సాక్షి, అమరావతి: పుంగనూరు ఘటనపై విచారణకు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశించారు. డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ రిషాంత్‌లకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ కార్యకర్తల దాడిలో పోలీసులు గాయపడ్డారని, వాహనాలను సైతం ఉద్దేశపూర్వకంగా తగులపెట్టారని డీజీపీ అన్నారు.
‘‘రాళ్లు రువ్విన, నిప్పు పెట్టిన వారందరినీ గుర్తించాం. లా అండ్ ఆర్డర్‌కి విఘాతం కలిగించిన వారందరిపై కఠినచర్యలు తప్పవు. సీసీ కెమెరా పుటేజీని విశ్లేషిస్తున్నాం. ఇప్పటికే అనేక మంది నిందితులను గుర్తించాం. మరికొందరి కదలికలపై నిఘా పెట్టాం. చంద్రబాబు రూట్ ప్లాన్ మార్పు వ్యవహారం కూడా విచారణలో తేలుతుంది. ఈ ఘటన వెనుక ఎవరున్నారో ప్రాథమిక సమాచారం ఉంది. రెచ్చగొట్టే ప్రసంగాలపై కూడా దృష్టి పెట్టాం. శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే సహించేదిలేదు’’ అని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి హెచ్చరించారు.
కేసు నమోదు..
పుంగనూరు పీఎస్‌లో నిన్న జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 30 మంది టీడీపీ నేతలపై కేసు నమోదైంది. ఐపీపీ 147, 148, 332, 353, 128బీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
చదవండి: టీడీపీ రాక్షస క్రీడ
Comments
Please login to add a commentAdd a comment