
సాక్షి, విజయవాడ: కోనసీమ జిల్లాలో పరిస్థితిపై డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరా తీశారు. ఏలూరు రేంజ్ డీఐజీ, ఎస్పీలతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అమలాపురంలో పరిస్థితిని డీఐజీ, ఎస్సీలు సమీక్షిస్తున్నారు. అమలాపురం ఘటనలో ఏడు కేసులు నమోదు చేశామని.. ఇప్పటికే 46 మందిని అరెస్ట్ చేశామని డీజీపీ తెలిపారు. రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్నామన్నారు. 3 బస్సుల దగ్ధంపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశామన్నారు.
చదవండి: అంబేడ్కర్ పేరుపై అగ్గి రాజేసిన 'కుట్ర'!