గుంట నక్కల కుట్రలు సహించం | Sajjala Ramakrishna Reddy on punganuru incident | Sakshi
Sakshi News home page

గుంట నక్కల కుట్రలు సహించం

Published Thu, Aug 10 2023 4:27 AM | Last Updated on Thu, Aug 10 2023 4:27 AM

Sajjala Ramakrishna Reddy on punganuru incident - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సీఎం వైఎస్‌ జగన్‌ పాల­నలో శాంతిభద్రతలు బ్రహ్మాండంగా ఉన్నా­యని, వాటికి విఘాతం కల్పించడానికి టీడీపీ అధ్య­క్షుడు చంద్రబాబు వంటి గుంటనక్కలు కుట్రలు చేస్తే సహించే ప్రశ్నే లేదని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు), వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్య­దర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అంగళ్లు, పుంగనూరులలో ఈనెల 4న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు, హింసాత్మక సంఘటనలు చోటుచేసు­కోవ­డానికి.. పోలీసులపై దాడికి పాల్పడడానికి చంద్రబాబే కారణమనడానికి పక్కా ఆధారాలు ఉన్నా­యని స్పష్టం చేశారు.

అందుకు సంబంధించిన వీడియో­లను తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యా­ల­యంలో బుధవారం మీడియా ముందు ప్రదర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఘటనపై సీబీఐ, ఎఫ్‌బీఐ విచారణ అవసరం లేదని.. ఇప్పటికే చంద్రబాబు డైరెక్షన్‌ మేరకు కుట్ర చేసిన వారు పోలీసులకు దొరికారని చెప్పారు.

ఇంకా తమ వెనుక చంద్రబాబు ఉన్నాడులే.. మేమేం చేసినా చెల్లుతుంది అనుకునే వారికి ఇక బుద్ధి వస్తుందని ఆశిస్తున్నామన్నారు. రాజకీయ పార్టీగా వైఎస్సా­ర్‌­సీపీ సంయమనం పాటిస్తుందని.. చంద్రబాబు, టీడీపీ అరాచక మూకల ఆగడాలు మితి­మీ­రి­పోతే ఎక్క­డ ఎలా దెబ్బకొట్టాలో ప్రభుత్వం, పోలీసు వ్యవ­స్థ చూసుకుంటాయని స్పష్టం చేశారు. మీడి­యా­­తో సజ్జల ఇంకా ఏం చెప్పారంటే..

గొడవకు కారణం చంద్రబాబే
ప్రాజెక్టుల పరిశీలన పేరుతో పులివెందులలో రెచ్చగొట్టేందుకు ప్రయత్నించినా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు సంయమనం పాటించారు. అంగళ్లు, పుంగనూరు ఘటనలపై దర్యాప్తు సీబీఐకి ఇస్తే అది ఇప్పట్లో తేలదని అనుకున్నాడో ఏమో కానీ బాబు చాలెంజ్‌ విసిరాడు. కానీ.. ఆ రోజు ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలంతా చూశారు. ఎల్లో మీడియా మొత్తం లైవ్‌ ఇచ్చింది. 
తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గాల్లో సాగు, తాగునీటి సమస్యలు తీర్చడానికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేపట్టిన ముదివేడు, నేతిగుంటపల్లి, ఆవులపల్లి రిజర్వాయర్ల నిర్మాణాన్ని ఎన్జీటీ­లో టీడీపీ కార్యకర్తలతో కేసులు వేయించి అడ్డుకుంటున్న చంద్రబాబుకు వినతిపత్రం ఇవ్వ­డా­నికి అంగళ్లులో శిబిరంలో వైఎస్సార్‌సీపీ కార్య­­కర్తలు నల్లకండువాలు వేసుకుని కూర్చు­న్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైఎస్సా­ర్‌సీపీ కార్యకర్తలను ఉద్దేశించి.. తరమండిరా నా కొడుకులను అంటూ చంద్రబాబు ఆదేశాలు ఇవ్వడంతో.. అప్పటికే చేతుల్లో రాళ్లు, కర్రలు, ఇనుప రాడ్లు పట్టుకున్న టీడీపీ అరాచక మూకలు ఎలా రెచ్చిపోయాయో రాష్ట్రమంతా చూసింది. 
 చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు నిజంగా దాడి చేయాలనుకుంటే.. శిబిరం వేసుకుని పక్కన కూర్చుంటారా? నాయకుడనేవాడు దాడు­లను ఆపడానికి ప్రయత్నం చేస్తాడా? తరమండిరా.. కొట్టండిరా.. అంటారా? 
♦ వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తున్నప్పుడు వందలసార్లు టీడీపీ కార్యకర్తలు నల్ల జెండాలతో నిరసనలు తెలిపారు. ఇప్పుడు కూడా అమరా­వతి ప్రాంతం వెళితే ఎక్కడో ఒక చోట నిరసన తెలుపుతూనే ఉన్నారు. దాన్ని ఆసరాగా తీసు­కుని సీఎం వైఎస్‌ జగన్, వైఎస్సార్‌సీపీ కార్య­కర్తలు ఏనాడూ దాడులకు ప్రయత్నించలేదు.  
పక్కా ప్రణాళికతోనే పోలీసులపై దాడి 
♦ ఈనెల 4న పుంగనూరు బైపాస్‌ నుంచే చిత్తూరు­కు వెళ్తామని చంద్రబాబు పర్యటన షెడ్యూలును ఈనెల 3నే విడుదల చేశారు. దాంతో ఈ నెల 4న పుంగనూరు బైపాస్‌ వద్దే పోలీసులు భద్రత చర్యలు చేపట్టారు. బట్టలూడ­దీస్తా అంటూ పోలీ­సు­లను చంద్రబాబు దుర్భాషలాడుతూ.. అరాచక మూకను వారిపైకి రెచ్చగొట్టారు. కరుడుగట్టిన నేరగాళ్లు ముందస్తు వ్యూహం ప్రకారం రాళ్లు, కర్రలు, ఇనుప రాడ్లతో పోలీసులపై విచక్షణా­రహి­తంగా దాడి చేశారు. 
♦ ఒక ఉగ్రవాద, ఉన్మాద ముఠా దాడి చేసినట్లు పోలీసులు టీడీపీ మూక చేసిన దాడిని రాష్ట్ర ప్రజలంతా చూశారు. పెద్ద సంఖ్యలో పోలీసులు గాయపడ్డారు. రణధీర్‌ అనే కానిస్టేబుల్‌ కన్ను ఒకటి చూపు కోల్పోవడం దారుణం. మరో కన్ను కూడా చూపును కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పారు.   
♦  ఉన్మాదంతో దాడి చేసిన వాళ్లు కార్యకర్తలా? ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలు అని చెప్పుకోడానికి వారికన్నా సిగ్గుండాలి.. వారికి నాయకుడినని  చెప్పుకోడానికి బాబుకైనా సిగ్గుండాలి. ఉన్మా­­­­ది చంద్ర­బాబు అధ్యక్షుడిగా ఉన్న పార్టీలో శిక్షణ పొం­ది తయారైన ఉన్మాదుల ముఠా టీడీపీ మూక. 
♦  ఈ ఉన్మాద ముఠా దాడులకు నాయకత్వం వహించిన చంద్రబాబుపై 307 కేసు కాకుండా ఇంకేం పెట్టాలి? పోలీసులను బట్టలు ఊడదీయ్‌ అన్నాక చంద్రబాబు నాయకుడు ఎలా అవు­తారు? మామూలుగా మీడియా ఇలాంటి సంఘటనల్లో సంయమనం పాటిస్తుంది. కానీ వాళ్లు లైవ్‌లో అంతా చూపించారు. వారి ఆలోచన చూసి వైఎస్సార్సీపీ కార్యకర్తలు రెచ్చిపోవాలి.. రాష్ట్రం తగులబడాలి అనేది వారి ఆలోచన.

మనసులో ఒకటి.. బయటకు మరొకటా?
మనసులో ఒకటి పెట్టుకుని.. బయటకు మరోలా మాట్లాడి.. ఎవరికి ప్రయోజనం చేకూర్చాలనుకు­న్నా­­రని సినీ నటుడు చిరంజీవిని వైఎస్సార్‌సీపీ ప్రధానకార్యదర్శి సజ్జల ప్రశ్నించారు. మీడియా ప్రతినిధి ఒకరు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బాలకృష్ణ సినిమాకు ఒకలా.. మిగిలిన వారి సినిమాలకు మరోలా వ్యవహరించి వివక్ష చూపా­రని ఎత్తిచూ­పారు.

చిన్న, పెద్ద నిర్మాతలు అందరికీ న్యాయం చేసేలా పారదర్శకమైన టికెటింగ్‌ వ్యవస్థను సీఎం వైఎస్‌ జగన్‌ తెచ్చారని గతంలో చిరంజీవి ప్రశంసించారని గుర్తు చేశారు.  విభజన సమయంలో చిరంజీవి కేంద్ర మంత్రిగా పని చేశారని.. అప్పట్లో ప్రత్యేక హోదాపై ఎందుకు మాట్లా­డ­లేదని ప్రశ్నించారు.  బోడిగుండకు మోకాలికి ముడిసేలా మాట్లాడితే మా నుంచి రాజకీయంగా ప్రతి స్పందన ఉంటుందని స్పష్టం చేశారు.  

రెండు రోజుల ముందే కుట్ర 
♦ తోడల్లుడు దగ్గుబాటి రాసిన పుస్తకంలో చెప్పిన­ట్లు­గానే ఇప్పడు చంద్రబాబు వ్యవహరించారు. శాంతిభద్రతల సమస్య రావా­లి.. అలాంటి సంక్షోభం నుంచి కూడా ఎన్ని ప్రాణాలు పోయినా తాను లాభపడాల­నేదే చంద్రబాబు సిద్ధాంతం. 
♦ రెండు రోజుల ముందే పుంగనూరు బైపాస్‌లో పోలీసుల మీద దాడి చేసి.. పుంగనూరులోకి తోసుకుపోవడానికి ప్లాన్‌ చేసుకున్నారు. ఈ సమయంలో పోలీసులు కాల్పులు జరిపి, నలుగురైదుగురు కార్యకర్తలు చనిపోతే.. దాని నుంచి సానుభూతి పొందాలని ప్రయత్నం చేశాడు. ఒక వేళ పోలీసులను తోసుకుని పుంగనూరులోకి పోగలిగితే.. పుంగనూరు పట్ట­ణాన్ని తగలబెట్టాలని చంద్రబాబు పథకం రచించారు. ఇంతటి దిక్కుమాలిన ఆలోచన, కుట్ర, కుతంత్రం చరిత్రలో ఉండి ఉండదు. 
 ♦పుంగనూరు బైపాస్‌లో టీడీపీ మూక తీవ్ర స్థాయిలో దాడి చేస్తున్నా.. పోలీసులు చాలా సంయమనంతో వ్యవహరించారు. ఫైరింగ్‌ ఆర్డర్‌ ఇవ్వకుండా అక్కడి ఎస్పీ వెనక్కి తగ్గారు. పోలీసులు ప్రతిష్టకు పోయి ఉంటే చంద్ర­బాబు ఆశించిందే జరిగేది. అందుకే పోలీసులు రెచ్చిపోలేదని మీకు రోషం లేదా.. చొక్కాలు విప్పండి అంటూ బాబు తిట్టారు. 
తన హయాంలో ఫలానా పని చేశానని చంద్ర­బాబుకు చెప్పుకోవడానికి ఏమీ లేదు. వైఎస్‌ జగన్‌ పాలనలో ఎత్తిచూపడానికి లోపాలు ఏమీ లేవు. రూ.2.30 లక్షలకోట్లు డీబీటీ ద్వారా నేరుగా ప్రజల ఖాతాల్లోకి వెళ్లాయి. 87% ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతు­న్నా­యి. అందుకే ఏమీ చేయలేక పవన్‌ కల్యాణ్‌ వంటి వారికి ప్యాకేజీ ఇచ్చి తిప్పుకుంటున్నాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement