tamilians
-
తమిళ ముల్లె.. అరవ పల్లె.. ‘నందలూరు.. రొంబవూరు’
రాజంపేట: దేశంలోనే అతిపెద్ద రవాణా సంస్థ భారతీయరైల్వే. అటువంటి రైల్వేతో అనేక ప్రాంతాలకు గుర్తింపు వచ్చింది. అలాంటివాటిలో అన్నమయ్య జిల్లా నందలూరు ఒకటి. అందునా.. ఇక్కడ ఉన్న అరవపల్లె.. ప్రత్యేక గుర్తింపు పొందింది. దశాబ్దాల క్రితం తమిళనాడు నుంచి వచ్చిన అనేకమందికి ఈ ప్రాంతం నిలయమైంది. ఆవాసాల ఏర్పాటుతో మొదలై క్రమంగా పెద్దగ్రామంగా రూపుదిద్దుకుంది. కాలానుగుణంగా మారిన పరిస్థితుల్లో కూడా తన ఉనికిని నిలుపుకుంది. ఇది ద్రవిడ జీవన సంస్కృతికి పట్టం కడుతోంది. అమ్మ తల్లి ఆరాధన ఇప్పటికీ కొనసాగిస్తోంది. ఆధునికతను, అభివృద్ధిని సాధించినప్పటికీ ఆత్మను మాత్రం వదులుకోనంటోంది. రైల్వే కేంద్రం ఏర్పాటుతో.. నందలూరు రైల్వే కేంద్రం ఒకప్పుడు సదరన్ రైల్వేలో ఉండేది. ఇక్కడ స్టీమ్ ఇంజన్ రైల్వే లోకో షెడ్ కూడా ఉండేది. ముంబాయి–చెన్నై రైలుమార్గం ఏర్పాటులో భాగంగా స్టీమ్ రైలింజన్లను నడిపేందుకు నందలూరును కేంద్రంగా బ్రిటిషు రైల్వేపాలకులు ఎంచుకున్నారు. చెయ్యేరు నది నీటి నాణ్యత స్టీమ్ ఇంజన్ల నిర్వహణకు ఉపయోగపడుతుందనేది ప్రధాన కారణం. గుంతకల్ రైల్వే జంక్షన్ నుంచి తమిళనాడులోని చెన్నై వరకు నడిచే రైళ్లన్నింటికీ నందలూరులో ఇంజన్ మార్పిడి జరిగేది. సిబ్బంది కూడా అటూ, ఇటూ మారేవారు. ఈ నేపథ్యంలోనే రైల్వేపరంగా నందలూరుకు గుంతకల్ రైల్వేడివిజన్‌లో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇక్కడి నుంచి నేరుగా మద్రాసుకు ప్యాసింజర్ రైలు కూడా నడిచేది. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల నుంచి నందలూరుకు ఉద్యోగ, ఉపాధి పనుల నిమిత్తం అనేకమంది వచ్చారు. అయితే వీరిలో అగ్రభాగం తమిళులదే. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, అరకోణం, పెరంబూరు, తిరుత్తిణి తదితర ప్రాంతాలకు చెందిన వారు వివిధ రకాలలో అధికారులు, ఉద్యోగులు, కార్మికులుగా పనిచేసేందుకు నందలూరు రైల్వే కేంద్రానికి తరలివచ్చారు. వీరిని స్థానికులు అరవోళ్లు అని పిలిచేవారు. ఈ క్రమంలో నందలూరు రైల్వేస్టేషన్‌కు సమీపంలో వారు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. క్రమేణా అది అరవపల్లె పేరిట గ్రామంగా మారింది. ప్రస్తుతం నాగిరెడ్డిపల్లె అర్బన్ పరిధిలో ఈ పల్లె ఉంది. తొమ్మిది వార్డులకు విస్తరించింది. నందలూరు రైల్వేస్టేషన్ జోన్ మారడంతో.. 1977లో సదరన్ రైల్వే నుంచి దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి నందలూరు మారింది. ఫలితంగా వందలాది మంది తమిళనాడుకు చెందిన వారు చెన్నై సెంట్రల్తో పాటు ఇతర ప్రాంతాలకు బదిలీ చేసుకొని వెళ్లిపోయారు. కొందరు నందలూరు నీళ్లు, వాతావరణం, స్థానికుల మంచితనంతో ఇక్కడే ఉండిపోయారు. చెన్నై, కంచి, సేలం, అరక్కోణం, మధురై తదితర ప్రాంతాలకు చెందినవారు పెద్దసంఖ్యలో అరవపల్లెలోనే నివాసముండేవారు. కాలక్రమేణా 1000 తమిళ కుటుంబాలున్న గ్రామంలో ఆ సంఖ్య ఇపుడు 30కి చేరింది. ఈ పల్లెలో తమిళులతో పాటు ఇపుడు ఇతరులు కూడా ఉంటున్నారు. కాగా, బదిలీలపై ఇక్కడి నుంచి తమ రాష్ట్రాలకు వెళుతూ వెళుతూ తమిళనాడువాసులు ‘నందలూరు.. రొంబవూరు’ అని సర్టిఫికెట్ ఇచ్చారు. ఆరాధ్యదైవం..ముత్తుమారెమ్మ తమిళనాడు ప్రాంతంలో ముత్తుమారెమ్మను ఆరాధ్యదైవంగా కొలుచుకుంటారు. తమ సంప్రదాయంలో భాగంగా అరవపల్లెలో కూడా వారు ముత్తుమారెమ్మ గుడి నిర్మించుకున్నారు. కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారి ఆలయంగా కొలవబడుతోంది. ఈ గుడి మొదలియార్ కుటుంబీకుల ఆధ్వర్యంలో నడుస్తోంది. యేటా జాతర కూడా నిర్వహిస్తుంటారు. రైల్వేకార్మికులతో ఒకప్పుడు కళకళ రైల్వేస్టీమ్ ఇంజన్ లోకోషెడ్ ఏర్పడినప్పటి నుంచి రైల్వేకార్మికులతో అరవపల్లె ఒకప్పుడు కళకళలాడేది. ఇప్పుడు ఆ పరిస్ధితి లేదు. పాల్ఘాట్ నుంచి వచ్చిన మా పూర్వీకులు 1955లో ఏర్పాటుచేసిన శ్రీ లక్ష్మీవిలాస్ హోటల్ ఎంతో ఆదరణ పొందింది. అప్పట్లో రైల్వే స్టాఫ్‌లో తమిళులు అధికంగా ఉండేవారు. ముత్తుమారెమ్మ ఆలయం అభివృద్ధికి నా తండ్రి నారాయణస్వామి అయ్యర్ తన వంతు కృషిచేశారు. –బాలసుబ్రమణ్యంస్వామి, శ్రీలక్ష్మీవిలాస్, అరవపల్లె నందలూరుతో విడదీయరాని అనుబంధం సదరన్ రైల్వే జోన్ వల్ల తమిళులతో నందలూరు రైల్వేకేంద్రానికి విడదీయ రాని అనుబంధం ఏర్పడింది. తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ విధులు నిర్వహించే వందలాది కార్మికుల కుటుంబాలు ఉండేవి. 1976లో నందలూరు కార్యాలయంలో పనిచేసేటప్పుడు విధుల నిర్వహణకు సంబంధించి సదరన్ రైల్వే జోనల్ కేంద్రమైన మద్రాసు(చెన్నై)కు వెళ్లేవారం. రైల్వే జోన్ మార్పిడిలో చెన్నైకు వెళ్లకుండా చాలా మంది మంది తమిళ కుటుంబీకులు నందలూరులో కొనసాగుతున్నారు. –ఆనంద్‌కుమార్, రిటైర్డ్ ఎస్ఎంఆర్, న్యాయవాది, నాగిరెడ్డిపల్లె పూర్వీకుల నుంచి ముత్తుమారెమ్మ కోవెల మా పూర్వీకుల నుంచి ముత్తుమారెమ్మ కోవెల ఏర్పాటైంది. అప్పటి నుంచి గుడి నిర్వహణ చేపడుతూ వస్తున్నాం. నందలూరు రైల్వేస్టేషన్ సమీప ప్రాంతంలోనే మా పల్లె ఉంది. రైల్వేతోనే జనజీవనం ముడిపడింది. అది అలాగే కొనసాగింది. –వెంకటరమణ మొదలియార్, ధర్మకర్త, ముత్తుమారెమ్మకోవెల, అరవపల్లె -
బీజేపీ దూకుడు.. నష్టం తప్పదన్న సీనియర్ నేత
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ఇటీవల బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ వైఖరి మున్ముందు ప్రతిపక్ష అన్నాడీఎంకేకు నష్టం కలిగించే అవకాశం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రచారానికి బలం చేకూర్చే విధంగా అన్నాడీఎంకే సీనియర్ నేత పొన్నయ్యన్ సమన్వయ కమిటీ పెద్దలను తాజాగా హెచ్చరించారు. కమలనాథులపై ఎదురు దాడికి సిద్ధం కాకుంటే, భవిష్యత్‌లో నష్టం తప్పదన్న ఆందోళనను పార్టీ సమావేశంలో వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా డీఎంకే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడమే లక్ష్యంగా కమలనాథులు దూకుడు పెంచారు. చిన్న అస్త్రం దొరికి నా, దానిని బూతద్దంలో పెట్టేస్తున్నారు. నిరసనలు, ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. మంగళవారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై రాష్ట్ర ప్రభుత్వ పన్ను వాటా తగ్గించాలనే నినాదంతో బీజేపీ వర్గాలు ఆందోళనలు నిర్వహించాయి. తమపై కేసులు నమోదు చేసినా తగ్గేది లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈమేరకు బుధవారం నుంచి ఈనెల 15వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలపై బీజేపీ అధ్యక్షుడు అన్నామలై దృష్టి పెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎనిమిదేళ్ల పాలనలో విజయాలను, పథకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లే విధంగా ముందుకెళ్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధాన ప్రతి పక్షంగా అన్నాడీఎంకే వైఫల్యం చెందిందనే ప్రచారాన్ని కొన్ని వర్గాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతం చేశాయి. ఈ పరిస్థితుల్లో అన్నాడీఎంకే సమన్వయ కమిటీ సమావేశంలో ఆ పార్టీ సీనియర్ నేత పొన్నయ్యన్ చేసిన వ్యాఖ్యలు, హెచ్చరికల వీడియో బుధవారం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా చర్చ.. నగర పాలక సంస్థల ఎన్నికల సమయంలో తమిళనాడు బీజేపీకీ అన్నాడీఎంకే కటీఫ్ చేప్పిన విషయం తెలిసిందే. అయితే, జాతీయ స్థాయిలో మాత్రం సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలో సాగుతున్న వ్యవహారాలపై పొన్నయ్యన్ సమన్వయ కమిటీ సమావేశంలో పొన్నయ్యన్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. తమిళనాడులో అన్నాడీఎంకేను వెనక్కి నెడుతున్నారనే ప్రచారం ఊపందుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అప్రమత్తంగా వ్యవహరించకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించడం గమనార్హం. తమిళ ప్రజలపై బీజేపీకి చిత్తశుద్దిలేదని, వారి రెండు నాల్కల ధోరణి, భిన్న వాదనల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అన్నాడీఎంకేపై ఉందన్నారు. వీడియో వైరల్ నేపథ్యంలో పొన్నయ్యన్‌ను మీడియా ప్రతినిధులు సందించిన ప్రశ్నలకు ప్రత్యేకంగా సమాధానాలు ఇచ్చారు. కావేరి, పాలారు, ముల్లై పెరియార్ వంటి అంశాలపై, తమిళ ప్రజల సంక్షేమంపై బీజేపీ నేతలు పెదవి విప్పడం లేదన్నారు. బీజేపీ సిద్ధాంతం వేరు, తమ సిద్ధాంతం వేరు అని గుర్తు చేశారు. తమిళులపై హిందీని వారు బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని, నీట్‌ను బలవంతంగా రుద్దేశారని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో తమిళ ప్రజల సంక్షేమం మీద దృష్టి పెట్టాల్సిన బాధ్యత గురించి తాను సమావేశంలో వ్యాఖ్యలు చేసినట్టు వివరించారు. వాస్తవాలు ప్రజలకు తెలియ జేయకుంటే, ప్రచారాలకు బలం చేకూరినట్టే అని హెచ్చరించారు. చిన్నమ్మకు ఆహ్వానం ఈ చర్చ ఓ వైపు ఉంటే, మరోవైపు బీజేపీ శాసన సభా పక్ష నేత నయనార్ నాగేంద్రన్ పుదుకోట్టైలో మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు మరింత హాట్ టాపిక్ అయ్యాయి. చిన్నమ్మ శశికళను బీజేపీలోకి ఆయన ఆహ్వానించారు. అన్నాడీఎంకేలోకి ఆమె వెళ్తే ఆ పార్టీ బల పడుతుందన్నారు. అదే తమ పార్టీలోకి వస్తానంటే, ఆహ్వానించేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. ఆమె బీజేపీలో చేరితే తమకు పక్క బలంగా ఉంటారని అభిప్రాయపడ్డారు. చదవండి: Divyavani On Chandrababu Naidu: నరకం చూపిస్తారా.. కన్నీళ్లు పెట్టుకున్న దివ్యవాణి -
ఎక్కడున్నా వారిని రక్షిస్తాం.. సీఎం స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: ప్రపంచ నలుమూలలా.. ఉన్న తమిళుల రక్షణే డీఎంకే ప్రథమ కర్తవ్యం అని.. ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఊళ్లో ఉన్నా.. ఉక్రెయిన్‌లో ఉన్నా.. రక్షిస్తామని స్పష్టం చేశారు. ఇక, ఏప్రిల్ రెండో తేదీ ఢిల్లీకి సీఎం స్టాలిన్ పయనం కానున్నారు. డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో నాద స్వరచక్రవర్తి టీఎన్ రాజరత్నం కుటుంబ వివాహ వేడుక జరిగింది. వధూవరులు కావ్య, కరుణారత్నంను ఆశీర్వదించిన అనంతరం.. సీఎం స్టాలిన్ ప్రసంగించారు. తమిళం అన్న పదం విన్నా, పలికినా, తెలియని ఉద్వేగం ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుందన్నారు. తమిళులు ప్రపంచంలో ఎక్కడున్నా సరే, వారికి చిన్న పాటి ఆపద ఎదురైనా తొలుత స్పందించి పరుగులు తీసే పార్టీ తమదేనని పేర్కొన్నారు. ప్రపంచం నలు మూలల్లో ఉన్న తమిళులకు రక్షకులుగా డీఎంకే ఉందని భరోసా ఇచ్చారు. ఉక్రెయిన్‌లో ఉన్న 2 వేల మంది తమిళుల్ని ఇక్కడికి రప్పించేందుకు తాము ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఏ రాష్ట్రం కూడా ఇలాంటి కమిటీ ఏర్పాటు చేయలేదన్నారు. ఈ కమిటీ సభ్యులు ఢిల్లీలోనే ఉంటూ.. రేయింబవళ్లు శ్రమించి తమిళ విద్యార్థులను రాష్ట్రానికి రప్పించారన్నారు. కార్యక్రమంలో డీఎంకే ప్రధాన కార్యదర్శి దురై మురుగన్, సీనియర్ నేతలు, మంత్రులు పొన్ముడి, వేలు, ఎంపీలు రాజ, జగత్ రక్షకన్, టీకేఎస్ ఇలంగోవన్ తదితరులు పాల్గొన్నారు. బిల్డర్ల కాన్ఫరెన్స్‌కు సీఎం.. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మూడు రోజుల కాన్ఫరెన్స్ చెన్నైలో శనివారం రాత్రి నుంచి నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి భవన నిర్మాణ రంగంలోని 1,500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. వీరితో సీఎం స్టాలిన్ భేటీ అయ్యారు. అనంతరం ముఖ్యమంత్రి సావనీరును ఆవిష్కరించారు. నిర్మాణరంVýæం, ఆర్థిక వ్యవస్థల బలోపేతంపై సీఎంకు బిల్డర్స్ పలు విజ్ఞప్తులు చేశారు. సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్ఎన్ గుప్తా, చైర్మన్ భీష్మ ఆర్. రాధాకృష్ణన్, తమిళనాడు చైర్మన్ శివకుమార్, మంత్రి దురై మురుగన్, వేలు, అన్బరసన్ తదితరులు పాల్గొన్నారు. అన్నా అరివాలయం ప్రారంభోత్సవానికి.. ఏప్రిల్ 2న సీఎం స్టాలిన్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఇది రాజకీయ పయనం అన్న ప్రకటనతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీల్లో డీఎంకే కార్యాలయం అన్నా అరివాలయం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ కార్యాలయాన్ని ఏప్రిల్ 2న ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. ఈ దృష్ట్యా ఢిల్లీకి స్టాలిన్ వెళ్లనున్నారు. అయితే, ఈ ప్రారం భోత్సవానికి మమత బెనర్జీ, కె చంద్రశేఖర్‌రావు, ఉమర్ అబ్దుల్లా, ఉద్దవ్ థాకరే ‡ వంటి నేతలను ఆహ్వానించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. అలాగే, ఏఐసీసీ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌ను కూడా ఆహ్వానించబోతున్నట్లు డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఆంధ్రాలో కాకతీయుల తమిళ శాసనం
సాక్షి, హైదరాబాద్: ఓరుగల్లు (తెలంగాణ) కేంద్రంగా పాలించిన రాజు.. ఆంధ్రాలోని ఓ దేవాలయం.. అక్కడ తమిళంలో శాసనం.. కాకతీయ చక్రవర్తుల అద్భుత పాలన తీరుకు మరో సజీవ సాక్ష్యమిది. నాటి చక్రవర్తి ప్రతాపరుద్రుడు కొంతమేర తమిళులున్న ఓ ప్రాంతంలో వారి సౌకర్యం కోసం తమిళ భాషలో శాసనం వేయించడం విశేషం. నష్టపోయిన వారికి బీమా కోసం.. ప్రస్తుతం ఏపీలోని ప్రకాశం జిల్లా చినగంజాం మండలంలో ఉన్న మోటుపల్లిలో క్రీస్తు శకం 1244వ సంవత్సరంలో కాకతీయ గణపతి దేవచక్రవర్తి ఓ శాసనం వేయించారు. ఆనాటి సముద్ర వాణిజ్యంలో భాగంగా ప్రమాదాలు జరిగి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లితే ఆదుకునేందుకు బీమా పథకాన్ని ప్రారంభిస్తూ.. సంస్కృతం, తెలుగు, తమిళ భాషల్లో శాసనం రాయించారు. మళ్లీ 64 ఏళ్ల తర్వాత 1308 ఆగస్టు 1న అదే మోటుపల్లిలో ప్రతాపరుద్రుడు తమిళంలో వేయించిన మరో శాసనం తాజాగా వెలుగు చూసింది. మోటుపల్లి కోదండ రామాలయ రాజగోపురం గోడ రాళ్లలో తమిళంలో రాసి ఉన్న శాసనాన్ని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి ఆదివారం గుర్తించారు. ఆలయ పునరుద్ధరణ పనుల కోసం మోటుపల్లి హెరిటేజ్ సొసైటీ అధ్యక్షుడు బొండా దశరామిరెడ్డి ఆహ్వానంపై వెళ్లిన ఆయన.. ఆలయాన్ని పరిశీలించే క్రమంలో ఈ శాసనం వెలుగుచూసిందని తెలిపారు. గోడ నిర్మాణంలో అడ్డంగా పెట్టిన ఆ ఓ రాయిపై ఉన్న అక్షరాలను అచ్చు తీసి చదవగా.. ప్రతాపరుద్రుడు వేయించిన దాన శాసనంగా తేలిందని వివరించారు. దీనిపై కేంద్ర పురావస్తు శాఖ శాసన విభాగం డైరెక్టర్ మునిరత్నంరెడ్డిని సంప్రదించామన్నారు. గతంలో ఆ శాసనం నకలును తీశామని.. మోటుపల్లిని దేశి ఉయ్యకొండపట్నమని, ఒక తమిళ ఉత్సవానికి కొంత భూమిని దానం చేసినట్టు అందులో ఉందని మునిరత్నంరెడ్డి వివరించారని తెలిపారు. అయితే ఇప్పటివరకు ఆ శాసనం వివరాలను అధికారికంగా రికార్డు చేసిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. మోటుపల్లి పోర్టు పూర్వకాలంలో వాణిజ్య కేంద్రంగా ఉండేదని, వ్యాపార రీత్యా తమిళులు పెద్దసంఖ్యలో వచ్చి స్థిరపడ్డటంతో ప్రతాపరుద్రుడు తమిళంలో శాసనం వేయించి ఉంటారని శివనాగిరెడ్డి తెలిపారు. గణపతిదేవుడు నిర్మించిన ఈ ఆలయం మొదట్లో ఇది చెన్నకేశవ దేవర పేరుతో ఉందని, ఈ మేరకు ఓ శాసనం ఉందని చెప్పారు. సుమారు 50 ఏళ్ల కింద ఆలయంలోని విగ్రహం భిన్నంగా ఉందంటూ తొలగించి.. కోదండ రామాలయంగా మార్చారని వెల్లడించారు. తాజా శాసనంలో ఈ ఆలయాన్ని రాజనారాయణ పెరుమాళ్‌గా ప్రస్తావించారని తెలిపారు. అరుదైన ఈ శాసనాన్ని వెలికి తీసి ప్రత్యేకంగా ప్రతిష్టించాల్సి ఉందన్నారు. -
తమిళుల ఆకాంక్షలు నెరవేర్చండి
న్యూఢిల్లీ: శ్రీలంకలో మైనార్టీ వర్గమైన తమిళ ప్రజలకు మరిన్ని పాలనాధికారాలు కల్పించేందుకు ఉద్దేశించిన 13వ రాజ్యాంగ సవరణను అమలు చేయాలని శ్రీలంక ప్రధాని మహీందా రాజపక్సకు భారత ప్రధాని మోదీ సూచించారు. తమిళులు సమానత్వం, న్యాయం, శాంతి, గౌరవం కోరుకుంటున్నారని, వారి ఆకాంక్షలను నెరవేర్చాలని మోదీ చెప్పారు. మోదీ, రాజపక్స శనివారం వర్చువల్ ద్వైపాక్షిక సదస్సులో పాల్గొన్నారు. తమిళులకు అధికారాలను బదిలీ చేయాల్సిన అవసరాన్ని మోదీ ప్రస్తావించినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. లంకలో శాంతి, తమిళ వర్గంతో సయోధ్య కోసం 13వ రాజ్యాంగ సవరణను అమలు చేయాలని మోదీ పేర్కొన్నారు. 1987లో ఇండో–శ్రీలంక ఒప్పందం తర్వాత 13వ రాజ్యాంగ సవరణ జరిగింది. అయితే, ఇది ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. ద్వైపాక్షిక సదస్సులో మోదీ, రాజపక్స పలు కీలక అంశాలపై చర్చించుకున్నారు. రక్షణ, వ్యాపార, వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. లంకతో బౌద్ధపరమైన సంబంధాలను ప్రోత్సహించడానికి 15 మిలియన్ డాలర్ల సాయం అందించనున్నట్లు ఈ సందర్భంగా మోదీ ప్రకటించారు. శ్రీలంకలో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మహీందా రాజపక్స నేతృత్వంలోని శ్రీలంక పీపుల్స్ ఫ్రంట్ విజయం సాధించడం ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి దోహదపడుతుందని మోదీ అన్నారు. -
విజయం దిశగా మహింద రాజపక్స
కొలంబో: శ్రీలంక రాజకీయాల్లో మాజీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని అయిన మహింద రాజపక్స మరోసారి కీలకంగా మారనున్నారు. ఆయన నేతృత్వం వహిస్తున్న శ్రీలంక పొదుజన పెరుమణ(ఎస్ఎల్పీపీ) పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు అధికారికంగా ఫలితాలు వెలువడిన 16 సీట్లకుగాను 13 చోట్ల 60 శాతం పైగా ఓట్లు సాధించింది. తమిళులు మెజారిటీ సంఖ్యలో ఉన్న ఉత్తర ప్రాంతంలో కూడా ఎస్ఎల్పీపీ అభ్యర్థులే విజయం దిశగా సాగిపోతున్నారు. మొత్తం 22 జిల్లాలకుగాను 17 జిల్లాల్లో ఎస్ఎల్పీపీ తిరుగులేని ఆధిక్యం సంపాదించినట్లు అనధికార ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. 225 సీట్లున్న అసెంబ్లీలో ఎస్ఎల్పీపీ అత్యధిక సీట్లు గెలుచుకుంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ గెలుపు అధికార పార్టీ సాధించిన అద్భుత విజయమని మహింద సోదరుడు, శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స పేర్కొన్నారు. ఈ గెలుపుపై మహింద రాజపక్సకు భారత ప్రధాని మోదీ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కోవిడ్–19 భయం పొంచి ఉన్నప్పటికీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించారనీ, ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారని అభినందించారు. ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించుకునేందుకు, ప్రత్యేకమైన అనుబంధాన్ని ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు ఈ ఫలితాలు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. భారత ప్రధానికి మహింద రాజపక్స కృతజ్ఞతలు తెలిపారు. శ్రీలంక, భారత్‌లు స్నేహితులు, బంధువులు కూడా అని ట్విట్టర్లో పేర్కొన్నారు. -
వింత ఆచారం.. ‘ఎర్రని’ అభిషేకం!
చెన్నై: కొన్ని ఆచారాలు వింత ఉంటాయి. తమిళనాడు ధర్మపురి జిల్లాలోని నల్లంపల్లిలో పాటించే ఆచారం కూడా ఇలాంటిదే. స్థానిక కరుప్పస్వామి ఆలయంలో ఆడి(ఆషాడ) అమావాస్య సందర్భంగా అర్చకుడికి కారం కలిపిన నీళ్లతో అభిషేకం చేస్తారు. ఏంటి నమ్మలేకపోతున్నారా! ప్రతి ఏటా ఆడి అమావాస్య రోజున ఆలయ ఉత్సవం నిర్వహించటం ఆనవాయితీ. ఉత్సవంలో భాగంగా పెద్ద ఎత్తున ఆలయానికి భక్తులు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చివరిగా ఆలయంలో అనాదిగా వస్తున్న ఆచారం నిర్వహించారు. అర్చకుడు ముందుగా ఓ ఆసనంపై కూర్చుని భక్తులకు ఉపదేశం చేయగా అక్కడే సిద్దంగా బిందెలలో ఉంచిన నీటిలో 75 కిలోల దంచిన ఎండు మిరపకాయల కారం పోసి కలిపారు. కారం కలిపిన జలంతో అర్చకుడికి గ్రామ పెద్దలు అభిషేకం చేశారు. భక్తులంతా ఈ ఘట్టాన్ని ఎంతో ఆసక్తిగా తిలకించారు. కారం కలిపిన నీటితో అభిషేకం చేస్తున్నా అర్చకుడు ఎటువంటి ఇబ్బంటి పడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కారం మంట పెడుతున్నా కరుప్పస్వామిపై ఉన్న భక్తి వల్ల అర్చకుడుకి ఏమాత్రం బాధ ఉండదని భక్తులు విశ్వసిస్తారు. తమ గ్రామంలో ఏళ్లు తరబడి వస్తున్న ఈ ఆచారాన్ని కొనసాగించటం ఆనందంగా ఉందని గ్రామస్తులు అంటున్నారు. ఇలా చేయటం ద్వారా అర్చకుడి ఉపదేశ వాక్కు ఫలిస్తుందని వారినమ్మకమట. గ్రామస్తుల ఆచారాలు ఎలా ఉన్నా కారం నీళ్లతో మనిషికి అభిషేకం విచిత్రంగానే ఉంది. -
పంచె కట్టి పొంగలి వండిన ప్రధాని
న్యూఢిల్లీ : కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడెవూ బుధవారం తమిళ సంప్రదాయం ప్రకారం సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. కెనడాలో స్థిరపడిన తమిళులతో కలసి ‘వెట్టి’ (తమిళ సంప్రదాయ దుస్తులు) ధరించిన ప్రధాని, పొంగల్‌ను తయారు చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను తన ట్విటర్ అకౌంట్లో పోస్టు చేశారు ట్రూడెవూ. తమిళ కెనడియన్లతో కలసి పొంగల్ పండుగను జరుపుకోవడం తనకు ఆనందంగా ఉందని అన్నారు. ఈ వేడుకల్లో ట్రూడెవూతో పాటు టొరంటో మేయర్ జాన్ టోరీ కూడా పాల్గొన్నారు. ట్రూడెవూ, టోరీలు కలసి పొంగల్‌ను వండటం విశేషం. -
మైసూర్‌పాక్ ఎవరిది..?
సాక్షి,న్యూఢిల్లీ: రసగులా బెంగాలీలదేనని తేలడంతో తాజాగా మరో స్వీట్‌పై వివాదం ముందుకొచ్చింది. నోరూరించే మైసూర్‌పాక్ కర్నాటకకు చెందుతుందా లేక అది తమిళనాడు వంటకమా అనేది తేలాల్సి ఉంది. అయితే ఈ స్వీట్ తమదంటే తమదేనని సోషల్ మీడియా వేదికగా తమిళులు, కన్నడిగులు సవాల్ చేసుకుంటున్నారు. ప్రాంతాలవారీగా విడిపోయి మైసూర్‌పాక్ మూలాలు తమ రాష్ర్టంలోనే ఉన్నాయని వాదవివాదాలకు దిగుతున్నారు. కన్నడిగులు ఒక అడుగు ముందుకేసి మైసూర్‌పాక్ పేరులోనే అది తమదేననే అర్థం స్ఫురిస్తుందని మైసూర్ పేరును ఉటంకిస్తూ ఇది రాజ కృష్ణ రాజ వడయార్ కిచెన్‌లో మెనూ అని చెబుతున్నారు. నెయ్యి, చక్కెర, శనగపిండితో ప్యాలెస్ చెఫ్ కకసుర మాదప్ప దీన్ని వండివార్చేవాడని చెబుతున్నారు.కాలక్రమంలో దీనిపేరు మైసూర్‌పాక్‌గా స్ధిరపడిందని అంటున్నారు. అయితే తమిళులు తమదైన శైలిలో మరో కథ వినిపిస్తున్నారు. మద్రాస్‌కు చెందినవారు మైసూర్ పాక్‌ను కనుగొన్నారని అయితే 74 ఏళ్ల కిందట ఓ న్యాయవాది ఈ వంటకాన్ని దొంగిలించి మైసూర్ రాజాకు దీని సీక్రెట్ ఫార్ములాను అప్పగించారని చెబుతున్నారు. అప్పుడు మైసూర్ రాజా ఈ వంటకానికి మైసూర్‌పాక్ అని పేరుపెట్టారని ఈ విషయాలను స్వయంగా మెకాలే 1835లో బ్రిటన్ పార్లమెంట్‌కు వివరించారని పేర్కొంటున్నారు.దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు రాష్ర్టాల వారీగా చీలి కామెంట్లు, లైక్‌లతో రెచ్చిపోతున్నారు. -
అర్ధరాత్రి ఘోరం
► అదుపుతప్పి వ్యవసాయబావిలోకి దూసుకెళ్లిన టవేరా ► ఇద్దరు మృతి, అయిదుగురికి తీవ్ర గాయాలు ► శ్రీవారి దర్శనానికి వెళ్లి వస్తుండగా ఘటన ► తిరుపతి సమీపంలోని పెరుమాళ్లపల్లెలో ప్రమాదం ► బాధితులందరూ ఒకే కుటుంబానికి చెందిన తమిళనాడు వాసులు ► క్షతగాత్రులను రుయాకు తరలించిన పోలీసులు తిరుపతి క్రైం: శుక్రవారం అర్ధరాత్రి 12.15 గంటల ప్రాంతంలో.. తిరుపతి ఎమ్మార్ పల్లె సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టవేరా వాహనం అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. దాదాపు 150 మీటర్ల వరకు రోడ్డు పక్కకు వెళ్లింది. అనంతరం సుబ్రమణ్యంరెడ్డి అనే రైతుకు చెందిన వ్యవసాయ బావిలో పడిపోయింది. దాదాపు 75 అడుగుల లోతులో వాహనం ఇరుక్కు పోయింది. పోలీసులు అందించిన వివరాల మేరకు.. తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై జిల్లా చెంగం గ్రామానికి చెందిన షణ్ముగం, విజయ్, శివ, సరసు, సుకన్య, షకీలతో పాటు డ్రైవర్ తిరుమల శ్రీవారి దర్శనానికి గురువారం వచ్చారు. శుక్రవారం తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయాన్ని దర్శించారు. అనంతరం స్వగ్రామానికి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో తిరుపతి ఎమ్మార్‌పల్లె పోలీస్‌స్టేషన్ పరిధిలోని పెరుమాళ్లపల్లె పంచాయతీ ఆంజనేయస్వామి గుడి ఎదురుగా వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో డ్రైవర్‌తోపాటు సుకన్య అనే మహిళ మృతి చెందింది. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సహాయంతో పోలీసుల, ఫైర్ సిబ్బంది క్షతగాత్రులను బావిలో నుంచి రక్షించి రుయా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో క్షతగాత్రుల రోదనలు మిన్నంటాయి. శబ్ధం విని ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు టవేరా వాహనం వ్యవసాయ బావిలో పడడంతో భారీశబ్ధం వచ్చింది. దీంతో స్థానికులు ప్రమాదాన్ని గుర్తించి. 108కు, పోలీసులకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది, 108 సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. -
నాలుగు బస్సులపై తమిళ తంబీల దాడి
శ్రీకాళహస్తి/తడ : తమిళ తంబీలు సోమవారం రాత్రి తమిళనాడు-ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన రామాపురం వద్ద శ్రీకాళహస్తికి చెందిన నాలుగు ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. శేషాచలం ఎన్కౌంటర్ నేపథ్యంలో ఈనెల 8వ తేదీ నుంచి 19వ తేదీ వరకు శ్రీకాళహస్తికి చెందిన ఎనిమిది ఆర్టీసీ బస్సులను చెన్నైకు వెళ్లకుండా నిలుపుదల చేశారు. సోమవారం తిరిగి యథావిధిగా శ్రీకాళహస్తికి చెందిన ఎనిమిది ఆర్టీసీ బస్సులను చెన్నైకు పంపారు. సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో తమిళనాడులోని గుమ్మిడిపూడితోపాటు తమిళనాడు, ఆంధ్ర సరిహద్దు ప్రాంతం రామాపురం(ఆంధ్ర)లో కొందరు తమిళులు బస్సులపై రాళ్లతోదాడి చేశారు. -
తమిళనాడులో చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం
-
క్లాసికల్ హోదాకు తమిళుల మోకాలడ్డు!
రామతీర్థ తెలుగు భాషకు ప్రాచీనహోదాపై తమిళ భాషా నిపుణులు పిల్ రూపంలో కుయుక్తితో వేసిన అడ్డుపుల్ల గత ఏడేళ్లుగా కేంద్రం నుంచి మనకు రావలసిన నిధులను అడ్డుకుంటోంది. దీనిపై తెలుగు రాష్ట్రాల తక్షణ స్పందన అవసరం. ఏడేళ్ల కిందట తెలుగు, కన్నడ భాషలకు ప్రాచీన హోదా ప్రక టించింది నాటి కేంద్ర ప్రభు త్వం. దాంతోపాటు, మీకు ఈ హోదా వలన కలిగే లాభాలు అన్నీ, మద్రాస్ హైకోర్టులో విచారణలో ఉన్న ప్రజాహిత వ్యాజ్యం తేలాక మాత్రమే అందుబాటులోకి వస్తాయని షరతులూ తగిలించారు. తమిళులు 2004లోనే తమ భాషకు ప్రాచీన హోదాను ఒక రాజకీయ డిమాండ్‌గా చేసి యూపీఏ-1 ప్రభుత్వా న్ని ఇరుకున పెట్టి తమ మాట నెగ్గించుకున్నారు. కేంద్రం ఇతర దేశ భాషల విషయంలోనూ ఇలాంటి డిమాండ్లు వస్తాయని గ్రహించి 2014 నవంబర్లోనే ఒక భాషా నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. తమిళ భాషకు ప్రాచీన హోదా ప్రకటించే కాలానికి ఆ భాష సాహిత్యా నికి వెయ్యేళ్లు ప్రాచీనత ఉంటే సరిపోతుందన్నది ఒక అవగాహనగా ఉండగా, దాన్ని ఇతర భాషల విషయానికి వచ్చేటప్పటికి 1500-2000 సంవత్సరాలు ఉండాలన్న నిబంధన చొప్పించింది కూడా తమిళ సోదరులే. దాంతో మనమందరం కూడా మేము అంత ప్రాచీనులం అంటే ఇంత ప్రాచీనులమని వెదుకులాటలో పడిపోయాం. ఇలా మనల్ని ఒక కృత్రిమ రేసులో దారి తప్పించి, ప్రాచీ న భాష హోదా వల్ల తమకు ఉపయోగ పడే అంశాలను సాధించుకునే క్రమాన్ని వారు వేగవంతం చేసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత అంటే 2008 అక్టోబర్‌లో కేంద్రం తెలుగు, కన్నడ భాషలకు కూడా ప్రాచీన హోదా ప్రకటిం చింది. భాషా నిపుణుల కమిటీలోని తమిళ సభ్యులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ఈ రెండు భాషలకు ప్రాచీన హోదా ప్రకటనను అడ్డుకోలేము అన్న సంగతి స్పష్టమైపోయి కుయుక్తిపన్నారు. కేంద్రం దీనిపై ప్రకటన చేయడానికి ముందే వారు, తమిళ న్యాయవాది ఆర్.గాంధీ చేత ఒక పిల్‌ని మద్రాస్ హైకోర్టులో దాఖలు చేయించారు. ఆయన ఈ విషయంలో తెలుగు, కన్నడ (2008లో), మలయాళ భాషా (2013లో) సమాజాలకు ప్రాచీన హోదాకు వ్యతిరేకంగా మూడు ప్రజాహిత వ్యా జ్యాలు వేసి ఉంచాడు. ఆయనతో తమకేమీ సంబంధం లేదని తమిళనాడు ప్రభుత్వం తెలివిగా దూరం పాటి స్తోంది కానీ, ఈ చర్య వల్ల ఈ మూడు భాషలూ నేటి వర కూ ఎలాంటి లబ్ధికి నోచుకోలేదు. ప్రాచీన భాష హోదా పై నిబంధనలను ఇతర భాషల విషయంలో కఠినం చేయడంలో కూటనీతికి పాల్పడ్డారు తమిళ సోదరులు. ప్రాచీనతా నిర్ధారణ సంఘంలో తామూ ఉండడం వల్ల తెలుగు, కన్నడ భాషలకు ప్రాచీనహోదాపై కేంద్ర ప్రభు త్వం చేయనున్న ప్రకటనను ముందుగానే గ్రహించి, ఆ ఆంతరంగిక సమాచారాన్ని ముందస్తుగా పిల్ దాఖలు చేసే న్యాయవాదికి అందచేసి ఇతర భాషా సమాజాలకు జరిగే లబ్ధికి అడ్డుపడటం తమిళ సమాజ కుసం స్కారా నికి ప్రబల నిదర్శనం. దీనిని తెలుగు, కన్నడ, మలయాళ సోదరులు సమైక్యంగా ఎదుర్కొనగలిగితే వారికి ఒక గుణపాఠం చెప్పిన వారం అవుతాము. లేదా అత్యంత అవమానకరంగా.. కేంద్ర ప్రభుత్వం అందజేసి న ఆర్ట్స్, హ్యుమానిటీస్ రంగానికి సంబంధించిన ఒక ప్రధాన లబ్దిని సాకారం చేసుకోకుండా ఈ అనవసర వ్యాజ్యంలో ఇప్పటికే ఏడేళ్లుగా ఇరుక్కున్న మనం ఆ లబ్ధిని ఇంకా దూరం చేసుకుంటాం. కొన్నేళ్ల క్రితం ఈ విషయాన్ని తేల్చమని ఆంధ్ర, కర్ణాటక ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, నాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.జి. బాలకృష్ణన్ మద్రాస్ హైకోర్టు ముందున్న పిల్లో జోక్యం చేసుకోవ డానికి నిరాకరిస్తూ ఈ విషయాన్ని అక్కడే తేల్చుకోవా ల్సిందని సూచించారు. అయితే ప్రాచీన హోదా అమలు మాత్రం ఈ కేసు తీర్పుపైనే ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇలా మనం ప్రాచీన హోదా దాని ప్రయోజనాల విషయంలో కోర్టుల వెంబడి తిరుగుతుండగా, తమిళులు తమకు కాగల కార్యాన్ని పూర్తి చేసుకున్నారు. మైసూరు లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ ఇనిస్టి ట్యూట్ ఫర్ ఇండియన్ లాంగ్వేజెస్ ఆధ్వర్యంలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ క్లాసికల్ తమిళ్‌ను 2008లోనే వేరు చేసి తమ రాష్ట్రానికి తీసుకుపోయి ఏటా రూ. 75 కోట్ల ఖర్చుతో కేంద్ర ప్రభు త్వ సంస్థగా నిర్వహించుకుంటున్నారు. మన తెలుగు భాష క్లాసికల్ పరిస్థితి అందరికన్నా ఘోరంగా ఉంది. ఆనాడు పిల్‌పై అప్పీల్ చేసిన అధికార భాషా సంఘం ఇప్పుడు లేదు. రాష్ట్రం కూడా రెండుగా చీలిపోయింది. ఈ పిల్‌కు సంబంధించి అధికార భాషా సంఘం పేరు ఎక్కడా ప్రతివాదుల జాబితాలో లేకపోవడం, దివంగత ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి పేరు నేటికీ ఆ జాబితాలో ఉండటం చూస్తే ఈ కేసులో మన ప్రభుత్వ శాఖల, అధికారుల వైఫల్యం స్పష్టమవుతుంది. భాషల ప్రాచీనతే ప్రాచీన భాష హోదాకు తప్పని సరి అనే నిబంధన వెనక్కు వెళ్లాక కూడా ఇంకా మద్రాస్ హైకోర్టులో పిల్స్ పెండింగ్‌లో ఉండటంపై తెలుగు, కన్న డ, మలయాళ భాషా సమాజాల ప్రజలు తమ అభ్యంత రాలు పంపి ఆ వ్యాజ్యాలను రద్దు చేసుకోవాలి. ఈ దిశగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు క్రియాశీల కంగా పనిచేసి తమిళులకు తగు వ్యూహంతో దీటుగా జవాబు ఇవ్వాలి. ఎప్పటికైనా ఫలితం దక్షిణ రాష్ట్రాలకు అనుకూలంగానే వస్తుంది కానీ తమిళ భాషా సమాజం, తోటి దక్షిణ భాషలకు చేసిన ద్రోహం చరిత్రలో నిలిచిపో తుంది. భాషా రాజకీయాలకు తమిళులు పెట్టింది పేరు. రెండేళ్లకు ఒకసారి తెలుగు మహాసభలు జరుపు కోవడం బాగానే ఉంటుంది కానీ, మన భాషపై పొరుగు వారు అనవసరంగా కాలు పెట్టి తొక్కుతున్న నేపథ్యం లో, తగు స్పందనలు ఇవ్వకపోవడం, ఇందుకోసం ఒక సదస్సు కూడా లేకపోవడం.. ఇవన్నీ మన వైఫల్యాలే. ప్రాచీన భాష అనే మాయాజాలం లోంచి విశిష్ట భాషా చైతన్యంలోకి మనం ఎంత వేగంగా వస్తే అంత మంచిది. జాతి కాలిలో గుచ్చుకున్న ఈ ముల్లును మనం ఎంత వేగంగా తీసివేయగలిగితే అంత వేగంగా మన భాషా ప్రగతి భవ్యపథంలో సాగుతుంది. వ్యాసకర్త ప్రముఖ కవి, రచయిత మొబైల్ : 9849200385 -
టాస్క్‌ఫోర్స్ సిబ్బంది దారుణం
తిరుపతి: తిరుపతిలో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది దారుణంగా ప్రవర్తించారు. సబ్ జైల్లో ఉన్న నిందితుడిని పరామర్శించడానికి వచ్చిన తమిళులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్మగ్లింగ్‌కు, తమకు ఎలాంటి సంబంధం లేదన్నా వారు పట్టించుకోలేదు. మహిళలతో కూడా పోలీసులు చాలా అమర్యాదగా ప్రవర్తించారు. సబ్ జైల్ వద్దే బాధిత మహిళలు పడిగాపులుకాస్తున్నారు.