయం. ‘బావున్నారా‘ అనేది మనమందరం చేసే అతి సాధారణ పలకరింపు. ఈ నాలుగు అక్షరాలు మన గొంతులో పలికే మన స్వర స్థాయిని బట్టి మన మనోభావాన్ని తెలియచేస్తుంది. అందుకే మాటలు అవే అయినా వాటిని పలికే తీరులో ఎంతో తేడా ఉంటుంది. మన భావాన్ని తెలియచెప్పే మాటల ధ్వని, దాని అర్థం మనం స్వరం లో పలికేటట్టు మాట్లాడగలగాలి. అదే చక్కని పలకరింపుకు చిరునామా అవుతుంది. మనల్ని చక్కని సంభాషణ పరులుగా చేసేది. పలకరింపు అంటే భాష మీద పట్టు, సాధికారత కానే కాదు. పలకరింపుకు మన విజ్ఞత, వివేచన ఉండాలి.. అపుడే అది చేయదగ్గ పనిని చేస్తుంది. తల్లిదండ్రులు తమ జీవితమంతా పిల్లలకే ధారపోస్తారు. అహరహం వారి బంగారు భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. వయసు మీరిన తరువాత పలకరింపుకోసం తపించిపోతారు. ఈరోజు విషయాన్ని పిల్లలు అర్థం చేసుకోవాలి. స్వదేశంలో ఉన్నా, విదేశంలో ఉన్నా తమ తల్లిదండ్రులను పలకరించాలి. ఆ పలకరింపు, గడపబోయే సమయం కొన్ని క్షణాలైనా చాలు. అది వృద్ధులకు ఎంతో ధైర్యాన్ని, భరోసాను ఇస్తుంది. అన్నిటికీ మించి వర్ణించలేని సంతృప్తిని, అంతులేని ఆనందాన్ని ఇస్తుంది. మనం పలకరించినా, లేకపోయినా ప్రకృతి మనల్ని పలకరిస్తూనే ఉంటుంది. ప్రకృతిపరమైన ఈ పలకరింపులు ఆలకించగలగాలి లేదా అలవాటు చేసుకోవాలి. అపుడు ఎంతో ఆనందాన్ని పొందగలం. ఆ దృష్టి ఆనంద హేతువు. ఉదయానే కొక్కోరోకో అనే ధ్వని, ఉదయపు వ్యాహ్యాళి వేళ తమ ఆవాసమైన వృక్షాన్ని వీడి పక్షులు తమ ఆహారన్వేషణ కు ఆకాశానికెగిరే వేళ చేసే టప టప మనే ధ్వని ప్రకృతి పలకరింపు. పండిన నారింజ రంగులో ఉన్న భానోదయం, భాస్కరుని నులివెచ్చని కిరణాలు నిశ్శబ్ద పలకరింపులే కదా! గాలి ఈలలు, చిరుగాలి సవ్వడి, నీటి గలగలలు, నిన్నటి మొగ్గ నేడు తన రేకానయనాలను విప్పార్చుకుంటూ పరిమళాలతో మనల్ని మన ఆత్మీయులు పలుకరించిన అనుభూతి కలగదా! పలకరింపు మాటల్లోనే ఉండనక్కర లేదు. అది ఒక చూపు, స్పర్శ, చిరునవ్వు, దృశ్యం, పుస్తకం.. ఇలా ఏవైనా కావచ్చు. ఇలా ఏదోరకమైన పలకరింపును మనం చేయగలగాలి. అది పొందిన వారు, కోరుకునే వారికి తీయని అనుభూతినిస్తుంది. వారి మనసు ఆనంద సంద్రమవుతుంది. కొందరు ఎంత ఉన్నతపదవుల్లోకి వెళ్లినా తమ హితులను, స్నేహితులను, బంధువులను విస్మరించరు. పలకరించే ఏ సందర్భాన్ని వదలుకోరు. వారి హోదాకు, అంతస్థుకి చెందినవారిని ఎంత ఆప్యాయంగా, ఆత్మీయంగా పలుకరిస్తారో పేదలైనా, ధనికులైనా, చదువుకున్న వారైనా, చదువుకోనివారైనా ఒకేరకమైన ప్రవర్తన. ఒకేరకంగా పలకరిస్తారు. అది ఎంతో గొప్ప లక్షణం. ఇది చాలామందిలో ఉండదు. అటువంటి వారు వేళ్ళమీద లెక్కపెట్టే సంఖ్యలోనే ఉంటారు. అందుకే వారిది అపురూప వ్యక్తిత్వమవుతుంది. అదే మనకు ఆదర్శం కావాలి. ఆర్థిక బాధల్లో ఉన్న వారందరికీ మనం సహాయం చేయడం సాధ్యం కాకపోవచ్చు. అయితే, కష్టాల కడలిలో ఉన్న మన చుట్టాలను, స్నేహితులను, ఇరుగు పొరుగుని ఓదార్పుగా పలకరించవచ్చు. అది వారికి హార్దికంగా ఎంతో శక్తినిస్తుంది. పెడతోవలో వెళ్ళే వారి ఆలోచనలకు ఒక క్రమ మార్గం ఏర్పరుస్తుంది. ఇటువంటి సందర్భాలలోనే మన సంభాషణ చాతుర్యం తెలిసేది. మన మాటల ఎన్నిక, కూర్పు, పొందికలలో ఎంతో జాగ్రత్త అవసరం. ఇవన్నీ మన పలకరింపు పెదవులను దాటటానికి ముందు మనసులో జరిగే ప్రక్రియ. ఇది పూర్వభాగమైతే, మన భావనలు పలకరింపై ఎదుటివారిని చేరటం ఉత్తరభాగం. సరిగ్గా, ఇక్కడే మాటలకున్న అర్థాన్ని మనమెంత లోతుగా గ్రహించగలిగామో తెలిసేది. – లలితా వాసంతి -
రక్తదాతల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా విలువైన ప్రాణాలను కాపాడేందుకు నిస్వార్థంగా రక్తదానం చేస్తున్న రక్తదాతలందరికీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం శుభాకాంక్షలు తెలిపారు. రక్తదాతలు ప్రపంచవ్యాప్తంగా ఏటా కోట్లాది మంది జీవితాలను రక్షిస్తున్నారని కొనియాడారు. రక్తదానం ఉదాత్తమైన, మానవీయమైన, అమూల్యమైన చర్య అన్నారు. రక్తదాతల ఉదారమైన సేవకు గుర్తింపుగా ఏటా జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. -
దేశ ప్రజలకు ప్రధాని మోదీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: మనుమాన్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘బలం, ధైర్యం, సంయమనానికి ప్రతీక అయిన హనుమంతుని జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. పవన్‌పుత్ర దయతో ప్రతి ఒక్కరి జీవితాలు తెలివితేటలు, విజ్ఞానంతో నిండి ఉండాలి’ అని ప్రధాని మోదీ ట్విటర్లో పేర్కొన్నారు. शक्ति, साहस और संयम के प्रतीक भगवान हनुमान की जयंती पर सभी देशवासियों को अनेकानेक शुभकामनाएं। पवनपुत्र की कृपा से हर किसी का जीवन बल, बुद्धि और विद्या से सदा परिपूर्ण रहे। — Narendra Modi (@narendramodi) April 16, 2022 -
తెలంగాణ ఆడపడుచులకు చిరంజీవి శుభాకాంక్షలు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలను ప్రతిబింబించే బతుకమ్మ సంబురాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డలు పూల పండుగతో సందడి చేయనున్నారు. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలయ్యే ఈ వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. బతుకమ్మ పండుగ ప్రారంభం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ ఆడపడుచులకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆశ్వయుజ మాసంలో 9 రోజుల బొద్దెమ్మ తర్వాత వచ్చే తెలంగాణ ఆడపడుచు ' బతుకమ్మ' కు స్వాగతం. 9 రోజుల పాటు సాయంత్రం కాగానే వివిధ పుష్పాలతో తీరుగా తీర్చిదిద్దే బతుకమ్మను కీర్తిస్తూ ఆడపడుచులు చప్పట్లు, కోలాటాలతో పాటలు పాడే దృశ్యం ఓ అద్భుతం.ఆడపడుచులు అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు’అని చిరంజీవి ట్వీట్ చేశారు. ఆశ్వయుజ మాసంలో 9 రోజుల బొద్దెమ్మ తర్వాత వచ్చే తెలంగాణ ఆడపడుచు ' బతుకమ్మ' కు స్వాగతం. 9 రోజుల పాటు సాయంత్రం కాగానే వివిధ పుష్పాలతో తీరుగా తీర్చిదిద్దే బతుకమ్మను కీర్తిస్తూ ఆడపడుచులు చప్పట్లు, కోలాటాలతో పాటలు పాడే దృశ్యం ఓ అద్భుతం.ఆడపడుచులు అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. — Chiranjeevi Konidela (@KChiruTweets) October 6, 2021 -
గురువులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పిల్లలను బాధ్యతాయుత పౌరులుగా మార్చడంలో ఉపాధ్యాయుల కృషి గొప్పది అని కొనియాడారు. ‘‘చదువే తరగని ఆస్తి.. గురువే రూపశిల్పి.. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న గురువులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయులందరికీ టీచర్ డే శుభాకాంక్షలు’’ అంటూ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. చదువే తరగని ఆస్తి గురువే రూపశిల్పి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న గురువులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయులందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు.#TeachersDay — YS Jagan Mohan Reddy (@ysjagan) September 5, 2021 ఇవీ చదవండి: సీఎం వైఎస్ జగన్‌కు అర్చక సమాఖ్య కృతజ్ఞతలు విద్యార్థి మృతిపై లోకేశ్ తప్పుడు ప్రచారం -
రాష్ట్ర ప్రజలకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా ప్రజలు శనివారం భక్తిశ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు శనివారం సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘‘గురువును దైవంతో సమానంగా పూజించే గొప్ప సంస్కృతి భారతదేశానిది. మంచిని ప్రభోదించి, జ్ఞాన జ్యోతిని వెలిగించే గురువు స్థానం ఎంతో మహోన్నతమైనది. నేడు గురు పౌర్ణమి సందర్భంగా పూజ్య గురుతుల్యులందరినీ స్మరించుకుంటూ.. రాష్ట్ర ప్రజలకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. గురువును దైవంతో సమానంగా పూజించే గొప్ప సంస్కృతి భారతదేశానిది. మంచిని ప్రభోదించి, జ్ఞాన జ్యోతిని వెలిగించే గురువు స్థానం ఎంతో మహోన్నతమైనది. నేడు గురు పౌర్ణమి సందర్భంగా పూజ్య గురుతుల్యులందరినీ స్మరించుకుంటూ.. రాష్ట్ర ప్రజలకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు.#GuruPurnima2021 — YS Jagan Mohan Reddy (@ysjagan) July 24, 2021 -
ముస్లిం సోదరులకు సీఎం జగన్ బక్రీద్ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: ముస్లిం సోదర సోదరీమణులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు బుధవారం సీఎం జగన్ ట్వీట్ చేశారు. త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలన్నారు. ‘‘దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఈ పండుగ జరుపుకొంటారన్నారు. భక్తి భావం, విశ్వాసం, కరుణ, ఐక్యతకు సంకేతమైన ఈ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని’’ సీఎం జగన్ ఆకాంక్షించారు. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ముఖ్యమంత్రి జగన్ అభిలషించారు. విశ్వాసానికి, కరుణ, ఐక్యతకు ప్రతీక బక్రీద్. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ చేసుకునే బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు. అల్లాహ్ ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్ధిస్తున్నాను.#EidMubarak — YS Jagan Mohan Reddy (@ysjagan) July 21, 2021 -
ముస్లిం సోదరులకు ప్రధాని మోదీ రంజాన్ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా మహమ్మారిని అధిగమించి మానవ సంక్షేమాన్ని మరింత పెంపొందించేలా కృషి చేద్దామని కోరారు. ‘ఈద్ ఉల్ పితర్ సందర్భంగా ఈద్ ముబారక్. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఉండాలని ప్రార్థిస్తున్నాను. మనందరి సమిష్టి కృషితో కరోనా మహమ్మారిని అధిగమించి ముందుకు వెళ్లేలా కృషి చ్దేదాం' అంటూ మోదీ ట్వీట్ చేశారు. Best wishes on the auspicious occasion of Eid-ul-Fitr. Praying for everyone’s good health and well-being. Powered by our collective efforts, may we overcome the global pandemic and work towards furthering human welfare. Eid Mubarak! — Narendra Modi (@narendramodi) May 14, 2021 -
గవర్నర్ ఈస్టర్ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రజలకు, క్రైస్తవులకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసు ప్రభువు పునర్జన్మకు సంకేతంగా ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ పర్వదినం జరుపుకుంటారని పేర్కొన్నారు. ఈస్టర్ పండుగ సమాజంలో సానుకూల దృక్పథాన్ని బలోపేతం చేస్తుందన్నారు. ఈ పర్వదినం మనకు కరోనాపై పోరాడటానికి శక్తినివ్వాలని, సాధారణ జనజీవనం పునరుద్ధరించబడాలని ఈ సందర్భంగా గవర్నర్ అభిలషించారు. -
ప్రతి ఒక్క నిరక్షరాస్యుడికీ విద్య
-
రాష్ట్ర ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తోబుట్టువుల మధ్య ఉన్న ప్రేమానురాగాలకు, జీవితాంతం ఒకరికొకరం తోడుగా ఉంటామనే హామీకి రక్షాబంధన్ ప్రతీకగా నిలుస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా రాఖీ పండుగ జరుపుకోవాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. Greetings to all on the auspicious occasion of #RakshaBandhan, which signifies the bond of love, protection and respect of siblings for each other. Wishing you all a joyous and a fun-filled Rakhi. — YS Jagan Mohan Reddy (@ysjagan) August 15, 2019 -
మేమిద్దరం కలిసే పనిచేస్తాం: హరీష్ రావు
సాక్షి, హైదారాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన కేటీఆర్‌ను హరీష్ రావు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. కేటిఆర్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ భవిష్యత్‌లో ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశించారు. అదే సమయంలో తామిద్దరం కేసీఆర్‌కు చేదోడు వాదోడుగా ఉంటామన్నారు. ‘వచ్చే స్ధానిక సంస్థల ఎన్నికల్లో మరింత బాగా పనిచేయాలని కోరుకుంటున్నా. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరం కలిసి పనిచేశాం. రేపు రాష్టాన్ని ముందుకు తీసుకుపోవడంలో కూడా ఇద్దరు కలిసి పనిచేస్తాం’ అని హరీష్ రావు అన్నారు. -
వైఎస్ జగన్ వినాయకచవితి శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి దీవెనలతో అభివృద్ధిపరంగా ఇరు రాష్ట్రాలకు, ఇరు రాష్ట్రాల ప్రజలకు విఘ్నాలు తొలగి ఇకమీదట అనేక విజయాలు సిద్ధించాలని ఆయన కోరుకున్నారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి బుధవారం ప్రకటన వెలువడింది. కాగా, ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్ బుధవారం విశాఖపట్నం తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, భరోసాయిస్తూ ముందుకు సాగుతున్నారు. బీఆర్టీఎస్ రోడ్డులో చినగదిలి వద్ద ఈ మధ్యాహ్నం జరిగే ముస్లిం మైనారిటీల ఆత్మీయ సదస్సులో వైఎస్ జగన్ పాల్గొంటారు. -
దేశప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు చెప్పిన మోదీ
-
ముస్లిం ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు
-
వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్ : ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు(ఈద్ ముబారక్) తెలిపారు. మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించిందని రంజాన్ మాసంలోనే కావడంతో ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యతను ఇస్తారని వైఎస్ జగన్ అన్నారు. రంజాన్ అంటే ఉపవాస దీక్ష మాత్రమే కాదని, మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని చెప్పారు. నెలరోజుల పాటు నియమ నిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే పుణ్యమాసానికి రంజాన్ ఒక ముగింపు వేడుక కాగా, ఐకమత్యంతో మెలగడం, క్రమశిక్షణ కలిగి ఉండడం, పేదలకు తోడ్పడటం ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశమని ఆయన పేర్కొన్నారు. రంజాన్ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వ మానవ సమత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని, ప్రజలందరికీ శుభ సంతోషాలు కలగాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. -
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు: గవర్నర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర 4వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ నరసింహన్ శుభాకాంక్షలు తెలిపారు. గడిచిన నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. సంక్షేమ ఫలాలు చిట్టచివరి వ్యక్తి వరకూ అందేలా చూడాలన్నారు. ప్రజల సంతోషమే ప్రభుత్వ విజయాలకి కొలబద్ద అని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ సాధనలో ప్రభుత్వానికి విజయం చేకూరాలని, సుఖశాంతులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. -
గణతంత్ర దినోత్సవం..గవర్నర్ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు 69వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ శుభసమయంలో మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఎందరో అమరవీరులను, త్యాగమూర్తులను స్మరించుకుందామన్నారు. ఆ మహనీయుల ఆశయాల సాధనకు మనందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. అభివృద్ధి ఫలాలు సమాజంలోని అన్ని వర్గాల వారికి సమంగా అందాలని అన్నారు. బాధ్యత గల పౌరులుగా మనందరం సమిష్టిగా శ్రమించాలన్నారు. స్వర్ణాంధ్ర ప్రదేశ్ సాధన లక్ష్యంతో అహర్నిశం, అనుక్షణం కృషి చేద్దామని చెప్పారు. -
నిజాయితీ చాటుకున్న ఆటోవాలా
ఎస్ఆర్నగర్(హైదరాబాద్): నిజాయితీ కరవైన ఈ రోజుల్లో ఓ ఆటోవాలా తన నిజాయితీని చాటుకున్నాడు. తాను నడుపుతున్న ఆటోలో ప్రయాణించిన వారి బంగారు ఆభరణాలు ఆటోలో జారిపోయాయి. ఇది గమనించని వారు ఆటో దిగి వెళ్లిపోయారు. తర్వాత వాటిని గమనించిన ఆటో డ్రైవర్ మీర్జా మహమూద్ ఆరున్నర తులాల బరువున్న ఆ ఆభరణాలను ఎస్ఆర్ నగర్ పోలీసులకు అప్పగించాడు. నిజాయితీ ప్రదర్శించిన ఆటో డ్రైవర్‌ను పోలీసులు అభినందించారు. సీఐ వహిదుద్దీన్ ఆయన్నుసన్మానించారు. -
దేశం గర్వించదగ్గది మన సైన్యం: రాష్ట్రపతి, ప్రధాని
న్యూఢిల్లీ: ఆర్మీ డే సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధనమంత్రి నరేంద్ర మోదిలు సైనికులకు శుభాకాంక్షలు తెలిపారు. పురుష, మహిళా సైన్యానికి, వారి కుటుంబీకులకు, వృద్ధులకు కూడా గ్రీటింగ్స్ తెలిపారు. మీరు దేశం గర్వించదగ్గ వారని, పౌరుల భద్రత పట్ల ఎంతో జాగరూకత వహిస్తారని రాష్ట్రపతి తన ట్విటర్లో కొనియాడారు. దేశాన్ని మొదటి స్థానంలో నిలిపేందుకు సైనికులు కృషిచేస్తున్నారంటూ ప్రధాని మోదీ తన ట్విటర్లో కొనియాడారు. ఆర్మీ డే సందర్భంగా వారికి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పౌరులు కూడా ఎలాంటి అభిజాత్యం లేకుండా సైన్యం పట్ల విశ్వాసం కలిగి ఉన్నారన్నారు. మన సైన్యం దేశాన్ని రక్షించడంలోనేగాక ప్రకృతి విలయాలు, ప్రమాదాలు సంభవించినపుడు ముందుండి మానవతా దృక్పథంలో సహాయక చర్యలు చేపడుతుంటుందని అన్నారు. 1949లో భారత్‌లో చివరి బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ సర్ ఫ్రాన్సిస్ బచర్ నుంచి మొదటి ఇండియన్ ఆర్మీ చీఫ్‌గా ఫీల్డ్ మార్షల్ కె.ఎం.కరియప్ప బాధ్యతలు స్వీకరించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆ గుర్తుగా ఏటా ఆర్మీడేను నిర్వహిస్తున్నారు. -
మోదీ క్రిస్మస్ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్ : దేశ ప్రజలకు క్రిస్మస్ పర్వదిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రిస్మస్ సమాజంలో సుఖశాంతులు తీసుకురావాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ రోజే పుట్టినరోజు జరుపుకుంటున్న మాజీ ప్రధానమంత్రి అటల్ బీహారీ వాజ్‌పేయికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచం దేశాల ముందు భారత్ ఉన్నత స్ధానంలో నిలవడానికి వాజ్‌పేయి దూరదృష్టే కారణమని కొనియాడారు. ఇదే రోజున జన్మించిన పండిట్ మదన్ మోహన్ మాళవీయను కూడా మోదీ గుర్తు చేసుకున్నారు. భారత చరిత్రపై మాళవీయ వేసిన ముద్ర ఎన్నటికీ చెరిగిపోనిదని అన్నారు. విద్యా రంగం కోసం ఆయన చేసిన సేవలు మరువలేనివని చెప్పారు. -
విశాల్‌కు కుష్బూ శుభాకాంక్షలా?
టీ.నగర్: డీఎంకే అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతిస్తున్న తరుణంలో విశాల్‌కు కుష్బూ శుభాకాంక్షలు తెలపడమేమిటని దక్షిణ చెన్నై జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కరాటే త్యాగరాజన్ విమర్శించారు. ఈ మేరకు ఆయన మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విధంగా తెలిపారు. డీఎంకేలో ఉన్న సమయంలో అక్కడున్న నేతలకు సమస్యలను కలిగించి బయటికి పంపిన కుష్బూకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యతను కల్పించి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా హోదాను కల్పించిందని ఈ పదవిలో హూందాగా నడచుకోవాల్సిన కుష్బు కాంగ్రెస్ పార్టీలోను గందరగోళం సృష్టిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆర్కేనగర్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న విశాల్‌కు ఆమె శుభాకాంక్షలు తెలిపి గందరగోళం సృష్టించినట్లు కరాటే త్యాగరాజన్ ఆరోపించారు. -
ఆర్మీకి మోదీ ఇన్ఫాంట్రీ డే శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: ఇన్ఫాంట్రీ డే సందర్భంగా ప్రధాని మోదీ శుక్రవారం ఆర్మీకి శుభాకాంక్షలు తెలిపారు. 1947, అక్టోబర్ 27న పాక్ సైన్యం మద్దతుతో జమ్మూకశ్మీర్‌లో ప్రవేశించిన గిరిజన దళాలను తరిమివేసేందుకు సిక్కు రెజిమెంట్‌కు చెందిన మొదటి బెటాలియన్ సైనికులు తొలిసారిగా విమానాల ద్వారా శ్రీనగర్‌లో దిగారు. భారత సైన్యం చేపట్టిన ఈ ఆపరేషన్‌కు గుర్తుగా ప్రతి ఏటా అక్టోబర్ 27న ఇన్ఫాంట్రీ డేగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్పందిస్తూ..‘ ఇన్ఫాంట్రీ డే వేళ పదాతిదళ సభ్యులందరికీ నా శుభాకాంక్షలు. మన పదాతిదళం ప్రదర్శించిన అసమాన ధైర్య సాహసాలు, దేశానికి అందించిన సేవలపై మేం ఎంతో గర్వపడుతున్నాం’ అని ట్వీట్ చేశారు. ‘దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఇన్ఫాంట్రీ వీరులందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. వారి వీరోచిత త్యాగాలను రాబోయే భవిష్యత్ తరాలు కూడా గుర్తుంచుకుంటాయి’ అని మరో ట్వీట్లో తెలిపారు. -
ఐకమత్యాన్ని పెంచే రంజాన్ మాసం
తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు సాక్షి, హైదరాబాద్ : ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ నెల ప్రారంభమైన సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో ఐకమత్యం, సామరస్యాన్ని రంజాన్ మాసం పెంపొందిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ పవిత్ర దినాల్లో ముస్లింలంతా ఉపవాసాలతో ప్రశాంతంగా గడపాలని, అల్లా వారికి సుఖశాంతులు ప్రసాదించాలని ఆకాంక్షించారు. సాటివారికి చేయూతనందించాలనే రంజాన్ సారాంశం మరింతగా వర్థిల్లాలని అన్నారు. మనిషిలో క్రమశిక్షణ, ఐక్యత, సర్వమానవ సౌభ్రాతృత్వం, సహనశీలత, మనో నిశ్చలత, దాన గుణాన్ని పెంపొందించే మహత్తరమైన నెల రంజాన్ అని జగన్ పేర్కొన్నారు. -
రాష్ట్ర ప్రజలకు సీఎం మే డే శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మే డే శుభాకాంక్షలు తెలిపారు. కార్మిక లోకమంతా క్షేమంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. -
మార్పు కోసం ధైర్యంగా ముందుకు కదలండి
- మహిళలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు - అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ ప్రతిపక్ష నేత సాక్షి, హైదరాబాద్: మార్పు కోసం మహిళలు ధైర్యంగా ముందుకు కదలాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు నిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన మంగళవారం మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సాధికారిత ద్వారానే సాంఘిక, ఆర్థిక స్వావలంబన సాధ్యమని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందితేనే సాధికారిత సాధ్యమవుతుందని వెల్లడించారు. -
హెల్త్ యూనివర్సిటీ రైఫిల్ షూటింగ్ జట్టు
విజయవాడ స్పోర్ట్స్ : గురునానక్ దేవ్ (అమృత్సర్) యూనివర్సిటీలో ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు జరిగే ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ రైఫిల్ షూటింగ్ టోర్నీలో పాల్గొనే డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ జట్టును వర్సిటీ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఇ.త్రిమూర్తి శుక్రవారం విడదల చేశారు. పురుషుల జట్టుకు పి.భార్గవ్హర్ష (డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ), డి.విశాల్ అంకిత్ (ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాల), ఎన్.తేజవర్థన్ నాయుడు (నిమ్రా మెడికల్ కళాశాల), మహిళా జట్టుకు సీహెచ్.సత్యహర్షిణి (సెయింట్‌జోసెఫ్ డెంటల్ కళాశాల, ఏలూరు) ఎంపికయ్యారు. టోర్నీకి పయనమైన జట్టు సభ్యులకు యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ టి.రవిరాజు, రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.అప్పలనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. -
అంతా మనమే! అందరూ మనలోనే!! - కాజల్ అగర్వాల్
ఏ స్త్రీ అయితే తన లోలోపలి ధైర్యాన్ని మేలుకొలుపుతుందో... అలాంటి ప్రతి స్త్రీ తానే దుర్గా మాత! ఏ స్త్రీ అయితే తనలో మార్పును మేలుకొలుపుతుందో... అలాంటి ప్రతి స్త్రీ తానే కాళీ మాత! ఏ స్త్రీ అయితే తనలో అంకితభావాన్ని మేలుకొలుపుతుందో... అలాంటి ప్రతి స్త్రీ తానే పార్వతీ మాత! ఏ స్త్రీ అయితే, తనలోని పరిపోషణశక్తిని మేలుకొలుపుతుందో... అలాంటి ప్రతి స్త్రీ తానే అన్నపూర్ణా దేవి! ఏ స్త్రీ అయితే, తనలోని శివుణ్ణి మేలుకొలుపుతుందో... అలాంటి ప్రతి స్త్రీ తానే శక్తి! మనలోనే ఉన్న దేవతలను పూజిద్దాం. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. -
స్కాచ్ అవార్డులు బెజవాడ స్థాయిని పెంచాయి
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ చరిత్రలో స్కాచ్ అవార్డులు ఓ మైలురాయిగా మిగిలిపోతాయని ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) అన్నారు. గురువారం కౌన్సిల్ హాల్లో కమిషనర్ జి.వీరపాండియన్, మేయర్ కోనేరు శ్రీధర్‌లకు అభినందన సభ నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ ఒకేసారి ఐదు అవార్డులు సాధించడం ద్వారా బెజవాడ స్థాయిని పెంచారని కొనియాడారు. మున్నెన్నడూ లేని విధంగా నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఐదు వేల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. అభివృద్ధి కావాలంటే కొంతమందిని ఇబ్బంది పెట్టక తప్పదన్నారు. ఢిల్లీ ముంబయిల స్థాయిలో మార్పు: కలెక్టర్ బాబు జిల్లా కలెక్టర్ బాబు.ఏ మాట్లాడుతూ ఆన్లైన్ సేవలు నగరపాలక సంస్థ స్థాయిని పెంచాయన్నారు. ప్రజల వ్యవహార శైలిలోనూ మార్పు వచ్చిందన్నారు. ఢిల్లీ, ముంబై తరహాలో నగరంలో మార్పు కనిపిస్తోందన్నారు. పుష్కర ఘాట్లను టూరిస్ట్‌స్పాట్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మేయర్ కోనేరు శ్రీధర్ మాట్లాడుతూ తన హయాంలో ఐదు అవార్డులు రావడం మధురమైన అనుభూతిని ఇచ్చిందన్నారు. ఇంద్రకీలాద్రిపై నిర్వహించే దసరా వేడుకల్ని పురస్కరించుకొని సేవలందిస్తున్న కార్పొరేషన్‌కు యూజర్ చార్జీలు చెల్లించే విధంగా చూడాలని కలెక్టర్‌ను కోరారు. పోలీస్‌శాఖకు ఏటా రూ.50 లక్షలు యూజర్ చార్జీలు చెల్లిస్తున్నారు కాబట్టి తమకూ చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరారు. 23 ప్రాంతాల్లో సోలార్ కేంద్రాలు: వీరపాండియన్ ప్రజాప్రతినిధులు సహకరిస్తే మరిన్ని అవార్డులు సాధించవచ్చని కమిషనర్ జి.వీరపాండియన్ అన్నారు. బహిరంగ మలమూత్ర రహిత నగరంగా తీర్చిదిద్దడంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. నగరంలో 23 ప్రాంతాల్లో సోలార్ విద్యుత్‌ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. స్మార్ట్ మొౖ»ñ ల్యాప్ మెరుగైన ఫలితాలను ఇస్తోందన్నారు. భవిష్యత్‌లో అన్ని రకాల పన్నులు ఈ యాప్‌ద్వారానే వసూలు చేసే విధంగా యాక్షన్‌ప్లాన్ రూపొందిస్తున్నామన్నారు. ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహనరావు, జలీల్‌ఖాన్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఉప మేయర్ గోగుల వెంకట రమణారావు తదితరులు పాల్గొన్నారు. -
తెలుగును కాపాడుకుందాం: వైఎస్ జగన్
హైదరాబాద్: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మాతృ భాష మన ప్రాచీన సంపద అని, దానిని కాపాడుకుందాం అని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. దేశభాషలందు తెలుగు లెస్స. మాతృ భాష మన ప్రాచీన సంపద. కాపాడుకుందాం, పెంపొందిద్దాం. తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. — YS Jagan Mohan Reddy (@ysjagan) August 29, 2016 -
డీఐజీకి శుభాకాంక్షలు తెలిపిన సీపీ, ఎస్పీ
వరంగల్ : రాష్ట్రపతి పోలీస్ (శౌర్యపతకం) గ్యాలంటరీ అవార్డుకు ఎంపికైన వరంగల్ రేంజ్ డీఐజీ డాక్టర్ ప్రభాకర్‌రావుకు వరంగల్ పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబు, రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్‌ఝూ బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు డీఐజీ కార్యాలయంలో ఆయనను కలిసి బొకే అందించారు. కాగా, తనను గ్యాలంటరీ అవార్డుకు ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, డీజీపీ, ఐజీ, పోలీస్ ఉన్నతాధికారులకు ప్రభాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. -
కర్నూలు వ్యాఖ్యాతకు సీఎం అభినందన
కర్నూలు(అర్బన్): 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అనంతపురం పోలీస్ ట్రై నింగ్ కాలేజ్ గ్రౌండ్లో జరిగిన రాష్ట్రస్థాయి వేడుకలలో వ్యాఖ్యాతగా పాల్గొన్న కర్నూలు కథారచయిత ఇనాయతుల్లాను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. అనంతపురం స్వాతంత్య్రోద్యమ చరిత్ర, అమరావతి విశేషాలను, పోలీసు కవాతు దశ్యాలను, శకటాల ప్రదర్శనను ఆసక్తికరంగా వ్యాఖ్యానించిన తీరును మెచ్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారు పరకాల ప్రభాకర్, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, బీజేపీ నండూరి సాంబశివరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ ప్రకాష్ టక్కర్, ఎపీఎస్పీ బెటాలియన్ ఐజీ ఆర్కే మీనా, అనంతపురానికి చెందిన ప్రముఖ రచయిత ఏలూరు యంగన్నకవి తదితరులు ఇనాయతుల్లాను అభినందించారు. ఈయన గతంలో విజయవాడ, వైజాగ్‌లలో జరిగిన రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడులకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. -
హల్చల్ చేస్తున్న చిన్నారి వీడియో
సాధారణంగా చిన్నపిల్లలు కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు, ఎవరైనా కొత్తవాళ్లని చూసినప్పుడు వెంటనే ముడుచుకుపోతుంటారు. తల్లి ఒడిలోంచి దిగమంటూ మారాం చేస్తుంటారు. అందుకు భిన్నంగా ఓ 16 నెలల చిన్నారి షాపింగ్ మాల్లో కనిపించిన ప్రతివారిని పలుకరించుకుంటూ వెళ్తున్నఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 'లవ్ వాట్ మ్యాటర్స్' పేరుతో ఫేస్బుక్ పేజీలో మూడు వారాల క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే 46 మిలియన్ల మంది వీక్షించడం విశేషం. ఈ వీడియోలో బుడిబుడి అడుగులతో షాపింగ్ మాల్ మొత్తం కలియతిరుగుతున్నజాయ్ అనే చిన్నారి కనిపించిన ప్రతివారిని పలుకరిస్తూ వెళ్లింది. షాపింగ్ చేస్తున్న వారిని, షాప్‌లో పనిచేస్తున్న వారిని ఇలా తనకు ఎదురు పడిన ప్రతివారిని పలుకరించింది. చివరికి అక్కడ షాపింగ్ చేస్తున్న ఓ మహిళ వద్దకు వెళ్లి ఏ మాత్రం బెరుకు లేకుండా హగ్ కూడా చేసుకోవడం విశేషం. -
టీఆర్ఎస్ గెలుపు.. హైదరాబాద్ కు మలుపు
ఆ పార్టీకి శుభాకాంక్షలు : టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్) : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు హైదరాబాద్ వికాసానికి దోహదం చేస్తుందని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. శనివారం మహబూబ్‌నగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తొలిసారి హైదరాబాద్ ప్రజలు స్థిరమైన తీర్పునివ్వడంతో టీఆర్ఎస్ పార్టీ సొంతంగా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటోందని తెలిపారు. భారీ విజయాన్ని సాధించిన టీఆర్ఎస్ పార్టీకి అభినందనలతోపాటు శుభాకాంక్షలు తెలిపారు. సెంట్రల్ వర్సిటీలో వివక్షకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. వర్సిటీల్లో విద్యా హక్కుల పరిరక్షణకు జేఏసీ ప్రయత్నిస్తుందన్నారు. సర్కారు ప్రవేశపెట్టే బడ్జెట్‌పై జేఏసీ చర్చించి, కేటాయింపులపై ప్రభుత్వానికి సూచనలిస్తుందన్నారు. -
తెలుగు నేల సంతోషాలతో కళకళలాడాలి
సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, హైదరాబాద్: ఈ భోగి పండుగ అందరికీ భోగభాగ్యాల్ని ప్రసాదించాలని, సంక్రాంతి పండుగ తెలుగు రాష్ట్రాలలోను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరి ముంగిళ్లలో వెలుగులు నింపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలిపటాల సందళ్లతో, రకరకాల వేడుకలతో కూడిన సంక్రాంతి అంటేనే రైతులు, పల్లెల పండుగ అని ఆయన అన్నారు. పాడిపంటలతో, పైరుపచ్చలతో ప్రతి పల్లె కళకళలాడినప్పుడే ప్రజలు ఆనందంగా ఉంటారని, అన్నపూర్ణగా పేరుగాంచిన తెలుగు నేలలో రైతన్నలు, గ్రామీణ వృత్తుల వారంతా భోగభాగ్యాలతో, సుఖసంతోషాలతో తులతూగాలని కోరుకుంటున్నానని ఆయన బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
వేడుకలు ఘనంగా జరుపుకోవాలి: బాబు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబుసంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు, దేశ, విదేశాల్లోని తెలుగువారు భోగి, సంక్రాంతి, కనుమ వేడుకలను ఘనంగా చేసుకోవాలని బుధవారం ఒక ప్రకటనలో కోరారు. పేద కుటుంబాలు పెద్ద పండుగను సంతోషంగా చేసుకోవాలన్నదే తమ అభిమతమని పేర్కొన్నారు. -
సీఎం కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితాల్లో ఈ పండుగ కొత్త కాంతులు నింపాలని బుధవారం ఆయన ఆకాంక్షించారు. అన్ని వర్గాలు సుఖ సంతోషాలతో జీవించేందుకు, రాష్ట్ర భూముల్లో బంగారు పంటలు పండేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు దిగ్విజయంగా ముందుకు సాగేలా భగవంతుడు దీవించాలని, ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. -
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు
హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ భోగి పండుగ అందరికీ భోగభాగ్యాలను ప్రసాదించాలని, సంక్రాంతి పండుగ తెలుగు రాష్ట్రాలలోను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరి ముంగిళ్ళలో వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్లతో, రకరకాల వేడుకలతో కూడిన సంక్రాంతి అంటేనే రైతులు, పల్లెల పండుగ అని వైఎస్ జగన్ అన్నారు. పాడి పంటలతో, పైరు పచ్చలతో ప్రతి పల్లె కళకళలాడినప్పుడే ప్రజలు ఆనందరంగా ఉంటారని, అన్నపూర్ణగా పేరుగాంచిన తెలుగు నేలలో రైతన్నలు, గ్రామీణ వృత్తుల వారంతా భోగభాగ్యాలతో, సుఖసంతోషాలతో తులతూగాలని కోరుకుంటున్నట్లు ఆయన మకర సంక్రాంతి శుభాకాంక్షల సందేశంలో పేర్కొన్నారు. -
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగు ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. సర్వమానవ సమానత్వం, సౌభ్రాతృత్వం, సహనం, శాంతి, ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ వంటి క్రీస్తు బోధనలు మానవాళికి అనుసరణీయాలని ఆయన పేర్కొన్నారు. వైఎస్ఆర్ జిల్లా పర్యటనలో ఉన్న వైఎస్ జగన్.. ఓపెన్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. -
ముస్లింలకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ.. ముస్లిం సోదరులకు బుధవారం మిలాద్ ఉన్ నబీ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. మానవ జాతి పట్ల ప్రేమ, సోదరభావం చాటి చెప్పిన మహమ్మద్ ప్రవక్త జీవితం స్ఫూర్తిదాయకమని గవర్నర్ పేర్కొన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినం సమాజంలో శాంతి, సౌహార్థ్ర భావాన్ని పెంపొందిస్తుందన్నారు. సాటి మనుషుల పట్ల విశ్వాసం, ఆదరణ, కరుణ చూపితేనే ప్రవక్త ఆశయాలు నెరవేరుతాయన్నారు. ప్రవక్త్త అడుగు జాడల్లో నడిస్తే ఆదర్శ సమాజాన్ని నిర్మించవచ్చని పేర్కొన్నారు. -
ప్రజలకు వైఎస్ జగన్ విజయదశమి శుభాకాంక్షలు
హైదరాబాద్ : తెలుగు ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. లోకంలోని ప్రజలందర్నీ రక్షించే దుర్గామాత తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుఖ శాంతులు ఇవ్వాలని వైఎస్ జగన్ అభిలాషించారు. ప్రజలంతా సుఖ, సంతోషాలతో తులతూగాలని ఆయన ఆకాంక్షించారు. -
జయకు శుభాకాంక్షల వెల్లువ
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నిర్దోషిగా విడుదల కావడంతో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆమెతో ఫోన్లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య బొకే పంపించి శుభాకాంక్షలు తెలియజేశారు. సాక్షి, చెన్నై : ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఏళ్ల తరబడి అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను వెంటాడింది. మూడోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టినా ఆ కేసులతో సతమతంకాక తప్పలేదు. 2014 సెప్టెంబరు 27న బెంగళూరు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి మైకెల్ డి గున్హా ఇచ్చిన తీర్పు జయలలిత రాజకీయ జీవితాన్ని ప్రశ్నార్థకంలో పడేసింది. సీఎం, ఎమ్మెల్యే పదవికి అనర్హురాలుగా మిగిలారు. ఇక తమ అమ్మను మళ్లీ సీఎంగా చూస్తామా అన్న మనో వేదనతో ఆలయాల్లో పూజలు, యాగాది కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చిన అన్నాడీఎంకే వర్గాలకు 2015 మే 11న ఓ శుభ దినమే. తమ అమ్మ నిర్దోషి అంటూ కోర్టు ఇచ్చిన తీర్పుతో అన్నాడీఎంకే వర్గాలు ఆనందడోలికల్లో మునిగారు. అమ్మను చూడాలన్న ఆశతో పోయెస్ గార్డెన్‌కు పరుగులు తీసి శుభాకాంక్షలతో ముంచెత్తారు. ప్రధాని నరేంద్ర మోది ఆమెకు ఫోన్లో శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, రవిశంకర్‌ప్రసాద్, నజ్మా, తమిళ మానిల కాంగ్రెస్ అధ్యక్షుడు జీకే.వాసన్, ఎండీఎంకే అధినేత వైగో, సీపీఐ జాతీయ నేత అతుల్ కుమార్ అంజన్, దేశీయవాద కాంగ్రెస్ నేత శరద్‌పవార్ జయలలితకు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలి యజేసిన వారిలో ఉన్నారు. రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రో శయ్య జయలలితకు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలపడంతో పాటు ఒక బొకేను పోయెస్ గార్డెన్‌కు పంపిం చారు. ఇక అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్, సీఎం పన్నీరు సెల్వం, మంత్రులు నత్తం విశ్వనాథన్, వైద్యలింగం, ఎడపాడి పళని స్వామి, పార్లమెంట్ డెప్యూటీ స్పీకర్ తంబిదురై జయలలితను కలుసుకుని తమ ఆనందాన్ని పంచుకున్నారు. మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టాలని మదుసూదనన్, పార్టీ క్రమశిక్షణ సంఘం నే త, సీఎం పన్నీరు సెల్వంతో పాటు సీనియర్ మంత్రు లు కోరినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
ప్రజలకు వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు
తెలుగు ప్రజలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో సుఖ సంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలు నింపాలని ఆయన ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని కొనియాడారు. పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలన్నారు. పాడిపంటలతో పల్లెలు కలకల్లాడినప్పుడే ప్రజలు ఆనందంగా ఉంటారన్నారు. ప్రజలు సుఖసంతోషాలు, భోగభాగ్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయాన్ని పండగ చేసేందుకు విధివిధానాలు రూపొందించాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. ఈ సందర్భంగా.. రైతులు సంతోషంగా ఉన్నప్పుడే రాష్ట్రం, దేశం సంతోషంగా ఉంటాయని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. -
వైఎస్ జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు 2015 చిరస్మరణీయ సంవత్సరం కావాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. 2015లో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని వైఎస్ జగన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కొత్త ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా శ్రేయస్సుకు కొత్త లక్ష్యాలు నిర్దేశించుకోవాలని సూచించారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని తెలుగు ప్రజలకు మేలు చేయాలని వైఎస్ జగన్ కోరారు. -
న్యూ ఇయర్.. గ్రీటింగ్స్
ఎంత ఘనంగా స్వాగతం పలుకుతామో... అంతే గొప్పగా మిత్రులు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పడం న్యూ ఇయర్ స్పెషల్. కంప్యూటర్ యుగం... స్మార్ట్ ఫోన్ల రాజ్యం... ఎస్ఎంఎస్ల మయం. అయినా ఆనాటి నుంచి ఈ నాటి వరకు గ్రీటింగ్ కార్డ్స్‌కు క్రేజ్ తగ్గలేదు. విభిన్నమైన డిజైన్లు.. థీమ్‌లతో పైన ఎంతగా ఆకట్టుకుంటుందో... తెరిచి చూస్తే ఆత్మీయత, అనుబంధాన్ని ప్రతిబింబించేలా అంతే చక్కని సందేశాలు... ప్రియమైనవారి చేవ్రాలుతో మనసుకు హత్తుకుంటుంది. కలకాలం ఓ మధుర జ్ఞాపకంలా మనతోనే నిలిచిపోతుంది. టెక్నాలజీలో దూసుకుపోతున్నా... నగరం కాంక్రీట్ జంగిల్‌గా మారినా... ‘సమ్‌వన్ స్పెషల్’కు ‘సమ్‌థింగ్ స్పెషల్’ ఎప్పుడూ గ్రీటింగ్ కార్డులే. ఈసారి న్యూ ఇయర్‌కు సిటీలో షాపుల్లో విభిన్నమైన గ్రీటింగ్ కార్డ్స్ కొలువుదీరాయి. యువతరం వాటిపై ఇంకా మనసు పారేసుకుంటూనే ఉంది. సికింద్రాబాద్‌లోని ఓ గ్రీటింగ్ షాప్‌లో మంగళవారం దృశ్యమిది. -
రాహుల్ దీపావళి శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో దీపావళి జరుపుకోవాలని ఆకాంక్షించారు. దేశ ప్రజలు శాంతి సామరస్యాలతో, సంపదతో జీవించాలని రాహుల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
తెలుగువారికి వైఎస్ జగన్ దీపావళి శుభాకాంక్షలు
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి తెలుగువారి జీవితాల్లో వెలుగు నింపాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. దీపావళి పండగ కోసం చేసే ఖర్చులో కొంత భాగం హుదూద్ తుపాన్ బాధితులకు అందించాలని జగన్ కోరారు. తుపాన్ తీవ్రంగా దెబ్బతిన్న ఉత్తరాంధ్రకు సాయం చేయాలని వైఎస్ జగన్ తెలుగు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. దైవత్వానికి, త్యాగానికి బక్రీద్ ప్రతీకని జగన్ పేర్కొన్నారు. ముస్లింలు ఎంతో భక్తిశ్రద్దలతో జరుపుకునే పండుగ బక్రీద్ అని వైఎస్ జగన్ తెలిపారు. దైవ ప్రవక్తను స్మరించుకుంటూ ముస్లింలు చేసుకునే బక్రీద్ పండుగ భక్తి భావానికి చిహ్నమని జగన్ అన్నారు. -
మోడీకి పాక్ ప్రధాని శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: భారత 68వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మన ప్రధాని నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలియజేశారు. భారత ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని షరీఫ్ ఓ అధికారిక ప్రకటనలో ఆకాంక్షించారు. భారత్‌లో పాకిస్థాన్ హైకమిషన్ కార్యాలయంలో ఈ ప్రకటన విడుదల చేసింది. -
కేసీఆర్‌కు ప్రముఖుల శుభాకాంక్షలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కే చంద్రశేఖర రావుకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కేసీఆర్‌కు అభినంనదలు తెలియజేశారు. కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి, మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు, అభిమానులు కేసీఆర్‌ను కలిసి అభినందించారు. -
కేసీఆర్‌ను కలసిన ఫిలిం చాంబర్ నాయకులు
సాక్షి, సిటీబ్యూరో: ఏపీ ఫిలిం చాంబర్ అసోసియేషన్, ఏపీ ప్రొడ్యుసర్స్ అసోసియేషన్, మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ నాయకులు, పలువురు సినీ ప్రముఖులు బుధవారం టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా త్వరలో బాధ్యతలు స్వీకరించనున్న కె.చంద్రశేఖరరావు(కేసీఆర్)ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు. మురళీమోహన్, రామానాయుడు, సురేష్‌బాబు, దిల్ రాజు, అలీ, వేణుమాధవ్ కేసీఆర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. అనంతరం మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ..నూతనంగా బాధ్యతలు చేపట్టే ముఖ్యమంత్రికి ఫిలిం చాంబర్ , ప్రొడ్యుసర్స్ అసోసియేషన్, మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలపడం ఆనవాయితీ అని, ఆ ప్రకారమే కేసీఆర్‌ను కలిశామన్నారు. త్వరలోనే సినీ పరిశ్రమ నాయకులు, ప్రతినిధులతో సమావేశం అవుతానని కేసీఆర్ చెప్పారన్నారు. ప్రముఖ నటి జమున కూడా కేసీఆర్‌ను కలసి శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌ను కలిసిన మోహన్‌బాబు కేసీఆర్‌ను సినీనటుడు మోహన్‌బాబు బుధవారం కలిశారు. పుష్పగుచ్ఛాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని, పేదలకు పంచాలని కేసీఆర్‌ను కోరినట్టు మోహన్‌బాబు వెల్లడించారు. కొనసాగుతున్న అభినందనల వెల్లువ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న కేసీఆర్‌కు అభినందనల వెల్లువ కొనసాగుతోంది. బంజారాహిల్స్‌లోని ఆయన నివాసం టీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, ఉద్యోగ సంఘాల నేతలు, జిల్లాల నుంచి వచ్చిన ప్రజలతో జనసంద్రాన్ని తలపిస్తోంది. బుధవారం కూడా కేసీఆర్ నివాసానికి నాయకులు, ప్రజల తాకిడి కొనసాగింది. రాజకీయ నేతల నుంచి అధికారుల దాకా పెద్ద సంఖ్యలో బుధవారం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు. -
ఎవరి ఎజెండా వారిదే అన్నట్టున్న గ్రీటింగ్ కార్డులు
-
‘క్రిస్‌గేల్’ మేక.. 2 లక్షల పొట్టేలు!!
నల్లగా నిగనిగలాడిపోతున్న ఈ మేకను చూశారా? దీనిపేరు క్రిస్ గేల్!! బరువు సుమారు 100 కిలోలు. రాజస్థాన్ నుంచి దిగుమతి అయిన దీని ధర రూ.90 వేలు. ఇక తెల్లగా తళతళలాడిపోతున్న పొట్టేలు బరువు 160 కిలోలు. దాని ధర అక్షరాలా 2 లక్షల రూపాయలు. వయసు మూడేళ్ల్లు. బక్రీద్‌ను పురస్కరించుకొని ముషీరాబాద్ ఏక్‌మినార్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ రహీమ్ పంజాబ్ నుంచి దీన్ని తీసుకొచ్చారు. కాగా, బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులు, సోదరీమణులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి, దైవత్వానికి ప్రతీక అయిన బక్రీద్‌ను ముస్లీంలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని ఆయన పేర్కొన్నారు.