
ప్రజలకు వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు
తెలుగు ప్రజలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో సుఖ సంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలు నింపాలని ఆయన ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని కొనియాడారు. పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలన్నారు.
పాడిపంటలతో పల్లెలు కలకల్లాడినప్పుడే ప్రజలు ఆనందంగా ఉంటారన్నారు. ప్రజలు సుఖసంతోషాలు, భోగభాగ్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయాన్ని పండగ చేసేందుకు విధివిధానాలు రూపొందించాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. ఈ సందర్భంగా.. రైతులు సంతోషంగా ఉన్నప్పుడే రాష్ట్రం, దేశం సంతోషంగా ఉంటాయని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.