మత్స్యకార దినోత్సవం సందర్భంగా గంగపుత్రులకు శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
వారి స్థితిగతులను మెరుగుపరిచేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం
10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం
వేట నిషేధ సమయంలో 1,23,519 కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం చేశాం
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేశామని.. వారి స్థితిగతులను మెరుగుపరిచేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుర్తు చేశారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని గంగపుత్రులందరికీ వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ మేరకు గురువారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘మత్స్యకారుల సంక్షేమం కోసం మన ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. సముద్రంపై వేటకు వెళ్లే మత్స్యకారుల స్థితిగతులను మెరుగుపరచాలనే లక్ష్యంతో రూ.3,767.48 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం.
వేట నిషేధ సమయంలో దాదాపు 1,23,519 మత్స్యకార కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం చేశాం. సబ్సిడీపై డీజిల్ అందించాం. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని గంగపుత్రులందరికీ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment