![Konaseema District: Another 25 Arrested In Amalapuram Riots Case - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/28/Konaseema-District123.jpg.webp?itok=cQUgImQC)
సాక్షి, కోనసీమ జిల్లా: అమలాపురంలో అల్లర్లకు పాల్పడిన మరో 25 మందిని అరెస్ట్ చేసినట్లు డీఐజీ పాలరాజు వెల్లడించారు. 20 వాట్సాప్ గ్రూప్‌లను పరిశీలిస్తున్నామని, 350కి పైగా సీసీ ఫుటేజ్‌లను విశ్లేషిస్తున్నామని డీఐజీ తెలిపారు. మరిన్ని అరెస్టులు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
చదవండి: జనసేన, టీడీపీ, బీజేపీ కుమ్మక్కు.. కుట్ర బట్టబయలు
అమలాపురంలో అల్లర్లు, విధ్వంసం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సాగిన విధ్వంసకాండ కుట్ర వెనుక సూత్రధారులు, దాడుల్లో పాత్రధారులను అరెస్టు చేస్తున్నారు. ఇప్పటికే వీడియో క్లిప్పింగులు, సోషల్ మీడియా పోస్టులు, కాల్ డేటా, సీసీ టీవీ ఫుటేజ్‌ల ఆధారంగా కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. వీడియో క్లిప్పింగుల ఆధారంగా 70 మందికిపైగా నిందితులను గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment