Konaseema District Issue
-
అల్లు అర్జున్ను అరెస్టు చేస్తే చంద్రబాబును ఏం చేయాలి?
సాక్షి, అమలాపురం: హైదరాబాద్ సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతికి అల్లు అర్జున్ కారణమని అరెస్ట్ చేస్తే.. గత గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో 29 మందికి చావుకు కారణమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎందుకు అరెస్టు చేయలేదని అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ ప్రశ్నించారు. అమలాపురంలో శుక్రవారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. సంధ్యా థియేటర్ దుర్ఘటన చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే దీనికి అల్లు అర్జున్ను బాధ్యుడిని చేసి, అరెస్ట్ చేయడం అన్యాయమని అన్నారు.నాడు చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయలేదుఅమలాపురం టౌన్: రాజమహేంద్రవరంలో 2015లో జరిగిన గోదావరి పుష్కరాల్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జరిగిన తొక్కిసలాటలో 29 మంది చనిపోయారని, నాడు ఆయనను ఎందుకు అరెస్టు చేయలేదని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ప్రశ్నించారు. తొక్కిసలాట, మృతి కారణంగా ఇప్పుడు సినీ హీరో అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం ఎంత మాత్రం సబబు కాదని స్పష్టం చేశారు. అమలాపురంలో ఆయన శుక్రవారం రాత్రి స్థానిక మీడియాతో మాట్లాడారు. నాడు పుష్కరాల్లో జరిగిన ఘోరానికి చంద్రబాబును అరెస్ట్ చేయనప్పుడు.. ఇప్పుడు అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం తప్పే అవుతుందని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఇదే విషయాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నానని చెప్పారు. ‘ఎన్నో తొక్కిసలాటలు జరుగుతాయి. ఎందరో చనిపోతూంటారు. అలాంటిచోట్లకు వెళ్లిన లెజెండ్లను అలా చేయమని ఎవరూ చెప్పరు. యాదృచ్ఛికంగా జరిగిన తొక్కిసలాటలకు వారిని బాధ్యులను చేయడం కరెక్ట్ కాదు’ అని అన్నారు. పైపెచ్చు ఆ బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం కూడా ప్రకటించారని గుర్తు చేశారు. ఇలాంటి అరెస్టులను, ఘటనలను ప్రజలు సమర్థించరని హర్షకుమార్ స్పష్టం చేశారు.నేషనల్ రోలర్ స్కేటింగ్‌లో ప్రతిభఅంబాజీపేట: నేషనల్ రోలర్ స్కేటింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో ఇసుకపూడి శివారు పెండిపేటకు చెందిన కుంచే హన్షిత్ సిల్వర్ మెడల్ సాధించాడు. కర్ణాటక రాష్ట్రం మైసూర్లో ఈ నెల 5 నుంచి 15వ తేదీ వరకూ 62వ నేషనల్ రోలర్ స్కేటింగ్ చాంపియన్ షిప్– 2024 పోటీలు నిర్వహించారు. 5 నుంచి 7 ఏళ్ల వయసు బాలుర విభాగంలో హన్షిత్ పాల్గొని సిల్వర్ మెడల్ కై వసం చేసుకున్నాడని అతని తల్లిదండ్రులు కుంచే రమేష్, శ్వేత శుక్రవారం చెప్పారు. ఇప్పటి వరకూ హన్షిత్ పలు పతకాలు సాధించాడు. 2024లో రాయపూర్‌లో జరిగిన ఆరేళ్ల గ్రూప్ ఓపెన్ నేషనల్స్‌లో గోల్డ్, బ్రాంజ్ మెడల్స్, అక్టోబర్‌లో తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్‌లో జరిగిన ఓపెన్ నేషనల్స్‌లో సిల్వర్ మెడల్, జిల్లా స్థాయి పోటీల్లో గోల్డ్, బ్రాంజ్ మెడల్స్, నవంబర్‌లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ నిర్వహించిన 36వ రాష్ట్ర స్థాయి పోటీల్లో సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించాడు. చిన్న వయసులోనే తమ కుమారుడు జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.16న జాబ్మేళాకాకినాడ సిటీ: కలెక్టరేట్లోని వికాస కార్యాలయం ఆధ్వర్యాన ఈ నెల 16న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్టు డైరెక్టర్ కె.లచ్చారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. టారస్ కంపెనీలో బీపీఓ, వరుణ్ మోటార్స్‌లో టీమ్ లీడర్, ఎగ్జిక్యూటివ్ సేల్స్, అడ్వైజర్, పెయింటర్ అండ్ డెంటర్, రిలయన్స్ ట్రెండ్స్‌లో రిటైల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఇండో ఎంఐఎం, హోండాస్ మోబీస్, పానసోనిక్ అండ్ కేఐఎంఎల్ కంపెనీల్లో టెక్నీషియన్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణులైన 30 ఏళ్ల లోపు వారు అర్హులన్నారు. వీరికి నెలకు రూ.12 వేల నుంచి రూ.18 వేల వరకూ జీతం, ఆయా ఉద్యోగాలను బట్టి ఇన్సెంటివ్‌లు, భోజనం, వసతి, రవాణా సౌకర్యాలు ఉంటాయన్నారు. ఆసక్తి ఉన్న వారు ఆ రోజు ఉదయం 9 గంటలకు కలెక్టరేట్ ఆవరణలోని వికాస కార్యాలయానికి సర్టిఫికెట్ల జిరాక్సులతో హాజరు కావాలని లచ్చారావు సూచించారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఇంట్లో షాకింగ్ ఘటన.. తలుపు తట్టి.. నెట్టుకు వచ్చి..
అమలాపురం టౌన్(కోనసీమ జిల్లా): సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై ఓ ఆగంతకుడు చాకులతో దాడి చేసిన ఘటన అమలాపురం పట్టణంలో కలకలం రేపింది. పోతీసులు, బాధితుల కథనం ప్రకారం.. పట్టణంలోని ప్రకాశం వీధిలో నివసిస్తున్న నందెపు రామాంజనేయులు కుమార్తె సూర్యప్రియాంక సాఫ్ట్వేర్ ఉద్యోగిని. ఆమె భర్త విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తున్నారు. నాలుగు నెలల బాలింతరాలు కావడంతో ఆమె చంటిబిడ్డతో అమలాపురంలోని పుట్టింట్లోనే ఉండి ఉద్యోగ విధులు నిర్వహిస్తోంది. బిడ్డకు అస్వస్థతగా ఉండటంతో ప్రియాంక ఆదివారం రాత్రి ఆసుపత్రికి వెళ్లి తిరిగి వచ్చింది. రాత్రి 9 గంటల సమయంలో తలుపు తట్టిన శబ్దం వినిపించడంతో ప్రియాంక తలుపు తెరిచింది. అంతలోనే ముఖానికి మాస్క్, చేతులకు గ్లౌజులు వేసుకుని, రెండు చేతుల్లో రెండు చాకులు పట్టుకుని ఉన్న దుండగుడు ఒక్కసారిగా తలుపు నెట్టి.. ఇంట్లోకి చొరబడి, ఆమెపై దాడికి ఒడిగట్టాడు. రక్షణ కోసం అడ్డం పెట్టుకున్న చేతులపై చాకులతో పొడిచి బలంగా గాయపరిచాడు. ఈ హఠాత్పరిణామంతో హడలిపోయిన ప్రియాంక భయంతో పెద్ద పెట్టున కేకలు వేస్తూ తండ్రి ఉన్న గదిలోకి వెళ్లింది. అంతలోనే ఆ ఆగంతకుడు తన చేతిలోని రెండు చాకులను అక్కడే వదిలేసి, ఇంటి గోడ దూకి పరారయ్యాడు. చేతులకు తీవ్ర గాయాలైన ప్రియాంకను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఇంట్లో అమ్మ, తాను మాత్రమే ఉన్నామనుకుని ఆ ఆగంతకుడు చోరీకి వచ్చాడని ప్రియాంక పోలీసులకు చెప్పింది. తన తండ్రి ఇంట్లో ఉండబట్టే తాను, తన తల్లి బతికామని, లేకపోతే తమను చంపేసి నగలు దోచుకునేవాడని ఆమె కన్నీటిపర్యంతమైంది. చదవండి: ప్రియుడి మర్మాంగాన్ని కోసిన ప్రియురాలు.. ఆ ఇంట్లో అసలేం జరిగింది? ఆ దుండగుడు చోరీకి విఫలయత్నం చేసి, ఈ దాడికి పాల్పడడ్డాడని రామాంజనేయులు కూడా చెబుతున్నారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆగంతకుడు వదిలేసిన చాకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆగంతకుడు చోరీకి వచ్చాడా.. తెలిసున్న వ్యక్తే ఈ దాడికి ఒడిగట్టాడా.. మతిస్థిమితం లేక ఇలా ప్రవర్తించాడా అనే కోణాల్లో బాధిత కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. పట్టణ ఎస్సై ప్రభాకర్, హెడ్ కానిస్టేబుల్ సుబ్బరాజు ఆ ఇంటిని సోమవారం బాధిత కుటుంబ సభ్యులను విచారించారు. ఆ వీధిలో ఉన్న సీసీ ఫుటేజీలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ దాడి ఏ కారణంతో జరిగిందో దర్యాప్తు అనంతరం స్పష్టత వస్తుందని ఎస్సై ప్రభాకర్ చెప్పారు. -
టీడీపీ నేతకు ముందస్తు బెయిల్ నిరాకరణ
సాక్షి, అమరావతి: కోనసీమ అల్లర్లకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన కేసుల్లో తెలుగుదేశం పార్టీ నాయకుడు అరిగెల వెంకట రామారావుకు హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసుకున్న నాలుగు పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. కోనసీమ అల్లర్ల విషయంలో నమోదైన ఫిర్యాదుల్లోనూ, సాక్షుల వాంగ్మూలాల్లోనూ పిటిషనర్ పేరు ఉందని తెలిపింది. అల్లర్లు జరగడంలో పిటిషనర్‌ది కీలకపాత్ర అని, వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా సందేశాలు పంపారని, దీనివల్ల హింస జరిగిందని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శెట్టిపల్లి దుష్యంతరెడ్డి వాదనతో హైకోర్టు ఏకీభవించింది. అందువల్ల ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందన్న ఏపీపీ వాదనకు అంగీకారం తెలిపింది. పోలీసుల దర్యాప్తు నిష్పాక్షికంగా, స్వేచ్ఛాయుతంగా సాగేందుకు పిటిషనర్‌ను విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని హైకోర్టు వెల్లడించింది. అందువల్ల రామారావుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి తీర్పునిచ్చారు. కోనసీమ జిల్లాకు డాక్టర్ అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ కొందరు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారి అధికార పార్టీ నేతల ఇళ్లు, ప్రభుత్వ ఆస్తులను తగులబెట్టే వరకు వెళ్లింది. దీనిపై అమలాపురం పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేశారు. ఇలా కేసు నమోదైన వారిలో టీడీపీ నేత రామారావు కూడా ఉన్నారు. పిటిషనర్ పాత్రపై ఆధారాలున్నాయి.. పోలీసుల తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ ర్యాలీ పేరుతో కార్యక్రమం చేపట్టి.. తరువాత పెద్ద ఎత్తున అనుచరులను కూడగట్టి హింసకు పాల్పడ్డారని తెలిపారు. అంతకు ముందు వెంకట రామారావు తరఫు న్యాయవాది ఎన్.రవిప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ అమాయకుడన్నారు. అల్లర్లతో ఆయనకు సంబంధం లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఫిర్యాదుల్లోనూ, సాక్షుల వాంగ్మూలాల్లోనూ పిటిషనర్ పేరు ఉండటం వల్ల వెంకట రామారావుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. -
కీలక దశకు దర్యాప్తు
సాక్షి, అమరావతి: అమలాపురం అల్లర్ల కేసులో పోలీసుల దర్యాప్తు కీలకదశకు చేరుకుంది. విధ్వంసానికి సంబంధించిన కుట్ర రచన, అమలు చేసిన విధానంపై పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. సమాజంలో వర్గవైషమ్యాలను రెచ్చగొట్టేందుకు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా దాడుల్లో పాల్గొన్న అందర్నీ గుర్తించే ప్రక్రియ దాదాపు పూర్తయింది. సుమారు 300 మందిని పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. వారిలో ఇప్పటికే 62 మందిని అరెస్టు చేశారు. మరో 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. వారిలో పదిమందిని అరెస్టుచేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం పరారీలో ఉన్న వారి ఆచూకీని కూడా పోలీసు బృందాలు గుర్తిస్తున్నాయి. దీంతో వచ్చే వారంలో మరింతమంది నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. వారిలో పలువురిపై రౌడీషీట్లు తెరవాలని పోలీసులు సూత్రప్రాయంగా నిర్ణయించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం 52 మందిపై రౌడీషీట్లు ఎత్తేసిన విషయాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. వారిలో కొందరు ఇటీవల అమలాపురంలో జరిగిన విధ్వంసంలో పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. అప్పట్లో ఏకపక్షంగా అంతమందిపై ఒకేసారి రౌడీషీట్లు ఎత్తివేయడం శాంతిభద్రతల కోణంలో సరైన చర్యకాదని పోలీసు అధికారులు భావిస్తున్నారు. అమలాపురం అల్లర్లలో ప్రత్యక్షంగా పాల్గొన్నవారి అరెస్టుల ప్రక్రియ పూర్తిచేసిన తరువాత ఈ దాడుల వెనుక కుట్రదారులపై దృష్టిసారించాలని నిర్ణయించారు. ఇప్పటికే కొందరు సూత్రధారులను గుర్తించిన పోలీసులు వారు ఎవరి ప్రోత్సాహంతో, ఏ ప్రయోజనాల కోసం ఈ కుట్ర పన్నారన్న అంశాలను కొలిక్కి తేవాలని భావిస్తున్నారు. అందుకోసం ఇప్పటికే వారి కాల్‌డేటాలు, వాట్సాప్ సందేశాలు మొదలైనవి విశ్లేషిస్తున్నారు. పటిష్ట బందోబస్తు కోనసీమలో ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది. అమలాపురంతోసహా జిల్లాలోని మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, సున్నితమైనవిగా గుర్తించిన గ్రామాల్లో పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. మళ్లీ ఉద్రిక్తతలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు గ్రామాల్లోకి అనుమానితుల కదలికలు, రాకపోకలపై పటిష్ట నిఘాను ఏర్పాటు చేశారు. మరోవైపు గ్రామాల్లో అన్నివర్గాల పెద్దలతో మాట్లాడుతూ సామరస్య పరిస్థితులు నెలకొనేలా చర్యలు చేపట్టారు. ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడకుండా కట్టడి చేస్తున్నారు. వినతిపత్రాల సమర్పణ కోసం కలెక్టరేట్‌లకుగానీ, తహశీల్దార్ కార్యాలయాలకుగానీ అనుమతించడం లేదు. ఎలాంటి వినతిపత్రాలనైనా సంబంధిత గ్రామ, వార్డు సచివాలయంలో సమర్పించమని అధికార యంత్రాంగం ఇప్పటికే సూచించింది. ఇంటరెŠన్ట్ సేవల నిలుపుదలను కొనసాగిస్తున్నారు. పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
అజ్ఞాత వాసం.. టీడీపీ, జనసేన నేతల గుండెల్లో గుబులు
అమలాపురం టౌన్(కోనసీమ జిల్లా): కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ అమలాపురంలో ఈ నెల 24న విధ్వంసం సృష్టించిన ఆందోళనకారులు కొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరోపక్క పోలీసులు ఆధునాతన సాంకేతికత పరిజ్ఞానంతో సీసీ కెమెరా ఫుటేజ్‌లు, కాల్ డేటాలతో ఆందోళనకారులను గుర్తిస్తున్నారు. ఇప్పటికే 19 మందిని అరెస్ట్ చేశారు. 46 మందిపై కేసులు నమోదు చేశారు. మరో 23 మందిని అదుపులోకి తీసుకుని, కేసుల నమోదుకు సిద్ధమవుతున్నారు. పోలీసులు దాదాపు 150 మందిని అనుమానితులుగా గుర్తించడంతో ఆందోళనకారుల్లో వణుకు పుడుతోంది. చదవండి: జనసేన, టీడీపీ, బీజేపీ కుమ్మక్కు.. కుట్ర బట్టబయలు పోలీసుల కంట పడకుండా అజ్ఞాతంలోకి వెళ్తున్నారు. కొందరు సొంత ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసేస్తే.. మరికొందరు ఫోన్ కాల్స్ వస్తున్నా లిఫ్ట్ చేయకుండా మిన్నకుండిపోతున్నారు. మరికొందరు హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లి తలదాచుకున్నట్లు తెలిసింది. విధ్వంస కాండకు పాల్పడిన వారిలో అధిక శాతం టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన క్రియాశీలక కార్యకర్తలే ఉన్నారు. కేసులు నమోదైన ముగ్గురు బీజేపీ నాయకులు, ఇద్దరు టీడీపీ, ఆరుగురు జనసేన కార్యకర్తలు అజ్జాతంలోకి వెళ్లిపోయారు. అజ్ఞాతంలోకి వెళ్లిన ఆందోళనకారుల ఫోన్ నంబర్ల కాల్ డేటా, ఫోన్లు ఏ టవర్ పరిధిలో ఉన్నాయో పోలీసులు ఆధునిక టెక్నాలజీతో పసిగడుతున్నారు. ఆ రెండు పార్టీ నేతల్లో గుబులు విధ్వంసకర ఘటనల్లో ఎక్కువ మంది టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు ఉన్నారు. దీంతో ఆయా పార్టీల నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పోలీసు విచారణలో తమ పేర్లు ఎక్కడ బయట పడతాయోనని పలువురు గుబులు చెందుతున్నారు. తమ ఫోన్లు ట్రాప్ చేస్తున్నారేమోనన్న అనుమానంతో ఆ పార్టీల నేతలు సొంత ఫోన్లకు బదులు కొత్త ఫోన్లు, నంబర్ల నుంచి మాట్లాడుతున్నారు. ఇంకా నిఘా నీడలోనే.. విధ్వసంకర ఘటనలతో అట్టుడికిన అమలాపురం పూర్తిగా కుదుటపడింది. జిల్లా వ్యాప్తంగా పోలీసు నిఘా మాత్రం కొనసాగుతోంది. దాదాపు వెయ్యి మంది పోలీసులు ముఖ్య కూడళ్ల వద్ద పహారా కాస్తున్నారు. రోడ్లపై వాహనాల విస్తృత తనిఖీలకు పోలీసులు శనివారం నుంచి తెర వేశారు. ఆందోళనకారులను దీటుగా కట్టడి చేసేందుకు తగిన బందోబస్తుతో పోలీసు శాఖ సంసిద్ధమై ఉంది. -
అమలాపురం అల్లర్ల కేసు: మరో 25 మంది అరెస్ట్
సాక్షి, కోనసీమ జిల్లా: అమలాపురంలో అల్లర్లకు పాల్పడిన మరో 25 మందిని అరెస్ట్ చేసినట్లు డీఐజీ పాలరాజు వెల్లడించారు. 20 వాట్సాప్ గ్రూప్‌లను పరిశీలిస్తున్నామని, 350కి పైగా సీసీ ఫుటేజ్‌లను విశ్లేషిస్తున్నామని డీఐజీ తెలిపారు. మరిన్ని అరెస్టులు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. చదవండి: జనసేన, టీడీపీ, బీజేపీ కుమ్మక్కు.. కుట్ర బట్టబయలు అమలాపురంలో అల్లర్లు, విధ్వంసం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సాగిన విధ్వంసకాండ కుట్ర వెనుక సూత్రధారులు, దాడుల్లో పాత్రధారులను అరెస్టు చేస్తున్నారు. ఇప్పటికే వీడియో క్లిప్పింగులు, సోషల్ మీడియా పోస్టులు, కాల్ డేటా, సీసీ టీవీ ఫుటేజ్‌ల ఆధారంగా కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. వీడియో క్లిప్పింగుల ఆధారంగా 70 మందికిపైగా నిందితులను గుర్తించారు. -
కోనసీమ ఘటన.. ఆర్.నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కోనసీమకు అంబేడ్కర్ జిల్లా పేరు పెట్టడం శుభ పరిణామం అని నటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. అమలాపురం ఘటనపై ఆయన స్పందిస్తూ.. దాడులు దారుణమని, నాయకుల ఇళ్లు తగులబెట్టడం సమంజసం కాదన్నారు. అంబేడ్కర్ పేరు జిల్లాకే కాదు.. దేశానికే పెట్టాలన్నారు. దేశానికి అంబేడ్కర్ ఇండియాగా పేరు మార్చాలన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ మాట తప్పారన్నారు. చదవండి: ‘కోన’లో కుట్ర కోణం! -
అమలాపురం ఘటన కేసులో టీడీపీ,జనసేన నేతల అరెస్ట్
-
అంబేడ్కర్ పేరును వ్యతిరేకించడం దారుణం
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): కోనసీమ జిల్లాకు పెట్టిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరును వ్యతిరేకించడం దారుణమని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మండిపడ్డారు. గురువారం గుంటూరులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద మాలమహానాడు, దళిత, బహుజన, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇతర జిల్లాలకు పేర్లు పెట్టినప్పుడు రాని అభ్యంతరం.. కోనసీమకు అంబేడ్కర్ పేరు పెట్టినందుకు రావడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం కోనసీమకు అంబేడ్కర్ పేరును కొనసాగించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే మస్తాన్‌వలి మాట్లాడుతూ ప్రపంచ మేధావి పేరును వ్యతిరేకించడం సరికాదన్నారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్‌కుమార్ మాట్లాడుతూ డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగానే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ 5న చలో అమలాపురానికి పిలుపునిచ్చినట్లు తెలిపారు. బీజేపీ నేతలు అంబేడ్కర్‌ను చులకన చేసి మాట్లాడుతున్నారని, ఇందుకు సోము వీర్రాజు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రెడ్డి జనసేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు కె.అంజనీశ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు. -
Amalapuram: జనసేన, టీడీపీ, బీజేపీ కుమ్మక్కు.. కుట్ర బట్టబయలు
సాక్షి, అమరావతి/అమలాపురం టౌన్: అమలాపురంలో అల్లర్లు, విధ్వంసం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సాగిన విధ్వంసకాండ కుట్ర వెనుక సూత్రధారులు, దాడుల్లో పాత్రధారులను అరెస్టు చేస్తున్నారు. ఇప్పటికే వీడియో క్లిప్పింగులు, సోషల్ మీడియా పోస్టులు, కాల్ డేటా, సీసీ టీవీ ఫుటేజ్‌ల ఆధారంగా కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. వీడియో క్లిప్పింగుల ఆధారంగా 70 మందికిపైగా నిందితులను గుర్తించారు. ఇందులో భాగంగా గురువారం ఒక్కరోజే 19 మందిని అరెస్టు చేశారు. మరో 46 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా సుబ్బారావు.. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట రామారావు ఉన్నారు. మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పు పెట్టిన ఘటనలో టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్ప అనుచరుడు వడగన నాగబాబుపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద ఆరు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ప్రత్యేక బృందాల ద్వారా మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ఈ విషయాన్ని డీఐజీ పాలరాజు మీడియాకు తెలిపారు. అమలాపురం ఎస్పీ కార్యాలయంలో కోనసీమ, కాకినాడ జిల్లా ఎస్పీలు కెఎస్ఎస్వీ సుబ్బారెడ్డి, ఎం.రవీంద్రనాథ్‌బాబు, కోనసీమ ఏఎస్పీ లత మాధురితో కలిసి పాలరాజు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 24న అమలాపురం పట్టణంలో పలు కూడళ్లలో ఉన్న సీసీ పుటేజ్‌లు, వాట్సాప్ గ్రూపులు, టీవీ చానల్స్‌లో ప్రసారమైన దృశ్యాలను ఆధారంగా చేసుకుని నిందితులను గుర్తించామన్నారు. అలాగే 12 వాట్సాప్ గ్రూపులను గుర్తించామని పేర్కొన్నారు. ఈ వాట్సాప్ గ్రూపుల్లో ఆందోళనకారులు పరస్పర సమాచారం చేర వేసుకుంటూ.. ఫలానా చోటకు రావాలని, ఫలానా చోట పోలీసుల బందోబస్తు అధికంగా ఉందని.. అడ్డదారుల్లో రావాలని ఆ దారులు తెలియజేస్తూ గ్రూపుల్లో సమాచారం పంపించారని తెలిపారు. ఈ 12 వాట్సాప్ గ్రూపుల్లో ఆ రోజు సాగిన పోస్టింగ్‌లు, మెసేజ్‌లు సేకరించామని చెప్పారు. వాట్సాప్ గ్రూపుల అడ్మిన్లపైనా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పతో పళ్లంరాజు ఉద్దేశపూర్వకంగానే ప్రజాప్రతినిధుల ఇళ్లకు నిప్పు.. మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్ ఇళ్లపై ఆందోళనకారులు ఉద్దేశపూర్వకంగా దాడి చేసి నిప్పుపెట్టారని డీఐజీ పాలరాజు చెప్పారు. నిందితులపై హత్యాయత్నంతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసం, పథకం ప్రకారం దాడులు, దొమ్మి తదితర కేసులు నమోదు చేశామన్నారు. పోలీసు బందోబస్తు పెద్ద స్థాయిలో ఉన్నప్పటికీ ఆందోళనకారులు దాడులకు తెగబడిన పరిస్థితులపై పోలీసుశాఖ పునః సమీక్షించుకుంటుందన్నారు. నల్లవంతెన వద్ద పోలీసుల వజ్ర వాహనాన్ని ధ్వంసం చేయడంతోపాటు కలెక్టరేట్ వద్ద, ఎర్ర వంతెన వద్ద బస్సులను తగలబెట్టడం, తర్వాత వాట్సాప్ గ్రూపుల్లో మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్ ఇళ్లకు నిప్పు పెట్టాలని పథక రచన చేసుకుని ఎర్రవంతెన వైపు నుంచి వెళ్లారన్నారు. ఈ కేసుల దర్యాప్తులో ఆరు పోలీసు బృందాలు ఉన్నాయని.. మరో ఆరు బృందాలు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను గుర్తించే పనిలో ఉన్నాయని చెప్పారు. ఈ విధ్వంస ఘటనల్లో పాల్గొన్నవారి పేర్లను గ్రామాలవారీగా సేకరించి జాబితాలను తయారుచేస్తున్నామన్నారు. దాడుల్లో రౌడీషీటర్ల పాత్ర ఉందన్నారు. శుక్రవారం మరో కొంత మందిని అరెస్టు చేస్తామని చెప్పారు. అరెస్టులు కొన్ని రోజులపాటు కొనసాగుతాయన్నారు. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అనుచరుడు, రౌడీషీటర్ గంధం పళ్లంరాజుతో నాగబాబు (గళ్ల చొక్కా వ్యక్తి), పళ్లంరాజు (తెల్ల చొక్కా వ్యక్తి) సోషల్ మీడియా పోస్టుల ద్వారానే కుట్ర అమలు కుట్రదారులు అమలాపురంలో విధ్వంసానికి పక్కాగా పన్నాగం పన్నారని పోలీసులు గుర్తించారు. ప్రధానంగా అల్లర్లకు ఆజ్యం పోయడానికి సోషల్ మీడియాను వాడుకున్నారు. ఈ నెల 19 నుంచి వర్గ విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులను తమ వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేసినట్టు గుర్తించారు. సోషల్ మీడియా వేదికగా పరస్పరం దూషణలకు పాల్పడ్డారు. విద్వేషాలు రేకెత్తించేలా వాట్సాప్ స్టేటస్లు పెట్టుకోవడాన్ని ట్రెండ్‌గా మార్చారు. దాంతో సహజంగానే కోనసీమలో ఇరువర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. అక్కడక్కడా స్వల్ప ఘర్షణలు, వాహనాల దహనాలు, పరస్పరం దూషణల పర్వం కొనసాగింది. వీటిని అవకాశంగా చేసుకుని శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన కొందరు నేతలు రంగంలోకి దిగారు. ఈ నెల 24న ర్యాలీ సందర్భంగా విధ్వంసానికి పాల్పడేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. ర్యాలీలో వేలాదిమంది పాల్గొన్నప్పటికీ విధ్వంసం కుట్రను ఎంపిక చేసిన కొంతమందికే ముందుగా చెప్పారు. ర్యాలీ రూట్‌మ్యాప్, ఎక్కడ దారి మళ్లించాలి, పోలీసులపై రాళ్లు రువ్వడం, మంత్రి విశ్వరూప్ రెండు ఇళ్లు, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటిపై దాడులు.. ఇలా అన్నీ పక్కాగా సోషల్ మీడియా పోస్టుల ద్వారానే కథ నడిపించినట్టు పోలీసులు గుర్తించారు. పవన్‌కల్యాణ్, నాదెండ్ల మనోహర్‌తో అన్యం సాయి వాటి ఆధారంగానే దర్యాప్తు ముమ్మరం.. సోషల్ మీడియా పోస్టుల ఆధారంగానే పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. విధ్వంసానికి కుట్ర పన్నిన సూత్రధారులు, అల్లర్లలో పాల్గొన్నవారి సోషల్ మీడియా పోస్టులను పోలీసులు పరిశీలిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న 46 మందితో పాటు అరెస్టు చేసిన 19 మందినీ వారి సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా విచారిస్తున్నారు. ఆ పోస్టులు మొదటగా ఎక్కడ నుంచి వచ్చాయన్న అంశాన్ని ఆరా తీస్తున్నారు. వారి కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్నారు. ఈ దిశగా ఇప్పటికే కీలక ఆధారాలను సేకరించినట్టు తెలుస్తోంది. ఇక సూత్రధారుల అరెస్టులే.. సేకరించిన కీలక ఆధారాలతో అమలాపురంలో విధ్వంస కాండ వెనుక అసలు కుట్రదారులు ఎవర్నది గుర్తించే పనిలో పోలీసు యంత్రాంగం నిమగ్నమైంది. పరారీలో ఉన్న మిగిలిన నిందితులను కూడా అదుపులోకి తీసుకోవడంతోపాటు ఈ కుట్ర వెనుక అసలు సూత్రధారుల పాత్రను తగిన ఆధారాలతోసహా నిరూపించే దిశగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. విధ్వంసం వెనుక అసలు పాత్రధారులు, కుట్రదారులను ఒకట్రెండు రోజుల్లో అరెస్టు చేసే అవకాశాలున్నాయి. సంచలన విషయాలు వెల్లడించే రీతిలో అరెస్టులు ఉండొచ్చని విశ్వసనీయ సమాచారం. ప్రశాంతంగా కోనసీమ.. అమలాపురంలో పోలీసుల చర్యలతో ప్రశాంత వాతావరణం ఏర్పడింది. సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. వ్యాపార దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు యధావిధిగా పనిచేస్తున్నాయి. ఆర్టీసీ కూడా పూర్తి స్థాయిలో సర్వీసులు నడుపుతోంది. దాదాపు వెయ్యి మంది పోలీసులతో అత్యంత పకడ్బందీగా బందోబస్తు కొనసాగుతోంది. ప్రజాభీష్టం మేరకే అంబేడ్కర్ జిల్లా శ్రీకాకుళం రూరల్: ప్రజాభీష్టం మేరకే కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టామని హోంశాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు. కోనసీమ ప్రస్తుతం ప్రశాంతంగానే ఉందని.. 2 వేల మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కోనసీమ అల్లర్ల వెనుక ఎవరున్నారో పోలీసులు కూపీ లాగుతున్నారని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు దండ వేస్తున్న అరిగల వెంకట రామారావు(ఎడమవైపు), మోకా సుబ్బారావు(కుడివైపు) పోలీసులు అరెస్ట్ చేసిన 19 మంది వీరే.. గురువారం పోలీసులు అరెస్టు చేసిన 19 మంది నిందితుల్లో 18 మంది జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలకు చెందినవారే. టీడీపీ కార్యకర్తలు.. దున్నల తాతాజీ ధనుంజయ దిలీప్, అల్లబిల్లి సూర్యనారాయణమూర్తి, జనసేన పార్టీ కార్యకర్తలు.. అన్యం దుర్గా సాయికుమార్, కల్వకొలను సత్యనారాయణమూర్తి, కురసాల సురేష్ నాయుడు, నార్కెడిమిల్లి కృష్ణకిశోర్, అడ్డాల నాగ శ్రీరంగ గణేష్, చిట్టూరి ప్రసాద్, విత్తనాల శివనాగ మణికంఠ, ఎర్రంశెట్టి బాలాజీ, నల్లా సురేష్, విత్తనాల ప్రభాకర్, పలివెల శేఖర్, నేదునూరి వెంకటేష్, నడవపల్లి భవానీ శివశంకర్, కంచిపల్లి వెంకటేశ్వరరావు, బీజేపీ కార్యకర్తలు..సత్తిరెడ్డి సతీష్, ఎర్రంశెట్టి సాయిబాబులతోపాటు ఏ పార్టీకి చెందని వాసంశెట్టి రాము ఉన్నారు. వీరిలో 12 మంది అమలాపురం పట్టణానికి చెందినవారు కాగా అమలాపురం రూరల్ మండలానికి చెందినవారు ముగ్గురు, పి.గన్నవరానికి చెందినవారు ఇద్దరున్నారు. అల్లవరం, అయినవిల్లిలకు చెందినవారు చెరొకరు ఉన్నారు. -
అమలాపురం ఘటన: పోలీస్ వాహనాలపై రాళ్లు.. 46 మందిపై కేసు..
సాక్షి, కోనసీమ జిల్లా: అమలాపురంలో పోలీస్ వాహనాలపై రాళ్లు రువ్విన కేసులో 46 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 307,143,144,147,148,151,152, 332, 336,427,188, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సామర్లకోటకు చెందిన హోంగార్డ్ వాసంశెట్టి సుబ్రహ్మణ్యం ఫిర్యాదుతో కేసులు నమోదు చేశారు. చదవండి: ‘కోన’లో కుట్ర కోణం! వడగాన నాగబాబు, నూకల పండు, కురసాల నాయుడు, దున్నాల దిలీప్, అడపా శివ, చిక్కాల మధుబాబు, దువ్వా నరేష్, లింగోలు సతీష్, నల్ల నాయుడు, నక్కా హరి, కిశోర్, అడపా సత్తిబాబు, నల్ల రాంబాబు, యాళ్ల రాధ, గాలిదేవర నరసింహమూర్తి, సంసాని రమేష్, కడాలి విజయ్, తోట గణేష్, అన్యం సాయి, దూలం సునీల్, కల్వకొలను సతీష్, కానిపూడి రమేష్, ఈదరపల్లి జంబు, చింతపల్లి చిన్నా, పోలిశెట్టి కిషోర్, నల్లా కరుణ, పాటి శ్రీను, చిక్కం బాలాజీ, పెద్దిరెడ్డి రాజా, మద్దిశెట్టి ప్రసాద్, వినయ్, శివ, సాధనాల మురళీ, నల్లా అజయ్, వాకపల్లి మణికంఠ, కాసిన ఫణీంద్ర, కొండేటి ఈశ్వర్రావు, అరిగెల తేజ, అరిగెల వెంకటరామారావు, రాయుడు స్వామిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మరి కొందరి కేసులు నమోదు చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. బస్సును దగ్ధం చేసిన కేసులో.. ఎర్ర వంతెన వద్ద బస్సును దగ్ధం చేసిన కేసులో 46 మందిపై మరో ఎఫ్ఐఆర్ అమలాపురం పీఎస్‌లో నమోదు చేశారు. 341,143, 144,147,148,151,336,435,188,149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆర్టీసీ డ్రైవర్ గిరిబాబు ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
అల్లర్ల వెనుక ఎవరున్నారో వెలికితీస్తాం: బొత్స
-
అమలాపురం అల్లర్ల వెనుక రాజకీయ కుట్ర: మంత్రి బొత్స
సాక్షి, శ్రీకాకుళం: చంద్రబాబు దివాళాకోరు రాజకీయం చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. తమ మంత్రి, ఎమ్మెల్యేపై తాము దాడి చేయిస్తామా అని ప్రశ్నించారు. మామపై రాళ్లు వేయించి.. అల్లర్లు సృష్టించిన చరిత్ర మాది కాదన్నారు. చదవండి: అల్లర్ల వెనుక ఎవరున్నా ఉపేక్షించేది లేదు అమలాపురం అల్లర్ల వెనుక రాజకీయ కుట్ర ఉంది. అల్లర్ల వెనుక ఎవరున్నారో వెలికితీస్తామని’’ మంత్రి బొత్స అన్నారు. పవన్‌కల్యాణ్ అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. తుని ఘటనపై పవన్ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రతిపక్షాలు కోరలేదా? ప్రభుత్వంపై కుట్రలు చేస్తే చూస్తూ ఊరుకోమని’’ మంత్రి బొత్స హెచ్చరించారు. -
అమలాపురం ఘటనను పవన్ ఎందుకు ఖండించలేదు: మంత్రి చెల్లుబోయిన
సాక్షి, కాకినాడ: అమలాపురంలో జరిగిన సంఘటన సభ్య సమాజం సిగ్గు పడేలా ఉందని ఏపీ బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ అన్నారు. 35 మంది పోలీసులకు గాయాలయ్యాయని తెలిపారు. అమలాపురం ఘటనను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ మాటలు వింటే అంబేద్కర్ జిల్లాకు వ్యతిరేకమని అర్దం అవుతుందని, అంబేద్కర్ పేరు పెట్టడానికి పవన్ అనుకూలమా? వ్యతిరేకమా చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో ప్రతిపక్షాలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని, ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని విమర్శించారు. ఈ మేరకు మంత్రి వేణుగోపాల్ కాకినాడలో బుధవారం మాట్లాడుతూ.. చంద్రబాబు స్క్రిప్ట్‌ను పవన్ చదివినట్లు కనిపిస్తోందన్నారు. ఉద్యమం ముసుగులో వచ్చిన ఎవరిని విడిచిపెట్టమని తెలిపారు. వినతులు స్వీకరణ కోసం 30 రోజుల సమయం ప్రభుత్వం ఇచ్చిందని, జిల్లా మార్పుపై అభ్యంతరాలు ఉంటే తెలియజేసే పద్ధతి ఇదేనా అని నిలదీశారు. కోనసీమ అల్లర్ల సమయంలో ప్రభుత్వం, పోలీసులు ఎంతో సహనాన్ని వహించారన్నారు. కోనసీమ వాసులందరూ సంయమనం పాటించాలని కోరారు. రాజకీయ వికృత కీడకు యువకులు బలికావొద్దని మంత్రి కోరారు. చదవండి: ఎమ్మెల్సీ అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైఎస్సార్సీపీ -
పవన్ కల్యాణ్ తీరుని ఎండగట్టిన అంబటి.. ‘ప్రొసీజర్ తెలియకుండా ఏంటిది?’
సాక్షి, తాడేపల్లి: అమలాపురం అల్లర్ల ఘటనపై పవన్ కల్యాణ్ స్పందించిన తీరు దారుణమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పవన్ కల్యాణ్ పార్టీకి చెందిన వారు ఎందుకు నిరాహార దీక్షలు చేశారని ఆయన ప్రశ్నించారు. ప్రజల నుంచి డిమాండ్ వచ్చినపుడు పరిశీలించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని అంబటి స్పష్టం చేశారు. మీడియాతో బుధవారం ఆయన మాట్లాడారు. చదవండి👉 పోలీసుల అదుపులో కోనసీమ అల్లర్ల కేసు అనుమానితుడు? ‘మీ డిమాండ్, ప్రజల డిమాండ్‌నీ ప్రభుత్వం అంగీకరించింది కదా. మేమే మా మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లను దగ్దం చేసుకున్నామా? ఎక్కడా పవన్ ఇవాళ ఇది దురదృష్టకరం, ఖండిస్తున్నాం అన్న మాట అనలేదు. శ్రీలంక అవుతుంది అని చంద్రబాబు, పవన్ కల్యాణ్ అన్నారు. ఇప్పుడు శ్రీలంకలా చేయడానికి కుట్రలు పన్నుతున్నారు. చివరికి మంటలను ఆర్పడానికి ఫైర్ ఇంజన్ రాకుండా అడ్డుకున్నారు. మంత్రి ఇంటిని తగలబెట్టి శ్రీలంకలా రాష్ట్రం మారింది అని చూపించాలి అనుకుంటున్నారు. అభ్యంతరాలు చెప్పడానికి 30 రోజులు ఎందుకు అంటాడు పవన్.. అది ప్రొసీజర్. తుని సంఘటనను దీనికి ముడి పెడుతున్నారు. ఆరోజు కడప వాళ్లు అన్నారు. చంద్రబాబు మాటలే ఈయన నోటి నుంచి వస్తున్నాయి. మా విశ్వరూప్ ఇల్లు, మా సతీష్ ఇల్లు మేము తగలేసుకున్నామా? డైవర్షన్ అనడానికి పవన్ కల్యాణ్‌కు అసలు అవగాహన ఉందా? అసలు జరిగిన దాడులను ఖండించకుండా ఏదేదో ఎందుకు మాట్లాడతాడు. కోనసీమలో జరిగిన సంఘటనలో కఠినంగా వ్యవహరించాలి. ఉక్కుపాదంతో అణచివేయాలి... అలా పవన్ ఎందుకు డిమాండ్ చేయడు?’ అని పవన్ తీరుని మంత్రి అంబటి రాంబాబు ఎండగట్టారు. చదవండి👇 చంద్రబాబు స్క్రిప్టు పవన్ చదువుతున్నాడు: మంత్రి రోజా అమలాపురం అల్లర్లపై స్పీకర్ సీరియస్.. అప్పుడుంటది బాదుడే బాదుడు! -
కోనసీమ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా: మంత్రి అంబటి
-
తప్పు చేసినవారిని వదిలిపెట్టేది లేదు: మంత్రి రోజా
-
మా మంత్రి, ఎమ్మెల్యే మీద మేమే దాడి చేయించుకుంటామా?: సజ్జల
-
కోనసీమ అల్లర్లు.. అన్యం సాయి జనసేనకు చెందిన వ్యక్తే: సజ్జల
సాక్షి, అమరావతి: కోనసీమ అల్లర్ల వెనుకున్న కుట్రకోణం స్పష్టంగా అర్థమవుతోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కొందరి ప్రవర్తనే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోందన్నారు. అమలాపురం దాడులపై ప్రతిపక్షాల స్పందన చూస్తుంటే.. వాళ్లే కథంతా నడిపించారనే అనుమానాలు బలపడుతున్నాయన్నారు. అల్లర్ల కేసులో నిందితులపై కఠిన చర్యలుంటాయన్నారు. ‘దాడులకు కారణం వైఎస్సార్సీసీనేని టీడీపీ, జనసేన ఆరోపణలు చేస్తున్నాయి. టీడీపీ, జనసేనవి దుర్మార్గపు రాజకీయ ఆలోచనలు. మా మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లపై మేమే దాడులు చేయించుకుంటామా? అన్యం సాయి జనసేనకు చెందిన వ్యక్తే. జనసేన కార్యక్రమాల్లో అన్యంసాయి పాల్గొన్న ఫోటోలు వచ్చాయి. విపక్షాల అరోపణలకు ఏమైనా అర్థం ఉందా.ఇలాంటి అడ్డగోలు ఆరోపణలు వారి విచక్షణకే వదిలేస్తున్నాం. పవన్ కల్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. టీడీపీ కార్యాలయం నుంచి వచ్చిన స్క్రిప్ట్‌ను పవన్ చదివారు. చదవండి: కోనసీమ అల్లర్లు.. చంద్రబాబు స్క్రిప్టు పవన్ చదువుతున్నాడు: మంత్రి రోజా అంబేద్కర్ పేరు విషయంలో టీడీపీ, జనసేన వైఖరి చెప్పాలి. అడ్డ దారుల్లో ప్రయోజనం పొందాలని చంద్రబాబు యత్నిస్తున్నారు. ఏం చెప్పాలనుకున్నారో పవన్‌కే తెలియడం లేదు. అల్లర్ల విషయం వదిలేసి ఏవేవో మాట్లాడుతున్నారు. టీడీపీ హయాంలో అత్యాచార ఘటనపై పవన్‌కు వివరాలు అందిస్తాం. కులం, మతాలను అడ్డుపెట్టుకొని మేం అధికారంలోకి రాలేదు. సీఎం జగన్ కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు’ అని సజ్జల అన్నారు. చదవండి: అమలాపురం అల్లర్ల ఘటన: ‘ఆ రెండు పార్టీలు ఎందుకు ఖండిచడం లేదు’ -
అమలాపురం అల్లర్ల ఘటన: ‘ఆ రెండు పార్టీలు ఎందుకు ఖండించడం లేదు’
సాక్షి, తిరుపతి: అమలాపురం అల్లర్ల ఘటనను తిరుపతి ఎంపీ గురుమూర్తి తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన దురదృష్టకరమని.. దానిని అందరూ ముఖ్త కంఠంతో ఖండించాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈ ఘటనను ఎందుకు ఖండించడం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. కుట్ర పూరిత రాజకీయాలు మానండని ప్రతి పక్షాలకు ఆయన హితవు పలికారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని కుట్రలో భాగంగా ఇలా చేశారని ఎంపీ ఆరోపించారు. రాజకీయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎదుర్కోలేక కులాల మధ్య ఇలాంటి చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల నుంచి, ప్రతి పక్ష పార్టీల నుంచి, సామజిక సేవా సంస్థల నుంచి వచ్చిన విజ్ఞప్తులను కూడా పరిగణలోకి తీసుకొని జిల్లాల పేర్లను ప్రకటించడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్వార్ధ రాజకీయాల కోసం యువతను పెడతోవ పట్టించవద్దని ఎంపీ గురుమూర్తి కోరారు. -
కోనసీమ అల్లర్లు.. చంద్రబాబు స్క్రిప్టు పవన్ చదువుతున్నాడు: మంత్రి రోజా
సాక్షి, అమరావతి: కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే గొడవ చేయటం బాధాకరమని ఏపీ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఎస్సీ మంత్రి, బీసీ ఎమ్మెల్యే ఇళ్లు తగలబెట్టడం అన్యాయమన్నారు. దాడి చేసిన వారిలో 50 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. అమలాపురం అల్లర్లపై కేసు విచారణ జరుగుతోందన్నారు. తప్పు చేసిన వారిని విడిచిపెట్టే ప్రస్తకే లేదన్నారు. వైఎస్సార్సీపీ పాలనపై బురద చల్లడానికి ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. అంబేద్కర్ వలనే మనమంతా క్షేమంగా ఉన్నామని, అలాంటి అంబేద్కర్ పేరు పెడితే గొడవలు చేయడం ఏంటని ప్రశ్నించారు. కుట్ర వెనుక ఎవరున్నారో బయటకు లాగుతామని తెలిపారు. ఇవే ప్రతిపక్షాలు గతంలో అంబేద్కర్ పేరు పెట్టాలని నిరాహారదీక్షలు చేశారని గుర్తు చేశారు. సూసైడ్ చేసుకుంటామంటూ టీవీల ముందుకు వచ్చిన వారు.. జనసేన పార్టీ నేత పవన్‌తో ఎంత క్లోజ్‌గా ఉన్నారో తెలుస్తోందన్నారు. చంద్రబాబు స్క్రిప్టు పవన్ చదువుతున్నారని, ప్యాకేజీ తీసుకుని మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. చదవండి: పోలీసుల అదుపులో కోనసీమ అల్లర్ల కేసు అనుమానితుడు? ‘మేమే చేయించాం అని అంటున్నారంటే చంద్రబాబు స్క్రిప్ట్‌ను ఎలా చదువుతున్నాడో తెలుస్తోంది. అప్పట్లో తుని ఘటనలో వైఎస్సార్ సీపీ వాళ్లు ఉంటే మీ పాలనలో ఎందుకు అరెస్టు చేయలేకపోయారు? కోనసీమలో ప్రజలు భయపడాల్సిన పనిలేదు. దీని వెనుక ఎవరు ఉన్నారో ప్రజలు గ్రహించాలి. పోలీసులకు దెబ్బలు తగిలినా కష్టపడి పని చేశారు. వారు ఓట్ల కోసం మీ దగ్గరకు వస్తే మూతి పగిలేలా తీర్పు ఇవ్వండి. దావోస్ పర్యటన ద్వారా ఏపీకి పెట్టుబడులు తెస్తున్నారు. సీఎం జగన్ రాష్ట్రంలో లేరని ఇలాంటి కుట్రలు చేస్తే కుదరదు. ఆయన ఎక్కడ ఉన్నా ఆ చూపంతా ఏపీలోనే ఉంటుంది’ అని మంత్రి రోజా చెపపారు. చదవండి: అమలాపురం అల్లర్లపై స్పీకర్ సీరియస్.. అప్పుడుంటది బాదుడే బాదుడు! -
అమలాపురం అల్లర్ల ఘటన: పోలీసుల అదుపులో అనుమానితుడు అన్యం సాయి
-
పోలీసుల అదుపులో కోనసీమ అల్లర్ల కేసు అనుమానితుడు?
సాక్షి,అమలాపురం: అమలాపురం అల్లర్ల కేసులో అనుమానితుడు అన్యం సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 20న కలెక్టరేట్ వద్ద.. కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టొంద్దంటూ అన్యం సాయి ఒంటిపై పెట్రోల్ పోసుకుని హల్ చల్ చేశాడు. జనసేన కార్యక్రమాల్లో అనుమానితుడు సాయి చురుగ్గా పాల్గొన్నట్టు తెలుస్తోంది. పవన్, నాగబాబు, జనసేన నాయకులతో అతను దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కోనసీమ అల్లర్ల కేసులో సాయి పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అతనిపై గతంలో రౌడీషీట్ నమోదై ఉందని పోలీసులు తెలిపారు. (చదవండి: అమలాపురం ఘటన వెనుక కుట్ర.. వదిలేదే లేదు: మంత్రి బొత్స) -
సంఘవిద్రోహ శక్తులే దారి మళ్లించి విధ్వంసం సృష్టించారు: మంత్రి విశ్వరూప్
-
అమలాపురంలో పరిస్థితి పూర్తి అదుపులో ఉంది: హోంమంత్రి తానేటి వనిత