stones
-
సముద్రం ఒడ్డున రాళ్లు ఏరుతున్నారా.. వద్దొద్దు!
పిల్లలూ! మీరెప్పుడైనా సరదాగా సముద్రం చూసేందుకు వెళితే ఏం చేస్తారు? అక్కడ ఒడ్డున ఉన్న రాళ్లను ఏరుకుంటారు. వాటిని మీతోపాటు తెచ్చుకొని దాచుకుంటారు. నలుపు, తెలుపు రంగుల్లో నునుపుగా ఉండే ఆ రాళ్లు చూసేందుకు ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. వాటిని ఇంట్లో పెట్టుకొని మురిసి΄ోతుంటారు. అయితే ఇకపై ఆ పని చేయొద్దు. ఎందుకో తెలుసా?సముద్రంలో నిత్యం ఉవ్వెత్తున అలలు ఎగిసి పడుతుంటాయన్న విషయం మీకు తెలుసు కదా! ఆ అల్లు తాకిడికి తీరం కొట్టుకు΄ోకుండా రక్షించేది ఈ రాళ్లే. ఒడ్డున అందరూ ఆనందంగా ఉండాలన్నా, సముద్రం అలలు మన మీద ఉధృతంగా పడిపోకుండా ఉండాలన్నా ఈ రాళ్లు రక్షణ కవచాలుగా నిలబడతాయి. మీరు ఈ రాళ్లను మీతోపాటు తెచ్చుకుంటే ఆ రక్షణ వ్యవస్థ దెబ్బతింటుంది. దాంతో అలలు తీరాన్ని కోసుకుంటూ వెళ్లిపోతాయి. దానివల్ల ఎంతో నష్టం జరుగుతుంది. మేమొక్కరం కొన్ని రాళ్లు తెచ్చుకుంటే నిజంగా ఇంత సమస్య వస్తుందా అని అనుకోవద్దు. మీరొక్కరే కాకుండా నిత్యం ఎంతోమంది సముద్రం చూసేందుకు వస్తారు. వారంతా మీలాగే ఆలోచించి తలా ఒక రాయి తీసుకొని వెళితే నష్టం తప్పక జరుగుతుంది. అందుకే ఉత్తర ఇంగ్లండ్‌లోని కంబర్‌ల్యాండ్ కౌన్సిల్ ప్రాంతంలో కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చారు. ఎవరైనా సముద్రం ఒడ్డున రాళ్లు ఏరి, తీసుకెళ్తున్నట్టు తెలిస్తే వాళ్లకు 100 పౌండ్లు(సుమారు రూ.10 వేలు) జరిమానా విధిస్తారు. ఇదంతా సముద్రాన్ని, చుట్టూ ఉన్న తీరు ప్రాంతాన్ని కాపాడటం కోసమే! మన దేశంలో అలా రాళ్లు ఏరినందుకు ఎవరూ జరిమానా వేయరు. కానీ సముద్రం చుట్టూ ఉన్న ప్రాంతానికి హాని కలగకుండా ఉండాలంటే మనమే సొంతంగా ఆ పని మానేయాలి. సముద్రం ఒడ్డున హాయిగా పరుగులు పెడుతూ, సముద్రం అలల్ని చూస్తూ గడపాలి.. కావాలంటే ఆ రాళ్లతో అక్కడే ఆడుకోవాలి తప్ప వాటిని ఏరుకొని ఇంటికి తీసుకురాకూడదు. తెలిసిందా! ఇదీ చదవండి: US Air Crash: పెళ్లి కావాల్సిన పైలట్, ఒక్కొక్కరిదీ ఒక్కో విషాదం! US air crash: భారతీయ యువతి లాస్ట్ మెసేజ్ భర్త కన్నీరుమున్నీరు -
ఎగుమతుల్లో దూసుకుపోతున్న భారత్!
పెట్రోలియం, జెమ్‌స్టోన్ (రత్నాలు), చక్కెర, ఆగ్రోకెమికల్ ఉత్పత్తుల ఎగుమతుల్లో భారత్ పాత్ర అంతర్జాతీయంగా బలోపేతం అవుతోంది. గడిచిన ఐదేళ్లుగా అంతర్జాతీయ వాణిజ్యంలో ఈ రంగాల నుంచి భారత్ ఎగుమతుల వాటా పెరుగుతున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2018 నుంచి 2023 మధ్య కాలంలో వీటితోపాటు ఎలక్ట్రికల్ గూడ్స్, న్యూమాటిక్ టైర్లు, ట్యాప్‌లు, వాల్వ్‌లు, సెమీకండక్టర్ పరికరాల ఎగుమతులు సైతం పెరుగుతున్నాయి.వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం..2023లో పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 85 బిలియన్ డాలర్ల(రూ.7.09 లక్షల కోట్లు)కు పెరిగాయి. ఈ రంగంలో అంతర్జాతీయంగా భారత్ వాటా 2018 నాటికి 6.45 శాతంగా ఉంటే, 2023 నాటికి 12.59 శాతానికి పెరిగింది. 2018లో పెట్రోలియం ఉత్పత్తుల పరంగా ఐదో అతిపెద్ద దేశంగా ఉండగా, 2023 నాటికి మూడో అతిపెద్ద ఎగుమతిదారుగా అవతరించింది.విలువైన రాళ్లుప్రీషియస్, సెమీ ప్రీషియష్ (విలువైన రాళ్లు) స్టోన్స్ ఎగుమతుల పరంగా 2018 నాటికి భారత్ వాటా 16.27 శాతం కాగా, 2023 చివరికి 36.53 శాతానికి పెరిగింది. ఈ విభాగంలో అంతర్జాతీయంగా భారత్ నంబర్1 స్థానానికి చేరింది. 2023లో 1.52 బిలియన్ డాలర్ల విలువైన తర్నాలను భారత్ ఎగుమతి చేసింది. 2018లో ఎగుమతులు కేవలం 0.26 బిలియన్ డాలర్లుగానే (అంతర్జాతీయంగా రెండో స్థానం) ఉన్నాయి.చక్కెర ఎగుమతులుచెరకు లేదా చక్కెర ఎగుమతుల పరంగా అంతర్జాతీయంగా భారత్ వాటా 2018 నాటికి ఉన్న 4.17 శాతం నుంచి 2023లో 12.21 శాతానికి చేరింది. చక్కెర ఎగుమతుల్లో భారత్ అంతర్జాతీయంగా రెండో అతిపెద్ద దేశంగా ఉంది. ఆగ్రోకెమికల్, పురుగు మందులుఆగ్రోకెమికల్, పురుగు మందుల ఉత్పత్తుల ఎగుమతులతో అంతర్జాతీయంగా భారత్ వాటా 8.52 శాతం నుంచి 10.85 శాతానికి పెరిగింది. 2023 చివరికి ఎగుమతులు 4.32 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందాయి. అంతర్జాతీయ వ్యవసాయ, పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేసే సామర్థ్యాలు భారత్‌కు కలిసొస్తున్నాయి. ఈ విభాగంలో అంతర్జాతీయంగా భారత్ మూడో స్థానానికి ఎగబాకింది. ఇదీ చదవండి: అత్యవసర నిధికి నిజంగా ‘బంగారం’ అనుకూలమా?రబ్బర్ టైర్ల ఎగుమతులురబ్బర్ న్యూమాటిక్ టైర్ల ఎగుమతులు 2018లో 1.82 బిలియన్ డాలర్లుగా ఉంటే 2023 చివరికి 2.66 బిలియన్ డారల్లకు పెరిగాయి. అంతర్జాతీయంగా భారత్ వాటా 2.34 శాతం నుంచి 3.31 శాతానికి చేరింది.సెమీకండక్టర్లుసెమీకండక్టర్, ఫొటోసెన్సిటివ్ పరికరాల ఎగుమతులు 2018లో కేవలం 0.16 బిలియన్ డాలర్లుగానే ఉండగా, 2023 నాటికి 1.91 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందినట్టు వాణిజ్య శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. -
మహాబోధి ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి.. పలువురు ప్రయాణికులకు గాయాలు
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాబోధి ఎక్స్‌ప్రెస్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం సంఘటన జరిగిన సమయంలో మహాబోధి ఎక్స్‌ప్రెస్ న్యూఢిల్లీ నుండి బీహార్‌లోని గయకు వెళుతోంది.ఈ రాళ్లదాడిలో పలువురు ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి యమునా బ్రిడ్జి సమీపంలో ఈ రాళ్లదాడి జరిగింది. మిర్జాపూర్ స్టేషన్లో రైలును నిలిపివేసి, గాయపడిన ప్రయాణికులకు చికిత్స అందించారు. అలాగే దాడికి పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.కాగా ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్ జిల్లాలో దుర్గ్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ట్రయల్ రన్ సమయంలో రాళ్ల దాడి జరిగింది. ఈ రైలుపై రాళ్లు రువ్విన ఐదుగురిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అరెస్టు చేసింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (మహాసముంద్) ఇన్స్పెక్టర్ ప్రవీణ్ సింగ్ ధాకడ్ మీడియాతో మాట్లాడుతూ ఈ రైలు విశాఖపట్నం నుండి దుర్గ్‌కు తిరిగి వస్తుండగా బాగ్బహ్రా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ సంఘటన జరిగిందని తెలిపారు. రైలు దుర్గ్ నుండి ట్రయల్ రన్ కోసం బయలుదేరిందని, రాయ్‌పూర్ గుండా మహాసముంద్ చేరుకుందని ధాకడ్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: పట్టాలు తప్పించే కుట్ర.. ఆ ముగ్గురు రైల్వే ఉద్యోగుల పనే -
రామసేతు రహస్యాలు పార్ట్2 : తేలియాడే రామసేతు రాళ్ల రహస్యాలు
రామసేతు నిర్మాణంలో ఉపయోగించిన రాళ్ల విషయంలోనూ చాలా వాదనలున్నాయి. అసలవి నిజమైన రాళ్లేనా లేక వృక్షాలను ఒక క్రమ పద్ధతిలో రాళ్లుగా చేసి వంతెన నిర్మాణంలో ఉపయోగించారా అనే అనుమాలున్నాయి. ఈ సందేహాలకు సరైన కారణాలే ఉన్నాయి. వారధి నిర్మాణానికి చెందినవిగా పేర్కొంటున్న రాళ్లు కొన్ని ఇప్పటికీ రామేశ్వరంలో ఉన్నాయి. ఐతే అవి నీటిలో తేలుతూ ఉండడం గమనార్హం. అంటే రామవారధి నిర్మాణంలో నీటిపై తేలియాడే రాళ్లను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే నీటిపై తేలియాడే రాళ్లను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు.? ఆ రాళ్లు ఎలాంటి పదార్థంతో తయారయ్యాయి. ?వంతెన నిర్మాణంలో ఉపయోగించిన రాళ్లు ఏ రకం పదార్థానికి చెందినవనే అంశంపై కూడా పరిశోధనలు జరిగాయి. ఓ వాదన ప్రకారం ఆ రాళ్లు అగ్నిశిలకు చెందిన రాళ్లు. అగ్నిపర్వతం పేలిన తర్వాత వెలువడే లావాకు ఘనరూపమే ఈ అగ్నిశిల రాళ్లు. ఇవి నీటిపై తేలియాడే స్వభావాన్ని కలిగి ఉంటాయట. ఐతే తమిళనాడు, శ్రీలంక పరిసరాల్లో ఎక్కడా కూడా మనకు అగ్నిపర్వతాలు కనిపించవు. దాంతో రామ సేతు నిర్మాణంలో ఉపయోగించిన రాళ్లు ప్యూమిక్ స్టోన్స్‌అనే వాదన తప్పు అని తేలి పోయింది. మరో వాదన ఏంటంటే వారధికి చెందిన రాళ్లు పగడపు దిబ్బలకు చెందినవి. ఐతే ఈ వాదనలో కూడా పస లేదని బయటపడింది. ఎందుకంటే పగడపు దిబ్బల్లో కాల్షియం కార్బో నేట్ పదార్థముంటుంది.దీని సాంద్రత నీటి సాంద్రత కంటే ఎక్కువ.కాబట్టి నీటిపై తేలడం కష్టం.మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు కూడా రామసేతు మానవ నిర్మితం కాదని వాదించింది. అది సహజంగా ఏర్పడిన కట్టడమే అని పేర్కొంది. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్ కూడా సమర్పించారు. అంతేగాక సేతుసముద్రం షిప్పింగ్ కెనాల్ పేరుతో ఓ భారీ ప్రాజెక్టు నిర్మాణానికి కూడా యూపీఏ సర్కారు పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టుతో రామ సేతు ఉనికే లేకుండా పోతుందన్న ఆందోళనలు ఉన్నాయి. అయితే యూపీఏ సర్కారు వాటిని పట్టించుకోలేదు. కానీ బీజేపీ, అన్నాడీఎంకే తదితర పార్టీలు ఆందోళనలు చేపట్టడంతో యూపీఏ సర్కారు వెనక్కి తగ్గింది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే రామసేతు రామాయణం కాలం నాటిది. అంటే త్రేతాయుగానికి చెందినదన్నమాట.యుగాల లెక్కల ప్రకారం సత్య యుగం వయసు 17 లక్షల 28 వేల సంవత్సరాలు. త్రేతాయుగ కాల పరిమాణం 12 లక్షల 96 వేల ఏళ్లు. ద్వాపర యుగం వయసు 8 లక్షల 64 వేల ఏళ్లు. కలియుగం వయసు 4 లక్షల 32 వేల ఏళ్లు. ఇక కలియుగం క్రీస్తు పూర్వం 3102లో ప్రారంభమైనట్లు చెబుతారు. ఈ లెక్కన కలియుగం నుంచి త్రేతాయుగానికి మధ్య కొన్ని లక్షల సంవత్సారాలు ఉన్నాయి. ఐతే విదేశీ సైంటిస్టులు మాత్రం రామసేతు నిర్మాణంలోని రాళ్లు 7 వేల ఏళ్ల క్రితం నాటివిగా చెబుతుండడం గమనార్హం. -
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
ఎన్నో రకాల రెసిపీలు గురించి విని ఉంటారు. అత్యంత వ్యవధి తీసుకున్న రెసీపీలు కూడా చూశాం. వాటన్నింటిని కాలదన్నేలా కఠినమైన రెసిపీ గురించి మాత్రం విని ఉండదరు. అయితే దీనిని వేటితో తయారు చేస్తారో వింటే మాత్రం కంగుతింటారు. ఏదో మాట వరసకు మంచి జీర్ణశక్తి గలవారిని రాళ్లను హరాయించుకోగలరు అంటారు గాని, ఎంతటి జీర్ణశక్తిమంతులకైనా ఈ వంటకాన్ని ఆరగించడం సవాలే! ‘సువోడియు’ అనే ఈ చైనీస్ వంటకంలోని ప్రధాన పదార్థం నది ఒడ్డున దొరికే నున్నని గులకరాళ్లే! గులకరాళ్లను మూకుడులో వేసి, బాగా వేయించి, వాటికి వెల్లుల్లి, మిరపకాయలు సహా రకరకాల మసాలాలు జోడించి తయారు చేస్తారు. కాస్త జారుగా సూప్‌లా ఉండే ఈ వంటకాన్ని కొన్ని శతాబ్దాల కిందట నది మధ్యలో చిక్కుకుపోయిన ఓడ సరంగులు కనిపెట్టారట! ఈ వంటకంలోని సూప్‌లాంటి జారుడు ద్రవాన్ని జుర్రుకుని, ఇందులోని రాళ్లకు పట్టిన మసాలాలను నిదానంగా చప్పరించి, ఆనక ఆ రాళ్లను ఊసేయాలి. నిజానికి ఈ వంటకాన్ని ఆరగించడమే ఒక కళ! ‘సువోడియు’ చైనాలో చాలా చోట్ల వీథుల్లో అమ్ముతారు. ఇది ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకంగా గుర్తింపు పొందింది. (చదవండి: ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!) -
ఉత్తరప్రదేశ్‌లో ‘వందేభారత్’పై రాళ్ల దాడి!
ఉత్తరప్రదేశ్‌లో వందేభారత్ రైలుపై అల్లరి మూకలు రాళ్లు రువ్వాయి. ఈ ఘటనతో రైల్వేశాఖలో కలలకం చెలరేగింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. యూపీలోని లక్నో నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్తున్న వందే భారత్ రైలుపై ఈ రాళ్లదాడి జరిగింది. ఈ ఘటనలో ఆ రైలు కిటికీ అద్దాలు పగిలిపోయాయి ఈ సంఘటన శ్రీరాజ్ నగర్- బచ్రావాన్ మధ్య జరిగింది. గేట్ నంబర్ 178 సమీపంలో రైలుపై బయటి నుంచి ఎవరో రాళ్లు విసిరారు. దీంతో రైలులోని సీ-3 కోచ్ కిటికీ అద్దం బద్దలయ్యింది. రైలు టెక్నీషియన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడలేదు. -
నల్లరాతి తాజ్‌మహల్ ఎక్కడుంది? దేనికి చిహ్నం?
ఆగ్రాలోని తాజ్ మహల్ ప్రేమకు చిహ్నంగా పేరుగాంచింది. యమునా నది ఒడ్డున ఉన్న ఈ అందమైన పాలరాతి భవనం ప్రేమలో మునిగితేలిన చక్రవర్తి కథను చెబుతుంది. షాజహాన్ తన భార్య జ్ఞాపకార్థం దీనిని నిర్మించాడు. అయితే మన దేశంలో నల్లరాతి తాజ్ మహల్ కూడా ఉందనే సంగతి చాలామందికి తెలియదు. ఇంతకీ ఇదెక్కడ ఉంది? దీని ప్రత్యేకత ఏమిటి? ఇది ఏ భావోద్వేగానికి గుర్తు అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నల్లరాతి తాజ్‌మహల్ మధ్యప్రదేశ్‌లోని చారిత్రక నగరం బుర్హాన్పూర్లో ఉంది. మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఈ నల్లరాతి తాజ్ మహల్‌ను చూశాకే.. ఆగ్రాలో పాలరాతి తాజ్ మహల్ నిర్మించాలని నిర్ణయించుకున్నాడని చెబుతారు. బుర్హాన్‌పూర్‌ను చాలా కాలం పాటు మొఘలులు పాలించారు. అందుకే ఇక్కడ బ్లాక్ తాజ్ మహల్‌తో పాటు అనేక చారిత్రక కట్టడాలు కనిపిస్తాయి. బుర్హాన్‌పూర్‌లోని ఉతావలి నది ఒడ్డున బ్లాక్ తాజ్ మహల్ నిర్మితమయ్యింది. ఇది ఆగ్రాలోని తాజ్ మహల్ కంటే కొంచెం చిన్నది. ఇది అబ్దుల్ రహీం ఖాన్ఖానా పెద్ద కుమారుడు షానవాజ్ ఖాన్ సమాధి. షానవాజ్ ఖాన్ కేవలం 44 సంవత్సరాల వయస్సులోనే మరణించాడు. అతనిని బుర్హాన్‌పూర్‌లోని ఉతావలి నది ఒడ్డున ఖననం చేశారు. అతను మరణించిన కొంతకాలానికి అతని భార్య కూడా మృతి చెందింది. షానవాజ్ ఖాన్ సమాధి పక్కనే ఆమెను కూడా ఖననం చేశారు. వీరిదిద్దరి మరణం తరువాత మొఘల్ చక్రవర్తి జహంగీర్ 1622- 1623 మధ్య కాలంలో ఇక్కడ బ్లాక్ తాజ్ మహల్‌ను నిర్మించాడు. ఈ నల్లరాతి తాజ్ మహల్ షానవాజ్ ఖాన్, అతని భార్య మధ్య ఉన్న ప్రేమకు చిహ్నంగా పరిగణిస్తారు. నల్లరాళ్లతో నిర్మించిన ఈ తాజ్‌మహల్‌ను చూసేందుకు మనదేశం నుంచే కాకుండా విదేశాల నుండి పర్యాటకులు తరలి వస్తుంటారు. ఈ బ్లాక్ తాజ్‌మహల్‌ను పురావస్తు శాఖ పర్యవేక్షిస్తోంది. దీని మినార్లు కూడా తాజ్ మహల్ మాదిరిగానే ఉంటాయి. -
చేపలు తింటున్నారా? దానిలోని ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల..
మారుతున్న జీవనశైలి కారణంగా ప్రస్తుతం చాలామంది అధిక బీపీతో బాధపడుతున్నారు. ముఖ్యంగా యువతలో ఈ సమస్య ఎక్కువగా వస్తుండటం విచారకరం. ‘అధిక రక్తపోటు’ శరీరంలో గుండె సమస్యలను పెంచుతుంది. అయితే జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యని నియంత్రించవచ్చు. అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లయితే ఎక్కువ ఉప్పు, తీపి, కొవ్వు పదార్థాలను తినకూడదు. ఇలాంటివి తినడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఆహారంలో కొన్ని పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు చేర్చినట్లయితే రక్తపోటును నియంత్రించవచ్చు. అవేంటో తెలుసుకుందాం. ►గుమ్మడి గింజల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. పొటాషియం, మెగ్నీషియం ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఫ్యాటీ ఫిష్ తినడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. చేపలలో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మన హృదయాన్ని ఫిట్‌గా ఉంచుతాయి. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. ► ఆధునిక కాలంలో మారిన జీవన పరిస్థితుల వల్ల చాలామందిలో కిడ్నీలలో రాళ్లు ఏర్పడుతున్నాయి. దీనికి కారణాలు అనేకం. కిడ్నీలో రాళ్లు ఏర్పడినప్పుడు చాలా ఇబ్బందులు పడతారు. ఇందుకోసం కొన్ని చిట్కాలు ► తులసి ఆకుల రసాన్ని తీసి దానికి ఒక చెంచా తేనె కలిపి ఈ మిశ్రమాన్ని ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ► కిడ్నీలో రాళ్లను తొలగించడంలో టొమాటో రసం బాగా ఉపయోగపడుతుంది. ఈ పరిస్థితిలో రెండు టమోటాలు బాగా కడిగి వాటిని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ జ్యూస్‌లో ఉప్పు, మిరియాల పొడి కలుపుకుని తాగాలి. కావాలంటే ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో ఉంచి జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కిడ్నీలోని స్టోన్స్‌ను తొలగించడంలో చక్కగా పనిచేస్తుంది. ► పెరుగును ఒక గిన్నెలో తీసుకుని అందులో చెంచా నిమ్మరసం వేసి రుచికి తగినట్లుగా ఉప్పు వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. -
స్టోన్స్ జ్యువెలరీతో స్టార్స్‌లా మెరిసిపోతున్న మగువలు!
ఆభరణాలలో రాళ్లు అనగానే మనకు వజ్ర వైఢూర్యాలు గుర్తుకు వస్తుంటాయి. సంప్రదాయ ఆభరణాలలో పొదిగిన రత్నాలు కళ్లముందు కనిపిస్తుంటాయి. కానీ, వేషధారణలో ఇండోవెస్ట్రన్ స్టైల్‌ని ఇష్టపడినట్టే ఆభరణాలనూ వెస్ట్రన్ లుక్‌ను తీసుకువస్తున్నారు డిజైనర్లు. ధరించిన వెస్ట్రన్ డ్రెస్‌కు మరిన్ని హంగులు తీసుకురావడానికి రంగు రంగుల రాళ్లతో ఫ్యాషన్ జ్యువెలరీ రూపుదిద్దుకుంటోంది. స్టోన్ జ్యువెలరీని ధరించినవారు వేడుకలో ఎక్కడ ఉన్నాస్టార్లలా మెరిసిసోతున్నారు. స్టోన్ స్టార్స్ అని కితాబులు అందుకుంటున్నారు. ఇటీవల అట్రాక్ట్ చేస్తున్న ఫ్యాషన్ జ్యువెలరీలో స్టోన్ ముందువరసలో ఉన్నాయి. వెడల్పాటి స్టోన్స్, బీడ్స్ కాంబినేషన్లో వస్తున్న జ్యువెలరీని నవతరం మరింతగా ఇష్టపడుతుంది. బ్రాస్ మెటల్‌తో...రాళ్లను పట్టి ఉంచాలంటే అందుకు తగిన గట్టి తీగల అల్లిక కూడా ఉండాలి. దానికి అనువైన లోహంగా ఇత్తడి డిజైనర్ల చేతిలో కొత్తగా మెరుస్తోంది. దీనితో స్టోన్ జ్యువెలరీని ఇండోవెస్ట్రన్ దుస్తులకు తగ్గట్టు ధరించేలా విన్నూతమైన డిజైన్స్‌ని మన ముందు కనువిందు చేస్తున్నాయి.. వందల రూపాయల నుంచి వేల రూపాయల వరకు ధర పలుకుతున్నాయి ఈ డిజైన్స్. రంగు రాళ్లు అచ్చమైన బంగారు ఆభరణాల్లో రత్నాలను పొదగడం చూస్తుంటాం. అయితే, ఇప్పుడు ఫ్యాషన్ జ్యువెల్రీలో రంగు రాళ్లను ఉపయోగించి డిజైన్స్రూపొందిస్తున్నారు. సిల్వర్, స్టీల్ మెటల్తోనూ రంగు రాళ్లు కనువిందు చేస్తున్నాయి. తక్కువ ధరలో అతివల చూపులను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. రాళ్లలోనూ రెప్లికా.. రాతి యుగంలో తమను తాము కాపాడుకోవడానికి రకరకాల లోహాలు, జంతువుల ఎముకలు, రంగు రాళ్లను ఆభరణాలుగా వాడుతూ వచ్చేవారు. నాగరికత మారుతున్న కొద్దీ డిజైన్స్‌లో మార్పులు వచ్చాయి కానీ, రాతి రూపం అలాగే ఉంటోంది. పిన్స్, బ్రోచెస్, రింగ్స్, పెండెంట్స్, నెక్లెస్‌లు, పొడవైన హారాలు, రాళ్ల వరసలు .. వీటిలో పూసలు కూడా జత చేరి మరింత హంగులతో స్టోన్ జ్యువెలరీ ముస్తాబు అవుతోంది. ఖరీదు ఎక్కువైన రత్నాలనే కాదు వాటి రెప్లికాలుగా రంగు రాళ్లతోనూ సంప్రదాయ, ఇండోవెస్ట్రన్ డిజైన్లు సృష్టిస్తున్నారు డిజైనర్లు. ఇటీవల అట్రాక్ట్ చేస్తున్న ఫ్యాషన్ జ్యువెలరీలో స్టోన్ ముందువరసలో ఉన్నాయి. వెడల్పాటి స్టోన్స్, బీడ్స్ కాంబినేషన్లో వస్తున్న జ్యువెలరీని నవతరం మరింతగా ఇష్టపడుతుంది. (చదవండి: అందాల తార సోనాక్షి సిన్హా ధరించిన డ్రస్ ధర తెలిస్తే..షాకవ్వుతారు!) -
వందే భారత్‌కు తప్పని రాళ్ల దెబ్బలు
ఇది సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ రైలు పరిస్థితి. ఏకంగా ఆరు కోచ్‌ల అద్దాలను ఆకతాయిలు పగలకొట్టేశారు. ఇటీవల ప్రారంభమై ప్రయాణికుల ఆదరణ చూరగొంటూ దాదాపు 115 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో నడుస్తున్న ఈ రైలును ఆకతాయిలు టార్గెట్‌గా చేసుకుంటున్నారు.– సాక్షి, హైదరాబాద్ వందేభారత్ రైళ్లపైనే కసిగా.. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రైళ్లపై రాళ్ల దాడులు జరగటం ముందు నుంచీ ఉంది. కానీ వందేభారత్ రైళ్లు పట్టాలెక్కిన తర్వాత అది మరింతగా పెరిగింది. గత ఏడు నెలల్లో రాష్ట్రంలో దాదాపు 300 పర్యాయాలు రైళ్లపై దాడులు జరిగితే, అందులో వందేభారతపై జరిగినవే 50కి పైగా ఉండటం గమనార్హం. వెడల్పాటి అద్దాలుండటంతో వందేభారత్ రైళ్లకు ఈ రాళ్లదాడి తీవ్ర నష్టం చేస్తోంది. సాధారణంగా రైలు అద్దాలు పగిలితే, మెయింటెనెన్స్ సమయంలో వాటిని మార్చేస్తారు. కానీ, వందేభారత్ రైళ్ల అద్దాలు తరచూ పగిలిపోతుండటంతో వాటిని మార్చటం ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం దక్షిణ మధ్య పరిధిలో సికింద్రాబాద్–విశాఖపట్నం, సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇందులో విశాఖపట్నం రైలు విశాఖలో మెయింటెయిన్ అవుతుండగా,తిరుపతి రైలు సికింద్రాబాద్‌లో అవుతోంది. వారానికి ఒక రోజు వీటికి సెలవు ఉండటంతో ఆ రోజు పూర్తిస్థాయిలో నిర్వహణ పనులు చేపడుతూ పగిలిన అద్దాలను మారుస్తున్నారు. బాగా పగిలితే మాత్రం వెంటనే మార్చేస్తున్నారు. ఇందుకోసం పెద్ద మొత్తంలో అద్దాలను స్థానికంగా నిల్వ చేసుకుంటున్నారు. సికింద్రాబాద్ డివిజన్‌లోనే ఎక్కువగా.. తాజాగా తిరుపతి రైలులో ఆరు కోచ్‌ల అద్దాలు పగలగా, విశాఖ రైలుకు మూడు కోచ్‌ల అద్దాలు పగిలాయి. ఈ ఏడాది రైళ్లపై జరిగిన 300 రాళ్ల దాడుల్లో ఎక్కువ సికింద్రాబాద్ డివిజన్‌లోనే చోటు చేసుకున్నట్టు రైల్వే అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి రైళ్లపై దాడుల విషయంలో నిందితులపై తీవ్రచర్యలుంటాయి. రైళ్లపై దాడి చేయటాన్ని జాతి ఆస్తి విధ్వంసంగా పరిగణిస్తూ కఠిన సెక్షన్లు దాఖలు చేస్తారు. అలాంటి వారికి ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం పోతుంది. దాడి చేసి అలాంటి కేసులుకొని తెచ్చుకోవద్దని ఎంతగా ప్రచారం చేసినా ఆకతాయిలు వినటం లేదు. దీంతో ఆ సెక్షన్ల కింద గరిష్ట జైలు శిక్షలు విధించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక నుంచి పట్టుబడిన వారికి వీలైనంత ఎక్కువ కాలం జైలు శిక్ష పడే ప్రమాదం ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. -
ఆ గ్రహంపై అధిక ఉష్ణోగ్రతలు.. తుఫాను గాలులు, రాళ్ల వర్షాలు
కొన్నేళ్ల క్రితం శాస్త్రవేత్తలు రెండు గ్రహాలను కనుగొన్నారు. ఈ గ్రహాలు మిగిలిన గ్రహాల కన్నా భిన్నంగా ఉన్నాయి. వాటి పరిమాణం బృహస్పతి గ్రహానికి సమానంగా ఉంది. ఈ రెండు గ్రహాలు మన పాలపుంత గెలాక్సీలో వాటి నక్షత్రానికి సమీపంలో ఉన్నాయి. ఈ రెండు గ్రహాలు అక్కడి అధిక ఉష్ణోగ్రత కారణంగా వేడెక్కుతాయని, ఈ గ్రహాల్లో ఒకదానిపై ఆవిరితో కూడిన రాళ్ల వర్షం కురుస్తుండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈ తీవ్రతకు టైటానియం వంటి శక్తివంతమైన లోహాలు కూడా కరిగి ఆవిరైపోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శాస్త్రవేత్తలు తమ అధ్యయనాలలో ఈ రెండు గ్రహాలకు సంబంధించిన సమాచారాన్ని అందించారు. ఈ గ్రహాల ద్వారా పాలపుంతలోని వైవిధ్యం, సంక్లిష్టత, విశిష్ట రహస్యాలను తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. ఈ గ్రహాల ద్వారా విశ్వంలోని గ్రహ వ్యవస్థ అభివృద్ధిలో వైవిధ్యాన్ని కూడా తెలుసుకోవచ్చంటున్నారు. నేచర్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక రిపోర్టులో శాస్త్రవేత్తలు హబుల్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా భూమికి 1300 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న డబ్ల్యుఏఎస్‌పీ-178b అనే గ్రహాన్ని గుర్తించామని తెలిపారు. ఈ గ్రహంపైగల వాతావరణంలో సిలికాన్ మోనాక్సైడ్ వాయువు ఉంటుంది. ఈ గ్రహంపై పగటిపూట మేఘాలు ఉండవని, అయితే రాత్రిపూట గంటకు రెండు వేల మైళ్ల వేగంతో తుఫాను గాలులు వీస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ గ్రహం దాని నక్షత్రానికి చాలా దగ్గరగా ఉంది. దీనితో పాటు, ఈ గ్రహంలోని ఒక భాగం ఎల్లప్పుడూ దాని నక్షత్రం వైపు ఉంటుంది. ఈ గ్రహానికి అవతలి వైపున ఉన్న సిలికాన్ మోనాక్సైడ్ చాలా చల్లగా ఉండడం కారణంగా మేఘాల నుంచి నీరు వెలువడేందుకు బదులుగా రాళ్ల వర్షం కురుస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది మాత్రమే కాదు ఈ గ్రహం మీద ఉదయం, సాయంత్రం వేళ్లల్లో ఉష్ణోగ్రత చాలా అధికంగా ఉంటుంది. దీని వల్ల రాళ్లు కూడా ఆవిరిగా మారుతాయి. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, మొదటిసారి సిలికాన్ మోనాక్సైడ్ ఇలాంటి రూపంలో కనిపించింది. మరొక అధ్యయనం ఆస్ట్రోఫిజికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యింది. దీనిలో అత్యంత వేడి వాతావరణం కలిగిన గ్రహాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారనిపేర్కొన్నారు. 400 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్రహానికి కేఈఎల్టీ-20బీ అని పేరు పెట్టారు. ఇది కూడా చదవండి: భారత్-శ్రీలంకల ‘కచ్చతీవు’ వివాదం ఏమిటి? ఇందిరాగాంధీని ఎందుకు తప్పుబడుతున్నారు? -
పచ్చ గూండాలు పేట్రేగిన వేళ..
సాక్షి, చిత్తూరు, పుంగనూరు (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా పుంగనూరులో ఇటీవల తెలుగుదేశం పార్టీ సృష్టించిన విధ్వంసంలో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. పక్కా ప్రణాళిక, భారీ వ్యూహంతోనే ఈ దాడులు జరిగినట్లు స్పష్టమవుతోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువైన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపడం, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రాజకీయంగా అణగదొక్కటమే లక్ష్యంగా టీడీపీ ఈ దాడులకు వ్యూహ రచన చేసింది పక్కా ప్రణాళికతో జిల్లా నలుమూలల నుంచి టీడీపీకి చెందిన గూండాలను ఎంపిక చేసి మరీ పుంగనూరుకు తెచ్చినట్లు వెల్లడైంది. వారిపై జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో అనేక కేసులు ఉన్నాయి. వీరిని ముందుగానే మారణాయుధాలతో సహా పుంగనూరులో మోహరించారు. చంద్రబాబు పర్యటనను కూడా వ్యూహాత్మకంగా పుంగనూరుకు వచ్చేలా మార్పు చేశారు. ముందస్తు షెడ్యూల్లో లేకపోయినా, పోలీసుల అనుమతి లేకుండానే దాడుల కోసమే ఆయన పుంగనూరు వచ్చారు. చంద్రబాబు వస్తూనే టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టడం, వెనువెంటనే విధ్వంసం సృష్టించడం.. అంతా వ్యూహం ప్రకారం చేశారు. కర్రలు, రాళ్లు, మద్యం సీసాలు, ఇతర మారణాయుధాలతో వందల సంఖ్యలో పోలీసులపై విరుచుకుపడ్డారు. ఈ దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు. ఓ కానిస్టేబుల్ ఓ కంటి చూపు కోల్పోయాడు. అయితే, పోలీసులు చాలా సహనంతో వ్యవహరించడంతో టీడీపీ వ్యూహం బెడిసికొట్టింది. పుంగనూరు విధ్వంసంలో ఇప్పటి వరకు ఏడు నేరాలకు సంబంధించి మొత్తం 277 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో పాల్గొన్న వారిని పోలీసులు ఆధారాలతో సహా గుర్తించారు. వారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మంగళవారం వరకు 90 మందిని అరెస్ట్ చేశారు.వారికి కోర్టు రిమాండ్ విధించడంతో కడప సెంట్రల్ జైలుకు తరలించారు. పోలీసులపై దాడి కేసులో ప్రధాన నిందితుడు చల్లా బాబుతోపాటు కుట్ర, వ్యూహ రచన, దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న పలువురిని పోలీసులు గుర్తించారు. వారి గత చరిత్రను కూడా నిశితంగా పరిశీలించారు. దాడుల్లో భాగస్వాములైన వారిలో ఎక్కువ మంది పాత నేరాల చరిత్ర చూసి పోలీసులే షాక్ అయ్యారు. వారిలో కొందరి నేర చరిత్ర ఇదీ.. 1. నేరాల్లో ఘనుడు చల్లా బాబు పుంగనూరులో దాడి కేసులో ప్రధాన సూత్రదారి, పాత్రదారి ఆ నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి చల్లా బాబు అలియాస్ చల్లా రామచంద్రారెడ్డి అని పోలీసులు తేల్చారు. దాడులకు కుట్ర పన్నడం, వ్యూహాన్ని అమలుపరచడంలో ఇతనిదే ప్రధాన పాత్రగా పోలీసులు నిర్ధారించారు. చల్లా బాబు గత చరిత్ర అంతా నేర పూరితమేనని పోలీసు విచారణలో తేలింది. పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయి. ఇతను ఆలయ భూములు, ప్రభుత్వ భూముల ఆక్రమణకు పాల్పడినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. చల్లా బాబుపై ఉన్న పాత కేసుల్లో మచ్చుకు కొన్ని.. 1.1985లో రొంపిచెర్ల పోలింగ్ స్టేషన్‌పై బాంబు దాడి కేసు 2. రొంపిచెర్ల క్రైం నం.368, 2021లో ఐపీసీ సెక్షన్లు, 143, 188, 341,269, 270, 290 రెడ్‌విత్ 149 ఐపీసీ, సెక్షన్ 3 ఈడీయాక్ట్ 3. క్రైం నం.18–2021 ఐపీసీ సెక్షన్లు 353, 506 రెడ్‌విత్ 34 కింద కేసు 4. క్రైం నం.8–2022 ఐపీసీ సెక్షన్లు 188, 341 కింద చౌడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు 5. క్రైం నం.89–2023 ఐపీసీ సెక్షన్లు 143, 341, 506 రెడ్‌విత్ 149 కింద సోమల పీఎస్‌లో కేసు 6. క్రైం నం.72–2022 ఐపీసీ సెక్షన్లు› 341, 143, 290 రెడ్‌విత్ 149 కింద కేసు 7. క్రైం నం.26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రెడ్‌విత్ 149 కింద కల్లూరు పోలీసు స్టేషన్లో కేసు 2. టీఎం బాబు (40) ఊరు: తొట్లిగానిపల్లి, గుడిపల్లి, కుప్పం నియోజకవర్గం పార్టీలో హోదా: టీడీపీ మండల అధ్యక్షుడు పాత కేసులివీ.. 1. క్రైం నం.30–2009లో గుడిపల్లి పీఎస్‌లో పరిధిలో జరిగిన కేసు 2. క్రైం నం.171 ఇ, 506, 8–బి–1, ఏపీపీయాక్ట్ 3. క్రైం నం.165–2010 ఐపీసీ 392 సెక్షన్ల కింద కుప్పం పోలీస్ స్టేషన్లో కేసు 3. క్రైం నం.38–2022 ఐపీసీ సెక్షన్ 448, 427, 323, 324, రెడ్‌విత్ 34 కింద గుడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు 3. భాష్యం విశ్వనాథనాయుడు (45) మండలం: శాంతిపురం, కుప్పం నియోజకవర్గం పార్టీ హోదా: టీడీపీ మండల అధ్యక్షుడు పాత కేసులు: 3 కేసుల్లో నిందితుడు 1. క్రైం నం.191–2021, ఐపీసీ సెక్షన్లు 143, 341, 506, 188, 59 డీఎంఏ, ఈడీఏ కింద రాళ్ళబుదుగూరు పోలీస్ స్టేషన్లో కేసు 2. క్రైం నం.73–2022, ఐపీసీ సెక్షన్లు 177 ,182, 155 సెక్షన్ల కింద రెండో కేసు 3. రామకుప్పం పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైం నం.130–2022 , ఐపీసీ సెక్షన్లు 143, 147, 148, 307, 324తో పాటు రెడ్‌విత్ 149 కింద కేసు 4. జి.దేవేంద్ర (31) ఊరు: గోపన్నగారిపల్లి, పులిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం పార్టీలో హోదా: తెలుగు యువత మండల అధ్యక్షుడు పాత కేసులు: కల్లూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో క్రైం నం.26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రెడ్‌విత్ 149 కింద కేసు నమోదైంది. 5. లెక్కల ధనుంజయనాయుడు ఊరు: కొక్కువారిపల్లి, పులిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం పార్టీలో హోదా: టీడీపీ రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ ఆర్గనైజింగ్ సెక్రటరీ పాత కేసులు: రెండుకేసుల్లో నిందితుడు 1. క్రైం. నం. 26–2022 నంబరుతో కల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఐపీసీ సెక్షన్ 341, 506, 353, 143, 147, 148, రెడ్‌విత్ 149 కింద కేసు నమోదు 2. క్రైం.నం. 368– 2021. రొంపిచెర్ల పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్లు 143, 188, 341, 269, 270, 290 రెడ్‌విత్ 149 ఐపీసీ, సెక్షన్ 3 ఈడీ యాక్ట్ కింద కేసులు 6. ముల్లంగి వెంకటరమణ (52) ఊరు: ముల్లంగివారిపల్లి, పులిచెర్ల మండలం పార్టీలో హోదా: టీడీపీ ఎస్సీ సెల్ స్టేట్ ప్రిన్సిపల్ సెక్రటరీ పాత కేసులు: మూడు కేసుల్లో నిందితుడు 1.క్రైం. నం. 26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148, రెడ్‌విత్ 149 ఐపీసీ కింద కల్లూరు పోలీస్ స్టేషన్లో కేసు 2. ఇదే స్టేషన్ పరిధిలో క్రైం.నం. 35–2017 ఐపీసీ సెక్షన్లు 447, 427, 324తోపాటు 34 ఐపీసీ కింద కేసు నమోదు 3. ఇక్కడే క్రైం. నం. 140–2021, ఐపీసీ సెక్షన్లు 353, 341 రెడ్ విత్ 34 కింద మరో కేసు 7. నూకల నాగార్జున నాయుడు (33) ఊరు: బొడిపటివారిపల్లి, పులిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం పార్టీలో హోదా: టీడీపీ మండల యువనేత, రాష్ట్ర ఐటీ విభాగం సభ్యుడు పాత కేసులు: ఆరు కేసుల్లో నిందితుడు. రొంపిచెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు, కల్లూరులో 1 , సోమల పరిధిలో మరొక కేసు 1. క్రైం.నం. 368–2021 ఐపీసీ 134, 188, 341, 269, 270, 290 రెడ్ విత్ 149 ఐపీసీతో పాటు సెక్షన్ 3 కింద ఈడీయాక్ట్ నమోదు 2. క్రైం.నం. 2–2023 ఐపీసీ సెక్షన్లు 143, 147, 148, 506 రెడ్ విత్, 149 3. క్రైం.నం. 374–2021 ఐపీసీ సెక్షన్లు 153, 153ఏ, 120బీ, 506, 507 4. క్రైం.నం. 5–2022 ఐపీసీ సెక్షన్లు 153, 427, 290 రెడ్ విత్ 34 ఐపీసీ 5. క్రైం.నం. 26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రెడ్ విత్ 149 ఐపీసీ 6. క్రైం.నం. 149–2022 ఐపీసీ సెక్షన్లు 143, 148, 354డీ, 324, 506, 509 రెడ్‌విత్ 149 8. ఇ. క్రిష్ణమూర్తినాయుడు (55) ఊరు: రాయవారిపల్లి గ్రామం, రొంపిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం పార్టీలో హోదా: టీడీపీ మండల అధ్యక్షుడు పాత కేసులు: ఇతనిపై కల్లూరు పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి 1 క్రైం.నం. 26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 506, 353, 143, 147, 148 రెడ్‌విత్ 149 2. క్రైం.నం. 12–2021, ఐపీసీ సెక్షన్లు 353, 506, రెడ్ విత్ 34 ఐపీసీ 9. నాగిశెట్టి నాగరాజ (38) ఊరు: బొమ్మయ్యగారిపల్లి గ్రామం, రొంపిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం హోదా: మండలం తెలుగు యువత అధ్యక్షుడు పాత కేసులు: ఇతనిపై ఐదు కేసులు ఉన్నాయి. కల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 3, రొంపిచెర్లలో మరో రెండు కేసులు 1. క్రైం.నం. 140–2021, ఐపీసీ సెక్షన్లు 353, 341 రెడ్‌విత్ 34 2. క్రైం.నం. 368–2021 ఐపీసీ సెక్షన్లు 143, 188, 341, 269, 270, 290 రెడ్‌విత్ 149తో పాటు సెక్షన్ 3 ఈడీ యాక్ట్ 3. క్రైం.నం. 26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రెడ్ విత్ 149 ఐపీసీ. 4. క్రైం.నం. 2–2023 ఐపీసీ సెక్షన్లు 143, 147, 148, 506 రెడ్‌విత్ 149 ఐపీసీ. 5. క్రైం.నం. 350–2021 ఐపీసీ సెక్షన్లు 151 సీఆర్పీసీ 10. కె.సహదేవుడు (50) ఊరు: బొమ్మయ్యగారిపల్లి గ్రామం, రొంపిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం పార్టీలో హోదా: రొంపిచెర్ల మండలం బొమ్మయ్యగారి పల్లి ఎంపీటీసీ పాత కేసులు: రొంపిచెర్ల, మరికొన్ని స్టేషన్లలో 8 కేసుల్లో నిందితుడు 1. క్రైం.నం. 89–2014 ఐపీసీ సెక్షన్లు 447, 506 రెడ్‌విత్ 34 2. క్రైం.నం. 331–2020 సీఆర్పీసీ 151 3. క్రైం.నం. 365–2020 సీఆర్పీసీ 151 4. క్రైం.నం. 14–2021 ఐపీసీ సెక్షన్లు 188 , 353, 506, రెడ్ విత్ 34 5. క్రైం.నం. 356–2021 ఐపీసీ సెక్షన్ 151 6. క్రైం.నం. 368–2021 ఐపీసీ 143, 188, 341, 269, 270, 290 రెడ్‌విత్ 149 7. క్రైం.నం. 9–2022 ఐపీసీ సెక్షన్లు 447, 427, 506, 143 రెడ్‌విత్ 149 8. క్రైం.నం. 10–2022 ఐపీసీ సెక్షన్లు 341, 323, 506, 153 11. ఉయ్యాల రమణ (44) ఊరు: బొమ్మయ్యగారిపల్లి, రొంపిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం హోదా: రొంపిచెర్ల మండలం టీడీపీ అధ్యక్షుడు పాత కేసులు: కల్లూరు , రొంపిచెర్ల, సోమల పోలీస్స్టేషన్ల పరిధిలో 8 కేసుల్లో నిందితుడు 1. క్రైం.నం. 140–2021 ఐపీసీ సెక్షన్ 353, 341 రెడ్ విత్ 34 2. క్రైం.నం. 368 – 2021 ఐపీసీ సెక్షన్లు 143, 188, 341, 269,270, 290 రెడ్‌విత్ 149 ఐపీసీతోపాటు 3 ఈడీ యాక్ట్ 3. క్రైం.నం. 2–2023 ఐపీసీ సెక్షన్లు 143, 147, 148, 506 రెడ్‌విత్ 149 4. క్రైం.నం.15–2021 ఐపీసీ సెక్షన్లు 188, 506 రెడ్‌విత్ 34 ఐపీసీ 5. క్రైం.నం.40 – 2014 ఐపీసీ సెక్షన్లు 307, 326, 324 రెడ్‌విత్ 34 6. క్రైం.నం. 26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రెడ్‌విత్ 149 7. క్రైం.నం.140–2021 ఐపీసీ సెక్షన్లు 353, 341 రెడ్‌విత్ 34 8. క్రైం.నం. 89–2023 ఐపీసీ సెక్షన్లు 143, 341, 506 రెడ్‌విత్ 149 ఏ ఒక్కర్నీ వదలం పుంగనూరు దుశ్చర్యలో పోలీసుల రక్తం కళ్ల చూసిన ప్రతి ఒక్కరినీ వదలం. చట్ట ప్రకారం ముందుకెళ్తాం. బందోబస్తు డ్యూటీ కోసం వచ్చిన పోలీసులను మట్టుపెట్టాలని చూడటం, రాళ్లు, మద్యం బాటిళ్లు విసరడంపై మా వద్ద అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. వీడియో ఫుటేజీల ఆధారంగా ఇప్పటికే పలువురిని అరెస్టు చేశాం. ప్రధాన నిందితుల కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఆరోజు పోలీసులు అడ్డుపడకపోతే పుంగనూరు టౌన్లోకి పోయి విధ్వంసం సృష్టించేవాళ్లు. నిందితులపై చట్టరీత్యా చర్యలు తప్పవు.– వై.రిషాంత్‌రెడ్డి, ఎస్పీ, చిత్తూరు -
అక్కడ దేవుడికి నైవేద్యంగా రాళ్లే పెడతారు! ఎందుకంటే.
మన హిందూ దేవాలయాల్లో ఒక్కో దేవాలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. చాలామంది భక్తులు కూడా ఆ దేవాలయ ప్రసాదాలంటే చాలా ఇష్టపడతారు కూడా. అందుకోసం గుడికి వచ్చేవాళ్లు కూడా ఉన్నారు. ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధం. ఈ దేవాలయంలో దేవుడికి రాళ్లనే నైవేద్యంగా పెడతారట. పైగా అలా చేస్తే అనుకున్న పని ఎలాంటి ఆటంకం లేకుండా అయిపోతుందని అక్కడ వారి నమ్మకం. వివరాల్లోకెళ్తే..శ్రీకాకుళం జిల్లా షేర్ మహ్మద్‌పురం గ్రామంలో ఈ వింత ఆచారం నెలకొంది. అక్కడ గ్రామస్తులు దేవుడికి నైవేద్యంగా ఏదోఒక రాయిని సమర్పిస్తారు. ఇది కొన్నేళ్లుగా వస్తున్న ఆచారం అని చెబుతున్నారు స్థానికులు. వాళ్లు ఆ దేవుడిని 'వీరుడి తాతగా' కొలుస్తారు. నిజానికి అక్కడ దేవాలయం గానీ దేవుని విగ్రహం కానీ ఉండదు. అక్కడ గుట్టగా.. భక్తులు నైవేద్యంగా సమర్పించిన రాళ్లు మాత్రమే కనిపిస్తాయి. అక్కడే సమీపంలో ఉండే వేపచెట్టునే దేవుడిగా పూజిస్తారు. ఈ దేవుడిని వీరుడి తాతగా పిలుస్తుంటారు. ఆ ప్రాంతంలో కుమ్మరి వాళ్లు ఉండేవారని, ఈ గ్రామంలో జరిగే పెళ్లిళ్లకు కుండలు తయారు చేసి పెద్ద ఊరేగింపుగా వచ్చి ఈ ప్రాంతంలో ఉండేవారని చెబుతున్నారు. ఆ తర్వాత క్రమేణ ఆ ప్రాంతాన్ని వీరుడి తాతగా కొలవడం ప్రారంభించారు. ఆ దారి వెంబడి వెళ్తూ ఆ స్వామికి ఏదో ఒక రాయిని సమర్పించి వెళ్తే తక్షణమే పని అవుతుందని వారి ప్రగాఢ నమ్మకం. అది కేవలం ఆ ఊరికి మాత్రమే పరిమితం కాలేదు. చుట్టు పక్కడ గ్రామస్తులు సైతం ఇక్కడకు వచ్చి రాళ్లను సమర్పిస్తుంటారు. ఈ ప్రదేశం సరిగ్గా ప్రధాన రహదారికి పక్కనే ఉంది. అత్యంత విలువైన ఈ ప్రదేశం పక్కన ఉన్న కొంత జాగా(నాలుగుసెంట్లు భూమిని) ఆ దేవుడి కోసం గ్రామస్తులు వదిలేశారు. ఈ ప్రదేశంలోనే పెళ్లిళ్లు కూడా చేసుకుంటారని చెబుతున్నారు అక్కడి గ్రామస్తులు. వినడానికి నమ్మశక్యం కాని విధంగా వింతగా ఉంది కదూ ఈ ఆచారం. ఏదీఏమైన మనిషి నమ్మకమే దేవుడు అని మరోసారి ఈ ఘటన ద్వారా తేటతెల్లమైంది. (చదవండి: యావత్తు సృష్టిని ఒక్క గంటలో సృష్టించి..'స్త్రీ మూర్తి'ని మాత్రం ఏకంగా అన్ని రోజులా?) -
ఉద్రిక్తతలకు దారితీసిన దర్గా కూల్చివేత.. పోలీసులపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు..
గుజరాత్:గుజరాత్‌లోని జునాగఢ్‌లో అక్రమంగా నిర్మించిన దర్గా కూల్చివేత వ్యవహారం ఉద్రిక్తతలకు దారితీసింది. దర్గా కూల్చివేత నోటీసులు జారీ చేయడానికి వెళ్లిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పోలీసులపై అందోళనకారులు రాళ్లు రువ్వారు. ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేశారు. ఈ అల్లర్లలో ఓ వ్యక్తి మృతి చెందగా..పలువురు పోలీసులు గాయపడ్డారు. దర్గాను అక్రమంగా నిర్మించారని జునాగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ గుర్తించింది. ఈ క్రమంలో అధికారులు దర్గాపై కూల్చివేతకు సంబంధించిన నోటీసులను జారీ చేయడానికి వెళ్లగా.. ఆందోళనకారులు అధికారులను అడ్డగించారు. అనంతరం అధికారులపై దాడులకు పాల్పడ్డారు. పోలీసు పోస్టును కూల్చివేశారు. దాదాపు 300 మంది నిరసనకారులు దాడిలో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు భాష్పవాయు గోళాలను ఉపయోగించారు. ఈ అల్లర్లలో ఓ వ్యక్తి మరణించాడు. ముగ్గురు పోలీసులతో సహా ఓ డీఎస్పీ తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో 174 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఇదీ చదవండి:Cyclone Biparjoy: బలహీనపడిన బిపర్జోయ్.. గుజరాత్ నుంచి రాజస్తాన్ వైపు పయనం -
ప్రపంచంలోని 10 ప్రసిద్ధి చెందిన టొంబ్స్
-
పట్టాలపై బుడ్డోడి తింగరిపని
-
కలకలం రేపుతున్న వీడియో.. రైలు పట్టాలపై రాళ్లు పెట్టి
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): రైలు పట్టాలపై ఒక బాలుడు రాళ్లు పెట్టిన వీడియో ఒకటి కర్ణాటక రాష్ట్రంలో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో ఒక బాలుడు రైలు పట్టాలపై రాళ్లను వరుసగా పేర్చాడు. కొందరు ఆ బాలుడిని పట్టుకుని రాళ్లు ఎవరు పెట్టమన్నారని అడుగుతున్నారు. అయితే తనకు ఎవరూ ఇలా చేయమని చెప్పలేదని పోలీసులకు అప్పగించవద్దని ఏడుస్తూ వేడుకోవడం, తరువాత ఆ బాలుడిని వదిలేయడం రికార్డయ్యాయి. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందీ తెలీడం లేదు. ఈ వీడియోను కేంద్ర రైల్వే శాఖమంత్రి అశ్విన్ వైష్ణవ్ రైల్వే ఉన్నతాధికారులకు ట్యాగ్ చేసి ఇది చాలా సీరియస్ విషయమని, దీనికి సంబంధించి వివరాలు తెలుసుకోవాలని ఆదేశించారు. కాగా ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటకలో ఓ బాలుడు రైలు పట్టాలపై రాళ్లు పెట్టిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే ఓ వ్యక్తి సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందనే చెప్పాలి. ⚠️ Shocking: Another #TrainAccident Averted. An underage boy was caught sabotaging the railway Track this time in #Karnataka. We have tens of thousands of Kms of railway tracks and forget adults now even kids are being used for sabotaging and causing deaths. This is a serious… pic.twitter.com/URe9zW4NgG — Arun Pudur (@arunpudur) June 5, 2023 చదవండి: ఒడిశా రైలు ప్రమాదం: మృతదేహాలలో నుంచి ఒక చేయి అతనిని పట్టుకోగానే... -
రీ సర్వేలో సర్కారు స్పీడు
సాక్షి, అమరావతి: భూముల రీ సర్వేతో కొత్త చరిత్రను లిఖిస్తున్న ప్రభుత్వం మరో రికార్డు సృష్టించింది. తొలి విడత రీ సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లో సరిహద్దు రాళ్లు పాతే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. వ్యవసాయ భూముల సరిహద్దులను చూపుతూ రాళ్లు వేసినప్పుడు మాత్రమే సమగ్ర భూ సర్వే పూర్తయినట్లని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేయటంతో సర్వే శాఖ వేగంగా దాన్ని పూర్తి చేసింది. గత నెలాఖరుకి 13 లక్షల రాళ్లు పాతిన యంత్రాంగం ఆ తర్వాత 20 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 12.80 లక్షలకుపైగా రాళ్లు పాతి, కొత్త రికార్డు సృష్టించింది. ఈ నెల 20వ తేదీకల్లా 2 వేల గ్రామాల్లో రాళ్లు పాతే పని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నా మూడు రోజుల ముందే ఆ పని పూర్తి చేశారు. ఇందుకోసం సర్వే శాఖ వెయ్యి రోవర్లను సమకూర్చుకొంది. మరికొన్నింటిని అద్దెకు తీసుకొంది. రోజుకు సగటున 40 నుంచి 50 వేల రాళ్లను పాతారు. 2 వేల గ్రామాల్లో అన్ని దశల సర్వే పూర్తి రాష్ట్రంలోని 17 వేలకుపైగా గ్రామాలకుగాను తొలి విడతగా 2 వేల గ్రామాల్లో రీ సర్వే అన్ని దశలు పూర్తయింది. ఈ గ్రామాలకు కొత్త రెవెన్యూ రికార్డులు (ఆర్ఓఆర్) సైతం తయారయ్యాయి. ఆ గ్రామాలకు చెందిన 7.50 లక్షల మంది రైతులకు భూ హక్కు పత్రాలను జారీ చేశారు. చివరిగా రైతుల భూముల సరిహద్దుల్లో సర్వే రాళ్లు పాతడం కూడా పూర్తి చేయడం ద్వారా ఈ 2 వేల గ్రామాలను రీసర్వే మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దారు. ఖర్చంతా ప్రభుత్వానిదే సాధారణంగా రైతులు భూమిని సర్వే చేయించుకుని రాళ్లు పాతించడం పెద్ద ప్రయాస. ఖర్చు ఎక్కువ. అయితే, ప్రభుత్వం రైతులపై పైసా కూడా భారం పడకుండా మొత్తం తానే భరించింది. సర్వే పూర్తి చేసి ఉచితంగా రాళ్లు పాతి రైతులకు భూములు అప్పగించింది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా ఇందుకోసం అవసరమైన రాళ్లను కోట్ల ఖర్చుతో తయారు చేయించింది. రాళ్ల తయారీకి ప్రత్యేకంగా యూనిట్లు పెట్టి మరీ అవసరమైన సైజుల్లో రాళ్లను తయారు చేసింది. 25 లక్షలకు పైగా రాళ్లు సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లో మొత్తం 25 లక్షలకు పైగా రాళ్లను పాతారు. మూడు గ్రామాలు కలిసే చోట (ట్రై జంక్షన్) ఏ క్లాస్ పెద్ద రాళ్లు 6,970 పాతారు. ప్రతి భూకమతం హద్దుల్లో బి క్లాస్ చిన్న రాళ్లు 25.73 లక్షలు పాతారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలోని 354 గ్రామాల హద్దుల్లో 4.48 లక్షల రాళ్లు పాతారు. విజయనగరం జిల్లాలో 179 గ్రామాల్లో 2.48 లక్షలు, పల్నాడు జిల్లాలో 70 గ్రామాల్లో 2.08 లక్షలు, కాకినాడ జిల్లాలో 121 గ్రామాల్లో 1.86 లక్షలు, చిత్తూరు జిల్లాలోని 134 గ్రామాల్లో 1.44 లక్షల రాళ్లు పాతారు. ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా గ్రానైట్, శాండ్ స్టోన్, లైమ్ స్టోన్, నాప రాళ్లను వినియోగించారు. 70 శాతానికిపైగా గ్రానైట్ రాళ్లనే పాతారు. -
రోజుకు 50 వేల సర్వే రాళ్లు
సాక్షి, అమరావతి: భూముల రీ సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లో సర్వే రాళ్లు పాతే కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది. రైతులపై పైసా భారం లేకుండా ప్రభుత్వ ఖర్చుతోనే సర్వే చేసిన భూముల్లో రాళ్లు పాతుతున్నారు. ఇప్పటికే విశాఖపట్నం, గుంటూరు, నంద్యాల, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఈ కార్యక్రమం వంద శాతం పూర్తయింది. మిగతా జిల్లాల్లోనూ వేగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రోజుకు 50 వేల రాళ్లు పాతడమే లక్ష్యంగా సర్వే సెటిల్మెంట్, రెవెన్యూ యంత్రాంగాలు పనిచేస్తున్నాయి. ఈ నెల 18వ తేదీన 54,538 రాళ్లను రైతుల భూముల సరిహద్దుల్లో పాతారు. ఆరోజు ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే 8 వేలకుపైగా రాళ్లను పాతారు. ఆ తర్వాత నుంచి ప్రతి రోజూ 50 వేలకు తగ్గకుండా రాళ్లను పాతుతున్నారు. ఇందుకోసం జిల్లాలవారీగా షెడ్యూల్‌ను రూపొందించారు. దాని ప్రకారం రోజూ రాళ్లు పాతుతున్నారో లేదో పర్యవేక్షిస్తున్నారు. ఒకేసారి భారీగా సర్వే రాళ్లు పాతుతుండడంతో ఉన్న రోవర్లు సరిపోవడంలేదు. దీంతో సర్వే శాఖ అదనంగా వెయ్యి రోవర్లను సమకూర్చుకుంది. వచ్చే నెల 20లోగా సర్వే పూర్తయిన గ్రామాలన్నింటిలో ఈ కార్యక్రమం పూర్తి చేయాలని లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈ గ్రామాల్లో 25.80 లక్షల రాళ్లు పాతాల్సి ఉండగా ఇప్పటివరకు 14 లక్షలకుపైగా రాళ్లు పాతారు. రికార్డు స్థాయిలో సర్వే రాళ్లు పాతే కార్యక్రమం నడుస్తోందని సర్వే, సెటిల్మెంట్ కమిషనర్ సిద్ధార్థ జైన్ తెలిపారు. రీ సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లోని రైతులకు భూహక్కు పత్రాల పంపిణీ చివరి దశకు వచ్చిందని చెప్పారు. రాళ్లు కూడా పాతడం పూర్తయితే రీ సర్వే ప్రాజెక్టులో ఈ గ్రామాలు మోడల్‌గా ఉంటాయని తెలిపారు. కోటీ ఇరవై ఐదు లక్షల సర్వే రాళ్లు అవసరం సర్వే కోసం రాష్ట్రవ్యాప్తంగా కోటీ ఇరవై ఐదు లక్షల సర్వే రాళ్లు అవసరమవుతాయని అంచనా. అన్ని రాళ్లను సమకూర్చే సామర్థ్యం ఉన్న ఫ్యాక్టరీలు రాష్ట్రంలో, సమీప రాష్ట్రాల్లోనూ లేవు. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే 4 సర్వే రాళ్ల కర్మాగారాలు ఏర్పాటు చేసి రాళ్లు ఉత్పత్తి చేస్తోంది. సర్వే రాళ్లు తయారు చేయడానికి అవసరమైన గ్రానైట్ రాళ్లను గనుల శాఖ ఈ ఫ్యాక్టరీలకు సమకూరుస్తోంది. వాటిని 2 సైజుల్లో తయారు చేసి సర్వే శాఖకు అప్పగిస్తున్నారు. -
పోలవరం ఎఫ్ఆర్ఎల్ సర్వేరాళ్లు 2008లోనే ఏర్పాటు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో గరిష్ట మట్టం (ఎఫ్ఆర్ఎల్) 45.72 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ చేసినప్పుడు ముంపునకు గురయ్యే ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో 2008లోనే గుర్తించి, సర్వేరాళ్లు ఏర్పాటుచేశామని తెలంగాణ అధికారులకు ఆ ప్రాజెక్టు సీఈ సుధాకర్‌బాబు మరోసారి తేల్చిచెప్పారు. ఇందుకు సంబంధించిన రికార్డులు ఈనెల 14లోగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి ఇస్తామన్నారు. ఆ రికార్డులను పరిశీలించాక కూడా ఏమైనా అనుమానాలుంటే క్షేత్రస్థాయిలో ఎఫ్ఆర్ఎల్ సర్వేరాళ్లను చూపించడానికి తాము సిద్ధమని స్పష్టం చేశారు. ఎఫ్ఆర్ఎల్ మ్యాప్, ముంపు ప్రాంతాల్లో వేసిన సర్వేరాళ్ల (అక్షాంశాలు, రేఖాంశాలతో కూడిన) వివరాలను ఏపీ ప్రభుత్వం అందజేశాక మరోసారి సమావేశం నిర్వహిస్తామని పీపీఏ సభ్య కార్యదర్శి ఎం.రఘురాం రెండు రాష్ట్రాల అధికారులకు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ (వెనుక జలాలు) ప్రభావం వల్ల ముంపుపై తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల అనుమానాలను నివృత్తి చేయడానికి ఈ నెల 3న కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ కుస్విందర్‌సింగ్ వోరా అధ్యక్షతన సాంకేతిక కమిటీ మూడోసారి సమావేశమైంది. గోదావరికి గరిష్టంగా 50 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందనే అంచనాతో పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ప్రభావంపై సీడబ్ల్యూసీ అధ్యయనం చేసిందని, అందులో ఎలాంటి ముంపు ముప్పు ఉండదని తేలిందని ఎత్తిచూపుతూ ఛత్తీస్‌గఢ్, ఒడిశా అభ్యంతరాలను తోసిపుచ్చారు. సుప్రీంకోర్టు గతంలో గోపాలకృష్ణన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సాధికార కమిటీ కూడా సీడబ్ల్యూసీ అధ్యయన నివేదికనే ఖరారు చేసిందని గుర్తుచేశారు. పోలవరం ఎఫ్‌ఆర్‌ఎల్‌పై ఏపీ, తెలంగాణ అధికారులు అధ్యయన నివేదికలను మార్చుకుని, చర్చించి.. తెలంగాణ అభ్యంతరాలను నివృత్తి చేయాలని పీపీఏను సీడబ్ల్యూసీ చైర్మన్ వోరా ఆదేశించారు. ఆ మేరకు బుధవారం పీపీఏ సభ్య కార్యదర్శి ఎం.రఘురాం రెండు రాష్ట్రాల అధికారులతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఏపీ తరఫున పోలవరం సీఈ సుధాకర్‌బాబు, ఎస్ఈ నరసింహమూర్తి, తెలంగాణ తరఫున ఈఎన్సీ కె.నాగేంద్రరావు, ఆ రాష్ట్ర అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరోసారి భేటీ.. పోలవరం ప్రాజెక్టు ఎఫ్ఆర్ఎల్ మ్యాపు, సర్వేరాళ్లకు సంబంధించిన రికార్డులు ఏపీ అధికారులు అందజేసిన తర్వాత.. రెండు రాష్ట్రాల అధికారులతో భౌతికంగా సమావేశం నిర్వహించాలని తెలంగాణ ఈఎన్సీ నాగేంద్రరావు చేసిన ప్రతిపాదనను పీపీఏ సభ్య కార్యదర్శి రఘురాం ఆమోదించారు. ఏపీ అధికారులు ఇచ్చే రికార్డులను తెలంగాణ అధికారులకు పంపుతామన్నారు. ఆ తర్వాత రెండు రాష్ట్రాల అధికారులతో చర్చిస్తామని చెప్పారు. అప్పటికీ తెలంగాణ సర్కార్ సంతృప్తి చెందకపోతే.. ఎఫ్ఆర్ఎల్ రాళ్లను క్షేత్రస్థాయిలో చూపించడానికి సంయుక్తంగా వెళదామని ఆయన పేర్కొన్నారు. ఎఫ్ఆర్ఎల్ అందరికీ తెలిసిందే.. పోలవరం ఎఫ్ఆర్ఎల్ పరిధిలోకి కిన్నెరసాని, ముర్రేడువాగులతోపాటు మరో ఆరువాగులు వస్తాయని.. వాటిలోకి బ్యాక్‌వాటర్ ఎగదన్ని తమ రాష్ట్రంలో బూర్గుంపహాడ్ మండలంలో 899 ఎకరాల భూమి ముంపునకు గురవుతోందని తెలంగాణ ఈఎన్సీ నాగేంద్రరావు చెప్పారు. ఇందుకు సంబంధించిన రికార్డులను పీపీఏ ద్వారా ఏపీ అధికారులకు అందజేశారు. కిన్నెరసాని, ముర్రేడువాగులపై పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావంపై సీడబ్ల్యూసీ అధ్యయనం చేసిందని, ఆ నివేదిక తెలంగాణ అధికారుల వద్ద కూడా ఉందని పోలవరం సీఈ సుధాకర్‌బాబు గుర్తుచేశారు. పోలవరం ఎఫ్‌ఆర్‌ఎల్‌ను 2008లోనే గుర్తించి.. ముంపునకు గురయ్యే ప్రాంతాలను అక్షాంశాలు, రేఖాంశాలతో గుర్తించి.. సర్వేరాళ్లు కూడా ఏర్పాటు చేశామన్నారు. ఇందుకు సంబంధించిన రికార్డులు రాష్ట్ర విభజన నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నాయని, వాటిని సమీకరించి ఈనెల 14న అందజేస్తామని చెప్పారు. దీనిపై తెలంగాణ ఈఎన్సీ స్పందిస్తూ పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావం వల్ల ముంపు ప్రాంతంపై ఏపీ ప్రభుత్వం వాస్తవాలను దాచేస్తోందని, అందువల్లే రికార్డులు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఎఫ్ఆర్ఎల్కు సంబంధించిన రికార్డులన్నీ సీడబ్ల్యూసీ వద్ద, తెలంగాణ అధికారుల వద్ద ఉన్నాయని.. వాస్తవాలను దాచాల్సిన అవసరం తమకు లేదని పోలవరం సీఈ సుధాకర్‌బాబు స్పష్టం చేశారు. బూర్గుంపహాడ్‌లో ముంపునకు గురయ్యే 899 ఎకరాల భూమిని కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిందని, దాన్ని ఏపీకి అప్పగించే ప్రక్రియలో జాప్యం జరుగుతోందని గుర్తుచేశారు. -
అదృష్టం వరించే రాళ్లంటూ వంచన
కర్ణాటక: సాలిగ్రామ అనే రాయిని అదృష్టం రాళ్లు అంటూ నమ్మించి వంచనకు పాల్పడుతున్న మనోజ్, ఆదిత్యసాగర్ అనే వ్యక్తులను అరెస్ట్‌చేసినట్లు సీసీబీ జాయింట్ పోలీస్‌కమిషనర్ డాక్టర్ ఎస్డీ.శరణప్ప తెలిపారు. నిందితులు రాజాజీనగర డాక్టర్ రాజ్కుమార్రోడ్డులోని ప్రైవేటు హోటల్లో బస చేశారు. వినియోగదారులను అక్కడకు పిలిపించి గుజరాత్‌లోని గోమతి నది నుంచి సాలిగ్రామ రాళ్లు తెప్పించామని, ఇవి విష్ణురూపమని, వీటిని ఇంట్లో ఉంచుకుంటే అదృష్టమని, వీటిని రూ.2కోట్లకు విక్రయిస్తామని చెప్పారు. పక్కా సమాచారంతో శుక్రవారం సీసీబీపోలీసులు దాడిచేసి నిందితులను అరెస్ట్ చేశారు. సాలిగ్రామ రాళ్లను స్వాదీనం చేసుకున్నారు. -
అయోధ్య విగ్రహాల కోసం.. సాలిగ్రామ శిలలతోనే ఎందుకంటే..
లక్నో: ఉత్తర ప్రదేశ్ అయోధ్య రామాలయం కోసం భారీ రాతి శిలలు.. గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకున్నాయి. ఆదివారం నేపాల్ నుంచి బయల్దేరిన ట్రక్కు.. ఎలాంటి అవాంతరాలు లేకుండా ఇవాళ(గురువారం ఫిబ్రవరి 2) అయోధ్యలో అడుగుపెట్టింది. పూజారులు, స్థానికులు దండలేసి.. ఆ పవిత్రమైన రాళ్లను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అప్పజెప్పారు. వాటిని రామ్ సేవక్ పురంలో భద్రపరిచారు ట్రస్ట్ నిర్వాహకులు. మరి వీటికి ఎందుకంత ప్రత్యేకతో చూద్దాం.. ప్రధాన ఆలయంలోని శ్రీరామ, జానకీ విగ్రహాలను చెక్కేందుకు వీటిని ఉపయోగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రెండు రాళ్లలో ఒకటి 30 టన్నులు, మరొకటి 15 టన్నుల వరకు బరువు ఉంటాయని శ్రీ రామ జన్మభూమి తీర్థ ట్రస్టు జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ తెలిపారు. నేపాల్‌లోని మయాగ్డి-ముస్తాంగ్ జిల్లాల గుండా ప్రవహించే కలి గండకి నది ఒడ్డున ఉన్న జలపాతం చెంత నుంచి ఈ రెండు భారీ శిలలను తెప్పించారు. అంతకు ముందు సీత జన్మస్థలంగా భావించే జనక్‌పూర్(నేపాల్)లో వీటికి ప్రత్యేక పూజలు జరిగాయి కూడా. శాలిగ్రాముల ప్రత్యేకత ఏంటంటే.. సాలిగ్రామ (శాలిగ్రామ).. సాలిగ్రామ శిలలని కూడా పిలుస్తారు. నేపాల్ గంకీ రాష్ట్రంలో.. దామోదర్ కుండ్ నుంచి గండకీ నది ఉద్భవిస్తుంది. గండకీ నదికి ఉపనది అయిన కలి గండకీ ప్రవాహ తీరంలోనే ఇవి కనిపిస్తాయి. ఆ ప్రాంతం సముద్ర మట్టానికి సుమారు 6వేల ఫీట్ల ఎత్తులో ఉంటుంది. ఈ శిలలను విష్ణు మూర్తికి ప్రతీకలుగా భావిస్తారు. వాస్తవానికి.. ఇవి డెవోనియన్-క్రెటేషియస్ కాలానికి చెందిన అమ్మోనైట్ షెల్ శిలాజాలు. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఇవి ఇక్కడ ఉంటున్నాయి. హిందువులు ఈ శిలాజాలను పవిత్రమైనవిగా గౌరవిస్తారు. ఎందుకంటే.. మధ్వాచార్య, అస్తమూర్తి(వ్యాసదేవ) నుండి అందుకున్నాడని, అందుకు వాటిపై ఉండే విష్ణు చిహ్నాలు, ముఖ్యంగా శంఖాన్ని పోలి ఉండడమే కారణమని భావిస్తారు. అదీ కాకుండా.. జానకీ మాత జన్మించిన నేల కావడంతో ఈ శిలలకు ప్రత్యేకత సంతరించుకుంది. అక్కడ ఉన్న శిలలకు కోట్లాది ఏళ్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఆ విగ్రహాలు కూడా.. ఉడుపి కృష్ణ మఠంలో కృష్ణ విగ్రహం, బృందావనంలోని రాధా రామన్ ఆలయం, తిరువనంతపురం పద్మనాభ స్వామి ఆలయంలోని విష్ణుమూర్తి విగ్రహం, గర్వాల్లోని బద్రినాథ్ ఆలయంలోని విగ్రహాలు సాలిగ్రామ్ శిలలతోనే తయారు చేసినట్లు తెలుస్తోంది. దేవీ భాగవతా పురాణా, బ్రహ్మవైవర్థ పురాణా, శివ పురాణాలలో సాలిగ్రామ శిలల ప్రస్తావన కూడా ఉంది. కొన్ని నివేదికల ప్రకారం.. ఆదిశంకర రచనలలోనూ.. సాలిగ్రామ(శాలిగ్రామ) శిలల గురించి ప్రత్యేక ప్రస్తావన ఉంది. తైత్తిరీయ ఉపనిషత్తులోని 1.6.1వ శ్లోకం, బ్రహ్మ సూత్రాలలోని 1.3.14 శ్లోకాలకు ఆదిశంకర తన విష్ణువు ఆరాధనలో శిల ఉపయోగించడం సుప్రసిద్ధ హిందూ ఆచారంగా ఉండేదని ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఇవేకాదు.. చాలాచోట్ల సాలిగ్రామ శిలలు కొన్ని నకిలీవి వాడుకలో ఉండడం గమనార్హం. -
సజీవ శిలలు.. ఎక్కడైనా అరుగుతాయి; ఇక్కడ పెరుగుతాయి
శిల్పాలలో జీవం ఉట్టిపడితే వాటిని సజీవ శిల్పాలు అంటారు. సజీవ శిలలేమిటి అనే కదూ మీ అనుమానం? అంతేకాదు, కాలం గడిచేకొద్ది ఈ శిలలు పెరుగుతాయి. రాళ్లు ఎక్కడైనా అరిగితే అరుగుతాయేమో గాని, పెరుగుతాయా? ఇదెక్కడి చోద్యం అనుకుంటున్నారా? నోరెళ్లబెట్టేలా చేసే ఈ చోద్యాన్ని చూడాలంటే, రుమేనియాకు వెళ్లాల్సిందే! రుమేనియా రాజధాని బుచారెస్ట్కు యాభైమైళ్ల దూరంలోని కోస్టెస్టీ గ్రామంలోను, ఆ గ్రామ పరిసరాల్లోని ఇసుక నేలల్లోను కనిపించే ఈ సజీవ శిలలను ‘ట్రోవంట్స్’ అంటారు. ప్రతి వెయ్యేళ్లకు వీటి పరిమాణం రెండు అంగుళాల మేరకు పెరుగుతుంది. పెరిగే కొద్ది ఇవి జంతువులు, వృక్షాల ఆకారాలను సంతరించుకుంటాయి. వీటి పెరుగుదల క్రమాన్ని గమనిస్తే, వృక్షకణం పెరుగుదల మాదిరిగానే ఉంటుంది. అంతేకాదు, ఈ శిలలు మరికొన్ని శిలలకు జన్మనిస్తాయి కూడా! వీటిలో కొన్ని చేతిలో ఇమిడిపోయే పరిమాణంలో ఉంటే, మరికొన్ని కొన్ని అడుగుల వ్యాసంతో భారీ పరిమాణంలో ఉంటాయి. ఈ శిలలపై చాలా ఏళ్లుగా భూగర్భ శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. రుమేనియా వచ్చే విదేశీ పర్యాటకులు వీటిని తిలకించేందుకు పనిగట్టుకుని మరీ కోస్టెస్టీ గ్రామానికి వస్తుంటారు. చదవండి: గోల్ఫ్ సామ్రాజ్యానికి రారాజు.. 'టైగర్ వుడ్స్' పేరు ఎలా వచ్చింది 'బోపన్న.. మీ భార్య చాలా అందంగా ఉంది' -
మర్కూక్‌లో ఇనుపయుగం నాటి మెన్హిర్
సాక్షి, హైదరాబాద్: ఆదిమానవుల సమూహాల్లోని ముఖ్య వ్యక్తులకు సంబంధించిన సమాధుల గుర్తు నిలువు రాళ్లు(మెన్హిర్) తాజాగా వరదరాజపురం గ్రామ శివారులో గుర్తించారు. అది క్రీ.పూ. వేయి సంవత్సరాల క్రితం ఇనుప యుగం నాటి సమాధి రాయిగా విశ్రాంత పురావస్తు అధికారి, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. ఔత్సాహిక పరిశోధకుడు నసీరుద్దీన్‌తో కలిసి సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం వరదరాజపురం, మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలం కేశవరం తండా పరిసరాల్లో శివనాగిరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా వరదరాజపురం గ్రామ శివారులోని గుట్టమీద ఒక మెన్హిర్ను గుర్తించారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరపటంతో ఆ రాయి కాస్తా పక్కకు ఒరిగిపోయింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఈ ఒక్క మెన్హిర్ మాత్రమే ఉందని, దీనిని కాపాడుకోవాలని ఆయన స్థానికులను కోరారు. కేశవరం తండా రోడ్డుకు రెండువైపులా వందల సంఖ్యలో ఉన్న ఇనుప యుగం నాటి సమాధులు కూడా చెదిరిపోయాయని, కొన్ని మాత్రమే మిగిలాయని పేర్కొన్నారు. -
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం; రాళ్ల నాణ్యత పరిశీలన
పోలవరం రూరల్ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వినియోగించే రాళ్ల నాణ్యత ప్రమాణాలను కేంద్ర జలసంఘంలోని సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ సెంటర్ (సీఎస్ఎం ఆర్ఎస్) బృందం సభ్యులు పరిశీలించారు. సీఎస్ఎంఆర్ఎస్ సభ్యులు సందీప్ దనో త్, ఉదయ్ శుక్రవారం పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుని పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. గైడ్ బండ్(రాతి గోడ) నిర్మాణానికి ఉపయోగించే రాళ్లను పరీక్షించారు. ఒక కిలోమీటరు పరిధిలో 53 మీటర్ల ఎత్తున రాతి గోడ నిర్మించాల్సి ఉంది. ఇప్పటి వరకు 42 మీటర్ల ఎత్తు వరకు నిర్మాణం పూర్తయింది. ఈ పనులు ఏ విధంగా జరుగుతున్నాయనే విషయాన్ని కూడా వీరు ఆరా తీశారు. ప్రాజెక్టు ప్రాంతంలో ఉన్న ల్యాబ్‌లో కొన్ని పరీక్షలు నిర్వహించారు. శనివారం కాఫర్ డ్యామ్ నిర్మాణ పనులను కూడా పరిశీలించనున్నారు. వీరి వెంట డీఈ శ్రీనివాసరావు, క్వాలిటీ కంట్రోల్, వ్యాబ్‌కోస్ అధికారులు ఉన్నారు. (క్లిక్: ‘బల్క్’ కుట్ర బహిర్గతం.. టీడీపీ పన్నాగం బట్టబయలు) -
అవి శివుడి గుడి స్తంభాలు.. ఇది హిడింబి ఇసుర్రాయి!
సాక్షి, హైదరాబాద్: మీటర్లకొద్దీ పొడవున్న నిలువు రాళ్లు.. ఏదో పనికోసం యంత్రంతో కోసినట్టుగా చక్కటి ఆకృతులు.. ఒకదాని తర్వాత ఒకటి పడుకోబెట్టినట్టుగా ఉన్న రాతి శిలలు.. అవి శివుడి గుడి స్తంభాలు అంటూ స్థానికంగా ఓ ప్రచారం.. ►దారిపక్కన టన్నుల బరువున్న విశాలమైన రెండు రాళ్లు.. వృత్తాకారంలో ఒకదానిపై మరొకటి పేర్చినట్టు ఆకృతి.. అది ఒకనాటి ఇసుర్రాయి అని, భారతంలో ప్రస్తావించే హిడింబి దాన్ని వాడేదని ఓ గాధ.. ►చిత్రమైన ఆకృతుల్లో, మనం నిత్యం వాడే పరికరాల ఆకారాల్లో ఉండే రాళ్లు జన బాహుళ్యంలో వింత ప్రచారానికి కారణమవుతాయి. అలాంటివే ఈ రాళ్లు. ప్రకృతిలో సహజ సిద్ధంగా ఏర్పడి మనను ఆకట్టుకుంటున్నాయి. వీటి వెనుక ఎలాంటి చారిత్రక, పౌరాణిక గాథ లేదని తేల్చిన నిపుణులు దీనిపై స్థానికులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. రాతి స్తంభాల ఆకృతిలో.. ఆసిఫాబాద్ జిల్లా బోర్‌లాల్‌గూడ అడవిలో ప్రకృతి చెక్కిన రాతి స్తంభాలు ఉన్నాయి. దాదాపు ఆరున్నర కోట్ల ఏళ్ల కింద లావా ఉబికివచ్చి కడ్డీల ఆకృతుల్లో ఘనీభవించిన రాతి శిలలు అవి. కాలమ్నార్ బసాల్ట్స్‌గా పేర్కొనే ఈ శిలలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు తిరుపతి మిత్రబృందం గుర్తించింది. తెలంగాణలో తొలిసారిగా ఏడేళ్ల కింద ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ శాంతిపూర్ రిజర్వ్ ఫారెస్టులో కూడా ఇలాంటి రాళ్లను గుర్తించారు. తాజాగా రెండో చోట అవి బయటపడినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. ఈ ప్రాంతాన్ని భూభౌతిక స్మారక ప్రాంతంగా గుర్తించాలని కోరారు. కర్ణాటకలోని ఉడిపి సమీపంలో సెయింట్ మేరీ ద్వీపాల్లో ఇలాంటి రాతి స్తంభాలను గుర్తించిన జీఎస్ఐ.. దేశంలో గుర్తింపు పొందిన 34 జాతీయ భూభౌతిక స్మారక ప్రాంతాల్లో ఒకటిగా చేర్చిందని తెలిపారు. బోర్‌లాల్‌గూడలో ఈ లావా శిలలున్న ప్రాంతంలో పురాతన శివలింగం వెలుగుచూడటంతో.. శివుడి గుడి కోసం రూపొందించిన స్తంభాలుగా వీటి గురించిన గాథ ప్రచారంలో ఉందని వెల్లడించారు. ఇసుర్రాయి రూపంలో.. హైదరాబాద్ శివార్లలో ఇబ్రహీంపట్నానికి 2 కిలోమీటర్ల దూరంలో దండుమైలారం వెళ్లేదారిలో రోడ్డు పక్కన భారీ వృత్తాకార రాళ్లు ఒకదానిపై ఒకటి పేర్చినట్టు ఉన్నాయి. ఇది మహాభారతంలో హిడింబి అనే రాక్షస స్త్రీ వాడిన ఇసుర్రాయిగా ఓ గాథ స్థానికంగా ప్రచారంలో ఉంది. బుద్ధవనం ప్రాజెక్టు డిజైన్ ఇన్చార్జి శ్యాంసుందర్, శిల్పి హర్షవర్ధన్‌తో కలిసి చరిత్ర పరిశోధకులు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి వీటిని పరిశీలించి.. అవి సహజసిద్ధంగా ఏర్పడ్డవేనని గుర్తించారు. కోట్ల ఏళ్ల పరిణామ క్రమంలో రాళ్లు ఇలా ఒకదానిపై మరొకటి ఏర్పడటం సహజమని.. వీటిని బ్యాలెన్సింగ్ స్టోన్స్‌గా పిలుస్తారని తెలిపారు. వీటిని కాపాడుకుంటే ఆ ప్రాంతానికి ఓ ప్రత్యేకతగా ఉంటుందని స్థానికులకు సూచించారు. -
మహిళ గాల్ బ్లాడర్‌లో 219 రాళ్లు
నరసరావుపేట (పల్నాడు జిల్లా): పట్టణంలోని మాతాశ్రీ హాస్పిటల్ వైద్యులు ఓ మహిళ పిత్తాశయం (గాల్ బ్లాడర్) నుంచి ఏకంగా 219 రాళ్లను వెలికితీశారు. హాస్పిటల్ డాక్టర్ పి.రామచంద్రారెడ్డి శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన 52 ఏళ్ల ఫాతిమా కడుపునొప్పితో తమను సంప్రదించిందన్నారు. హైప్రోస్కోపిక్ ద్వారా ఆమె పిత్తాశయంలో రాళ్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆమెకు ఈ నెల 20న ఆపరేషన్ చేసి 219 రాళ్లను వెలికితీశామన్నారు. సాధారణంగా 20 రాళ్లు ఉంటేనే కఠినతరంగా భావిస్తామని, ఏకంగా ఓ మహిళ గాల్ బ్లాడర్ నుంచి ఇన్ని రాళ్లను వెలికితీయటం బహుశా ఇదే మొదటిసారి కావొచ్చని పేర్కొన్నారు. ఆపరేషన్ అనంతరం ఆ మహిళ సురక్షితంగా ఇంటికి వెళ్లారన్నారు. -
అమలాపురం ఘటన: పోలీస్ వాహనాలపై రాళ్లు.. 46 మందిపై కేసు..
సాక్షి, కోనసీమ జిల్లా: అమలాపురంలో పోలీస్ వాహనాలపై రాళ్లు రువ్విన కేసులో 46 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 307,143,144,147,148,151,152, 332, 336,427,188, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సామర్లకోటకు చెందిన హోంగార్డ్ వాసంశెట్టి సుబ్రహ్మణ్యం ఫిర్యాదుతో కేసులు నమోదు చేశారు. చదవండి: ‘కోన’లో కుట్ర కోణం! వడగాన నాగబాబు, నూకల పండు, కురసాల నాయుడు, దున్నాల దిలీప్, అడపా శివ, చిక్కాల మధుబాబు, దువ్వా నరేష్, లింగోలు సతీష్, నల్ల నాయుడు, నక్కా హరి, కిశోర్, అడపా సత్తిబాబు, నల్ల రాంబాబు, యాళ్ల రాధ, గాలిదేవర నరసింహమూర్తి, సంసాని రమేష్, కడాలి విజయ్, తోట గణేష్, అన్యం సాయి, దూలం సునీల్, కల్వకొలను సతీష్, కానిపూడి రమేష్, ఈదరపల్లి జంబు, చింతపల్లి చిన్నా, పోలిశెట్టి కిషోర్, నల్లా కరుణ, పాటి శ్రీను, చిక్కం బాలాజీ, పెద్దిరెడ్డి రాజా, మద్దిశెట్టి ప్రసాద్, వినయ్, శివ, సాధనాల మురళీ, నల్లా అజయ్, వాకపల్లి మణికంఠ, కాసిన ఫణీంద్ర, కొండేటి ఈశ్వర్రావు, అరిగెల తేజ, అరిగెల వెంకటరామారావు, రాయుడు స్వామిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మరి కొందరి కేసులు నమోదు చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. బస్సును దగ్ధం చేసిన కేసులో.. ఎర్ర వంతెన వద్ద బస్సును దగ్ధం చేసిన కేసులో 46 మందిపై మరో ఎఫ్ఐఆర్ అమలాపురం పీఎస్‌లో నమోదు చేశారు. 341,143, 144,147,148,151,336,435,188,149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆర్టీసీ డ్రైవర్ గిరిబాబు ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
విద్యార్థుల బాహాబాహీ
సత్తుపల్లి: విద్యార్థులు నడిరోడ్డుపై బాహాబాహీకి దిగారు. కర్రలు, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని భయానక వాతావరణం సృష్టించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య శనివారం సాయంత్రం ఈ ఘర్షణ జరిగింది. కళాశాలకు చెందిన ఓ జూనియర్ విద్యార్థి పుట్టినరోజు వేడుకల్లో అతడిపై కేక్ పూయడంతో మొదలైన వివాదం... మరో జూనియర్ విద్యార్థి సీనియర్‌ను సిగరెట్ అడగటంతో ముదిరింది. జూనియర్లు, సీనియర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కాసేపటి తర్వాత అందరూ తిరిగి కళాశాలకు వెళ్లిపోయారు. సాయంత్రం మళ్లీ మరో జూనియర్ విద్యార్థి తన స్నేహితులను వెంటబెట్టుకొచ్చి కర్రలతో దాడి చేయటంతో గొడవ తీవ్రమయ్యింది. కళాశాల నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు జాతీయ రహదారిపైనే కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. దీంతో స్థానికులు భయభ్రాంతులయ్యారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టినట్టు సమాచారం. -
ఏడువారాల గుహలు.. తళుక్కుమంటున్న రాళ్లు
సాక్షి, హైదరాబాద్: నిర్మల్ జిల్లా సిరాలగ్రామం శివారులోని గుహలు తళుక్కుమంటున్నాయి. ఎవరో రంగులద్దినట్టు ఇంద్రధనస్సు తరహాలో వాటిల్లోని రాళ్లు మెరుస్తున్నాయి. దాదాపు అర కిలోమీటరు వెడల్పుతో నాలుగైదు కిలోమీటర్ల మేర ఈ గుహలు విస్తరించి ఉన్నాయి. లిమొనైట్, హెమటైట్ తదితరాలతో కూడిన ఈ శిలలు ఇనుప ఖనిజంతో ఉన్నందుననే ఇలా రకరకాల రంగుల్లో కనిపిస్తున్నాయని జీఎస్ఐ విశ్రాంత డిప్యూటీ డైరక్టర్ జనరల్ చకిలం వేణుగోపాల రావు చెప్పారు. ఈ నిక్షేపాలు జీఎస్ఐ అధికారికంగా గుర్తించిన జాబితాలో లేవన్నారు. శిలల్లో ఇనుప ఖనిజ పరిమాణం ఎంత ఉందో శాస్త్రీయ పద్ధతిలో పరిశీలించాల్సి ఉందని చెప్పారు. 25 కోట్ల నుంచి 17 కోట్ల సంవత్సరాల క్రితం శిలలు ఏర్పడి ఉంటాయని జీఎస్ఐ అంచనా. తాజాగా ఈ గుహలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు బలగం రామ్మోహన్ పరిశీలించారు. ఈ ఖనిజం విషయాన్ని పక్కనపెడితే గుహలు సందర్శకులకు కొత్త వినోదాన్ని పంచుతున్నాయని చెప్పారు. వీటి గురించి స్థానికులకు తప్ప ఇతర ప్రాంతాల వారికి పెద్దగా అవగాహన లేదని, అందుకే పెద్దగా పర్యాటకులు రావట్లేదని అన్నారు. స్థానికులు వీటిని ఏడువారాల గుహలంటున్నారని చెప్పారు. రుషులు ఒక్కో రోజు ఒక్కో గుహలో తపస్సు చేసుకునేవారని ప్రచారంలో ఉందని అన్నారు. -
ఇళ్లు అందంగా ఉండాలంటే.. నాలుగు రాళ్లు ఉన్నా చాలు!
ఇంట్లోకి ప్రకృతిని ఆహ్వానించాలంటే సహజత్వం ఉట్టిపడే అలంకరణ ఉండాలి. అందుకు రాతి కళ గొప్ప వేదిక అవుతుంది. పెద్ద రాతి నమూనాను గోడగా అమర్చినా, చిన్న చిన్న రాళ్లను ఫ్రేములుగా కట్టినా.. ఆ కళ వెంటనే చూపరులను ఆకట్టుకుంటుంది. సొంతింటి కల కోసం సంపాదనను సూచిస్తూ ‘నాలుగు రాళ్లు సంపాదించండి ’ అని హితులు సలహాలు ఇస్తుంటారు. అద్దెల్లు అయినా, సొంతిల్లు అయినా అలంకారంలో రాళ్లను రతనాలుగా మార్చేలా నవతరం వినూత్న ఆలోచనలు చేస్తోంది. గోడంత రాయి: లగ్జరీకి ప్రతిరూపం.. చూపు తిప్పుకోనివ్వని అందం వాల్ స్టోన్ది. పెద్ద పెద్ద భవంతుల నిర్మాణాల్లో అతి పెద్ద రాయిని గోడకు బదులుగా నిర్మించడంలో వారి అభిరుచి తెలిసిపోతుంది. అత్యంత ప్రజాదరణ పొందిన వాల్ డిజైన్లలో కొన్నేళ్లుగా వాల్స్టోన్ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఒకవేళ అంత పెద్ద స్టోన్‌ని అమర్చలేం అనుకున్నవారు కాంక్రీట్‌తో గోడ మొత్తం స్టోన్ లుక్‌తో మెరిపిస్తున్నారు. సహజత్వాన్ని ఇంటి అలంకరణలో భాగం చేయడానికి ఖరీదు అనేది పెద్ద పట్టింపుగా ఉండటం లేదు. గోరంత దీపం: గొడుగులా ఉండే టేబుల్ ల్యాంప్.. ఇంటికెంత అవసరమో మనకు తెలిసిందే. ఈ టేబుల్ ల్యాంప్ సహజత్వంతో వెలుగులు రువ్వాలంటే రాళ్లతో ఇలా సృష్టించుకోవచ్చు. ఆకర్షణ రాళ్లు: రాళ్లపై అక్షరాలు గార్డెన్‌లోనే కాదు లివింగ్ రూమ్‌లోనూ ఆకర్షణగా నిలుస్తాయి. రోజులో మనకు కావల్సిన సందేశాన్ని మనమే సృష్టించుకోవచ్చు. కుటుంబ సభ్యుల పేర్లనూ రాసి అలంకరించుకోవచ్చు. టేబుల్ టాప్: నదీ తీరాలను సందర్శించే వారు కొందరు తమకు నచ్చిన రాళ్లను జ్ఞాపకంగా వెంట తెచ్చుకుంటారు. సెంట్రల్ టేబుల్ టాప్‌ను గ్లాస్ అమరికతో డిజైన్ చేయించుకోవాలనుకునేవారు ఇలా జ్ఞాపకాల రాళ్లను కూడా పొందిగ్గా వాడుకోవచ్చు. ప్లేట్ మ్యాట్స్: ఇప్పటి వరకు క్లాత్, జ్యూట్, ఫైబర్ వంటి ప్లేట్ మ్యాట్స్‌ను డైనింగ్ టేబుల్‌పైన అలంకరించి ఉంటారు. ఇప్పుడు ఈ స్టోన్ మ్యాట్స్‌ను ప్రయత్నించండి. మీ సృజనాత్మకతకు అతిథుల ప్రశంసలు తప్పక అందుతాయి. ఫొటో ఫ్రేమ్స్, స్టోన్ పెయింటింగ్, వాల్ డెకార్ హ్యాంగింగ్స్, ఫ్లవర్ పాట్స్.. ఇలా చిన్న చిన్న రాళ్లతో అందమైన కళాకృతులను ఆకర్షణీయంగా ఎవరికి వారు రూపొందించు కోవచ్చు. ఇందుకు కావల్సినవి కొన్ని రాళ్లు, మరికొంత గమ్. ఇంకొన్ని రంగులు. ఆర్ట్ మీ చేతిలో ఉంటే చక్కటి రాళ్లు మీ ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తాయి. -
Balancing Stones: కోట్ల ఏళ్లుగా.. కొండ కొసన..
సిద్దిపేట సమీపంలోని హస్తాల్పూర్ శివారు గుట్టమీద అంచుపై ఉన్న గుండు రాయి ఇది. కాస్త పట్టుకుని ఉన్నట్టుండే ఈ రాయి కూడా కనుమరుగయ్యే పరిస్థితిలో ఉంది. ..పైన చెప్పినవన్నీ ఒకే రకంగా ఏర్పడిన రాళ్లే. తెలంగాణలో పలుచోట్ల ఇలాంటివి ఉన్నాయి. కానీ వాటి ప్రత్యేకతలపై అవగాహన లేక ధ్వంసమైపోతున్నాయి. ఒక్కదాన్ని కూడా పురావస్తు శాఖ (ప్రస్తుతం వారసత్వ శాఖ) రక్షిత ప్రాంతంగా గుర్తించలేదు. ప్రకృతి చెక్కిన ఈ రాళ్లను పరిరక్షించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెప్తున్నారు. విదేశాల్లో ఇలాంటి వాటిని రక్షిత ప్రాంతంగా గుర్తించి, కాపాడుకుంటున్నారని పేర్కొంటున్నారు. రెండేళ్ల కింద ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మహాబలిపురంలో ద్వైపాక్షిక చర్చలు జరిపిన వేళ.. పెద్ద పరుపు బండపై నిలిచిన గుండ్రటి రాయి వద్ద ఫొటో దిగారు. కృష్ణుడి చేతిలోని వెన్నెముద్దగా పిలిచే ఆ రాయి ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ముట్టుకుంటే జారిపోతుందేమో అన్నట్టున్న ఆ రాయి.. అలా ఎలా నిలిచి ఉందన్న ప్రశ్న అందరినీ తొలిచేసింది. ఇది హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉన్న ఓ చిత్రమైన రాయి. అడ్డంగా ఉన్న అంత పెద్ద రాయి.. మధ్యలో చిన్న భాగం మాత్రమే కింద తాకుతుంది. మిగతా భాగమంతా గాలిలో తేలుతూ ఉంటుంది. అయినా బలంగా నిలిచి ఉంది. దీన్ని ‘మష్రూమ్ (పుట్టగొడుగు) రాక్’గా పిలుచుకుంటారు. హిమాయత్‌సాగర్ జలాశయం పక్కనే.. చిన్నగుట్టపై ఒకదానిమీద మరొకటి పేర్చినట్టుగా ఉన్న రాళ్లు ఇవి. ఏ క్షణాన్నయినా జలాశయంలోకి దొర్లిపోయేట్టుగా కనిపిస్తాయి. ఆ రాళ్ల పక్కన గుట్ట భాగాన్ని గతంలోనే తొలిచేశారు. ఎప్పుడో అప్పుడు ఇవీ కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఎలా ఏర్పడతాయి? భూమ్యాకర్షణ శక్తికి విరుద్ధంగా ఉన్నట్టు భ్రమింపజేసే ఈ రాళ్లను బ్యాలెన్సింగ్ స్టోన్స్‌గా పిలుస్తారు. భూమిపై 350–250 కోట్ల ఏళ్ల క్రితం గ్రానైట్, ఇతర రాళ్ల పొరలు ఏర్పడ్డాయని.. వాటిలో క్రమంగా పగుళ్లు ఏర్పడి, దిగువకు కూరుకుపోవడమో, పడిపోవడమో జరిగిందని నిపుణులు చెప్తున్నారు. అలాంటి సమయంలో కొన్ని రాళ్లు అలాగే నిలిచిపోతాయని.. అవే ఈ బ్యాలెన్సింగ్ రాళ్లు అని అంటున్నారు. – సాక్షి, హైదరాబాద్ ఆరు కోట్ల ఏళ్ల నాటివి ‘‘కోట్ల ఏళ్ల క్రమంలో భూమిలో వచ్చే మార్పుల వల్ల బ్యాలెన్సింగ్ రాళ్లు ఏర్పడతాయి. తెలంగాణలో కనిపిస్తున్న ఈ బ్యాలెన్సింగ్ రాళ్లు దాదాపు 6 కోట్ల ఏళ్ల క్రితం నాటివిగా అంచనా. పురాతన ప్రాధాన్యమున్న ఈ రాళ్లను పర్యాటకులకు చేరువ చేయాలి’’ – చకిలం వేణుగోపాల్, విశ్రాంత డిప్యూటీ డీజీ, జీఎస్ఐ మనవద్ద గుర్తింపు రాలేదు ‘‘బ్యాలెన్సింగ్ రాళ్లకు విదేశాల్లో మంచి గుర్తింపు ఉంది. రాష్ట్రంలో కొన్ని గుట్టల్లో ఇలాంటి రాళ్లున్నా వాటికి గుర్తింపు లేదు. స్థానికంగా ఏ అవగాహనా లేదు. క్రషర్లలో, ఇళ్ల నిర్మాణాల్లో వాడే రాళ్లుగా వినియోగిస్తున్నారు. వాటిని పరిరక్షించాలి’’ – శ్రీరామోజు హరగోపాల్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ -
అతనికి అదృష్టం 17 కేజీల ఉల్కరూపంలో తగిలింది.. బంగారం కంటే ఎన్నో రెట్లు!!
అది మామూలు రాయని అందరూ అంటుంటే.. తన మనసు మాత్రం కాదని చెబుతోంది. అది చాలా విలువైన రాయని, ఎందుకో తనకు అదృష్టం ఈ రాయి రూపంలోనే వరించబోతోందని గాఢంగా నమ్మాడు. ఎన్నో సంవత్సరాలుగా తన ఇంట్లో భద్రపరిచాడు కూడా. చివరికి తన నమ్మకమే నిజమైంది.. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్కు చెందిన డేవిడ్ హోల్‌కు అక్కడి స్థానక పార్కులో 2015లో 17 కేజీల రాయి దొరికింది. అప్పటినుంచి అది బంగారమై ఉంటుందని తన ఇంట్లోనే భద్రపరిచాడు. తనకు దొరికిన రాయిని పగలగొట్టడానికి డ్రిల్ మిషన్‌తో సహా ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు. చివరికి యాసిడ్‌లో వేశాడు కూడా.. కానీ దానిని పగులగొట్టి, లోపల ఏముందో చూడలేకపోయాడు. చేసేదిలేక ఆ రాయిని తీసుకుని మెల్బోర్న్లో ఉన్న మ్యూజియంకు తీసుకెళ్లాడు. ఐతే జియాలజిస్టుల పరిశీలనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. ఎందుకంటే సదరు రాయి మామూలుది కాదుమరి! అవును.. అంతరిక్షం నుంచి భూమిపై పడ్డ అరుదైన ఉల్క అది. సుమారు 460 కోట్ల సంవత్సరాలనాటిది. బంగారం కంటే కూడా ఎన్నోరెట్లు విలువైనది. ఈ విషయం తెలుసుకున్న డేవిడ్ ఎగిరి గంతేశాడు.19వ శతాబ్ధంలో అనేక బంగారం రాళ్లు ఈ ప్రాంతానికి తీసుకురాబడ్డాయి. ఈ పార్కులో బంగారం దొరుకుతుందని అక్కడి స్థానికుల నమ్మకం. అంతేకాదు ఈ పార్కులో దొరికిన ఏ వస్తువునైనా సందర్శకులు తమ ఇళ్లకు తీసుకెళ్లొచ్చు కూడా. డేవిడ్ కూడా తనకు దొరికిన రాయిని ఇంటికి తీసుకెళ్లాడు.. ఒక్కసారిగా కోటీశ్వరుడైపోయాడు. చదవండి: Day for Elimination of Violence Against Women:16 రోజులు... పదునెక్కే ఆలోచనలు.. కాలంతో పాటు హింసా రూపాలు మారుతున్నాయి! -
రాళ్ల వర్షం కురిసిందట.. ఆ ఊరిలో పొలాల నిండా రాళ్లే
వైఎస్సార్ జిల్లా (జమ్మలమడుగు): జమ్మలమడుగు పట్టణానికి తూర్పు దిశగా ఐదు కిలోమీటర్ల దూరంగా ఉన్న చిన్న గ్రామమైన రాళ్లగుళ్లకుంట ప్రత్యేకత చాటుకుంది. కేవలం గ్రామానికి కిలోమీటరు చుట్టూ మాత్రమే పొలాల నిండా రాళ్లుతో నిండిపోయి ఉంటుంది. ఈ రాళ్లలోనే రైతులు భూమిని దున్ని పంటలను సాగుచేస్తున్నారు. కేవలం గ్రామానికి కిలోమీటరు చుట్టూ రాళ్లు ఉండటం ఈ గ్రామానికి ప్రత్యేకత తీసుకుని వచ్చింది. గ్రామానికి చుట్టూ కిలోమీటరు దూరం వరకు ఉన్న పొలాల్లో రాళ్లు మాత్రమే కనిపిస్తాయి తప్ప భూమి ఎక్కడ కనిపించదు. కిలోమీటరు దాటిన తర్వాత పూర్తిగా నల్లరేగటి భూమిలే. రాళ్లు ఎక్కువగా ఉండటంతో ఈ గ్రామానికి రాళ్ల గుల్లకుంటగా గుర్తింపు తీసుకుని వచ్చింది. ఈ గ్రామానికి మరో పేరు శేషారెడ్డిపల్లె. రాళ్లవర్షం కురిసిందంటా... త్రేతా యుగంలో గ్రామం చుట్టూ పరిసరా ప్రాంతాలలో రాళ్ల వర్షం పడ్డాయని గ్రామస్థులు కథలు చెబుతున్నారు. భూమిలోరాళ్లు ఎక్కువ ఉండటంతో రైతులు మొదట్లో రాళ్లను తొలగించే ప్రయత్నం చేశారు. భూమిని దున్నుతున్న ప్రతి సారి భూమిలో నుంచి రాళ్లు ఎక్కువగా వస్తుండటంతో శ్రమంతా నిరుపయోగం అవుతుండటంతో రాళ్లును తొలగించే ప్రయత్నం మానుకున్నారు. అయితే ఈ రాళ్లు రైతులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. గ్రామంలో చుట్టూప్రక్కల భూములన్ని వర్షాధార ఆధారంగా పంటలను సాగుచేస్తున్నారు. అయితే వర్షాలు తక్కువగా పడిన సమయంలో భూమిలో రాళ్లు ఉండటంతో ఆ రాళ్ల చల్లదనానికి పంటలు ఎండకుండ కాస్త దిగుబడి ఎక్కువగా వస్తుందని రైతులు చెబుతున్నారు. -
ఆ బాలిక ఏడిస్తే కంట్లోంచి రాళ్లు వస్తాయట!
-
రాళ్ల భూముల్లోనూ ఇక పంట సిరులు!
రాళ్లు, రప్పలతో నిండిన భూములు పంటల సాగుకు పనికిరావు. రాళ్లు రప్పలు ఎక్కువగా ఉన్న భూములను పడావుగా వదిలేస్తూ ఉండటం మెట్ట ప్రాంతాల్లో సర్వసాధారణం. ఒక మోస్తరుగా రాళ్లుండే భూముల్లో కూలీలను పెట్టి రాళ్లను ఏరి వేయించటం వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. తవ్వేకొద్దీ రాళ్లు బయటపడుతూ ఉంటుండడంతో.. ఏటేటా కూలీలతో రాళ్లను ఏరించాల్సిన పరిస్థితి. ఈ బాధలు పడలేక ఆ భూములపై ఆశలు వదులుకుంటున్న రైతులు ఎందరో కనిపిస్తారు. ఈ రాళ్ల కష్టాల నుంచి రైతులను గట్టెక్కించి, సాగు భూమి విస్తీర్ణం పెంచుకునేందుకు ఉపకరించే ప్రత్యేక యంత్రాన్ని ఆవిష్కరించారు ఓ యువ ఇంజనీర్. వేలాది ఎకరాలు.. సంగారెడ్డి జిల్లా మనురు మండలం బొరంచకు చెందిన రైతు కుటుంబంలో పుట్టిన కె.దీపక్‌రెడ్డి హైదరాబాద్ మీర్పేట్లోని టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్‌లో 2016లో బీటెక్ పూర్తి చేశారు. ఉద్యోగంలో చేరకుండా సొంత పరిశోధనలను కొనసాగించారు. కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న తమ స్వగ్రామం పరిసరాల్లోనే పది వేల ఎకరాల వరకు ఉన్న రాళ్ల భూములను సాగు యోగ్యంగా మార్చుకోవడానికి ఏమైనా యంత్రాన్ని కనిపెడితే బాగుంటుంది అని ఆలోచన చేశారు. 3.5 ఏళ్లుగా మల్టీపర్పస్ హెర్వెస్టర్ పరిశోధనలపైనే దృష్టిని కేంద్రీకరించి, పట్టుదలతో విజయం సాధించారు. ఇప్పటి వరకు సొంత డబ్బు రూ. 5 లక్షల ఖర్చు పెట్టారు. ఎకరానికి 4 గంటలు చాలు.. దీపక్‌రెడ్డి రూపొందించిన హార్వెస్టర్‌ను 50, అంతకన్నా ఎక్కువ అశ్వ శక్తి కలిగిన ట్రాక్టర్‌కు అనుసంధానించి ఉపయోగించాలి. మట్టిని తవ్వుకుంటూ జల్లెడ పట్టి రాళ్లను లేదా ఉల్లి, బంగాళదుంప వంటి గుండ్రటి పంట ఉత్పత్తులను సేకరించి.. వాటిని ఈ యంత్రంలోనే ఉన్న బక్కెట్లో నిల్వచేస్తుంది. రైతులకు ఖర్చు తగ్గడంతో పాటు, సమయం కూడా ఆదా అవుతుందని చెబుతున్నారు. ఎకరం భూమిలో ఉన్న రాళ్లన్నింటినీ కేవలం 3–4 గంటల్లో రూ. మూడు వేల నుంచి నాలుగు వేల ఖర్చుతో ఏరివేయవచ్చన్నది దీపక్‌రెడ్డి మాట. కూలీలతో ఈ పని చేయిస్తే కనీసం రూ. 12 వేలకు పైగా ఖర్చవుతుందన్నారు. ఎకరంలో రాళ్లు ఏరివేయాలంటే కూలీలు రోజుల తరబడి పనిచేయాల్సి వస్తుంది. పైగా భూమి పైపైన ఉన్న రాళ్లను మాత్రమే కూలీలు తీయగలుగుతారు. కానీ ఈ యంత్రం సహాయంతో కనీసం తొమ్మిది అంగుళాల లోతులో ఉన్న రాళ్లను కూడా ఏరెయ్యవచ్చని తెలిపారు. రూ. 10 లక్షల ఐసీఏఆర్ గ్రాంటు స్టార్టప్ కంపెనీ రిజిస్ట్రేషన్ కోసం ఇటీవలే దరఖాస్తు చేసిన దీపక్‌రెడ్డి.. దీన్ని వాణిజ్యపరంగా విక్రయించేందుకు మరో ఏడాది సమయం పడుతుందంటున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఇన్నోవేషన్ టూ ఎంటర్పెన్యూర్ (ఐ టు ఏ)కు దరఖాస్తు చేశారు. ‘నిధి ప్రయాస్’ పథకం కింద భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) రూ. పది లక్షల గ్రాంటును విడుదల చేసింది. ఇప్పటి వరకు సొంత డబ్బుతోనే తిప్పలు పడుతున్న దీపక్‌రెడ్డికి ఐసీఏఆర్ గ్రాంటుతో కొండంత బలం వచ్చింది. ఇతర వనరుల నుంచి నిధులు సమకూర్చుకోవడానికి కూడా ఐసీఏఆర్ గుర్తింపు ఉపకరిస్తుందని ఆశిస్తున్నారు. ఈ ఉత్సాహంతో యంత్రాన్ని మరింత అభివృద్ధి చేసి, ఏడాదిలో రైతులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నానని దీపక్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు ఇటీవల టర్కీ నుంచి ఇలాంటి ఓ యంత్రాన్ని రూ. 12 లక్షలతో దిగుమతి చేసుకున్నారన్నారు. తాను రూపొందించిన హార్వెస్టర్‌ను రూ. 2.5 లక్షలకే రైతులకు అందుబాటులో తేబోతున్నానన్నారు. రాళ్ల భూముల్లోనే తన బంగారు భవిష్యత్తును వెతుక్కుంటూ కలలు పండించుకుంటున్న రైతుబిడ్డ, సృజనశీలి దీపక్‌రెడ్డికి శుభాభినందనలు! – పాత బాలప్రసాద్, సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి ఆలుగడ్డ, ఉల్లిగడ్డలనూ తవ్వి తీస్తుంది! పొలంలో రాళ్లను ఏరివేయడంతోపాటు దుంప పంటల కోతలకు కూడా ఈ బహుళ ప్రయోజనకారి అయిన ఈ హార్వెస్టర్ ఉపయోగపడుతుంది. ఆలుగడ్డ, ఉల్లిగడ్డలను తవ్వి తీయడానికి కూడా ఈ యంత్రం ఉపయోగపడుతుంది. ఎకరానికి 3–4 గంటల సమయం పడుతుంది. మార్కెట్లో యంత్రాలు ఉన్నప్పటికీ.. ధర రూ. 8 లక్షల వరకు ఉండటం వల్ల రైతులకు అందుబాటులో లేవని దీపక్‌రెడ్డి తెలిపారు. రూ. 2.50 లక్షలకే తాను అందుబాటులోకి తేనున్న హార్వెస్టర్ రైతులను కష్టాల నుంచి గట్టెక్కించడానికి తోడ్పడుతుందని దీపక్‌రెడ్డి ఆశిస్తున్నారు. మూడున్నరేళ్లు శ్రమించా..! మంజీరా నది మాకు దగ్గర్లో ఉన్నప్పటికీ రాళ్లు, రప్పల కారణంగా మా ప్రాంతంలో భూమి వేల ఎకరాలు పడావు పడి ఉంటున్నది. మాకు కూడా 2 ఎకరాల రాళ్ల పొలం ఉంది. ఏదైనా పంటలు వేస్తే ఎండల తీవ్రతకు రాళ్లు వేడెక్కి పంటలు, తోటలను దెబ్బతీస్తున్నందున వేలాది ఎకరాల్లో పంటలు పండించలేని పరిస్థితి ఉంటుంది. ఏటా ఎండాకాలంలో కూలీలను పెట్టి రాళ్లను ఏరివేయించడం ఇబ్బందికరంగా మారింది. ఈ సమస్య పరిష్కరం కోసం మార్గం ఏమిటా అని అన్వేషించాను. ఇతర దేశాల్లో రైతులకు అందుబాటులో ఉన్న యంత్రాలను ఆన్లైన్లో పరిశీలించాను. మెకానికల్ ఇంజనీర్‌గా నాకున్న పరిజ్ఞానంతో మన పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా యంత్రాన్ని రూపొందించే పరిశోధన ప్రారంభించాను. మూడున్నరేళ్లుగా ఇదే పని మీద ఉన్నాను. ఎట్టకేలకు మల్టీపర్పస్ హార్వెస్టర్ యంత్రం ప్రొటోటైప్‌ను రూపొందించాను. పొలాల్లో ప్రయోగించి సత్ఫలితాలు సాధించాను. – కె. దీపక్‌రెడ్డి, బొరంచ, మనురు మండలం, సంగారెడ్డి జిల్లా ► పాలేకర్ ఆన్లైన్ పాఠాలు భారతీయ ప్రకృతి వ్యవసాయ పితామహులు డా. సుభాష్ పాలేకర్ ‘తిరిగి ప్రకృతిలోకి..’ సిరీస్‌లో భాగంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో తన యూట్యూబ్ ఛానల్లో 5 రోజులు శిక్షణ ఇవ్వనున్నారు. టెర్రస్ గార్డెనింగ్, కిచెన్ గార్డెనింగ్, ఔషధాలతో పనిలేని మానవ జీవనం, ఆధ్యాత్మిక జీవన విధానం, సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయదారులు, వినియోగదారులంతా ఒకే కుటుంబం.. తదితర అంశాలపై శిక్షణ ఇస్తారు. సెప్టెంబర్ 12, 26 తేదీలు, అక్టోబర్ 3, 10,17 తేదీల్లో మధ్యాహ్నం 1.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు) 6 గంటల పాటు శిక్షణ ఇస్తారు. పాలేకర్ వాట్సప్ నంబరు: 98503 52745. ఇతర వివరాలకు.. అమిత్ పాలేకర్ – 96731 62240 యూట్యూబ్‌లో ్ఖఆఏఅ ఏ ్కఅఔఉఓఅఖఓఖ్ఖ ఏఐ ఛానల్‌ని సబ్‌స్రైబ్ చేసుకొని ఈ శిక్షణ పొందవచ్చు. ► పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ ప్రమాణాలపై శిక్షణ మార్కెట్లకు తరటించే క్రమంలో పండ్లు, కూరగాయలను ప్యాక్ చేయడానికి సంబంధించిన నూతన పద్ధతులు, పదార్థాలు, యంత్రాలు, ప్యాక్ హౌస్ నిర్వహణ, కోల్డ్‌స్టోరేజ్ రవాణా, లేబెలింగ్ ప్రమాణాలపై అవగాహన కలిగించడానికి తంజావూరులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ’ ఈ నెల 31న ఉ. 10 గం. నుంచి 1.30 గం వరకు ఆన్లైన్లో శిక్షణ ఇవ్వనుంది. ఫీజు రూ. 590 (జిఎస్టీ అదనం). ఈనెల 30 లోగా రిజిస్టర్ చేసుకోవచ్చు. వివరాలకు.. 97509 68415, 88482 55361 -
హమ్మా! కాకికే షాకిచ్చిందిగా..!!
-
హమ్మా! కాకికే షాకిచ్చిందిగా..!! వైరల్ వీడియో
సాక్షి, హైదరాబాద్: అనగనగా ఒక కాకి.. ఆ కాకికి దాహం వేసింది. చుట్టూ వెదికింది. ఎక్కడా నీళ్లు కనిపించలేదు.. దాహంతో గొంతు తడారిపోతుండగా. ఎక్కడో అడుగున కాసిన్ని నీళ్లతో ఒక కూజా కనిపించింది. ఆ నీళ్లు అందకపోవడంతో తెలివిగా కొన్ని గులకరాళ్లను తెచ్చి అందులో వేసి.. నీళ్లు పైకి వచ్చాక తన దాహాన్ని తీర్చుకుంది.. హాయిగా ఎగిరిపోయింది..ఈ కథ తరతరాలుగా కొనసాగుతూనే ఉంది. అంతేనా కాకమ్మ తెలివితేటల గురించి చాలా స్టోరీలు ఇప్పటిదాకా వైరల్ అయ్యాయి. మనుషులు అతి నిర్లక్ష్యంగా పారవేసిన చెత్తను, ప్లాస్టిక్ బాటిళ్లతో సహా ఏరి చెత్త కుండీలో పారవేసిన స్వచ్ఛ్ భారత్ కాకి కథను కూడా విన్నాం. కానీ తాజాగా అలనాటి పాత కథను తలపించేలా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక చిన్న ప్లాస్టిక్ బాటిల్లో ఉన్న నీళ్ల కోసం ఒక పిట్ట కష్టపడుతున్న వైనం ఆసక్తికరంగా మారింది. కాకికే షాకిచ్చిందిగా బుల్లి పిట్ట. ఔరా అంటూ నెటిజన్లు కమెంట్ చేస్తున్నారు. ఈ వీడియోలోకనిపించిన మాగ్పై పక్షలు కూడా కాకుల్లాగే చాలా తెలివైనవట. గత ఏడాది స్టీవ్ స్టీవార్డ్ విలియమ్స్ అనే యూజర్ ఈ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. అది తిరిగి తిరిగి మళ్లీ ఇపుడు వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేసుకోండి మరి! -
గ్రామాన్నికాపాడిన వారికోసమే.. ఈ గుళ్లు
యాదాద్రి: ఊరిని కాపాడుకోవడానికి ప్రతి గ్రామానికి కొంతమంది వీరులు ఉండేవారని చరిత్ర చెబుతోంది. వారు ఊర్లలోని పిల్లల్ని, స్త్రీలను, సంపదలను కాపాడటానికి దొంగలతో, పరాయి సైనికులతో, క్రూర జంతువులతోనూ పోరాడేవారు. పోరులో అమరులైన ఆ వీరుల పేరిట నిలిపిన స్మారక శిలలే వీరగల్లులు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు గ్రామాల్లో ఈ శిలలు దర్శనమిస్తాయి. అయితే వీరగల్లులకు గుడులు కట్టిన విషయం మాత్రం పరిశోధకులకు ఆసక్తి కలిగిస్తోంది. గుర్తించిన చరిత్రకారులు.. శ్రీరామోజు హరగోపాల్, వేముగంటి మురళీకృష్ణ, పెసరు లింగారెడ్డి, సహాయకుడు నాగరాజుతో కూడిన చరిత్ర బృందం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో పర్యటించినపుడు అక్కడున్న మన్నెవార్ కోట, శైవ, వైష్ణవ దేవాలయాలు, నిజాం కాలం నాటి మెట్లబావితో పాటు విశేషమైన వీరగల్లులను గుర్తించారు. ఎక్కడాలేనట్లు తుర్కపల్లిలో వీరగల్లులకు గుడికట్టిన అవశేషాలు కనిపించాయి. ఊరికి తూర్పున 2 కూలిన కప్పులతో చిన్నగుడుల అవశేషాలు ఉన్నాయి. వీరగల్లులకు గుడులు కట్టిన 4 రాతి స్తంభాలున్నాయి. భూమిలో మునిగినవి కొన్ని, సగం బయటపడినవి కొన్ని కనిపించాయి. మూడింటిలో 2 ప్రత్యేక వీరగల్లులు ఉన్నాయి. వీరగల్లుల శిల మొదటి వీరగల్లులో రెండవ అంతస్తులో పైన సూర్యచంద్రులు వాటికింద ఒక ఎద్దు, దానికెదురుగా పడ గెత్తిన నాగుపాము ఉన్నాయి. కింది అంతస్తులో దనుర్ధారి సైనికుడున్నాడు. పాము నుండి ఎద్దును కాపాడే క్రమంలో పోరాడి మరణించిన వీరుని స్మారకశిలగా భావిస్తు న్నారు. ఇంతవరకు తెలంగాణలో లభించిన వీరగల్లులలో ఇటువంటి వీరగల్లు ఇదే మొదటిది. రెండవ వీరగల్లులో పెద్దపులులతో పోరాడుతున్న వీరుడు అగుపిస్తున్నా డు. ఓ పులి మరణించి ఉంది. రెండో పులిని వీరుడు శూలంతో పొడుస్తున్నాడు. మూడో పులి పారిపోతున్నది. పులులతో పోరాడి అమరుడైన వీరయోధుని వీరశిల ఇది. తెలంగాణలో వీరులు పెద్దపులులతో పోరాడే దృశ్యాలున్న వీరగల్లులు కూడా ఐదులోపునే లభించాయి. మూడవ వీరగల్లులో వీరుని తలమీద సూర్యచంద్రులున్నా రు. ఇలా వీరగల్లులపై లోతుగా పరిశీలన చేస్తే విలువైన సమాచారం లభించవచ్చు. -
భయానకం: గాల్బ్లాడరా.. రాళ్ల కుప్పనా..!
సాక్షి, నిర్మల్: మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనగతితో మానవ శరీరంలోని కిడ్నీల్లో ఒకట్రెండు రాళ్లు తయారుకావడం సహజమే. కానీ ఆమె గాల్‌బ్లాడర్‌లో ఏకంగా 20 వరకు రాళ్లు.. అవి కూడా 20మి.మీ. ఉండటం గమనార్హం. జిల్లాకేంద్రానికి చెందిన నస్రీన్ రెండేళ్లుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో చికిత్సకోసం నిర్మల్, నిజామాబాద్, హైదరాబాద్‌లతోపాటు మహారాష్ట్రలోని నాందేడ్ వరకూ వెళ్లారు. అనేక ప్రైవేటు ఆసుపత్రులు తిరిగారు. సమస్య మాత్రం తీరలేదు. చివరకు నిర్మల్ జిల్లాకేంద్రంలోనే దేవీబాయి ఆస్పత్రి వైద్యుడు అవినాశ్ కాసావార్‌ను కలిశారు. గాల్‌బ్లాడర్‌లో పెద్ద మొత్తంలో రాళ్లు ఉండటం వల్లే కడుపునొప్పి వస్తున్నట్లు ఆయన గుర్తించారు. ఈమేరకు శుక్రవారం ల్యాపరోస్కోపి విధానంలో ఆపరేషన్ చేయగా, ఆమె గాల్‌బ్లాడర్‌లో సుమారు 20రాళ్లు, ఒక్కో రాయి సైజు 20మి.మీ. ఉన్నవి బయటపడ్డాయి. ఇలాంటి అరుదైన ఆపరేషన్ జిల్లాలోనే తొలిసారిగా చేసినట్లు వైద్యుడు అవినాశ్ తెలిపారు. -
నాపరాతి పరిశ్రమ: రూ.600 కోట్ల వరకు నష్టాలు
కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో పాటు ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తాండూరు నాపరాతి పరిశ్రమ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. అన్‌లాక్ ప్రక్రియతో కాస్త ఊరట లభిస్తున్న తరుణంలో భారీ వర్షాలతో పరిస్థితి మొదటికొచ్చింది. క్వారీల్లో చేరిన నీటితో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. క్వారీ నుంచి ముడి సరుకు బయటకు రాకపోవడంతో దానికి అనుబంధంగా ఉన్న పాలిషింగ్ యూనిట్లు సైతం దిక్కులు చూస్తున్నాయి. ఇప్పట్లో పనులు ప్రారంభమయ్యే పరిస్థితి లేకపోవడంతో క్వారీల యజమానులు డోలాయమానంలో పడ్డారు.ఇక పరిశ్రమపై ఆధారపడ్డ 25వేల మంది కార్మికులకు పూటగడవడమే కష్టమైంది. ‘ఉపాధి’ని ముంచేసిన వానలు వికారాబాద్ జిల్లా తాండూరు పరిధిలో దాదాపు 300 నాపరాతి క్వారీలున్నాయి. వీటికి అనుబంధంగా 1,250 పాలిషింగ్ యూనిట్లు, ఇతర మార్కెటింగ్ స్టోర్లు కొనసాగుతున్నాయి. వీటిల్లో పనిచేసే వారిలో ఎక్కువ మంది బిహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందినవారే. ఉమ్మడి మహబూబ్‌నగర్, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన కూలీలు సైతం వలస వచ్చి పనిచేస్తున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో నాపరాతి పరిశ్రమ మూతపడటంతో 95 శాతం కూలీలు సొంతూళ్లకు వెళ్లిపోయారు. అన్‌లాక్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆగస్టు చివరి నుంచి క్రమంగా యూనిట్లను తెరిచేందుకు యాజమాన్యాలు ఉపక్రమించగా.. సెప్టెంబర్ నెలాఖరు నుంచి కార్మికులు, కూలీలు తిరిగి వచ్చారు. పనులు మొదలవుతున్న తరుణంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, కాగ్నా నది ఉప్పొంగడంతో క్వారీలన్నీ నీటితో నిండిపోయాయి. ఇప్పటికీ క్వారీల్లోకి నీళ్లు వస్తున్నాయి. తొలుత కురిసిన వానలు కాస్త తెరపివ్వడంతో భారీ ఖర్చుతో క్వారీ యజమానులు పెద్ద మోటార్లను బిగించి నీటిని బయటకు తోడారు. అంతలోనే మళ్లీ వానల తీవ్రత పెరగడంతో క్వారీలు నిండా మునిగాయి. భూమిలోతులోకి క్వారీలు ఉండడంతో ఇప్పటికీ పలుచోట్ల ఊటగా నీరు వస్తోంది. ఈ నీటిని తోడాలంటే లక్షల్లో వెచ్చించాల్సి రావడంతో క్వారీల యజమానులు ఆ పనులను విరమించారు. దీంతో ఇప్పటికే నెలల తరబడి మూతబడ్డ క్వారీలు.. ఇప్పట్లో గాడినపడేలా లేవు. మరోవైపు క్వారీల నుంచి రాయి ఉత్పత్తి లేకపోవడంతో పాలిషింగ్ యూనిట్లకూ పనిలేకుండా పోయింది. తక్కువ విస్తీర్ణంలో ఉన్న మినీ క్వారీలను ఇప్పుడిప్పుడే తెరుస్తున్నా.. ఆశించిన స్థాయిలో పనిలేదు. ముడిసరుకు సిద్ధంగా ఉన్న పాలిషింగ్ యూనిట్లలో ఒకరిద్దరికే పని దొరుకుతోంది. దిక్కుతోచని స్థితిలో కార్మికులు క్వారీలు, పాలిషింగ్ యూనిట్లలో ఉపాధి పొందుతున్న వేలాది మంది కార్మికులకు ఇప్పుడు దిక్కుతోచట్లేదు. లాక్డౌన్ సమయంలో సొంతూళ్లకు వెళ్తే అక్కడ తగిన ఉపాధి దొరకలేదు. అన్‌లాక్ సమయంలో గంపెడాశతో తిరిగొస్తే.. క్వారీలను వానలు నిండా ముంచేశాయి. రోజువారీ కూలీపై ఆధారపడ్డ వారందరికీ ప్రస్తుతం బతుకు గగనమైంది. చేతిలో డబ్బుల్లేక, అప్పు దొరక్క పస్తులుంటున్నారు. దీనిపై కార్మిక సంఘాల నేతలు యాజమాన్యాలతో చర్చించినా ఫలితం లేదు. అడ్వాన్స్ రూపంలో కొంత మేర డబ్బులు తీసుకున్నప్పటికీ నెలల తరబడి పనిలేకపోవడంతో ఉన్న డబ్బులు పూర్తిగా ఖర్చు కావడంతో మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోంది. తాండూరు, షాబాద్ బండలంటే దక్షిణ భారతమంతా పేరు దక్షిణ భారతదేశంలో తాండూరు నాపరాతికి మంచి పేరుంది. క్వారీల నుంచి రాయిని బయటకు తీయడం.. దానిని పాలిషింగ్ చేసి మార్కెట్లో విక్రయించడం ఇక్కడ ప్రధానంగా జరిగే పని. నాపరాతిని నిర్ణీత రూపంలో కటింగ్ చేసిన తర్వాత నేరుగా వాడుకోవచ్చు. పాలిష్ చేసిన రాక్షీట్లకైతే మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. తెలంగాణలో తాండూర్ బండలు, షాబాద్ బండల పేరుతో వీటిని విక్రయిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రకు ఇక్కడి నుంచి భారీగా ఎగుమతులు చేస్తారు. నాపరాతి పరిశ్రమ వల్ల ప్రభుత్వానికి రాయల్టీ, ఇతర పన్నుల రూపంలో ఏటా రూ.150 కోట్ల మేర ఆదాయం వస్తోంది. ఇక్కడ ఏటా దాదాపు రూ.2,500 కోట్ల వరకు లావాదేవీలు జరుగుతాయి. లాక్‌డౌన్‌తో పాటు, ఇటీవలి వర్షాల కారణంగా నాపరాతి పరిశ్రమ దాదాపు రూ.600 కోట్ల వరకు నష్టపోయి ఉంటుందని అంచనా. ఈ క్వారీలు, పాలిషింగ్ యూనిట్లలో వివిధ కేటగిరీల్లో పనిచేసే కార్మికులు, కూలీలు 25 వేలకు పైమాటే. నెల వరకు కష్టమే.. క్వారీల్లో భారీగా చేరిన నీటిని తోడాలంటే రూ.లక్షలు ఖర్చు చేయాలి. పెద్ద మోటార్లతో రోజుల తరబడి పంపింగ్ చేయాలి. మోటార్లకు కిరాయి భారీ మొత్తంలోనే ఉంటుంది. ప్రస్తుతం తాండూరు పరిధిలోని 70 శాతం క్వారీలు నీటితో నిండిపోయాయి. వీటన్నింటి నుంచి నీళ్లు తొలగించి మళ్లీ గాడిన పడటానికి కనీసం నెల పట్టొచ్చు. మమ్మల్ని నమ్ముకున్న కూలీలు, కార్మికులకు కొంత నగదు అడ్వాన్స్ ఇచ్చి పోషిస్తున్నాం. – వెంకటరామిరెడ్డి, క్వారీ యజమాని, తాండూరు 2 నెలలుగా పనిలేదు క్వారీలో పనిచేస్తే రోజుకు రూ.500 కూలి వచ్చేది. ప్రస్తుతం రెండు నెలలుగా పని లేదు. నా దగ్గరున్న డబ్బులు పూర్తిగా ఖర్చయిపోవడంతో భార్య, పిల్లల పోషణ కష్టంగా మారింది. గతనెల అప్పుచేసి కుటుంబాన్ని నెట్టుకొచ్చా. ఇప్పుడిక వేరే పని దొరికినా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా. – వడ్డే నగేశ్, కార్మికుడు -
ఎల్లమ్మ.. బంగారం
నెల్లూరు(మినీబైపాస్): ఆమె వయసు 65 సంవత్సరాలు.. భర్త మృతిచెందాడు. సంతానం పట్టించుకోలేదు. ఎవరైనా సాయం చేస్తారా అని ఎదురు చూడలేదు. తన కాళ్లపై తాను నిలబడింది. రోళ్లు తయారు చేస్తూ జీవనోపాధి పొందుతోంది. ♦ ఎల్లమ్మ సొంత ఊరు ప్రకాశం జిల్లాలోని మార్కాపురం. ♦ భర్త చనిపోవడం.. సంతానం అండగా లేకపోవడంతో 20 సంవత్సరాల క్రితం ఆమె నెల్లూరుకు వలస వచ్చింది. తన కాళ్లపై తాను నిలబడాలని నిర్ణయించుకుంది. ♦ నగరంలోని ప్రభుత్వాస్పత్రి సమీపంలో చిన్న గుడిసె వేసుకుని ఉంటోంది. వర్షం కురిస్తే అక్కడ తంటాలు పడుతూ ఉండాలి. ♦ రోళ్లు తయారుచేసి జీవనం పొందుతోంది. ♦ అనంతపురం నుంచి రాళ్లను తెప్పించుకుంటుంది. ♦ రోజుకు మూడు రోళ్లు తయారు చేస్తుంది. ♦ ఒక్కోటి సైజ్‌ని బట్టి రూ.150 నుంచి రూ.200కు విక్రయిస్తుంది. వచ్చిన డబ్బుతో జీవితాన్ని నెట్టుకొస్తోంది. కొంత తగ్గింది అండగా నిలవాల్సిన సంతానం ఎక్కడున్నారో తెలియదు. నాకు తెలిసింది ఇదే పని. 20 సంవత్సరాలుగా చేస్తున్నా. మిక్సీలు, గ్రైండర్లు రావడంతో రోళ్ల వినియోగం కొంత తగ్గింది. అయినా నా కాళ్లపై నేను నిలబడుతున్నా. సంపాదన తక్కువే అయినా ఎవరిపైనా ఆధారపడకుండా జీవిస్తున్నా. – ఎల్లమ్మ -
టీడీపీ.. చీకటి వ్యాపారం
సాక్షి, బొమ్మనహాళ్: మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అండతో టీడీపీ నాయకుడు టీవీఎస్ కాంతారావ్ నేమకల్లు సమీపాన కొండల్లో ఉన్న కంకర మిషన్ల నుంచి కంకరను, డస్ట్ పౌడర్‌ను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అదీ రాత్రి వేళ కర్ణాటకకు తరలిస్తున్నారు. గత ఏడాది నేమకల్లు, ఉంతకల్లు గ్రామాల రైతులు కంకర మిషన్ల నుంచి వెలువడే దుమ్ము, ధూళి వల్ల పంట పొలాలు నాశనం అవుతున్నాయని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. మేకలు, గొర్రెలు, జీవాలు, ప్రజలు కంకర మిషన్ల నుంచి వెలువడే దుమ్ము, ధూళి వల్ల చనిపోతున్నాయని, తక్షణమే కంకర మిషన్లను నిలిపివేయాలని గ్రీన్ టిబ్యునల్‌కు వెళ్లారు. ఈ విషయంపై గ్రీన్ టిబ్యునల్ అధికారులు పరిశీలించి నేమకల్లు కొండల్లో కంకర మిషన్లను, క్వారీలను పూర్తిగా నిలిపివేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. ఉత్తర్వులు బేఖాతర్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులను టీడీపీ నాయకుడు టీవీఎస్ కాంతారావ్ బేఖాతర్ చేశారు. తన స్వంత కంకర మిషన్‌ను తెరిచి నిల్వ ఉంచిన కంకరను, డస్టŠట్ పౌడర్‌ను లారీల్లో అక్రమంగా కర్ణాటకకు తరలిస్తున్నారు. తాజాగా శనివారం సాయంత్రం కాంతారావ్ కంకర మిషన్ నుంచి కర్ణాటకకు కంకరను అక్రమంగా తరలిస్తున్న రెండు టిప్పర్లతో పాటు జేసీబీని నేమకల్లు గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఒక్క రోజే దాదాపు 25 లారీల కంకర, డస్ట్‌ను కర్ణాటకకు తరలిచినట్లు గ్రామస్తులు తెలిపారు. అధికారులు స్పందించి అక్రమంగా తరలిపోతున్న కంకరకు అడ్డుకట్ట వేసి, కాంతారావ్‌పై చట్టపరమైన తీసుకోవాలని తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఇళ్లపై పడుతున్న ఓసీపీ బండరాళ్లు
సాక్షి, భూపాలపల్లి : భూపాలపల్లి ఏరియాలోని ఓసీపీలో బాంబుల మోతలకు కాలనీ వాసులు బెంబేలెత్తుతున్నారు. ఓపెన్‌కాస్టు ప్రాజెక్టు–2లో జరుగుతున్న బొగ్గు, మట్టి వెలికితీత పనుల్లో భాగంగా చేపడుతున్న బాంబు బ్లాస్టింగ్లతో మంగళవారం బండరాళ్లు వచ్చి సమీప కాలనీల్లోని ఇళ్లపై పడినాయి. ఓసీపీ–2 సమీపంలోని గాంధీనగర్ కాలనీలోని చిక్కుల దేవేందర్ ఇంటిపై సుమారు 5 కిలోల బరువు గల బండరాయి పడడంతో పై కప్పు రేకులు పగిలిపోయాయి. అయితే ఆ సమయంలో దేవేందర్ భార్య ఇంట్లోనే నిద్రిస్తున్నప్పటికీ బండరాయి ఆమె మీద పడకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. నిబంధనలు గాలికి కాలనీలకు 500 మీటర్ల దూరంలో ఓసీపీలో బాంబు బ్లాస్టింగ్ పనులు చేపట్టాలని నేషనల్ గ్రీన్ట్రిబ్యూనల్ సింగరేణి యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. కేవలం వంద మీటర్ల దూరంలోనే బ్లాస్టింగ్లు చేపట్టడం వలన ఇలా బండరాళ్లు వచ్చి ఇళ్లపై పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా పేలుళ్ల శబ్దంతో గోడలు పగుళ్లు బారుతున్నాయని వాపోయారు. బ్లాస్టింగ్ చప్పుళ్లతో బెంబేలెత్తుతున్న జనం ప్రతి రోజు రెండు సార్లు బాంబుబ్లాస్టింగ్ చేయడం వలన ఎప్పుడు ఎటువంటి ప్రమాదం జరుగుతుందోనని జంగేడు, పక్కీరుగడ్డ, ఆకుదారివాడ, సుభాష్‌కాలనీ, గాంధినగర్, శాంతినగర్ కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా అధిక సామర్థ్యం గల బాంబులను వినియోగించడం వలన ఇళ్లు కదులుతున్నాయని బాధితులు గోడును వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఓసీపీ–1లో చేపట్టిన బ్లాస్టింగ్ వలన గడ్డిగానిపల్లి గ్రామంలోని ఇళ్లపైన బండరాళ్లు పడిన సందర్భాలు ఉన్నాయి. అయిన్నప్పటికీ ఎలాంటి నియంత్రణ చర్యలు చేపట్టడంలేదని స్పష్టమవుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమ ఇబ్బందులను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. -
అమ్మకోసం ఫోన్ ఆర్డర్ చేస్తే..
సాక్షి,న్యూఢిల్లీ: ఆన్లైన్ షాపింగ్ అంటేనే వినియోగదారులు భయపడే మరో సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన ద్వారా ఆర్డర్ చేసిన ఢిల్లీకి చెందిన ఒక వినియోగదారుడికి చేదు అనుభవం ఎదురైంది. రూ.35 వేల ఫోన్ బుక్ చేస్తే మైండ్ బ్లైండయ్యే గిఫ్ట్ వచ్చింది. దీంతో లబోదిబోమన్న కస్టమర్ పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే, ఢిల్లీకి చెందిన మానస్ సక్సేనా మాతృదినోత్సవం సందర్భంగా కన్నతల్లికి బహుమతి ఇద్దామనుకున్నారు. దీంతో ఓ ఈ-కామర్స్ సంస్థను సంప్రదించి స్మార్ట్ ఫోన్ ఆర్డర్ ఇచ్చి డబ్బు చెల్లించారు. ఇక్కడే ఈయనకు ఈ కామర్స్ సైట్ దిమ్మతిరిగే షాకిచ్చింది. మే 26న ఆన్లైన్లో వన్‌ప్లస్ 6 ఫోన్‌ను ఆర్డర్ చేసి రూ. 34,999ను డెబిట్ కార్డు ద్వారా పే మెంట్ చేశారు. మే 27న పార్శిల్ వచ్చింది. అయితే ఫోన్ కు బదులుగా పార్సిల్లో మార్బుల్ స్టోన్స్ దర్శనమిచ్చాయి. దీంతో అవాక్కయన ఆయన ఆన్లైన్ సంస్థకు ఫిర్యాదు చేశారు. వారు సరిగా స్పందించడకపోవడంత పోలీసులను ఆశ్రయించారు. సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. డెలివరీ బాయ్, లేదా ఏజెన్సీ ప్రమేయం వుండొచ్చన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
ఈ రాళ్లు నడుస్తాయి...!
ఈ భూమిపై మనుషులు, ప్రాణం ఉన్న ఇతర జంతువులు నడుస్తుంటాయి. కొన్ని ప్రాణులు గాల్లో విహరిస్తే మరికొన్ని భూమిపై పాకేవి కూడా ఉన్నాయి. ప్రాణం ఉన్న చెట్లు కూడా అవి ఉన్న స్థానం నుంచి పక్కకు కదల్లేవు. అలాంటిది ప్రాణంలేని ఏ వస్తువులైనా ఇతర జీవుల ప్రమేయం లేకుండా పక్కకు కదలవు. ఇలాంటివి మనం కొన్ని హర్రర్ సినిమాల్లో చూసి ఉంటాం. నిజజీవితంలో అది అసాధ్యం. కానీ అదోలోయ ప్రాంతం. అక్కడ రాళ్లన్నీ పరుచుకొని ఉంటాయి. అవి ఎవరూ కదల్చకుండానే ముందుకు కదిలిపోతుంటాయి. రాళ్లేంటి కదలడంమేంటనీ అశ్చర్యపోతున్నారా? అయితే ఈ కథనం చదవండి...! అమెరికాలోని కాలిఫోర్నియాలోని పానామింట్ పర్వతాలకు సమీపంలో ఒకలోయ ఉంది. దీన్ని అందరూ మృత్యులోయ అని పిలుస్తారు. అక్కడ జనసంచారం ఉండదు కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. అక్కడ రాళ్లు జీవం ఉన్న ప్రాణు ల్లా వాటంతట అవే ముందుకు కదులుతాయి. ఈ రాళ్లనే సెయిలింగ్ స్టోన్స్ అనీ, స్లైడింగ్ రాక్స్ అనీ, మూవింగ్ రాక్స్ అనీ ఇలా ఎవరికి తోచిన పేర్లు వారు పెడుతూ వచ్చారు. అలా ముందుకు కదిలే రాళ్ల బరువు 700 పౌండ్ల బరువు ఉంటుంది. రాళ్లు కదులుతాయంటే సరే నమ్ముదాం. కానీ అవి కదిలినట్లు మనకి ఎలా తెలుస్తుంది అనేగా మీ సందేహం. అవి ఎంత దూరం ప్రయాణించాయో ఆ ప్రయాణించిన మేరకు చారలు స్పష్టంగా కనిపిస్తాయి అక్కడ. చార చివరలో రాయి ఆగి ఉంటుంది. ఆ చారల ద్వారా ఆ రాయి ఎక్కడ నుంచి ఎక్కడికి దొర్లుకుంటూ వచ్చిందనే విషయం తెలుసుకోవచ్చు. వంద సంవత్సరాలకుపైగా ఇలా రాళ్లు కదులుతున్నా దానివెనక ఉన్న రహస్యం ఏంటో ఇప్పటివరకూ ఎవరూ చేధించలేదు. రెండు, మూడేళ్లకు ఒకసారే... ఈ రాళ్లు కొలువై ఉన్న సరస్సును అక్కడ పర్యాటక అభిమానులు రేస్ ట్రాక్ ప్లే అంటూ వ్యవహరిస్తారు. ఈ ప్రాంతం కొండల మధ్య ఉన్న ఓ విశాలమైన మైదానంలా, చాలా చదనుగా ఉంటుంది. అయితే రాళ్లు రోజూ కదులుతూ ఉంటాయి అనుకుంటే పొరబాటే. రెండు లేదా మూడేళ్లకు ఒకసారి మాత్రమే ఈ రాళ్లు కదలడం లేదా దొర్లడం జరుగుతూ ఉంటుంది. అదీ సమాంతరంగా ఒక రాయి కదలడం మొదలుపెడితే ఆ రాతితో పాటే మరో రాయి తన దిశను మార్చుకుంటుంది. దిశ మార్చుకున్న రాయి, సమాంతర రాయి రెండూ ఒకే బరువుతో ఉండడం ఇంకో విశేషం. కొన్నిరాళ్లు పదడుగుల దూరం వెళ్లగా మరికొన్ని వంద అడుగులకుపైగా ముందుకు కదిలాయి. కొన్ని కొన్ని రాళ్లు 90 డిగ్రీల కోణంలో కూడా తమ దిశను మార్చుకోవడం విశేషం. వందేళ్ల క్రితమే గుర్తించారు... ఈ ప్రాంతంలో పెద్దగా జంతు సంచారం కూడా ఉండదు. కనుక వాటివల్ల రాళ్లు కదిలే అవకాశం లేదు. జనసంచారం కూడా ఆ ప్రాంతంలో చాలా తక్కువ. కొందరేమో దె య్యాలు ఈ రాళ్లను కదులుస్తున్నాయని అంటే మరికొందరేమో ప్రత్యేకమైన అయస్కాంత లక్షణాలే ఈ రాళ్లను కదులిస్తున్నాయని అంటున్నారు. దాదాపు వందేళ్ల క్రితమే పరిశోధకులు ఈ రాళ్ల కదలికలను మొదటిసారి గుర్తించారు. ఇప్పటికి అరవై ఏడేళ్లుగా వీటి కదలికలపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ పరిశోధనల్లో ఎలాంటి సమాచారం తెలియలేదు. మంచు పర్వత శ్రేణులైతే రాతి శిలలు వేగంగా కదులుతాయనటానికి ఆస్కారం ఉంది. కానీ, ఇక్కడ ఆ దాఖలాలు లేవు. పరిశోధనలు జరుగుతున్నతసేపూ ఒక్క అంగుళం కూడా కదలని రాళ్లు ఆ పరిశోధనలు ముగిసి తిరిగి వెళ్లిపోతున్నప్పుడు కదిలాయి. కానీ వీటిని వీడియోలో బంధించలేక పోయారు. ఫోటోలు మాత్రం తీయగలిగారు. అసలు రహస్యం... ఆ తర్వాత 1955లో, 1972లో బాండ్ షార్ప్, డ్విట్ కేరే అనే శాస్త్రవేత్తలు మళ్లీ పరిశోధనలు మొదలుపెట్టారు. ఆయా ప్రాంతాల్లో అప్పటికే 30 రాతిశిలల్లో కదలిక ఉందని గ్రహించారు. ఏడేళ్ల సుదీర్ఘ కాలంలో పరిశోధనల్లో కొంత పురోగతి కనిపించినప్పటికీ సంగతులేవీ సరిగ్గా తెలియలేదు. ఆ ప్రాంతం కొండల మధ్యలో ఉంటుంది. వర్షాకాలంలో అక్కడ భారీగా వర్షాలు కురుస్తాయి. కొండల వాలు వెంబడి వర్షం నీరు జారి మైదానాన్ని ముంచెత్తుతుంది. ఆ ప్రాంతం చిన్నపాటి సరస్సులా మారుతుంది. ఎండాకాలంలో నీరు పూర్తిగా ఇంకిపోతుంది. ఎండిన నేలలో బీటలు పడతాయి. అప్పుడు ఆ నేల మీద పూర్తిగా తడి ఆరని పరిస్థితుల్లో నేల చిత్తడిగా ఉంటుంది. ఈ స్థితిలో రాళ్లకి నేలకి మద్య రాపిడి కాస్త తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో గాలి ప్రభావం వల్ల రాళ్లు మరికొంచెం వేగంగా కదిలే అవకాశం ఉంది. ఆ ప్రాంతంలో గమనించదగిన విషయం ఏంటంటే అక్కడ బలమైన ఈదురు గాలులు వీస్తాయి. అక్కడి గాలులు సామాన్యంగా నైరుతి దిశ నుంచి ఈశాన్యదిశ వైపు వీస్తుంటాయి. విచిత్రమేమిటంటే, కదిలే రాళ్ల దిశ కూడా ఈ క్రమంలోనే ఉంటుంది. ఈ విషయమై ఓ వైజ్ఞానిక బృందం పరిశోధించింది. మంచు, గాలి రాళ్ల కదలికకు కారణమనీ, వేసవి కాలంలో వీటిలో కదలికలు లేవనీ, శీతాకాలంలో మాత్రమే కదులుతున్నాయని తేల్చారు. ఆయా కాలాల్లో వీచే గాలులు,శీతోష్ణ స్థితిగతులు ఇవన్నీ రాతి కదలికలపై ప్రభావాన్ని చూపుతున్నాయని కనుగొన్నారు. – సాక్షి స్కూల్ ఎడిషన్ -
అక్కడ రాళ్లే నైవేద్యం
లేపాక్షి మండలంలోని కోడిపల్లి నుంచి హిందూపురానికి వెళ్లే రహదారిలో ఒక కిలోమీటర్ దూరం ప్రయాణిస్తే కొత్తపల్లిక్రాస్ వద్ద ఉన్న బట్ల బైరవేశ్వర స్వామికి రాళ్లను నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఆశ్చర్యంగా ఉంది కదూ! ఈ దేవుడికి జంతుబలులు, అభిషేకాలు, అర్చనలు అంటూ ప్రత్యేకించి ఏవీ ఉండవు. ఆ దారి గుండా ప్రయాణించే వారు మూడు రాళ్లను నైవేద్యంగా సమర్పించి వెళుతుంటారు. ఇలా చేయడం వల్ల తమ కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఇలా భక్తులు సమర్పించిన రాళ్లు ఓ గుట్టగా పోగయ్యాయి. అయితే దీనికి ఓ ప్రాచీన కథను స్థానికులు నేటికీ వినిపిస్తున్నారు. అదేమంటే పూర్వం తిరుపతికి పాదయాత్రగా కుటుంబసభ్యులతో బయలుదేరిన బైరవేశ్వరుడనే భక్తుడు.. ఈ ప్రాంతానికి చేరుకునే సమయానికి చీకటి పడింది. దీంతో ఆ రాత్రికి అక్కడే విడిది చేశారు. తెల్లవారే సరికి భైరవేశ్వరుడు చనిపోయినట్లు గుర్తించి, అక్కడే ఖననం చేశారు. ఆ సమయంలో అతని సమాధిపై ఒక్కొక్కరు మూడు రాళ్లు వేసి వెళ్లారు. మనసులో ఏదైనా కోరుకుని ఇక్కడ మూడు రాళ్లు వేస్తే అవి నెరవేరుతూ వస్తుండడంతో ఆ మరుసటి రోజున కోడి పుంజులను ఇక్కడ బలివ్వడం మొదలు పెట్టినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. - లేపాక్షి (హిందూపురం) -
రాజు గారి ‘శిలా’శాసనం
మాయమవుతున్న గత పాలకుల శిలా ఫలకాలు శంకుస్థాపన రాళ్లు కనిపించకూడదట! పిఠాపురంలో నీచ సంస్కృతి రాచరికం పోయి ప్రజాస్వామ్యంలో అడుగుపెట్టినా ఆ ఛాయలు మాత్రం పిఠాపురం నియోజక వర్గంలో పోవడం లేదు. రాజుల పాలనలో యుద్ధాలు జరిగేవి. విజేతగా నిలిచిన రాజుదే ఆ రాజ్యం. అందుకే గత రాజుల ఆనవాలు కనిపించకుండా ధ్వంసం చేసేవారు. అదే పద్ధతిని ఇక్కడ అమలు చేస్తున్నారు ఈ రాజుగారు. శాశ్వతంగా తానే ఉండిపోతాననే భ్రమలో ఉన్నట్టున్నారు ఈ రాజుగారు. పాత శిలా ఫలకాలు ఒక్కొక్కటినీ పడగొట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేస్తున్నారు. పిఠాపురం: చరిత్రను చాటి చెప్పే శిలా శాసనాలను రాచరికంలో రాజులు వేయించుకునే వారు. అలాగే ప్రస్తుత కాలంలో పాలకులు తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాల జ్ఞాపకాలుగా శిలా ఫలకాలను వేయించుకుంటున్నారు. అంత వరకూ బాగానే ఉన్నా పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం ఎక్కడ చూసినా ఆయన పేరు తప్ప మరే ఇతర నాయకుల పేర్లు కపించకూడదనేది ఇక్కడి రాజు గారి శిలాశాసనం. రెండు, మూడేళ్ల ముందు ఒకరు శంఖుస్థాపన చేస్తారు ... పూర్తయిన తరువాత ఆ రోజుకి ఎవరు ప్రజాప్రతినిధిగా ఉంటే వారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవం చేస్తారు. ఆ సమయంలో శంఖుస్థాపన చేసినవారి పేరుతోపాటు ప్రారంభోత్సవం చేసినవారి పేరు ఉండడం సహజం. కానీ ఈయనగారు ప్రారంభించిన ఏ కార్యాలయంలోనూ తన ప్రారంభోత్సవ శిలాఫలకం తప్ప శంఖుస్థాపన శిలాఫలకం మాత్రం కనిపించకూడదనే హుకుం జారీ చేయడంతో జుత్తు పీక్కుంటున్నారు ఆయా శాఖల అధికారులు. ఈ నిరంకుశత్వ విధానాలు ఎక్కడో కాదు పిఠాపురం నియోజకవర్గంలో... ఆ నియోజకవర్గానికి శాసన సభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్వీఎస్ఎన్ వర్మ జమానాలో ఈ తంతు సాగుతోంది. పద్థతిదీ... సాధారణంగా ఏ ప్రభుత్వ భవనమైనా ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేపడితే ఆ సమయంలో అధికారంలో ఉన్న పాలకులు శంఖుస్థాపన చేస్తారు. ఆ భవనాలు పూర్తయ్యాక వాటిని పాలకులు ప్రారంభోత్సవం చేస్తారు. ఆ రెండు కార్యక్రమాలకు సంబంధించి ఏ పాలకులు కార్యక్రమంలో పాల్గొన్నా రెండు శిలాఫలకాలనూ ఆ కార్యాలయంలో శాశ్వతంగా కనిపించే విధంగా ఏర్పాటు చేయడం ఆనవాయితీ. 2014లో ఎన్నికలు జరిగే వరకు అలాగే కొనసాగింది కాని ఎన్నికల అనంతరం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాత్రం పిఠాపురం నియోజకవర్గంలో దీనికి భిన్నంగా జరుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఇతర నాయకులు చేసిన శంఖుస్థాపన రాళ్లు మాయమవుతుండగా కేవలం ఇప్పటి నాయకులు వేసిన ప్రారంభోత్సవ రాళ్లు మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు. అలాగే గతంలో వేసిన శంఖుస్థాపన రాళ్లను మూలన పడేయడం ...లేదా ఎక్కడ వేసిన రాళ్లను అక్కడ వదిలేయడం జరుగుతోందంటున్నారు. . తాజా ఘటనలివీ... కొత్తపల్లి మండలంలోని మండల కేంద్రమైన కొత్తపల్లి పోలీసు స్టేషన్, తహసీల్దారు కార్యాలయం, ప్రభుత్వాసుపత్రి భవన నిర్మాణాలకు ఎన్నో ఏళ్ల నిరీక్షణ అనంతరం అప్పటి ఎమ్మెల్యే వంగా గీతా విశ్వనా«థ్ శంఖుస్థాపన చేశారు. అనంతరం ఎట్టకేలకు ఆ భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇంతలో ఎన్నికలు రావడం ఆ భవనాలను ఎన్నికల అనంతరం కొత్త పాలకులు ప్రారంభోత్సవాలు చేశారు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఆ కార్యాలయాల వద్ద మాత్రం గతంలో పాలకులు చేసిన శంఖుస్థాపన రాళ్లను మూడు ముక్కలు చేసి మూలన పడేయడం గమనార్హం. గతంలో కొత్తపల్లి మండల పరిషత్ కార్యాలయాన్ని గతంలో పాలకులు ప్రారంభించగా అక్కడ మాత్రం శంఖుస్థాపన ప్రారంభోత్సవ శిలాఫలకాలు ఏర్పాటు చేశారు. అదే కార్యాలయంలో ఆధునికీకరణ పనులు చేపట్టి ప్రస్తుత నాయకుల పేరుతో కొత్త శిలాఫలకాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇలా నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పలు అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించి గతంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ధ్వంసం చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. + తాజాగా పిఠాపురం మండలంలో మంగితుర్తిలో ఒక దాత ఏర్పాటు చేసిన శిలాఫలకం తీయించేసి ఎమ్మెల్యే వర్మ ప్రారంభోత్సవం చేసిన శిలాఫలకం ఏర్పాటు చేయించడం ఇందుకు తార్కాణం. ఈ తంతు ఆయన పదవి చేపట్టిన నాటి నుంచి జరుగుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కాలం మారుతోంది ...ప్రభుత్వాలు మారుతుంటాయి ... నాయకులు తారుమారవుతుంటారు...అలా అని గత పాలకుల జ్ఞాపకాలను తుడిచేయాలనే కుటిల ఆలోచన మాత్రం ఇప్పటి వరకు ఎవరికీ రాలేదని ... ఇంత దారుణం ఎప్పుడూ చూడలేదని నియోజకవర్గ ప్రజలే ముక్కున వేలేసుకుంటున్నారు. -
ట్రాక్టర్ బోల్తా.. డిగ్రీ విద్యార్థి దుర్మరణం
కళ్లను దానం చేసిన కుటుంబ సభ్యులు బనగానపల్లె రూరల్ : నాపరాళ్ల ట్రాక్టర్ బోల్తా పడడంతో డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన నందివర్గం పోలీసుస్టేషన్ పరిధిలోని రామకృష్ణాపురం అడ్డ రోడ్డు బుధవారం చోటుచేసుకుంది. రామకృష్ణాపురం గ్రామానికి చెందిన బుడిగి మద్దిలేటి, సుభద్ర దంపతులకు మోహన్‌కృష్ణ (22), హరికృష్ణ.. ఇద్దరు కుమారులు. బనగానపల్లెలోని ఓ ప్రైవేట్ కళాశాలలో మోహన్‌కృష్ణ బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చేశాడు. హరికృష్ణ ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసి చివరి సంవత్సరం చేరేందుకు ఉన్నారు. గ్రామంలోని గనిలో నుంచి నాపరాళ్లను ట్రాక్టర్లో పలుకూరు క్రాస్ రోడ్డు వద్ద ఉన్న నాపరాళ్ల డిపోల వద్ద తరలించేందుకు తండ్రి మద్దిలేటితో పాటు మోహన్‌కృష్ణ కూడా లోడింగ్ పనికి వెళ్లాడు. నాపరాళ్ల లోడ్‌ను డిపో వద్దకు తరలిస్తుండగా ఎదురుగా వస్తున్న మరో వాహనానికి సైడ్ ఇవ్వబోయి ట్రాక్టర్ అదుపు తప్పింది. దీంతో ట్రాక్టర్‌కు, ట్రాలీకి ఉన్న బోల్ట్ ఊడిపోవడంతో ట్రాలీ బోల్తాపడి ట్రాలీలో కూర్చున్న మోహన్‌కృష్ణ పైనాపరాళ్లు పడడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న నందివర్గం ఎస్ఐ హనుమంతరెడ్డి ఘటన స్థలానికి వెళ్లి.. మృతదేహం పై పడ్డ నాపరాళ్లను తొలగించి పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చేతికొచ్చిన పెద్ద కుమారుడు మోహన్‌కృష్ణ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. కళ్లను దానం చేసిన కుటుంబ సభ్యులు ఎస్ఐ హనుమంతరెడ్డి సహకారంతో మోహన్ కృష్ణ కళ్లను తలిదండ్రులు దానం చేశారు. కర్నూలుకు చెందిన కంటి వైద్యనిపుణులు డాక్టర్ భరణికుమార్ ఆధ్వర్యంలో టెక్నిషియన్ రంగారెడ్డి మృతుడు మోహన్ కృష్ణ కళ్లను సేకరించారు. -
నాపరాళ్ల లారీ బోల్తా
- డ్రైవర్, క్లీనర్‌ను కాపాడిన పోలీసులు ఆస్పరి: బిణిగేరి గ్రామం సుంకులమ్మ ఆలయ సమీపంలో శుక్రవారం తెల్లవారు జామున ఓ లారీ బోల్తా పడింది. అనంతపురం నుంచి పూణేకు నాపరాళ్ల లోడ్‌తో వెళ్తున్న లారీ టైరు పంక్చర్ కావడంతో అదుపు తప్పి కల్వర్టులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ పూర్తిగా దెబ్బతినగా.. అందులోని డ్రైవర్ పుల్లారెడ్డి, క్లీనర్ బాషా లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న ఆస్పరి ఎస్ఐ వెంకటరమణ వెంటనే ఆదోని అగ్నిమాపక సిబ్బందికి, 108కు సమాచారం ఇచ్చి ఘటన స్థలానికి చేరుకున్నారు. రెండు గంటలు పాటు శ్రమించి అతి కష్టంపై డ్రైవర్, క్లీనర్‌ను బయటకు తీశారు. చికిత్స నిమిత్తం 108లో ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు వ్యక్తుల ప్రాణాలను కాపాడిన ఎస్ఐ, అగ్నిమాపక సిబ్బంది. 108 సిబ్బందిని పలువురు అభినందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
గని కార్మికుడు మృతి
కొలిమిగుండ్ల: నాపరాళ్ల గనిలో ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. అంకిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన గంగయ్య (39) అదే గ్రామానికి చెందిన పుల్లారెడ్డి నాపరాతి గనిలో సోమవారం కూలీకి వెళ్లాడు. కటింగ్ మిషన్‌తో కోత కోసిన ఆరడుగల ఎత్తైన నాపరాయిని వెలికి తీసి వరుసలో పెట్టేక్రమంలో కాలు జారి కింద పడ్డాడు. అతని తలపై నాపరాయి పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య కుళ్లాయమ్మ, కుమారుడు గణేష్ ఉన్నారు. ఏఎస్ఐ ఉస్మాన్‌ఘని తాడిపత్రి ప్రభుత్వ వైద్యశాలకు చేరుకొని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. -
తుంగఛిద్రం!
బింగిరాళ్లకు రెక్కలు - హద్దులు దాటుతున్న విలువైన ఖనిజం - బాల కార్మికులతో సేకరణ - నదీ తీరంలో టీడీపీ నేత పాగా - ఐదేళ్లుగా సాగుతున్న వ్యాపారం - చోద్యం చూస్తున్న మైనింగ్, రెవెన్యూ అధికారులు తుంగభద్ర ఎడారిగా మారుతోంది. నదీ తీరంలో కోట్లాది రూపాయల విలువైన బింగిరాళ్ల దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో అధికార పార్టీకి చెందిన తూర్పు గోదావరి జిల్లా నేత కనుసన్నల్లో ఈ దందా జరుగుతోంది. ఐదేళ్లుగా అడిగే నాథుడే లేకపోవడంతో భూగర్భ జలాలపై ప్రభావం చూపుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. స్థానిక టీడీపీ నేత అండతో పాటు అధికారుల చేతులు తడుస్తుండటంతో ఎవ్వరూ నోరు మెదపడం లేదని తెలుస్తోంది. కర్నూలు(వైఎస్ఆర్ సర్కిల్): జిల్లా మీదుగా ప్రవహిస్తున్న తుంగభద్ర తీరంలోని బింగిరాళ్లకు(పెబ్బెల్ క్వార్ట్ ్జ) రెక్కలొచ్చాయి. ఎలాంటి ఉపయోగం లేని విధంగా కనిపించే ఈ రాళ్ల ధర టన్ను రూ.3వేల నుంచి రూ.5వేలు పలుకుతోంది. నదీ తీరంలో వందల ఎకరాల్లో విస్తరించిన ఈ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. వరద ఉద్ధృతంగా ఉన్న సమయంలో ఈ రాళ్లు వేగంగా వచ్చే నీటిని నిలువరించే వీలుంటుంది. తద్వారా భూగర్భ జలాల పెంపునకు ఈ రాళ్లు దోహదం చేస్తాయి. ఇంతటి విలువైన రాళ్లను అక్రమార్కులు సరిహద్దులు దాటిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వందలాది మంది కూలీలకు రోజుకు ఒక్కొక్కరికి రూ.120 చెల్లిస్తూ ఈ అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగిస్తున్నారు. కూలీలు సేకరించిన రాళ్లను 10-20 ఎంఎం, 20-30, 30-40 ఎంఎం.. ఇలా వంద వరకు సైజుల్లో నదీ తీరంలోనే విభజించి ఓ ప్రముఖ ప్రయివేట్ పాఠశాల వద్దకు రాత్రిళ్లు ఆటోల్లో తరలించి డంప్ చేస్తున్నారు. అక్కడ రాళ్లను సంచుల్లో నింపి బెంగళూరు, హైదరాబాద్, నల్లగొండ, విజయవాడ, అమరావతితో పాటు ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. కోట్లు కురిపిస్తున్న ఖనిజం ఒక్క పంచలింగాల ప్రాంతంలోనే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వ్యాపారి ఈ రాళ్ల వ్యాపారం జోరుగా సాగిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ కూలీలు ప్రతి రోజూ 40 టన్నుల రాళ్లు సేకరించి లారీల ద్వారా హద్దులు దాటిస్తున్నారు. ఇటీవల నల్గొండతో పాటు, విజయవాడ, బెంగళూరు ప్రాంతాల్లో ఖనిజానికి డిమాండ్ ఏర్పడింది. ఒక్కో లారీలో 40 టన్నుల వరకు తరలించే అవకాశం ఉండటంతో.. టన్ను రూ.3వేలు చొప్పున సొమ్ము చేసుకుంటున్నారు. ఈ లెక్కన ఒక్క లోడుతో రూ.1.20 లక్షలు ఆక్రమార్కుల జేబుకు చేరుతోంది. గత ఐదేళ్లుగా సాగుతున్న ఈ వ్యాపారాన్ని పరిశీలిస్తే కోట్లాది రూపాయల మేర ప్రభుత్వ ఖజానాకు గండి పడుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ సాగిస్తున్న ఈ వ్యవహారంలో బాల కార్మికులను కూలీలుగా మార్చడం గమనార్హం. బహిరంగమే.. నోరు మెదపరు నగరానికి కూతవేటు దూరంలోని నదీ తీరంలో రాళ్ల తరలింపు నిత్యకృత్యమే అయినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఎలాంటి అనుమతి లేకుండా నది వద్దే రాళ్లను గ్రేడింగ్ చేస్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. గనుల శాఖలోని ఓ అధికారితో పాటు రెవెన్యూ, పోలీసు యంత్రాంగానికి సదరు వ్యాపారి లారీకి రూ.2వేల చొప్పున మామూళ్ల రూపంలో ముట్టజెబుతుండటం వల్లే వ్యవహారం సాఫీగా సాగిపోతున్నట్లు తెలుస్తోంది. బింగిరాళ్ల ఉపయోగం - మంచినీటిని శుద్ధి చేసే ట్యాంకుల్లో.. - వాటర్ ప్యూరిఫయర్లలో.. - రహదారులు, హోటళ్లు, విలాసవంతమైన ఇళ్లకు అలంకరణ. మా దృష్టికి రాలేదు తుంగభద్ర నుంచి పెబ్బెల్క్వార్ట్ ్జను అక్రమంగా తరలిస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. ఎవరైనా అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. - వెంకటరెడ్డి, భూగర్భ గనుల శాఖ -
జల్లికట్టుపై కోయంబత్తూర్‌లో ఆందోళన
-
‘పోలవరం’ పనులు ప్రాణాంతకం
కుమ్మరిలోవ కాలనీపై పడిన కాలువ బండరాళ్లు తృటిలో తప్పిన పెనుప్రమాదం ఆందోళనలో స్థానికులు తాత్కాలికంగా పనులు నిలిపివేత తునిరూరల్ : తుని మండలం కుమ్మరిలోవ కాలనీని ఆనుకుని ఉన్న కొండపై నుంచి తాండవ నదిమీదుగా నిర్మించనున్న పోలవరం ఎడమ కాలువ అక్విడెక్ట్ పనులతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. భారీ యంత్రాలు వెళ్లేందుకు వీలుగా కొండపై రహదారి ఏర్పాటు చేస్తుండగా మంగళవారం బండరాయి అదుపు తప్పి కిందకు దొర్లివచ్చింది. ఈ బండరాయి కొండ దిగువన ఉన్న గోగాడ పైడితల్లి ఇంటి ప్రధాన గోడను ధ్వంసం చేసింది. ఈ ఘటనతో తమ వంటింట్లో సామాన్లు ధ్వంసమయ్యాయని బాధితురాలు బుధవారం వాపోయింది. పాఠశాల నుంచి పిల్లలు రాకపోవడంతో పెద్దప్రమాదం తప్పిందని, వారు వచ్చుంటే ఆ ప్రాంతంలోనే ఆడుకునేవారని ఆందోళన వ్యక్తం చేసింది. 20 అడుగులు ఎత్తునుంచి ఈ బండరాయి పడిందని, కాంట్రాక్టర్ సిబ్బంది వచ్చి పరిశీలించి పనులు నిలిపివేసినట్టు ఆమె వివరించింది. పగుళ్లిచ్చిన ఇంటి గోడ, బండరాయిని ఆమె విలేకరులకు చూపించారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు అందుబాటులో ఎవరూ లేరు. ఇటీవల పనులు చేసేందుకు పీఎస్‌కె, హెచ్‌ఈఎస్ (జాయింట్ వెంచర్)కు అప్పగించారు. కాలనీ ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉన్నా నష్టపరిహారం ఇవ్వలేదని, పనులు చేస్తున్నట్టు కనీస సమాచారం ఇవ్వలేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం సంభవించగానే పనులు నిలిపివేశారన్నారు. ప్రాథమిక పనులు చేస్తేనే తీవ్రత ఇలా ఉంటే ప్రధాన పనులు చేస్తే ఏవిధంగా ఉంటుందోనని స్థానికులు భీతిల్లుతున్నారు. -
పట్టాలపై రాళ్లు పెట్టిన మతిస్థిమితం లేని వ్యక్తి
అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు సమాచారం ఇచ్చిన తమిళనాడు ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం మహబూబాబాద్ : మానుకోట రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫామ్‌కు ఇరువైపులా ఉన్న డౌన్‌లైన్ పట్టాలపై ఆదివారం రాత్రి సుమారు 10 గంటల నుంచి 10.30 మధ్యలో మతిస్థిమితం లేని వ్యక్తి కంకర రాళ్లు పెట్టాడు. గమనించిన ఆర్పీఎఫ్ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆర్పీఎఫ్ అవుట్‌పోస్ట్ ఎస్సై కె.మధు కథనం ప్రకారం.. బలార్షా నుంచి విజయవాడ వెళ్లే తమిళనాడు ఎక్స్‌ప్రెస్ ఆదివారం రాత్రి మానుకోట రైల్వేస్టేషన్ నుంచి డౌన్‌లైన్‌లో బయల్దేరింది. ఆ రైలుకు మానుకోట రైల్వేస్టేషన్ ఏ క్యాబిన్ సమీపంలో పలు కంకరరాళ్లు తగలగా ప్లాట్‌ఫారమ్ దాటిన తర్వాత కూడా కంకర రాళ్లు ఎగిసిపడ్డాయి. పెద్ద శబ్దం వచ్చింది. దీంతో గుండ్రాతిమడుగు రైల్వేస్టేషన్లో డ్రైవర్ రైలును ఆపాడు. రైలును తనిఖీ చేసుకొని వెంటనే మానుకోట రైల్వేస్టేషన్‌కు సమాచారమిచ్చాడు. కేవలం 3 నిమిషాల వ్యవధిలోనే రైలు తిరిగి బయల్దేరింది. దీంతో ఆర్పీఎఫ్ సిబ్బంది వెళ్లి పరిశీలించగా ప్లాట్‌ఫామ్‌కు ఏ క్యాబిన్‌కు మధ్య పట్టాలపై కొన్ని కంకరరాళ్లు, రైల్వేస్టేషన్ ఆర్‌యూబీకి మధ్య సుమారు 10 కంకర రాళ్లను పట్టాలపై మతిస్థిమితం లేని వ్యక్తి పెట్టడాన్ని గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని విచారించి, సోమవారం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మతిస్థిమితం లేకపోవడం, మూగవాడు కావడం వల్ల సరైన సమాధానం రావడం లేదని ఆర్పీఎఫ్ ఎస్సై తెలిపారు. తెలంగాణకు చెందినవాడా లేక ఇతర రాష్ట్రాలకు చెందిన వాడా అనేది తెలియడం లేదన్నారు. కంకరరాళ్లు పట్టాలపై ఏర్పాటు చేయడం ప్రమాదకరమని ఏ మాత్రం ఎక్కువ రాళ్లు ఉన్నా రైలు చక్రాలు కిందికి దిగేవని, దీంతో ప్రమాదం జరిగి ఉండేదని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. ఏదేమైనా రైలుకు ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. విజయవాడ రైల్వే ఇంటర్ లాక్ సిస్టం పనుల కారణంగా కొన్ని రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. దీని వెనుక మరో రైలు రాకపోవడంతో వెంటనే రైల్వే పోలీసులు అప్రమత్తం కావడంతో ప్రమాదం జరగకుండా చూశారు. -
కేటీఆర్‌కు సిరిసిల్ల జిల్లా సెగ
కాన్వాయిపై రాళ్లు రువ్విన అడ్వకేట్ జేఏసీ నాయకులు ఎల్లారెడ్డిపేట: కరీంనగర్ జిల్లా గంభీరావుపేట మండలం మల్లుపల్లె వద్ద మంత్రి కేటీఆర్ పర్యటనను సిరిసిల్ల జిల్లా డిమాండ్‌తో అడ్వకేట్ జేఏసీ నాయకులు అడ్డుకోవడం, రాళ్లదాడితో ఆదివారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సంఘటనలో ఆర్మీ పోలీస్ వ్యానుతో పాటు ఎల్లారెడ్డిపేట ఎంపీపీ ఎలుసాని సుజాత వాహనం ధ్వంసమయ్యాయి. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. వరదలతో ఎగువ మానేరు జలకళ సంతరించుకోగా మంత్రి కేటీఆర్ ఆదివారం సాయంత్రం జలాశయూన్ని సందర్శించారు. అనంతరం ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్‌కు వస్తున్న క్రమంలో మల్లుపల్లె వద్ద దెబ్బతిన్న పంట పొలాలను మంత్రి పరిశీలించి తిరిగి వెళ్తుండగా, న్యాయవాద జేఏసీ నాయకులు మంత్రి వాహనాన్ని అడ్డుకున్నారు. సిరిసిల్ల జిల్లా ఏర్పాటుపై హామీ ఇవ్వాలని, లేకుంటే కదలనిచ్చేది లేదని మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి వాహనానికి అడ్డుగా కూర్చోవడంతో పరిస్థితి చేయి దాటిపోయింది. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు మంత్రి కాన్వాయిపై రాళ్లు రువ్వడంతో అప్రమత్తమైన పోలీసులు లాఠీలకు పని చెప్పారు. -
చిన్నారి కళ్లలో నుంచి రాళ్లు
-
విద్యార్థిని కంటి నుంచి రాళ్ళు
రాళ్ళు వస్తున్న సమయంలో కంటి నొప్పితో అవస్థ నాలుగు రోజులుగా ఇబ్బందులు పడుతున్న విద్యార్థిని మహబూబాబాద్ : 2వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని కుడి కంటి నుంచి నాలుగు రోజులుగా చిన్న చిన్న రాళ్ళు వస్తున్నాయి. దీంతో ఆ విద్యార్థిని ఆ నొప్పితో అవస్థలు పడుతున్నది. వరంగల్ జిల్లా మహబూబాబాద్ పట్టణ శివారు లెనిన్‌నగర్ కాలనీకి చెందిన కాగితపు రాంమూర్తి, విజయ దంపతుల పెద్ద కుమార్తె స్పందన కుడి కన్ను నుంచి నాలుగు రోజులుగా చిన్న రాళ్ళు వస్తున్నాయి. కంటి నుంచి నీరు కారడంతో పాటు రాళ్ళు రావడంతో తీవ్ర నొప్పితో బాధపడుతోంది. ప్రతిరోజు సుమారు 10 నుంచి 12 చిన్న చిన్న రాళ్ళు బయటకు వస్తున్నాయి. కంటి నుంచి వచ్చే నీరుతో ఆ చిన్న రాయి రెప్ప దగ్గరికి చేరుకుంటుంది. దాన్ని బయటకు తీసిన తర్వాత నొప్పి తగ్గుతుంది. మానుకోటలోని ఓ ప్రయివేట్ కంటి వైద్యశాలకు తీసుకెళ్ళగా వైద్యులు పరీక్షలు నిర్వహించి చికిత్సను అందించారు. అయినప్పటికీ కంటి నుంచి రాళ్ళు వస్తూనే ఉన్నాయి. పెద్దాసుపత్రులలో చూపిస్తే వైద్య పరీక్షలు నిర్వహించి అందుకు కారణాన్ని తెలియపరుస్తారని స్థానిక వైద్యులు తెలిపారు. తన కూతురికి మెరుగైన వైద్యాన్ని అందించే స్థాయిలో లేనని, దాతలు ఆదుకుని తన కూతురుకు ఆ బాధ నుంచి విముక్తి కల్పించాలని రాంమూర్తి వేడుకుంటున్నాడు. -
యాత్రికుల బస్సుపై రాళ్ల దాడి
జమ్మూకశ్మీర్: జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. వేర్పాటువాదుల అల్లర్లతో ఇప్పటికే 23 మంది మృతి చెందారు. అల్లరిమూకలను అదుపు చేయడానికి భద్రతాబలగాలు ప్రయత్నిస్తున్నాయి. అమర్నాథ్ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులను అధికారులు జమ్మూకు తరలిస్తున్నారు. బాల్తాల్ బేస్ క్యాంపు నుంచి అమర్నాథ్ యాత్రికులను జమ్మూకు తరలిస్తుండగా అల్లరిమూకలు రాళ్ల దాడికి పాల్పడ్డాయి. జమ్మూకు 150 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. వదంతులు వ్యాపించకుండా అధికారులు మొబైల్ ఇంటర్నెట్ సేవలను సైతం నిలిపేశారు. -
న్యూస్ ఛానల్ కార్యాలయంపై రాళ్ల దాడి
విజయవాడ: కృష్ణా జిల్లా విజయవాడలోని ఓ న్యూస్ ఛానల్ కార్యాలయం పైకి గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తత రాజుకుంది. నగరంలోని నెంబర్ 1 న్యూస్ ఛానల్‌పై గుర్తుతెలియని దుండగులు శుక్రవారం రాత్రి రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో కార్యాలయ భవనంలోని అద్దాలు స్వల్పంగా ధ్వంసం అయ్యాయి. దీంతో సదరు టీవీ ఛానల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోందని.. విచారణ అనంతరం వివరాలు తెలియజేస్తామని అధికారులు తెలిపారు. -
అయోధ్యలో అలజడి..
-
రెండో ఘాట్‌లో కూలిన కొండ చరియలు
తిరుమల : తిరుమలలో మంగళవారం కుండపోతగా వర్షం కురిసింది. ఆదివారం ప్రారంభమైన వర్షం మంగళవారం సాయంత్రం వరకు కొనసాగింది. ఆది, సోమవారాల్లో దఫదఫాలుగా కురిసిన వర్షం మంగళవారం మాత్రం ప్రభావం పెంచింది. దీనివల్ల తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్‌లో 11, 12, 14 కిలోమీటర్ల ప్రాంతాల్లో కొండ చరియలు కూలి రోడ్డు మీద పడ్డాయి. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా వాటిని తొలగించారు. వర్షాలపై టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు ఇంజినీర్లతో ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుని, అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. ఐదు జలాశయాల నుంచి నీరు విడుదల గతవారం కురిసిన వర్షాలకే తిరుమలలోని గోగర్భం, ఆకాశగంగ, పాపవినాశనంతో పాటు జంట ప్రాజెక్టులైన కుమారధార, పసుపుధార ప్రాజెక్టులు నిండాయి. అధికారులు ముందు జాగ్రత్తగా డ్యాముల నుంచి నీటిని కిందికి వదిలిపెట్టారు. తాజాగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షంతో డ్యాముల్లోకి చేరుతున్న నీటి శాతం మేరకు మంగళవారం కిందికి వదిలిపెట్టారు. ఇదే పరిస్థితి తిరుపతిలోని కల్యాణీ డ్యాంలో కూడా ఉంది. -
ప్రమాదకరంగా మారిన శ్రీవారి మెట్టు మార్గం
-
యువకుడి దారుణ హత్య
అనంతపురం: ఇంటి ముందు నిద్రిస్తున్న వ్యక్తి పై శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు దాడి చేసి బండరాళ్లతో హతమార్చారు. ఈ ఘటన అనంతపురం జిల్లా శెట్టూరు మండలం చింతర్లపల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన వన్నూరు స్వామి(26) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం ఇంటి ముందు నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని దుండగులు దాడి చేసి బండరాళ్లతో మోది హత్య చేశారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. -
ఎక్స్‌ప్రెస్‌వేలో వాహనాలపై రాళ్ల వర్షం
పుణె: ప్రసిద్ధ ముంబై- పుణె ఎక్స్‌ప్రెస్ రహదారిపై వెళుతున్న వాహనాలపై పెద్ద పెద్ద బండరాళ్ల వాన కురిసింది. రహదారిలోని అదోషి టన్నెల్ వద్ద ఆదివారం మద్యాహ్నం కొండచరియలు విరిగిపడటంతో ఒక్కసారిగా బండరాళ్లు కూలి ఓ కారు, మరో రెండు వాహనాలపై పడ్డాయి. ఈ ప్రమాదంలో కనీసం ముగ్గురు మరణించినట్లు తెలిసింది. చిత్రంలో కినిపిస్తున్న కారుపై పెద్ద బండరాళ్లు నేరుగా పడటంతో అందులో ప్రయాణిస్తున్నవారు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. రహదారిపై రాళ్లు గుట్టలా పేరుకుపోవడంతో ఇరువైపులా భారీ స్థాయిలో ట్రాఫిక్ నిలిచిపోయింది. యంత్రాలతో రాళ్లను తొలిగిస్తున్న పోలీసులు మరికొద్ది గంటల్లో ట్రాఫిక్ క్లియర్ చేస్తామని చెప్పారు. ముంబై- పుణె ఎక్స్ ప్రెస్ హైవేపై ఇలాంటివి ఐదారు టన్నెల్స్ ఉన్నాయి. దీంతో అధికారులు అన్నిచోట్ల ముందస్తు రక్షణచర్యలు చేపట్టారు. -
బీసీ ఎంపీలను రాళ్లతో కొట్టిస్తా: ఆర్.కృష్ణయ్య
సంగారెడ్డి క్రైం: పార్లమెంట్లో బీసీల సమస్యలను ప్రస్తావించని బీసీ ఎంపీలను రాళ్లతో కొట్టిస్తామని ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించేందుకు బీసీలంతా తీవ్రవాదులుగానో, ఉగ్రవాదులుగానో మారుతారని చెప్పారు. మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్రా ప్రభుత్వాలు బీసీ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని, సమస్యలపై ఇద్దరు సీఎంలను నిలదీస్తామని చెప్పారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కేసీఆర్ ఏ ఒక్కరికీ కూడా ఉద్యోగం ఇవ్వలేదని విమర్శించారు. -
రాయి పడుద్ది!
కిడ్నీలో స్టోన్స్ కిడ్నీలో రాళ్లు పడ్డ విషయం తెలియగానే మన గుండెల్లో రాయి పడుతుంది. అయితే గుండెల్లోని రాయి కనిపించదు కానీ కిడ్నీలో రాయి పరీక్షల్లో కనిపిస్తుంది. ఇలా కిడ్నీ రాయిపడటానికి చాలా కారణాలున్నాయి. మనలో జరిగే అనేక జీవకార్యకలాపాల తర్వాత వెలువడే వ్యర్థాలు, విషపదార్థాలను రక్తం నుంచి వేరు చేసి బయటకు పంపే కీలకమైన భూమికను మన మూత్రపిండాలు నిర్వహిస్తుంటాయి. ఆ టైమ్‌లో మన కిడ్నీలో కొన్ని పదార్థాలు క్రమంగా పేరుకుపోతూ స్ఫటికాకృతిని సంతరించుకుంటాయి. నీళ్లు తక్కువగా తీసుకునేవారిలోనూ, చాక్లెట్లు, కెఫిన్ వంటి వాటిని ఎక్కువగా తీసుకునే వారిలోనూ, ప్రత్యేకంగా వేసవికాలంలో ఏసీ రూమ్స్‌లో ఎక్కువగా ఉంటూ, తక్కువగా నీళ్లు తాగే సందర్భాల్లో కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ రాళ్ల నివారణ, చికిత్స ఎలాగో తెలుసుకుందాం. కిడ్నీ రాయితో పాటూ గుండెల్లో రాయినీ తొలగించుకుందాం. మనలో నడుముకు ఇరువైపులా చిక్కుడు గింజ ఆకృతిలో రెండు మూత్రపిండాలుంటాయి. వీటి నుంచి సంచిలా ఉండే బ్లాడర్‌కు కలిపే పైప్‌లను యురేటర్స్ అంటారు. బ్లాడర్ నుంచి ఒక మూత్రనాళం ద్వారా మూత్రం బయటకు వెళ్తుంది. రక్తంలోని అనేక అంశాలను మూత్రపిండాలు శుద్ధి చేసి, అవసరమైన వాటిని తీసుకొని, వ్యర్థాలను మూత్రంతో పాటు బయటకు పంపిస్తాయి. ఈ క్రమంలో క్యాల్షియమ్ ఆక్సలేట్, సిస్టిన్ వంటివి స్ఫటికాలుగా మారిపోతూ ఉంటాయి. సాధారణంగా చిన్న చిన్న రాళ్లుగా ఏర్పడ్డ తర్వాత కూడా అవి మూత్రంతో పాటు బయటకు వెళ్తుంటాయి. కానీ ఒక రాయి 5 మి.మీ. కంటే ఎక్కువ సైజ్‌కు పెరిగితే మూత్రంలో సాఫీగా కొట్టుకొనిపోలేక... మూత్రవిసర్జక వ్యవస్థలో ఎక్కడైనా ఇరుక్కుపోవచ్చు. ఇలా మూత్రవిసర్జక వ్యవస్థలో రాళ్లు ఎక్కడైనా ఇరుక్కుపోయినప్పుడు తీవ్రమైన కడుపునొప్పి మొదలుకొని మూత్రధారకు ఏదో అడ్డుపడ్డట్లుగా ఉండటం వరకు అనేక లక్షణాలు కనిపిస్తాయి. వాటిలో ప్రధానమైనవి కొన్ని... కిడ్నీలో రాళ్ల నిర్థారణ : మూత్రపరీక్ష, అల్ట్రాసౌండ్ పరీక్ష, ఇంట్రావీనస్ యూరోగ్రఫీ (ఐవీయూ), ఎక్స్-రే, సీటీ స్కాన్ల వంటి పరీక్షలతో కిడ్నీ స్టోన్స్‌ను నిర్ధారణ చేస్తారు. కిడ్నీల్లోని రాళ్లను నివారించండిలా : మూత్రపిండాల్లో వచ్చే రాళ్ల వల్ల కూడా దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అందుకే కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండేందుకు అవసరమైన చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఎంతో పెద్ద ప్రమాదాన్నే నివారించే అవకాశం ఉంది. ఆ జాగ్రత్తలివి... నీటిని ఎక్కువగా తాగాలి. రోజుకు తప్పని సరిగా రెండు నుంచి రెండున్నర లీటర్ల యూరిన్‌ను విసర్జించాలి. కాబట్టి శరీర కణాల నిర్వహణకు, పోను ఆ మోతాదులో మూత్ర విసర్జన జరగాలంటే రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగాల్సి ఉంటుంది ఆహారంలో ప్రొటీన్, నైట్రోజెన్, సోడియం ఉన్న పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. స్థూలంగా చెప్పాలంటే ఉప్పు పాళ్లు తక్కువగా ఉండాలి ఆగ్సలేట్ ఎక్కువగా ఉండే గింజలు, సోయాబీన్స్, పాలకూర, చాక్లెట్ల వంటి వాటిని వీలైనంతగా తగ్గించాలి క్యాల్షియం సప్లిమెంట్లను కూడా తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. పొటాషియం సిట్రేట్‌కు కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నివారించే లక్షణం ఉంది కాబట్టి వైద్యుల సూచనల మేరకు ఆహార నియమాలను పాటించడం మంచిది ఆల్కహాల్ వల్ల మూత్రం ఎక్కువగా వస్తుంది. దాంతో దేహంలో నీటి శాతం తగ్గిపోయి డీహైడ్రేషన్, క్రమేణా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి అవకాశం ఎక్కువ ఆరెంజ్ జ్యూస్‌కు క్యాల్షియం ఆక్సలేట్‌ను రాయిగా మారకుండా నిరోధించే లక్షణం ఉంది. కాబట్టి ఆరెంజ్ జ్యూస్ మంచిదే. అయితే విటమిన్ సి ఎక్కువగా తీసుకోవడం కూడా కిడ్నీస్టోన్ సమస్యకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి పుల్లటి పండ్లతో చేసిన జ్యూస్‌లను ఎక్కువగా తీసుకోకూడదు కూల్‌డ్రింకులను అస్సలు తాగకూడదు. మూత్రపిండాల్లో రాళ్లకు చికిత్స... : కిడ్నీ స్టోన్స్ చాలావరకు ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేకుండా వాటంతట అవే ఎక్కువగా మూత్రంతో పాటు పడిపోతుంటాయి. రాయి సైజు, రాయి ఉన్న ప్రాంతం వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని చేయాల్సిన చికిత్స నిర్ణయిస్తారు. ఎండోస్కోపీ ద్వారా యురేటర్లో రాయిని తీయడం (యూఆర్ఎస్ఎల్ -ఎండోస్కోపిక్ రిమూవల్ ఆఫ్ స్టోన్ ఇన్ ద యురేటర్), ఎండోస్కోపీ ప్రక్రియతో మూత్రపిండం నుంచి రాయి తీయడం (పీసీఎన్ఎల్ - ఎండోస్కోపిక్ రిమూవల్ ఆఫ్ స్టోన్ ఫ్రమ్ ద కిడ్నీ) వంటి ప్రక్రియలతో రాయిని తొలగించవచ్చు. రోగి విపరీతమైన నొప్పితో బాధపడుతున్నప్పుడు, మూత్రపిండాల వ్యవస్థ విఫలమైనప్పుడు, కిడ్నీలు ఇన్ఫెక్షన్కు గురైనప్పుడు సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఆపరేషన్ ఇష్టపడని రోగులు ఒక నెల రోజులు ఆగి చూసి అప్పటికీ రాయి దానంతట అదే పడిపోకపోతే తప్పనిసరిగా ఆపరేషన్ చేయించాలి. లేకపోతే రాయి వల్ల ఇన్ఫెక్షన్ పాకి మూత్రపిండాలు దెబ్బతినే అవకాశాలుంటాయి. నాన్ ఇన్వేజివ్ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్వేవ్ లిథోట్రిప్సీ (ఇఎస్డబ్ల్యూఎల్) అనే చికిత్స ప్రక్రియలో లేజర్, అల్ట్రాసోనిక్ కిరణాల ద్వారాగానీ లేదా మెకానికల్‌గా గానీ రాయిని చిన్న చిన్న పలుకులు లేదా పొడి అయ్యేలా చేస్తారు. ఆ పలుకులు, పొడి మూత్రంతో పాటు వెళ్లిపోతాయి. ఇలా రాయిని పలుకులు, పొడిగా చేస్తే యురేటర్లో స్టెంట్ వేస్తారు. ఇందుకంటే మూత్రనాళాలు, బ్లాడర్ గోడలు ఈ రాతిపలుకుల వల్ల ఒరుసుకుపోకుండా ఉండటానికి ఈ ఏర్పాటు చేస్తారు. రోగినుంచి పలుకులు పూర్తిగా పడిపోయాక స్టెంట్‌ను తొలగిస్తారు.ఇలాంటి నాన్ఇన్వేజివ్ (కత్తి ఉపయోగించకుండానే చేసే) ప్రక్రియల ద్వారా చికిత్స సాధ్యం కానప్పుడు మాత్రమే ఓపెన్ సర్జరీ (శస్త్రచికిత్స) చేస్తారు. శబ్దతరంగాల ద్వారా : శబ్దతరంగాలను ఉపయోగించి రాయిని చిన్న పలుకులుగా పొడిలా చేయడం ద్వారా చేసే చికిత్సను ఎక్స్ట్రా కార్పోరల్ షాక్వేవ్ లిథోట్రిప్సీ అంటారు. చికిత్స కంటే నివారణ మేలు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని, రోజూ తగినన్ని మంచినీళ్లు తాగడం లాంటి విధానాలు అవలంబించడం ద్వారా కిడ్నీలో రాళ్లను నివారించుకుంటే మేలు. కిడ్నీస్టోన్స్ లక్షణాలు... కోలిక్ పెయిన్... భరించలేని నొప్పి ఉండటాన్ని ఇలా వ్యవహరిస్తారు హిమచ్యూరియా... మూత్రంలో రక్తం పడడాన్ని హిమచ్యురియా అంటారు పైయూరియా... మూత్రంలో చీము రావడాన్ని ఇలా అంటారు డిస్ యూరియా... విసర్జన సమయంలో మార్గం మంటగా అనిపించడం. చిన్న రాళ్లు మూత్రంతోపాటు వచ్చినప్పుడు లేదా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా కనిపిస్తుంది ఆలిగ్యురియా... మూత్రం పరిమాణం తగ్గడం. యురెథ్రాలో కాని మూత్రాశయంలో కాని లేదా రెండింటిలో కాని రాళ్లు ఉన్నప్పుడు ఇలా జరగవచ్చు అబ్డామినల్ డిస్టెన్షస్లో... తల తిరగడం, వాంతులవడం ఉంటుంది. వీటితోపాటు చలి, జ్వరం కూడా ఉండవచ్చు పోస్ట్రిరీనల్ అజోటీమియా... కిడ్నీలో రాయి యురేటర్ని బ్లాక్ చేయడం, తద్వారా కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారి తీయడం ఫ్రీక్వెన్సీ ఇన్ మిక్చ్యురిషన్... ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయాల్సి రావడం. అలాగని ఒక రోజుకు రెండున్నర లీటర్లకంటే ఎక్కువ మూత్రవిసర్జన ఉండదు. తక్కువ మోతాదులో విసర్జిస్తూ ఎక్కువసార్లు వెళ్లాల్సి రావడం జీర్ణవ్యవస్థ అస్తవ్యస్తం కావడం వల్ల ఆహారం తీసుకోవాలన్న ఆసక్తి లేకపోవడం, బరువు తగ్గడం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. డాక్టర్ ఎన్. ఉపేంద్రకుమార్ యూరాలజిస్ట్ అండ్ యాండ్రాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్ -
చిన్నారి కళ్ల నుంచి వస్తున్న రాళ్లు
చెన్నూర్: ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ మండలంలోని కాచన్‌పల్లి గ్రామానికి చెందిన నరిగె సమ్మయ్య-సమ్మక్కల కూతరు స్వర్ణలత (8) కళ్లలోంచి రాళ్లు వస్తున్నాయి. స్వర్ణలత స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. గురువారం నాటి నుంచి శనివారం సాయంత్రం వరకు సుమారు 30 రాళ్లు పడినట్లు బంధువులు తెలిపారు. బాలికను సమీపంలోని అంగ్రాజ్‌పల్లి పీహెచ్సీలో వైద్య చికిత్సల నిమిత్తం తీసుకువెళ్లగా హైదరాబాద్ ఆసుపత్రిలో చూపించాలని అక్కడి వైద్యులు చెప్పారు. కూలీ పని చేసుకుని బతికే తాము బిడ్డను హైదరాబాద్ ఎలా తీసుకెళ్లేదని వారు ఆవేదన చెందుతున్నారు. తమ కూతురు వైద్య చికిత్స కోసం దాతలు సహాయంఅందించాలని కోరుతున్నారు. -
బాలిక కళ్ల వెంట నీళ్లు కాదు... రాళ్లు వస్తున్నాయి!
చెన్నూర్ రూరల్ (ఆదిలాబాద్): బాధ, భావోద్వేగం, అమితానందం.. వీటిలో ఏ భావానికి లోనైనా... కళ్ల వెంట నీరు రావడం సర్వసాధారణం. కానీ, ఈ బాలిక కళ్ల నుంచి ఉన్నట్టుండి రాళ్లు బయటకు వస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ మండలంలోని కాచన్‌పల్లి గ్రామానికి స్వర్ణలత (8)కు గురువారం నుంచి రెండు కళ్లలోంచి రాళ్లు వస్తున్నాయి. ఇప్పటి వరకు 30 రాళ్లు బయటకు వచ్చాయని బాలిక తల్లిదండ్రులు నరిగె సమ్మయ్య-సమ్మక్క తెలిపారు. బాలికను సమీపంలోని అంగ్రాజ్‌పల్లి ప్రాథమిక ఆస్పత్రిలో చూపించగా... హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారు. అయితే, కూలీ పని చేసుకుని బతికే తాము బిడ్డను హైదరాబాద్ ఎలా తీసుకెళ్లేదని వారు ఆవేదన చెందుతున్నారు. కూతురు వైద్య చికిత్స కోసం దాతలు సహాయం అందించాలని కోరుతున్నారు. -
మండుటెండలో... కంకరరాళ్లపై
ఒక చిన్న రాయి కాలికి గుచ్చుకుంటేనే అమ్మా అంటూ బాధపడతాం. మరి అలాంటిది కంకర రాళ్లపై నిద్ర... అది మండుటెండలో అంటే... కానీ ఇక్కడ మాత్రం ఓ చిన్నారి హాయిగా నిద్రిస్తోంది. అమ్మా ఒడిలో వెచ్చగా సేద తీరాల్సిన చిన్నారికి కంకరరాళ్లే పూల ఊయలగా మారాయి. రోజు గడవడం కోసం ఎండా.... వాన తేడా లేకుండా అమ్మ రాళ్లను మోస్తుంటే, తన తల్లితో పాటు పని జరిగే ప్రాంతానికి వచ్చిన చిన్నారి రాళ్లనే పాన్పుగా చేసుకొని ఇలా నిద్రిస్తోంది. కష్టజీవులకు రాళ్లైనా, పూలైనా ఒకటే అన్న విషయాన్ని ఈ చిన్నారి పాలుతాగే వయసులోనే జీర్ణించుకున్నట్లుంది. బెంగళూరులోని నాగరబావి ప్రాంతంలో ఈ దృశ్యం 'సాక్షి' కెమెరా కంటికి చిక్కింది. -
నానక్‌రాంగూడలో సైకో వీరంగం
రోడ్డుపై రెండు గంటలపాటు హంగామా రాళ్లు విసరడంతో ఆటోడ్రైవర్ తలకు గాయం అదుపులోకి తీసుకొని వదిలేసిన పోలీసులు రాయదుర్గం: నానక్‌రాంగూడ ప్రధాన రోడ్డులో గురువారం ఉదయం ఓ సైకో వీరంగం సృష్టించాడు. రెండు గంటలపాటు హంగామా చేశాడు. రాళ్లు రువ్వడంతో ఓ ఆటో డ్రైవర్ గాయపడ్డాడు. అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనికి కౌన్సెలింగ్ నిర్వహించి వదిలిపెట్టారు. వివరాలు ఇలా... స్థానిక ట్రెండ్‌సెట్ అపార్ట్మెంట్ రోడ్డు నుంచి పోచ మ్మ దేవాల యానికి వెళ్లే ప్రధాన రోడ్డులో గుర్తుతెలియని రెండుగంటలపాటు హంగామా సృష్టించాడు. నడుచుకుంటూ వెళ్లే వారిని నానా దుర్భాషలాడడంతోపాటు తోసేశాడు. ద్విచక్రవాహనాలను, కార్లను అడ్డుకొన్నాడు. దీంతో అరగంటపాటు వాహనాలన్నీ నిలిచిపోయాయి. స్థానికులు పోలీ సులకు సమాచారమిచ్చారు. అక్కడికి వచ్చిన పోలీసులను కూడా అతను దుర్భాషలాడాడు. పోలీసులు హెచ్చరించడంతో పక్కకు తప్పుకున్నాడు. కొద్దిసేపటికి మళ్లీ రోడ్డుపైకి వచ్చి వీరంగం చేయడం ప్రారంభించాడు. దారిలో వెళ్లేవారిపై రాళ్లు విసరడం ప్రారంభించాడు. దీంతో ఆటో డ్రైవర్ మునవర్ తలకు గాయం కాగా రక్తస్రావమైంది. వెంటనే అతడు ఆసుపత్రికి వెళ్లాడు. ఆ సమయంలో స్థానికులు కొందరు అతని చేతులను తాళ్లతో బంధించి పోలీసులకు మరోమారు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి అతణ్ణి తీసుకెళ్లడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. స్టేషన్లో దాదాపు రెండు గంటల సేపు మాట్లాడగా అతని గురించి ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదు. పొంతనలేని సమాధానాలు చెబుతుండడంతో పోలీసులు అతనికి కౌన్సెలింగ్ నిర్వహించి వదిలేశారు. -
మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడితే లక్షణాలు
లక్షణాలు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడితే ఆ విషయాన్ని నిర్ధారించడానికి కొన్ని వైద్య పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అయితే కొన్ని లక్షణాలు స్వయంగా రోగికి అనుభవంలోకి వస్తుంటాయి. అవి... మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి మూత్రంతోపాటు రక్తం చలిజ్వరం మూత్రం దుర్వాసన రావడం, రంగు మారడం వెనుకవైపు ఛాతీకి- పిరుదులకు మధ్య (లోవర్ ఎబ్డామిన్) సన్నగా మెలిపెట్టినట్లు నొప్పి వస్తుంది. నొప్పి తీవ్రత పెరిగినప్పుడు తల తిరగడం, వాంతి కావడం వంటి లక్షణాలు కూడా తోడవుతుంటాయి. ఈ లక్షణాలలో ఏది కనిపించినా పరీక్ష చేయించుకోవడం మంచిది. గమనిక: రెండు మిల్లీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉన్న రాళ్లు మూత్ర విసర్జన సమయంలోనే బయటకు వెళ్లిపోతుంటాయి. అలా వెళ్లే క్రమంలో మూత్రవాహిక ఒరుసుకుపోయినట్లు అనిపించవచ్చు. అంతే తప్ప పైన చెప్పిన లక్షణాలు కనిపించవు. మూత్రాశయంలో ఏర్పడిన రాళ్లు రెండు మీల్లీమీటర్ల కంటే పెద్దవైనప్పుడు పై లక్షణాలు బయటపడతాయి. -
మీరేంటో...మీ చేతి గడియారమూ చెబుతోంది!
సైకాలజీ మణికట్టును అంటిపెట్టుకొని సమయాన్ని సూచించడమే కాదు.. ఎంచుకున్న గడియారం మగువ మనస్తత్వమూ చెబుతోంది. అదెలాగంటే...!!! ఆభరణాలకు మ్యాచ్ అయ్యేలా వాచ్ ధరించేవారు ప్రతీ పనిని పక్కాగా చేయాలనుకుంటారు. అంకెల సమయాన్ని సూచించే గడియారాలను ఇష్టపడేవారు ముక్కుసూటి తత్త్వం గలవారు. త్వరగా పనులు పూర్తిచేయాలని తొందరపడిపోతుంటారు. ఫంకీ వాచీలను ధరించేవారు నలుగురి దృష్టీ తమపై ఉండాలనీ, గ్లామరస్‌గా కనిపించా లని ఆరాటపడతారు. రత్నాలు, రాళ్లు పొదిగిన గడియారాలను ఎంపిక చేసుకునేవారు విలాసంగా జీవితాన్ని గడపాలనుకుంటారు. అంకెలు లేని వాచ్‌లను ఎంపిక చేసుకునేవారు నిగూఢంగా ఉండాలనుకుంటారు. అంటే వీరు ఏ విషయాన్నీ ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరన్నమాట. లెదర్ బెల్ట్ గడియారాలను ఇష్టపడేవారు హుందాతనాన్ని కోరుకుంటారు బ్రాండెడ్ వాచ్‌లను ఇష్టపడేవారు కాన్ఫిడెంట్‌గా ఉండాలనుకుంటారు. పాతకాలం మోడల్ గడియారాలను ఇష్టపడేవారు తమ అభిప్రాయాలను మార్చుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడరు. -
అప్పుడు రాళ్లు - నేడు పూలు
-
కేజ్రీవాల్‌పై రాళ్ల దాడి
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ లక్ష్యంగా మరో సారి దాడి జరిగింది. వారణాసి నగరం బెనారస్ హిందూ యూనివర్శిటీ సమీపంలో గురువారం రాత్రి ఎన్నిక ప్రచారం నిర్వహిస్తున్న కేజ్రీవాల్‌పై ఆగంతకులు రాళ్ల వర్షం కురిపించారు. అనంతరం ఆగంతకులు హర్ హర్ మోడీ, ఘర్ ఘర్ మోడీ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఆ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటన అక్కడికి చేరుకుని రాళ్ల దాడి చేసిన వారిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. అయితే గత నెల 25న వారణాసిలో కేజ్రీవాల్‌పై దాడి జరిగింది. అనంతరం ఈ నెల 4న కేజ్రీవాల్‌పై దక్షిణ ఢిల్లీలో ఓ వ్యక్తి చెంపదెబ్బ కొట్టిన విషయం తెలిసిందే. -
చిన్నారి కళ్ల నుంచి రాలుతున్న రాళ్లు
మన్నెగూడెం(డోర్నకల్), న్యూస్‌లైన్ : కంటిలో చిన్న నలుసు పడితేనే తట్టుకోవడం కష్టం. కళ్లలో దుమ్ము, దూళి పడితే పడే ఇబ్బంది అంతా.. ఇంతా కాదు. కానీ ఓ చిన్నారి కళ్లలో నుంచి ఏకంగా శనగ గింజ సైజులో రాళ్లు బయటపడతున్నారుు. దీంతో ఆ బాలిక పడుతు న్న బాధ వర్ణణాతీతంగా మారింది. అర గంటకోసారి నరకం అనుభవిస్తోంది. కళ్ల నుంచి రాళ్లతోపాటు రక్తం కారుతుండడం తో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. డోర్నకల్ మండలంలోని మన్నెగూడెం గ్రామానికి చెందిన తేజావత్ కృష్ణ, లక్ష్మి దంపతులు కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారి కుమార్తె సాయితేజ స్థానిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. సోమవారం సాయంత్రం నుంచి సాయితేజ కళ్ల నుంచి రక్తం కారడంతోపాటు రెండు కళ్ల నుంచి రాళ్లు వస్తుండడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నా రు. ఆరు నెలల క్రితం కూడా ఇలాగే బాలిక కళ్ల నుంచి రక్తం, రాళ్లు రావడంతో తల్లిదండ్రులు ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించారు. అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఎలాంటి జబ్బు లేదని తేల్చారు. రాళ్లు ఎందుకు వస్తున్నాయని అడిగితే హైదరాబాద్‌లోని పెద్దాస్పత్రికి వెళ్లాలని సూచించారు. భూత వైద్యుడిని ఆశ్రరుుంచిన తల్లిదండ్రులు హైదరాబాద్‌కు వెళ్లేందుకు డబ్బులు లేకపోవడంతో ఇంటికి వచ్చి భూతవైద్యుడికి చూపగా రాళ్ల రావడం ఆగిపోయాయని సాయితేజ తల్లిదండ్రులు కృష్ణ, లక్ష్మి తెలిపారు. తిరిగి రెండు రోజులుగా సాయితేజ కళ్ల నుంచి రక్తం, రాళ్లు రావడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ప్రతీ అరగంటకు ఒకసారి రెండు కళ్ల నుంచి రక్తంతోపాటు రారుు వస్తుండడంతో సాయితేజ నరకయాతన అనుభవిస్తోంది. శనగ గింజ కంటె పెద్ద పరిమాణంలో ఉన్న రాళ్లు కళ్ల నుంచి ఒక్కొక్కటిగా బయటకు వస్తుండడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కళ్ల నుంచి రాళ్లు రావడాన్ని ప్రత్యక్షంగా గమనించిన గ్రామస్తులు సాయితేజ పరిస్థితిపై విచారం వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల క్రితం కృష్ణ, లక్ష్మీ దంపతులకు చెందిన ఇల్లు అగ్నిప్రమాదానికి గురై సర్వం అగ్నికి ఆహుతవడంతో నిరాశ్రయులయ్యారు. ఇప్పుడు సాయితేజకు వింత జబ్బు రావడంతో వైద్యం చేయిం చలేని దుస్థితిలో ఉన్నామని అధికారులు, దయామయులైన దాతలు తమ కూతురికి వైద్యం చేయించేందుకు సాయం చేసి ఆదుకోవాలని సాయితేజ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. -
చిరంజీవిపై సమైక్యవాదుల రాళ్లదాడి