
సాక్షి, కోనసీమ జిల్లా: అమలాపురంలో పోలీస్ వాహనాలపై రాళ్లు రువ్విన కేసులో 46 మందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 307,143,144,147,148,151,152, 332, 336,427,188, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సామర్లకోటకు చెందిన హోంగార్డ్ వాసంశెట్టి సుబ్రహ్మణ్యం ఫిర్యాదుతో కేసులు నమోదు చేశారు.
చదవండి: ‘కోన’లో కుట్ర కోణం!
వడగాన నాగబాబు, నూకల పండు, కురసాల నాయుడు, దున్నాల దిలీప్, అడపా శివ, చిక్కాల మధుబాబు, దువ్వా నరేష్, లింగోలు సతీష్, నల్ల నాయుడు, నక్కా హరి, కిశోర్, అడపా సత్తిబాబు, నల్ల రాంబాబు, యాళ్ల రాధ, గాలిదేవర నరసింహమూర్తి, సంసాని రమేష్, కడాలి విజయ్, తోట గణేష్, అన్యం సాయి, దూలం సునీల్, కల్వకొలను సతీష్, కానిపూడి రమేష్, ఈదరపల్లి జంబు, చింతపల్లి చిన్నా, పోలిశెట్టి కిషోర్, నల్లా కరుణ, పాటి శ్రీను, చిక్కం బాలాజీ, పెద్దిరెడ్డి రాజా, మద్దిశెట్టి ప్రసాద్, వినయ్, శివ, సాధనాల మురళీ, నల్లా అజయ్, వాకపల్లి మణికంఠ, కాసిన ఫణీంద్ర, కొండేటి ఈశ్వర్‌రావు, అరిగెల తేజ, అరిగెల వెంకటరామారావు, రాయుడు స్వామిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మరి కొందరి కేసులు నమోదు చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు.
బస్సును దగ్ధం చేసిన కేసులో..
ఎర్ర వంతెన వద్ద బస్సును దగ్ధం చేసిన కేసులో 46 మందిపై మరో ఎఫ్‌ఐఆర్ అమలాపురం పీఎస్‌లో నమోదు చేశారు. 341,143, 144,147,148,151,336,435,188,149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆర్టీసీ డ్రైవర్ గిరిబాబు ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment