పంచె కట్టి పొంగలి వండిన ప్రధాని | Trudeau Wears Veshti to Celebrate Pongal in Toronto | Sakshi
Sakshi News home page

పంచె కట్టి పొంగలి వండిన ప్రధాని

Published Wed, Jan 17 2018 2:54 PM | Last Updated on Fri, Jul 6 2018 3:32 PM

Trudeau Wears Veshti to Celebrate Pongal in Toronto - Sakshi

సంక్రాంతి వేడుకల్లో పొంగలి వండుతున్న కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడెవూ

న్యూఢిల్లీ : కెనడా ప్రధాన మంత్రి జస్టిన్‌ ట్రూడెవూ బుధవారం తమిళ సంప్రదాయం ప్రకారం సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. కెనడాలో స్థిరపడిన తమిళులతో కలసి ‘వెట్టి’ (తమిళ సంప్రదాయ దుస్తులు) ధరించిన ప్రధాని, పొంగల్‌ను తయారు చేశారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను తన ట్విటర్‌ అకౌంట్‌లో పోస్టు చేశారు ట్రూడెవూ. తమిళ కెనడియన్లతో కలసి పొంగల్‌ పండుగను జరుపుకోవడం తనకు ఆనందంగా ఉందని అన్నారు.

ఈ వేడుకల్లో ట్రూడెవూతో పాటు టొరంటో మేయర్‌ జాన్‌ టోరీ కూడా పాల్గొన్నారు. ట్రూడెవూ, టోరీలు కలసి పొంగల్‌ను వండటం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement