pongal
-
'బేసికల్లీ, టెక్నికల్లీ, లాజికల్లీ, ప్రాక్టీకల్లీ అండ్ ఫైనల్లీ'.. వెంకీమామ ఫుల్ సాంగ్ చూశారా?
విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఫర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఏడాది పొంగల్ కానుకగా థియేటర్లలోకి వచ్చిన బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ మూవీకి మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. జనవరి 14న రిలీజైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.276 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.అయితే ఈ మూవీలో ఓ సాంగ్ విక్టరీ వెంకటేశ్ స్వయంగా ఆలపించారు. బేసికల్లీ, టెక్నికల్లీ, లాజికల్లీ, ప్రాక్టీకల్లీ అండ్ ఫైనల్లీ.. అంటూ సాగే పాట ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. తాజాగా ఈ సాంగ్ ఫుల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ముఖ్యంగా వెంకటేశ్ పాడిన సాంగ్ కావడంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు సాహిత్యం అందించగా.. భీమ్ సిసిరోలియో సంగీతమందించారు. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. -
కోలీవుడ్‌లో గేమ్ చేంజ్
సంక్రాంతి అంటే స్టార్ హీరోల చిత్రాలు కనీసం మూడు నాలుగైనా ఉండాలి. అప్పుడే సినీ లవర్స్‌కి అసలైన పండగ. కానీ ఈ పొంగల్‌కి తమిళ తెరపై ఒకే ఒక్క స్టార్ హీరో కనిపించనున్నారు. అది కూడా తెలుగు స్టార్ రామ్‌చరణ్. ‘గేమ్ చేంజర్’ తమిళంలో డబ్ అయి, విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇక తమిళంలో అజిత్ ‘విడాముయర్చి’ పొంగల్ రేసు నుంచి తప్పుకుంది. మొత్తంగా తమిళంలో ఆరేడు స్ట్రయిట్ చిత్రాలు పొంగల్‌కి రానున్నాయి. అవి కూడా మీడియమ్ కంటే ఓ మెట్టు ఎక్కువ ఉన్న హీరోలు, ఓ మెట్టు తక్కువ ఉన్న హీరోలవే. హీరోల రేంజ్ పక్కన పెడితే... ఒకవేళ కథాబలం ఉండి, ప్రేక్షకులను ఆకట్టుకుంటే మీడియమ్ రేంజ్ సినిమా పెద్ద రేంజ్ అయిపోతుంది. మరి... పొంగల్పోటీలో వసూళ్లు కొల్లగొట్టే సినిమా ఏది? అనేది తర్వాత డిసైడ్ అవుతుంది. ఇక ఈ పొంగల్‌కి తెరపైకి రానున్న చిత్రాల గురించి తెలుసుకుందాం...తెలుగు సినిమాకి సంక్రాంతి సీజన్ ఎంత ముఖ్యమో తమిళ ఇండస్ట్రీకి పొంగల్ కూడా అంతే ముఖ్యం. వరుస సెలవులను క్యాష్ చేసుకునే వీలు ఉన్న సీజన్ కాబట్టి భారీ చిత్రాల విడుదలను ప్లాన్ చేస్తుంటారు. ఎప్పటిలానే ఈసారి తెలుగులో భారీ చిత్రాలు విడుదలకు సిద్ధం అయ్యాయి. సీనియర్ స్టార్ హీరోలు బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సంక్రాంతి సందడికి రెడీ అయ్యాయి. యంగ్ స్టార్ రామ్‌చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ కూడా ఈ పండగకి రానుంది. అయితే అటు తమిళంలో మాత్రం మీడియమ్ రేంజ్ హీరోల చిత్రాలే విడుదల కానున్నాయి. ఆ మాట కొస్తే... గతేడాది కూడా కోలీవుడ్ పరిస్థితి ఇదే. ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ మినహా మిగతావన్నీ ఓ మోస్తరు చిత్రాలే.ఈసారి అజిత్ ‘విడాముయర్చి’ రావాల్సింది కానీ సంక్రాంతి రేసు నుంచి ఆ సినిమా తప్పుకోవడంతో ఇక పొంగల్‌కి పెరియ పడమ్ ఇల్లే (సంక్రాంతికి పెద్ద సినిమా లేదు) అన్నట్లు అయింది. సో... ఉన్నదంతా ‘గేమ్ చేంజర్’ మాత్రమే. అనువాద రూపంలో తమిళ తెరపై ‘గేమ్ చేంజర్’ కనిపించనుంది. ‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబల్ స్టార్ అనిపించుకున్న రామ్‌చరణ్ హీరోగా నటించిన చిత్రం కావడం, తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన చిత్రం కావడం, సక్సెస్ఫుల్ ప్రోడ్యూసర్ ‘దిల్’ రాజు నిర్మించిన చిత్రం కావడంతో ‘గేమ్ చేంజర్’పై తమిళనాడులోనూ భారీ అంచనాలు ఉన్నాయి. సో... ఒక స్టార్ డైరెక్టర్–స్టార్ హీరో–స్టార్ ప్రోడ్యూసర్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం కావడంతో కోలీవుడ్ పొంగల్ బాక్సాఫీస్ దగ్గర ఆట అంతా ‘గేమ్ చేంజర్’దే అని చె΄÷్పచ్చు. వేరే పెద్ద చిత్రాలు లేకపోవడంతో ఈ చిత్రానికే ఎక్కువ థియేటర్లు లభించాయి. ‘గేమ్ చేంజర్’కి ఇదో మంచి అవకాశం.10న 3 సినిమాలు ఈ నెల 10న తెలుగులోనూ, అనువాద రూపంలో తమిళ్, హిందీ భాషల్లోనూ ‘గేమ్ చేంజర్’ విడుదల కానుంది. అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, ‘దిల్’ రాజు ప్రోడక్షన్ బ్యానర్స్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ దాదాపు రూ.450 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు సమాచారం. శంకర్ అంటే దాదాపు లార్జ్ స్కేల్ సినిమానే అవుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘గేమ్ చేంజర్’తోపాటు 10న తమిళంలో విడుదల కానున్న వాటిలో విలక్షణ నటుడు బాల దర్శకత్వంలో అరుణ్ విజయ్ నటించిన ‘వణంగాన్’, మలయాళ నటుడు షానే నిగమ్ తమిళ తెరకు హీరోగా పరిచయం అవుతున్న ‘మద్రాస్క్కారన్’ చిత్రాలు ఉన్నాయి. నిజానికి ‘వణంగాన్’ని సూర్య హీరోగా ప్లాన్ చేశారు బాల.అయితే కొన్ని కారణాల వల్ల అరుణ్ విజయ్‌తో ఈ చిత్రం చేశారు. ఒకవేళ సూర్యతో చేసి ఉంటే... పొంగల్ రేస్‌లో తమిళంలో ఓ స్టార్ ఉండి ఉండేవారు. ఇక ‘మద్రాస్ క్కారన్’ విషయానికొస్తే... గతేడాది ‘రంగోలి’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన వాలీ మోహన్‌దాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మలయాళ యంగ్ హీరో షానే నిగమ్ నటించారు. 11 ఏళ్ల తర్వాత 12న ఇక పొంగల్ రేస్‌లోని తమిళ చిత్రాల్లో చెప్పుకోదగ్గ మాస్ హీరో అంటే విశాల్. ‘మద గజ రాజా’ చిత్రంతో ఈ 12న రానున్నారు విశాల్. ఈ సినిమా 2013లో విడుదల కావాల్సింది. కొన్ని కారణాల వల్ల కుదరలేదు. చివరికి 11 ఏళ్ల తర్వాత ఈ 12న విడుదల కానుంది. సుందర్.సి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.పొంగల్ రోజున... పండగ రోజున ఆకాశ్ మురళి అనే నూతన హీరో వెండితెరకు పరిచయం కానున్నారు. ‘ఇదయం’ (హృదయం) ఫేమ్ మురళి రెండో కుమారుడే ఆకాశ్ మురళి. ఆల్రెడీ పెద్ద కుమారుడు అథర్వ హీరోగా (తెలుగులో ‘గద్దలకొండ గణేశ్’లో నటించారు) సినిమాలు చేస్తున్నారు. ఇక తమిళంలో ‘బిల్లా, ఆరంభం’ చిత్రాలతో మంచి మాస్ స్టయిలిష్ దర్శకుడు అనిపించుకున్న విష్ణువర్ధన్ నూతన హీరో ఆకాశ్ మురళితో తీసిన ‘నేసి΄్పాయా’ 14న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె అదితీ శంకర్ హీరోయిన్గా నటించారు.ఇక పండగ రోజున సీనియర్ హీరో ‘జయం రవి’ ప్రేమించడానికి సమయం లేదంటూ ప్రేక్షకులు ముందుకొస్తున్నారు. ఆయన హీరోగా నిత్యామీనన్ హీరోయిన్గా నటించిన ‘కాదలిక్క నేరమిల్లై’ (ప్రేమించడానికి సమయం లేదు) చిత్రం ఈ 14న విడుదల కానుంది. ఈ చిత్రానికి కృతికా ఉదయనిధి స్టాలిన్ దర్శకత్వం వహించారు.ఇలా పొంగల్ రేసులో తమిళంలో ఐదు చిత్రాలు నిలవగా, వాటిలో విశాల్, ‘జయం’ రవి పేరున్న హీరోలు కాగా... వీరి తర్వాత అరుణ్ విజయ్ కొంచెం చెప్పుకోదగ్గ హీరో కాగా... మిగతా ఇద్దరిలో యువ హీరోలు ఆకాశ్ మురళి, షానే నిగమ్ ఉన్నారు. ఈ ఐదు చిత్రాలే కాకుండా మరో రెండు మూడు చిన్న సినిమాలు కూడా విడుదల కానున్నాయి. సో... ఎలా చూసుకున్నా పొంగల్‌కి తమిళ ప్రేక్షకుల ముందుకు రానున్న పెద్ద సినిమా ‘గేమ్ చేంజర్’ మాత్రమే. మరి... వసూళ్ల పరంగా ఈ సినిమా ప్రభావం ఇతర చిత్రాలపై ఏ మేరకు ఉంటుంది? పొంగల్పోటీలో బాక్సాఫీస్ హిట్ ఏ సినిమాకి దక్కుతుంది? అనేది మరో వారంలో తెలిసిపోతుంది. గేమ్ చేంజర్‌తో రీ ఎంటర్ కావడం హ్యాపీ ‘సందడే సందడి’తో నిర్మాతగా తెలుగులో ఆదిత్యా రామ్ ప్రయాణం ఆరంభమైంది. ఆ తర్వాత ‘ఖుషీ ఖుషీగా, స్వాగతం, ఏక్ నిరంజన్’ చిత్రాలు నిర్మించారాయన. ‘ఏక్ నిరంజన్’ (2009) తర్వాత మళ్లీ సినిమాలు నిర్మించలేదు. చెన్నైలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. కాగా ‘గేమ్ చేంజర్’ని తమిళంలో విడుదల చేస్తున్నారు ఆదిత్యా రామ్. ‘‘చాలా కాలం తర్వాత ఒక గ్రాండ్ స్కేల్ సినిమాతో వస్తున్నందుకు ఆనందంగా ఉంది. తమిళనాడులో దాదాపు నాలుగువందల స్క్రీన్స్‌లో విడుదల చేస్తున్నాం. రామ్‌చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్లో వస్తున్న ‘గేమ్ చేంజర్’ ఈ వీకెండ్‌కి పెద్ద సినిమా అవుతుంది. ‘దిల్’ రాజుగారి సినిమాని విడుదల చేయడం ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు ఆదిత్యా రామ్. – డి.జి.భవాని‘విడాముయర్చి’ రాకపోవడం నిరుత్సాహమే ‘‘పొంగల్ చాలా పెద్ద పండగ. పైగా ఇది పెద్ద వీకెండ్. పెద్ద హీరోల సినిమాలు రాకపోతే అస్సలు పండగలానే అనిపించదు. తమిళనాడులోని థియేటర్ ఓనర్స్ అందరూ అజిత్ హీరోగా నటించిన ‘విడాముయర్చి’ కోసం ఎదురు చూశారు. హఠాత్తుగా ఈ సినిమా వాయిదా పడటంతో అందరూ నిరుత్సాహపడ్డారు’’ అంటూ తమిళ చిత్రపరిశ్రమకు చెందిన ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. -
సంక్రాంతి స్పెషల్ స్వీట్స్ : నోరూరించేలా, ఈజీగా ఇలా ట్రై చేయండి!
సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే వేళ మకర సంక్రాంతిని సంబరంగా జరుపుకుంటాం. ఏడాదిలో తొలి పండుగ కూడా. మరి అలాంటి పండగకి ఘుమఘుమ లాడే పిండి వంటలు లేకపోతే ఎలా? కొత్త అల్లుళ్లు, అత్తారింటి నుంచి ఎంతో ఆశతో పుట్టింటికి వచ్చిన అమ్మాయిలతో సంక్రాంతి అంతా సరదా సరదాగా గడుస్తుంది. ఈ సంబరాల సంక్రాంతికోసం కొన్ని స్పెషల్ స్వీట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్వీట్ పొంగల్, బూందీ లడ్డూని సులభంగా తయారుచేసే రెసిపీ గురించి తెలుసుకుందాం.సంక్రాంతి అనగానే ముందుగానే గుర్తొచ్చే స్వీట్ పొంగల్. కొత్త బియ్యం, నెయ్యి, బెల్లంతో పొంగల్ తయారు చేసిన బంధు మిత్రులకు పంచి పెడతారు.స్వీట్ పొంగల్స్వీట్ పొంగల్ తయారీకి కావాల్సిన పదార్థాలు : బియ్యం - ఒక కప్పు, పెసరపప్పు లేదా శనగపప్పు-అరకప్పు, పాలు - ఒక కప్పు, బెల్లం - అరకప్పు, కొబ్బరి తురుము - అరకప్పు, ఏలకులు - 4, జీడిపప్పు, ఎండు ద్రాక్షలు కొద్దిగా, నెయ్యి-అరకప్పు.తయారీమొదటపెసరపప్పును నేతిలో దోరగా వేయించుకోవాలి. తర్వాత బియ్యాన్ని శుభ్రంగా కడగాలి. కుక్కర్లో కడిగిన బియ్యం, వేయించిన పప్పు రెండింటినీ వేసుకోవాలి. అందులో సరిపడా నీరు పోసి మూతపెట్టాలి. మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. కుక్కర్ మూత వచ్చేదాకా బెల్లాన్ని సన్నగా తరిగిఉంచుకోవాలి. యాలకుల పొడి చేసుకోవాలి. కొబ్బరిని కూడా తురిమి పక్కన పెట్టుకోవాలి. అలాగే జీడిపప్పు, ఎండు ద్రాక్షల్ని నేతిలో వేయించుకోవాలి. కుక్కర్ మూత వచ్చాక, ఉడికిన అన్నం, పప్పులో మరికొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇందులో ఒక కప్పు పాలు, బెల్లం నీళ్లు పోసి బాగా కలపాలి. సన్నని మంటమీద ఉడకనివ్వాలి. ఇందులో తురిమిన పచ్చి కొబ్బరి వేసి కలపి మరో పది నిమిషాలు ఉడికిస్తే చాలు. తరువాత నేతిలో వేయించి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్ వేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ స్వీట్ పొంగల్ రెడీ.బూందీ లడ్డు కావలసిన పదార్థాలు: శనగ పిండి - 1 కేజీ, నీరు - తగినంత. నూనె - వేయించడానికి సరిపడాపాకం కోసం: బెల్లం - 1కేజీ,కొద్దిగా నీళ్లు, యాలకుల పొడి - 1 టీస్పూన్, నిమ్మరసం - నాలుగు చుక్కలు, జీడిపప్పు ఎండు ద్రాక్ష, చిటికెడు పచ్చకర్పూరం తయారీ విధానం : ముందుగా శనగపిండిని జల్లించుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ గిన్నె తీసుకుని జల్లించిన శనగపిండి వేసుకుని నీళ్లు కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండలు లేకుండా , మృదువుగా ఉండేలా జారుడుగా కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి.ఆ తర్వాత స్టౌ ఆన్ చేసి మూకుడు పెట్టి, సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడెక్కాక, బూందీ గరిటె సాయంతో ముందుగానే కలిపి ఉంచుకున్న శనగపిండి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేయాలి. సన్నగా ముత్యాల్లా బూందీ నూనెలో పడుతుంది. పిండిని ఒకేసారి ఎక్కువ మొత్తంలో బూందీ గరిటెలో వేయకూడదు. ఇలా చేస్తే పిండి ముద్దలు ముద్దలుగా పడుతుంది. కొద్దికొద్దిగా వేసుకుంటూ సన్న మంటమీద బూందీ చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ మొత్తం బూందీనీ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పాకం తయారీఒక కడాయిలో బెల్లం,నీళ్లు పోసి మరిగించాలి. బెల్లం కరిగి కాస్త పాకం వచ్చాక యాలకులు, పచ్చ కర్పూరం వేసి కలపాలి. తీగ పాక వచ్చేదాకా తిప్పుతూ ఉండాలి. నాలుగు చుక్కల నిమ్మరసం కలుపుకుంటే పాకం గట్టిపడకుండా ఉంటుంది. పాకం వచ్చాక జీడిపప్పులు,కిస్మిస్తోపాటు ముందుగా రెడీ చేసుకున్న వేడి వేడి బూందీలను పాకంలో వేసి బాగా కలపండి. కాస్త వేడి వేడిగా ఉండగానే చేతులకు నెయ్యి రాసుకొని మనకు కావాల్సిన సైజులో గుండ్రంగా ఉండలుగా చేసుకోవాలి. అంతే నోట్లో వేసుకుంటే కరిగిపోయే వెన్నలాంటి బూందీ లడ్డు రెడీ! -
జల్లికట్టు చిన్నారి పట్టు
‘జల్లికట్టు’ అంటే ఎద్దును లొంగదీసుకుని దాని కొమ్ములకున్న అలంకరణలను సొంతం చేసుకోవడం. జల్లికట్టు ఎద్దులకు ΄పౌరుషం ఎక్కువ. కొమ్ములకు వాడి ఎక్కువ. తమ మూపురాలను తాకనివ్వవు. అందుకే ఈ మనిషి–పశువు క్రీడ తరాలుగా తమిళనాడులో ఉంది. జల్లికట్టులో దించబోయే ఎద్దుకు తర్ఫీదు ఇస్తూ పదేళ్ల యజిని వార్తల్లోకి ఎక్కింది. రాబోయే సంక్రాంతికి యజిని.. ఎద్దు‘నన్బన్’ చాలా పెద్ద వార్తలనే సృష్టించనున్నాయి.రాబోయే‘΄పొంగల్’కి తమిళనాడులో జల్లికట్టు ధూమ్‌ధామ్‌గా జరగనుంది. మదురై, తంజావూరు, తిరుచిరాపల్లి తదితర ప్రాంతాల్లో ΄పొంగల్ నుంచి మొదలై వేసవి వరకు జల్లికట్టు పోటీలు జరుగుతూనే ఉంటాయి. అక్కడి పల్లెవాసులు కూడా వేలాదిగా వీటిలో పాల్గొంటారు. తమ ఎడ్లను తెచ్చి పాల్గొనేలా చేస్తారు. మన కోళ్ల పందేలకు కోడిపుంజులను తీర్చిదిద్దినట్టే ఇందుకై ఎడ్లనూ తీర్చిదిద్దుతారు. రైతు కుటుంబాల్లో తండ్రులు వారికి తోడు పిల్లలు ఈ పనిలో నిమగ్నమవుతారు. అలాంటి రైతు కూతురే పదేళ్ల వయసున్న యజిని.ఎద్దు– మనిషిమదురైలోని మంగులం అనే గ్రామంలో శ్రీనివాసన్ అనే రైతుకు రెండు ఎడ్లు ఉన్నాయి. వాటిలో ఒకదాన్ని జల్లికట్టులో పాల్గొనేలా చేస్తున్నాడు. ‘జల్లికట్టు’లో ‘జల్లి అంటే రెండు కొమ్ములకు అలంకరణ వస్త్రాలు ‘కట్టు’ అంటే కట్టడం. రెండు కొమ్ముల మధ్య వెండి లేదా బంగారు నాణేలు కూడా కడతారు. ఆటగాళ్లు పరిగెడుతున్న ఎద్దును తాకి, మూపురం పట్టి నెమ్మదించేలా చేసి ఆ అలంకరణలను, నాణేలను సొంతం చేసుకుంటారు. ఎన్ని సొంతం చేసుకుంటే అంత వీరుడిగా గుర్తింపు. అలాగే ఈ వీరులకు చిక్కకుండా వారి మీద కొమ్ము విసిరి తరిమికొడితే ఆ ఎద్దుకు అంతటి ఘనత. ‘మా ఎద్దు కూడా అంతటి గొప్పదే. చాలా మెడల్స్ సాధించింది’ అంటుంది యజిని.పాపకు స్నేహితుడుయజినికి ఐదేళ్లుండగా తండ్రి ఎద్దులను కొన్నాడు. వాటిలో ఒకదానికి యజిని‘నన్బన్’ (స్నేహితుడు) అనే పేరు పెట్టింది. రోజూ దానికి మేత వేయడం, నీళ్లు పెట్టడం, కబుర్లు చెప్పడం ఇదే పని. ‘నేను దగ్గరికి వెళితే ఏమీ చేయదు. పిలవగానే వచ్చేస్తుంది’ అంటుంది యజిని. గత మూడేళ్లుగా జల్లికట్టులో తండ్రితో పాటు నన్బన్ను తీసుకొని వెళుతోంది యజిని. ‘వాడివాసల్ (స్టార్టింగ్ పాయింట్) నుంచి మా నన్బన్ పరుగు అందుకోగానే చాలామంది ఆటగాళ్లు దాని మూపురం పట్టుకోవాలని, కొమ్ములు అందుకోవాలని ట్రై చేస్తారు. కాని మా నన్బన్ అందరి మీదా బుసకొట్టి దూరం పోయేలా చేస్తుంది. ఆట గెలిచాక బుద్ధిగా నా వెంట ఇంటికి వస్తుంది. ఆ ఎద్దు – ఈ ఎద్దు ఒకటేనా అన్నంత డౌట్ వస్తుంది’ అంటుంది యజిని.ట్రైనింగ్జల్లికట్టు కోసం ట్రైనింగ్ యజిని ఇస్తోంది తండ్రితో పాటు. జల్లికట్టులో పాల్గొనే ఎద్దును రోజూ వాకింగ్‌కి, స్విమ్మింగ్‌కి తీసుకెళ్లాలి. తడి నేలలో, మెత్తటి నేలలో కొమ్ములు గుచ్చి కొమ్ములు బలపడేలా చేయాలి. దీనిని ‘మన్ కుథల్’ అంటారు. ఇక మంచి తిండి పెట్టాలి. ఇవన్నీ యజిని చేస్తోంది. ‘నేను ఇంగ్లిష్ మీడియంలో చదువుకుంటున్నా. గవర్నమెంట్ జల్లికట్టు కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎద్దుకు ఎటువంటి అపాయం కలక్కుండా రూల్స్ పెట్టింది. అందుకే నన్బన్ను నేను ధైర్యంగా పోటీకి తీసుకెళ్తా’ అంటోంది యజిని. -
పందెం కోడి.. పండక్కి రెడీ..
సంక్రాంతి వచ్చిందంటే చాలు పల్లెల్లో సందడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో అయితే ఈ హడావుడి ఓ రేంజ్లో ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో చిన్నాపెద్దా, ఆడామగా తేడాలేకుండా పొలోమని వచ్చేస్తారు. కారణం.. అందరినీ ఆకర్షించే కోడిపందేలు. ఈ మూడ్రోజుల పండగ ప్రత్యేకత.. ప్రత్యేక ఆకర్షణ ఇదే. మరో నెలరోజుల్లో ఈ సందడి ప్రారంభం కానుంది. కాలు దువ్వడానికి కోళ్లు.. పందెం రాయుళ్లు రెడీ అయిపోతున్నారు.కైకలూరు : సంక్రాంతి పందేల బరిలో ‘తగ్గేదే లే’ అన్నట్లుగా ఢీకొట్టడానికి కోడిపుంజులు సిద్ధమవుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో పెద్ద పండుగ సమరానికి కసరత్తు మొదలైంది. పండ్ల తోటలు, చేపల చెరువు గట్లు, ఫాం హౌస్‌లు ఇలా చిన్నాపెద్దా కలిపి దాదాపు 450 పుంజుల పెంపక కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో టీడీపీ నాయకులతో పాటు జనసేన నేతలు పందేల బరుల ఏర్పాటుకు పోటీపడుతున్నారు. బరుల స్థల సేకరణలో నిమగ్నమయ్యారు. గుండాట, పేకాట, మద్యం విక్రయాలు, వ్యాపార దుకాణాల కోసం ఆశావహులు కూటమి నేతల ప్రసన్నానికి ప్రయత్నిస్తున్నారు. ఒక్కో పుంజుకు రూ.30 వేల ఖర్చు.. ఇక పందేనికి సిద్ధంచేసే ఒక్కో పుంజుకు రూ.30 వేల వరకు ఖర్చుచేస్తున్నారు. జీడిపప్పు, బాదం, రాగులు, సజ్జలు, నువ్వులు, బెల్లం, డ్రై ఫ్రూట్స్‌తో పాటు ఉడికించిన మటన్, గుడ్లు పెడుతున్నారు. ప్రతిరోజూ ప్రత్యేకంగా నీటిలో ఈత కొట్టిస్తూ, ప్రత్యేక పరికరాల ద్వారా నడిపిస్తారు. కొంతమంది థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్ నుంచి మేలు జాతి కోడిపుంజులను తెప్పించుకుంటున్నారు. ఇటీవల నెల్లూరు జిల్లా రైతులు ఆటోలలో వివిధ జాతుల పుంజులను తీసుకొచ్చి ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో రూ.10 వేల నుంచి రూ.30 వేలకు విక్రయిస్తున్నారు. అలాగే, కోడి పందేలలో ఎదుటి పుంజులు దాడి చేసినప్పుడు వాటిని తప్పించుకుని ఎలాంటి గాయాలు కాకుండా ప్రత్యర్థి పుంజును చంపిన పుంజులను రూ.3లక్షలకు కొనుగోలు చేస్తారు. ఇలాంటి వాటిని ఈ ప్రాంతంలో పందేల నిర్వాహకులు గుర్తిస్తారు. ఇక సంక్రాంతి నెలరోజుల్లో పుంజుల అమ్మకాల ద్వారా రూ.25 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుంది. సుమారు ఏడువేలకు పైగా పుంజుల అమ్మకాలు ఇక్కడ జరుగుతాయని అంచనా.పొరుగు రాష్ట్రాల నుంచి అతిథులు రాకకోడిపందేల కోసం ఏడాది మొత్తం ఎదురుచూసే వారు.. ఈ సమయంలోనే సంవత్సరానికి సరిపడా ఆదాయాన్ని గడించే వారు గోదావరి జిల్లాల్లో అనేకమంది ఉంటారు. ఈ ఏడాది జనవరిలో పండుగ మూడ్రోజులు ఒక్క ఉమ్మడి పశి్చమ గోదావరి జిల్లాలోనే రూ.500 కోట్లపైనే చేతులు మారాయి. ఇక వచ్చే నెలలో జరిగే కోడిపందేలు ఒక రేంజ్లో ఉంటాయని జూద విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ కోడిపందేలను తిలకించడానికి హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాల నుంచి విచ్చేసే అతిథుల కోసం హోటళ్లు, లాడ్జీల బుకింగ్‌లు మొదలయ్యాయి. ప్రధాన సెంటర్లలో అయితే ఇప్పటికే పూర్తయిపోయాయి. అలాగే, బరుల చుట్టూ ఎల్ఈడీ స్క్రీన్లు, ఫ్లడ్‌లైట్లు, బౌన్సర్ల ఏర్పాటుతో పాటు ఎక్కువ పందేలు గెలిచిన వారికి బుల్లెట్లు, స్కూటీలను అందించాలనే యోచనలో నిర్వాహకులు ఉన్నారు. కుక్కుట శాస్త్రంపై నమ్మకం..కోడి పందేల నిర్వాహకులు పురాతన కాలం నుంచి వాడుకలో ఉన్న కుక్కుట శా్రస్తాన్ని (కుక్కుట పురాణం) విశ్వసిస్తారు. కుక్కుటేశ్వరస్వామి నుంచి ఈ పురాణం వినుతికెక్కిందని అంచనా. బొబ్బిలి యుద్ధకాలం నుంచి ఈ శా్రస్తాన్ని పందెపు రాయుళ్లు అనుసరిస్తున్నారు. కోడిపుంజు జన్మనక్షత్రం, జాతకం, 27 నక్షత్ర, వారఫలాలు ఇందులో ఉన్నాయి. పందెం జరిగే తిథిని బట్టి కోడిపుంజు గెలుస్తుందో లేదో అంచనా వేసి మరీ లక్షల్లో పందేలు కడతారు. కోడి పుంజులకు వాటి ఈకల రంగును బట్టి, జాతిని బట్టి రకరకాల పేర్లు ఉన్నాయి. నెమలి, పూల, కాకి, డేగ, పింగళి, సేతు, మైల, పచ్చకాకి, గేరివా, తీతువా ఇలా అనేక జాతులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబరు నుంచి కోడిపుంజులకు ప్రత్యేక శిక్షణ అందించడానికి పందేలలో అనుభవం కలిగిన గురువులను పెంపకందారులు నియమించుకున్నారు. పుంజుల పెంపకం హాబీ.. ఏటా వివిధ జాతుల కోడి పుంజులను పెంచడం ఒక హాబీ. చంటి పిల్లలను తల్లి ఏ విధంగా సాకుతుందో పుంజులనూ అలాగే పెంచుతాం. తల్లి, తండ్రి జీన్స్‌ను పరిగణనలోకి తీసుకుని 18 నెలల వయస్సులోనే పోరాట పటిమను గుర్తిస్తాం. వీటి సంరక్షణకు ప్రత్యేకమైన మందులు వినియోగిస్తాం. ఒక్కో పుంజు తయారీకి అన్నీ కలుపుకుని రూ.30 వేలు ఖర్చు చేస్తున్నాం. – దండు రంగరాజు, ఆక్వా రైతు, కైకలూరు -
Dasara Special 2024: అమ్మవారికి ఆరోగ్య నైవేద్యాలు
నవరాత్రులు పూర్తయ్యాయి. ఈ రోజే దసరా పండుగ. అమ్మవారికి ప్రసాదాలు ఏం వండాలి? ఆరోగ్యంగా రుచిగా సులువుగా ఉండాలి. ముందురోజు నానబోసే శనగ గుగ్గిళ్ల బదులు... అప్పటికప్పుడు స్వీట్ కార్న్ సుండలు చేయండి. చిటికెలో పూర్తయ్యే రవ్వ పోంగలి వండండి. తీపి లేకపోతే పండుగ ఫీల్ రాదంటే పాల పాయసం ఉంది. పాలపాయసంకావలసినవి: బియ్యం– కప్పు; వెన్న తీయని పాలు – లీటరు; చక్కెర – ఒకటిన్నర కప్పు; నెయ్యి– టేబుల్‌స్పూన్; యాలకుల పొడి– అర టీ స్పూన్; కుంకుమ పువ్వు – పది రేకలు.తయారీ: బియ్యం కడిగి నీరంతా పోయేటట్లు చిల్లుల పాత్రలో వేసి ఉంచాలి. ఒక పాత్రలో పాలను మరిగించి పక్కన పెట్టాలి. పెద్ద పాత్ర పెట్టి అందులో నెయ్యి వేడి చేసి అందులో బియ్యం వేసి సన్నమంట మీద వేయించాలి. బియ్యం ఒక మోస్తరుగా వేగిన తరవాత అందులో పాలను పోసి కలిపి ఉడికించాలి. సగం ఉడికిన మంట తగ్గించాలి.బియ్యం మొత్తగా ఉడికిన తరవాత అందులో చక్కెర, యాలకుల పొడి వేసి కలిపి మరికొంత సేపు ఉడకనివ్వాలి. చక్కెర కరిగి తిరిగి మిశ్రమం చిక్కబడిన తర్వాత దించే ముందు కుంకుమ పువ్వు రేకలు వేయాలి. పాల పాయసాన్ని గరిట జారుడుగా ఉండగానే దించేయాలి, పోంగలి వండినట్లు తేమ ఇంకిపోయే వరకు ఉడికించకూడదు. స్వీట్ కార్న్ సుండలుకావలసినవి: స్వీట్ కార్న్ – 2 కప్పులు; పచ్చి కొబ్బరి తురుము – 4 టేబుల్ స్పూన్లు; నెయ్యి – టేబుల్ స్పూన్; ఆవాలు – టీ స్పూన్; మినప్పప్పు – టీ స్పూన్; ఎండుమిర్చి – 2; పచ్చిమిర్చి – 2 (తరగాలి); ఇంగువ – చిటికెడు; కరివేపాకు – 8 రెమ్మలు; ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచినిబట్టి;తయారీ: స్వీట్ కార్న్ గింజలను కడిగి ప్రెషర్ కుకర్‌లో వేసి టేబుల్ స్పూన్ నీటిని చిలకరించి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి దించేయాలి. ప్రెషర్ తగ్గిన తర్వాత మూత తీసి వడపోసి పక్కన పెట్టాలి. బాణలిలో నెయ్యి వేడి చేసి ఆవాలు, ఎండుమిర్చి, మినప్పప్పు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవన్నీ వేగిన తర్వాత కరివేపాకు, ఇంగువ, పచ్చికొబ్బరి తురుము వేసి బాగా కలపాలి. పోపు దినుసులు కొబ్బరికి సమంగా పట్టిన తర్వాత స్వీట్ కార్న్ గింజలు, ఉప్పు వేసి కలిపి చిన్న మంట మీద రెండు నిమిషాల సేపు ఉంచి, మరోసారి బాగా కలిపి దించేయాలి. గోధుమ రవ్వ పోంగలికావలసినవి: గోధుమరవ్వ – 150 గ్రాములు; పెసరపప్పు – 100 గ్రాములు; నెయ్యి– 4 టేబుల్ స్పూన్లు; జీలకర్ర – టీ స్పూన్; మిరియాలు లేదా మిరియాల΄÷డి – టీ స్పూన్; అల్లం తురుము – టీ స్పూన్; ఇంగువ – చిటికెడు; జీడిపప్పు– 15; కరివేపాకు – 2 రెమ్మలు; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి; నీరు – అర లీటరు. తయారీ: మందపాటి బాణలిలో పెసరపప్పును దోరగా వేయించాలి. చల్లారిన తర్వాత కడిగి ప్రెషర్ కుకర్‌లో వేసి పప్పు మునిగేవరకు నీటిని పోసి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. చల్లారిన తర్వాత మెదిపి పక్కన పెట్టాలి. అదే పెనంలో గోధుమపిండి వేసి దోరగా వేయించి పక్కన పెట్టాలి. బాణలిలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, జీలకర్ర, మిరియాలు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, ఇంగువ వేసి వేగిన తర్వాత అందులో మిగిలిన నీటిని పోయాలి. నీరు మరగడం మొదలైన తర్వాత ఉప్పు వేసి కలిపి అందులో రవ్వను వేయాలి. రవ్వ ఉండలు కట్టకుండా ఉండడానికి నీటిలో వేస్తున్న సేపు గరిటతో కలుపుతూ ఉండాలి. రవ్వ ఉడికి దగ్గరవుతున్న సమయంలో ముందుగా ఉడికించి, మెదిపి పక్కన పెట్టిన పెసరపప్పు వేసి కలిపితే రవ్వ పోంగలి రెడీ. -
Dussehera 2024 : నవరాత్రి స్పెషల్, కమ్మని ప్రసాదాల తయారీ
దసరా వేడుకలకు సమయం సమీపిస్తోంది. ఒకవైపు షాపింగ్, మరోవైపు పిండివంటలు సందడి షురూ అయిపోయింది. తొమ్మిది రోజులు అమ్మవారికి పలు రకా నైవేద్యాలు మాత్రమేకాదు, ఇంటికొచ్చే అతిథులకు, మనవళ్లు, మనవరాళ్లకు రకరకాల వంటలు చేసి పెట్టాల్సిందే. ముఖ్యంగా స్వీట్లపై పెద్ద పీట. అటు అమ్మవారికి నైవేద్యంగా ఉపయోగపడేలా, ఇటు ఇంట్లో అందరూ ఇష్టంగా తినేలా కొన్ని వంటకాలు చూద్దాం.పండుగరోజు పులిహోర, పూర్ణం బూరెలు,గారెలు, బొబ్బట్లు (భక్య్షాలు) తదితర వంటకాలు చేసుకోవడం అలవాటు. కానీ సులువుగా చేసుకొనే మరికొన్ని వంటకాలను చూద్దాం.పెసరపప్పు పొంగలికావాల్సిన పదార్థాలుబియ్యం - ఒక కప్పుపెసరపప్పు - ఒక కప్పుబెల్లం - రెండు కప్పులుకొబ్బరి ముక్కలు - అరకప్పుజీడిప్పులు ,బాదం, కిస్ మిస్కొద్దిగా, యాలకు పొడి అరస్పూనునెయ్యి - అర కప్పుతయారీ బాండ్లీలో కొద్దిగా నెయ్యి వేసి, కొబ్బరి ముక్కలు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాతజీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పులను నేతిలో దోరంగా వేయించుకోవాలిఇప్పుడు బియ్యం, పెసపప్పు బాగా కడిగి నీళ్లుపోసి నాలుగు మెత్తగా కుక్కర్లో ఉడికించుకోవాలి. కుక్కర్ మూత వచ్చిక, అన్నంలో ముందుగా తరిగిపెట్టుకున్న బెల్లం తురుము వేసుకొని అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. బెల్లం పాకం వచ్చి, పాయసంలాగా తయారవుతూ, కమ్మని వాసన వస్తూంటుంది. ఇపుడు ముందుగా వేయించుకున్న కొబ్బరిముక్కలు, జీడిపప్పులు, కిస్ మిస్లు,బాదం పలుకులు వేసి బాగా కలపాలి. చివర్లో కొద్దిగా నెయ్యి, యాలకుల పొడి వేసుకుంటే కమ్మని పెసరపప్పు పొంగలి నైవేద్యం రెడీ.కట్టు పొంగలి కావలసిన పదార్థాలుబియ్యం: రెండు కప్పులు,పెసరపప్పు: ఒక కప్పు, మిరియాలు, జీలకర్రకరివేపాకు రెండు రెబ్బలు, అయిదారు పచ్చిమిరపకాయలు కొద్దిగా నెయ్యి, నూనె,ఉప్పు తగినంత, చిటికెడు ఇంగువ: చిటికెడుతయారీ: ఒకటి రెండు చొప్పున పెసరప్పు, బియ్యం శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి.ఇపుడు స్టవ్‌మీద మూకుడు పెట్టి కొద్దిగా నూనె వేసి, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. వేగిన తరువాత కొలతకు తగ్గట్టుగా నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు నానిన బియ్యం, పప్పు , ఉప్పు వేసి కొద్ది సేపు ఉడకనివ్వాలి. మెత్తగా ఉడికాక నేతిలో వేయించుకొన్న జీడిపప్పులు వేసుకోవాలి. అంతే మిరియాలు, ఇంగుల ఘాటుతో, వేడి వేడి నెయ్యితో రుచికరమైన కట్టు పొంగలి రెడీ.బాదం పాయసంకావాల్సిన పదార్థాలుబాదం పప్పులు: ఒక కప్పుపాలు - ఆరు కప్పులుపంచదార - ఒక కప్పునీళ్లు - ఒక గ్లాసుకుంకుమ రేకలు: అయిదు రేకలుతయారీ: ముందుగా బాదం పప్పులను నానబెట్టుకోవాలి. శుభ్రంగా పొట్టుతీసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇపుడు కడాయి పెట్టి చిక్కని పాలు పోసి బాగా మరగనివ్వాలి. పాలు మరిగాక బాదం పేస్టు వేసి బాగా కలపాలి. కదుపుతూ పదినిమిషాల పాటూ ఉడికించాలి. బాదం పాలల్లో బాగా కలిసాక, పంచదార వేయాలి. పంచదార వేసాక పాయం చిక్కబడుతుంది. అడుగు అంటకుండా మెల్లగా కలుపుతూ మరింత చిక్కగా అయ్యేదాకా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇపుడు కొద్దిగా యాలకుల పొడి, నానబెట్టిన కుంకుమ పువ్వు రేకులను అలా పైన చల్లుకోవాలి. అంతే, టేస్టీ, టేస్టీ బాదం పాయసం సిద్దం. -
Happy Pongal 2024: సంక్రాంతి వేడుకల్లో సందడి చేసిన సినీ తారలు (ఫోటోలు)
-
సంక్రాంతి వేకేషన్లో ఐకాన్ స్టార్.. వీడియో వైరల్!
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల ప్రజలు భోగి సంబురాలతో ఈ ఏడాది వేడుకలను ఘనంగా ప్రారంభించారు. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఫెస్టివల్ మూడ్‌లోకి వెళ్లిపోయారు. అగ్ర సినీ తారలంతా తమకు ఇష్టమైన ప్రాంతాలకు వెళ్లిపోయి పొంగల్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఫెస్టివల్ వెకేషన్‌కు వెళ్లిపోయారు. రామ్ చరణ్-ఉపాసన, వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వెళ్తూ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-స్నేహారెడ్డి సైతం బెంగళూరుకు వెళ్లిపోయారు. కుటుంబంతో కలిసి సంక్రాంతి వేడుకల కోసమే బయలుదేరారు. ఎయిర్‌పోర్ట్‌లో బన్నీ దంపతులు వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప పార్ట్-1 సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న పుష్ప-2లో నటిస్తున్నారు. సుకుమార్ డైరెక్షన్లో రూపొందిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. వీరిద్దరి కాంబోలో పుష్ప బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో నటనకు అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ కూడా అందుకున్నారు. కాగా.. పుష్ప-2 చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 15న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. #TFNExclusive: Icon stAAr @alluarjun along with his wife #AlluSnehaReddy were seen 📸 at HYD airport in stylish & chic looks as they're off to Bangalore for Sankranthi celebrations with family! 😍🔥#AlluArjun #Pushpa2TheRule #TeluguFilmNagar pic.twitter.com/zbj3NHc55j — Telugu FilmNagar (@telugufilmnagar) January 14, 2024 -
సత్తెనపల్లిలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు
-
వాకిళ్లు కళ కళ..
సంక్రాంతి వచ్చిందంటే ప్రతి వాకిలి ముగ్గులతో మురిసిపోతుంది. తెల్లటి చుక్కలు మల్లెల్లా ఇంటిముందు వికసిస్తాయి. రంగులు పూసుకొని ముస్తాబవుతాయి. స్త్రీలు తెల్లవారుజాము నుంచి ఓపిగ్గా వీటిని తీర్చుదిద్దుతారు. నిలువు చుక్కలు, అడ్డ చుక్కల మధ్య మెలి తిరుగుతూ రేఖలు కదులుతాయి. ఈ ముగ్గుల వెనుక చాలా విశేషాలున్నాయి. శుభాలూ ఉన్నాయి. బోసి వాకిలిని ముగ్గుతో ఎందుకు కళను నింపాలో తెలుసుకుందాం. సంవత్సరమంతా ఇంటి వాకిలి ముందు సుద్దముక్కతో అమ్మ గీసే ముగ్గు వేరు. సంక్రాంతి రాగానే వేసే ముగ్గు వేరు. సంక్రాంతి పండగ నెలంతా ఇంటిముందు పెద్ద ముగ్గులు పడతాయి. తెల్లగీతలతో ఒక్కోసారి, రంగులతో నిండి ఒక్కోసారి. పండగ నెల వస్తే వీధిలోని స్త్రీలంతా తెల్లవారు జామున లేచి ఇంటి ముందు పెద్ద ముగ్గును వేయడానికి ఇష్టపడతారు. కాని అది ఒక నిమిషంతో అయ్యేదా? వాకిలి చిమ్ముకోవాలి, కళ్లాపి చల్లుకోవాలి, తర్వాత చుక్కలు పెట్టాలి, చుక్కలు కలపాలి, రంగులు అద్దాలి.. యోగా అంటారు గాని ఇంతకు మించిన యోగా లేదు. ఇంతకు మించిన వ్యాయామమూ లేదు. ముగ్గు పెట్టాక ఇంటికి ఇంతకు మించిన కళ లేదు. మనకు ఉంది... మరి క్రిమి కీటకాలకు? సంక్రాంతికి పంట చేతికొస్తుంది. కొత్త బియ్యం ఇంట చేరుతాయి. గాదెలు నిండుతాయి. వడ్ల బస్తాలున్న ఇల్లు సమృద్ధిగా కనిపిస్తుంది. కాని పండించింది మనమే తింటే ఎలా? క్రిమి కీటకాదులకు? ముగ్గు ఒక పంపకం. ముగ్గు ఒక దానం. ముగ్గు ఒక సంతర్పణ. ఎందుకంటే ముగ్గును బియ్యం పిండితో వేస్తారు. బియ్యం సమృద్ధిగా ఉన్నప్పుడు బియ్యం పిండితో పెద్ద పెద్ద ముగ్గులు వేయడానికి కొదవేముంది? ఆ పిండి ముగ్గు వేస్తే ఆ పిండిని చీమలు, క్రిములు, కీటకాలు ఆరగిస్తాయి. అలా ప్రకృతిని సంతృప్తి పరిచిన ఇంటిని ప్రకృతి కాచుకుంటుంది. శుభం జరుగుతుంది. ముగ్గు ఆడవాళ్ల సొంతం భారతీయ సంస్కృతిలో హరప్పా, మొహెంజోదారో కాలం నాటి నుంచే అంటే క్రీ.పూ 2000 కాలం నుంచే ముగ్గులు ఉన్నట్టు ఆధారాలున్నాయి. తమిళనాడులో ముగ్గుకు విశేష ఆదరణ ఉంది. ఉత్తరాదిలో ముగ్గును ‘రంగోలి’ అంటారు. తెలుగువారి సంస్కృతిలో ముగ్గు ఉందనడానికి సాహిత్య తార్కాణాలున్నాయి. కాకతీయుల గాథను తెలిపే ‘క్రీడాభిరామం’లో ‘చందంబున గలయంపి చల్లినారు.. మ్రుగ్గులిడినారు’ అని ఒక పద్యంలో ఉంది. శ్రీకృష్ణదేవరాయలు ‘ఆముక్త మాల్యద’లో ‘బలువన్నె మ్రుగ్గుబెట్టి’ అని ఒక పద్యంలో రాశాడు. అయితే తొలి రోజుల్లో పురుషుల కళగా ఉన్న ముగ్గు క్రమేపి స్త్రీల కళగా మారింది. స్త్రీని ఇంటి పట్టునే ఉంచడం వల్ల, వంటకు, పూజకు, భక్తి గీతాలకు మాత్రమే అనుమతించడం వల్ల, చాలాకాలం ఇతర లలిత కళలకు దూరంగా ఉంచడం వల్ల ‘ఎవరి కంట పడకుండా’ ఇంటి పట్టున సాధన చేసుకునే ముగ్గు మీద ఎవరికీ అభ్యంతరం లేక΄ోయింది. దాంతో స్త్రీలు తమ సృజనాత్మకతను ముగ్గుల్లో చూపారు. ముగ్గుల వల్ల కొద్దో గొప్పో లెక్కలు తెలియడం, ధ్యాస నిలవడం, వేసుకున్న ముగ్గును చూసి సంతృప్తి చెందడం ఆడవాళ్లకు వీలయ్యింది. అంతేకాదు తెల్లవారు జామున స్త్రీలు లేచి వీధి మొత్తాన్ని పలకరించుకుంటూ మానవ సంబంధాలు పెంచుకునే వీలు చిక్కింది. కష్టసుఖాలు మాట్లాడుకునే వీలు కూడా. మనం వేసిన ముగ్గున మరుసటి రోజున మనమే చెరిపిపేయడంలో ఎప్పటికప్పుడు జీవితాన్ని కొత్తగా మొదలెట్టాలన్న భావన, గతం గతః అనుకునే తాత్త్వికత ఏర్పడతాయి. ఇప్పటి కాలంలో కూడా ముగ్గుల్లో మగవాళ్లకు ప్రవేశం లేకపోవడం గమనార్హం. రకరకాల ముగ్గులు ముగ్గుల్లో చాలా రకాలు ఉన్నాయి. వాటి చుక్కలను బట్టి, రూ΄ాలను బట్టి ఆధ్యాత్మిక, ధార్మిక వ్యాఖ్యానాలు ఉంటాయి. తొమ్మిది చుక్కల ముగ్గు నవగ్రహాలకు ప్రతీక అని, చుక్కలు లేకుండా రెండు అడ్డగీతలు గీసి ఖండించుకునే త్రికోణాలతో వేసే ముగ్గు కుండలినికి గుర్తు అని అంటారు. అలాగే పురాణాలను తెలిపే, అవతారాలను సూచించే ముగ్గులు ఉంటాయి. రాను రాను ఈ ముగ్గులు సందేశాత్మకంగా కూడా మారాయి. దేశభక్తిని తెలిపే నాయకుల బొమ్మలు, జాతీయ పతాకాలు ముగ్గుల్లో చేరాయి. ఒక్కోసారి నిరసనలకు, నినాదాలకు కూడా వేదికలయ్యాయి. ముగ్గు ప్రథమ లక్ష్యం పారిశుద్ధత. ఇంటిముంగిలిని శుభ్రం చేసుకుని వేస్తారు కాబట్టి ఆ రోజుల్లోకాని ఈ రోజుల్లోకాని సగం రోగకారకాలు ఇంట్లో రాకుండా ఉంటాయి. అయితే రాను రాను స్త్రీలు బద్దకించి ఆధునికత పేరుతో స్టిక్కర్ ముగ్గులతో సరి పెట్టడం కనిపిస్తోంది. చిటికెన వేళ్ల మధ్య ముగ్గు ఎంత ధారగా వేయడం వస్తుందో అంత నైపుణ్యం వచ్చినట్టు. ముగ్గు వేయడంలో నైపుణ్యం వస్తే జీవితాన్ని చక్కదిద్దుకోవడంలో కూడా నైపుణ్యం వస్తుంది. సంక్రాంతిని బ్రహ్మాండమైన ముగ్గులతో స్వాగతం చెపుదాం. -
సీఎం స్టాలిన్ సంక్రాంతి కానుక
చెన్నై: తమిళనాడు సీఎం స్టాలిన్ సంక్రాంతి కానుకను పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 2 కోట్ల రేషన్ కార్డుదారులకు రూ.1000ని పండగ కానుకగా అందజేశారు. దీంతోపాటు చెరకు గడ, కిలో ముడి బియ్యం, చెక్కర, చీర, దోతీలను పంపిణీ చేశారు. వీరితో పాటు తమిళనాడులో శరణార్థులుగా ఉన్న శ్రీలంక తమిళులకు కూడా ఈ కానుకను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని అళ్వార్‌పేటలో ప్రారంభించినట్లు ఎక్స్ వేదికగా పంచుకున్నారు. Tamil Nadu Chief Minister MK Stalin inaugurates state government's Pongal gift hamper scheme in Chennai; also distributes gift hampers to people pic.twitter.com/kC7AlW82oF — ANI (@ANI) January 9, 2023 రాష్ట్రంలో ఉన్న 2,19,71,113 మంది రేషన్ కార్డుదారులు, శిబిరాల్లో ఉన్న శ్రీలంక తమిళ శరణార్థులకు దాదాపు రూ. 2,436.19 కోట్ల అంచనా వ్యయంతో సంక్రాంతి కానుకను అందజేశారు. ఈ పంపిణీలో జనం రద్దీని నివారించేందుకు టోకెన్ విధానాన్ని అమలుపరిచారు. 1.77 కోట్ల దోతి, చీరలను పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇదీ చదవండి: కర్ణాటక అసెంబ్లీ ఎదుట కుటుంబం ఆత్మాహుతి యత్నం -
Pongal: భాగ్యవంతులొస్తున్నారు..
ఆశలు మూటలు నెత్తిన మోస్తూ గతంలో తాము నడిచివెళ్లిన బాటల్లో ఆనందపు అడుగులను వెతుక్కుంటూ భాగ్యవంతులు వస్తున్నారు. ఇంకో వారంపదిరోజుల్లో హైదరాబాద్, బెజవాడ..గుంటూరు..నెల్లూరు..నల్గొండ.. ఈస్ట్..వెస్ట్.. జిల్లాలనుంచి వేలమందిని మోసుకుంటూ రైళ్లు బస్సులు మన్యం జిల్లాకు వస్తుంటాయి. వాళ్లంతా వలసకూలీలని సామాజికవేత్తలు అంటుంటారు కానీ నాలాంటి అల్ప సంతోషులు మాత్రం వాళ్ళను భాగ్యవంతులు అంటారు. వాళ్లంతా ఇక్కడ బతకలేని పేదలని మేధావులు అంటారు. నాలాంటి సామాన్యులు మాత్రం వాళ్లంతా తమ బతుకులు బాగుచేసుకునేందుకు జిల్లాల హద్దులు దాటిన శ్రమజీవులని అంటాం భోగి ముందురోజు రాత్రి ఐడ్రా బాడ్ నుంచొచ్చిన అప్పలనాయుడు, లక్ష్మీ, నాయుడి వీరకాడు నారాయణ, ఇరుగుపొరుగు వట్టిగడ్డి కుప్పేసి దమట ముట్టించి సుట్టూ కూకుని కవుర్లు మొదలెట్టారు.. మరేటిబావా ఐడ్రాబాడ్లో అంతా బాగున్నట్టేనా అన్న నారాయణ ప్రశ్న పూర్తి కాకుండానే లక్ష్మీ అందుకుని.. పర్లేదన్నియ్యా ఇద్దరం డూటీకి వెళ్తాం..మాతోబాటే మా మహేసూ వస్తాడు.. ముగ్గురికి బాగానే వస్తాది అదోరం సెలవు.. ఒకలి జీతం అద్దికి.. ఖర్చులకు పోయినా రెండు జీతాలు మిగుల్తాయి.. మరి దాంతోటే కదా ఈ ఇల్లు పునాదులు రేకులు వెయ్యడం.. పెద్దదాని పెళ్లి అప్పు లచ్చన్నర తీర్చడం..చిన్నదాన్ని నర్స్ ట్రైనింగ్.. అంతా దాన్లోంచే అంటున్నప్పుడు ఒకనాడు వంద నోటును అబ్బురంగా చూసిన పేదరికాన్ని కష్టంతో దాటుకొచ్చాము అంటున్న లక్ష్మీ ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. అంతలోనే లక్ష్మీ మళ్ళీ అందుకుని తిండికి.. గుడ్డకు లోటు లేదన్నియ్యా.. మీ బావకు మాత్రం వారానికి మూడ్రోజులు కౌసు ఉండాలి అంటున్నప్పుడు ఆరేడేళ్ళు క్రితం ఇదేఊళ్ళో అడ్డిడు బియ్యం.. తవ్విడు నూకలికి ఇల్లిల్లూ తిరిగిన జ్ఞాపకాన్ని మర్చిపోలేదు అంటూనే ఇప్పుడు మేం అలా లేం. మేం కష్టంతో స్థాయిని పెంచుకున్నాం అంటుంది.. పోన్లేర్రా ఊళ్ళో అయినోళ్ళ ముందు చెడి .. చెయ్యిచాచి బతకడం కన్నా ఊరుదాటి బాగుపడడం మేలని నారాయణ చెబుతుండగా పక్కింది వదిన చేటలో చెత్త పెంటమీద పారేస్తూ దమటకాడికి వస్తూనే ఏటీ నచ్చిమొదినా చెవులోవి కొత్తవా ఏటీ అన్నాది. వెంటనే లక్ష్మీ మొహాన్ని సంతోషం కమ్మేయగా..అవును మంగొదినా ఇన్నాళ్లకు ఆర్తులం సెయిను, ఆర్తులం జూకాలూ చేయించాడు మీ అన్నియ్య అని చెబుతూ భర్తను మురిపెంగా చూస్తుంటే దమట వెలుగులో జూకాలు మరింత మెరుస్తూ కనిపించాయి. ఇదిగో ఈ సీర్లన్నీ సీఎమ్మారులో కొనేసామ్ ఒకేసారి అంటున్నప్పుడు అప్పట్లో పాతచీరలకోసం తెలిసినవాళ్లను అడిగిన లక్ష్మీ గొంతులో మాకిప్పుడా అవసరం లేదన్న భరోసా వినిపించింది.. మొన్నామధ్య యాదగిరి వెళ్ళాము. తిరప్తి కన్నా పెద్దది తెలుసా.. ఇంతంత కాదని చెబుతున్నపుడు మేం విహారయాత్రలకూ వెళ్తాం..మేం అప్పట్లా లేం.. అనే ధీమా ముప్పిరిగొంటుంది. పాత్రల పేర్లు మారతాయేమో కానీ పార్వతీపురం డివిజన్లోని ప్రతిగ్రామంలోనూ ఇలాంటి కుటుంబాలు ఉన్నాయి. ఆరేడేళ్ళ క్రిందట పూటపుటనూ లెక్కించుకుని జీవించే వందలాది కుటుంబాలు.. కాలాన్ని నిందించలేదు. ప్రభుత్వాలను తిట్టలేదు. కష్టాన్ని నమ్ముకుని ట్రైన్..బస్సు ఎక్కి.. ఆ జిల్లాలకు వెళ్లాయి. రైస్ మిల్లులు..నూలు మిల్లులు..టాబ్లెట్స్.. ప్లాస్టిక్ కంపెనీలు..చేపలు..రొయ్యల చెరువులు..ఫామ్ హవుసులు.. కోళ్లఫారాలు..డైరీ ఫారాలు.. ఎక్కడ పనిదొరికితే అక్కడ చేరిపోయారు.. పాపం అమాయకులు..నిజాయితీగా ఒళ్ళోంచి పనిచేస్తారు.. అందుకేనేమో కొద్దిరోజుల్లోనే యజమానులకు ఇష్టులైపోయారు. చాలామందికి..చిన్నపాటి షెడ్.. ఇల్లు..రేషన్ కూడా యజమానులే ఇస్తారు..ఇక ఖర్చేముంది.. మూణ్ణాలుగేళ్ళు తిరిగేసరికి తమ జీవితం మారుతుందన్న.. మారిందన్న తేడా వాళ్ళకే స్పష్టంగా కనిపిస్తోంది. కోట్లు లేకపోవచ్చు..లక్షలూ అక్కర్లేదు. శ్రమే పెట్టుబడి.. మూడేళ్లు తిరిగేసరికి మెల్లగా చేతిలో డబ్బు కనిపిస్తుంది..తమ అభివృద్ధి తమకే తెలుస్తోంది. ఓపికున్నన్నాళ్లు చేద్దాం..ఊళ్ళోకొచ్చి మాత్రం చేసేదేముందన్న ధీమా.. కష్టంలోనే ఆనందం.. వచ్చే జీతంలోనే సంతోషం ..ఆ పక్కనే సంబరం.. ఇంతకన్నా భాగ్యవంతులెవరు.. డబ్బుమాత్రమే ఉన్నోళ్లు ధనవంతులు అవుతారు. జీవితంలో అన్నీ కోణాలూ..అన్ని భావాలూ.. అన్ని ఎత్తుపల్లాలూ చూసి తమను తాము గెలిచినవాళ్ళు భాగ్యవంతులే... ఓ రాసీరాయని పెన్నుతో వీళ్ళ జీవనరేఖలను బ్రహ్మ తన ఇష్టానుసారం రాసేస్తుంటే బ్రహ్మచేతిని ఒడిసిపట్టుకుని అలాక్కాడు.. మా రాత మేం రాసుకుంటాం.. నువ్ పక్కకేళ్లు సామీ అని గదమాయించి తమ రేఖలను భాగ్యరేఖలుగా మార్చుకున్న కుటుంబాలు కోకొల్లలు... వీళ్ళెవరూ పేదలు కారు...అవును పేదలు కారు...అక్షరాలా శ్రామికులు.. కార్మికులు... కృషి..శ్రమ ఉన్నచోట పేదరికం ఉండదు. దానికి వీళ్లంటే భయమెక్కువ.. పారిపోతుంది.. ఎక్కడికి..ఇంకెక్కడికి.. సోమరిపోతుల దగ్గరకు... శ్రమయేవ జయతే కృషితో నాస్తి దుర్భిక్షం. గాంధీ... విజయనగరం -
పొంగల్ బరిలో మరో చిత్రం.. ఆ స్టార్ హీరోలతో పోటీ!
సంక్రాంతి వచ్చిందంటే చాలు బాక్సాఫీస్ వద్ద పోటీ మామూలుగా ఉండదు. స్టార్ హీరోల సినిమాలు పొంగల్ బరిలో ఉండడం సహజం. అలాగే వచ్చే ఏడాది కూడా కోలీవుడ్ స్టార్స్ రజనీకాంత్, ధనుష్ చిత్రాలు కూడా ఉన్నాయి. స్టార్ హీరోలతో మరో చిత్రం పోటీకి సిద్ధం అవుతోంది. అరుణ్ విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మిషన్ చాప్టర్– 1. ఐచ్చంయన్బదు ఇల్లయే. ఈ చిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్గా కనిపించనున్నారు. ఆమెతో పాటు నటిగా మలయాళంలో మంచి పేరు తెచ్చుకున్న నిమీషా సజయన్ నాయకిగా నటిస్తున్నారు. ఈ చిత్రం విడుదల హక్కులను లైకా ప్రొడక్షనన్స్ అధినేత సుభాస్కరన్ పొందారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని పొంగల్ సందర్భంగా విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. దర్శకుడు విజయ్ తన దర్శక ప్రతిభతో నిర్మాతలకు నచ్చిన దర్శకుడిగా మారారన్నారు. చిత్ర షూటింగ్‌ను చైన్నె, లండన్‌లో 70 రోజల పాటు నిర్వహించి పూర్తి చేసినట్లు చెప్పారు. మంచి యాక్షన్‌తో రూపొందించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల విడుదల చేసిన చిత్ర టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. ముఖ్యంగా యాక్షన్‌తో కూడిన ఉద్వేగ భరిత సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం త్వరలోనే వివరాలను వెల్లడించనున్నట్లు చెప్పారు. ఈ చిత్రంలో అభిహాసన్, భరత్ బొప్పన్న ముఖ్యపాత్రలు పోషించారు. జీవీ.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. Mission Chapter 1 Teaser (Tamil) https://t.co/hIpcbHhM8Z GRAND WORLD WIDE RELEASE IN PONGAL #MISSION CHAPTER - 1 teasar Bgm music extraordinary All the best #mission entire team 🎉@arunvijayno1 @iamAmyJackson @NimishaSajayan @gvprakash #Mahadev pic.twitter.com/8L9svtJp2F — Satishtanikella (@SatishC68386813) December 24, 2023 -
పుంజు భలే రంజుగా!
సాక్షి, భీమవరం: ఆంధ్రుల అతిపెద్ద పండుగ సంక్రాంతికి దాదాపు ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి సందడిని తెచ్చే కోడి పందేలకు అప్పుడే తెర లేచింది. రాష్ట్రంలో కోస్తా జిల్లాల్లో ఏటా సంక్రాంతి పండుగ మూడు రోజులు పెద్ద ఎత్తున కోడి పందేలు నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు కోడి పందేలకు పెట్టింది పేరు. ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, పరిసర ప్రాంతాల్లో నిర్వహించే కోడి పందేలను వీక్షించడానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు కూడా వస్తారంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో కోడి పందేల నిర్వాహకులు తమ పుంజులను పందెం బరిలో నిలపడానికి సిద్ధం చేస్తున్నారు. కోడి పుంజుల ఎంపిక, వాటికి ప్రత్యేక శిక్షణ, మంచి పౌష్టికాహారం, శారీరక పటుత్వానికి ప్రత్యేక వ్యాయామాలు చేయిస్తూ పందెం బరిలో నిలపడానికి సై అంటున్నారు. మేత, శిక్షణ.. పెద్ద కసరత్తే ఏ వ్యక్తితో అయినా గొడవ పడి, కోపం వచ్చి నప్పుడు నిన్ను పందెం పుంజును మేపినట్టు మేపానని దెప్పడం గోదావరి జిల్లాల్లో సర్వసాధారణం. దీనినిబట్టి పందెం కోళ్లను ఇక్కడ ఏ విధంగా పెంచుతారో అర్థం చేసుకోవచ్చు. పది నిమిషాల పాటు ఉండే పందెం బరిలో ప్రత్యర్థి పుంజును మట్టికరిపించేందుకు కోళ్ల పెంపకందారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. సంక్రాంతికి మూడు నెలల ముందు నుంచే వాటికిచ్చే మేత, శిక్షణలో పెద్ద కసరత్తే చేస్తారు. పండుగ సమయంలో భీమవరం, కోనసీమ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కోడిపందేల కోలాహలమే కనిపిస్తుంది. ఆ మూడు రోజులు కోట్లాది రూపాయలు చేతులు మారతాయి. భీమవరం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసే భారీ బరులు, గ్యాలరీలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. పందేలను చూడటానికి సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు భారీ ఎత్తున వస్తుంటారు. వారితో ముందుగానే హోటళ్లు, లాడ్జిలు నిండిపోతాయి. మటన్ నుంచి డ్రైప్రూట్స్ వరకు.. శిక్షణలో పుంజుకు శక్తి, సామర్థ్యం పెంచేందుకు, దాని శరీరంలో కొవ్వు చేరకుండా సులువుగా ఎగురుతూ ప్రత్యర్థిపై విరుచుకుపడేందుకు మూడు నెలలపాటు ప్రత్యేక మేతను అందిస్తారు. కోడి పరిమాణాన్ని బట్టి ఉదయం పూట 20 నుంచి 40 గ్రాముల వరకు ఉడకబెట్టిన మటన్, మూడు నుంచి ఐదు వరకు బాదం పప్పులు, రెండు వెల్లుల్లి, ఒక ఎండు ఖర్జూరం, ఉడికించిన కోడిగుడ్డు ముక్కలు పెడతారు. సాయంత్రం.. చోళ్లు, గంటులు, మెరికలు మొదలైన వాటిని ఆహారంగా అందిస్తారు. పుంజుకు నొప్పులు తగ్గేందుకు ప్రత్యేక శిక్షణ.. పండుగ దగ్గర పడుతున్నకొద్దీ పుంజు శరీరం గట్టిపడేందుకు, నొప్పులేమైనా ఉంటే తగ్గేందుకు ప్రత్యేక ట్రైనర్లతో నీళ్లపోతలు, శాఖలు చేయిస్తారు. ఇందుకు వేప, జామాయిల్, కుంకుడు, వెదురు, వాయిల తదితర ఆకులు, తుమ్మ బెరడు, తోక మిరియాలు, పసుపు కొమ్ములు తదితర 20 రకాల వాటిని నీటిలో వేసి గంటల కొద్దీ మరిగిస్తారు. ఈ ద్రావణాన్ని చిన్న తొట్టెలో కోడి తట్టుకునే వేడి వరకు చల్లార్చుతారు. ఆ తర్వాత అందులో పుంజును ఉంచి పైనుంచి ద్రావణం పోస్తూ వారం రోజుల వ్యవధిలో ఒకటి రెండుసార్లు నీళ్లపోతలు చేయిస్తారు. చివరిగా శాఖల కోసం పొయ్యిపై మూకుడిని వేడి చేస్తూ.. అందులో చీప్ లిక్కర్ చిమ్మినప్పుడు వచ్చిన ఆవిరిని మెత్తటి గుడ్డకు పట్టించి దాన్ని కోడి శరీరమంతా అద్దుతారు. వారానికి ఒకసారి చొప్పున, కొందరు.. రెండు మూడుసార్లు కూడా ఈ శాఖలు చేయిస్తుంటారు. ఏ ప్రక్రియ అయినా కోడి సామర్థ్యాన్ని బట్టి మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉంటుంది. ఇవే కాకుండా పందెం పుంజు అనారోగ్యం, వైరస్ల బారిన పడకుండా తరచూ పశువైద్యుడిని తీసుకొచ్చి పరీక్షలు చేయిస్తారు. ఆయుర్వేద పద్ధతులను అనుసరించేవారూ ఉన్నారు. పందేలకు ముందు అలసిపోకుండా నాలుగైదు రోజుల ముందు నుంచి పుంజుకు పూర్తి విశ్రాంతిని ఇచ్చి మకాంలో కట్టేసి ఉంచుతారు. రూ.కోట్లలో వ్యాపారం మకాంల వద్ద పనిచేసే వారికి నెలకు రూ.15 వేలు నుంచి రూ.20 వేల వరకు జీతాలుంటాయి. ఒక్కొక్కరు 12 నుంచి 15 పుంజులను మాత్రమే పర్యవేక్షిస్తారు. నీళ్లపోతలు, శాఖల కోసం వచ్చే ట్రైనర్లు కొంత మొత్తం మాట్లాడుకుంటారు. ఇవికాకుండా కోడికి అందించే ప్రత్యేక మేత, మందులతో ఒక్కో పందెం పుంజును సిద్ధం చేసేందుకు మూడు నెలల్లో రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చవుతుంది. ఈ విధంగా పెంచిన పుంజులను వాటి రంగు, ఎత్తు, పోరాట పటిమను బట్టి రూ.50 వేల నుంచి లక్షల్లో అమ్ముతుంటారు. వీటిపై భారీస్థాయిలో పందేలు జరుగుతుంటాయి. మామూలుగా ఇళ్ల వద్ద పెంచిన పుంజులు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు ఉంటాయి. పండుగల కోసం రెండు వేలకు పైగా పందెం కోళ్లు అమ్మకాలు జరుగుతుంటాయి. వీటి ద్వారా రూ.12 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా. పండుగకు నెలరోజులు మాత్రమే గడువుండటంతో ఇప్పటికే భీమవరం, కోనసీమ ప్రాంతాల్లో పందెంకోళ్ల పెంపకం జోరుగా సాగుతోంది. పుంజుల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ.. బరిలో ప్రత్యర్థి కోడిని ఓడించడమే లక్ష్యంగా పందెంరాయుళ్లు పుంజుల పెంపకంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కొందరు తమ ఇళ్లు, చెరువులు, పొలాల వద్ద పుంజులను పెంచితే అధిక శాతం మంది నాటుకోళ్ల కేంద్రాల్లో పుంజులను కొనుగోలు చేసి వాటిని పందేలకు సిద్ధం చేసే పనిని పెంపకందారులకు అప్పగిస్తారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర నగరాలతో పాటు విదేశాల నుంచి సంక్రాంతికి స్వస్థలాలకు వచ్చే ఔత్సాహికులు ఆన్లైన్లో పుంజులను ఎంపిక చేసుకుని పెంపకందారులకు ముందుగానే అడ్వాన్స్‌లు చెల్లిస్తుండటం విశేషం. పందెం పుంజులకు ఉన్న డిమాండ్‌తో ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే 150కి పైగా నాటుకోళ్ల పెంపకం కేంద్రాలు ఉన్నట్టు అంచనా. కాకి, నెమలి, పచ్చకాకి, కేతువ, డేగ.. వివిధ రంగుల్లో కాకి, నెమలి, అబ్రాస్, డేగ, పచ్చకాకి, కేతువ తదితర జాతుల నుంచి రెండేళ్ల వయసు కలిగిన పుంజులను పందేలకు సిద్ధం చేస్తారు. ఎంపిక చేసుకున్న పుంజుకు పోరాట పటిమ, శరీర పటుత్వం, శక్తిని పెంచేందుకు మూడు నెలల ముందు నుంచి ఎవరికి వారు ఎన్నో సంప్రదాయ, ఆధునిక పద్ధతులు అవలంబిస్తారు. వాటికిచ్చే ఆహారం, మందుల నుంచి శిక్షణ వరకు ప్రతి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. తాము ఎలా పెంచుతున్నది.. తమ పుంజు బలం, బలహీనత ఇతరులకు తెలియకుండా చాలా జాగ్రత్తలు పాటిస్తారు. పందెం పుంజు దినచర్య ఇలా.. ఉదయాన్నే పుంజును బయటకు తెచ్చి కొద్దిగా వేడి నీటిని పట్టిస్తారు. కాళ్లల్లో పటుత్వానికి, ఆయాసం రాకుండా ఉండేందుకు, అనారోగ్య సమస్యలుంటే గుర్తించేందుకు దాదాపు నెల పాటు రోజు విడిచి రోజు ఈత కొట్టిస్తారు. తదుపరి ప్రక్రియగా ‘వి’ ఆకారంలో నెట్లు కట్టి పుంజు అందులోనే తిరిగేలా బేటా (ని ర్ణీత పద్ధతిలో వాకింగ్) చేయిస్తారు. మరికొందరు ఖాళీ జాగాలో వాటి వెనుకే ఉండి తరుముతూ నడిచేలా చేస్తారు. కోడి నోటి నుంచి వచ్చే కఫాన్ని తొలగించి శుభ్రం చేయిస్తారు. తర్వాత మేత పెట్టి ఉదయం 11 గంటల వరకు ఎండలో కట్టేసిన తర్వాత మకాంలోకి మారుస్తారు. -
Recipe: పెసరపప్పు, నెయ్యి, జీడిపప్పు.. రుచికరమైన ఆపిల్ పొంగల్!
ఆపిల్ పొంగల్ ఎప్పుడైనా టేస్ట్ చేశారా? ఇదిగో ఇంట్లో ఇలా సులభంగా వండుకోండి! కమ్మని రుచిని ఆస్వాదించండి. ఆపిల్ పొంగల్ తయారీకి కావలసినవి: ►పెసరపప్పు, బియ్యం – అర కప్పు చొప్పున (పది నిమిషాలు నానబెట్టి, నీళ్లు తొలగించి శుభ్రం చేసుకుని పక్కనపెట్టుకోవాలి) ►నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు ►జీడిపప్పు, కిస్మిస్ – గార్నిష్‌కి సరిపడా ►ఉప్పు – తగినంత ►ఆపిల్ – 2 (తొక్క,గింజలు తొలగించి ముక్కలు చేసుకోవాలి) ►బెల్లం పాకం – 1 కప్పు (అప్పటికప్పుడు సిద్ధం చేసుకుని, వడకట్టుకోవాలి) ఆపిల్ పొంగల్ తయారీ విధానం: ►ముందుగా ఒక కుకర్ తీసుకుని.. అందులో నెయ్యి వేసుకుని జీడిపప్పు, కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకోవాలి. ►అందులో బియ్యం వేసుకుని 1 నిమిషం గరిటెతో తిప్పుతూ వేయించాలి. ►తర్వాత పెసరపప్పు వేసుకుని గరిటెతో తిప్పుతూ మరో నిమిషం పాటు వేయించుకోవాలి. ►అనంతరం ఉప్పు, ఆపిల్ ముక్కలు వేసుకుని కలపాలి. ►ఆపై 2 కప్పుల నీళ్లు పోసి, కుకర్ మూత పెట్టి.. 3 లేదా 4 విజిల్స్ వచ్చేవరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ►ఆవిరి చల్లారేంత వరకు ఆగి.. కుకర్ మూత తీసి.. మళ్లీ స్టవ్ ఆన్ చేసుకుని, కుకర్ స్టవ్ మీద పెట్టి, ఆ మిశ్రమాన్ని గరిటెతో బాగా తిపాల్పి. ►బెల్లం పాకం జోడించి మరింత సేపు ఉడికించుకోవాలి. ►చివరిగా నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ►వేడి వేడిగా ఉన్నప్పుడే నెయ్యితో కలిపి సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటుంది. చదవండి: Kullu Trout Fish: ఘుమఘుమలాడే కులు ట్రౌట్ ఫిష్ తయారీ ఇలా! -
వైరల్ వీడియో: అభిమానుల కోసం బయటకొచ్చిన సూపర్‌స్టార్
చెన్నై: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని సూపర్ స్టార్ రజనీకాంత్ తన అభిమానులను పలకరించడానికి తన నివాసం నుంచి బయటకు వచ్చారు. తనను చూసేందుకు భారీగా తరలి వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూ..రజనీ సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో తెల్లని కుర్తా, పైజామా ధరించిన సూపర్ స్టార్ తనదైన స్టైల్లో నమస్కారం చేస్తూ సూపర్ కూల్‌గా ఉన్నారు. తాము అభిమానించే నటుడ్ని దగ్గరనుంచి కలిసినందుకు అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరోవైపు రజనీకాంత్ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సంక్రాంతి పండుగను చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు ట్విటర్లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. చదవండి: నాగ చైతన్య, సమంత విడాకులు.. డైరెక్టర్‌కు తెచ్చిన కష్టాలు ‘మనమందరం భయంకరమైన, ప్రమాదకరమైన కాలంలో జీవిస్తున్నాము. కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ ఇన్ఫెక్షన్ నుంచి మనల్ని మనం రక్షించుకోడానికి అన్ని నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. మన ఆరోగ్యం కంటే ముఖ్యమైంది ఏదీ లేదు. అందరికీ పొంగల్ శుభాకాంక్షలు' అని రజనీకాంత్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. చదవండి: ఈ వార్తలకి, చర్చలకు ఫుల్స్టాప్ పెట్టండి: చిరంజీవి View this post on Instagram A post shared by SNEHA RAJINI ❤️ (@thalaivar_fan_girl) -
మామ వర్సెస్ అల్లుడు
మామాఅల్లుళ్ల సవాల్ సినిమాల్లో భలే సరదాగా ఉంటాయి. నువ్వా? నేనా? అని మామా అల్లుళ్లు తలపడటం సినిమాల్లో చూస్తుంటాం. ఇప్పుడు తమిళనాడు బాక్సాఫీస్ దగ్గర మామాఅల్లుళ్లు రజనీకాంత్, ధనుష్ తలపడే అవకాశం కనిపిస్తోంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘దర్బార్’. నయనతార కథానాయిక. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ఎప్పుడో ప్రకటించింది. మరోవైపు దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో ధనుష్ ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా ‘పటాస్’. మెహరీన్, స్నేహా కథానాయికలు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ‘పటాస్’ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్రబృందం భావిస్తోంది. దాంతో వచ్చే ఏడాది పొంగల్‌కి బాక్సాఫీస్ దగ్గర మామాఅల్లుళ్ల క్లాష్ ఏర్పడనుందని భావిస్తున్నారంతా. ఏం జరుగుతుందో చూడాలి. -
ప్రారంభమైన జల్లికట్టు.. ఇద్దరి పరిస్థితి విషమం
చెన్నై: తమిళనాడులో పొంగల్ వేడుకల్లో భాగంగా నిర్వహించే సంప్రదాయ సాహస క్రీడ జల్లికట్టు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో జల్లికట్టు నిర్వహించేందుకు పలు ప్రాంతాల్లో భారీ ఏర్పాట్లు చేశారు. జల్లికట్టు వేడుకలను వీక్షించేందుకు పలు ప్రాంతాల నుంచి జనం భారీగా తరలివచ్చారు. పుదుకొట్టే జిల్లా తసంగుర్చిలో తొలి జల్లికట్టు పోటీలను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విజయ భాస్కర్ ప్రారంభించారు. జల్లికట్టు పోటీలో భాగంగా 300 ఎద్దులను అదుపు చేయడానికి 400 మంది యువకులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని పుదుకోట్టె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిత్తూరులో ఘనంగా జల్లికట్టు వేడుకలు.. చిత్తూరు: సంక్రాంతి పండగను పురస్కరించుకుని తమిళనాడుతో పాటు సరిహద్దులోని చిత్తూరు జిల్లాలో జల్లికట్టు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జల్లికట్టులో పాల్గొనేందుకు యువత ఉత్సహం కనబరుస్తున్నారు. జిల్లాలోని రామచంద్రాపురం మండలం అనుప్పల్లి గ్రామంలో నిర్వహిస్తున్న జలికట్టు వేడుకలకు భారీగా జనాలు తరలివచ్చారు. పోటీలో భాగంగా పశువులను పట్టుకునేందుకు యువకులు రంగంలోకి దిగుతున్నారు. జల్లికట్టును వీక్షించేందుకు వచ్చిన యువత కేరింతలు కొడుతూ ఉత్సహంగా గడుపుతున్నారు. అక్కడికి పెద్ద సంఖ్యలో తరలివచ్చినవారికి రేఖలచేను గ్రామ యువత అన్నదానం చేసింది. -
తమిళనాడులో జల్లికట్టు జోరు!
సాక్షి, చెన్నై: తమిళనాడులో పొంగల్ వేడుకలు కోలాహలంగా జరుగుతున్నాయి. పండుగ సందర్బంగా నిర్వహించే జల్లికట్టు పోటీలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా 64 ప్రాంతాల్లో జల్లికట్టు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో భారీ ఏర్పాట్లు చేశారు. అవనియపురం, పాలమేడు, అనంగానల్లురులో జరిగే జల్లికట్టును వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రేక్షకులు ఇప్పటికే తమిళనాడు చేరుకున్నారు. జల్లికట్టులో పాల్గొనేందుకు 3400 మంది యువకులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 2600 ఎద్దులు ఈసారి జల్లికట్టులో పాల్గొంటున్నాయి. -
పండగ సెలవులు
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహిస్తారని తెలిసిందే. సంక్రాంతిని తమిళనాడులో పొంగల్ పేరుతో సెలబ్రేట్ చేసుకుంటారని తెలిసిందే. ఈ పెద్ద పండక్కి కుటుంబ సభ్యులతో కలిసి జాలీగా గడపటానికి ఇష్టపడతారు సినీ తారలు. ఈ లిస్ట్‌లో కార్తీ కూడా ఉన్నారు. ఈ ఏడాది పొంగల్‌కి ఆయన రెండు రోజులు సెలవు తీసుకుని తిరగి షూట్లో జాయిన్ అవుతారు. ప్రస్తుతం ‘మా నగరం’ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తీ హీరోగా ఓ యూక్షన్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్గా చెన్నైలో స్టార్ట్ అయిన ఈ సినిమా షూటింగ్ తాజాగా టెన్‌కాశీలో జరుగుతోంది. పొంగల్‌కి బ్రేక్ తీసుకుని మరలా అదే లోకేష¯Œ లో షూట్ స్టార్ట్ చేస్తారు టీమ్. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రే లేకపోవడం విశేషం. -
జల్లిపట్టు
-
వీధి పొరికి
బొంతాలమ్మ గుడికాడ జయరాముడు, జయచంద్రుడు, జయసింహుడితో కలసి దాయాలాట ఆడతా వుండాడు ధనంజయుడు. కార్తీకమాసం కాబట్టి గుడిలో దీపాలు వెలిగిద్దామని వచ్చినారు మునిలక్ష్మి, వెంకటలక్ష్మి, సుబ్బలక్ష్మి.‘‘ఒరేయ్, జయరామా! మొన్న మంగళవారం నాడు నా మనవడు నాగసూరి ప్రసాదానికి వస్తే పొంగలి పెట్టకుండానే పంపినావంట కదరా’’ అని ఎగిరెగిరి అడిగింది మునిలక్ష్మి.‘‘ఆరోజు పొంగలి అరచెంబుకే వండినాములే అక్కా, చాలీ చాలకుండా వచ్చిందిగానీ’’ అని గట్టిగా బదులిచ్చినాడు.‘‘వచ్చినోడే వచ్చి పదిసార్లు పొంగలికి చేయి చాపితే ఎక్కడి నుంచి తెచ్చేదిలే అక్కా’’ అని గుసగుసలాడినాడు.‘‘జయచంద్రా, నా ఏడేండ్ల చిన్న బుడ్డోడు మనోహరుడు జంబాడ బస్సెక్కితే టికెటు తీసుకోమన్నావంట కదరా. ఊరోడిగా ఉండి ఊరోళ్లనే టికెట్ అడగతావరా? అని రాగాలు తీస్తూ అడిగింది వెంకటలక్ష్మి.‘‘ఏమి చేసేది పిన్నమ్మా! అయిదేండ్లు దాటితే ఆర్టీసీబస్సులో టికెటు కొట్టమని రూల్ ఉంది కదా’’ అని వయ్యారంగా బదులిచ్చినాడు ఆర్టీసీ కండక్టర్ జయచంద్రుడు.‘‘భలే రూల్స్గానీ...’’ అని విసురుగా అంటూ ఇంటికి బయలుదేరింది వెంకటలక్ష్మి.‘‘జయసింహా! పప్పన్నం ఎప్పుడు పెడ్తావబ్బీ’’ అని ఊరంతా అడిగింది సుబ్బలక్ష్మి.‘‘నయనతార నంబర్ దొరకలేదత్తా. ముహూర్తాలు పెట్టుకొందామంటే’’ అని నంగిగా బదులిచ్చినాడు మూడుపదుల జయసింహుడు.‘‘మీతో మాట్లాడాలంటే మూడుపూటలు తింటే చాలదురా అబ్బా, అయిదారు సార్లన్నా తినాల్సిందే’’ అంటూ గబగబా వెళ్లిపోయింది. కడుపులో ఎలుకలు పరుగెడ్తావుంటే బొంతాలమ్మ గుడి కాడి నుంచి గబగబా తడుకుపేట ఊర్లోకి బయలుదేరినాడు ధనంజయుడు. ఆకలికి పంచె ఎగ్గట్టుకొని పరుగులు తీస్తూ వీరరాఘవన్న ఇంటి వంటగదిలోకి దూరినాడు. అన్ని ఆల్మారాలు వెదికినాడు. అప్పచ్చులు ఏమీ దొరకలేదు. చిన్నతట్టలో నారదబ్బ ఊరగాయ ముక్క కనబడింది. నోటిలో ఊట మొదలయ్యింది. గబుక్కున దానిని నోట్లో వేసుకొని చప్పరిస్తూ పరుగెత్తుతా ఊర్లోకి పోయినాడు. పరుగులు తీస్తూ ‘నెల్లికాయ తెద్దునా, నిమ్మకాయ తెద్దునా’ అని చిటికెలేసి పాడుకుంటూ వెళ్లినాడు.కొంగు విదిలించి ధనంజయుడిని ఉరిమి ఉరిమి చూడసాగింది రాఘవన్న భార్య నరసమ్మ. ‘‘ఎవరిని ఎక్కడ పెట్టాల్నో మీకు తెలవకపాయె. వాడిని ఇంట్లోకి ఎందుకు రానిస్తారు మీరు? వీధి పొరికివాడు. నెత్తిన ఎక్కించుకొంటిరి. వాడిష్టంగా వాడు నేరుగా ఇంట్లోకి వస్తాడు, పోతాడు. అడగకుండానే దూరి దూరి తింటాడు. నచ్చింది చేస్తాడు. నట్టింట్లో తిష్ట వేస్తాడు. అడ్డదొడ్డం తిరగతాడు. ఎట్లా ఏగేదబ్బా వాడితో’’ అంటూ చేతులు తిప్పుతూ భర్తని నిష్టూ మాడింది నరసమ్మ. వినీవిననట్లు ఇంటి ముందరి మునగచెట్టుకి విరగకాచిన మునగకాయలను వరుసగా ఎంచసాగాడు రాఘవన్న.‘‘ధనంజయుడి గురించి మీకు ఎన్ని చెప్పినా ఉలకరు, పలకరు. బండరాయిలాగ గమ్మున ఉంటారు. నాకేమో వాడు మన ఇంట్లో తిరుగులాడుతుంటే ఒళ్లంతా జెర్రులు పాకినట్లు ఉంటాది, నిప్పుల్లో నడిచినట్లు ఉంటాది. మీకు మేనమామకొడుకో, నాకు మేనత్త కొడుకో అన్నట్లుగా వాడిని చూస్తారు. వాడిని ‘దేముడమ్మ దేముడు’ అన్నట్లుగా ఇల్లంతా, ఊరంతా ఊరేగిస్తారు. ఎట్ల చేసేదబ్బా? ఎవరితో చెప్పుకొనేదబ్బా’’ అంటూ పెరట్లో పాత్రలేసుకొని కడుగుతూ గట్టిగట్టిగా ముక్కుచీదసాగింది నరసమ్మ. తిన్నెపైన కూర్చొని ఆకాశంలో ఎగురుతున్న తెల్లకొంగల్ని లెక్కలేస్తున్నాడు రాఘవన్న. ఊర్లోని ముత్తబావ శవం పాడిపైన ఊరేగుతోంది. తిమ్మాపురం తిమ్మడి బృందం పలకలు కొడుతోంది. కర్రోడు, పొట్టేలు పరంధాముడు, నడింపల్లి నాగన్న, దొంగకోళ్ల దామోదరం, రామగిరి రామన్న శవం ముందు డ్యాన్సులు చేస్తా వుండారు. తిరుచానూరు తిరుపాలు టపాకాయలు పేలస్తా వుండాడు. బాతుల బాలిరెడ్డి బుట్టలోంచి పూలు, బొరుగులు, పైసలు చల్లతా పోతావుండాడు.మిట్ట మధ్యాహ్నం బొంతాలమ్మ గుడికాడ పొట్టి రెక్కల చొక్కా వేసుకొని నిద్ర పోతావుండాడు ధనంజయుడు. వాడి చెవులకి చావు మేళం వినిపించింది. సరసరాలేచి టకటక నడుస్తూ ‘లకలక’ అంటూ పలకల ముందరకి దూకినాడు. ఒంటికాలిపై నిలబడి భుజాలు ఎగరేస్తూ నోట్లో నాలిక మడిచి కులకతా డ్యాన్సు చేసినాడు. పరుగెత్తతా వచ్చిన గంపలాయన ఈలలు వేస్తూ వయ్యారంగా చేతివేళ్ళు తిప్పుతూ చిందులేసినాడు. రాజబాబు టపాకాయలు పేల్చినాడు.ఇంటి ముందర గుబురుగా ఉన్న తెల్ల ఉమ్మెత్త పూలు అటూ ఇటూ ఊగుతుంటే వాటిని లెక్కేస్తూ నిల బడివున్నాడు రాఘవన్న. ధనంజయుడి డ్యాన్సు చూడలేక నరసమ్మ ఇంటి తలుపులేసుకొని పెరట్లో చిక్కుడు పందిరి దగ్గరికి పోయి నిలబడింది. తిరుత్తణి కొండని చూస్తూ ‘ము రుగా! కొడుకు కుమారస్వామి అమెరికాలో రేయనక పగలనకా కష్టం చేసి పైసలు పంపిస్తా వుండాడు. నా మొగుడేమో వీధి పొరికి ధనంజయుడిని ఏనుగును మేపినట్లు మేపతా ఉండాడు. వాడు అడిగింది కాదనడు. అడిగినప్పుడల్లా డబ్బులిస్తాడు. వాడు మూడు పూటలా మా ఇంటికాడనే పడి మెక్కతాడు. పనీ లేదు పాటా లేదు వాడికి. ముందూ వెనకా ఎవరూ లేరు వాడికి. ఎక్కడి వాడో.... ఎవడువాడో నా బిడ్డ సొత్తంతా తిని పోతావుండాడే. ఊరకనే సాకతావుండాడు వాడిని మా ఇంటాయన. నా మొగుడి బుద్ధి మార్చరాదా. నీకు నెలనెలా ప్రతి కృత్తికకీ పిండి దీపం వెలిగించి దండం పెట్టుకుంటా మురగా’’ అని చేతులెత్తి వేడుకొంది. రాఘవన్న, ధనంజయుడు నాలుగేసి సజ్జెరొట్టెల్ని ఎర్రగడ్డ కారం వేసుకొని తృప్తిగా తినినారు. పౌర్ణమి వెన్నెలకి ఇంటి ముందర నారమంచం వేసి కూర్చొన్నారు. చల్లగా చింత చెట్ల గాలి వీస్తోంది. కొండపైన తిరుత్తణి గుడిదీపాలు మిలమిలా మెరుస్తున్నాయి.ఎదురింటి వెంకటస్వామికి తెల్లారికి మార్కెట్లోకి తోపుడు బండి సిద్ధం చేస్తా ఉండాడు. వెంకటస్వామి భార్య వెంకటలక్ష్మి నైటీ వేసుకొని దానిపైన తువ్వాలు వేసుకొని నాలుగేసి మునక్కాయలు జతచేసి అరటినార చుట్టి బండిలో పెడతావుంది.ఈతగింజలు తింటూ ధనంజయుడు ‘‘కొండ ఎక్కినోడు కొండ దిగడా, శెనక్కాయలు తిన్నోడు సేయి కడగడా, ఏటికి పోయినోడు కాళ్లు కడగడా, పుట్టినోడు చావడా’’ అన్నాడు. ముసిముసిగా నవ్వినాడు రాఘవన్న. పడిపడీ నవ్వినారు వెంకటస్వామి, వెంకటలక్ష్మి.మాణిక్యం తాగి ఊగతా వీధిలోని వేపచెట్టు కింద ధబీమని పడినాడు.‘‘ఏం మావా, పడినావా’’ అని అడిగినాడు ధనంజయుడు.‘‘లేదురా ధనంజయా, తమాషాగా ఉంటుందని పల్టీ కొట్టినానురా’’ అని లేచి ఒళ్లు దులుపుకొని ఊర్లోకి పోయినాడు. ధనంజయుడు నవ్వుతూ ‘‘చూడు రాఘవన్నా! మాణిక్యంగాడు పడినా పల్టీ అంటూ లేచిపోతా వుండాడు’’ అనినాడు. వీధికుక్కలు రెండు మొరుగుతూ మంచినీళ్ల గుంటవైపు పరుగులెత్తినాయి. తలతిప్పి చూసినాడు రాఘవన్న. ‘‘మన ఊరి కుక్కలు దొంగల్ని చూసి మొరిగేది మరచినాయిలే రాఘవన్నా. అట్ల తిరిగి, ఇట్ల తిరిగి మన వాళ్లని, మన ఊరి వాళ్లనే చూసి మొరుగుతున్నాయి. ఇవి దొంగల్ని పట్టిందీ లేదూ, దొంగలు దొరికిందీ లేదూ’’ అని రాగాలు తీస్తూ చెప్పినాడు ధనంజయుడు. ఫస్ట్ షో తెలుగు సినిమాకి సైకిల్లో పోయివస్తావున్న మొగుడూపెళ్లాలు బోడెన్న బోడెక్కలు ధనంజయుడి మాటలకి నవ్వుకుంటూ వెళ్లినారు.‘‘రాఘవన్నా! సెప్పేది మరచినా. మొన్న చచ్చిన ముత్తబావ కొడుకు మునికిష్టడు నాయిన పోయినాడని దొర్లిదొర్లి ఏడ్చినాడన్నా, పోయినోడితోనే పోతాడన్నంతగా పొర్లి పొర్లి ఏడ్చినాడు.సచ్చినోళ్లతోనే పోతామా! సింగినాదం కాకపోతే, ఏడ్చి ఏడ్చి నువ్వు చస్తే నీ బిడ్డలెట్ల బతకతార్రా’’ అని అందరూ సర్ది చెప్పినారన్నా. గుంతలో శవాన్ని వేస్తావుంటే ముత్తబావా చొక్కాజేబులో రెండు రెండువేల నోట్లు వున్నాయన్నా. ఆ నోట్లు శవంతోటే పూడ్చేద్దామంటే వినలేదన్నా మునికిష్టడు. రచ్చరచ్చ చేసినాడు. పోనీ దాన్ని గుంత తవ్వినోడికి ఇనాం ఇద్దామని ఊరిపెద్ద పెరుమాల్రాజు చెబితే గలాటా చేసి రెండు నోట్లూ పెరికి పెట్టుకున్నాడన్నా...అట్లా ఆడిస్తదన్నా జిత్తుల మారి బుద్ధి’’ అని చెప్పినాడు ధనంజయుడు. కావడి పూజ చేసుకొని, కాశెమ్మ కొడుకు కోడలు గుడికి పోయి గుండు గీయించుకొని ఇంటికెళ్తున్నారు. ధనంజయుడి మాటలు విని వాళ్లు ముసిముసిగా నవ్వుకొంటూ పోయినారు.ఇంతలో నరసమ్మ తాగేదానికి చెంబునిండా మజ్జిగ తెచ్చి ఇచ్చింది రాఘవన్నకి. ‘ధనంజయుడికి మజ్జిగ లేదా’ అన్నట్లుగా పెళ్లాం వైపు చూసినాడు. ‘‘సట్టెడు తిన్నాడు, చాల్లే. ఇంట్లో చలివేంద్రం పెట్టలేదు. దారిన పోయే వాళ్లకంతా మజ్జిగ దానం చేయడానికి’’ అన్నట్లుగా ముఖం పెట్టింది నరసమ్మ. మజ్జిగ తాగి మీసాలు తుడుచుకొని చెంబు నరసమ్మ చేతికిస్తూ ఆమె చేతి బంగారు గాజుల్ని చూసినాడు. కొడుకు ఇంజనీరింగ్ చదువులకి గ్రామీణబ్యాంకులో రెండు మూడు సార్లు వాటిని కుదవపెట్టిన విషయం గుర్తొచ్చింది.‘‘ఎంత కష్టపడి చదివించినాం బిడ్డని’ అనుకున్నాడు మనసులో.‘‘వాడు అమెరికా వెళ్లి డాలర్ల వర్షం కురిపించినాక అప్పులన్నీ తీర్చేసుకున్నాములే’’ అని తనలో తాను అనుకున్నాడు.‘అర్ధరాత్రిళ్ల దాకా చదివి ఆకాశంలో ఎగిరి అమెరికా వెళ్లినాడు. మంచికీ చెడ్డకీ ఎట్ల రాబోతాడబ్బా మన ఊరికి’ అంటూ ఆలోచనలో పడ్డాడు. కంట్లో తడి ఎవరికంటా పడకుండా పై గుడ్డతో తుడుచుకున్నాడు.రాఘవన్న, ధనంజయుడు ఊర్లో కథలన్నీ మాట్లాడి మాట్లాడి అలిసిపోయినారు. ఆకాశంలో నక్షత్రాలను లెక్కిస్తూ ఇద్దరూ మంచంపైన గురకలు పెడ్తూ నిద్రపోయినారు.ఆడినెల–ఆదివారం నాడు సన్నసన్నగా చినుకులు రాలుతూ ఉన్నాయి. కోమటోళ్ల బావికాడ వరికయ్యిలో కలుపు తీస్తా వుంది నరసమ్మ. నరసమ్మకి తోడుగా కయ్యిలో అయిదారు కొంగలు వంగి పురుగూపుట్రా తింటున్నాయి. నాటుకోళ్లు నాలుగు నరసమ్మ చుట్టూ తిరిగి తిరిగి కానగచెట్టు కింద చేరినాయి.పరుగులు తీస్తా పేరూరు పద్మ అరస్తా వచ్చి చెప్పింది–‘‘నరసక్కా! నరసక్కా! మన రాఘవన్న బ్రహ్మంగారి మఠంకాడ నిలబడినోడు నిలబడినట్లే గుండె పట్టుకొని పక్కకి వాలిపోయినాడంట. మన ఊరి ఆయుర్వేదం డాక్టరు ఆర్ముగం నాడిపట్టి చూసి పెదాలు విరిచేసినాడంట. ఊరు ఊరంతా మఠం కాడ వుండారక్కా’’విషయం విన్న నరసక్క సెకను నిలబడలా. కత్తి, కొడవలి, పార వరికయ్యిలోనే పారేసి గట్టిగా గుండెలు బాదుకొంటూ గెనాలమ్మిట మఠంకాడికి పరుగులు తీసింది. బావికాడి పచ్చగడ్డి తింటున్న రెండు ఆవులు తలలెత్తి నరసమ్మ వైపు చూసినాయి. నరసమ్మ ఊర్లోకి పోయేంతవరకు ఆ దిక్కే చూసినాయి. బావి కట్టపైన ఉన్న బొప్పాయి చెట్టుకున్న కాయలు యజమాని లేడని తెలిసి బాధపడ్తున్నట్లుగా పాలు కార్చినాయి. శవం చుట్టూ జనాలు గుంపులు గుంపులుగా చేరినారు. ఐ.ఐ.టి, ఖరగ్‌పూర్‌లో చదువుతున్న మేకల గంగయ్య వీడియో కాన్ఫరెన్స్ పెట్టినాడు. నాయన శవాన్ని చూసి భోరుభోరున ఏడుస్తున్నాడు కాలిఫోర్నియాలోని కొడుకు కుమారస్వామి. గ్రామపెద్దలు జడామణి, రోడ్డు మేస్త్రీ, తపాలాయన, బ్యాంకు బాలరాజు, మాడా మునస్వామి విషయాన్ని కుమారస్వామికి వివరించినారు. అమ్మ నరసమ్మకి ధైర్యం మాటలు చెప్పినాడు కుమారస్వామి. తను రావడానికి కుదరడం లేదని భోరుభోరునా ఏడుస్తూ చెప్పినాడు.మరి ‘తలకొరివి ఎవరు పెడ్తారు?’ అని అడిగినాడు సర్పంచ్ సుబ్బరామన్న. తల కొట్టుకుంటూ కూర్చొంది నరసమ్మ. పక్కనున్న ఆడాళ్లంతా ఒకర్నొకరు పట్టుకొని ఏడస్తావుండారు. భారతంమిట్ట, పేటమిట్ట, మేదరమిట్ట, గులకరాళ్లమిట్ట, కొత్తపల్లిమిట్ట బంధువులంతా ‘ఒక్కగానొక్క కొడుకుని అమెరికాకు పంపినారు కదబ్బా’ అని గుసగుసలాడినారు. వెంకటాపురం, వేదాంతపురం, ఈశ్వరాపురం, రామాపురం, వేమాపురం దాయాదులంతా ‘దూరాబారాలెల్లిపోయి, పిలకాయలు చివరి చూపులకి కూడా రాలేకపోతావుండారు కదబ్బా’’ అని చెవులు కొరుక్కున్నారు.ఇంతలో ఎక్కడి నుంచో ‘లక్ లక్’మంటూ ఎగురుతూ చేతుల్తోనే తిక్కమేళం వేసుకొంటూ వచ్చినాడు ధనంజయుడు. మెడ మీది తువ్వాలు ఆకాశంలోకి విసురుతా ‘రాఘవన్నకి తలకొరివి నేను పెడ్తాను’ అని అరిచి చెప్పినాడు. అందరూ వాడివైపు తల తిప్పి చూసినారు.‘‘రాఘవన్న బతికి వున్నప్పుడే నాకు చెప్పినాడు. కొడుకు కుమారస్వామి అమెరికా నుంచి రాలేకపోతే నాకు కొరివి నువ్వే పెట్టాలిరా ధనంజయా...అని ఒక్కసారి కాదు...వందసార్లు చెప్పినాడు పెద్దాయన’’ఊరి కుర్రకారు గంతులేస్తూ ధనంజయుడి వైపు చేతులు విసిరినారు. జయరాముడు, జయచంద్రుడు, జయసింహుడు కులాసాగా చేతి గుడ్డలు ఊపినారు. రాములోరి గుడి అయ్యోరు ధనంజయుడిని గుండెలకి హత్తుకున్నాడు. పోస్ట్‌మాస్టర్ చీటీల చెంగల్రాజు ధనంజయుడి మెడలో ముద్దబంతుల మాల వేసినాడు. చేయి చేయి కలిపినాడు. అక్కడ ఉన్న ఆడోళ్లంతా ధనంజయుడు చేస్తున్న మంచిపనికి ముక్కు మీద వేలేసుకొని సంతోషపడినారు. తూకివాకం తిరుపాలు బృందం పలకలు కొడతా వచ్చింది. బీడీల బీకిరాజు, గూని గురవరాజు, సంగటికూడు శివయ్య, ఆవిరికుడుము ఆనందుడు, లొడిగనోరు లోకనాధంలు డాన్సులు చేస్తా వచ్చినారు. కాటమరెడ్డి నడిపి కొడుకు టపాకాయలు పేలస్తా వుండాడు. బాణపొట్ట బాలరాజు బుట్టలోంచి పూలు, బొరుగులు, పైసలు చల్లతా వుండాడు. పరుగెత్తతా వచ్చిన కొర్రలోడు రెండు చేతులూ నడుముపైన పెట్టుకొని నోటితోనే ఈలలు వేస్తా వుండాడు.ఉడకబెట్టిన అన్నం మట్టికుండలో పెట్టుకొని, తెల్లతడి పంచె కట్టుకొని శవం ముందర నడుస్తున్నాడు ధనంజయుడు. వాడిని కన్నులార్పకుండా చూస్తోంది నరసమ్మ. మొగుడి ముందస్తు ఒప్పందం తెలియక ‘వీధి పొరికి’ అనుకున్న ధనంజయుడిలో తన కొడుకు కుమారస్వామి కనిపించాడు. ఆమెకు తెలియకనే ఆమె కళ్లు మరిన్ని కన్నీళ్లు కార్చాయి. ధనంజయుడికి చేతులెత్తి నమస్కరించింది. ఊరిలోని ఉమ్మెత్తపూలు ధనంజయుడిని చూసి పలకరింపుగా అటూ ఇటూ ఊగుతూ పలకరించినాయి. తిరుత్తణిలో కొండపైని గుడి గుంటలు గణగణ మోగినాయి. ఆర్.సి.కృష్ణస్వామిరాజు -
పొంగల్‌కు తలైవా పార్టీ?
తమిళసినిమా: నటుడు రజనీకాంత్ రాజకీయ పార్టీని పొంగల్ రోజున ప్రకటించనున్నారా? ఈ ప్రశ్నకు అవుననే అంటున్నాయి ఆయన సన్నిహిత వర్గాలు. గత 25 ఏళ్ల అభిమానుల ఒత్తిడి కారణమో, ఆయన చిరకాల వాంఛ కారణంగానో రజనీకాంత్ ఎట్టకేలకు గత ఏడాది డిసెంబర్లో రాజకీయ ప్రవేశం గురించి ప్రకటించారు. దీంతో తలైవా రాజకీయాల్లోకి వస్తున్నారన్న సంతోషం ఆయన అభిమానుల్ని సంతోషంతో ఉక్కిరిబిక్కిరి చేసింది. అదే విధంగా రజనీకాంత్ తన అభిమాన సంఘాలను ప్రజాసంఘాలుగా మార్చారు. ఆ సంఘాల నిర్వాహక బాధ్యతలను రాజుమహాలింగం, సుధాకర్‌కు అప్పగించారు. వారు రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వం, జిల్లాలవారిగా నిర్వాహకుల ఎంపిక కార్యక్రమాలను పూర్తి చేశారు. రాజకీయ రంగప్రవేశం చేస్తున్నట్లు వెల్లడించినప్పుడే తమ పార్టీ రానున్న శాసనసభ ఎన్నికల్లో 234 నియోజక వర్గాల్లోనూ పోటీచేస్తుందని రజనీకాంత్ ప్రకటించారు. అయితే పార్టీ ప్రకటన ఎప్పుడన్నది అప్పటి నుంచి రజనీకాంత్ ఊరిస్తూనే ఉన్నారు. ఈ ఏడాది తమిళ ఉగాదికి పార్టీ పేరును, విధివిధానాలను వెల్లడిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే సరిగ్గా ఆ సమయంలో పార్టీ ప్రకటన లాంటిది ఇప్పట్లో లేదన్న రజనీకాంత్ ప్రకటన ఆభిమానుల్లో నిరుత్సాహాన్ని కలిగించింది. అలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్ ముఖ్యకార్యకర్తలను తన ఇంటికి పిలిపించి పార్టీ వ్యవహారాల గురించి చర్చించి వారిలో మళ్లీ నూ తనోత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. అయితే మళ్లీ రాజకీయాలకు దూరంగా తన తాజా చిత్ర షూటింగ్ కోసం రెడీ అయిపోయారు. ప్రస్తుతం ఆయన కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో డెహ్రాడూ న్లో చిత్రీకరణ జరుపుకుంటున్న కొత్త చిత్రం షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ చిత్ర షూటింగ్ మూడు నెలల పాటు జరుగుతుంది. ఆ తరువాతే మళ్లీ రాజకీయపరమైన చర్చలపై దృష్టిసారించే అవకాశం ఉంది. పొంగల్‌కు రజనీకాంత్ పార్టీని ప్రకటిస్తారని ఆయన అభిమాన వర్గాలు చెబుతున్నారు. అయితే ఈ విషయంపై క్లారిటీ రావాలం టే రజనీకాంత్ స్పష్టమైన ప్రకటన చేయాల్సిందే. రజనీకి సమస్యలు తెలియవు రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై రాజకీయ నాయకులు విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు. మరికొందరు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్ కూడా రజనీకాంత్‌కు బడుగు వర్గాల సమస్యలు తెలిసే అవకాశం లేదని పేర్కొన్నారు. ఆయన తిరువారూర్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రజనీకాంత్ రాజకీయరంగ ప్రవేశం గురించి అడిగిన ప్రశ్నకు ఆయన రాజకీయాల్లోకి వస్తారా? రారా? అన్నది సరిగ్గా తెలియడం లేదన్నారు. అయినా సంపన్న జీవితాన్ని అనుభవిస్తున్న రజనీకాంత్‌కు బడుగ వర్గాల సమస్యలు తెలిసే అవకాశం లేదని బాలకృష్ణన్ పేర్కొన్నారు. -
పంచె కట్టి పొంగలి వండిన ప్రధాని
న్యూఢిల్లీ : కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడెవూ బుధవారం తమిళ సంప్రదాయం ప్రకారం సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. కెనడాలో స్థిరపడిన తమిళులతో కలసి ‘వెట్టి’ (తమిళ సంప్రదాయ దుస్తులు) ధరించిన ప్రధాని, పొంగల్‌ను తయారు చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను తన ట్విటర్ అకౌంట్లో పోస్టు చేశారు ట్రూడెవూ. తమిళ కెనడియన్లతో కలసి పొంగల్ పండుగను జరుపుకోవడం తనకు ఆనందంగా ఉందని అన్నారు. ఈ వేడుకల్లో ట్రూడెవూతో పాటు టొరంటో మేయర్ జాన్ టోరీ కూడా పాల్గొన్నారు. ట్రూడెవూ, టోరీలు కలసి పొంగల్‌ను వండటం విశేషం. -
పండుగ పూట పైసల్లేవ్
-
పండుగ వేళ 12th January 2018
-
చెన్నైకి ఫ్లైట్‌లో వెళుతున్నారా...అయితే
సాక్షి, చెన్నై: దేశప్రజలంతా సంక్రాంతి ఉత్సాహంతో ఉరకలేస్తోంటే.. చెన్నై విమానాలు మాత్రం గాల్లోకి ఎగరలేక తెల్లబోవడంతోవిమాన ప్రయాణీకులు మాత్రం ఉసూరుమంటున్నారు. దట్టమైన పొగ కారణంగా దాదాపు 10 విమానాలు టేక్‌ఆఫ్‌లు, లాండింగ్‌లు నిలిచిపోయాయి. మరికొన్నింటిని దారి మళ్లించారు. చెన్నైనుంచి బయలు దేరాల్సిన కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దాదాపు 18 విమానాలను హైదరాబాద్, బెంగళూరు వైపు మళ్లించారు. చెన్నై నగరంలో ‘భోగి’ మంటల వల్ల వ్యాపించిన దట్టమైన పొగతో ఎయిర్‌క్వాలిటీ, రన్‌వే విజిబిలిటీ దారుణంగా పడిపోవడంతో ప్రయాణీకుల ఆందోళన నెలకొంది. విమానాశ్రయ సీనియర్ అధికారి మాట్లాడుతూ రన్‌వే దృశ్యమానత 50 మీటర్లకు పడిపోయిందనిచెప్పారు. ఉదయం మూడున్నరనుంచి తమకు విమాన కార్యకలాపాలు నిలిచిపోయాయి. మరికొన్ని గంటల్లో పరిస్థితి చక్కబడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు తనకు ముంబైలో చాలా ముఖ్యమైన బిజినెస్ మీట్ వుందంటూ భరత్ జైన్ వాపోయారు. చెన్నైకు భోగి మంటలు ఒక ఛాలెంజ్‌గా నిలుస్తున్నాయని మరో సీనియర్ అధికారి తెలిపారు. గతపదేళ్లుగా ఈ విషయంలో కాలుష్య నియంత్రణ బోర్డు తమిళనాడులో అవగాహన పెంచుతోందన్నారు. ఇది ఇలా ఉంటే.. చెన్నై, చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు భోగి సంబరాలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. తెల్లవారుఝామునుంచే సందడి మొదలైంది. పాత బట్టలు, వస్తువులను తగలబెట్టడం శుభాన్నిస్తుందని , అంతేకాదు భోగిమంటలు గాలిని శుభ్రం చేస్తాయని స్థానికుడు కరుప్పన్ సంతోషంగా చెప్పారు. తమిళ సంస్కృతిలో 'భోగీ' ముఖ్య పాత్ర పోషిస్తుందని, ఈపొగ గాలిని కలుషితం చేస్తుందని తెలుసు.. అందుకే తాము ప్లాస్టిక్స్ , టైర్లను నివారిస్తామని చెన్నైవాసి శరవణన్ వివరించారు. -
పొంగల్ క్రాంతి
ఖర్జూరాలు అందుకోండి. పండ్లబుట్ట తీసుకురండి. పచ్చికోవా రెడీ చేసుకోండి. పండగకి ఎప్పుడూ కొత్త బియ్యం పొంగళ్లేనా? వీటిని ట్రై చెయ్యండి. అతిథుల్ని సర్ప్రైజ్ చెయ్యండి. స్వీట్ పొంగల్ కావలసినవి: పాలు – 4 కప్పులు; బియ్యం – కప్పు; బెల్లం పొడి – కప్పు; జీడిపప్పులు – 10; కిస్మిస్ – 2 టేబుల్‌స్పూన్లు; ఏలకుల పొడి – అర టీ స్పూను; నెయ్యి – 6 టేబుల్ స్పూన్లు; కొబ్బరి ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు తయారి: ముందుగా పాలను మరిగించాలి∙ బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీరు ఒంపేసి, మరుగుతున్న పాలలో వేయాలి∙ బాగా ఉడికిన తరవాత బెల్లం పొడి వేసి కలియబెట్టి, ఉడికించాలి∙ ఐదు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలపాలి∙ బాణలిలో టేబుల్ స్పూను నెయ్యి వేసి కరిగాక జీడిపప్పులు, కిస్మిస్, కొబ్బరి ముక్కలు విడివిడిగా వేసి వేయించి, ఉడికిన పొంగల్‌లో వేసి బాగా కలపాలి వేడివేడిగా వడ్డించాలి. డేట్స్ హనీ పొంగల్ కావలసినవి: బియ్యం – కప్పు; పెసర పప్పు – అర కప్పు; పాలు – 4 కప్పులు; నీళ్లు – 2 కప్పులు; బెల్లం పొడి – ఒకటిన్నర కప్పులు; ఖర్జూరాలు – 10 (చిన్న చిన్న ముక్కలుగా చేయాలి); తేనె – 3 టేబుల్ స్పూన్లు; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – టీ స్పూను; శొంఠి పొడి – టీ స్పూను; వేయించిన జీడి పప్పులు – 10 తయారి: బియ్యం, పెసర పప్పులను బాగా కడిగి అరగంటసేపు నానబెట్టాలి∙ పెద్ద పాత్రలో పాలు పోసి మరిగించాలి∙ నీళ్లు, టేబుల్ స్పూను నెయ్యి జత చేసి బాగా కలపాలి∙ నానబెట్టుకున్న బియ్యం + పెసర పప్పు వేసి బాగా కలిపి ఉడికించాలి∙ ఒక పాత్రలో బెల్లం, నీరు పోసి గరిటెతో బెల్లం కరిగేవరకు కలపాలి∙ మిక్సీలో ఖర్జూరాలు, తేనె వేసి మెత్తగా చేసి, ఉడుకుతున్న పొంగల్‌లో వేసి మరోమారు కలిపి ఉడికించాలి∙ ఏలకుల పొడి, శొంఠి పొడి వేసి బాగా కలిపి దింపేయాలి∙ వేయించి ఉంచుకున్న జీడిపప్పులతో అలంకరించి వేడివేడిగా అందించాలి. ఫ్రూట్ పొంగల్ కావలసినవి: బియ్యం – కప్పు; పెసర పప్పు – టేబుల్ స్పూను; పటిక బెల్లం – కప్పు; ఫ్రూట్ పల్ప్ – ఒకటిన్నర కప్పులు; ఏలకుల పొడి – టీ స్పూను; కుంకుమ పువ్వు – చిటికెడు; కిస్మిస్ – కొద్దిగా తయారి: బియ్యం, పెసరపప్పులను విడివిడిగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి విడివిడిగా ఉడికించాలి∙ పెసరపప్పు మరీ మెత్తగా కాకుండా, కొద్దిగా పొడిపొడిగా ఉండేలా ఉడికించాలి∙ పటిక బెల్లానికి తగినని నీళ్లు జత చేసి, స్టౌ మీద కరిగించాలి∙ ఒక పాత్రలో అన్నం, ఉడికించిన పెసరపప్పు వేసి బాగా కలపాలి∙ పటికబెల్లం నీళ్లు జత చేసి మారోమారు ఉడికించాలి∙ ఏలకుల పొడి, కుంకుమ పువ్వు జతచేసి మరోమారు కలపాలి ∙ చివరగా ఫ్రూట్ పల్ప్ జత చేసి బాగా కలియబెట్టి దింపేయాలి ∙ బాణలిలో నెయ్యి వేసి కరిగాక కిస్మిస్ వేసి వేయించి, ఫ్రూట్ పొంగల్‌లో వేసి కలపాలి. ఫ్రూట్ పల్ప్ కోసం... ఆపిల్, పైనాపిల్, అరటిపండు, సపోటా, స్ట్రాబెర్రీలు... వీటిని తగినన్ని తీసుకుని చిన్నచిన్న ముక్కలుగా చేసి మెత్తగా చేయాలి. అమృత పొంగల్ కావలసినవి: సన్న బియ్యం – కప్పు; పాలు – 2 కప్పులు; నీళ్లు – కప్పు; పంచదార లేని పచ్చి కోవా – కప్పు; పంచదార – కప్పు; కుంకుమ పువ్వు – పావు టీ స్పూను; బాదం పప్పులు – 5; పిస్తా – 5 తయారి: ముందుగా బియ్యం శుభ్రంగా కడగాలి ∙ పాలు, నీళ్లు కలిపి మరిగాక, కడిగిన బియ్యం వేసి ఉడికించాలి∙ ఉడికిన అన్నాన్ని మెత్తగా మెదిపి, పంచదార జత చేసి, స్టౌ మీద ఉంచి, పంచదార కరిగేవరకు కలపాలి∙ పచ్చి కోవా జత చేసి మరోమారు కలిపి బాగా ఉడికించి దింపేయాలి∙ బాదం పప్పుల తరుగు, పిస్తా పప్పులు వేసి బాగా కలిపి, కుంకుమ పువ్వు పొడి వేసి కలిపి వేడివేడిగా అందించాలి. -
తేగల సమర్థుడు!
♦ అక్షర తూణీరం దేవుడి చేతిలో మనందరం తోలు బొమ్మలమే. కానీ నాయకులు మనల్ని శాసించి, ఆడిస్తారు. అప్పుడప్పుడు తల కాయలు మారుస్తారు కూడా. సంక్రాంతి అంటే కొత్త ధాన్యం వచ్చే తరుణం. ఆ వడ్లని మసిలే నీళ్లలో నానపోసి, తర్వాత వాటిని ఆరపోస్తారు. మంచి పొయ్యి సెగమీద మంగలంలో వాటిని వేపుతూ, వేడిమీదనే రోకళ్లతో దంచుతారు. అప్పుడు అటుకులుగా సాగుతాయి. అన్ని పనులూ సరైన పదునులో జరిగి, అనుభవం తోడైతే అటు కులు చింతాకుల్లా సాగి ఫలిస్తాయి. అటుకులు పేదవాడి ఫల హారం. ద్వాపరంలో కుచేలుడు వీటికి ఎక్కడలేని ప్రాచుర్యం తీసుకొచ్చాడు. దేవుళ్లకి అటుకులు ఇష్టప్రసాదాలైనాయి. ఈ గ్రామీణ గృహ పరిశ్రమలో రాజకీయం ఉంది. ఉడుకుదుడుకుగా విషయాన్ని నాన పెట్టడం, సెగమీద వేపడం, వేడిమీదే ధనధనా దంచి సాగతియ్యడం– మనం గమని స్తూనే ఉన్నాం. అరిశెల తయారీ కూడా ప్రజా సేవకులకు దారి చూపిస్తుంది. వాగ్దానాలు వారికి కొట్టినపిండి. కొత్త బెల్లంతో తియ్యటి తీగెపాకం పట్టడం, అందులో కొట్టిన పిండి పోస్తూ తిప్పడం, అవసరమైతే కుమ్మడం ద్వారా అరిశెల పిండి సిద్ధం అవుతుంది. దాన్ని అప్పచ్చులుగా చేసి కాగే నూనెలో వండుతారు. వాటిని పైకి తీసి అరిశె చెక్కలతో తాగిన నూనెని కక్కిస్తారు. పైపైన నువ్వులద్దుతారు. ఇహ వాటి రుచి సంక్రాంతి సంబరాల్ని మెరిపిస్తుంది. ఈ తయారీలో దంచడం, కుమ్మడం, నొక్కడం, కక్కించడం, పైపైన అద్దడం లాంటి ప్రక్రియలున్నాయ్. గమనార్హం. ఇప్పటి వారికి పేరు తెలుసుగానీ ‘తేగలు’ ఎక్కడ ఎలా పండుతాయో, ఏ ఫ్యాక్టరీలో తయారవుతాయో తెలియదు. తేగ అంటే తాడిచెట్టు మొలక. తాటిపండు లోంచి వచ్చే టెంకలు మొలకెత్తి తేగల వుతాయి. ఇది కూడా మంచి ఆహారం. ‘‘ఇదిగో నే ఢిల్లీ వెళ్తున్నా. ప్రధానమంత్రిని కలు స్తున్నా. రాష్ట్రానికి అందాల్సిన సాయాలన్నింటినీ తేగ లను... తేగలను’’ అంటూ చంద్ర బాబు నొక్కి వక్కాణిస్తున్నారు. తేగల సమర్థుడే! ఆవుపేడ కిలో రెండొందల యాభైకి ఆన్లైన్లో అమ్ముతున్నారు. ఇది మోదీ కీర్తిని పెంచే అంశం ఏ మాత్రం కాదు. పేడ విషయంలో కమల నాథులు మనసు పెట్టాలి. ఒక సవాలుగా స్వీకరించాలి. కొడి గట్టిన స్వచ్ఛభారత్ నినాదాన్ని భోగిమంటల్లో తిరిగి వెలిగిం చాలి. ఈ పండుగ సీజన్లో ఊరి బయటి చింతలతోపులో బొమ్మ లాళ్లు వచ్చి దిగేవారు. ఏడెని మిది గూడుబళ్లు, వాటి నిండా తోలు బొమ్మలు, చిన్నా పెద్దా, పిల్లా జెల్లా, కోడీ మేకా, సరుకూ సరంజామా సర్వం దిగిపోయి చింతలతోపు తిరునాళ్లను తలపించేది. వాళ్లు బళ్లలోంచి బొమ్మలన్నింటినీ దింపి వాటిని సరిచేసుకోవడం, కొత్త నగిషీలు పూయడం చేసేవారు. కొందరు వూరిమీదపడి తెరలకు వస్త్రాలు, ఆటదీపానికి చమురు పోగేసేవారు. పొడుగాటి తుమ్మముళ్లు ఆట ఆడించడానికి మరికొందరు సేకరిస్తుండే వారు. వూడిపోయిన తలకాయల్ని, వూగే కాళ్లని చేతుల్ని ప్రతి మజిలీలోనూ జాగ్రత్తగా సరిచూసుకోవాలి. బొమ్మలాటలో వినోదం పంచే బంగారక్క, కేతిగాడు అతి ముఖ్యంగా. వాళ్లిద్దరూ నోటికి ఎంత మాటొస్తే అంతమాటంటారు. చెయ్యి విదల్చని వారిని ఆ పాత్రలతో తిట్టించేవారు. జట్టుపోలిగాడు మరో ప్రధాన పాత్ర. దేవుడి చేతిలో మనందరం తోలు బొమ్మలమే. కానీ నాయకులు మనల్ని శాసించి, ఆడిస్తారు. అప్పుడప్పుడు తల కాయలు మారుస్తారు. బంగారక్క కేతిగాడులా ఒక్కోసారి పాలకుల్ని నోటారా తిట్టాలని పిస్తుంది. ఫిరంగి గొట్టం నీటిధారలు చిమ్ముతోంది పంటచేలు పచ్చపచ్చని సిరులు సింగారించుకుంటున్నాయి ఉదయపు సూర్యకాంతిలో కమలం కళకళలాడుతోంది పంటసిరుల సంక్రాంతి శుభవేళ మన భారతావనిని శాంతి సౌభాగ్యాలు వరించుగాక! ( ప్రధానికి రచయిత సంక్రాంతి శుభాకాంక్షలు ) శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
కో‘ఢీ’ అంటే చర్యలు తప్పవు!
సాక్షి, కదిరి: కదిరి, పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కదిరి డీఎస్పీ శ్రీలక్ష్మి హెచ్చరించారు. పట్టణ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మంగళవారం ఎమ్మార్వో పీవీ రమణ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన డీఎస్పీ ప్రసంగించారు. గ్రామాల్లో ఆయా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పోలీస్‌కు సహకరించి కోడిపందేలు జరగకుండా చూడాలని కోరారు. గతంలో కోడిపందేల కేసుల్లో ఉన్నవారిని ఆయా ఎమ్మార్వోల ఎదుట బైండోవర్ చేయిస్తామన్నారు. కోడి పందేల నిర్వహణకు ఎవరైనా తమ స్థలాలు, తోటలు ఇచ్చినట్లు తెలిస్తే వారిపై కూడా కేసులను నమోదు చేస్తామని డీఎస్పీ హెచ్చరించారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం కోడిపందేలు నిర్వహించిన వారిపై ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్ యాక్టు, ఏపీ గేమింగ్ యాక్టుల కింద కేసులు బనాయిస్తామని తెలిపారు. ఇప్పటి నుండి ఈ నెల 24 వరకు అనంతపురం జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్టు అమలులో ఉంటుందన్నారు. కోడి పందేల బదులు సంక్రాంతిని పురష్కరించుకొని పట్టణంలో ముగ్గుల పోటీలు నిర్వహిద్దామని, అందులో ప్రతిభ కనబరచిన మహిళలు బహుమతులు అందజేద్దామని సీఐ గోరంట్ల మాధవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు హేమంత్‌కుమార్, సహదేవరెడ్డి, మగ్బుల్‌బాషా తదితరులు పాల్గొన్నారు. -
సంక్రాంతికి బసవన్నలు ఆడుకోవచ్చు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి వేళ గంగిరెద్దులాటకు పోలీసుల నుంచి ఎటువంటి అభ్యంతరాలు ఉండవని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు తెలిపారు. రహదారులపై, చౌరస్తాల వద్ద భిక్షాటన చేస్తూ ప్రజలకు ఆటంకం కలిగిస్తున్న వారిని మాత్రమే అదుపులోకి తీసుకుని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని వారు చెబుతున్నారు. గంగిరెద్దులు ఆడించేవారు ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ మేరకు మూడు కమిషనరేట్ల పోలీసు కమిషనర్లు శ్రీనివాసరావు, సందీప్ శాండిల్య, మహేశ్ భగవత్ శనివారం ప్రకటనలు విడుదల చేశారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా గంగిరెద్దులాట అనేది హిందూ సంస్కృతిలో భాగమని, తరతరాలుగా కొనసాగుతున్న ఈ ఆటకు పోలీసుల నుంచి ఆటంకం ఉండదని వారు వెల్లడించారు. గంగిరెద్దులాడించే వారికి నగరంలో ఏదైనా ఇబ్బంది తలెత్తితే కంట్రోల్ రూమ్ నం. 100కు తెలపవచ్చని.. వెంటనే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. -
సంక్రాంతి అల్లుడొక జీఎస్టీ
అక్షర తూణీరం గుమ్మడి కాయంత బంగారం, కుక్క ముట్టుకుందని పారేశాం. అందుకే ఇలా వచ్చానని జోలె చూపిస్తాడు. ఆ కబుర్లు, కోతలు ఓటుకొచ్చే వారి మాటల్ని తలపిస్తాయ్. సంక్రాంతి పండగ కనుచూపు మేరలో ఉంది. ఓట్ల పండగలాగే సంక్రాంతి కూడా నెల ముందునుంచీ సంద డికి దిగుతుంది. సాంతం తెల్లారకుండానే సాతాని జియ్యరు పాడినపాటే పాడుకుంటూ గడపగడపకీ తిరు గుతాడు. అక్షయ పాత్రలో బియ్యం పడగానే ‘కృష్ణార్పణం’ అంటూ మరో ముగ్గులోకి వెళ్లిపోతాడు. పాడిన పాటే పాడుకుంటూ ఓట్ల కోసం వస్తారు. కాకపోతే ఓటేశాక మనమే ‘కృష్ణార్పణం’ అనుకుని సరిపెట్టుకోవాలి. ఈ తరుణంలో గంగిరెద్దులస్వామి వస్తాడు. ‘అయ్యగారికి దణ్ణం పెట్టు, అమ్మగారికి దణ్ణం పెట్టు’ అంటూ బొంతలు కప్పుకున్న గంగిరెద్దుని మోకరిల్ల చేస్తాడు. బోలెడు దీవెనలు పెడతాడు. అన్నింటికీ ఆ బసవన్న తలూపుతుంది. అప్పుడు దాని మెడలో గంటలు మోగుతాయి. ఒకసారి నాయకత్వం తలపైకొస్తే, ఇక తర్వాత అందర్నీ డూడూ బసవన్నలని చేసి ఆడించవచ్చునని ఒక ధీమా, ఒక నమ్మకం, ఒక నిజం. బుర్రమీసాలు, వెలిసిపోయిన కోటు, చిరుగుల గొడుగు, తలకి పాగా, చేతిలో ఢక్కా నుదుట పెద్ద కుంకమ బొట్టుతో బుడబుక్కల స్వామి కొంచెం దాష్టీకంగా ఉంటాడు. ‘అంబ పలుకు, జగదాంబ పలుకు’ అనే పల్లవితో ఇంటిల్లపాదికీ దీవెనలు పెడతాడు. అంతా జయమే కలుగుతుందంటూ జోస్యాలు చెబుతాడు. బోలెడు కోరికలు కోరతాడు. కోరినవన్నీ సాధించుకు గాని వెళ్లడు. మంచి కార్యసాధకుడైన నేతలా కనిపిస్తాడు. కట్టె తుపాకీ బుజాన పెట్టుకుని, విచిత్ర వేషధారణలో వినోదాన్ని ఇంటి ముందుకు తెస్తాడు పిట్టలదొర. ఇది చాలా ప్రసిద్ధమైన సంక్రాంతి ముష్టిపాత్ర. కావల్సినన్ని కబుర్లు చెబుతాడు. అంతులేనన్ని కోతలు కోస్తాడు. గుమ్మడి కాయంత బంగారం ఉన్నవాణ్ణి, కుక్క ముట్టుకుందని అవతల పారేశాం. అందుకే ఇలా వచ్చానని జోలె చూపిస్తాడు. ఆ కబుర్లు, కోతలు ఓటుకొచ్చే వారి మాటల్ని తలపిస్తాయ్. కడవలో నీళ్లు పోసి, నీళ్లలో కత్తి గుచ్చి, ఆ కత్తిని కావడికి వేలాడదీసి ఊరంతా ఊరేగిస్తారు మాసాబత్తినివాళ్లు. విప్రవినోదులు హస్తలాఘవంతో ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు ప్రదర్శిస్తారు. నీళ్లలో కత్తి గుచ్చి ఇంద్రజాలం చేయడం, హస్తలాఘవ విద్య రాజకీయ వ్యాపారానికి పెట్టుబడులు. ఏది శంకుస్థాపనో, ఏది ప్రారంభోత్సవమో అంతుపట్టదు. కోడిపందేలు సరేసరి. పందెపు కోళ్లు బాదంపప్పులు దాణాగా తింటాయ్. స్కాచ్ విస్కీ పుచ్చుకుంటాయ్. వాటి గెలుపోటములు కొందరి జీవితాలని నిర్ధారిస్తాయ్. మన పల్నాటి చరిత్రని పందెపు కోళ్లే రచించి, పౌరుషానికి నిర్వచనం చేశాయి. ‘‘ఏమిటోనండీ! ఈ సంక్రాంతి లాంఛనాలతో, అల్లుళ్ల అలకలతో ఇది మాత్రం మోదీ పెట్టిన జీఎస్టీలాగా తినేస్తోందండి!’’ ఈ సంక్రాంతి వేళ ఓ గృహస్తు బావురుమన్నాడు. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
సంక్రాంతికి ఆర్టీసీ 3,262 ప్రత్యేక బస్సులు
సాక్షి, హైదరాబాద్ : సంక్రాంతి సందర్భంగా 3,262 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలను రూపొందించింది. ఈ నెల 10 నుంచి 13 వ తేదీ వరకు ఈ బస్సులు అందు బాటులో ఉంటాయి. రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచనున్నట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజినల్ మేనేజర్ యాదగిరి బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపా రు. దూరప్రాంతాలకు వెళ్లే అన్ని ప్రత్యేక బస్సులపై 50 శాతం అదనపుచార్జీలు వసూ లు చేయనున్నారు. మరోవైపు సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ ప్రాంతాల మధ్య 84 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే చర్యలు చేపట్టింది. జనవరి, ఫిబ్రవరి, మార్చిల్లో రద్దీకి అనుగుణంగా ఈ ప్రత్యేక రైళ్లు వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగిస్తాయి. సాధారణ రోజుల్లో మహాత్మాగాంధీ, జూబ్లీబస్స్టేషన్లు, నగరంలో ని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 1.5 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తుండగా సంక్రాంతి వంటి పర్వదినాల్లో మరో 25 వేల మంది సగటున రోజూ అదనంగా బస్సుల్లో బయలుదేరే అవ కాశముంది. ఇందుకు అనుగుణంగా తెలంగా ణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రోజూ నడిచే 3,065 రెగ్యులర్ బస్సులతోపాటు 3,262 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ వైపు 1,094 బస్సులు, కర్నూల్ వైపు 115, నెల్లూరు 143, వరంగల్ 384, కరీంనగర్ 280, ఖమ్మం 430, మహబూబ్ నగర్ 179, ఆదిలాబాద్, నిజామా బాద్ జిల్లా లకు 259, నల్లగొండ 228, మెదక్ 125, బెంగ ళూరు 15, చెన్నై 5, పూణే వైపునకు 5 ప్రత్యేక బస్సులను నడుపనున్నారు. మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో రద్దీని నియం త్రించేందుకు ప్రత్యేక బస్సులను నగర శివార్ల నుంచి నడి పేందుకు చర్యలు తీసుకున్నారు. ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఎల్బీనగర్, బీహెచ్ ఈఎల్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు, జీడిమెట్ల తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతారు. సంక్రాంతి స్పెషల్ రైళ్లు... సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తిరుపతి–విశాఖపట్టణం, కాచిగూడ–విశాఖ, తిరుపతి–కాచిగూడ, హైదరాబాద్–విశాఖ, సికింద్రా బాద్– దర్బం గా, హైదరాబాద్– రెక్సాల్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌కు మార్ తెలిపారు. ఈ మేరకు తిరుపతి–విశాఖ (07487/07488) ప్రత్యేక రైలు ఈ నెల 7, 14, 21, 28, ఫిబ్రవరి 4, 11, 18, 25 తేదీల్లో రాత్రి 10.30 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.45 గంటలకు విశాఖ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 8, 15, 22, 29, ఫిబ్రవరి 5, 12, 19, 26 తేదీల్లో సాయంత్రం 7.20 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 8.10 కు తిరుపతికి చేరుతుంది. కాచిగూడ–విశాఖ (07016) స్పెషల్ ట్రైన్ ఫిబ్రవరి 6, 13, 20, 27 తేదీల్లో సాయంత్రం 6.45కు కాచిగూడ నుంచి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.50కి విశాఖ చేరుతుంది. విశాఖ–తిరుపతి(07479) స్పెషల్ ట్రైన్ ఫిబ్రవరి 7, 14, 21, 28 తేదీల్లో సాయంత్రం 7.05 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.25కి తిరుపతికి చేరుకుంటుంది. తిరుపతి– కాచిగూడ (07146) స్పెషల్ ట్రైన్ ఈ నెల 8, 15, 22, మార్చి 1 తేదీల్లో సాయంత్రం 5 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30కు కాచిగూడ చేరుకుంటుంది. హైదరాబాద్–విశాఖ(07148/07147) స్పెషల్ ట్రైన్ ఈ నెల 10, 12 తేదీల్లో సాయంత్రం 5.45 గంటలకు నాంపల్లి నుంచి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 9.45 కి విశాఖ చేరుతెంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 11, 13 తేదీల్లో సాయంత్రం 6.50 కు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.45 కు నాంపల్లి చేరుకుంటుంది. సికింద్రాబాద్–దర్భంగా(07007/07008) స్పెషల్ ట్రైన్ ఫిబ్రవరి 3, 6, 10, 13, 17, 20, 24, మార్చి 3, 6, 10, 13, 17, 20, 24, 27, 31తేదీల్లో రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి రెండోరోజు మధ్యాహ్నం 1.45కు దర్భంగా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఫిబ్రవరి 6, 9, 13, 16, 20, 23, 27, మార్చి 2, 6, 9, 13, 16, 20, 23, 27, 30 తేదీల్లో ఉదయం 5 గంటలకు దర్భంగా నుంచి బయలుదేరి మరుసటిరోజు రాత్రి 10.10కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. హైదరాబాద్ –రెక్సాల్ (07005/07006) స్పెషల్ ట్రైన్ ఫిబ్రవరి 1, 8, 15, 22, మార్చి 1,8, 15, 22, 29 తేదీల్లో రాత్రి 9.30 గంటకు నాంపల్లిలో బయలుదేరి రెండోరోజు సాయంత్రం 5.30కు రెక్సాల్ చేరుతుంది. తిరుగుప్రయాణంలో ఫిబ్రవరి 4, 11, 18, 25, మార్చి 4, 11, 18, 25, ఏప్రిల్ 1 తేదీల్లో తెల్లవారు జామున 1.30 కు బయలుదేరి మరుసటిరోజు రాత్రి 11.15 కు నాంపల్లి చేరుకుంటుంది. -
తెలంగాణ డయాగ్నస్టిక్స్
సాక్షి, హైదరాబాద్ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రారంభిస్తోంది. వైద్య సేవలు, చికిత్సలో కీలకమైన రోగ నిర్ధారణ పరీక్షలను ఉచితంగా అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ డయాగ్నస్టిక్స్ పేరిట రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రారం భించనున్నారు. తొలుత ఈ వారంలోనే నగరంలో ప్రయోగాత్మకంగా ఉచిత రోగ నిర్ధారణ పరీక్షల కార్యక్రమాన్ని ప్రారంభిం చడానికి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేసింది. ప్రయోగాత్మక కార్యక్రమంలో వచ్చే ఇబ్బందులను సరి చేసి సంక్రాంతిలోపు పూర్తి స్థాయిలో ఈ సేవలను ప్రారంభించనున్నారు. మొదట పాత జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులు, ఆ తర్వాత కొత్త జిల్లాల కేంద్రాలకు విస్తరిస్తారు. ఆ తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఈ సేవలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.10 కోట్ల నిధులను విడుదల చేసింది. కార్పొరేట్, ప్రైవేట్ డయాగ్నస్టిక్స్‌కు దీటుగా ప్రభుత్వ పరంగా ఈ సేవలను అందించేలా అధునాతన సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం) ఆవరణలోని ల్యాబ్‌కు అదనంగా మరో అత్యాధునిక డయాగ్నస్టిక్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉచిత రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న వారు ఎక్కడైనా నివేదికలు తీసుకునేలా ఎప్పటికప్పుడు వీటిని ఆన్లైన్లో పొందుపరచనున్నారు. రోగనిర్ధారణ పరీక్షలే కీలకం.. వైద్య సేవలలో డయాగ్నస్టిక్స్ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. రోగ నిర్ధారణలో ఎంత స్పష్టత ఉంటే అంత మెరుగైన వైద్యం అందించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రులలో ఇన్ పేషెంట్లకే ఉచితంగా ఈ సేవలు అందుతున్నాయి. అయితే ఔట్ పేషెంట్లుగా వచ్చే పేద వర్గాలకు ఇది ఇబ్బందిగా ఉంటోంది. బీపీ, మధుమేహం, మూత్ర పరీక్షలకు సైతం ప్రైవేటు డయాగ్నస్టిక్స్ కేంద్రాలకే వెళ్లాల్సి వస్తోంది. రోగ నిర్ధారణకు వైద్యులు సిఫారసు చేసినా డబ్బులు లేక పరీక్షలు చేయించుకోలేని పరిస్థితి ఉంటోంది. దీంతో వారు సరైన చికిత్స తీసుకోలేకపోతున్నారు. ఫలితంగా మరింత అనారోగ్యానికి గురవుతున్నారు. ఇదిలా ఉండగా అధికశాతం ప్రభుత్వ ఆస్పత్రులలో పరికరాలు, సిబ్బంది సరిగాలేక సాధారణ పరీక్షలు సైతం నిర్వహించడంలేదు. ఈ నేపథ్యంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కొత్తగా ప్రారంభిస్తున్న పథకంతో ఈ పరిస్థితులు మారనున్నాయి. ఔట్ పేషెంట్లకూ ఉచితం.. ఇకపై ఔట్ పేషెంట్లకు కూడా ఉచిత పరీక్షల సేవలు అందిస్తారు. అన్ని రకాల రోగ నిర్ధారణ పరీక్షలకు అవసరమైన పరికరాలను సిద్ధం చేస్తున్నారు. పరీక్షలకు అవసరమైన సాంకేతిక సిబ్బందిని కూడా నియమిస్తున్నారు. కాగా, ఆయా ఆస్పత్రుల స్థాయి ఆధారంగా ఉచిత రోగ నిర్ధారణ పరీక్షల సేవలను అందించనున్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో 39 రకాల సేవలు అందుబాటులో ఉంటాయి. అన్ని స్థాయిల ఆస్పత్రుల్లోనూ ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు రక్తం, మూత్ర, మల పరీక్షలకు సంబంధించిన నమూనాలు సేకరిస్తారు. ఆయా ఆస్పత్రుల నుంచి సాయంత్రం ఐదు గంటలలోపు ఐపీఎంలోని రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రానికి వాటిని చేరుస్తారు. మరుసటి రోజు ఉదయం నమూనాలను పరీక్షించి, మధ్యాహ్నం రెండు గంటలలోపు పరీక్ష నివేదికలను ఆన్లైన్లో సంబంధిత ఆస్పత్రికి పంపిస్తారు. ఆస్పత్రి నుంచి రోగికి ఆన్లైన్లో చేరవేస్తారు. అవసరమైతే రోగికి నేరుగా నివేదికలను ఇస్తారు. కాగా, తీవ్రమైన వ్యాధులకు సంబంధించిన పరీక్షలను ఐపీఎంలో నిర్వహించగా, ఇతర సాధారణ పరీక్షలను స్థానికంగా నిర్వహిస్తారు. వైద్య సేవల్లో మార్పులు: వాకాటి కరుణ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ తెలంగాణ డయాగ్నస్టిక్స్‌తో రాష్ట్రంలోని వైద్య సేవలలో ఎన్నో మార్పులు వస్తాయి. వైద్య సేవలలో కీలకమైన రోగ నిర్ధారణ పరీక్షలను ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేశాం. వారంలోనే ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లో ఈ సేవలు మొదలవుతాయి. రెండోవారంలో అధికారికంగా పూర్తి స్థాయిలో సేవలను అందిస్తాం. -
అమ్మాయిల మెప్పు కోసం జల్లికట్టు ..
సంక్రాంతి పర్వదినం సమీపిస్తుండడంతో సాహస క్రీడ జల్లికట్టుకు ఇప్పటినుంచే దక్షిణాదిలోని గ్రామాలు సిద్ధం అవుతున్నాయి. ఎవరికీ పట్టుబడని రీతిలో, ఎవరైనా దూసుకొస్తే, వారిని ఎదుర్కొనే విధంగా ఎద్దులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే పనిలో రైతులు నిమగ్నం అవుతున్నారు. రంకెలేసే ఎద్దులకు ముక్కుతాడు వేయడానికి క్రీడాకారులు తమ మెళకువలకు మెరుగులుదిద్దేందుకు సిద్ధం అవుతున్నారు. అదే సమయంలో మళ్లీ జల్లికట్టు వివాదంలోకి ఇరుక్కోని రీతిలో ఈసారి మరింత కట్టుదిట్టమైన నిబంధనలు, భద్రతా ఆంక్షల మధ్య సాగనుంది. ఆమేరకు అనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఏడబ్ల్యూబీఐ) కార్యాచరణ రూపొందిస్తోంది. ఏ ఒక్క ఎద్దు హింసకు గురికాకుండా. ఏ క్రీడాకారుడు గాయపడకుండా ఉండేందుకు నిబంధనల రూపకల్పన చేస్తోంది. అతి నిబంధనల్ని జిల్లా యంత్రాంగాల ద్వారా సక్రమంగా అమలు చేయించి, క్రీడలను నిర్వహించేందుకు ఏడబ్ల్యూబీఐ ఏర్పాట్లు చేస్తోంది. సాక్షి, చెన్నై: ‘ముత్యాల ముగ్గులు, రంగ వల్లులు, గొబ్బెమ్మలు.. బోగి మంటలు, పొంగళ్లతో ఇంటిల్లి పాది సంబరాలు’ ఇది సంక్రాంతి సందడి. అయితే, తమిళనాట ఈ సంబరాలకు తోడుగా వీరత్వాన్ని చాటే సాహస క్రీడ జల్లికట్టుకు పెద్ద పీట వేయడం ఆనవాయితీ. రంకెలు వేసే బసవన్నల పొగరును అణచివేస్తూ, తమ పౌరుషాన్ని చాటుకునే క్రీడాకారులతో ఈ క్రీడ సాగుతుంది. అయితే, ఈ సారి ఈ జల్లికట్టు మరింత కట్టుదిట్టమైన నిబంధనలు, భద్రత ఆంక్షల మధ్య సాగనుంది. ఇందుకు తగ్గ కార్యాచరణను అనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియ (ఏడబ్ల్యూబీఐ) రూపొందిస్తున్నది. రాష్ట్రంలో సాహస, సంప్రదాయ క్రీడగా జల్లికట్టు పేరుగడించింది. ఈ క్రీడ ఎప్పటి నుంచి సాగుతోందో అన్నది ఓ ప్రశ్నగానే మిగిలింది. ఒకప్పుడు తమకు నచ్చిన వారిని వరుడుగా ఎంపిక చేసుకునేందుకు ఈ క్రీడను యువతులు వేదికగా చేసుకున్నట్టు చరిత్ర చేబుతోంది. అప్పటి నుంచి సంప్రదాయబద్ధంగా సాగుతూ వస్తున్న ఈ క్రీడను మంజు విరాట్, వడి మంజువిరాట్, వెల్లి విరాట్, వడం విరాట్ పేర్లతోనూ పిలుస్తుంటారు. ‘‘సల్లి కాసు–కట్టు, సల్టికాసు కట్టుగా, సల్లికట్టుగా ...చివరకు జల్లికట్టుగా’ ఈ సాహస క్రీడ రూపాంతరం చెందినట్టుగా పురాణాలు చెబుతుంటాయి. తొలి నాళ్లల్లో యువతుల్ని మెప్పించేందుకు యువకులు సాహసాన్ని ప్రదర్శిస్తే, రాను రాను ఇదో రాక్షసక్రీడగా మారిందని చెప్పవచ్చు. సంక్రాంతి సందర్భంగా కనుమనాడు ఆరంభం అయ్యే ఈ క్రీడ ఒకప్పుడు ఆరు నెలల పాటు వివిధ జిల్లాల వారీగా జరిగేది. ఒక్కో జిల్లాల్లో ఈ క్రీడ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్న యువకులు ఉన్నారు. తమ వీరత్వాన్ని చాటుకునేందుకు కదన రంగంలోకి దుకే వారు కొందరు అయితే, ఆకర్షణీయమైన బహుమతుల్ని తన్నుకెళ్లేందుకు దూసుకొచ్చే వారు మరి కొందరు. ఈ క్రమంలో కదన రంగంలోకి దిగే ఎద్దులను హింసించడం పెరిగింది. తప్పించుకునే క్రమంలో క్రీడా కారులపై తమ ప్రతాపాన్ని ఎద్దులు చూపించడం, వాటి దాటికి బలైన వారెందరో ఉన్నారు. అలాగే, కదనరంగంలో దిగే బసవన్నలు రంకెలు వేసే విధంగా వాటికి మద్యం, సారా వంటివి పట్టిస్తున్నట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో జంతు ప్రేమికులు రంగంలోకి దిగడం వ్యవహారం కోర్టుకు చేరింది. దీంతో జల్లికట్టుకు దూరంగా రెండేళ్లు గడపాల్సిన పరిస్థితి. కోర్టు స్టే విధించడంతో జల్లికట్టు ఇకలేనట్టే అన్న పరిస్థితి తప్పలేదు. ఎట్టకేలకు ఈ ఏడాది ఆరంభంలో దేశమే తమిళనాడు వైపుగా చూసే స్థాయిలో సాగిన ఉద్యమంతో మళ్లీ జల్లికట్టు తమిళుల సొంతం అయింది. జల్లికట్టు కట్టుదిట్టం: గట్టి భద్రత నడుమ ఈ సారి జల్లికట్టును జరుపనున్నారు. అయినా, జల్లికట్టుకు నిషేధం లక్ష్యంగా పీట తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నది. ఈ నేపథ్యంలో మళ్లీ సంక్రాంతి పర్వదినం వేళ సమీపిస్తుండడంతో ఇప్పటి నుంచే సాహస క్రీడ జల్లికట్టుకు దక్షిణాదిలోని గ్రామాలు సిద్ధం అవుతున్నాయి. ఎవరికీ పట్టుబడని రీతిలో, ఎవరైనా దూసుకొస్తే, వారిని ఎదుర్కొనే విధంగా ఎద్దులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే పనిలో రైతులు నిమగ్నం అవుతున్నారు. ఇప్పటి నుంచి వాటికి మంచి ఆహారంతో పాటు, శిక్షణ మెళకువల్ని ఇస్తూ గెలుపు బావుటాకు వాటి యజమానులు సిద్ధం అవుంటే, రంకెలేసే ఎద్దులకు ముక్కుతాడు వేయడానికి క్రీడాకారులు తమ మెళకువలకు మెరుగులు దిద్దేందుకు సిద్ధం అవుతున్నారు. అదే సమయంలో మళ్లీ జల్లికట్టు వివాదంలోకి ఇరుక్కోని రీతిలో ఈ సారి మరింత కట్టుదిట్టంగా నిబంధనల అమలు మీద ఏడబ్ల్యూబీఐ దృష్టి పెట్టింది. ఆ సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఆర్ గుప్తా ప్రధానంగా జల్లికట్టుకు కొత్త ఆంక్షలు, నిబంధనల రూపకల్పన మీద దృష్టి పెట్టారు. ఏ ఒక్క ఎద్దు హింసించ బడకుండా ఉండే రీతిలో, ఏ క్రీడాకారుడు గాయపడకుండా ఉండేందుకు తగ్గట్టుగా ఈ సారి నిబంధనల రూపకల్పన సాగనుంది. అతిపెద్ద మైదానం, భారీ భద్రతతో, సందర్శకుల భద్రత నిమిత్తం ప్రత్యేక గ్యాలరీలతో పాటుగా అన్ని రకాల నిబంధనల్ని జిల్లా యంత్రాంగాల ద్వారా సక్రమంగా అమలు చేయించి, క్రీడల్ని నిర్వహించే విధంగా ముందుకు సాగునున్నారు. మరి కొద్ది రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త నిబంధనలు నివేదిక రూపంలో చేరనుంది. ఆ తదుపరి నిర్వాహకులు, క్రీడాకారులతో సమావేశం ఏర్పాటు చేసి, ప్రత్యేక కార్యాచరణతో ఈ సంక్రాంతి పర్వదినం వేళ జల్లికట్టును విజయవంతం చేయబోతున్నారు. -
మేకింగ్ ఆఫ్ మూవీ - శతమానం భవతి
-
జల్లి 'కట్టు' పై తంబి పట్టు
జల్లికట్టు అంటే.. గిత్తను లొంగదీసే సంప్రదాయ తమిళ ఆట. మదురై, తిరుచిరా పల్లి, తేని, పుదుకొట్టాయ్, దిండిగుల్ జిల్లాలో పోంగల్ సందర్భంగా కోలాహలంగా ఆడుతారు. నిర్దిష్ట స్థలంలో కొందరు యువకుల మధ్యకు బలిష్టమైన గిత్తను వదులుతారు. ఉత్తిచేతులతో దాన్ని లొంగదీసిన వారు విజేత. మరికొన్ని చోట్ల వీధుల్లో ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి... మధ్యనున్న దారిలో గిత్తను వదులుతారు. దాన్ని కరుచుకొని ఎవరు ఎక్కువ దూరం ప్రయాణించగలిగితే వారే విజేత. ఓ దండేసి విజేతను సన్మానిస్తారు. మొదట్లో 101 రూపాయల చిల్లర నాణేలు ఎద్దు కొమ్ముకు కట్టేవారు. వాటితో పాటు ఓ ధోవతి, టవల్... ఇవే విజేతలకు దక్కే బహుమతి. తర్వాతి కాలంలో గ్రైండర్లు, ఫ్రిజ్‌లాంటి గృహోపకరణాలను కొన్నిచోట్ల బహుమతు లుగా ఇస్తున్నారు. ఆర్థిక ప్రయోజనాలు లేకున్నా జల్లికట్టులో నెగ్గడాన్ని తమిళ యువత ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. రాజకీయ కోణం.. విపక్ష డీఎంకే నేత స్టాలిన్ జల్లికట్టుపై నిషేధాన్ని రాజకీయం చేశారు. నిషేధం ఎత్తి వేతకు రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శలు మొదలుపెట్టారు. డీఎంకే భాగస్వామిగా ఉన్న యూపీఏ ప్రభుత్వమే మొదట జల్లికట్టును అడ్డు కుందని ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ప్రతి విమర్శ చేశారు. తేవర్ కులం ప్రాబల్యం కలిగిన జిల్లాలో దీన్ని ఎక్కువ గా ఆడతారు. అన్నా డీఎంకేలో తేవర్ల ప్రాబల్యం ఎక్కువ. రాజకీయం గా ప్రాబల్యం కలిగిన కులం. సీఎం, శశికళ ఇద్దరూ ఈ కులానికి చెందిన వాళ్లే. అందువల్ల ప్రభుత్వం ఒత్తిడికి లోనైంది. ఉప్పెనలా యువత... కొంతమంది నిరసనకారులను అరెస్ట్ చేశారనే వార్తలతో మంగళవారం ఉదయం ఓ 50 మంది మెరీనా బీచ్‌కు చేరుకొని నిరసనకు దిగారు. గంటల్లోనే ఈ సంఖ్య వేలకు చేరింది. సామాజిక మాధ్యమాల్లో ప్రచారంతో... యువత ఉప్పెనలా కదిలింది. ఐటీ నిపుణులు, ఉద్యోగులు, కాలేజీ విద్యార్థులు స్వచ్ఛందంగా తరలివచ్చారు. బుధ వారం రాత్రయ్యేసరికి నిరసనకారుల సంఖ్య 15 వేలకు చేరుకుంది. రాత్రి చల్లని చలిలో బీచ్‌లోనే పడుకున్నారు. గురువారం ఉదయం పరిసరాలను శుభ్రం చేశారు. తోటి నిరసనకారులకు కొందరు ఇంటి నుంచి భోజనాలు తెచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది యువత రోడ్డెక్కారు. నిరసనకారులు శాంతియుతంగా ఆందోళన చేస్తూనే... రాజకీయ నాయకులను తమ ఆందోళనకు దూరంగా ఉంచారు. నాయకుడెవరూ లేని నయా సమష్టి ఉద్యమమిది. సినీనటులు, ఇతర రంగాల ప్రముఖులు వీరికి మద్దతు పలుకుతున్నారు. జల్లికట్టును అనుమతించాలి, విదేశీ సంస్థ పెటాను నిషేధించాలి... అనేవి నిరసనకారుల డిమాండ్లు. ఎందుకంత మద్దతు.. ద్రవిడ ఉద్యమం, హిందీ భాషకు వ్యతిరేక ఉద్యమాలు చేసిన తమిళుల్లో అస్థిత్వ భావన ఎక్కువ. తమిళ సంప్రదాయాల్లో ఇతరుల జోక్యమేమిటి? ఇది తమిళుల ఆత్మగౌరవానికి భంగకరమని వీరి భావన. ఈ భావనతోనే యువత ఒక్కసారిగా స్వచ్ఛందంగా కదిలింది. పైగా స్పెయిన్ బుల్‌ఫైట్‌లో లాగా తాము గిత్తలను హింసించి చంపడం లేదనేది వీరి వాదన. వివాదం ఏంటి? జంతువులకు శిక్షణ (కోతులు, ఎలుగుబంట్లు, పులులు తదితర) ఇచ్చి... వాటితో ప్రదర్శనలు ఇవ్వడాన్ని కేంద్ర ప్రభుత్వం 1991లో నిషేధించింది. 2011లో ఈ జాబితాలో గిత్తను కూడా చేర్చారు. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయగా... 2014లో అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ జల్లికట్టుపై నిషేధం విధించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను (2016 మే) దృష్టిలో పెట్టుకొని గత ఏడాది ఆరంభంలో అమిత్ షా జోక్యంతో ఎద్దు నిషేధిత జాబితాలో ఉన్నా జల్లికట్టు ఆడుకోవచ్చని కేంద్రం ఆదేశించింది. ఇది కోర్టు ధిక్కారమని జంతు పరిరక్షణ సంస్థ ‘పెటా’ సుప్రీం తలుపు తట్టింది. ఈ ఆదేశాలను సుప్రీం తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో క్రీడ మద్దతుదారులు కొందరు అనుమతించాలని మళ్లీ సుప్రీంకు వెళ్లారు. పొంగల్ సమీపిస్తున్నందున అత్యవసరంగా విచారించాలని కోరగా... ఈనెల 12 సుప్రీం వారి విజ్ఞప్తిని తిరస్కరించింది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ మదురై తదితర ప్రాంతాల్లో జల్లికట్టును నిర్వహించారు. అప్పటి నుంచి అక్కడక్కడ నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఢిల్లీకి పన్నీరు... శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉండటంతో సీఎం పన్నీర్ సెల్వం బుధవారం రాత్రే ఢిల్లీకి వెళ్లారు. గురువారం ప్రధాని నరేంద్ర మోదీని కలిసి పరిస్థితిని వివరించారు. జల్లికట్టుకు అనుమతిస్తూ ఆర్డినెన్స్ తెచ్చి ఆందోళనకారులను శాంతింపజేయాలని మొరపెట్టుకున్నారు. జల్లికట్టుకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపుతామన్నారు. కాగా తమిళనాడులో నిరసన ఉధృతమవుతున్న దృష్ట్యా సుమోటోగా తీసుకొని విచారించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం తోసిపుచ్చింది. మద్రాసు హైకోర్టుకు వెళ్లమని సూచించింది. ప్రధాని ఏమన్నారు జల్లికట్టుపై తమిళుల సెంటిమెంట్లను మేము గౌరవిస్తాం. అయితే కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. జల్లికట్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా అండగా నిలబడతాం. ‘పెటా’ వాదనేంటి... జల్లికట్టు ముమ్మాటికీ జంతు హింసే. గిత్తలు అదుపు తప్పి రెచ్చిపోయేలా పోటీకి ముందు వాటికి మత్తుమందులు ఇస్తున్నారు. కళ్లలో కారం జల్లుతున్నారు. దీనికి వీడియో సాక్ష్యాలు కూడా కోర్టుకు సమర్పించాం. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
రజనీ కూడా సై అంటున్నారు!
-
రజనీ కూడా సై అంటున్నారు!
సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో నిర్వహించే జల్లికట్టుకు నిన్న కాక మొన్న కమల్‌హాసన్ మద్దతు పలికితే.. ఇప్పుడు సూపర్‌స్టార్ రజనీ కాంత్ కూడా దన్నుగా నిలిచారు. సుప్రీంకోర్టు వద్దన్నా, ఎవరు వద్దన్నా కూడా తమిళుల సంప్రదాయ క్రీడ అయిన జల్లికట్టును ఆడాల్సిందేనని అంటున్నారు. ఎన్నో శతాబ్దాలుగా జల్లికట్టు ఆట ఉందని, తమిళుల సంస్కృతిలో భాగంగా దాన్ని తప్పనిసరిగా నిర్వహించాలని చెప్పారు. వికటన్ సినిమా అవార్డుల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అందులో కావాలంటే ఎన్ని నిబంధనలైనా పెట్టుకోవచ్చు గానీ, జల్లికట్టును మాత్రం కొనసాగించాలని చెప్పారు. జల్లికట్టు మీద నిషేధం విధించాలంటే బిర్యానీని కూడా నిషేధించాలని కమల్ అన్న విషయం తెలిసిందే. తమిళులు దేన్నయినా వదులుకుంటారు గానీ, సంక్రాంతి సందర్భంగా నిర్వహించే జల్లికట్టును మాత్రం కొనసాగించాల్సిందేనని చెబుతారు. ఇప్పటికే ధనుష్, శింబూ, జీవీ ప్రకాష్, ఆర్జే బాలాజీ, ఖుష్బూ లాంటి చాలా మంది దీనికి మద్దతు పలికారు. -
పల్లెబాట పట్టిన హైదరాబాద్
-
ఊరంతా సంక్రాంతి
-
కోడిపందేల్లో రివాల్వర్ కాల్పుల కలకలం.
-
కోడిపందేల్లో రివాల్వర్ కాల్పుల కలకలం
సంక్రాంతి సందర్భంగా గోదావరి జిల్లాల్లో నిర్వహిస్తున్న కోడి పందేల వద్ద ఓ వ్యక్తి రివాల్వర్‌తో కాల్పులు జరపడం తీవ్ర కలకలం రేపింది. తాడేపల్లిగూడెం మండలం శ్రీనివాసపురం వద్ద ఈ ఘటన జరిగింది. శ్రీనివాసపురం బరి వద్దకు భారీ సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. అక్కడ పోటాపోటీగా కోడిపందేలు జరుగుతున్నాయి. బెట్టింగులు కూడా జోరందుకున్నాయి. ఇంతలో ఖమ్మం జిల్లాకు చెందిన దయాకర్ అనే వ్యక్తి తన వద్ద ఉన్న లైసెన్సుడు రివాల్వర్‌తో గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. దాంతో ఏం జరిగిందో తెలియక అంతా కంగారు పడ్డారు. మధ్యాహ్నం సమయంలో పందేలు జరుగుతుండగా ఒక్కసారిగా అతడు కాల్పులు జరపడంతో కాసేపు కలకలం రేగింది. దయాకర్ ఖమ్మం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడని తెలిసింది. అయితే ఇంత జరిగినా పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకోవడం గానీ, అతడిని అదుపులోకి తీసుకోవడం గానీ జరగలేదు. -
ప్రభుత్వ ఆధ్వర్యంలో నేడు సంక్రాంతి సంబరాలు
– ఉదయం 9 నుంచి 12 వరకు గ్రామ, మండల స్థాయిలో –జిల్లా స్థాయిలో మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 వరకు వేడుకలు – వ్యాఖ్యాతలుగా సీనీ ఆర్టిస్ట్, మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి, కళాకారిణి చిత్రలేఖలు –మహిళలకు ముగ్గులు, వంటల పోటీలు కర్నూలు(అగ్రికల్చర్): ప్రభుత్వం తరఫున సంక్రాంతి సంబరాలను గురువారం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. ఇందు కోసం రూ. కోటి మంజూరయ్యాయి. గ్రామ పంచాయతీ, మండల స్థాయిలో 12న ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, జిల్లా స్థాయిలో మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. జిల్లా స్థాయిలో వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అధికారులకు వివిధ బాధ్యతలు అప్పగించారు.కర్నూలు ఎగ్జిబిషన్ గ్రౌండులో మహిళలకు ముగ్గుల పోటీలు, దామోదరం సంజీవయ్య ఉన్నత పాఠశాలలో రాయలసీమ రుచులపై వంటల పోటీలు నిర్వహిస్తారు. సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని కర్నూలులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు జిల్లా సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే జానపద నృత్యాలు, మ్యూజిక్, మ్యాజిక్ షోలు, పోక్ డ్యాన్స్‌లు వంటి పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా ప్రముఖ సీనీ ఆర్టిస్ట్, మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి, కాళాకారిణి చిత్రలేఖలు వ్యవహరిస్తారు. వ్యవసాయ అనుబంధరంగాల్లో రాణించిన రైతులు, అధికారులను, కవులు, కళాకారులను ప్రశంసాపత్రాలతో సత్కరించనున్నారు. జన్మభూమి కార్యక్రమంలో బాగా పనిచేసిన వారినిసైతం సత్కరించనున్నట్లుగా అధికార వర్గాలు తెలిపాయి. ప్రశంసా పత్రాలకు అర్హులయిన వారిని జెడ్పీ సీఇఓ ఆధ్వర్యంలోని కమిటీ ఎంపిక చేస్తుంది. సంక్రాంతి సంబరాల సందర్భంగా కలెక్టరేట్ నుంచి కొండారెడ్డిబురుజు వరకు 3కే రన్ నిర్వహించనున్నారు. ముగ్గులు, వంటల పోటీలు తదితద వాటిల్లో విజేతలయిన వారికి బహుమతులు అందచేస్తారు. కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ఎంపీ, ఎమ్మెల్యే, ఎంఎల్సీలు తదితరులు పాల్గొననున్నారు. -
అంకురార్పణ
మల్లన్న సనిధిలో మకరసంక్రమణ మహోత్సవాలు · శాస్త్రోక్తంగా ఉత్సవపూజలకు అంకురార్పణ · సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ · నేటి నుంచి వాహనసేవలు శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో మకరసంక్రమణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. బుధవారం శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల ఆలయ ప్రాంగణం రుద్ర యాగశాలలో పంచాహ్నికదీక్షతో ఆరంభమైన ఈ ఉత్సవాల్లో దేవస్థానం ఈఓ నారాయణ భరత్‌గుప్త, అర్చకులు, వేదపండితులు యాగశాల ప్రవేశం చేసి గణపతిపూజ, కంకణ«పూజలు నిర్వహించారు. యాగశాలలో లోక కల్యాణం కోసం జరిగిన ఈ విశేషపూజల సందర్భంగా చండీశ్వరుడికి కంకణధారణ చేశారు. ఉత్సవాలో్ల పాల్గొనే వేదపండితులు, అర్చకులు భజంత్రీలకు, సంబంధిత ఆలయసిబ్బందికి దీక్షావస్త్రాలను ఈఓ అందజేశారు. ఆ తరువాత వాస్తుపూజ, వాస్తుహోమం, మండపారాధన, పంచావరణార్చన, కలశస్థాపన నిర్వహించి అనుష్ఠానములు చేశారు. రాత్రి 8 గంటల నుంచి భేరిపూజ, భేరితాడన తో సకల దేవతాహ్వానా పూర్వక ధ్వజారోహణ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజ పటావిష్కరణ ః మకర సంక్రమణ మహోత్సవాలో్ల భాగంగా బుధవారం రాత్రి 8.15గంటలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజపటావిష్కరణ చేశారు. దీనికి ముందుగా ఉత్సవ నిర్వాహకుడైన చండీశ్వరుడిని పల్లకీలో ఊరేగిస్తూ ఆలయ ప్రదక్షిణ చేసి ధ్వజస్తంభం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ వేదమంత్రోచ్ఛారణలతో భేరి, సన్నాయిలకు వేదపండితులు, అర్చకులు పూజలు చేశారు. ధ్వజారోహణలో సంక్రాంతి బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఆధ్వర్యం వహించాల్సిందిగా బ్రహ్మదేవుడిని ఆహ్వానించారు. పార్వతీమల్లికార్జునస్వామివార్ల కల్యాణంలో కన్యాదానం చేసేందుకు శ్రీ మహావిష్ణువును ఉత్సవాలకు రావాల్సిందిగా వేదమంత్రోచ్చారణలతో ఆహ్వానం పలికారు. పంచాహ్నికదీక్షతో వారం రోజులపాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో ఏఈఓ కృష్ణారెడ్డి, పర్యవేక్షకులు శ్రీహరి, దేవస్థానం వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. -
కప్పట్రాళ్లలో సంక్రాంతి సంబరాలు
– ఎద్దులబండిపై ఎస్పీ దంపతుల ఊరేగింపు దేవనకొండ(ఆలూరు): కప్పట్రాళ్ల గ్రామంలో బుధవారం కోరమాండల్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సంబరాలకు జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ, ఆకె పార్వతి దంపతులు హాజరయ్యారు. వీరికి గ్రామస్తులు, మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ముందుగా ఎద్దులబండిపై ఎస్పీ దంపతులను ఊరేగిస్తూ వారిపై పూల వర్షం కురిపించారు. ఎద్దులబండి ముందు బైకు ర్యాలీని నిర్వహించారు. అనంతరం రూ.25 లక్షలతో కమ్యూనిటీ హల్ భవన ఏర్పాటుకు ఎంపీపీ రామచంద్రనాయుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొజ్జమ్మతో కలిసి ఎస్పీ దంపతులు భూమిపూజ చేశారు. కోలాట బృందంతో కోలాటలు ఆడి ఎస్పీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి కుటుంబం సంక్రాంతి సంబరాల్లో పాల్గొని సంతోషంగా గడపాలన్నారు. గ్రామంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు తాను కృషి చేస్తున్నట్లు చెప్పారు. గ్రామస్తులు.. ఎస్పీ దంపతులకు నూతన వస్త్రాలను సమర్పించారు. గ్రామ ప్రజలతో కలిసి ఎస్పీ దంపతులు చెన్నకేశవస్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. అంతకముందు ముగ్గుల పోటీలు, టెన్నికాయిట్ తదితర పోటీలను నిర్వహించారు. ఎస్పీ సతీమణి ఆకె పార్వతి.. మ్యాజికల్చైర్స్ ఆటను ఆడారు. ఆటల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. సంబరాల్లో కోరమాండల్ ఇంటర్నేషనల్ సీనియర్ మేనేజర్ చక్రవర్తి, దేవియాడ్స్ విజయ్‌భాస్కర్, ఏపీజీబీ రీజినల్ మేనేజర్ ప్రసాద్, యూపీఎల్ కంపెనీ అధినేత మోహన్, రీజినల్ మేనేజర్ గోవర్ధన్ రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, సీఐలు విక్రమ్‌సింహ, రిటైర్డ్ హెచ్ఎం రామరాజు, కోడుమూరు ఏవో అక్బర్‌బాషా, దేవనకొండ ఎస్ఐ గంగయ్యయాదవ్, పంచాయతీరాజ్ ఏఈ మహబూబ్‌బాషా, పీఆర్ ఈఈ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
రైళ్లు ఫుల్!
సంక్రాంత్రి ఎఫెక్ట్ – జనవరి 20వరకు బోగీలన్నీ కిటకిట – ప్రత్యేక రైళ్లు నిల్ – బస్ చార్జీల పెరుగుదలతో రైలుబండిని ఆశ్రయిస్తున్న జనం కర్నూలు(రాజ్‌విహార్): సంక్రాంతి పండగ నేపథ్యంలో ముందస్తుగానే ప్రయాణానికి రిజర్వేషన్ చేయించుకోవడంతో రైళ్లలో చోటు దొరకడం లేదు. ప్రస్తుతం నడుస్తున్న వాటిలో బెర్తులన్నీ నిండిపోయాయి. టికెట్ల కోసం క్యూలో నిలిచిన ప్రయాణికులకు వెయిటింగ్ లిస్టు, నో రూమ్ సమాచారం దర్శనమిస్తోంది. జనవరి 20వ తేదీ వరకు ఇదే పరిస్థితి ఉండనుంది. దక్షిణ మధ్య రైల్వే అధికారులు సంకాంత్రి రద్దీని దృష్టిలో పెట్టుకుని పత్యేక రైళ్లను నడపకపోవడంతో పండుగ సంబరాలు అయినవారితో జరుపుకునే భాగ్యానికి నోచుకోలేకపోతున్నారు. సంపన్నులు సొంత కార్లు, వాహనాలు, లేకుంటే ట్యాక్సీలు అద్దెకు తీసుకుని వెళ్తారు. అదే పేద, సామన్య ప్రజలకు అంత స్థోమత లేదు. దీంతో కొందరు ప్రయాణానికి వెనకడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బస్సు చార్జీలు పెరగడంతోనే.. సమీప పట్టణాలకు వెళ్లే ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉన్నా కుటుంబ సభ్యులతో దూర ప్రాంతాలకు వెళ్లే వారికి ప్రయాణం ఓ పరీక్షగా మారింది. దసరా తరువాత పెరిగిన బస్సు చార్జీలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో రైలు చార్జీ తక్కువగా ఉన్న కారణంగా సామాన్యులు వాటిని ఆశ్రయిస్తున్నారు. సాధారణంగా హైదరాబాదుకు బస్సు చార్జీలతో పోల్చితే ఎక్స్‌ప్రెస్ రైలులో 50శాతం చార్జీలోపే వెళ్లి రావచ్చు. ఇక ప్యాసింజరు రైలులో అతితక్కువగా రూ.40కే హైదరాబాదుకు చేరవచ్చు. నిల్చునేందుకు జాగా కరువే! రద్దీ సమయాల్లో ప్రయాణికుల అవసరాలు గుర్తించి ప్రత్యేక రైళ్లు నడపడంలో ఆశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తిరిగే రైళ్లలో కనీసం నిలబడేందుకు కూడా చోటు ఉండదని టీసీలే పేర్కొంటున్నారు. కర్నూలు మీదుగా హైదరాబాద్ వైపు ముఖ్యంగా యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు ఎక్స్‌ప్రెస్, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అర్ధరాత్రి తరువాత బయలుదేరుతాయి. గుంటూరు, కర్నూలు సిటీ, గుంతకల్లు ప్యాసింజర్ రైళ్లు పగలు నడుస్తున్నాయి. కొంగు ఎక్స్‌ప్రెస్, వైనగంగ ఎక్స్‌ప్రెస్, గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్, ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్, ఓఖా ఎక్స్‌ప్రెస్, జైపూర్ ఎక్స్‌ప్రెస్, అమరావతి ఎక్స్‌ప్రెస్ తదిరత రైళ్లు వారంలో ఒకటి రెండు సార్లు మాత్రమే నడుస్తున్నాయి. కర్నూలు నుంచే బయలుదేరే హంద్రీ ఎక్స్‌ప్రెస్ (ఇంటర్ సిటీ) ఉదయం 05–30కి, తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 3గంటలకు బయలుదేరి వెళ్తాయి. హైదరాబాదు నుంచి కర్నూలు మీదుగా డోన్, తిరుపతి, చెన్నై, బెంగళూరు వెళ్లే రైళ్లు గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్, మైసూర్ ఎక్స్‌ప్రెస్, వైనగంగ ఎక్స్‌ప్రెస్, రామేశ్వరం, ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్, కొంగు ఎక్స్‌ప్రెస్ వారంలో ఒకటి రెండు సార్లు, చెన్నై ఎగ్మోర్, తిరుపతి ఎక్స్‌ప్రెస్, యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు ఎక్స్‌ప్రెస్, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైళ్లు రోజువారీగా నడుస్తున్నాయి. గుంటూరు, గుంతకల్లు, కర్నూలు ప్యాసింజరు రైళ్లు సాధారణంగా తిరుగుతున్నాయి. దూర ప్రాంతాలకు నడుస్తున్న రైళ్లలో నెల క్రితమే బెర్తులన్నీ రిజర్వేషన్ల ద్వారా పూర్తయ్యాయని అధికారులు పేర్కొంటున్నారు. బెర్తుల కోసం రిజర్వేషన్ చేయించుకునే ప్రయాణికులకు వందల్లో వెయిటింగ్ లిస్టు దర్శనమిస్తోంది. సాధారణ కంపార్ట్మెట్ల బోగీలు (జనరల్) కేవలం రెండు మూడు మాత్రమే పెడుతుండడంతో వీటిలో కూర్చునే సీటు సంగతి ఎలా ఉన్నా కనీసం నిల్చునేందుకు కూడా జాగా ఉండదని టీసీలు అంటున్నారు. రద్దీ సమయాల్లో ప్రయాణికుల అవసరాలు గుర్తించి ప్రత్యేక రైళ్లు నడపని రైల్వే అధికారులపై జనం మండిపడుతున్నారు. -
తగ్గుతున్న చలా’మనీ’
క్రిస్మస్, సంక్రాంతి సందర్భంగా జాగ్రత్త పడుతున్న ప్రజలు తీసుకున్న నగదును దాచుకుంటున్న వైనం వ్యాపారాలు ప్రారంభం అవుతాయని ఎదురుచూస్తున్న వ్యాపారులు జంగారెడ్డిగూడెం: రోజు రోజుకీ మార్కెట్లో నగదు చలామణి తగ్గిపోతోంది. ఎవరికి వారు బ్యాంకుల ద్వారా, ఏటీఎంల ద్వారా తీసుకున్న నగదును భద్రపరుచుకోవడంతో మార్కెట్లో నగదు చలామణి తగ్గిపోయి, వ్యాపార వాణిజ్య రంగాలు, చిరువ్యాపారులు, చేతివృత్తిదారులు పనులు వ్యాపారాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం ముందు ముందు ప్రధాన పండుగలు ఉండటమే కారణంగా పలువురు పేర్కొంటున్నారు. నవంబర్ 9 నుంచి రూ. 1000, రూ. 500 నోట్లు రద్దు చేయడంతో ఆ నాటి నుంచి నేటి వరకు అన్ని వర్గాల ప్రజలు నగదు కష్టాలు ఎదుర్కొంటున్నారు. బ్యాంకుల్లో నగదు లేకపోవడం, అసలు నగదు ఉంటుందో, లేదో తెలియకపోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. డిసెంబర్ నెలలో క్రిస్మస్, జనవరిలో సంక్రాంతి వంటి ప్రధాన పండుగలు ఉండటంతో ముందు ముందు పండుగలకు నగదు కొరత ఏర్పడుతుందని భావించిన ప్రజలు ప్రస్తుతం తీసుకుంటున్న నగదును ఇళ్లల్లోనే భద్రపరుచుకోవడంతో మార్కెట్లో చలామణి తగ్గిపోతోంది. ముందు జాగ్రత్త చర్యగా పిల్లలకు దుస్తులు, పిండి వంటలకు, కొత్త అళ్లుళ్లకు దుస్తులు, చీరె, సారె పెట్టుబడులు ఉండటంతో ఆ సమయంలో నగదు లేకపోతే తమ పరిస్థితి ఏమిటనేది ముందుగానే ఆలోచించి ఇళ్లల్లోనే నగదును దాచేస్తున్నారు. ఇంటిల్లపాది దుస్తులు కొనుగోలు చేసుకుని పండుగ చేసుకోవాలంటే పెద్దమొత్తంలోనే నగదు అవసరం అవుతుంది. అంతేగాక క్రిస్మస్, సంక్రాంతి పండుగలు ప్రధాన పండుగలు. వీటికి మధ్యలో నూతన సంవత్సర వేడుకలు రావడంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్రిస్మస్ , సంక్రాంతి పండుగలకు పొరుగూళ్లల్లో ఉన్న కుటుంబసభ్యులు, బంధువులే కాకుండా విదేశాల్లో ఉన్న వారు కూడా స్వదేశాల్లో ఉన్న తమ కుటుంబసభ్యులు, బంధువులు ఇంటికి రావడంతో ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాగే సంక్రాంతికి కోడిపందాలు, జూదాలు కూడా పెద్దమొత్తంలో నగదు అవసరం అవుతోంది. దీంతో ఎవరికి వారే జాగ్రత్త పడుతున్నారు. ఇక పేద తరగతి ప్రజలు కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ తమ పిల్లలకు కనీసం దుస్తులు అన్నా కొనాలనే తపనతో ఉన్నారు. ప్రస్తుతం తమ నోరు కట్టుకుని పండుగ జరుపుకోవాలని భావిస్తున్నారు. ఇప్పుడే నగదు కొరత ఇంత ఉంటే పండుగల సమయానికి నగదు లేకపోతే ఇబ్బందులు తప్పవని ప్రతీ ఒక్కరు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే వ్యాపారులు తమ వ్యాపారాలు ఎప్పుడు ప్రారంభం అవుతాయా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పెద్దమొత్తాల్లో పెట్టుబడులు పెట్టి దుస్తుల వ్యాపారులు నిల్వ ఉంచారు. క్రిస్మస్ దగ్గర పడుతున్నా పూర్తిస్థాయి వ్యాపారాలు ఇంకా అందుకోలేదు. రేపో మాపో వ్యాపారాలు ప్రారంభం అవుతాయని ఎదురుచూస్తున్నారు. క్రిస్మస్ అయిన వెంటనే నూతన సంవత్సరం, సంక్రాంతి వస్తుందని ఎంతోకొంత వ్యాపారం జరుగుతుందనే ఆశతో ఉన్నారు. అంతేగాక భారీగా డిస్కౌంట్లు, పలు ఆఫర్లు కూడా ఇస్తున్నారు. దాని వల్లైన తమ వ్యాపారాలు కొంత మేర సాగుతాయని చూస్తున్నారు. -
పండగ రోజుల్లో కుటుంబానికి దూరంగా..!
-
విజయనగరంలో రంగోలీ, పతంగుల పోటీలు
-
సంక్రాంతి రోజున వైభవంగా ప్రభల తీర్థం
-
పల్లేకు తరలివచ్చిన పట్నం
-
విశాఖ జిల్లాలో సంక్రాంతి సంబరాలు
-
పట్నంలో పండగ సందడి..
-
పెద్దాపురంలో జోరుగా కోడిపందేలు
-
తెలుగు రాష్ట్రాలో సంక్రాంతి సంబరాలు
-
'సీఎం' సోంతుర్లో సంక్రాంతి శోభ
-
సై.. సై.. బసవన్నా!
-
గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు
-
ప్రకాశం జిల్లాలో భోగి సంబరాలు
-
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు
హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ భోగి పండుగ అందరికీ భోగభాగ్యాలను ప్రసాదించాలని, సంక్రాంతి పండుగ తెలుగు రాష్ట్రాలలోను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరి ముంగిళ్ళలో వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్లతో, రకరకాల వేడుకలతో కూడిన సంక్రాంతి అంటేనే రైతులు, పల్లెల పండుగ అని వైఎస్ జగన్ అన్నారు. పాడి పంటలతో, పైరు పచ్చలతో ప్రతి పల్లె కళకళలాడినప్పుడే ప్రజలు ఆనందరంగా ఉంటారని, అన్నపూర్ణగా పేరుగాంచిన తెలుగు నేలలో రైతన్నలు, గ్రామీణ వృత్తుల వారంతా భోగభాగ్యాలతో, సుఖసంతోషాలతో తులతూగాలని కోరుకుంటున్నట్లు ఆయన మకర సంక్రాంతి శుభాకాంక్షల సందేశంలో పేర్కొన్నారు. -
పండగ సీజన్లో రెచ్చిపోనున్న దొంగలు
-
విమానాల్లో చార్జీల మోత!!
-
అధిక ధరలు వసూలు చేస్తే కఠిన చర్యలు: శిద్ధా
హైదరాబాద్: సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ మంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు. హైదరాబాద్ లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సంక్రాంతి పండగకు రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు 2,600 ప్రత్యేక బస్సు సర్వీసులు కల్పించనున్నట్లు చెప్పారు. ఎవరైనా రవాణా కోసం ప్రయాణికుల నుంచి టిక్కెట్లపై అధిక ధరలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. -
ఏపీలో సంక్రాంతి సెలవులు యథాతథం
-
పొంగల్‌కు ప్రత్యేక బస్సులు
సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపనున్నట్లు ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు. ఈనెల 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మొత్తం 12,624 బస్సులను ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసినట్లు గురువారం ఆమె తెలిపారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: చెన్నై సచివాలయంలో ప్రజలకు పొంగల్ పండుగ సందర్భంగా ఉచిత కానుకలను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం ఒక ప్రకటన విడుదల చేశారు. పొంగల్ పండుగను తమ స్వస్థలంలో బంధుమిత్రుల మధ్య జరుపుకోవాలని ఆశిస్తారని, ఎంతో వ్యయప్రయాసలకోర్చి దూరప్రాంతాలకు ప్రయాణిస్తారని తెలిపారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో ప్రయాణికులు బయలుదేరడం వల్ల రోజూవారీగా అందుబాటులో ఉండే బస్సులు చాలవని అన్నారు. అందుకే గత నాలుగేళ్లుగా పొంగల్ పండుగకు ప్రత్యేక బస్సులను నడపడం ఆనవాయితీగా పెట్టుకున్నామని చెప్పారు. ఈ ప్రత్యేక బస్సులకు ప్రజల నుంచి ఏటా గొప్ప స్పందన వస్తోందని తెలిపారు. ఈ ఉత్సాహంతో కోయంబేడు బస్‌స్టేషన్ నుంచి రాష్ట్రం నలుమూలలకు 12,624 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని చెప్పారు. ఈనెల 9వ తేదీ నుంచి14వ తేదీ వరకు వెళ్లేందుకు, 15 వ తేదీ నుంచి 19వ తేదీ వరకు తిరుగు ప్రయాణం కోసం ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని తెలిపారు. అలాగే చెన్నై పరిసర ప్రాంతాలు, మహాబలిపురం వంటి పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు మరో 200 సిటీ బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు. ప్రయివేటు బస్సు యాజమాన్యాలు రద్దీని అడ్డుపెట్టుకుని హెచ్చు చార్జీలు వసూలు చేయకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అధిక చార్జీలు వసూలు చేస్తే 044-24794709కు ఫిర్యాదు చేయవచ్చని ఆమె చెప్పారు. పొంగల్ కానుకల పంపిణీ: పొంగల్ పండుగ సందర్భంగా ప్రభుత్వం ద్వారా కానుకలు పంచే కార్యక్రమాన్ని సీఎం జయలలిత సచివాలయంలో ప్రారంభించారు. కొన్ని కుటుంబాలను తన చాంబర్‌కు పిలిపించుకుని పొంగల్ కానుకల బ్యాగును అందజేశారు. అలాగే రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాల్లో పంపిణీ ప్రారంభించారు. 1.91 కోట్ల మందికి లబ్ధి చేకూర్చే పొంగల్ కానుకల వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.318 కోట్లు అదనపు భారం పడుతోందని సీఎం తెలిపారు. -
సంక్రాంతికి రద్దీ దృష్ట్యా 12 డబుల్ డెక్కర్ రైళ్లు
-
జల్లికట్టుపై రాజకీయాలు
-
డిక్టేటర్‌కు సవాల్ విసురుతున్న సోగ్గాడు ?
-
పోటీ నుంచి తప్పుకున్న నితిన్
హీరోగానే కాక నిర్మాతగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న నితిన్, త్వరలో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో సినిమాకు రెడీ అవుతున్నాడు. 'అ ఆ' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాతో హీరోగా స్టార్ ఇమేజ్ అందుకోవాలని భావిస్తున్నాడు ఈ యంగ్ హీరో. అదే సమయంలో అఖిల్ హీరోగా తను నిర్మిస్తున్న 'అఖిల్' సినిమాతో మంచి సక్సెస్ కొట్టాలని ట్రై చేస్తున్నాడు. త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసి స్టార్ హీరోగా తన లైన్ క్లియర్ చేసుకోవాలనుకున్నాడు. అయితే ప్రస్తుతానికి ఈ యంగ్ హీరో ఆ ఆలోచన విరమించుకున్నాడట. ఇప్పటికే పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, బాలయ్య లాంటి టాప్స్టార్లు సంక్రాంతి బరిలో దిగడానికి సిద్ధం అవుతుండటంతో, ఆ సమయంలో తాను పోటీకి దిగటం కరెక్ట్ కాదని భావిస్తున్నాడట. అందుకే కాస్త ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇంకా షూటింగ్ కూడా మొదలు కానీ 'అ ఆ' సినిమాను హడావిడిగా పూర్తి చేసి రిలీజ్ చేసే కన్నా, కాస్త గ్యాప్ తీసుకొని ఫిబ్రవరిలో రిలీజ్ చేయడం కరెక్ట్ అని నిర్ణయించుకున్నాడు. అందుకే ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న త్రివిక్రమ్ కాంబినేషన్లో నటిస్తున్న 'అ ఆ' సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. మరి నితిన్ కొత్త ప్లాన్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. -
ఆటోజానీకి సవాల్ విసురుతున్న డిక్టేటర్..?
-
కనుమ సందడి
తమిళనాట శుక్రవారం కనుమ పండుగ సందడి నెలకొంది. గ్రామగ్రామాన మూగజీవాలను పూజించారు. శనివారం కానం పొంగల్ సందర్భంగా జన సందోహం పర్యాటక, వినోద కేంద్రాలకు తరలి రానుంది. దీంతో చెన్నైని నీఘా నీడలోకి తెచ్చారు. మెరీనా, బీసెంట్ నగర్ బీచ్‌లలో పర్యాటకులపై ఆంక్షలు విధించారు. సాక్షి, చెన్నై: సంక్రాంతి సంబరాల్లో భాగంగా రాష్ట్ర ప్రజలు శుక్రవారం కనుమ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. తమకు జీవనాధారంగా ఉన్న పశువులను రైతులు భక్తిశ్రద్ధలతో పూజించారు. ఆశ్రమాల్లో, గో మందిరాల్లో ఉదయాన్నే గోమాతలకు స్నానాలు చేయిం చారు. కొమ్ములకు కొత్త రంగులు వేశారు. వివిధ రంగులు, బెలూన్లు, గజ్జెలతో అలంకరించారు. పండ్లు నైవేద్యంగా సమర్పించారు. చెన్నై మెరీనా తీరంలోకి తమ పశువుల్ని పెంపకదారులు తోలుకు వచ్చారు. వాటికి సముద్ర స్నానం చేయించిన అనంతరం పూజలు నిర్వహించారు. ఎడ్ల బండ్లతో పురవీధుల్లో చక్కర్లు కొట్టారు. జనానికి వినోదాన్ని పంచి పెట్టారు. పెద్ద పండుగలో మూడు ముఖ్య ఘట్టాలు ముగిశా యి. ఇక చివరగా కానం పొంగళ్ శనివారం ఘనంగా జరగనుంది. నేడు కానం పొంగల్ కానం పొంగల్ అంటే అందరికీ మహదానందం. ఇంటిల్లిపాదీ పర్యాటక ప్రాంతాలకు తరలి వెళ్లి ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. వీరి కోసం పర్యాటక ప్రాంతాలు, వినోద కేంద్రాలు ముస్తాబ య్యాయి. ఒక్క చెన్నై నగరంలో రెండు వందల ప్రత్యేక బస్సుల్ని నడిపేందుకు నగర రవాణా సంస్థ నిర్ణయించింది. ఆయా మార్గాల్లో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ప్రత్యేక బస్సులు తిరగనున్నాయి. జనం అత్యధికంగా తరలివచ్చే మెరీనా, బీసెంట్ నగర్ బీచ్‌ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సముద్రంలోకి ఎవరినీ వెళ్లనీయకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. సముద్ర స్నానాన్ని నిషేధించారు. సందర్శకుల భద్రత నిమిత్తం పోలీసులు యంత్రాంగం గట్టి భద్రతా చర్యలు తీసుకుంది. ప్రత్యేక హెల్ప్ లైన్లను ఏర్పాటు చేశారు. తప్పిపోయిన వారిని రక్షించేందుకు, జేబు దొంగల భరతం పట్టేం దుకు ప్రత్యేకంగా మఫ్టీలో సిబ్బందిని రంగంలోకి దించనున్నారు. అదే విధంగా చెన్నై నగరంలోని గిండి చిల్డ్రన్స్ పార్కు, వండలూరు జూ తదితర ప్రాంతాలు పర్యాటకుల కోసం ముస్తాబయ్యాయి. జనం నగరంలోని పర్యాటక, వినోద కేంద్రాలకు తరలి రానుండడంతో భద్రత నిమిత్తం 18 వేల మందిని రంగంలోకి దించారు. అలాగే ప్రత్యేక మొబైల్ టీమ్‌లను సైతం ఏర్పాటు చేశారు. -
కత్తి లేకుండానే.. కాయ్ రాజా కాయ్
సంక్రాంతి సందర్భంగా పందెంరాయుళ్లు పండగ చేసుకుంటున్నారు. కోడిపందేల రూపంలో లక్షల్లో డబ్బు చేతులు మారుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలు, హైకోర్టు ఉత్తర్వులు, పోలీసుల ఆంక్షలు ఎలా ఉన్నా కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. అయితే కత్తి కట్టకుండానే పందేలు నిర్వహించడం ఈసారి స్పెషాలిటీ. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, దేవరపల్లి, చాగల్లు మండలాల్లో కోడిపందేలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. భీమవరంలో కోడిపందేల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వీటిని చూడటానికి వచ్చిన ప్రేక్షకులు కత్తి కట్టకుండానే జరుపుతున్న కోడిపందేలను తిలకిస్తున్నారు. కత్తి కడితే జంతుహింస కిందకు వస్తుందన్న అనుమానంతోనే ఈసారి కత్తులు లేకుండా పందేలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. కత్తి కడితే నిమిషాల్లోనే పందెం అయిపోతుందని, లేకపోతేనే ఎక్కువ సేపు సాగి అందరికీ ఆసక్తికరంగా ఉంటుందని కూడా అంటున్నారు. కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలులో, తూర్పుగోదావరి జిల్లా మల్కిపురంలోనూ కోడిపందేల, గుండాటలు జోరుగా సాగుతున్నాయి. పోలీసులు రాకపోవడంతో కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగుళ్లో మునిగి తేలుతున్నరు. కాకినాడ రూరల్‌లో కోడిపందేలపై పోలీసులు దాడులు జరిపారు. కొవ్వాడలో పెద్ద ఎత్తున జరుగుతున్న కోడిపందేలపై ఇంద్రపాలెం పోలీసులు దాడి చేసి పందెం రాయుళ్లు, కోళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా కోడిపందేల అనుమతుల విషయమై హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లిన బీజేపీ నేత కనుమూరి రామకృష్ణంరాజు భీమవరంలో లాంఛనంగా కోడిపందేలను ప్రారంభించారు. ఏలూరు ఎంపీ మాగంటి బాబు కూడా కోళ్లను చేతబట్టుకొని పందేలకు సై అనిపించారు. -
పండుగ పూటా పస్తులే..!
* ఇంతవరకూ అందని చక్కెర * బియ్యం.. పప్పు.. ఉప్పూ కరువే * ఐదు నెలలుగా పామాయిల్ సరఫరా బంద్ * సర్కార్ తీరుపై పేదల ఆక్రోశం సంగారెడ్డి: తెలంగాణలో పండుగరోజు పప్పన్నం తినటం కాదు, పాయసం తాగుదాం...పండుగకు వారం రోజుల ముందే పేదలకు అవసరమైన పండుగ సామాను అందజేస్తాం. - సీఎం కేసీఆర్ చెప్పిన మాటలివి. కానీ సీఎం మాటలకు చేతలకు ఏ మాత్రం పొంతన కుదరడం లేదు. తెలుగువారు చేసుకునే పండుగల్లో సంక్రాంతి పెద్ద పండుగ. పల్లెల్లోనే కాదు పట్టణాల్లోని ప్రజలు సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. పెద్దోళ్లు..పేదోళ్లు అన్న తేడా లేకుండా పండుగపూట పిండి వంటలు చేసుకుని కుటుంబసభ్యులంతా సంతోషంగా తింటారు. అయితే ఈ సంక్రాంతికి పేదలు పిండివంటలు కాదుకదా, కనీసం పప్పు బువ్వ కూడా తినలేని పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పంపిణీ చేసి బియ్యం, పప్పు, ఉప్పు, చక్కెర, పామాయిల్ ఇలా వంట సరుకులేవీ ఈ నెల అందలేదు. దీంతో సకినాలు సుట్టుకుందామంటే బియ్యం లేవు..తీపి గారెలు చేద్దామంటే చక్కెర ఇవ్వలేదు...పిండివంటలు చేద్దామంటే పామాయిల్ లేదు.. ఇంగ పండుగ ఏం జేస్తం అంటూ తెల్లరేషన్ కార్డులున్న పేదలు ఆవేదన చెందుతున్నారు. కోటా పెరగక పోగా..అసలుకే ఎసరు సర్కార్ పౌరసరఫరాల శాఖ ద్వారా పేదలకు బియ్యం, పప్పు, నూనె, చెక్కెరతో పాటు ఇతర నిత్యావసరాలు పంపిణీ చేస్తుంది. అయితే ప్రతి పండుగకూ ముందుగానే కోటా పెంచి మరీ నిత్యావసరాలు పంపిణీ చేస్తుంది. అయితే ఈ సంక్రాంతికి మాత్రం పేదలకు చౌకధరల దుకాణాల ద్వారా ఎలాంటి సరుకులు అందలేదు. ఇదేమిటని అడిగితే ఆహారభద్రతా కార్డులు తయారు కాలేదనీ, దీంతో సరుకుల పంపిణీ కాలేదని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఆరు లక్షలపైచిలుకు రేషన్‌కార్డులుండగా, జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,843 చౌకధరల దుకాణాల ద్వారా రేషన్‌కార్డు లబ్ధిదారులకు బియ్యం, పప్పు, ఉప్పు లాంటి సరుకులు సరఫరా చేస్తున్నారు. అయితే ఈనెల రేషన్‌కార్డు లబ్ధిదారులకు ఎక్కడా సరుకుల పంపిణీ జరగలేదు. ఆరు లక్షల పైచిలుకు రేషన్‌కార్డు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయాలంటే 20.647 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం అవుతాయి. అయితే ఈనెల కేవలం ఆహారభద్రతాకార్డుల పూర్తయిన చోట్ల కేవలం 5 వేల క్వింటాళ్ల బియ్యం మాత్రమే సరఫరా చేశారు. ప్రతి కుటుంబానికి కనీసం కిలో చక్కెర పంపిణీ చేయాలి. అయితే ఇప్పటి వరకు కేవలం అర కేజీ చొప్పున 550 క్వింటాళ్ల చక్కెర మాత్రమే సరఫరా చేశారు. సంక్రాంతి పండుగ పూట అరిశెలు, ఇతర పిండివంటలు చేసుకోవాలనుకునే కుటుంబాలకు అరకిలో చక్కెర ఏమాత్రం సరిపోదు. దీంతో ఎక్కువ రేటు పెట్టి మార్కెట్లో చక్కెర కొనాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక సంక్రాంతి అంటేనే సకినాలు గుర్తుకు వస్తాయి. సకినాలు కాల్చుకోవాలంటే నూనె తప్పనిసరిగా ఉండాలి. అయితే చౌకధరల ద్వారా ఐదు మాసాలుగా పామాయిల్ సరఫరా నిలిచిపోయింది. దీంతో రేషన్‌కార్డు లబ్ధిదారులు కిలో పామాయిల్‌కు రూ.80 పెట్టి మార్కెట్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే చౌకధరల దుకాణం ద్వారా సరఫరా అవుతూ వచ్చిన పప్పు, గోధుమలు, ఉప్పు, చింతపండు లాంటి సరుకులు కూడా ఈ నెల సరఫరా కాలేదు. పండుగ పూట కూడా ప్రభుత్వం సరుకులు సరఫరా చేయకపోవటంపై పేదలు ఉడికిపోతున్నారు. సొంత రాష్ట్రంలో పేదలను అక్కున్న చేర్చుకుంటామని చెబుతున్న ప్రభుత్వం పండుగల రోజులు సైతం సరుకులు సరఫరా చేయకపోవటమేమిటని ఆక్రోశంగా ప్రశ్నిస్తున్నారు. అధికారులు మాత్రం ఆహార భద్రతాకార్డుల తయారీలో సమస్యలు, సరుకుల సరఫరాపై స్పష్టత కొరవడటం కారణంగానే సమస్య తలెత్తినట్లు చెబుతున్నారు. -
కొనసాగుతున్న ఆర్టీఏ తనిఖీలు
హైదరాబాద్: ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ అధికారులు మరోసారి కొరడా ఝళిపించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేట్ బస్సులపై దాడులు నిర్వహించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణ చార్జీలు అధికంగా వసూళ్లు చేయడంతో పాటు రవాణాశాఖ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారని ప్రైవేట్ ట్రావెల్స్‌లపై ఆర్టీఏ అధికారులు మళ్లీ దాడులు ప్రారంభించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగర శివార్లలో ఆర్టీఏ తనిఖీలు కొనసాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 11 బస్సులపై కేసు నమోదు చేయగా, మరో 4 బస్సులను అధికారులు సీజ్ చేశారు. కేశినేని, ఎస్వీఆర్, కావేరి, మేఘన ట్రావెల్స్ బస్సులు సీజ్ చేశారు. -
ప్రజలకు వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు
తెలుగు ప్రజలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో సుఖ సంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలు నింపాలని ఆయన ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని కొనియాడారు. పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలన్నారు. పాడిపంటలతో పల్లెలు కలకల్లాడినప్పుడే ప్రజలు ఆనందంగా ఉంటారన్నారు. ప్రజలు సుఖసంతోషాలు, భోగభాగ్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయాన్ని పండగ చేసేందుకు విధివిధానాలు రూపొందించాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. ఈ సందర్భంగా.. రైతులు సంతోషంగా ఉన్నప్పుడే రాష్ట్రం, దేశం సంతోషంగా ఉంటాయని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. -
గోరంత సాయం.. కొండంత ప్రచారమా!
రైతులు, మహిళల కుటుంబాల్లో చీకట్లు నింపి చంద్రబాబు మాత్రం సంక్రాంత్రి చేసుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఆరోపించారు. వర్షాలు లేక, పంటలు పండక రైతులు కష్టాల్లో ఉంటే ఆయనకు మాత్రం పండుగ వెలుగులు కావాల్సి వచ్చాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పుణ్యమా అని రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. సంక్రాంతి వెలుగులు కేవలం తెలుగు తమ్ముళ్లు, టీడీపీ నేతలకేనని.. ప్రజలు మాత్రం అష్టకష్టాలు పడుతున్నారని ఎస్వీ మోహన్ రెడ్డి మండిపడ్డారు. చంద్రన్న కానుక పేరుతో గోరంత సాయం చేస్తూ కొండంత ప్రచారం చేసుకుంటున్నారన్నారు. బ్రహ్మానందం సినిమాల్లో కామెడీ చేస్తుంటే..చంద్రబాబు ప్రజలను కామెడీ చేస్తున్నారని తెలిపారు. చంద్రన్న కానుక పేరుతో రూ. 60 నుంచి రూ.70 కోట్ల దోపిడీ జరిగిందని ఆరోపించారు. దీనిపై పూర్తి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రజాధనం దుర్వినియోగం చేసే అధికారం టీడీపీ నేతలకు ఎవరిచ్చారన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉంటే ప్రభుత్వం ప్రచారం కోసం కోట్లు ఖర్చు పెడుతోందని మోహన్ రెడ్డి విమర్శించారు. -
సంక్రాంతి వరకూ కొనసాగనున్న చలి తీవ్రత
విశాఖపట్నం: కోస్తాంధ్ర, తెలంగాణలో సంక్రాంతి వరకూ చలి తీవ్రత కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. ఉత్తరాది నుంచి గాలులు వీచడంతో సాధారణం కంటే ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఎలాంటి అలజడి లేకపోవడం కూడా మరో కారణమని పేర్కొంది. ఉత్తర తెలంగాణ, కోస్తా, ఒడిశాలలో 4 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. -
కో’ఢీ’
సంక్రాంతి వస్తోంది.. ఆంధ్రా సరిహద్దులో బిర్రులు సిద్ధమవుతున్నాయి. కొక్కొరొకో అని కోడిపుంజు కత్తులు దూస్తోంది. కుక్కుటశాస్త్రాన్ని కూలంకషంగా చదివి నక్షత్రం, తిథులు, దిక్కుల ఆధారంగా.. సమయానుకూలంగా కోడిపుంజును బరిలోకి దింపేందుకు జూదరులు సిద్ధమయ్యారు. అల్లారుముద్దుగా పెంచుకున్న పందెం పుంజును చంటిపిల్లాడి మాదిరి చంకలో ఎత్తుకొని ఆంధ్రాబాట పట్టారు. భోగి నుంచి మూడురోజులు పందేలు ‘పుంజు’కోనున్నాయి. మెడ తిప్పి, కాలుదువ్వి, రెక్కలు విప్పుకొని కొక్కొరొకో అంటూ ఎగిరెగిరి పొడుచుకొనే పోరాటమే ఇక తరువాయి... మరి సుప్రీం తీర్పు ఎలా ఉంటుందో...! సత్తుపల్లి : సంక్రాంతి పండుగకు నిర్వహించే మూడురోజుల కోడిపందేల కోసం రెండు నెలల ముందు నుంచే జిల్లాలోని ఆంధ్రా సరిహద్దు ప్రాంతాల్లో కసరత్తు జరుగుతోంది. సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల్లోని పందెంరాయుళ్లు కోడిపుంజులను బరిలోకి దింపేందుకు సిద్ధమవుతున్నారు. జంతు హింస పేరుతో కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించినా పందెంరాయుళ్లు మాత్రం తమ పుంజులకు కత్తి కట్టే పనిలో ఉన్నారు. తమ పుంజులను సోమవారం నుంచి బిర్రు(కోడిపందేలు నిర్వహించే ప్రదేశం) లోకి దించేందుకు సిద్ధమయ్యారు. చిన్నపిల్లలను ఎంత అల్లారుముద్దుగా పెంచుకుంటామో అంతకంటే ఎక్కువగా చూసుకునే కోడిపుంజులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఏడాదిన్నర వయస్సు ఉన్న కోడి పుంజును ఎంచుకొని ప్రత్యేకమైన బుట్టలో ఉంచి పండగకు వచ్చే కొత్త పెళ్లికొడుక్కి చేసే మర్యాదులు చేస్తారు. కోడిపెట్టలతో తిరగనీయకుండా బ్రహ్మచర్యం పాటించేలా చేసి శక్తి పుంజుకునేలా నానాతంటాలు పడతారు. కుక్కుట శాస్త్రం ఆధారంగా నక్షత్రం, తిథులు చూసుకొని మరీ పందెం పుంజులను చంకనబెట్టుకొని ఆంధ్రా బాట పట్టారు. అంతా నక్షత్రం ప్రకారమే.. కుక్కుటశాస్త్రం ప్రకారం ఏ సమయంలో ఏ పుంజు వేస్తే గెలుస్తుందో.. లెక్కలు వేసుకొని మరీ పందెం కాస్తారు. చాలా మంది పేరులోని అక్షరాలు, తిథుల ఆధారంగా ఆయా సమయాల్లో పలానా కోళ్లు గెలుస్తాయని చెపుతుంటారు. కోడి పందేలు జరిగే ప్రదేశం.. కోళ్ల యజమానులు ఉండే ప్రదేశం.. పందెం రోజు నక్షత్రం.. శుక్లపక్షంలో నెగ్గె కోళ్లను బట్టి పందేలు వేస్తారంటే ఆశ్చర్యం కలగక మానదు. కోళ్ల పందెం ఏ దిశగా జరుగుతుందో పుంజు యజమాని తన కోడిపుంజును ఆ దిక్కుకు తీసుకెళ్లే విషయంపైనే జయాపజయాలు ఆధారపడి ఉంటాయని పందెం రాయుళ్ల నమ్మకం. పందెం కట్టేవారి పేరులోని మొదటి అక్షరం ఆధారంగా ఫలితం ఉంటుందని కుక్కటశాస్త్రం ప్రకారం అంచనాలు వేసుకుంటారు. పందెం ప్రదేశంలో కుక్కటశాస్త్రం పుస్తకాలు తీసుకొని దిక్కులు, సమయాన్ని ఎంపిక చేసుకునే పనిలో నిమగ్నమౌతారు. అందరి దారి ఆంధ్రావైవే.. సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఆంధ్రాలో కోడిపందేలు నిర్వహించటం ఆనవాయితీ. పండుగ మూడురోజులు పందెం కోళ్లతో సందడి కనిపిస్తుంది. అక్కడక్కడా చిన్నచిన్న పందేలు (కూర పందేలు) స్థానికంగా నిర్వహిస్తూనే ఉన్నారు. పెద్ద పందేలకు పోలీసులు అనుమతించక పోవటంతో పందెంరాయుళ్లంతా ఆంధ్రాకు తరలివెళ్తున్నారు. గతేడాది సత్తుపల్లికి చెందిన కొందరు పశ్చిమగోదావరి జిల్లా పోతునూరులో బిర్రు అనుమతి తీసుకొని నిర్వహించినట్లు తెలిసింది. ఈ ఏడాది శీతానగరంలో వేసేందుకు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. పండుగ మూడురోజులు కోడి పందేలు కాసేందుకు.. చూసేందుకు.. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్‌ల నుంచి పెద్ద ఎత్తున సత్తుపల్లి మీదుగా వెళ్తారు. కోడిపందేలకు పశ్చిమగోదావరి జిల్లాలో శీతానగరం, చింతంపల్లి, పోతునూరు, ధర్మాజిగూడెం, కళ్ల చెరువు, వెంకటాపురం, భీమవరం, పంచాలకుంట, ప్రగడవరం, గోకారం ప్రసిద్ధి. మూడురోజులు బిజీబిజీ భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడురోజులు సత్తుపల్లి పరిసర ప్రాంతంలో కోడిపందేల సందడి నెలకొననుంది. చంకలో కోడిపుంజు పెట్టుకొని వాహనాలపై పందేనికి వెళ్లేవారు వందలసంఖ్యలో కనిపిస్తుంటారు. కోడిపందేలను నిలువరించటం పోలీసులకు పెద్దసవాలుగా మారనుంది. ఈ ఏడాది కోడిపందేలపై పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా బైండోవర్ కేసులు నమోదు చేశారు. అయినా పందెంరాయుళ్లను అడ్డుకోవటం సాధ్యమయ్యేలా కనిపించటం లేదు. 14, 15, 16 కోడి పందేలకు అనుమతి ఇవ్వాలనే డిమాండ్ ఊపందుకుంది. తెలంగాణ డబ్బులు ఆంధ్రాకు వెళ్ళుతున్నాయనేది పందెంరాయుళ్ల వాదన. కోట్ల రూపాయల్లో క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నా పట్టించుకోని అధికార యంత్రాంగం కోడి పందేలపై కన్నెర్ర చేయటం ఎంత వరకు సబబని ప్రశ్నిస్తున్నారు. సంస్కృతి పేరుతో పందేలు నిర్వహించి కోడిపుంజులను హింసిస్తున్నారని జంతు ప్రేమికుల వాదన. కోడిపందేలలో సరదాకుపోయి ఏడాది మొత్తం సంపాదించుకున్న సొమ్ములను పోగొట్టుకుంటున్న అభ్యాగులు ఎందరో ఉన్నారని.. కోడి పందేలు నిర్వహించటానికి వీలు లేదంటూ మానవ హక్కుల సంఘాలూ వాదిస్తున్నాయి. కోడిపందేల నిర్వహణపై సోమవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పందెం పుంజుల పెంపకంలో ప్రత్యేక జాగ్రత్తలు సాధారణ కోళ్ల పెంపకానికి..పందెంకోళ్ల పెంపకానికి చాలా వ్యత్యాసం ఉంది. అసలు ఇవి చూడటానికే ప్రత్యేకంగా కనిపిస్తాయి. మిగిలిన కోళ్లతో వీటిని కలవనీయరు. పందెం కోళ్ల పెంపకం తపస్సులా చేస్తారు. కన్నబిడ్డలకన్నా ప్రేమగా పుంజులను పెంచేవాళ్లూ ఉన్నారు. సాధారణ కోడిపుంజులకన్నా పందెం పుంజులు ఎత్తుగా, దృఢంగా ఉంటాయి. రంగురంగుల ఈకలతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ముక్కు దృఢంగా, పొడవుగా, కాలివేళ్లు నిటారుగా కనిపిస్తాయి. వీటి కూత గంభీరంగా ఉంటుంది. కొన్ని పుంజుల దగ్గరకు వెళ్లడానికి మనుషులు కూడా జంకుతారు. పందెం కోళ్లు సుమారు 50రకాలు ఉన్నాయి. కాకి, నెమలి, డేగ, పచ్చకాకి, పర్ల, సేతువు, పూల, పింగళి, కౌజు, నల్లమచ్చల సేతువు, ఎర్రబోరా, నల్లబోరా, పింగళి, మైల, కొక్కిరాయి, నల్ల సవల ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు ఉన్నాయి. ప్రాంతాలను బట్టి పేర్లు మారుతుంటాయి. వీటిలో కాకి, డేగ, నెమలి పందేలకు పెట్టింది పేరు. వీటి ధరలు రూ.5వేల నుంచి లక్షల రూపాయల వరకు ఉంటాయంటే అతిశయోక్తికాదు. పూర్వ కాలంలో కోడిపందేల కోసం యుద్ధాలు జరిగినట్లు చరిత్ర చెపుతోంది. కోడిపందేల ప్రస్తావన లేకుండా పల్నాటిచరిత్ర, బొబ్బిలియుద్ధాల గురించి ప్రస్తావించలేము. వీటి ఆహారమూ స్పెషలే.. పందెం కోళ్లకు ఇచ్చే ఆహారం కూడా ప్రత్యేకమైనదే. వీటికి సోళ్లు, సజ్జలు, మటన్ కైమా, పచ్చసొన తీసివేసిన కోడిగుడ్లు, రెవిటాల్ టాబ్లేట్లు, 18 రకాల దినుసుల లేహ్యం తినిపిస్తారు. పందెం కోడి ఇవి తిని కొవ్వు పట్టకుండా కట్టేసి ఒకేచోట నిలబెట్టడం వలన కాళ్లల్లో శక్తి దెబ్బతింటుందని నెట్ కట్టి పుంజును అటూ.. ఇటూ తిప్పుతారు. ఒక విధంగా పుంజుకు వాకింగ్ చేయిస్తారు. కొవ్వు పట్టకుండా వేడి నీళ్లపోత (వేడి నీళ్లల్లో వేప, జామ, వెదురు ఆకులు, పసుపులను కలిపి మరగపెట్టి బాలింతకు నీళ్లు పోసినట్లు) తడిసిన గుడ్డ కొడి చుట్టూ తిప్పి గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయిస్తారు. ఇలా రెండు నెలల పాటు కోళ్లను ఒక తపస్సులా పెంచుతారు. పందేనికి వారం రోజుల ముందు తేలికపాటి ఆహారం ఇస్తారు. నానబెట్టిన సోళ్లు, మెరిగలు, తవుడు, వెన్నకలిపిన మేత అందిస్తారు. చలిని తట్టుకునేందుకు బుట్ట చుట్టూ పరదాలుకట్టుతారు. పుంజు కొద్దిగా నీరసించినట్లు కనిపించినా..మెడను కదపలేక మేతను తినలేకపోయినా..తక్షణమే వైద్యం చేయిస్తారు. శుభ్రమైన నీటిని మట్టిపాత్రలోనే అందిస్తారు. -
పండుగ బాదుడు
పండుగ దోపిడీ ప్రారంభమైంది. ప్రత్యేక బస్సుల పేరుతో ఆర్టీసీ బస్సు టికెట్టు 50 శాతం అదనమంటుంటే ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు మాత్రం హద్దే లేకుండా రైట్, రైట్ అంటున్నారు. ఇటీవల రాష్ట్ర రవాణాశాఖా మంత్రి శిద్దా రాఘవరావు మాత్రం ఆర్టీసీలో ప్రత్యేక బస్సుల పేరుతో అదనపు చార్జీలు వసూలు చేసేది లేదని ప్రకటించారు. కానీ వారం రోజుల నుంచి ప్రత్యేక బస్సుల టికెట్లు బుకింగ్ అవుతుండడంతో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మూడు వేల మందికిపైగా ప్రయాణికులపై అదనపు భారం పడింది. వీరివద్ద నుంచి ఆర్టీసీ అదనంగా వసూలు చేసిన మొత్తం రూ.5 లక్షలపైమాటే. రూ.4,95,140 వసూలు చేసినట్లయింది. ఈ నెల 6, 7 తేదీలలో మరింత మంది ప్రయాణికుల నుంచి ఆర్టీసీ 50 శాతం అదనపు మొత్తాన్ని వసూలు చేసింది. ఈ ఏడాది మొత్తం 260 ప్రత్యేక సర్వీసులను నడపాలనుకుంటున్న దృష్ట్యా రూ.20.31 లక్షల భారం ప్రయాణికులు భరించాల్సి వస్తుందన్నమాట. ఈ లెక్క కేవలం ఒంగోలు డిపోకు పరిమితం. మిగిలిన డిపోలు కలుపుకుంటే కోటి రూపాయలు దాటిపోతుంది. సంక్రాంతికి ముందు హైదరాబాదు నుంచి జిల్లాకు ప్రత్యేక బస్సులు నడుస్తాయి. నెల్లూరు జిల్లా నుంచి వచ్చే బస్సులలో కూడా టిక్కెట్లను బుక్ చేసుకుంటుంటారు. ఓ వైపు అదనపు చార్జీలు వసూళ్లు చేసి రిజర్వేషన్ల ప్రాతిపదికన టికెట్లు అమ్మేస్తుంటే అదనపు వసూళ్లు ఉండవంటూ మంత్రి చెబుతున్న సాంత్వన పలుకులు ఏరకంగా ఆచరణకు వచ్చి ప్రయాణికులకు ఊరటనిస్తాయో అర్థం కావడం లేదు. ఇప్పటికే రిజర్వేషన్లు చేసుకున్నవారికి ఎలా డబ్బులు తిరిగి చెల్లిస్తారని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటు దోపిడీ ఇలా... ప్రైవేటు బస్సుల్లో దోపిడీ భయంకరంగా మారింది. దాదాపు సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రైవేటు బస్సుల్లో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 100కుపైగా బస్సులు నిండిపోయాయి. ఒక్కో బస్సులో కనీసంగా 30 సీట్లున్నాయనుకుంటే ప్రయాణికుల సంఖ్య 3 వేలు. ఆర్టీసీ సూపర్ లగ్జరీ రేటు రూ.390లుంటే ప్రైవేటు వ్యాపారులు మాత్రం దాదాపు రూ.700 నుంచి టిక్కెట్లు బుక్ చేస్తున్నారు. అంటే కనీసంగా టిక్కెట్‌కు రూ.300 అదనంగా పిండేస్తున్నారు. ఈ లెక్కన మూడువేల టిక్కెట్లకు అదనంగా వసూలైన మొత్తం రూ.9 లక్షలు. అక్కడితో ఆగకుండా వీరి దందా డిమాండ్‌ను బట్టి రెట్టింపయ్యే అవకాశం ఉంది. బెంగళూరు వైపు వెళ్లే బస్సులకు ఈ నెల 13, 18 తేదీలలో టిక్కెట్ ధర రూ.2 వేల నుంచి రూ. 2,500 వరకు పలుకుతున్నట్లు సమాచారం. ఆర్టీసీ, ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్లిద్దరూ కలిసి సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రయాణికుల మీద వేస్తున్న అదనపు భారం రూ.56.10 లక్షలపైనే ఉండనుంది. గత ఏడాది ప్రైవేటు ఆపరేటర్లపై రవాణాశాఖ అధికారులు ఉక్కుపాదం మోపడంతో ఆర్టీసీ కొంతమేరకు లబ్ధిపొందింది. కానీ ప్రస్తుతం ప్రైవేటు ఆపరేటర్లపట్ల ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహిస్తుండడంతో ఆర్టీసీకి నష్టాలే మిగలనున్నాయి. -
ఇడ్లీ, దోశ, పొంగల్.. జిమ్‌లో ఆరు గంటలు
హాలీవుడ్ కండల వీరుడు ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగర్ దక్షిణాది వంటకాలపై మనసు పారేసుకున్నాడు. ఇడ్లీ, దోశ, పొంగల్ వరుసగా లాగించేసి...వాటిని అరిగించుకోవటానికి సుమారు ఆరుగంటలు జిమ్‌లో కసరత్తు చేశాడు. దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన 'ఐ' సినిమా ఆడియో ఫంక్షన్‌కు చెన్నై వచ్చిన ష్వార్జ్ నెగర్...కాంటినెంటల్ వంటకాల్ని కాదని, అడిగి మరీ ఇడ్లీ, దోశ, పొంగల్‌ను ఇష్టంగా ఆరగించాడు. ఆ తర్వాత చెమటలు కక్కేలా ఆరు గంటలు వర్క్ అవుట్ చేశాడట. అంతేకాకుండా ష్వార్జ్ నెగర్ తమిళ సంప్రదాయ వస్త్రధారణ పంచెకట్టుపై కూడా మనసు పడ్డాడట. ఈవిషయాన్ని 'ఐ' చిత్ర నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ వెల్లడించాడు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కలిసిందుకు ష్వార్జ్ నెగర్ పంచెకట్టులో వెళదామనుకున్నా... సమయం సరిపోనందున 'అమ్మ'ను సూట్‌లోనే కలిసినట్లు రవిచంద్రన్ తెలిపాడు. 'ష్వార్జ్ నెగర్ 3.30కి లాండ్ అయ్యాడు. 5.30కి బ్రేక్ ఫాస్ట్ చేశాడు...ఆ తర్వాత జిమ్‌లో ఆరు గంటలు గడిపాడు' . ఫిట్‌నెస్‌పై ష్వార్జ్ నెగర్కి ఉన్న అంకిత భావం చూసి చిత్ర యూనిట్ స్టన్ అయ్యారట. ఆరు పదులు వయసు దాటినా ష్వార్జ్ నెగర్ ఇప్పటికీ కుర్రాడిలా షూటింగ్లో ఫైట్స్ చేస్తూ కాళ్లు చేతులకు గాయాలు తగలించుకోవటం అలవాటే. -
భోగి వైభవం
చెన్నై, సాక్షి ప్రతినిధి:పొంగల్ పండుగల కళను చూడాలంటే పల్లెదారి పట్టాల్సిందే. పచ్చని తోరణాలు, లోగిళ్లలో గొబ్బెమ్మలు, రంగురంగుల ముగ్గులు, భగవన్నామ స్మరణ చేస్తూ హరిదాసు కీర్తనలు, భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా కొత్త దుస్తులతో తిరగాడే పిల్లలు సం క్రాంతి శోభను రెట్టింపు చేస్తారు. అయితే పల్లెలే కాదు పట్టణాలు, నగరాలు సైతం ఈసారి పండుగ శోభను సంతరించుకున్నాయి. ‘భోగి’తో విమానాల జాప్యం రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం తెల్లవారుజాము 4 గంటలకే ఇంటి ముందు భోగిమంటలు వేశారు. సంప్రదాయం ప్రకారం పాత వస్తువులు అందులో వేసి కొత్తదనానికి స్వాగతం పలికారు. నగరమంతా భారీ సంఖ్యలో భోగిమంటలు వేయడం వల్ల వాటి ధాటికి దట్టమైన పొగ కమ్ముకుంది. దీనికి తోడు మంచు దుప్పటి ఉండనే ఉంది. దీని ప్రభావం వల్ల చెన్నై విమానాశ్రయానికి చేరుకోవాల్సిన మూడు విమానాల్లో జాప్యం ఏర్పడింది. కువైట్, కౌలాలంపూర్, షార్జా విమానాలు మూడుగంటలు ఆలస్యంగా చెన్నైకి చేరుకున్నాయి. బెంగళూరుకు వెళ్లాల్సిన విమానాన్ని అకస్మాత్తుగా రద్దుచేయడంతో దీనికోసం వేచివున్న వందమంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఖాకీల కోలాహలం పోలీసు సిబ్బంది అనగానే ఖాకీ దుస్తులే కళ్లకు కనపడతాయి. అయితే పండుగ రోజును ఖాకీని పక్కన పెట్టి పట్టు వస్త్రాల ధరించారు. చెన్నై హైకోర్టు, న్యాయ కళాశాలల పరిధిలో విధులు నిర్వర్తించే స్త్రీ, పురుషులు సంప్రదాయ దుస్తుల్లో ప్రత్యక్షమయ్యూరు. సుమారు 250 మంది పోలీసులు రంగు రంగులతో అలంకరించిన కుండలు చేతబట్టి పొంగళ్లు వండారు. మొత్తం 12 బృందాలుగా విడిపోయి ఆటపాట, ముగ్గుల పోటీల్లో మునిగి తేలారు. ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ సోమయాజీ ఈ కార్యక్రమానికి హాజరై పోలీసులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. నేతల శుభాకాంక్షలు తమిళనాడు గవర్నర్ కే రోశయ్య ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమిళ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగలు జరుపుకుంటూనే వాతావరణ పర్యావరణాన్ని కాపాడుకోవాలని సందేశంలో పేర్కొన్నారు. పండుగలు జరుపుకోవడంలోని అంతరార్థం మానవ సంబంధాలు మెరుగుపడటమేనని ముఖ్యమంత్రి జయలలిత సందేశమిచ్చారు. ప్రపంచంలోని తమిళులంతా సంతోష, సౌభాగ్యాలతో వర్దిల్లాలని కోరుకుంటున్నట్లు ఆమె చెప్పారు. చెన్నై వైఎంసీఏ మైదానంలో కనిమొళి నేతృత్వంలో మూడురోజులపాటూ సాగే పొంగల్ ఉత్సవాల్లో డీఎంకే అధినేత కరుణానిధి పొల్గొంటున్నారు. ఈ సందర్భంగా కరుణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. డీఎంకే కోశాధికారి స్టాలిన్ ఎమ్మెల్యేగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొలత్తూరులో ప్రజలకు ఉచితంగా కుట్టుమిషన్లు, పంచె, చీరలు పంపిణీచేసి శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రి జీకే వాసన్, టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్, ఎండీఎంకే అధినేత వైగో, పీఎంకే అధినేత డాక్టర్ రాందాస్, సమత్తువ మక్కల్ కట్చి అధినేత, నటుడు శరత్‌కుమార్ తదితరులు ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. సముద్రతీరాల్లో స్నానాలు నిషేధం పండుగల సందర్భంగా ఈనెల 14, 15, 16 తేదీల్లో సముద్రతీరాలు, పార్కులు, ఉద్యానవనాలు జనంతో కిక్కిరిసిపోతాయి. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సముద్రంలో స్నానాలపై పూర్తిగా నిషేధాజ్ఞలు విధించారు. ప్రజలు లోనికి వెళ్లకుండా సముద్రతీరం వెంబడి కొన్ని కిలోమీటర్ల దూరం వరకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. మహిళలను గేలి చేయడం, గొలుసు దొంగతనాలు చేసే రౌడీమూకలను అదుపుచేసేందుకు మఫ్టీలో మహిళా పోలీసులను నియమిస్తున్నారు. చెన్నై మెరీనా తీరం వద్ద ఐదు ఔట్‌పోస్టు పోలీసు స్టేషన్లు, 8 చోట్ల నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు. జనం రద్దీని అదుపుచేసేందుకు పోలీస్ అశ్వదళాలను రంగంలోకి దించుతున్నట్లు నగర పోలీస్ కమిషనర్ జార్జ్ చెప్పారు. -
ఢిల్లీ వాసుల్ని ఆకర్షించిన అమ్మ క్యాంటిన్
న్యూఢిల్లీ : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'అమ్మ క్యాంటీన్' దేశ రాజధానిలో అందుబాటుకి వచ్చింది. తమిళనాడు భవన్లో 'అమ్మ క్యాంటిన్'లో ఒక్కరూపాయికే ఇడ్లీలు లభ్యమయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. పొంగల్ పర్వదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించారు. దీనితో పాటు లెమన్ రైస్ , సాంబార్ రైస్ అయిదు రూపాయలకు దొరుకుతోంది. దాంతో ఢిల్లీ వాసులు అమ్మ క్యాంటిన్లో పొంగల్ వేడుకలు జరుపుకుంటున్నారు. అమ్మ క్యాంటిన్ ధరలు ఆకర్షించటంతో...వారు పెద్ద ఎత్తున తమిళనాడు భవన్‌కు చేరుకుని పొంగల్, ఇడ్లీ రుచి చూస్తున్నారు. కాగా కేవలం మూడు రోజుల మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. -
సంక్రాంతి సందడి
సంక్రాంతి సందడి ఆరంభం అయింది. స్వగ్రామాలకు బయల్దేరిన నగరవాసులతో బస్సులు, రైళ్లు కిక్కిరిశాయి. పండుగ సమయం ఆసన్నం కావడంతో ఆదివారం మాల్స్, మార్కెట్లలో కొత్త దుస్తులు, పూజా సామగ్రి కొనుగోలు జోరుగా సాగింది. సోమవారం భోగి పండుగను పొగ రహితంగా జరుపుకుందామని పర్యావరణ శాఖ పిలుపునిచ్చింది. పండుగను ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకునేందుకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గట్టి భద్రతా ఏర్పాట్లకు పోలీసు యంత్రాంగం ఆదేశించింది. సాక్షి, చెన్నై: రాష్ర్టంలో ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకునే పెద్ద పండుగ రానే వచ్చింది. సోమవారం భోగి, మంగళవారం సంక్రాంతి, బుధవారం కనుమ, గురువారం కానం పొంగళ్ పర్వదినాల్ని జరుపుకునేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధం అయ్యారు. పండుగ సమయం ఆసన్నం కావడంతో షాపింగ్ నిమిత్తం ఆదివారం పెద్దఎత్తున మాల్స్, మార్కెట్లకు తరలివచ్చారు. దీంతో నగరంలోని వాణిజ్య కేంద్రాలు ఎటు చూసినా జనంతో కళకళలాడయి. ఇంటి ల్లిపాది కొత్త దుస్తులు, సంక్రాంతి పొంగళ్ల కోసం కుండలు, చెరకులు, పూజా సామగ్రి, భోగి పండుగ కోసం తప్పెట్లు...ఇలా అన్ని రకాల వస్తువుల కోసం జనం పోటెత్తడంతో టీ నగర్, పురసై వాక్కం, ప్యారిస్ ప్రాం తాలు కిటకిటలాడాయి. అదే సమయంలో పూజా సామాగ్రి ధరలకు రెక్కలొచ్చాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది ధరలు ఆమాంతం పెరిగినా, చేసేది లేక కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. నగరంలోని కోయంబేడు మార్కెట్లో నల్ల చెరకులు పెద్ద ఎత్తున తరలి వచ్చాయి. ఒక కట్ట రూ.300 నుంచి పలుకుతోంది. యాపిల్ వంటి పండ్ల ధరలు గత వారం కంటే 25 శాతం మేరకు పెరగడం గమనార్హం. భోగి తప్పెట్లు: కష్టాలు వైదొలగి, తమ బాధలన్నీ మంటల్లో ఆహుతినిచ్చే రీతిలో భోగి మంటల్ని వేస్తూ వస్తున్నారు. ఇళ్లలోని పాత వస్తువుల్ని, చాప, చీపురు కట్టలు వంటివి ఈ భోగి మంటలో వేస్తారు. ఈ భోగి పండుగను చిన్న పిల్లలు భలే సరదాగా చేస్తారు. తప్పెట్లు వాయిస్తూ కేకలు పెడుతూ ఆనందాన్ని ఆస్వాదించే ఈ పండుగ కోసం మార్కెట్లో తప్పెట్లు కొలువు దీరాయి. మెట్టు పాళయం, పెరంబూరు, చూళై, ఆరుదొడ్డిల్లోని గ్రామీణ కళాకారులు తీర్చిదిద్దిన ఈ తప్పెట్ల పండుగ రోజున మార్మోగనున్నాయి. రైళ్లు, బస్సుల్లో జనమే జనం: ఇంటిల్లిపాది ఆనందంతో జరుపుకునే పెద్ద పండుగకు సెలువులూ ఎక్కువే. దీంతో నగరంలో పనిచేస్తున్న వివిధ ప్రాంతాలకు చెందిన వాళ్లు పండుగ కోసం తమ స్వగ్రామాలకు తరలి వెళ్లారు. దక్షిణాది జిల్లాలకు చెందిన వేలాదిమంది ఉద్యోగం, వ్యాపారం, చదువు తదితర పనుల నిమిత్తం చెన్నైలో ఉంటూ వస్తున్నారు. వీరంతా ఒక్కసారిగా తమ ప్రాంతాలకు వెళ్లేందుకు తరలిరావడంతో రైళ్లు, బస్సులు కిక్కిరిశాయి. చెన్నై సెంట్రల్, ఎగ్మూర్ స్టేషన్లలో దక్షిణాది జిల్లాల వైపుగా ఎనిమిది రైళ్లు పయనిస్తుండటంతో ఆ రైళ్ల బోగీలు ఇసుక వేస్తే రాలనంతగా కిటకిటలాడాయి. రిజర్వేషన్ లేని వాళ్ల కోసం ఆదివారం కూడా ప్రత్యేక క్యూలను పోలీసులు నిర్వహించారు. అయితే, ప్రత్యేక రైళ్లను ఈ సారి పెద్దగా నడపకపోవడాన్ని తీవ్రంగా ప్రయాణికులు విమర్శించారు. ఇక కోయంబేడు బస్టాండ్ జన సందోహంతో నిండింది. ప్రభుత్వం ప్రత్యేక బస్సులు నడిపినా, ఆమ్నీ బస్సుల వద్దకు జనం పరుగులు తీయక తప్పలేదు. ప్రభుత్వ బస్సులు కిట కిటలాడటంతో ఆమ్నీ యాజమాన్యాలు తమ పనితనాన్ని ప్రదర్శించారు. చార్జీలను పెంచినా, ఆ బస్సుల్లో ప్రయాణించక తప్పలేదు. భద్రత: పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా రాష్ట్ర పోలీసు యంత్రాంగం గట్టి భద్రతకు ఆదేశించింది. చెన్నై మహానగరంలో జన సంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మెరీనా తీరంలో స్నానం చేయడాన్ని నిషేధించారు. భోగి రోజు(సోమవారం) టైర్లు, ప్లాస్టిక్ వస్తువులను కాల్చితే మాత్రం చర్యలు తప్పదని హెచ్చరించారు. పర్యావరణానికి ఆటంకం కలగని రీతిలో, ప్రమాదాలకు చోటు ఇవ్వకుండా భోగిని జరుపుకుందామని ప్రజలకు పర్యావరణ శాఖ పిలుపు నిచ్చింది. ప్రధానంగా గుడిసె ప్రాంతాలు, పెట్రోల్ బంకుల సమీపాల్లో అగ్నిమాపక వాహనాలను సిద్ధం చేసి ఉంచారు. సంక్రాంతి పర్వదినం మంగళవారం, తిరువళ్లూర్ డే, కనుమ బుధవారం, గురువారం కానుం పొంగళ్ పర్వదినాల్ని పురస్కరించుకుని ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా కానం పొంగళ్ రోజున పెద్ద సంఖ్యలో జనం పర్యాటక ప్రాంతాలకు తరలి వస్తుంటారు. కుటుంబ సమేతంగా ఆ రోజును ఉల్లాసంగా గడుపుతుంటారు. దీంతో నగరంలోని పర్యాటక కేంద్రాలు, బీచ్లలోను నిఘా పెంచారు. వాణిజ్య సమూదాయాలు, సినిమా థియేటర్ల వద్ద కూడా భద్రత పెంచారు. ప్రధానంగా మెరీనా తీరంలో ప్రమాదాలు చోటు చేసుకోకుండా గజ ఈతగాళ్లు రంగంలో దించేందుకు నిర్ణయించారు. అత్యవసర వైద్య సేవల శిబిరాలు, హెల్ప్లైన్లు ఏర్పాటు పనులు వేగవంతం చేశారు. -
వివిధ సంక్రాంతి
పండుగ వివిధ రాష్ట్రాలలో సంక్రాంతిని వివిధ రకాలైన పేర్లతో, వివిధ రకాలుగా జరుపుకుంటారు. తమిళనాడు: సంక్రాంతిని పొంగల్‌గా జరుపుకుంటారు. ఇంటి ఇలవేల్పుకు భక్తిశ్రద్ధలతో పూజ చేసి, పొంగలిని నైవేద్యం పెడతారు. మరికొందరు బియ్యం, రకరకాల పప్పుదినుసులు, పాలు, నెయ్యి కలిపి కిచిడీలా తయారు చేసి, కులదేవతకు నైవేద్యం సమర్పిస్తారు. ఉత్తరప్రదేశ్:వీరికిది ఖిచిరి పేరుతో నదులలో పుణ్యస్నానాలు చేసే రోజు. పండుగకి నెలరోజుల ముందునుంచే మాఘమేళా పేరుతో నదులలో స్నానం చేసే సంప్రదాయం ఆరంభమవుతుంది. త్రివేణి సంగమం, ప్రయాగ, హరిద్వార్‌లలో పుణ్యస్నానాలు చేస్తారు. బెంగాల్: ప్రజలంతా ఈ రోజున గంగాసాగర్‌లో పుణ్య స్నానాలు చేస్తారు. మహారాష్ట్ర:చక్కెర, నువ్వులు కలిపి తయారు చేసిన పంచదార బిళ్లలను పంచుకుంటారు. ‘గత సంవత్సరంలో నా వల్ల జరిగిన తప్పులు, పొరపాట్లను క్షమించి, నన్ను ఆశీర్వదించు’ అని చెబుతూ పరస్పరం ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని, నువ్వుల లడ్డూలను తినిపించుకుంటారు. వివాహితలు హల్దీ- కుంకుమ్ ఉత్సవ్ పేరుతో ముత్తయిదువులను ఇంటికి పిలిచి, కొత్త పాత్రలో పసుపు, కుంకుమ ఇసారు. గుజరాత్: కుటుంబంలోని పెద్దలు చిన్నవాళ్లకు కానుకలిస్తారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకారవేతనాలు మంజూరు చేస్తారు. జ్యోతిషం, తత్త్వశాస్త్రంలో పరిపూర్ణత సాధించిన శిష్యులను గురువులు సత్కరిస్తారు. ప్రజలంతా పెద్ద ఎత్తున గాలిపటాలు ఎగురవేస్తారు. మధ్యప్రదేశ్: సకారత్ పేరుతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. రకరకాల పిండివంటలు చేసుకుని, ఒకరికొకరు పంచుకుంటారు. కేరళ: అయ్యప్పదీక్షకు ముగింపు పలుకుతూ ఉత్సవాలు, పూజలు చేస్తారు. ఒరిస్సా: గిరిజన తెగలలో ఈ పండుగను కొత్త సంవత్సరంగా జరుపుకుంటారు. నెగడు వెలిగించి, దానిచుట్టూ పాటలతో నృత్యం చేస్తారు. ప్రత్యేకమైన వంటకాలను ఆరగిస్తారు. -
రంగు రంగుల ముగ్గులు
-
సారీ..‘నో రూమ్’
=ఖాళీ లేని రైళ్లు ముంచుకొస్తున్న సెలవులు =సంక్రాంతి ప్రయాణంపై ప్రయాణికుల బెంబేలు =చలనం లేని రైల్వే సాక్షి, సిటీబ్యూరో: సంక్రాంతి పండుగ ప్రయాణం ఇప్పటి నుంచే ఉస్సూరుమనిపిస్తోంది. జనవరి 9 నాటికే రైళ్లలో ‘నో రూమ్’ వెక్కిరిస్తోంది. గోదావరి, విశాఖ, గరీబ్థ్,్ర ఫలక్‌నుమా, గౌతమి, మచిలీపట్నం, నర్సాపూర్, సింహపురి, నారాయణాద్రి, వెంకటాద్రి, పద్మావతి, రాయలసీమ వంటి ప్రధాన రైళ్లలో జనవరి 1 నుంచి 8 వరకు వెయిటింగ్ లిస్టు 200-250, కొన్నింటిలో 270కి చేరుకుంది. దీంతో ప్రయాణికులు సొంతూళ్లకు ఎలా వెళ్లాలనే దానిపై ఆందోళన చెందుతున్నారు. యథా ప్రకారం దక్షిణమధ్య రైల్వేలో చలనం లేదు. ఇప్పటి వరకు సంక్రాంతి ప్రత్యేక రైళ్లు ప్రకటించకపోవడం ప్రయాణికుల్ని మరింత బెంబేలెత్తిస్తోంది. ఇప్పటి నుంచే పండుగ ప్రయాణానికి ప్రణాళికలు రూపొందించుకొంటున్న వారిని రెగ్యులర్ రైళ్లలోని రద్దీ వెక్కిరిస్తోంది. ప్రత్యేక రైళ్లు వేస్తే తప్ప ఊరికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. గతేడాదితో పోలిస్తే ఈసారి ఉద్యమాలు, సమ్మెలు వంటి ప్రతికూల పరిస్థితులు లేవు. దీంతో పండుగ రద్దీ సాధారణంగా కంటే రెట్టింపు ఉండే అవకాశం ఉంది. పైగా పాలెంలో జరిగిన బస్సు దుర్ఘటన నేపథ్యంలో ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణానికి చాలామంది వెనుకాడుతున్నారు. దీంతో రైళ్లనే ఆశ్రయిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యేక రైళ్లు వేయవలసిన దక్షిణమధ్య రైల్వే ఇప్పటి వరకు ఆ దిశగా చర్య లు తీసుకున్నది లేదు. విశాఖ, తిరుపతి, కాకినాడ, నెల్లూరు, గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు వెళ్లే రైళ్లన్నీ చాంతాడంత వెయిటింగ్ లిస్టుతో దర్శనమిస్తున్నాయి. చాలా రైళ్లలో ‘నో రూమ్’ బోర్డు వేలాడుతోంది. ఏటేటా తగ్గుతున్న ప్రత్యేక రైళ్లు ఏటా సంక్రాంతికి రద్దీ పెరుగుతుండగా, రైళ్ల సంఖ్య తగ్గుతోంది. సాధారణ రోజుల్లో జంట నగరాల నుంచి సుమారు 2 లక్షల మంది వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. ఒక్క సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచే లక్షన్న ర మంది ప్రయాణిస్తారు. పండుగ రోజు ల్లో ఈ సంఖ్య రెట్టింపవుతుంది. సెలవు రోజు ల్లో లక్ష నుంచి 2 లక్షల మంది అదనంగా ప్రయాణిస్తారు. 2010లో సంక్రాంతికి 52 ప్రత్యేక రైళ్లు నడిపారు. 2011లో ఇవి 40కి, 2012లో 31కి తగ్గాయి. ఈ ఏడాది అసలు ప్రత్యేక రైళ్లు ఉంటాయా? అనే దానిపై సంది గ్ధత నెల కొంది. ప్రత్యేక రైళ్ల ప్రకటనను బట్టే నగరవాసులు కుటుంబాలతో కలిసి ఊరెళ్లేం దుకు ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటారు. పం డుగ సమీపించాక ప్రకటించినా అటు రైల్వేకు, ఇటు ప్రయాణికులకు ప్రయోజనం ఉండదు. మరోవైపు ఆదరాబాదరా ప్రత్యేక రైళ్లు వేయడం వల్ల ఎక్కువ శాతం సీట్లు దళారులే కొల్లగొట్టుకుపోయే అవకాశం ఉంది. ఇటీవల శబరి రైళ్లలో అయ్యప్ప భక్తులకు అదే అనుభవం ఎదురైంది. శబరిమలై వెళ్లేందుకు 138 ప్రత్యేక రైళ్లను ప్రకటించినప్పటికీ దళారుల చేతివాటంతో క్షణాల్లో బుకింగ్ ముగిసింది.