జమ్మూకశ్మీర్: జమ్మూకశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. వేర్పాటువాదుల అల్లర్లతో ఇప్పటికే 23 మంది మృతి చెందారు. అల్లరిమూకలను అదుపు చేయడానికి భద్రతాబలగాలు ప్రయత్నిస్తున్నాయి. అమర్నాథ్ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులను అధికారులు జమ్మూకు తరలిస్తున్నారు. బాల్తాల్ బేస్ క్యాంపు నుంచి అమర్నాథ్ యాత్రికులను జమ్మూకు తరలిస్తుండగా అల్లరిమూకలు రాళ్ల దాడికి పాల్పడ్డాయి. జమ్మూకు 150 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. వదంతులు వ్యాపించకుండా అధికారులు మొబైల్ ఇంటర్నెట్ సేవలను సైతం నిలిపేశారు.
యాత్రికుల బస్సుపై రాళ్ల దాడి
Published Mon, Jul 11 2016 12:17 PM | Last Updated on Fri, Aug 17 2018 8:06 PM
Advertisement
Advertisement