తమిళ తంబీలు సోమవారం రాత్రి తమిళనాడు-ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన రామాపురం వద్ద శ్రీకాళహస్తికి చెందిన నాలుగు ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు.
శ్రీకాళహస్తి/తడ : తమిళ తంబీలు సోమవారం రాత్రి తమిళనాడు-ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన రామాపురం వద్ద శ్రీకాళహస్తికి చెందిన నాలుగు ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. శేషాచలం ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఈనెల 8వ తేదీ నుంచి 19వ తేదీ వరకు శ్రీకాళహస్తికి చెందిన ఎనిమిది ఆర్టీసీ బస్సులను చెన్నైకు వెళ్లకుండా నిలుపుదల చేశారు. సోమవారం తిరిగి యథావిధిగా శ్రీకాళహస్తికి చెందిన ఎనిమిది ఆర్టీసీ బస్సులను చెన్నైకు పంపారు. సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో తమిళనాడులోని గుమ్మిడిపూడితోపాటు తమిళనాడు, ఆంధ్ర సరిహద్దు ప్రాంతం రామాపురం(ఆంధ్ర)లో కొందరు తమిళులు బస్సులపై రాళ్లతోదాడి చేశారు.