punganur
-
గోల్డ్‌లోన్ కంపెనీలో రూ.8 కోట్లు స్వాహా
పుంగనూరు: ఓ గోల్డ్‌లోన్ కంపెనీలో సిబ్బందే తమ సన్నిహితులు, బంధువులతో నకిలీ బంగారు తాకట్టు పెట్టించి రూ.8 కోట్లు కొల్లగొట్టారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు, పలమనేరులో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ‘కనకదుర్గ గోల్డ్‌లోన్స్ కంపెనీ’ పుంగనూరు, పలమనేరుల్లో బ్రాంచ్ నిర్వహిస్తోంది. బంగారు తాకట్టు పెట్టుకొని.. గ్రాముకు మార్కెట్ ధరకు అనుగుణంగా 70 నుంచి 80 శాతం వరకు రుణం ఇస్తోంది. సంస్థలోని ఆరుగురు ఉద్యోగులు సులభంగా డబ్బులు సంపాదించేందుకు పక్కదారి పట్టారు.తమ సన్నిహితులు, బంధువుల్లో 20 మందిని ఎంపిక చేసుకున్నారు. వారి ద్వారా నకిలీ బంగారు నగలు తాకట్టు పెట్టించి.. డబ్బులు ఇస్తుండేవారు. కంపెనీ యాజమాన్యం డిసెంబర్లో నిర్వహించిన ఆడిట్లో నకిలీ బంగారు నగలుతో రూ.కోట్లు స్వాహా చేసినట్లు గుర్తించింది. దీనిపై వెంటనే అంతర్గత విచారణ చేపట్టింది.తమ కంపెనీకే చెందిన ఆరుగురు ఉద్యోగులు.. మరో 20 మందితో కలసి సుమారు 6 కిలోలకు పైగా నకిలీ బంగారు నగలతో రూ.8 కోట్లు (పుంగనూరులో రూ.5 కోట్లు, పలమనేరులో రూ.3 కోట్లు) స్వాహా చేసినట్లు తేల్చింది. వారందరిపైనా యాజమాన్యం గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం బయటపడటంతో బంగారం తాకట్టు పెట్టిన పట్టణ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. -
ఆత్మీయ నేస్తాలు.. పుంగనూరు పొట్టి దూడలు
మూడడుగుల ఎత్తుంటాయి.. చూడముచ్చటగా కనిపిస్తాయి. మార్కెట్లో ధర మాత్రం లక్షల్లో పలుకుతాయి. ప్రపంచంలోనే అరుదైన ఈ పుంగనూరు పొట్టి దూడలను పోటీపడి మరీ కొనుగోలు చేస్తుంటారు. అదృష్ట చిహ్నంగా భావించే ఈ దూడలను పెంచుకునేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈక్రమంలో ఔత్సాహిక రైతులు చిట్టి ‘పొట్టి’ నేస్తాలను ప్రత్యేకంగా ఉత్పత్తి చేయిస్తున్నారు. అపురూప దూడలను విక్రయించి లాభాలను ఆర్జిస్తున్నారు. కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ఈ విశిష్ట జాతిని మరింతగా పెంచేందుకు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా పలమనేరులోని పశు పరిశోధన కేంద్రంలోపొట్టి దూడల సంరక్షణకు ఏర్పాట్లు చేశారు. పలమనేరు : పుంగనూరు పొట్టిరకం దూడల పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. పుట్టిన సమయంలో ఈ దూడ కేవలం అడుగు ఎత్తు మాత్రమే ఉంటుంది. జీవితకాలంలో కేవలం మూడడుగులు మాత్రమే పెరుగుతుంది. తోక నేలను తాకేలా ఉండే ఈ రకం దూడలకు ప్రస్తుతం భలే డిమాండ్ వచ్చింది. ఫస్ట్ క్వాలిటీ రకం దూడలు రూ.2 నుంచి 4 లక్షలు పలుకుతున్నాయి. రెండో క్వాలిటీ దూడలు రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు రేటుకు అమ్ముడవుతున్నాయి. ఈ దూడలు ఇంట్లో ఇంటే ఆరోగ్యంతో పాటు అదృష్టం వరిస్తుందనే మాట వినిపిస్తోంది. వీటిని కొనేందుకు వందలాదిమంది నిత్యం పశువుల సంతలు, రైతుల వద్దకు తిరుగుతున్నారు. సాధారణంగా ఇళ్లలో పెంపుడు జంతువులైన కుక్కలు, పిల్లుల జాబితాలో ఇప్పుడు పొట్టిదూడలు సైతం చేరిపోయాయి. వీటికి పేరు పెట్టి ఆ పేరుతో పిలిస్తే వెంటనే వచ్చేస్తాయి. 15 సెం.మీ నుంచి 50 సెం.మీ మాత్రమే ఎత్తు కలిగిన ఈ దూడలు ముద్దులొలుకుతుంటాయి. పొట్టి ఆవులు 85 సెం.మీ నుంచి 110 సెం.మీ ఎత్తు పెరుగుతాయి. పలమనేరు ప్రాంతంలో కొందరు రైతులు వీటిని ఫామ్స్‌లో మేపి పొట్టి జాతిని ఉత్పత్తి చేయిస్తూ వాటిని రూ.లక్షలకు విక్రయిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ పొట్టి రకం దూడల వ్యాపారం ఊపందుకోవడం విశేషం. ఇందుకే అంత డిమాండ్ పుంగనూరు పశువులు ఆకర్షణీయంగా ఉంటాయి. ఇంటి యజమానులపై విశ్వాసం ప్రదర్శిస్తాయి. æ పొట్టి దూడలు ఇంట్లో తిరుగుతుంటే చాలా మంచిదని జనం నమ్ముతారు. పొట్టి ఆవులు ఇచ్చే పాలలో రోగనిరోధకశక్తి అధికంగా ఉంటుంది. ఈ పాలను సేవిస్తే అనారోగ్యం దరిచేరదని విశ్వాసం.తక్కువ మేత.. అధిక పాల దిగుబడిపలమనేరు సమీపంలోని క్యాటిల్‌ఫామ్ వద్ద 1953లో సంకర జాతి ఆవుల ఉత్పత్తి, పరిశోధన కేంద్రం ప్రారంభమైంది. ఇది 1995 నుంచి పుంగనూరు పొట్టి రకం పశువుల ఉత్పత్తి కేంద్రంగా మారింది. మేలైన పుంగనూరు ఎద్దుల వీర్యాన్ని పుంగనూరు రకం పొట్టి ఆవులను పెంచుతున్న రైతులకు అందిస్తోంది. వీటిని మరింత ఉత్పత్తి చేసేందుకు ఆర్కేవీవై కృషి చేస్తోంది. ప్రస్తుతం దేశంలో ఇలాంటి పశువులు 700 దాకా ఉండగా, ఇందులో 277 వరకు పలమనేరులోని పశు పరిశోధన కేంద్రంలోనే ఉన్నాయి. ఈ పశువులు తక్కువ మేతతో ఎక్కువ వెన్నశాతం కలిగిన పాల దిగుబడినిస్తాయి. వీటి మూత్రంలో సైతం ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.రైతులకు అందిస్తున్నాం పలమనేరు పరిశోధన కేంద్రంతోపాటు ఏపీ ఎల్డీఏ ద్వారా కూడా ఈ జాతి వీర్యాన్ని రైతులు పొందవచ్చు. ఆవు ఎదకొచ్చిన తర్వాత స్థానిక వెటర్నరీ వైద్యుడి పర్యవేక్షణలో సెమన్ అందిస్తున్నాం. పుంగనూరు పొట్టిజాతిని అభివృద్ధికి కృషి చేస్తున్నాం. ఈ వీర్యం అవసరమైన రైతులు క్యాటిల్‌ఫామ్‌లో కూడా తీసుకోవచ్చు. –వేణు, శాస్త్రవేత్త, ఎస్వీ వెటర్నరీ వర్సిటీ, తిరుపతి మూడేళ్లుగా పెంచుతున్నా మూడేళ్లుగా పుంగనూరు రకం పొట్టి దూడలు పెంచుతున్నా. దేశవాళీ రకం పుంగనూరు ఆవుల ద్వారా దూడలను ఉత్పత్తి చేయిస్తున్నాం. ఈ ప్రాంతంలో చాలామంది పొట్టి దూడలు పెంచుతున్నారు. వీటికి భారీ డిమాండ్ ఉంది. ఆసక్తి ఉంటే రైతులకు ఇది ఎంతో లాభదాయకం. – మణి, రైతు, మారేడుపల్లె, గంగవరం మండలం -
YSRCP కార్యకర్తపై కర్రలతో టీడీపీ కార్యకర్తల దాడి
-
వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట..
-
వైఎస్ జగన్ పుంగునూర్ పర్యటన రద్దు
-
పుంగనూరుకు వైఎస్ జగన్.. కూటమి సర్కార్‌కు టెన్షన్: వరుదు కళ్యాణి
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో వంద రోజుల కూటమి పాలనలో ప్రతీరోజు మహిళల హత్యలు, హత్యాచారాలే జరుగుతున్నాయన్నారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. ఇదే సమయంలో పుంగనూరుకు వైఎస్ జగన్ వెళ్తున్నారని తెలిసి హోంమంత్రి అనిత ఈరోజు బాలిక కుటుంబాన్ని పరామర్శించారని చెప్పారు.ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆదివారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘పుంగనూరులో ముస్లిం బాలిక హత్య జరిగి వారం రోజులు అవుతున్న ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. వైఎస్ జగన్ పుంగనూరు వెళ్తున్నారని తెలియడంతో ఈరోజు మాత్రం హోంమంత్రి అనిత పుంగనూరు వెళ్లి బాలిక కుటుంబాన్ని పరామర్శించారు. హత్య జరిగిన వారం రోజులు గడిచినా.. ఇన్ని రోజులు చంద్రబాబు, మంత్రులు ఏం చేశారు?. ఆగమేఘాల మీద ఇప్పుడు ఎందుకు వెళ్లారు?. వైఎస్ జగన్ బాలిక కుటుంబాన్ని పరామర్శిస్తున్నారని తెలిసి మంత్రులు రాజకీయం చేస్తున్నారు.హోంమంత్రి అనిత పక్క నియోజకవర్గంలో మైనర్ బాలికను అత్యంత కిరాతకంగా చంపితే ఎందుకు పరామర్శించలేదు. గుడ్లవల్లేరు దారుణ ఘటనలో విద్యార్థులకు ఎందుకు ధైర్యం చెప్పలేకపోయారు. రాష్ట్రంలో కూటమి వంద రోజుల పాలనలో రోజూ మహిళలపై హత్యలు, హత్యాచారాలు జరుగుతున్నాయి. పోలీసు వ్యవస్థను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. మహిళలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మహిళల కోసం వైఎస్ జగన్ దిశా చట్టాన్ని, యాప్ ఏర్పాటు చేశారు’ అని తెలిపారు. ఇది కూడా చదవండి: గోల్మాల్ సర్కార్.. వరద లెక్కలో ‘బాబు’ లీలలే వేరయా! -
వైఎస్ జగన్ పుంగనూరు పర్యటన.. ఏర్పాట్లను పరిశీలించిన పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి
-
పుంగనూరుకు పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి.. బాలిక కుటుంబానికి పరామర్శ
-
పుంగనూరుకు పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి
-
ఈ చిన్నారి ఘటన మీకు కనిపించలేదా?
పుంగనూరు((చిత్తూరు జిల్లా): కిడ్నాప్‌కు గురై ఆపై హత్య గావించబడ్డ పుంగనూరుకు చెందిన అశ్వియా కుటుంబాన్ని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిలు పరామర్శించారు. శనివారం పుంగనూరుకు వెళ్లిన పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డిలు.. అశ్వియా కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. కుమార్తె అశ్వియా హత్యకు గురి కావడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తండ్రి హజ్మతుల్లాను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డిలు ఓదార్చి ధైర్యం చెప్పారు.అనంతరం పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ‘పుంగనూరులో ఇలాంటి దారుణ ఘటన ఎప్పుడూ జరగలేదు. ఇంటి ముందు ఆడుకుంటున్న రెండవ తరగతి చదువుతున్న చిన్నారి కిడ్నాప్ , హత్య జరిగితే ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనిపై దోషులను శిక్షించకపోతే అందుకు తగిన విధంగా స్పందిస్తాం. ఈ ఘటనలో పోలీసుల అసమర్థత కనిపిస్తోంది. మదనపల్లి సబ్ కలెక్టర్ ఘటనలో డీజీపీ, సీఐడీ అధికారులను ప్రత్యేక ఫ్లైట్, హెలికాప్టర్ ఇచ్చి పంపించి దర్యాప్తు చేశారు. మరి ఈ చిన్నారి ఘటన పోలీస్ ఉన్నతాధికారులకు కనిపించడం లేదా?, ఈ నెల9వ తేదీన వైఎస్ జగన్మోహన్రెడ్డి పుంగనూరుకు వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ ఆందోళన చేపట్టనుంది. బాధిత కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుంది’ అని పేర్కొన్నారు. ‘కానరాని లోకాలకు చిట్టితల్లి’9న పుంగనూరుకు వైఎస్ జగన్ -
9న పుంగనూరుకు వైఎస్ జగన్
పుంగనూరు: చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని ఉబేదుల్లా కాంపౌండులో కిడ్నాప్, ఆపై హత్యకు గురైన చిన్నారి అశ్వియ అంజుమ్ (7) కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 9వ తేదీన పుంగనూరుకు రానున్నారు. ఈ మేరకు తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.అంజుమ్ కిడ్నాప్, హత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిందన్నారు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి పరామర్శించేందుకు వైఎస్ జగన్ రానున్నారని, మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిలు కూడా వస్తారని తెలిపారు. వైఎస్సార్సీపీ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని బాధిత కుటుంబానికి అండగా నిలవాలని కోరారు.ఇదీ చదవండి: తప్పు చేసిన బాబు క్షమాపణ చెప్పాలి -
‘కానరాని లోకాలకు చిట్టితల్లి’
చిత్తూరు, సాక్షి: పోలీసులకు సవాల్‌గా మారిన పుంగనూరు చిన్నారి అదృశ్యం కేసు.. విషాదాంతం అయ్యింది. నాలుగు రోజుల కిందట కనిపించకుండా పోయిన ఆరేళ్ల బాలిక అస్పియా ఇవాళ శవంగా కనిపించింది. తన చిట్టితల్లి సురక్షితంగానే ఉండి ఉంటుందని, ఏ క్షణంలోనైనా తిరిగి వస్తుందని ఆశగా ఎదురు చూసిన ఆ తల్లికి.. చివరకు కడుపు కోతే మిగిలింది. సెప్టెంబర్ 29వ తేదీ ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలిసి ఇంటి వద్ద ఆడుకుంటోంది ఆస్పియా. కరెంట్ పోయి వచ్చాక చిన్నారి కనిపించలేదు. కంగారుపడిన తల్లి.. తండ్రి అజ్మతుల్లాకు ఫోన్ చేసి సమాచారం అందించింది. స్థానికంగా వెతికినా ఆమె కనిపించలేదు. దీంతో అదే రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని గాలింపు చేపట్టారు. మూడు రోజులుగా బాలిక ఆచూకీ కనిపెట్టడం కోసం పోలీసులు చేయని ప్రయత్నమంటూ లేదు. ఏకంగా 11 ప్రత్యేక బృందాలతో, డాగ్ స్క్వాడ్‌తో పుంగనూరు చుట్టుపక్కల జల్లెడ పట్టారు. అయితే ఇవాళ (బుధవారం) ఉదయం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో ఓ శవం తేలుతుందని పోలీసులకు సమాచారం అందింది.హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు.. అదొక చిన్నారి మృతదేహంగా తేల్చారు. అస్పియా తండ్రిని పిలిపించి.. ఆ చిన్నారిదేనని నిర్ధారణకు వచ్చారు. తిరిగి వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు.. బిడ్డ మృతితో రోదించారు. చిన్నారి విగత జీవిగా మారిందని తెలియడంతో పట్టణమంతా శోకసంద్రంలో మునిగింది. అయితే బాలిక అక్కడికి ఎలా వెళ్లింది? ప్రమాదవశాత్తు చెరువులో పడిందా..? లేదా ఎవరైనా కిడ్నాప్ చేసి చంపి పడేసారా?.. ఇలా అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
పుంగనూరు నియోజకవర్గం నాకు తల్లితో సమానం
-
పుంగనూరులో ఉద్రిక్తత
-
వైఎస్ఆర్ సీపీ మహిళ కార్యకర్తపై టీడీపీ నేతలు దాడి
-
ఎల్లో మీడియా తప్పుడు వార్తలపై చెంప చెళ్లుమనిపించిన రైతు..
-
AP: నిన్న దాడి.. ఇవాళ సెక్యూరిటీ తగ్గించారు
సాక్షి, చిత్తూరు: ఏపీలో కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి. అలాగే, పోలీసుల సమక్షంలో నిన్న తమపై టీడీపీ నేతలు దాడులు చేశారని చెప్పుకొచ్చారు.కాగా, రాజంపేటలో ఎంపీ మిథున్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘పుంగనూరులో పోలీసుల సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు ఇతర ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. అనంతరం, మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటిపై రాళ్ల దాడులు చేశారు. అంతటితో ఆగకుండా వాహనాలను కూడా ధ్వంసం చేశారు. పోలీసుల సమక్షంలోనే ఈ ఎపిసోడ్ అంతా జరిగింది. మళ్లీ అదే పోలీసులు మాపై నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టారు. నిన్న నాపై దాడి జరిగింది. ఈరోజు నా భద్రతను తగ్గించారు.ఈరోజు వైఎస్సార్సీపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి. మీరు అధైర్యపడవద్దు. కార్యకర్తలకు, పార్టీ నాయకులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటాను. విద్యార్థి దశ నుంచే మా తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పదిసార్లు ఎన్నికలు చూశారు. చంద్రబాబు చేసే దుర్మార్గపు రాజకీయాలను ఎప్పుడూ చూడలేదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
లా అండ్ ఆర్డర్ విఫలం.. చేతులెత్తేసిన పోలీసులు
-
పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డిపై టీడీపీ దాడి
సాక్షి, చిత్తూరు: టీడీపీ అరాచకాలకు అడ్డూ, అదుపు లేకుండా పోతోంది. పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి. మాజీ ఎంపీ రెడప్ప నివాసానికి మిథున్‌రెడ్డి రాగా.. రెడ్డప్ప ఇంటిపై టీడీపీ శ్రేణులు రాళ్లదాడికి దిగాయి.టీడీపీ దాడిలో గాయపడ్డ నేతలతో మిథున్‌రెడ్డి సమావేశం జరుగుతుండగా.. ‘పచ్చ’మూకలు రెచ్చిపోయాయి. రాళ్లతో దాడులకు తెగబడ్డాయి. రెడ్డప్ప ఇంటిని చుట్టిముట్టిన టీడీపీ గూండాలు.. మీడియా ప్రతినిధులపైనా రాళ్లతో దాడి చేశారు. రెడ్డప్ప ఇంటి వద్ద టీడీపీ కార్యకర్తలు యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. ఎంపీ మిథున్ రెడ్డి, వైఎస్సార్సీపీ నేతల వాహనాలను కూడా టీడీపీ గూండాలు ధ్వంసం చేశారు.చంద్రబాబు, లోకేష్ డైరెక్షన్లోనే దాడులు: మిథున్‌రెడ్డి ప్రశాంతంగా ఉన్న పుంగనూరు నియోజకవర్గంలో ఘర్షణ వాతావరణం సృష్టించారని మిథున్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘రాళ్లతో మారణాయుధాలతో ఈ రోజు దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ డైరెక్షన్ లోనే ఈరోజు పుంగనూరులో దాడులు జరుగుతున్నాయి. పుంగనూరు నియోజకవర్గం అభివృద్ధి అడ్డుకోవాలని కుట్రలో భాగమే. 5 వేల కోట్లతో ఎలక్ట్రికల్ కారు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే, దాన్ని రాకుండా కుట్రలు చేస్తున్నారు. ఎల్లకాలం మీ ఆటలు సాగవు, ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. నా పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించే వాతావరణం లేకుండా దాడులు చేస్తున్నారు. మా వాహనాలు ధ్వంసం చేశారు. ఇప్పటికీ రాళ్లు దాడి చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులు చేస్తూనే ఉన్నారు’’ అని మిథున్‌రెడ్డి ధ్వజమెత్తారు.దాడులు అత్యంత హేయం: ఎంపీ గురుమూర్తితెలుగుదేశం నేతల దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు పుంగనూరులోని మాజీ ఎంపీ రెడ్డెప్ప నివాసానికి వెళ్లిన మిధున్ రెడ్డిపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్యగా తిరుపతి ఎంపీ గురుమూర్తి అభివర్ణించారు. మిథున్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండించారు.ప్రజాస్వామ్య బద్దంగ ఎన్నికైన ఒక పార్లమెంటు సభ్యునికే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం సామాన్య కార్యకర్తలకు ఏవిధమైన రక్షణ కల్పిస్తుందన్నారు. ఒక ఎంపీపై రాళ్ల దాడి చేస్తుంటే రక్షణ కల్పించాల్సిన పోలీసులే చోద్యం చూస్తుంటే ఏవిధమైన ఆటవిక పాలన కొనసాగుతుందో అర్ధం చేసుకోవాలన్నారు. గతంలో ఎన్నడూ లేనటువంటి సంస్కృతిని నేటి పాలనలో చూస్తున్నామని అధికారం శాశ్వతం కాదు అనేది గుర్తుంచుకొంటే బాగుంటుందని ఆయన అన్నారు. నేడు మీ వెనుక ఉండి దాడులకు ప్రోత్సహించే నాయకులూ నాడు ఎవరూ ఉండరు అనేది ఆలోచించించాలని అన్నారు. -
పుంగనూరులో అర్ధరాత్రి విధ్వంసం
-
పుంగనూరులో కూటమి నేతల విధ్వంసం..
సాక్షి, చిత్తూరు: ఏపీలో కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతున్నారు. అలాగే, వైఎస్సార్పీ నేతల ఆస్తులను సైతం ధ్వంసం చేస్తున్నారు.తాజాగా పుంగనూరులో శనివారం అర్ధరాత్రి కూటమి నేతలు అరాచకం సృష్టించారు. ఇండోర్ స్టేడియం అసోసియేషన్ ప్రతినిధులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుకూలంగా పనిచేశారన్న కక్షతో దాడులు చేశారు. కోటి రూపాయలకు పైగా నిధులతో నిర్మించిన బ్యాట్మెంటన్ కోర్టు భవనాన్ని పచ్చ పార్టీ నేతలు ధ్వంసం చేశారు. భారీగా ప్రొక్లైన్లు, జేసీబీలు వినియోగించి దాడులకు పాల్పడ్డారు. -
పుంగనూరులో ‘అధికార’ అరాచకం
సాక్షి, టాస్‌్కఫోర్స్: అన్నమయ్య జిల్లా పుంగనూరులో అధికార మదంతో టీడీపీ శ్రేణులు సాగిస్తున్న అరాచక కాండ ఇది. ఫ్యాన్ గుర్తుకు ఓటేసిన ప్రతి ఒక్కరినీ లక్ష్యంగా చేసుకొని టీడీపీ గూండాలు రెచ్చిపోతున్నారు. ప్రతి రోజూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. నివాసాల్లోకి చొరబడి తరిమి తరిమి కొడుతున్నారు. ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో నిర్మించిన ప్రభుత్వ ఆస్తులను కూల్చివేస్తున్నారు. టీడీపీ శ్రేణుల దాడులతో తీవ్రగాయాలైన అనేక మంది పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరికొందరు ఊళ్లొదిలి రహస్య ప్రాంతాల్లో తలదాచుకోవాల్సిన దుస్థితి. సోమల మండలం నంజంపేట, కమ్మపల్లి, కందూరు, ఇరికిపెంట గ్రామాల్లో సుబ్రమణ్యంరెడ్డి, ఇంతియాజ్ బాషా, ప్రసాద్, భానుప్రకా‹Ù, రమే‹Ù, మునీశ్వర్, మోహన్‌బాబు, గంగులప్ప నివాసాల్లోకి చొరబడి, వారిపై దాడులు చేశారు. వీరంతా తీవ్ర గాయాలతో తిరుపతి రుయా, సోమల ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం కమ్మపల్లిలో వంద మందికి పైగా టీడీపీ గూండాలు వైఎస్సార్సీపీ నాయకుడు సుబ్రమణ్యం రెడ్డి ఇంటి తలుపులు విరగ్గొట్టి లోపలికి జొరబడ్డారు. ఇంట్లో ఉన్న సుబ్రమణ్యంరెడ్డిని ఈడ్చుకొచ్చి కొట్టారు. చంపేస్తామని బెదిరించారు. ఆయన ఇటుకల బట్టీలోని లక్ష ఇటుకలను దౌర్జన్యంగా ట్రాక్టర్లతో తరలించుకెళ్లారు. బట్టీని ధ్వంసం చేశారు. ఫోటోలు, వీడియోలు తీయకుండా మొబైల్ ఫోన్లు లాక్కుని నేలకేసి కొట్టి నాశనం చేశారు. ఈ విషయం బయటకు పొక్కితే ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతామని హెచ్చరించారు. దీంతో ప్రాణ భయంతో సుబ్రమణ్యంరెడ్డి కుటుంబం ఊరొదిలి వెళ్లిపోయింది. ఇలాంటి ఘటనలో గత నెల రోజుల్లో అనేకం జరిగాయి. అయినా పోలీసులు తగిన చర్యలు తీసుకోవడంలేదు. టీడీపీ నేతల దాడుల విషయంపై పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినా స్పందించడంలేదు. తాగు నీటి ట్యాంకులూ కూల్చివేత వైఎస్సార్సీపీ హయాంలో నిరి్మంచిన ప్రభుత్వ ఆస్తులను సైతం టీడీపీ గూండాలు ధ్వంసం చేస్తున్నారు. కరువు ప్రాంతాల్లో ఒకటైన పుంగనూరు నియోజకవర్గంలో ప్రజల తాగు నీటి కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిధున్ రెడ్డి నిధులు మంజూరు చేయించారు. 20 వేల లీటర్ల సామర్థ్యంతో నియోజకవర్గం మొత్తం రూ.60 కోట్లతో 550 ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణం చేపట్టారు. ప్రజలకు మంచి నీరందించే ఈ ట్యాంకులను కూడా టీడీపీ నేతలు కూల్చివేస్తున్నారు. రొంపిచెర్ల మండలం బోడిపాటివారి పల్లిలో రూ.15 లక్షలతో నిర్మిస్తున్న ఓవర్‌హెడ్ ట్యాంకును రెండు రోజుల క్రితం టీడీపీ నేతలు జేసీబీలతో కూల్చివేసి, పనులకు తెచ్చిన ఇనుప కమ్మీలను ఎత్తుకెళ్లిపోయారు. రొంపిచెర్ల క్రాస్ కురప్పల్లి వద్ద రూ. 15 లక్షలతో రెండో ఓవర్ హెడ్ ట్యాంకును నిర్మించారు. దీనిని కూడా జేసీబీలతో కూల్చివేశారు. ప్రజాధనంతో గ్రామీణ ప్రజల తాగునీటి అవసరాల కోసం నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకులను సైతం కూల్చివేయడం టీడీపీ నీచ మనస్తత్వానికి నిదర్శనమని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అధికార మదం పుంగనూరు ఎమ్మెల్యేగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి విజయాన్ని తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ జీరి్ణంచుకోలేకపోతోంది. వారిద్దరూ పుంగనూరులో పర్యటిస్తే అక్కడ టీడీపీకి పుట్టగతులుండవన్న విషయం ఆ పార్టీ నేతలకు అర్ధమైంది. అందుకే ఎమ్మెల్యే, ఎంపీలనే పుంగనూరులో అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్నారు. పోలీసులతో ఇద్దరినీ హౌస్ అరెస్టు చేయించారు. దాడుల పరంపర సోమల మండలం నంజంపేట, కమ్మపల్లి, కందూరు, ఇరికిపెంట గ్రామాల్లో పలువురి ఇళ్లలోకి చొరబడి, వారిపై దాడులు చేశారు. వీరంతా తీవ్ర గాయాలతో తిరుపతి రుయా, సోమల ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అధికార గూండాయిజం కమ్మపల్లిలో వైఎస్సార్సీపీ నాయకుడు సుబ్రమణ్యంరెడ్డి నివాసంలోకి జొరబడ్డ టీడీపీ గూండాలు ఆయన్ని చితక్కొట్టారు. ఆయన ఇటుకల బట్టీలోని ఇటుకలను తరలించి, ఆ బట్టీని ధ్వంసం చేశారు. ఫోన్లను నాశనం చేశారు. దీంతో ఆయన కుటుంబంతో సహా ఊరొదిలి వెళ్లిపోయారు. ఖాకీల కాఠిన్యం ఓ పక్క టీడీపీ గూండాల దాడులకు బెంబేలెత్తుతున్న ప్రజలు పోలీసులను ఆశ్రయిస్తే వారికి ఊహించని సమాధానం ఎదురవుతోంది. మీరే ఊరొదిలి పెట్టి ఎక్కడికైనా వెళ్లిపోండంటూ పోలీసు అధికారులు కొందరు సమాధానమివ్వడం బాధితులను మరింత భయభ్రాంతులకు గురి చేస్తోంది.పింఛన్లు నిలిపివేత ప్రభుత్వం అందించే సామాజిక పింఛన్లు వైఎస్సార్సీపీ శ్రేణులకు ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. కమ్మపల్లిలో పొన్నెమ్మ, యశోదమ్మ, శివారెడ్డితో పాటు సోమల మండలం పరిధిలో 75 మందికిపైగా లబ్ధిదారులకు పింఛన్లు నిలిపివేశారు. ఈ విషయం అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలు సరఫరా నిలిపివేయండి కమ్మపల్లిలో వైఎస్సార్సీపీకి మద్దతిచ్చిన పది కుటుంబాలకు పాలు కూడా అందకుండా టీడీపీ నేతలు దాషీ్టకం ప్రదర్శిస్తున్నారు. ఈ కుటుంబాలకు పాల సరఫరా నిలిపివేయాలని టీడీపీ నేతలు డెయిరీ యజమానులకు ఫోన్‌చేసి హుకుం జారీ చేసినట్లు బాధితులు వాపోయారు. వారికి పాలు సరఫరా చేస్తే వ్యాను తగులబెట్టేస్తామని టీడీపీ నేతలు హెచ్చరించినట్లు సమాచారం. అప్పు తీసుకోకపోయినా చెల్లించాలట పుంగనూరులో దుస్తుల దుకాణం నడుపుతున్న కె. జయంతి వైఎస్సార్సీపీకి ఓటేశారని టీడీపీ శ్రేణులు ఆమెకు ఫోన్లు చేసి బెదిరింపులకు దిగారు. అంతటితో ఆగకుండా.. పోలీసుల ద్వారా ఆమెకు ఫోన్ చేయించి ‘మీరు రూ.3 లక్షలు అప్పు తీసుకున్నారంట. వెంటనే చెల్లించకపోతే కేసు నమోదు చేస్తాం’ అని బెదిరించినట్లు తెలిసింది. ఈ విషయం గురించి ఆమెను సంప్రదిస్తే తాను ఎవ్వరికీ బకాయిలేనని, ఉంటే ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. ఊరొదిలి వెళ్లి దాక్కోండి టీడీపీ దాడులతో కమ్మపల్లి ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. పోలీసులు కూడా ఊరొదిలి వెళ్లిపోవాలని చెబుతుండటంతో మరింత భయకంపితులవుతున్నారు. టీడీపీ నేతలు ఆస్తులు కూడా ధ్వంసం చేస్తున్నారని, తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రక్షణ కలి్పంచాల్సిన పోలీసులే బాధ్యత లేకుండా వ్యవహరించటంపై న్యాయనిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
ఎంపీ మిథున్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డిలపై ఆంక్షలు
సాక్షి, తిరుపతి టాస్క్‌ఫోర్స్: రాజంపేట పార్లమెంట్ పరిధిలోని పుంగనూరు ఎమ్మెల్యేగా గెలిచిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిని ఆ నియోజకవర్గంలో పర్యటించకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. శాంతి భద్రతల పేరుతో వారి పర్యటనలకు అడ్డు చెబుతున్నారు. కార్యకర్తల సమావేశంలో పాల్గొనడంతో పాటు కూటమి నేతల దాడుల్లో నష్టపోయిన వారిని పరామర్శించి, భరోసా కల్పించాలని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి నిర్ణయించారు.ఆదివారం పార్లమెంట్ సమావేశాలు ఉండవు కాబట్టి ఢిల్లీ నుంచి తిరుపతి చేరుకున్నారు. ఇక్కడి నుంచి పుంగనూరుకు వెళ్లే సమయంలో పోలీసులు ఆదివారం ఆయన నివాసానికి చేరుకుని అక్కడికి వెళ్లడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. ఎంపీకి నోటీసులు ఇచ్చేందుకు గోడలు దూకి హడావుడి చేశారు. తిరుపతిలోని వకుళామాత ఆలయానికి కూడా వెళ్లడానికి వీలు లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు.పర్యటిస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని సాకు చెప్పారు. అంతటితో ఆగని పోలీసులు.. ఎమ్మెల్యే పెద్దిరెడ్డిని కలిసేందుకు వచ్చిన నియోజకవర్గ ప్రజలను సైతం లోనికి రానివ్వకుండా అడ్డుకున్నారు. వంద మీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేసి, పెద్దిరెడ్డి నివాసంలోకి ఎవరూ వెళ్లేందుకు లేకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రజలను కలిసేందుకు కూడా ఒప్పుకోలేదు. ఇదే సమయంలో పుంగనూరు నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో పలువురు వైఎస్సార్సీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. తమ ఆదేశాలను పాటించకపోతే కేసులు పెడతామని బెదిరించారు. నా నియోజకవర్గానికి నేను వెళ్లకూడదా?ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై కూటమి నేతలు భౌతిక దాడులకు పాల్పడుతున్నారని, గతంలో ఎన్నడూ లేని సంస్కృతికి తెరలేపారని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి మండిపడ్డారు. తిరుపతిలోని తన నివాసంలో ఆదివారం ఉదయం ఆయన విలేకరుల సమావేశంలో కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందన్నారు. నియోజకవర్గంలో ఎలక్ట్రికల్ బస్సు కంపెనీ రాకుండా, పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.ఇన్ని గొడవల నేపథ్యంలో ఎలక్ట్రిక్ బస్సుల ఫ్యాక్టరీ యాజమాన్యం సందిగ్ధంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో పుంగనూరుకు ఏ పరిశ్రమలు రాకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తన నియోజక వర్గంలో పర్యటించకుండా, ప్రజల్ని కలవకుండా అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పేదల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. జేసీబీలు తీసుకొచ్చి వైఎస్సార్సీపీ నాయకుల మామిడి తోటలు, ఆస్తులు, కుటుంబ సభ్యుల వాహనాలను ధ్వంసం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.నియోజకవర్గంలో పేదల ఆవులు కూడా ఎత్తుకెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఎన్నికల సమయంలో రాజకీయంగా పోరాడితే అందరం స్వాగతిస్తాం. కానీ పేదల ఇళ్లపై దాడులు చేయడం దారుణం. మా వారిని పరామర్శించడానికి వెళుతుంటే పోలీసులు అడ్డుకోవడం ఏమిటి? నా నియోజకవర్గంలో నేను పర్యటించకూడదా? ఈ విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్తా. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. వైఎస్సార్సీపీకి 40 శాతం మంది ఓటేశారని, వారందరినీ రాష్ట్రం నుంచి తరిమేస్తారా?’ అని నిప్పులు చెరిగారు. అరెస్టుకైనా, ప్రాణ త్యాగానికైనా సిద్ధం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉంటామని ఎంపీ మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ మారాలని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తాను బీజేపీలోకి వెళ్తున్నానని బుద్ధి లేని వారు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చల్లా బాబును అనేక సంవత్సరాల నుంచి చూస్తున్నప్పటికీ, ఇలాంటివి ఎప్పుడూ లేవని, బాబు ట్రాప్‌లో పడొద్దని హితవు పలికారు. గతంలో పోలీసులపై దాడి చేసిన చల్లా బాబు జైలుకు వెళ్లారన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రజల కోసం తాను అరెస్టుకైనా, ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. మంత్రి పదవిని కాపాడుకోవడానికే రాంప్రసాద్ తమపై విమర్శలు చేస్తున్నారని చెప్పారు.పుంగనూరులో ఉద్రిక్తత పుంగనూరు: ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే, ఎంపీలు తమ సొంత నియోజకవర్గాలలో తిరగరాదని హెచ్చరికలు చేస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు రోడ్లపై ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్న ఘటనలు ప్రజలను విస్మయానికి గురిచేస్తున్నాయి. ఆదివారం రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి పుంగనూరులో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న కూటమి నేతలు పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్లో ధర్నా చేపట్టి, నల్లజెండాలతో నిరసనకు దిగారు.ఎమ్మెల్యే, ఎంపీలు రాకూడదంటూ దూషణల పర్వం కొనసాగించారు. సుమారు రెండు గంటల సేపు హైడ్రామా సాగింది. ఈ నెల15న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి పుంగనూరు పర్యటన సమయంలో కూడా కూటమి నేతలు ఇలాగే అడ్డుకున్నారు. కూటమి నేతల తీరుతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పోలీసులు ఎంపీ మిథున్‌రెడ్డిని తిరుపతిలో హౌస్ అరెస్ట్ చేశామని తెలపడంతో కూటమి శ్రేణులు శాంతించారు. -
పుంగనూరులో ఫ్యాక్షన్ రాజకీయాలు.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు
-
ఆగని టీడీపీ దాడులు.. పెరిగిన విధ్వంసం
సాక్షి నెట్వర్క్: టీడీపీ పార్టీ కార్యకర్తలు పేట్రేగిపోతున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ, శంకుస్థాపనల శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం మండపాకలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ భవనాల వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రాలున్న శిలాఫలకాలను టీడీపీ శ్రేణులు శుక్రవారం రాత్రి ధ్వంసం చేశాయి. శనివారం ఉదయం విధులకు హాజరైన సచివాలయ సిబ్బంది దీనిని గుర్తించారు. ఈ ఘటనపై తణుకు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు బోడపాటి వీర్రాజు తెలిపారు. నూజివీడులో శిలాఫలకం కూల్చివేత ఏలూరు జిల్లా నూజివీడు నెహ్రూ పేటలో శనివారం తెల్లవారుజామున ఒక శిలాఫలకాన్ని కూల్చివేశారు. వారం రోజుల క్రితం చాట్రాయి మండలం పోలవరంలో నాలుగు శిలాఫలకాలను ధ్వంసం చేయగా.. ఈ నెల 11న రాత్రి నూజివీడు మండలం బోర్వంచలో గ్రామ సచివాలయ భవనం కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. ఎంఎన్‌పాలెంలో రెండు శిలాఫలకాలను, సీతారామపురంలో ఒక శిలాఫలకాన్ని, తూర్పుదిగవల్లిలో గ్రామ సచివాలయం బోర్డును ధ్వంసం చేశారు. సచివాలయంపై టీడీపీ జెండా ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం చినమనగుండం సచివాలయం ప్రారం¿ోత్సవ శిలాఫలకాలను టీడీపీ కార్యకర్తలు నెలకుర్తి దినే‹Ù, గుత్తా మహేందర్ ధ్వంసం చేశారు. సచివాలయం, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవనం వద్ద ఉన్న శిలాఫలకం కూడా ధ్వంసం చేశారు. అనంతరం గ్రామ సచివాలయంపై టీడీపీ జెండా పెట్టారు. శిలాఫలకాన్ని ధ్వంసం చేస్తున్న దృశ్యాలను టీడీపీ కార్యకర్తలు వీడియో తీసి వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరని కామెంట్లు పెట్టారు. ధ్వంసం చేసిన శిలాఫలకాల బోర్డులను, సచివాలయ భవనాలను శనివారం వైఎస్సార్సీపీ నాయకులు, సర్పంచ్ వడ్లమూడి మురళీమోహన్, ఎంపీటీసీ కోండ్రు వెంకటేశ్వర్లు, మాజీ వైస్ ఎంపీపీ ఉన్నం శ్రీనివాసులు పరిశీలించారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పంచాయతీ కార్యదర్శి నాగార్జున ఇచ్చిన ఫిర్యాదు మేరకు పొదిలి సీఐ మల్లికార్జునరావు, ఎస్ఐ మాధవరావు ఘటన స్థలాన్ని పరిశీలించారు. సచివాలయ ఉద్యోగులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఐ, ఎస్ఐ చెప్పారు. వైఎస్సార్ పేరు తొలగింపు ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని నూతన మునిసిపల్ కార్యాలయంపై గల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు, కార్యాలయం ప్రవేశ ఆర్చిపై ఉన్న మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి, వెంకాయమ్మ చారిటబుల్ ట్రస్ట్ పేర్లను టీడీపీ నాయకులు శనివారం తొలగించారు. మునిసిపల్ కార్యాలయం 6 నెలల క్రితం ప్రారంభం కాగా.. ఆర్చిని బూచేపల్లి శివప్రసాదరెడ్డి సొంత నిధులతో నిర్మించారు. వీటితో పాటు చీమకుర్తిలోని ప్రభుత్వాస్పత్రి ప్రవేశ ద్వారం ఆర్చిపై ఉన్న మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి, వెంకాయమ్మ పేర్లను కూడా తొలగించారు. ఈ ఘటనలపై వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ క్రిష్టిపాటి శేఖరరెడ్డి, కౌన్సిలర్ సోమా శేషాద్రి, గోపురపు చంద్ర, ఆముదాలపల్లి రామబ్రహ్మం తదితరులు సీఐని కలిసి వినతిపత్రం అందించారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
పుంగనూరులో హై టెన్షన్..
-
కుప్పంలోకి ప్రవేశించిన కృష్ణమ్మ జలాలు
-
సీఎం వైఎస్ జగన్ సహకారం మరువలేనిది
పుంగనూరు: జర్మనీకి చెందిన తమకు రాష్ట్రంలో పరిశ్రమ ఏర్పాటులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించిన సహకారం మరువలేనిదని పెప్పర్ మోషన్ విద్యుత్ బస్సుల తయారీ సంస్థ సీఈవో ఆండ్రియాస్ హేగర్ చెప్పారు. తాము చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏర్పాటు చేయబోయే పరిశ్రమ ద్వారా యువతకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు. హేగర్, ఆయన బృందం శుక్రవారం పుంగనూరు మండలంలోని ఆరడిగుంటలో పెప్పర్ మోషన్ బస్సులు, ట్రక్కుల తయారీ పరిశ్రమకు కేటాయించిన భూమిని జిల్లా కలెక్టర్ షన్మోహన్తో కలిసి పరిశీలించింది. ఈ సందర్భంగా హేగర్ జిల్లా కలెక్టర్‌తో, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, పీకేఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్‌తో పలు విషయాలపై చర్చించారు. అనంతరం పుంగనూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. భారతదేశం పెప్పర్ మోషన్ సంస్థకు రెండో పుట్టినిల్లు అని తెలిపారు. 2009లో తొలిసారిగా ఇండియాను సందర్శించామన్నారు. భారతదేశంలో అధిక జనాభా ఉన్నారని, అధిక శాతం వాహనాలను వినియోగిస్తున్నారని తెలిపారు. అందుకే ఇక్కడ 800 ఎకరాలలో రూ.4,640 కోట్లతో పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో 8,100 మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. ఫిబ్రవరిలో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. 2027 నాటికి 30 వేల బస్సులు, ట్రక్కులను మార్కెట్లో విడుదల చేస్తామన్నారు. మూడు దశల్లో నిర్మాణం చేస్తామని తెలిపారు. పర్యావరణానికి పూర్తి అనుకూలమైన విద్యుత్ బస్సులు, ట్రక్కుల తయారీతో పాటు విడిభాగాల తయారీ పరిశ్రమ కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తామన్నారు. బెంగళూరు, తమిళనాడుకు పుంగనూరు జాతీయ రహదారులు అనుసంధానం కావడం, విమానాశ్రయాలు, రవాణా సదుపాయాలు ఎంతో బాగుండడంతో ఇక్కడ పరిశ్రమ పెట్టాలని నిర్ణయించామన్నారు. దీని ద్వారా అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారాలు కొనసాగించేందుకు వీలుందని సీఈవో తెలిపారు. ఈ పరిశ్రమ ఏర్పాటులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ షన్మోహన్ పూర్తి సహకారం అందిస్తున్నారని చెప్పారు. సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది: జిల్లా కలెక్టర్ పుంగనూరు మండలంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన జర్మన్ పెప్పర్ ఎల్‌క్ట్రికల్ బస్సుల సంస్థ పరిశ్రమ ఏర్పాటు కావడం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గదని జిల్లా కలెక్టర్ షన్మోహన్ కొనియాడారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి చొరవతో పరిశ్రమ ఏర్పాటవుతోందన్నారు. నిరుద్యోగులు ఉపాధి కోసం వలసలు వెళ్లకుండా ఇక్కడే 8 వేల మందికి ఉపాధి లభిస్తుందని కలెక్టర్ తెలిపారు. ఘన స్వాగతం పెప్పర్ కంపెనీ సీఈవో ఆండ్రియస్ హేగర్కు, ఆయన బృందానికి కర్ణాటక సరిహద్దులో పుంగనూరు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, పీకేఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు కొత్తపల్లె చెంగారెడ్డి ఘన స్వాగతం పలికారు. శాలువలు కప్పి సన్మానించారు. హేగర్తోపాటు ఆ సంస్థ సీటీవో డాక్టర్ మదియాస్ కెర్లర్, సీఎస్‌వో సత్య, ఫైనాన్స్ డైరెక్టర్ ఉవే స్టెల్డర్, సీఐవో రాజశేఖర్‌రెడ్డి, సీఎస్‌వో సత్య బులుసు, సీసీవో రవిశంకర్, ఉర్త్ ఎల్రక్టానిక్స్ ఎండీ హర్ష ఆద్య తదితరులు ఉన్నారు. -
ప్రభుత్వ జూనియర్ కళాశాల.. యదార్థ సంఘటనతో సినిమా టీజర్
'ప్రభుత్వ జూనియర్ కళాశాల' ట్యాగ్‌లైన్ పుంగనూరు. ఈ పేరుతోనే సినిమాను యూత్ ఆడియన్స్‌కు కనెక్ట్ చేశారు మేకర్స్. ఓ యదార్థ సంఘటన ఆధారంగా, ఆసక్తికరంగా తెరకెక్కిన ఈ చిత్రం తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు శ్రీనాథ్ పులకురం దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇది వరకు విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా అందరినీ ఆకట్టుకుంది. నిర్మాతగా భువన్ రెడ్డి కొవ్వూరి ఈ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులోని నటీనటులు కొత్తవారు అయినా వారి నుంచి మంచి నటనను రాబట్టుకున్నట్లు టీజర్‌ను చూస్తుంటే అర్థం అవుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ రోడ్రిగ్జ్ అద్భుతమైన మ్యూజిక్‌ను అందించారు. ఇందులో ఒకపాటను ప్రముఖ గాయని చిన్మయి పాడారు. యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా టీనేజ్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థం అవుతుంది. ఈ సినిమా ఆడియో హక్కులను ఫాన్సీ రేటుకు టీ సిరీస్ తెలుగు సంస్థ దక్కించుకుంది. దీంతోనే చెప్పవచ్చు సినిమాకు మంచి స్కోప్ ఉందని. కార్తీక్ రోడ్రీగుజ్ స్వరాలను అందించగా కమ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించారు. శ్రీ సాయి కిరణ్ లిరిక్స్ రాశారు. నిఖిల్ సురేంద్రన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. -
పొట్టి దూడ.. గట్టి మేలు!
పలమనేరు(చిత్తూరు జిల్లా): పుంగనూరు పొట్టిరకం దూడలకు దేశవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది. పుట్టినప్పుడు కేవలం అడుగు మాత్రమే ఎత్తు ఉండి, తన జీవితకాలంలో మూడు అడుగులు మాత్రమే పెరుగుతుంది. అయితే ఈ దూడలకు ఉండే తోక నేలకు తాకేట్లు ఉంటే... ఆ రకానికి విపరీతమైన డిమాండ్ ఉన్నట్టే. వీటిలో మొదటిరకం రూ.2 నుంచి రూ.4 లక్షలు పలుకుతుండగా, రెండో రకం రూ. 50వేల నుంచి రూ.4 లక్షల ధర పలుకుతోంది. ఇంత ఖరీదైనా, ప్రస్తుతం ఇవి అందుబాటులో ఉండడం లేదు. ఈ దూడల్లో తోక నేలకు తాకడం, గోపురం కింద గంగడోలు కిందికి ఉండే రకాలు ఇళ్లల్లో ఉంటే ఆరోగ్యంతోపాటు అదృష్టం వరిస్తుందనే నమ్మకం చాలామందిలో ఉంది. సాంకేతికంగా ఈ జాతి దూడలు తక్కువ మేత తింటూ, ఎక్కువ రోగ నిరోధకశక్తి కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి లక్షణాలున్న దూడల కొనుగోలుకు ఏపీలోని ఉమ్మడి చిత్తూరు, కడప, అనంతపురము, ఉభయ గోదావరి జిల్లాలు సహా దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన బడాబాబులు సైతం ఆసక్తి చూపుతున్నారు. ఔషధ గుణాలు మెండు అరుదైన రకం పశువులుగా ఈ పుంగనూరు పొట్టి దూడలకు పేరుంది. అధిక వ్యాధి నిరోధక శక్తి, తక్కువ మేతతో ఎక్కువ వెన్నశాతం కలిగిన పాలనిస్తాయి. వీటి పాలు, మూత్రంలలో ఔషధ గుణములు మెండుగా ఉన్నాయి. అయితే వీటి ఉనికి ప్రశార్థకమవుతున్న తరుణంలో మరిన్ని దూడల ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్కేవీవై) ద్వారా కృషి చేస్తోంది. దేశంలో ఇలాంటి పశువులు 700 దాకా ఉండగా, దీన్లో 277 చిత్తూరు జిల్లా పలమనేరులోనే ఉన్నాయి. వీటిలో కుర్ర దూడలు 33, పెయ్య దూడలు 17 ఉండగా, మిగిలినవి ఎద్దులు, ఆవులు. పలమనేరు పరిశోధనా సంస్థలో ఉత్పత్తి... 1953లో పలమనేరు కెటిల్ఫామ్ వద్ద ‘సంకర జాతి ఆవుల ఉత్పత్తి, పరిశోధన కేంద్రం’ ప్రారంభమైంది. అనంతరం ఇన్‌సైటీవ్ కన్సర్వేషన్ (స్థానికంగా పొట్టి దూడల సంఖ్యను ఉత్పత్తి చేయడం) అనే లక్ష్యంతో 1995లో పుంగనూరు పొట్టి రకం పశువుల ఉత్పత్తి కేంద్రంగా మారింది. స్థానిక అధికారులు మేలైన పుంగనూరు రకం ఎద్దుల వీర్యాన్ని స్థానికంగా ఈరకం ఆవులు కలిగివున్న రైతులకు అందిస్తున్నారు. తద్వారా వారి వద్ద పొట్టి దూడల సంఖ్య గణనీయంగా వృద్ధి చెందుతోంది. పలమనేరు సహా రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాల్లో ఔత్సాహిక రైతులు ఫామ్స్‌లో ఈ పొట్టిజాతిని ఉత్పత్తి చేస్తూ లక్షల్లో విక్రయిస్తున్నారు. గణనీయ ఉత్పత్తికి కృషి ఆంధ్రప్రదేశ్ పశు అభివృద్ధి సంఘం (ఏపీఎల్డీఏ) ద్వారా పుంగనూరు రకం ఎద్దుల వీర్యాన్ని ఎదకొచ్చిన, పుంగనూరు ఆవులు కలిగిన ఉన్న రైతులకు స్థానిక పశువైద్యుడి పర్యవేక్షణలో అందిస్తూ, ఈ జాతి అభివృద్ధి అయ్యేలా కృషి చేస్తున్నాం. అవసరమైన రైతులు కెటిల్ఫామ్లో సెమన్ పొందవచ్చు.– డా.వేణు, సైంటిస్ట్, పశు పరిశోధన కేంద్రం, పలమనేరు -
కడప జైలుకు పుంగనూరు నిందితులు
సాక్షి, చిత్తూరు జిల్లా: పుంగనూరు విధ్వంసం కేసులో ప్రధాన నిందితుడు, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి(చల్లా బాబు) సహా 67 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం పోలీసుల ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులకు పుంగనూరు కోర్టు రిమాండ్ విధించింది. పుంగనూరు టీడీపీ ఇన్‌ఛార్జి చల్లా రామచంద్రారెడ్డితో పాటు.. 66 మంది నిందితులను కోర్టు ఆదేశాలతో కడప సెంట్రల్ జైలుకు తరలించారు. భారీ బందోబస్తు మధ్య నిందితులను రిమాండ్‌కు తరలించారు. కాగా, ఆగస్ట్ 4వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు అన్నమయ్య జిల్లాలోని అంగళ్లులో, చిత్తూరు జిల్లా పుంగనూరులో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. అప్పటికే పన్నిన పక్కా కుట్రతో టీడీపీ నేతలు, కార్యకర్తలు, కిరాయి మూకలు రాళ్లు, కట్టెలతో దాడి చేసి సుమారు 47 మంది పోలీసులను గాయపరిచారు. రెండు పోలీస్ వాహనాలను తగలబెట్టారు. రణధీర్ అనే కానిస్టేబుల్ కంటి చూపు కోల్పోయాడు. ఈ విధ్వంసానికి సంబంధించి ఇప్పటివరకు 277 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు చల్లా బాబు సహా నిందితులంతా పారిపోగా.. పోలీసులు ఇప్పటికే 110 మందిని అరెస్టు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో... టీడీపీ నేత చల్లా బాబును అదుపులోకి తీసుకునేందుకు జిల్లా పోలీస్ శాఖ 4 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు చల్లా బాబు తన సెల్‌ఫోన్ పడేసి.. కొత్త ఫోన్ తీసుకున్నాడు. సిమ్‌కార్డులు మార్చేస్తూ ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో తిరిగినట్లు తెలిసింది. ఎన్నిసార్లు మకాం మార్చేసినా పోలీసులు సమీపిస్తుండటంతో చల్లా బాబుతో పాటు టీడీపీ మూకల్లో ఆందోళన తలెత్తింది. చదవండి: నరం లేని నాలుక.. సీపీఐ మరీ దయనీయంగా.. ఈ నేపథ్యంలో తనపై నమోదైన 7 కేసుల్లో బెయిల్ కోరుతూ చల్లా బాబు హైకోర్టుకు వెళ్లగా.. న్యాయస్థానం మూడు కేసుల్లో బెయిల్ నిరాకరించింది. ఇక తిరగలేక, తప్పించుకోలేక చల్లా బాబు సహా 67 మంది నిందితులు సోమవారం పుంగనూరు పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ సుధాకర్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు. వారికి మద్దతుగా టీడీపీ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పల్లె రఘునాథరెడ్డి, దొరబాబు, సుగుణమ్మ తదితరులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు కొద్దిసేపు పోలీస్‌స్టేషన్ వద్ద నినాదాలు చేస్తూ హల్చల్ చేశారు. కాగా, ఆదివారం రాత్రి పుంగనూరుకు చెందిన సద్దామ్ హుస్సేన్, ఇమ్రాన్, ఫయాజ్, షామీర్, నూరుల్లాను రిమాండ్‌కు పంపించారు. పూచీకత్తు సమర్పించిన దేవినేని ఉమా మదనపల్లె: అంగళ్లులో జరిగిన అల్లర్ల కేసులో బెయిల్ పొందిన టీడీపీ నేత దేవినేని ఉమా సోమవారం మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో రూ.2 లక్షల బాండ్, ఇద్దరు జామీనుదారులను పూచీకత్తుగా సమర్పించారు. -
పుంగునూరులో పోలీసులపై దాడి కేసు: లొంగిపోయిన ఏ-1 నిందితుడు
చిత్తూరు జిల్లా: పుంగునూరులో పోలీసులపై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టీడీపీ ఇంచార్జ్ చల్లాబాబు సోమవారం పోలీసులకు లొంగిపోయాడు. పుంగునూరులో పోలీసులపై దాడి అనంతరం తప్పించుకుని తిరుగుతున్న చల్లాబాబు నెలరోజుల తర్వాత లొంగిపోయాడు. ఆగస్టు 1వ తేదీనే అల్లర్లకు చంద్రబాబు అండ్‌కో స్కెచ్ వేసింది. పుంగనూరు హైవేపై చంద్రబాబు మీటింగ్ ఉంటే పుంగనూరు పట్టణంలోకి బలవంతంగా దూసుకెళ్లాలని పథకం వేశారు. పోలీసులు అడ్డుకుంటే కర్రలు, రాళ్లు బీర్ బాటిళ్లతో రెచ్చిపోవాలని ప్లాన్ చేశారు. అల్లర్లపై పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా బాబుకు ముందే ఆదేశాలు వచ్చాయి. అంగళ్లు, పుంగనూరులో గొడవల పథకాన్ని వాంగ్మూలంలో చల్లా బాబు అనుచరులు స్పష్టంగా చెప్పారు. ఇప్పటివరకూ ఈ దాడి ఘటనకు సంబంధించి 110 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 63 మంది టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. నేరాల్లో ఘనుడు చల్లా బాబు పుంగనూరులో దాడి కేసులో ప్రధాన సూత్రదారి, పాత్రదారి ఆ నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి చల్లా బాబు అలియాస్ చల్లా రామచంద్రారెడ్డి అని పోలీసులు తేల్చారు. దాడులకు కుట్ర పన్నడం, వ్యూహాన్ని అమలుపరచడంలో ఇతనిదే ప్రధాన పాత్రగా పోలీసులు నిర్ధారించారు. చల్లా బాబు గత చరిత్ర అంతా నేర పూరితమేనని పోలీసు విచారణలో తేలింది. పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయి. ఇతను ఆలయ భూములు, ప్రభుత్వ భూముల ఆక్రమణకు పాల్పడినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. చల్లా బాబుపై ఉన్న పాత కేసుల్లో మచ్చుకు కొన్ని.. 1.1985లో రొంపిచెర్ల పోలింగ్ స్టేషన్‌పై బాంబు దాడి కేసు 2. రొంపిచెర్ల క్రైం నం.368, 2021లో ఐపీసీ సెక్షన్లు, 143, 188, 341,269, 270, 290 రీడ్‌విత్ 149 ఐపీసీ, సెక్షన్ 3 ఈడీయాక్ట్ 3. క్రైం నం.18–2021 ఐపీసీ సెక్షన్లు 353, 506 రీడ్‌విత్ 34 కింద కేసు 4. క్రైం నం.8–2022 ఐపీసీ సెక్షన్లు 188, 341 కింద చౌడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు 5. క్రైం నం.89–2023 ఐపీసీ సెక్షన్లు 143, 341, 506 రీడ్‌విత్149 కింద సోమల పీఎస్‌లో కేసు 6. క్రైం నం.72–2022 ఐపీసీ సెక్షన్లు› 341, 143, 290 రీడ్‌విత్ 149 కింద కేసు 7. క్రైం నం.26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రీడ్‌విత్ 149 కింద కల్లూరు పోలీసు స్టేషన్లో కేసు చదవండి: పుంగనూరు అల్లర్లు.. బయటపడ్డ చంద్రబాబు కుట్ర ‘నారా’జకీయం: తండ్రి పుంగనూరులో.. కొడుకు తుక్కులూరులో.. -
‘నారా’జకీయం: అటు పుంగనూరులో.. ఇటు తుక్కులూరులో..
‘హింసే అజెండా. దాడులతో పేట్రేగిపోవడమే సిద్ధాంతం. ఎక్కడికక్కడ రచ్చ రాజేసి అరాచకం సృష్టించడమే లక్ష్యం. ఏం చేసి అయినా.. ఎంత హింస రాజేసి అయినా.. వార్తల్లో కెక్కాలన్నదే ఆలోచన. ఇదే ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తోన్న విధ్వంస రాజకీయం. విద్వేషాలు రగులుస్తున్నారు. రెచ్చగొడుతున్నారు. శాంతి భద్రతలను దెబ్బ తీసి పైశాచికానందం చూస్తున్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయడానికి ఎన్ని వెధవ్వేషాలు వెయ్యాలో అన్ని వేషాలూ వేస్తున్నారు. సరికొత్త రాకాసి సంస్కృతిని రాజకీయాల్లోకి తెచ్చి విలువలకు పాతరేస్తున్నారు.‘ ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు అయ్యింది. ఇంత కాలం తర్వాత ప్రభుత్వం పట్ల జనం వ్యతిరేకతతో ఉండాలని ఉంటారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భావించారు. కానీ ఎక్కడా అసంతృప్తి లేకపోవడం ఆయనకు నచ్చలేదు. నాలుగున్నరేళ్ల తర్వాత అయిన ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి జనం బ్రహ్మరథం పడతారులే అని ఆయన అంచనా వేసుకున్నారు. కానీ అలాగా జరగలేదు. ఇప్పటికీ టీడీపీని జనం తిరస్కరిస్తూనే ఉన్నారు. కొద్ది రోజుల క్రితం పంచాయతీ ఉప ఎన్నికల్లోనూ టీడీపీని చిత్తుగా ఓడించడం ద్వారా ప్రజలు టీడీపీని దూరం పెట్టేశామని చాటి చెప్పారు. జనం దూరం అయిపోతే 2024 ఎన్నికల్లోనూ ప్రతిపక్షానికే పరిమితం కావల్సి వస్తుందన్న ఆలోచనే చంద్రబాబు నాయుడికి ముచ్చెమటలు పట్టిస్తోంది. అందుకే తన సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని పక్కన పెట్టి సరికొత్త గూండా రాజకీయాలను తెరపైకి తెచ్చారు. మొన్నటికి మొన్న పుంగనూరులో చంద్రబాబు తన స్వీయ దర్శకత్వంలో ఎంతటి హింస రాజేశారో అంతా చూశారు. చంద్రముఖిగా మారిన చంద్రబాబు వదనాన్నీ చూసి ఆశ్చర్యపోయారు. ఎక్కడికెళ్లినా తమ సభలకు ర్యాలీలకు జనం రాకపోతే.. స్పందన లేకపోతే.. మీడియాలో ప్రచారం దొరకదు కాబట్టి వార్తల్లోనే ఉండాలంటే విధ్వంసాలతో దూసుకుపోవడం ఒక్కటే మార్గమని చంద్రబాబు భావిస్తున్నట్లుందంటున్నారు పాలక పక్ష నేతలు. చంద్రబాబు నాయుడి రోడ్ షోలకు జనం రావడం లేదు. బహిరంగ సభల్లో జనం ఉండడం లేదు. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ యువగళం పేరుతో యాత్ర చేసుకుపోతూ ఉంటే ఊళ్లల్లో జనం ఎవరి పనులు వారు చేసుకుంటూ పోతున్నారు తప్ప లోకేష్యాత్రను వీక్షించడం లేదు. జనం ఇలా తమని వెలి వేసేశారన్న కోపమో కడుపు మంటో తెలీదు కానీ జనాన్ని కూడా వదలకూడదనుకున్న టీడీపీ నాయకత్వం ఆదేశాలతో లోకేష్ యాత్ర ఎక్కడికెళ్లినా రెచ్చగొట్టే తిట్ల పురాణాలు.. దాడులతో పేట్రేగిపోతున్నారు. ఏలూరు జిల్లాలో లోకేష్ పాదయాత్రలో టీడీపీ శ్రేణులు వీధిరౌడీల్లా వ్యవహరించారు. పాదయాత్ర మార్గంలో ఉన్న ఇళ్లపై రాళ్లతో దాడులు చేశారు. తుక్కులూరులో విధ్వంసానికి యత్నించారు టీడీపీ గుండాలు. చెవులు చిల్లులు పడేలా డీజే పాటలు పెట్టి వైఎస్సార్సీపీ నేతలను రెచ్చొగొట్టేలా వ్యవహరించారు. సౌండ్ తగ్గించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరిన వైఎస్సార్సీపీ నేత విజయ్ కుమార్.. ఇంటిపై రాళ్లు రువ్వారు టీడీపీ శ్రేణులు. లోకేష్ ఆదేశాలతో రెచ్చిపోయిన పచ్చ పార్టీ కార్యకర్తలు వైసీపీ నేత విజయ్‌కుమార్ ఇంటిపై రాళ్ల దాడి చేశారు.. పచ్చ గూండాల దాడిలో వైసీపీ నేత ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి.. అంతటితో ఆగకుండా, పక్కనే రోడ్డుపై నిల్చుని వున్న వైసీపీ కార్యకర్తలపైనా రాళ్లు రువ్వారు.. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా, మూడు బైక్‌లు ధ్వంసమయ్యాయి. యువగళం అరాచకాన్ని చిత్రీకరిస్తున్న పలువురు మీడియా ప్రతినిధులపైనా పచ్చ గూండాలు దాడికి తెగబడ్డారు.. మీడియా ప్రతినిధుల ఫోన్లు లాక్కున్నారు.. అడ్డొచ్చిన రూరల్ కానిస్టేబుల్‌పైనా దాడి చేశారు.. అయితే, పోలీసులు స్పందించి టీడీపీ కార్యకర్తల నుంచి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ శ్రేణులను చెదరగొట్టారు. దీనికి ముందు రోజు కృష్ణాజిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెంలోనూ లోకేష్యాత్రలో టీడీపీ శ్రేణులు ఇలాగే దాడికి దిగాయి. గ్రామంలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఇష్టారాజ్యంగా దాడులకు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో మూకుమ్మడి దాడి చేశారు. ఈ ఘటనలో ఓ కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి నాన్న పుంగనూరు లో హింస ఎలా చేయాలో చూపిస్తే తనయుడు లోకేష్ ఏక సంథాగ్రాహిలా దాన్ని అంది పుచ్చుకుని తండ్రికి మించిన తనయుడిల విద్వేషాలు.. విధ్వంసాలతో వికటాట్టహాసం చేసుకుపోతున్నారు. ఇటువంటి హింసా రాజకీయాల ద్వారా ప్రజల మనసులు గెలుచుకోలేరని రాజకీయ పండితులు అంటున్నారు. ఇటువంటి గూండాగిరీ వ్యవహారాలను ప్రజలు ఏవగించుకుంటారని ఎన్నికల్లో ఇంతకు ఇంత గుణపాఠం చెబుతారని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ::: సీఎన్ఎస్ యాజులు సీనియర్ జర్నలిస్ట్ -
టీడీపీ విధ్వంసాన్ని తీవ్రంగా పరిగణించాలి
సాక్షి, అమరావతి: అన్నమయ్య జిల్లా అంగళ్లు, చిత్తూరు జిల్లా పుంగనూరుల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఇతర నేతల ప్రోద్బలంతో జరిగిన విధ్వంసాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని పోలీసుల తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. సమాజానికే ప్రమాదం కలిగించే ఇలాంటి ఘటనలను అడ్డుకోకుంటే విధ్వంసాన్ని ప్రోత్సహించినట్లవుతుందని అన్నారు. ఇలాంటి వ్యక్తులు, ఘటనల వల్ల సామాన్య ప్రజలకు రక్షణ లేకుండా పోతుందని తెలిపారు. అంతిమంగా ప్రజాస్వామ్యం మనుగడ ప్రశ్నార్థకం అవుతుందన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దౌర్జన్యం చేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు. అంగళ్లులో విధ్వంసం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ టీడీపీ సీనియర్ నేతలు నల్లారి కిషోర్ కుమార్‌రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, పులివర్తి నాని దాఖలు చేసిన వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి గురువారం మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఏఏజీ వాదనలు వినిపిస్తూ.. చట్ట ప్రకారం ఓ వ్యక్తిపై హత్యాయత్నం (ఐపీసీ సెక్షన్ 307) కేసు నమోదు చేయాలంటే అతను మరొకరిని గాయపరచాల్సిన అవసరం లేదని, చంపాలన్న ఉద్దేశం ఉంటే సరిపోతుందని వివరించారు. అంగళ్లులో చంద్రబాబు తరమండిరా.. చంపండిరా.. అంటూ తన పార్టీ కార్యకర్తలను అధికార పార్టీ నేతలపై, సామాన్యులపై ఉసిగొల్పారన్నారు. టీడీపీ కార్యకర్తల దాడిలో అధికార పార్టీకి చెందిన వారే కాక సామాన్యులు కూడా గాయపడ్డారన్నారు. అందుకే చంద్రబాబు, ఇతర నేతలపై పెట్టిన హత్యాయత్నం కేసు చెల్లుబాటవుతుందని వివరించారు. అన్నమయ్య జిల్లాలోని ప్రజలకు ఎంతో ముఖ్యమైన పిచ్చివాండ్లపల్లి ప్రాజెక్టుపై టీడీపీ నేతలు కొందరు స్టే తెచ్చారని, దీంతో ప్రాజెక్టును అడ్డుకోవద్దంటూ చంద్రబాబును అభ్యర్థించేందుకే అధికార పార్టీ నేతలు ప్రయత్నించారన్నారు. టీడీపీ నేతల విధ్వంసానికి స్పష్టమైన ఆధారాలున్నాయని చెప్పారు. విధ్వంస ఘటనల వీడియో ఉన్న పెన్‌డ్రైవ్‌ను ఆయన కోర్టుకు సమర్పించారు. పులివర్తి నానిపై 16 కేసులు ఉన్నాయన్నారు. ముందస్తు వ్యూహంలో భాగంగా యుద్ధభేరిలో పాల్గొన్న నేతలందరూ వారి నియోజకవర్గాల నుంచి మనుషులను తెచ్చుకుని, విధ్వంసం సృష్టించారన్నారు. అంగళ్లు నుంచి పుంగనూరు వరకు అప్రతిహతంగా విధ్వంసం కొనసాగించారని వివరించారు. ఈ సందర్భంగా పలువురు సాక్షుల వాంగ్మూలాలను చదివి వినిపించారు. పిటిషనర్లకు బెయిల్ ఇస్తే ఏదైనా చేసి బెయిల్ తెచ్చుకోవచ్చన్న భావన ప్రజల్లో ఏర్పడుతుందన్నారు. అందువల్ల బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు. అనంతరం టీడీపీ నేత ఉమామహేశ్వరరావు తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్‌రెడ్డి తరఫున న్యాయవాది ఎన్వీ సుమంత్ వాదనలు వినిపిస్తూ.. దర్యాప్తులో జోక్యం చేసుకోబోమని, విచారణ నుంచి పారిపోబోమని, ఏ షరతులు విధించినా లోబడి ఉంటామని తెలిపారు. ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరారు. అంగళ్లు, పుంగనూరులో జరిగిన ఘటనలు వేర్వేరని, రెండింటినీ కలిపి పెద్దదిగా చిత్రీకరిస్తున్నారని వివరించారు. అధికార పార్టీ నేతలే చంద్రబాబు తదితరులపై రాళ్లు రువ్వారని చెప్పారు. వారి దాడిలో టీడీపీ నేతలు, కార్యకర్తలే గాయపడ్డారని తెలిపారు. పిచ్చివాండ్లపల్లి ప్రాజెక్టుపై హైకోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సురేష్‌రెడ్డి తీర్పును వాయిదా వేశారు. తీర్పు వెలువరించేంత వరకు పిటిషనర్లను అరెస్ట్ చేయకుండా పోలీసులకు తగిన సూచనలు ఇవ్వాలని ఏఏజీకి స్పష్టం చేశారు. ఆయుధ చట్టం కింద నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ నల్లారి కిషోర్ కుమార్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంలో కూడా న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు. -
పుంగనూరు అల్లర్ల కేసులో బయటపడిన కుట్ర కోణం
-
బాబు కుట్ర బట్టబయలు
-
పుంగనూరు అల్లర్లు.. బయటపడ్డ చంద్రబాబు కుట్ర
సాక్షి, చిత్తూరు జిల్లా: పుంగనూరు అల్లర్లలో చంద్రబాబు కుట్ర బయటపడింది. చంద్రబాబు పర్యటనకు 4 రోజుల ముందే అల్లర్లకు టీడీపీ ప్లాన్ చేసినట్లు తేలింది. టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా బాబు అనుచరుల వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల ఎదుట చల్లా బాబు అనుచరులు నరీన్‌కుమార్, దూవల అమర్నాథ్, పెద్దన్న సుబ్రహ్మణ్యం నేరం ఒప్పుకున్నారు ఆగస్టు 1వ తేదీనే అల్లర్లకు చంద్రబాబు అండ్‌కో స్కెచ్ వేసింది. పుంగనూరు హైవేపై చంద్రబాబు మీటింగ్ ఉంటే పుంగనూరు పట్టణంలోకి బలవంతంగా దూసుకెళ్లాలని పథకం వేశారు. పోలీసులు అడ్డుకుంటే కర్రలు, రాళ్లు బీర్ బాటిళ్లతో రెచ్చిపోవాలని ప్లాన్ చేశారు. అల్లర్లపై పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా బాబుకు ముందే ఆదేశాలు వచ్చాయి. అంగళ్లు, పుంగనూరులో గొడవల పథకాన్ని వాంగ్మూలంలో చల్లా బాబు అనుచరులు స్పష్టంగా చెప్పారు. చదవండి: Vision 2047 : దొందూ దొందే.. బాబు-పవన్ షేమ్ టూ షేమ్ -
పచ్చ గూండాలు పేట్రేగిన వేళ..
సాక్షి, చిత్తూరు, పుంగనూరు (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా పుంగనూరులో ఇటీవల తెలుగుదేశం పార్టీ సృష్టించిన విధ్వంసంలో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. పక్కా ప్రణాళిక, భారీ వ్యూహంతోనే ఈ దాడులు జరిగినట్లు స్పష్టమవుతోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువైన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపడం, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రాజకీయంగా అణగదొక్కటమే లక్ష్యంగా టీడీపీ ఈ దాడులకు వ్యూహ రచన చేసింది పక్కా ప్రణాళికతో జిల్లా నలుమూలల నుంచి టీడీపీకి చెందిన గూండాలను ఎంపిక చేసి మరీ పుంగనూరుకు తెచ్చినట్లు వెల్లడైంది. వారిపై జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో అనేక కేసులు ఉన్నాయి. వీరిని ముందుగానే మారణాయుధాలతో సహా పుంగనూరులో మోహరించారు. చంద్రబాబు పర్యటనను కూడా వ్యూహాత్మకంగా పుంగనూరుకు వచ్చేలా మార్పు చేశారు. ముందస్తు షెడ్యూల్లో లేకపోయినా, పోలీసుల అనుమతి లేకుండానే దాడుల కోసమే ఆయన పుంగనూరు వచ్చారు. చంద్రబాబు వస్తూనే టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టడం, వెనువెంటనే విధ్వంసం సృష్టించడం.. అంతా వ్యూహం ప్రకారం చేశారు. కర్రలు, రాళ్లు, మద్యం సీసాలు, ఇతర మారణాయుధాలతో వందల సంఖ్యలో పోలీసులపై విరుచుకుపడ్డారు. ఈ దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు. ఓ కానిస్టేబుల్ ఓ కంటి చూపు కోల్పోయాడు. అయితే, పోలీసులు చాలా సహనంతో వ్యవహరించడంతో టీడీపీ వ్యూహం బెడిసికొట్టింది. పుంగనూరు విధ్వంసంలో ఇప్పటి వరకు ఏడు నేరాలకు సంబంధించి మొత్తం 277 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో పాల్గొన్న వారిని పోలీసులు ఆధారాలతో సహా గుర్తించారు. వారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మంగళవారం వరకు 90 మందిని అరెస్ట్ చేశారు.వారికి కోర్టు రిమాండ్ విధించడంతో కడప సెంట్రల్ జైలుకు తరలించారు. పోలీసులపై దాడి కేసులో ప్రధాన నిందితుడు చల్లా బాబుతోపాటు కుట్ర, వ్యూహ రచన, దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న పలువురిని పోలీసులు గుర్తించారు. వారి గత చరిత్రను కూడా నిశితంగా పరిశీలించారు. దాడుల్లో భాగస్వాములైన వారిలో ఎక్కువ మంది పాత నేరాల చరిత్ర చూసి పోలీసులే షాక్ అయ్యారు. వారిలో కొందరి నేర చరిత్ర ఇదీ.. 1. నేరాల్లో ఘనుడు చల్లా బాబు పుంగనూరులో దాడి కేసులో ప్రధాన సూత్రదారి, పాత్రదారి ఆ నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి చల్లా బాబు అలియాస్ చల్లా రామచంద్రారెడ్డి అని పోలీసులు తేల్చారు. దాడులకు కుట్ర పన్నడం, వ్యూహాన్ని అమలుపరచడంలో ఇతనిదే ప్రధాన పాత్రగా పోలీసులు నిర్ధారించారు. చల్లా బాబు గత చరిత్ర అంతా నేర పూరితమేనని పోలీసు విచారణలో తేలింది. పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయి. ఇతను ఆలయ భూములు, ప్రభుత్వ భూముల ఆక్రమణకు పాల్పడినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. చల్లా బాబుపై ఉన్న పాత కేసుల్లో మచ్చుకు కొన్ని.. 1.1985లో రొంపిచెర్ల పోలింగ్ స్టేషన్‌పై బాంబు దాడి కేసు 2. రొంపిచెర్ల క్రైం నం.368, 2021లో ఐపీసీ సెక్షన్లు, 143, 188, 341,269, 270, 290 రెడ్‌విత్ 149 ఐపీసీ, సెక్షన్ 3 ఈడీయాక్ట్ 3. క్రైం నం.18–2021 ఐపీసీ సెక్షన్లు 353, 506 రెడ్‌విత్ 34 కింద కేసు 4. క్రైం నం.8–2022 ఐపీసీ సెక్షన్లు 188, 341 కింద చౌడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు 5. క్రైం నం.89–2023 ఐపీసీ సెక్షన్లు 143, 341, 506 రెడ్‌విత్ 149 కింద సోమల పీఎస్‌లో కేసు 6. క్రైం నం.72–2022 ఐపీసీ సెక్షన్లు› 341, 143, 290 రెడ్‌విత్ 149 కింద కేసు 7. క్రైం నం.26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రెడ్‌విత్ 149 కింద కల్లూరు పోలీసు స్టేషన్లో కేసు 2. టీఎం బాబు (40) ఊరు: తొట్లిగానిపల్లి, గుడిపల్లి, కుప్పం నియోజకవర్గం పార్టీలో హోదా: టీడీపీ మండల అధ్యక్షుడు పాత కేసులివీ.. 1. క్రైం నం.30–2009లో గుడిపల్లి పీఎస్‌లో పరిధిలో జరిగిన కేసు 2. క్రైం నం.171 ఇ, 506, 8–బి–1, ఏపీపీయాక్ట్ 3. క్రైం నం.165–2010 ఐపీసీ 392 సెక్షన్ల కింద కుప్పం పోలీస్ స్టేషన్లో కేసు 3. క్రైం నం.38–2022 ఐపీసీ సెక్షన్ 448, 427, 323, 324, రెడ్‌విత్ 34 కింద గుడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు 3. భాష్యం విశ్వనాథనాయుడు (45) మండలం: శాంతిపురం, కుప్పం నియోజకవర్గం పార్టీ హోదా: టీడీపీ మండల అధ్యక్షుడు పాత కేసులు: 3 కేసుల్లో నిందితుడు 1. క్రైం నం.191–2021, ఐపీసీ సెక్షన్లు 143, 341, 506, 188, 59 డీఎంఏ, ఈడీఏ కింద రాళ్ళబుదుగూరు పోలీస్ స్టేషన్లో కేసు 2. క్రైం నం.73–2022, ఐపీసీ సెక్షన్లు 177 ,182, 155 సెక్షన్ల కింద రెండో కేసు 3. రామకుప్పం పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైం నం.130–2022 , ఐపీసీ సెక్షన్లు 143, 147, 148, 307, 324తో పాటు రెడ్‌విత్ 149 కింద కేసు 4. జి.దేవేంద్ర (31) ఊరు: గోపన్నగారిపల్లి, పులిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం పార్టీలో హోదా: తెలుగు యువత మండల అధ్యక్షుడు పాత కేసులు: కల్లూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో క్రైం నం.26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రెడ్‌విత్ 149 కింద కేసు నమోదైంది. 5. లెక్కల ధనుంజయనాయుడు ఊరు: కొక్కువారిపల్లి, పులిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం పార్టీలో హోదా: టీడీపీ రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ ఆర్గనైజింగ్ సెక్రటరీ పాత కేసులు: రెండుకేసుల్లో నిందితుడు 1. క్రైం. నం. 26–2022 నంబరుతో కల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఐపీసీ సెక్షన్ 341, 506, 353, 143, 147, 148, రెడ్‌విత్ 149 కింద కేసు నమోదు 2. క్రైం.నం. 368– 2021. రొంపిచెర్ల పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్లు 143, 188, 341, 269, 270, 290 రెడ్‌విత్ 149 ఐపీసీ, సెక్షన్ 3 ఈడీ యాక్ట్ కింద కేసులు 6. ముల్లంగి వెంకటరమణ (52) ఊరు: ముల్లంగివారిపల్లి, పులిచెర్ల మండలం పార్టీలో హోదా: టీడీపీ ఎస్సీ సెల్ స్టేట్ ప్రిన్సిపల్ సెక్రటరీ పాత కేసులు: మూడు కేసుల్లో నిందితుడు 1.క్రైం. నం. 26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148, రెడ్‌విత్ 149 ఐపీసీ కింద కల్లూరు పోలీస్ స్టేషన్లో కేసు 2. ఇదే స్టేషన్ పరిధిలో క్రైం.నం. 35–2017 ఐపీసీ సెక్షన్లు 447, 427, 324తోపాటు 34 ఐపీసీ కింద కేసు నమోదు 3. ఇక్కడే క్రైం. నం. 140–2021, ఐపీసీ సెక్షన్లు 353, 341 రెడ్ విత్ 34 కింద మరో కేసు 7. నూకల నాగార్జున నాయుడు (33) ఊరు: బొడిపటివారిపల్లి, పులిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం పార్టీలో హోదా: టీడీపీ మండల యువనేత, రాష్ట్ర ఐటీ విభాగం సభ్యుడు పాత కేసులు: ఆరు కేసుల్లో నిందితుడు. రొంపిచెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు, కల్లూరులో 1 , సోమల పరిధిలో మరొక కేసు 1. క్రైం.నం. 368–2021 ఐపీసీ 134, 188, 341, 269, 270, 290 రెడ్ విత్ 149 ఐపీసీతో పాటు సెక్షన్ 3 కింద ఈడీయాక్ట్ నమోదు 2. క్రైం.నం. 2–2023 ఐపీసీ సెక్షన్లు 143, 147, 148, 506 రెడ్ విత్, 149 3. క్రైం.నం. 374–2021 ఐపీసీ సెక్షన్లు 153, 153ఏ, 120బీ, 506, 507 4. క్రైం.నం. 5–2022 ఐపీసీ సెక్షన్లు 153, 427, 290 రెడ్ విత్ 34 ఐపీసీ 5. క్రైం.నం. 26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రెడ్ విత్ 149 ఐపీసీ 6. క్రైం.నం. 149–2022 ఐపీసీ సెక్షన్లు 143, 148, 354డీ, 324, 506, 509 రెడ్‌విత్ 149 8. ఇ. క్రిష్ణమూర్తినాయుడు (55) ఊరు: రాయవారిపల్లి గ్రామం, రొంపిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం పార్టీలో హోదా: టీడీపీ మండల అధ్యక్షుడు పాత కేసులు: ఇతనిపై కల్లూరు పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి 1 క్రైం.నం. 26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 506, 353, 143, 147, 148 రెడ్‌విత్ 149 2. క్రైం.నం. 12–2021, ఐపీసీ సెక్షన్లు 353, 506, రెడ్ విత్ 34 ఐపీసీ 9. నాగిశెట్టి నాగరాజ (38) ఊరు: బొమ్మయ్యగారిపల్లి గ్రామం, రొంపిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం హోదా: మండలం తెలుగు యువత అధ్యక్షుడు పాత కేసులు: ఇతనిపై ఐదు కేసులు ఉన్నాయి. కల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 3, రొంపిచెర్లలో మరో రెండు కేసులు 1. క్రైం.నం. 140–2021, ఐపీసీ సెక్షన్లు 353, 341 రెడ్‌విత్ 34 2. క్రైం.నం. 368–2021 ఐపీసీ సెక్షన్లు 143, 188, 341, 269, 270, 290 రెడ్‌విత్ 149తో పాటు సెక్షన్ 3 ఈడీ యాక్ట్ 3. క్రైం.నం. 26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రెడ్ విత్ 149 ఐపీసీ. 4. క్రైం.నం. 2–2023 ఐపీసీ సెక్షన్లు 143, 147, 148, 506 రెడ్‌విత్ 149 ఐపీసీ. 5. క్రైం.నం. 350–2021 ఐపీసీ సెక్షన్లు 151 సీఆర్పీసీ 10. కె.సహదేవుడు (50) ఊరు: బొమ్మయ్యగారిపల్లి గ్రామం, రొంపిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం పార్టీలో హోదా: రొంపిచెర్ల మండలం బొమ్మయ్యగారి పల్లి ఎంపీటీసీ పాత కేసులు: రొంపిచెర్ల, మరికొన్ని స్టేషన్లలో 8 కేసుల్లో నిందితుడు 1. క్రైం.నం. 89–2014 ఐపీసీ సెక్షన్లు 447, 506 రెడ్‌విత్ 34 2. క్రైం.నం. 331–2020 సీఆర్పీసీ 151 3. క్రైం.నం. 365–2020 సీఆర్పీసీ 151 4. క్రైం.నం. 14–2021 ఐపీసీ సెక్షన్లు 188 , 353, 506, రెడ్ విత్ 34 5. క్రైం.నం. 356–2021 ఐపీసీ సెక్షన్ 151 6. క్రైం.నం. 368–2021 ఐపీసీ 143, 188, 341, 269, 270, 290 రెడ్‌విత్ 149 7. క్రైం.నం. 9–2022 ఐపీసీ సెక్షన్లు 447, 427, 506, 143 రెడ్‌విత్ 149 8. క్రైం.నం. 10–2022 ఐపీసీ సెక్షన్లు 341, 323, 506, 153 11. ఉయ్యాల రమణ (44) ఊరు: బొమ్మయ్యగారిపల్లి, రొంపిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం హోదా: రొంపిచెర్ల మండలం టీడీపీ అధ్యక్షుడు పాత కేసులు: కల్లూరు , రొంపిచెర్ల, సోమల పోలీస్స్టేషన్ల పరిధిలో 8 కేసుల్లో నిందితుడు 1. క్రైం.నం. 140–2021 ఐపీసీ సెక్షన్ 353, 341 రెడ్ విత్ 34 2. క్రైం.నం. 368 – 2021 ఐపీసీ సెక్షన్లు 143, 188, 341, 269,270, 290 రెడ్‌విత్ 149 ఐపీసీతోపాటు 3 ఈడీ యాక్ట్ 3. క్రైం.నం. 2–2023 ఐపీసీ సెక్షన్లు 143, 147, 148, 506 రెడ్‌విత్ 149 4. క్రైం.నం.15–2021 ఐపీసీ సెక్షన్లు 188, 506 రెడ్‌విత్ 34 ఐపీసీ 5. క్రైం.నం.40 – 2014 ఐపీసీ సెక్షన్లు 307, 326, 324 రెడ్‌విత్ 34 6. క్రైం.నం. 26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రెడ్‌విత్ 149 7. క్రైం.నం.140–2021 ఐపీసీ సెక్షన్లు 353, 341 రెడ్‌విత్ 34 8. క్రైం.నం. 89–2023 ఐపీసీ సెక్షన్లు 143, 341, 506 రెడ్‌విత్ 149 ఏ ఒక్కర్నీ వదలం పుంగనూరు దుశ్చర్యలో పోలీసుల రక్తం కళ్ల చూసిన ప్రతి ఒక్కరినీ వదలం. చట్ట ప్రకారం ముందుకెళ్తాం. బందోబస్తు డ్యూటీ కోసం వచ్చిన పోలీసులను మట్టుపెట్టాలని చూడటం, రాళ్లు, మద్యం బాటిళ్లు విసరడంపై మా వద్ద అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. వీడియో ఫుటేజీల ఆధారంగా ఇప్పటికే పలువురిని అరెస్టు చేశాం. ప్రధాన నిందితుల కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఆరోజు పోలీసులు అడ్డుపడకపోతే పుంగనూరు టౌన్లోకి పోయి విధ్వంసం సృష్టించేవాళ్లు. నిందితులపై చట్టరీత్యా చర్యలు తప్పవు.– వై.రిషాంత్‌రెడ్డి, ఎస్పీ, చిత్తూరు -
పుంగనూరు ఘటనపై దుష్ప్రచారం
అనంతపురం సిటీ: అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఇటీవల జరిగిన ఘటనపై చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, ఎల్లోమీడియా కలిసికట్టుగా దుష్ప్రచారానికి ఒడిగట్టారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. అనంతపురంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ రాష్ట్రపతి, ప్రధానమంత్రికి చంద్రబాబు విన్నవించిన అంశంపై స్పందించాలని ఓ విలేకరి అడగ్గా.. మంత్రి మాట్లాడుతూ ఈ ఘటన చంద్రబాబు నీచ సంస్కృతికి నిదర్శనమని చెప్పారు. పుంగనూరులో ఏం జరిగిందో ప్రజలంతా చూశారన్నారు. ఆ ఘటనను వైఎస్సార్సీపీకి ఆపాదించడం తగదని చెప్పారు. చంద్రబాబుకు మద్దతుగా ఎల్లోమీడియా కూడా పదేపదే అబద్ధాలు ప్రసారం చేయడం మంచి సంప్రదాయం కాదని పేర్కొన్నారు. టీడీపీ రాసిచ్చే స్క్రిప్ట్ ప్రకారం పవన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. తన పాలనలో సీబీఐని రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వనంటూ ప్రకటించిన చంద్రబాబు.. ఇప్పుడు అదే సీబీఐ విచారణ కోరడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని చెప్పారు. -
ఇదేం చిత్రం చంద్రబాబూ.. ఇదే కదా నీ కొంపముంచేది?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై దాడి జరిగిందా! ఆయనపై హత్యాయత్నం జరిగిందా? అది నిజమే అయితే కచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవలసిందే. కాని అందుకు సంబంధించిన ఆధారాలు ఎక్కడ అన్న ప్రశ్న వస్తుంది. అంగళ్లు గ్రామం వద్ద, పుంగనూరు పట్టణం వద్ద జరిగిన గొడవలలో రెచ్చగొట్టిందే చంద్రబాబు అయితే, చిత్రంగా ఆయన తనపై హత్యాయత్నం జరిగిందని అంటున్నారు. తనకు రాళ్ల దెబ్బలు తగలకుండా ప్రత్యేక రక్షణ బృందం బుల్లెట్ ఫ్రూఫ్ షీట్ పెట్టిందట. ఇవన్ని నిజమే అయితే ఈపాటికి.. సెక్యూరిటీ గార్డు అధికారి చిత్తూరు జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి చంద్రబాబుపై దాడి చేసే అవకాశం ఉందని చెప్పారట. ఇవన్ని నిజమే అయితే ఈపాటికి ఏమి జరిగి ఉండాలి. చంద్రబాబు ముందుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సంబంధిత వ్యక్తులపై ఫిర్యాదు చేసి ఉండేవారు. చంద్రబాబుపై ఎవరైనా రాళ్లు విసిరి ఉంటే ఆయన రక్షణకు ఉన్న ప్రత్యేక గార్డుల టీమ్ తగు చర్య తీసుకోవడమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండేది. చంద్రబాబు తత్వానికి ఏ మాత్రం అవకాశం దొరికినా, అక్కడే సీన్ క్రియేట్ చేసి ఉండేవారు. వాహనం దిగి రోడ్డుపైనే బైఠాయించేవారు. తనపై హత్యాయత్నం జరిగిందని గగ్గోలు పెట్టేవారు. కాని ఇవేవి చేయకుండానే ఆయన తన దారిన తాను వెళ్లిపోయారు. ఒకసారి గతం చూస్తే.. ఒకసారి గతంలోకి వెళ్లండి.. ఒక సందర్భంలో తిరుపతి విమానాశ్రయంలో పోలీసులు ఆయనను నిలుపుదల చేశారు. అప్పుడు ఆయన అక్కడే కూర్చుని హడావుడి చేశారు. అలా ఒకసారి కాదు.. ఆయన ప్రతిపక్షంలో ఉంటే అనేకసార్లు గందరగోళాలు సృష్టిస్తారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ ఉద్యమం టైమ్‌లో జరిగిన ఉప ఎన్నికల ప్రచారం నుంచి తప్పించుకునేందుకు బాబ్లి ప్రాజెక్టు అనే చిన్న ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ మహారాష్ట్రకు వెళ్లి గందరగోళం సృష్టించే యత్నం చేశారు. చదవండి: చిరంజీవి ఎందుకు ఉలిక్కిపడ్డారు? అదన్న మాట అసలు సంగతి! ఈ ప్రశ్నకు సమాధానం ఉందా? అప్పుడు అక్కడి పోలీసులు చంద్రబాబును, ఆయనతో వెళ్లినవారందరిని అరెస్టు చేసి ఒక చోట నిలుపుదల చేశారు. తదుపరి ఆనాటి ముఖ్యమంత్రి రోశయ్య మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వీరిని ప్రత్యేక విమానంలో ఏపీకి రప్పించారు.ప్రాజెక్టులకు సంబంధించి ఒక యాత్రను చేపట్టిన ఆయన ఆ పని చేసుకోకుండా రోడ్ షోలకు ఎందుకు దిగారో ముందుగా చెప్పాల్సి ఉంటుంది. అన్నమయ్య, చిత్తూరు జిల్లాల పోలీసు అధికారుల కథనం ప్రకారం అంగళ్లు, పుంగనూరులలో ఆయన నిర్దిష్ట రూట్ మాప్‌ను పాలో కాలేదట. ప్రాజెక్టులు చూసి వెళ్లిపోకుండా ఆయా చోట్ల సభలు జరిపే యత్నం చేశారు. దాడులు చేసేలా పురిగొల్పి.. ఆ క్రమంలో టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి వైసీపీ వారిపైన, అలాగే పోలీసులపైన దాడులు చేసేలా పురిగొల్పారు. అంగళ్లు వద్ద కార్యకర్తలు ఆయనను చూస్తూ వాహనం వైపు ఉన్నారు. కాని చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ దాడులు చేయాలని టీడీపీ కార్యకర్తలకు ఆదేశాలు ఇవ్వగానే వారిలో పలువురు ఆ ప్రకారమే చేసేశారు. అంగళ్లు వద్ద రైతులు వినతిపత్రం ఇవ్వడానికి వచ్చారు. వారితో పాటు వైసీపీ వారు కూడా కొందరు ఉండవచ్చు. వారంతా కలిపి నలభై మంది కూడా లేరు. చంద్రబాబు రోడ్ షో లో ఒకటి, రెండువేల మంది ఉండవచ్చు. వారంతా దాడులకు పాల్పడితే ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందో ఊహించుకోవచ్చు. మళ్లీ ఏమి ఎరగనట్లు.. రైతులు నిరసన తెలపడం తనకు ఇష్టం లేకపోవచ్చు. వారు అడిగే ప్రశ్నలకు ఆయన వద్ద సమాధానం లేకే అలా అనుచితంగా వ్యవహరించారనుకోవల్సి వస్తోంది. తంబళ్లపల్లె నియోజకవర్గంలో మూడు ప్రాజెక్టులకు ప్రభుత్వం చర్యలు చేపడితే వాటిని అడ్డుకుంది చంద్రబాబు, ఆయన పార్టీవారా?కాదా? మళ్లీ ఏమి ఎరగనట్లు ఆ ప్రాజెక్టులు చూడడానికి వెళ్లడం ఏమిటి?. దానిపై ఎవరూ ప్రశ్నించరాదా? అదే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలను ఎవరైనా ప్రశ్నిస్తే ఇదే చంద్రబాబు, ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి 5 వంటి మీడియాలు ఏమని అంటున్నాయి?. ప్రజలంతా నిలదీస్తున్నారని, నిరసన తెలుపుతున్నారని ప్రచారం చేస్తున్నారా? లేదా? అదే చంద్రబాబుకు వినతిపత్రం ఇవ్వడానికి వస్తే అలా ఎలా వస్తారని అడుగుతున్నారు. ఇలా టీడీపీ, అనుబంధ మీడియా డబుల్ గేమ్ ఆడుతోంది. బాబు కొత్త పాట.. గతంలో తిరుపతిలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పై టీడీపీ వారు ఏకంగా రాళ్ల దాడికి దిగితే అదంతా పోరాటం అని చెప్పారు కదా! అప్పట్లో బీజేపీ ఏపీ అధ్యక్షుడుగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణపై అనంతపురంలో నిజంగానే దాడి చేశారు కదా! అవన్ని ఎందుకు?. దేశ ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు వస్తే చంద్రబాబు నాయుడు ఏమి చేశారో గుర్తు లేదా?. ఆయనకు స్వాగతం చెప్పకపోగా, ఎందుకు వచ్చావంటూ నిలదీస్తూ దీక్షలు చేశారు. మోదీకి నల్లబెలూన్లు ఎగరవేసి నిరసన చెప్పారు. అది సరైనదేనా? ప్రధాని భద్రతకు అది ప్రమాదం కాదా?. ఇప్పుడు తనపై దాడి జరగకపోయినా, ఏకంగా హత్యాయత్నం జరిగిందని కొత్త పాట ఎత్తుకున్నారు. చంద్రబాబు కాదనగలరా?.. చంద్రబాబు చేసిన ప్రసంగాలు, రెచ్చగొట్టిన సన్నివేశాల వీడియోలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాటిని విచారించిన తర్వాతే పోలీసులు చంద్రబాబుపై కేసు పెట్టారు. ఆ వెంటనే చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ అన్యాయం అంటూ ఆక్రోశం పెట్టారు. అంతే తప్ప, తాను బూతులు తిట్టలేదని, ఎవరిని రెచ్చగొట్టలేదని చెప్పలేకపోయారు. ఒక డీఎస్పీని బట్టలూడదీసి వెళ్లు అని చంద్రబాబు అన్నారా?. లేదా? అది అవమానించడం కాదా?. రాయలసీమ పర్యటన అంతా ముఖ్యమంత్రి జగన్ ను, వైసీపీ కార్యకర్తలను తిట్టడానికి, టీడీపీ వారిని రెచ్చగొట్టడానికే చేశారు. పుంగనూరు వద్ద దానిని మరింత తీవ్రం చేసి ఏకంగా పోలీసు వాహనాలనే దహనం చేసేవరకు తీసుకువెళ్లారు. వాటిని చంద్రబాబు కాదనగలరా?. కనీసం సానుభూతి కూడా చెప్పలేదే?.. గతంలో తుని వద్ద కాపు రిజర్వేషన్ ఉద్యమకారులు ఒక రైలును దగ్దం చేస్తే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రతిపక్షంపై ఎన్ని విమర్శలు చేశారు?. ఎన్ని ఆరోపణలు చేశారు. రాయలసీమ రౌడీలని, గూండాలని ఇలా ఏవేవో చెప్పారు. కాని పుంగనూరు వద్ద ఆయన కళ్లెదుటే టీడీపీ కార్యకర్తలు పోలీసు వాహనాలను దహనం చేస్తుంటే ఎందుకు వారించలేదు? పోలీసులపై దాడులు చేసేలా టీడీపీ కార్యకర్తలను ఆయనే ప్రేరేపించారన్నది అభియోగం. ఈ దాడులలో 27 మంది పోలీసులకు గాయాలయిన మాట అవాస్తవమా? ఒక కానిస్టేబుల్ కన్ను పోయిన ఘటన గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడలేకపోయారు. కనీసం సానుభూతి కూడా చెప్పలేదే?. స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి విధ్వంసాలకు పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు. సవాళ్లు గుర్తు లేదా? ఘటన జరిగిన ప్రాంతంలో మొత్తం ఐదువేల సిమ్ కార్డులు ఉన్నాయని, అందులో రెండు వేల సిమ్‌లు స్థానికులవి కావని చెబుతున్నారు. ఇప్పటికే ఎనభై మంది వరకు అరెస్టు అయ్యారు. ముఖ్యమంత్రిని పట్టుకుని ఎన్నిసార్లు తన్నుకుందాం.. రా.. అని చంద్రబాబు కాని, ఆయన కుమారుడు కాని సవాళ్లు చేశారో గుర్తు లేదా?. అలా ఒక సీనియర్ నేత మాట్లాడవచ్చా? చంద్రబాబు ఇంతకాలం తాను ఏమి చేసినా, ఏమి మాట్లాడినా తనను ఎవరు ఏమీ చేయలేరు అన్న ధీమాతోనే ప్రవర్తించారు. కాని ఎప్పుడో అప్పుడు పరిస్థితి ఎదురు తిరుగుతుంది. అరాచకంగా ప్రవర్తించేవారిపై చర్య తీసుకునే అధికారులు కూడా వస్తారని ఇప్పుడు అర్దం అయి ఉండాలి. అదేదో రెడ్ బుక్ పెట్టుకుని.. ప్రభుత్వ విధానాలపై , లోటుపాట్లుపై విమర్శలు చేయవచ్చు. అలాకాకుండా అచ్చంగా బూతులు తిట్టుకుంటూ, పోలీసులపై విరుచుకుపడుతూ మీ అంతు చూస్తా.. అంటూ బెదిరిస్తూ యాత్రలు చేయడం చంద్రబాబు, లోకేష్ లకు అలవాటైంది. లోకేష్ అయితే అదేదో రెడ్ బుక్ పెట్టుకుని అందరి పేర్లు రాసుకుంటున్నారట. అధికారం వస్తే అందరి సంగతి చూస్తారట. మరి అధికారం రాకపోతే ఆ రెడ్ డెయిరీని ఏమి చేస్తారో తెలియదు. ఇక జగన్‌కు అధికారం పిచ్చివాడి చేతిలో రాయి అని చంద్రబాబు అన్నారు. నిజానికి అది ఆయనకే వర్తిస్తుందని చెప్పాలి. తనకు అధికారం ఉందని చెప్పి గోదావరి పుష్కరాలలో తన కుటుంబ స్నానం కోసం గేట్లు మూయించి తొక్కిసలాటకు కారణమయ్యారు. ఫలితంంగా ఇరవైతొమ్మిది మంది మరణించారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. తమిళ కూలీలు 20 మందిని తిరుమలలో ఎన్ కౌంటర్ చేసింది ఆయన ప్రభుత్వంలోనే. రాజధాని పేరుతో ముప్పైవేల ఎకరాలు సేకరించి అటు రైతులను, ఇటు ఏపీ ప్రజలను గందరగోళంలోకి నెట్టి రాజధాని అనే భ్రమరావతిని సృష్టించింది ఆయనే. ఇలాంటి వాటిని కదా?. పిచ్చోడి చేతిలో రాయి మాదిరి అధికారాన్ని వాడారని చెప్పాల్సింది. జగన్ అధికారంలోకి వచ్చాక తన మానిఫెస్టో అమలు చేయడం పిచ్చోడి చేతిలో రాయి అవుతుందా? చంద్రబాబు తన మానిఫెస్టోని వెబ్ సైట్ నుంచి తొలగించడం పిచ్చోడి చేతిలో రాయి అవుతుందా? లక్ష కోట్ల రూపాయల రైతుల, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తామని అబద్దపు హామీ ఇవ్వడం పిచ్చోడి చేతిలో రాయి అవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుంటే... చంద్రబాబు కేవలం అక్కసుతో, ఈర్ష్యతో జగన్‌పై నోరు పారేసుకుంటున్నారు. ఆయనకు ఈనాడు, తదితర టీడీపీ మీడియా తాన అంటే తందానా అని వంతపాడుతున్నాయి. అదే చంద్రబాబుకు పెద్ద ప్రమాదం అవుతుంది. వారిని నమ్మే ఇప్పుడు చంద్రబాబు హత్యాయత్నం కేసులో చిక్కుకున్నారు. చంద్రబాబును నమ్మి టీడీపీ కార్యకర్తలు జైళ్ల పాలయ్యారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుంటే, పద్దతులు మార్చుకుంటే వారికే మంచిది. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
చట్టం మీ చుట్టమా రామోజీ ?
-
అంతు చూస్తారట!
75 ఏళ్ల ముసలాయన, ఆయన దత్తపుత్రుడు, సొంత పుత్రుడు మాట్లాడుతున్న మాటలు వినండి. అధికారం ఇస్తే ఏం చేస్తారో వీళ్ల నోటితో వీళ్లే చెప్పారు. తనకు అధికారం ఇస్తే ఎవరినీ వదలడట.. తనకు గిట్టని వారి అంతు చూస్తాడట.. మట్టుబెడతాడట.. ఉగ్రరూపం చూపిస్తాడట.. ఏకంగా నరకం చూపిస్తాడట.. ఇందుకోసం ఆయనకు అధికారం ఇవ్వాలట! ఇదీ ఈ పెద్దమనిషి నైజం. ఇలాంటి ఆయన కోసం ఆయన దత్తపుత్రుడు పరుగెడుతున్నాడు. ఈ పెద్దమనిషికి ఏనాడైనా ప్రజలకు మంచి చేసిన చరిత్ర ఉందా? ఫలానా పని చేశానని చెప్పుకోవడానికి ఏమీ లేకే రెచ్చగొట్టి గొడవలు సృష్టించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ఇదేం రాజకీయం? – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి, అమలాపురం: ‘చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, సొంత పుత్రుడు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఎక్కడా చెప్పడం లేదు. అలా చెబితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అందుకే గొడవలు సృష్టించి ప్రజల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారు. యాత్రలు, సభల పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారు’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. అమలాపురంలో వైఎస్సార్ సున్నా వడ్డీ నాలుగో విడత నిధుల విడుదల సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఈ రోజు నిజంగా వీళ్లందరి ఆలోచన ఏ స్థాయిలో ఉందో ప్రజలు గమనించాలని కోరారు. ‘వారు మంచి చేస్తామంటే ప్రజలు నమ్మరని వాళ్లకు తెలుసు. కాబట్టే ప్రజల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారు. అబద్ధాలు చెబుతున్నారు. ప్రతి రోజూ మోసాలు చేస్తారు. మీటింగులు పెట్టి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. చివరకు 47 మంది పోలీసులపై దాడి చేశారు. ఇలాంటి రాక్షసులకు ఎందుకు సెక్యూరిటీ ఇవ్వాలని అనిపించింది. ఎక్కడికక్కడ ప్రజల్ని రెచ్చగొట్టి గొడవలు సృష్టిస్తున్న వారి పట్ల మనమంతా చాలా జాగ్రత్తగా ఉండాలి’ అని సూచించారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. శవ రాజకీయాలు చేస్తున్నారు. ♦ మొన్న అంగళ్లులో చంద్రబాబు తానే స్వయంగా రెచ్చగొట్టి గొడవలు చేయించారు. మళ్లీ పుంగనూరులో ఒక రూటుకు అనుమతి తీసుకొని ఆ రూట్లో పోకుండా పుంగనూరుకు వచ్చి వేరే రూట్లో పోవాలని ప్రయత్నించారు. అప్పుడే పోలీసులు మీకు అనుమతి లేదని, అక్కడ అధికార పార్టీవాళ్లు నిరసన కార్యక్రమం చేసుకుంటున్నారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తుందని చెప్పారు. ♦ దీంతో చంద్రబాబు వారిని ఇష్టమొచ్చినట్లు తిట్టాడు. వాళ్ల క్యాడర్‌ను రెచ్చగొట్టి 47 మంది పోలీసులను గాయపరిచారు. ఒక పోలీసు సోదరుడికి కన్ను కూడా పోగొట్టాడు. కారణం గొడవలు జరగాలి. శవ రాజకీయాలు చేయాలన్నదే ఆలోచన. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 వాళ్లదే. వాళ్లు ఏం చెబితే అది రాస్తారు. మైకులు పట్టుకొని దత్తపుత్రుడు రెడీగా ఉన్నాడు కాబట్టి శవ రాజకీయాలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంటే చులకన ♦ ఈ పెద్దమనిషి చంద్రబాబు మనస్తత్వం చూడండి. దళితులను చీల్చి వారికి నరకం చూపించాడు. ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? అని చెప్పి వారిని నానా ఇబ్బందులకు గురిచేశాడు. బీసీల తోకలు కత్తిరిస్తా, తోలు తీస్తా, తాట తీస్తా అని బెదిరించాడు. బీసీలకు 143 వాగ్దానాలిచ్చి వెన్నుపోటు పొడిచి మరీ వాళ్లకు నిలువునా దగా చేశాడు. ♦ మైనార్టీలకు, ఎస్టీలకు కనీసం ఒక్కటంటే ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వకుండా మైనార్టీ ఓటు బ్యాంకుతో చెలగాటం ఆడటాన్ని అదే పనిగా పెట్టుకొన్న విషయం గుర్తుకు తెస్తున్నా. ఎస్టీలకు ఏనాడూ న్యాయం చేయకుండా కనీసం ఒక్క ఎకరా ఆర్వోఎఫ్ఆర్ పట్టా ఏ రోజు ఇవ్వకుండా తన పెత్తందార్లకు మన్యాన్ని అప్పగించి మోసం చేశాడు. ♦ అక్కచెల్లెమ్మలను సైతం మోసం చేశాడు. కోడలు మగ పిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని అగౌరవ పరిచాడు. ఇటువంటి పెద్ద మనిషి ఈరోజు మైకు పట్టకుని ఊదరగొడుతున్నాడు. నోరు తెరిస్తే అబద్ధాలే ♦ 2014కు ముందు ఈయన మాట్లాడిన మాటలు గుర్తుకు తెచ్చుకోండి. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలి అన్నారు. రైతుల రుణాలు మాఫీ కావాలంటే బాబు రావాలట. అక్కచెల్లెమ్మలకు పొదుపు సంఘాల రుణాలు మాఫీ కావాలంటే బాబు రావాలట. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే బాబు రావాలంటూ మోసం చేశాడు. రూ.85,712 కోట్ల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి, చేయకుండా రైతులను నిలువునా మోసం చేశాడు. ♦ రూ.14,207 కోట్ల పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానని మోసం చేశాడు. చివరకు చదువుకుంటున్న పిల్లలనూ వదల్లేదు. ఉద్యోగం ఇస్తాను లేదా ఉపాధి కల్పిస్తాను అని నిస్సిగ్గుగా అబద్ధాల వాగ్దానాలు చేశాడు. లేదంటే ఇంటింటికీ రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ప్రతి ఇంటికీ రూ.2 వేలు అంటే ప్రతి పిల్లాడికీ ఏటా రూ.24 వేలు అలా ఐదేళ్లలో రూ.లక్షా 20 వేలు మోసం చేశాడు. ♦ మాటంటే విలువ లేదు. విశ్వసనీయత లేదు. ఎన్నికలు అయ్యాక ప్రజల్ని గాలికి వదిలేయాలి అనే తలంపుతో పరుగెత్తుతున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, చంద్రబాబు, దత్తపుత్రుడు.. వీళ్లందరూ దోచుకోవడానికి, పంచుకోవడానికి, తినుకోవడానికి మాత్రమే అధికారం కావాలి. జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు, దత్తపుత్రుడితో ఎండ్ అవుతుంది. నాడు, నేడు అదే బడ్జెట్.. ♦ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే బడ్జెట్, ఇదే రాష్ట్రం. అప్పులు కూడా అప్పటికన్నా ఇప్పుడే తక్కువ. కేవలం ముఖ్యమంత్రి మారాడు. మీ బిడ్డకు ఓటు వేయకపోయినా ఫర్వాలేదు.. కచ్చితంగా వారికి రావాల్సినవి రావాలని ప్రయత్నం చేశాడు. మీ బిడ్డ ఎలా చేయగలుగుతున్నాడు. అప్పట్లో ఇదే చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడని ఆలోచించండి. ♦ మీ బిడ్డ మీ కోసం ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా రూ.2.31 లక్షల కోట్లు నేరుగా బటన్ నొక్కి మీ అకౌంట్లలోకి పంపించాడు. ఈ నాలుగేళ్లలో ఇంతటి సంక్షేమాభివృద్ధిని ఏనాడైనా చూశామా? చంద్రబాబు హయాంలో సామాజిక న్యాయం ఉందా? నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజకీయంగా ఇన్ని పదవులు ఏనాడైనా ఇచ్చారా? ఏనాడైనా మీ బిడ్డల భవిష్యత్ గురించి ఆలోచన చేశాడా? చివరకు పేదింటి పిల్లలు ఇంగ్లిష్ మీడియం చదవాలంటే కూడా వద్దన్న చరిత్ర ఆయనది. వాళ్ల పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లకు మాత్రం ఇంగ్లిష్ మీడియం కావాలి. ♦ చంద్రబాబు అధికారంలో ఉండగా ఇలా 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి.. ఇళ్లు కట్టించడం ఎప్పుడైనా చేశారా? ఇలా చేయలేకపోయిన ఈ 75 ఏళ్ల ముసలాయన వాటిని అడ్డుకోవడంలో మాత్రం ముందుంటారు. దత్తపుత్రులు ఎందుకిలా పరుగెడుతున్నాడంటే ఆయన సీఎం కావడానికి కాదట. ఈ ముసలాయన్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టడానికట. ఇలాంటి వ్యక్తి సీఎం అయితే మనకు మంచి జరుగుతుందా? ♦ మీకు మంచి చేయడానికి వస్తున్న వలంటీర్లను కూడా వదలకుండా ఎంత దారుణంగా మాట్లాడారు. రాబోయే రోజుల్లో వీళ్ల నీచ రాజకీయాలు, అబద్ధాలు ఇంకా ఎక్కువ అవుతాయి. మీ బిడ్డ నమ్ముకున్నది దేవుడి దయ, మీ దీవెనలనే. మీకు మంచి జరిగి ఉంటే నాకు మద్దతివ్వండి. అమలాపురంలో మూడు వంతెనలకు రూ.10 కోట్లు అమలాపురంలో మూడు పాత బ్రిడ్జిలు ఉన్నాయి. వాటిని పునర్ నిర్మించాలని మంత్రి విశ్వరూప్ అడిగారు. ఇందుకోసం రూ.10 కోట్లు కేటాయిస్తున్నాను. మా దగ్గర 84 సచివాలయాలున్నాయి. మాది ఇబ్బందికర ప్రాంతం.. వర్షాలు వస్తే ఇబ్బంది పడతాం.. అని విశ్వరూప్ చెప్పారు. అందుకు మంత్రి విశ్వరూప్‌ను, లేదా అతని కుమారుడు డాక్టర్ శ్రీకాంత్‌ను బాగా తిరిగి ఏం పనులు కావాలో చెప్పాలన్నాను. ప్రతి సచివాలయానికి జీజీఎంపీ కింద రూ.40 లక్షలు మంజూరు చేస్తానని చెప్పాను. మీ గ్రామాలను అభివృద్ధి చేయడానికి మీ బిడ్డ ప్రభుత్వం తోడుగా ఉంటుంది. -
పుంగనూరు ఘటన: సిబిఐ చేత దర్యాప్తు చేయించాలని బాబు బిల్డప్పు
-
దిమ్మ తిరిగి బొమ్మ కనపడేసరికి చంద్రబాబు కొత్త నాటకం
-
ఏది నిజం?: చట్టం మీ ‘బాబు’ చుట్టమా రామోజీ?
వాహనాల్లో తుపాకులు... చేతుల్లో కర్రలు, రాళ్లు, తాగి ఖాళీ చేసిన బీరు బాటిళ్లు... ఇవన్నీ పట్టుకుని ప్రాజెక్టులు చూడటానికి ‘యాత్ర’గా వెళ్లారంటే నమ్మగలమా? వీళ్లు ఎలాంటి యాత్రకు ప్లాన్ చేస్తున్నారో తెలియటం లేదా? గుంపును నడిపించే నాయకుడు ఆవేశంతో... ‘‘తరమండిరా నా కొడుకుల్ని’’ అంటూ ఎదుటివాళ్లను కొట్టమని రెచ్చగొడుతుంటే దాన్నేమనుకోవాలి? పైపెచ్చు... ‘‘ఒళ్లు దగ్గర పెట్టుకోండి. నాతో పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది. తమాషాలు చేస్తున్నారా, చూసుకుందాం రండ్రా నా కొడకల్లారా..’’ అని తన బావమరిది సినిమాల్లో రెచ్చిపోయినట్లుగా 73 ఏళ్ల చంద్రబాబు నాయుడు రెచ్చిపోయాడంటే ఏమనుకోవాలి? ఆయన మాటలతో రెచ్చిపోయి పరుగులు తీస్తూ ఎదుటి వ్యక్తులపై రాళ్ల దాడికి తెగబడ్డ తెలుగుదేశం రౌడీ మూకలు ఏం యాత్ర చేస్తున్నట్లు? నిరసన తెలపటానికి నల్ల జెండాలతో వచ్చిన 20 మంది కూడా లేని వైఎస్సార్ సీపీ కార్యకర్తలను తరమటంతో పాటు పోలీసులను రాళ్లు విసిరి గాయపరిచిన వారిపై కేసు పెట్టడం తప్పా? అన్నమయ్య జిల్లా ‘అంగళ్లు’ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఎవరు ఎవరిపై హత్యాయత్నం చేశారో తెలియటం లేదా? మరి ఈ ఘటనలో కెమెరాల సాక్షిగా కార్యకర్తల్ని రెచ్చగొట్టి విధ్వంసానికి పాల్పడిన చంద్రబాబు నాయుడిపై కేసు పెట్టడం తప్పెలా అవుతుంది? దీన్ని కూడా తెలుగుదేశం పార్టీ కోణంలోనే చూసి... ‘వైకాపా జులుం’ అంటూ రాసిన మీ కలానికి జోహార్లు రామోజీరావు గారూ!!. మీ పాత్రికేయానికి 50 ఏళ్లు నిండుతున్న తరుణంలో మీరు కొత్త లోతులకు దిగజారిపోతున్నారని అర్థం కావటం లేదా? పుంగనూరులో మరీ దారుణం. అక్కడ వైసీపీ కార్యకర్తలు కూడా లేరు. ఉన్నదల్లా పోలీసులే. వారు కూడా బందోబస్తు కోసం పుంగనూరు ఊళ్లోకి వెళ్లే రోడ్లకు బారికేడ్లు పెట్టి... ఆ బారికేడ్ల వెనక నిలుచున్నారు. ఇక చంద్రబాబు నాయుడి మూకకు ఆ ఊళ్లోకి వెళ్లాల్సిన పనే లేదు. ఎందుకంటే వాళ్లు అనుమతి తీసుకున్న రూట్ మ్యాప్‌లో... పుంగనూరు బైపాస్ మీదుగా వెళ్లిపోవాలి తప్ప పుంగనూరు ఊళ్లోకి వెళ్లటమనేది లేదు. అందుకే పోలీసులు అక్కడ బందోబస్తుగా నిలుచున్నారు. అలాంటి చోట వెళుతూనే... దూరం నుంచే పోలీసులపైకి రాళ్లు, బీరు బాటిళ్లు విసురుతూ వారిని గాయపరిచిందెవరు? ఉద్దేశ పూర్వకంగా దాడి చేసి... ఏకంగా 47 మంది పోలీసుల్ని రక్తం వచ్చేలా రాళ్లతో కొట్టిందెవరు? ఒక కానిస్టేబుల్ కంటి చూపు కూడా పోయింది కదా!!. ఇది హత్యాయత్నం కాక మరేమిటి? చంద్రబాబు నాయుడు వెనక ఉండి ఉసిగొల్పడం వల్లే కదా... వారంతా పోలీసుల పైకి రాళ్లతో విరుచుకుపడ్డారు!!. ఆ సమయంలో పోలీసులు లాఠీచార్జి చేయటంతో... టీడీపీ మూకలు కూడా తాము తెచ్చుకున్న కర్రలు, రాళ్లతో ఎదురుదాడికి దిగాయి. చంద్రబాబు నాయుడు దాడులకు ప్రేరేపించటంతో పాటు... దగ్గరుండి రెచ్చగొడుతూ దాడులు చేయించటం... ఆయన సమక్షంలోనే మొత్తం దాడులు జరగటం... ఇదంతా కుట్ర కాక మరేంటి? చంద్రబాబుపై కేసు పెడితే తప్పేంటి రామోజీరావు గారూ? అసలు ముందే దాడులు చేయాలన్న ప్రణాళిక లేకుంటే తెలుగుదేశం నేతల వాహనాల్లో తుపాకులు ఎందుకున్నాయి? కర్రలు, రాడ్లు ఎందుకు వెంట తెచ్చుకున్నారు? చేతుల్లో రాళ్లు సిద్ధంగా ఉన్నాయంటే అర్థమేంటి? ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి రామోజీరావు గారూ? చంద్రబాబు టీడీపీ గుండాలను ఉసిగొల్పిన వీడియోలు వైరల్... డీఎస్పీని ఉద్దేశించి ‘ఆ బట్టలు తీసేయండయ్యా. అందరూ పెయిడ్ ఆర్టిస్టులే. గాడిదలు కాస్తున్నారా’ అంటూ నోరుపారేసుకున్నారు చంద్రబాబు. తనను అడ్డుకుంటే ఇలాగే జరుగుతుందని హెచ్చరించారు కూడా. ఇంకా.. ‘దెబ్బలు తగిలినా.. తలలు పగిలినా భయపడేది లేదు. నేను ఎన్ఎస్జి రక్షణలో ఉన్నా. ఏయ్ పోలీస్... బట్టలిప్పు. రోషం లేని జీవితం. మీ పతనం చూసేవరకు వెంటపడతా’ అంటూ పుంగనూరులో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ ఆడియో, వీడియో సాక్షాలతో సహా బయటపడ్డాయి. చంద్రబాబు వైఖరిని చూసి జనం ఛీకొట్టడమే కాదు... ఆయన అడ్డంగా దొరికిపోయాడు కనక పోలీసులు తననే ఏ–1గా పెట్టి కేసు నమోదు చేశారు. అంతటా తనకు ప్రతికూలత పెరుగుతుండటంతో... సంఘటన జరిగిన నాలుగు రోజుల తరవాత ఆయన కొత్త పల్లవి అందుకున్నారు. తనపైనే హత్యాయత్నం జరిగిందని, అలాంటిది తనపైనే కేసు పెట్టడం ఏంటని కొత్త రాగం అందుకున్నారు. అందుకే.. రామోజీరావు సైతం తన బాబుకు మద్దతుగా సంఘటన జరిగిన నాలుగు రోజుల తరవాత... అంతా వైఎస్సార్ సీపీ కార్యకర్తలే చేశారని, ఎదురు కేసులు పెడుతున్నారని కొత్త కథనం అందుకున్నారు. ఇదంతా చంద్రబాబు మాస్టర్ ప్లాన్‌లో భాగమేనని అర్థం కావటానికి ఇంకా ఏం కావాలి? అయినా సాక్ష్యాలతో దొరికిపోవడం చంద్రబాబుకు ఎప్పుడూ అలవాటే. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఓట్ల కోసం కోట్లు లంచాలిచ్చిన కేసులో చంద్రబాబు ఇలానే ‘మా వాళ్లు బ్రీఫ్డ్ మీ’ అంటూ అడ్డంగా దొరికిపోయిన వ్యవహారం ఎవరికీ తెలియంది కాదు. ఇక అంగళ్లు, పుంగనూరులో బహిరంగంగానే పోలీసులపై దాడులు చేయాలని ఆయన తమ కార్యకర్తలను ఆదేశించారు. మరి హత్యాయత్నానికి ప్రేరేపించిన వ్యక్తిపై కేసు పెట్టరా? చట్ట ప్రకారం పోలీసులు కేసు పెడితే అంతగా పెడబొబ్బలు పెడితే ఎలా...! చంద్రబాబు మీకు ఎక్కువ కావచ్చు. కానీ చట్టానికి అతీతుడు కాదు. పుంగనూరు వద్ద ఈ నెల 4న పోలీసు వాహనానికి నిప్పుపెడుతున్న టీడీపీ శ్రేణులు పోలీసులను రక్తమోడేలా కొట్టారు... ఒకరి కన్నుపోగొట్టారు చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ రౌడీ మూకలు అంగళ్లులో సృష్టించిన విధ్వంస కాండా అంతా ఇంతా కాదు. ఏకంగా ముందస్తు కుట్రతోనే తెచ్చుకున్న రాళ్లూ, కర్రలు, బీర్ సీసాలతో పోలీసులపై మూకుమ్మడి దాడికి తెగబడ్డారు. ఈ పెనుదాడిలో 47 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఒళ్లంతా రక్తమోడుతూ కుప్పకూలిపోయారు. టీడీపీ అల్లరి మూకల రాళ్లవర్షంతో గాయపడిన మహిళా పోలీసులు హాహాకారాలు చేయడం అక్కడున్న అందరినీ కలచివేసింది. చాలా మంది ఖాకీ దుస్తులు రక్తంతో తడిసి ఎర్రబారటం దాడి తీవ్రతకు నిదర్శనం. టీడీపీ రౌడీల రాళ్ల దాడితో రణ«దీర్ అనే కానిస్టేబుల్ కన్ను పోయింది. మరో కంటికి ఆపరేషన్ చేస్తేగానీ ఏమీ చెప్పలేమన్నది వైద్యుల మాట. ఇవన్నీ వీడియోలు, ఫొటోలతో సహా బయటపడినా... ‘ఈనాడు’ మాత్రం ఎవరిపై దాడి చేశారు...? ఎవరు గాయపడ్డారు?...అంటూ నంగనాచి కబుర్లు చెప్పడం పాత్రికేయానికి పట్టిన ఖర్మ కాక మరేంటి? అంతా చంద్రబాబు పన్నాగమే... రోజు రోజుకు ప్రజల్లో ఆదరణ కరువవుతున్న టీడీపీకి... లేని సానుభూతి సృష్టించేందుకు చంద్రబాబు కుట్రపన్నారన్నది పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. సాగునీటి ప్రాజెక్టుల పేరిట తాను చేపట్టే యాత్రలో విధ్వంసం సృష్టించాలనేది ఆయన పన్నాగం. ముందుగా తంబళ్లపల్లె నియోజకవర్గంలో అంగళ్లు సర్కిల్‌కు వద్దకు చంద్రబాబు చేరుకోగానే టీడీపీ మూకలు కేకలు వేస్తూ... తొడలు చరుస్తూ కర్రలు, బీరు బాటిళ్లు, రాళ్లు విసురుతూ దాడులకు తెగబడ్డాయి. దాంతో పోలీసులతో సహా పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. అంతటితో చంద్రబాబు శాంతించ లేదు. తన వాహనం నుంచే ప్రసంగిస్తూ ‘పుంగనూరులో ఓ పుడింగి ఉన్నాడు.. పదండి అక్కడ తేల్చుకుందాం’ అని టీడీపీ నేతలు, కార్యకర్తలతో అన్నాడు. పుంగనూరులో విధ్వంసానికి అప్పటికే ‘అన్నీ’ సిద్దం చేసుకునే ఆయన ఆ మాటన్నారు. 2 వేలమందికిపైగా టీడీపీ రౌడీలు మాటువేశారు. అప్పటికే కృష్ణదేవరాయ కూడలికి సమీపంలో సిద్ధంగా ఉంచుకున్న రాళ్లు, మద్యం బాటిళ్లు, బీరు బాటిళ్లు, గుండ్రటి టపాసు బాంబులును గట్టిగా విసిరే బాధ్యత కొందరికి అప్పగించారు. ఒకరిద్దరు పోలీసులు చనిపోయినా పర్వాలేదు... పోలీసులు అనివార్యంగా కాల్పులు జరిపే పరిస్థితిని క్రియేట్ చేయాలన్నది బాబు లక్ష్యం. పోలీసు కాల్పుల్లో టీడీపీ కార్యకర్తలు చనిపోతే రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలకు విఘాతం కలించాలన్నది అసలు పన్నాగం. అందుకే రూట్ మ్యాప్‌లో లేకపోయినా సరే పుంగనూరు పట్టణంలోకి వెళ్లాలని పట్టుబట్టారు. ఎన్ఎస్జీ కమాండోల భద్రతలో ఉండే చంద్రబాబు పర్యటన రూట్‌ను ముందే ఖరారు చేస్తారు. ఆ మేరకు ఆ రూట్‌ను భద్రతా బలగాలు పరిశీలించి క్లియరెన్స్ ఇస్తాయి. అదే రీతిలో టీడీపీ నేతలు ముందుగా ఇచ్చిన దరఖాస్తు మేరకు పుంగనూరు బైపాస్ నుంచి యాత్రకు అనుమతినిచ్చారు. ఆ విషయాన్ని ఎన్ఎస్జీ కార్యాలయానికి కూడా తెలిపారు. కానీ చివరి నిముషంలో ఆ రూట్ కాకుండా పుంగనూరు పట్టణంలోకి వెళ్లాలని చంద్రబాబు ఎందుకు పట్టుబట్టారు? అదీ తనకు భద్రత విధుల్లో ఉండే ఎన్ఎస్జీ కమాండోలకు ఎలాంటి సమాచారం లేకుండా? ఎందుకంటే పుంగనూరులో అయితే యథేచ్ఛగా విధ్వంస కాండ సృష్టించవచ్చనేది కుతంత్రం. ఇవన్నీ పోలీసుల దర్యాప్తులో వెల్లడైన నిఖార్సైన నిజాలు. పోలీసులు సంయమనం పాటించి కాల్పులు జరపకపోవటం వల్లే పరిస్థితి చేయిదాటిపోకుండా ఉందన్నది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. కానీ ‘ఈనాడు’కు ఇవేవీ పట్టవు. ఎందుకంటే దానికి నిజాలతో పనిలేదు. బాబు కోసం పనిచేస్తే చాలు. -
అడ్డంగా బుక్కయిన చంద్రబాబు!
చిత్తూరు అర్బన్/బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లా అంగళ్లు, చిత్తూరు జిల్లా పుంగనూరు వద్ద ముందస్తు ప్రణాళికలో భాగంగానే టీడీపీ శ్రేణులను బహిరంగంగా రెచ్చగొట్టి దాడులు చేయించిన చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. విధ్వంసానికి దిగాలని చంద్రబాబు బహిరంగంగానే పిలుపునివ్వగా.. పార్టీ శ్రేణులు, కిరాయి మూకలు దాడులకు తెగబడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ‘పచ్చ మీడియా’ సహా అన్ని చానళ్లలోనూ ప్రసారమయ్యాయి. వాస్తవానికి తంబళ్లపల్లె నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన లేకపోయినా.. ముందురోజు సాయంత్రం పర్యటనలో మార్పు చేయడం.. ముందుగా ప్రకటించిన షెడ్యూల్లో లేకున్నా ములకలచెరువు, బురకాయలకోట, అంగళ్లు గ్రామాల పర్యటనకు వెళ్లడం వంటి అంశాలు చంద్రబాబు ఈ కుట్రకు ఏవిధంగా తెర తీశారనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గతంలో తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన చంద్రబాబు.. ఆ ఆడియో టేపులోని మాటలు తనవి కాదని బొంకారు. కానీ.. తాజా కేసులో పార్టీ శ్రేణులను రెచ్చగొట్టిన వీడియో సాక్ష్యాలు ఉండటంతో ఈ కేసులో అడ్డంగా దొరికిపోయారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ చంద్రబాబు తాను రెచ్చగొట్టలేదని మాట మారిస్తే.. పోలీసుల వద్ద ఉన్న, ఎల్లో మీడియా, సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైన వీడియోలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపి.. చట్టపరంగా ముందుకు వెళ్లడానికి పోలీస్ యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఏ1గా కేసు నమోదైంది. అంతా వ్యూహం ప్రకారమే.. ఈ నెల 4న ఉదయం 10:30 గంటలకు నాయన చెరువుపల్లెలో పనుల పరిశీలనకు రావాల్సిన చంద్రబాబు 12 గంటలు దాటాక చేరుకున్నారు. నేరుగా పనుల పరిశీలనకు వెళ్లకుండా షెడ్యూల్‌ను పక్కనపెట్టి ములకలచెరువులో ప్రసంగించారు. ఈ ప్రసంగంలోనూ టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా మాట్లాడారు. అక్కడినుంచి నాయన చెరువుపల్లెకు వెళ్లి తిరుగు ప్రయాణంలో బురకాయలకోటలో కారు ఫుట్ బోర్డుపైకి ఎక్కి రోడ్‌షో నిర్వహించారు. బి.కొత్తకోట మండలంలో హంద్రీ–నీవా కాలువను కొద్దిసేపు పరిశీలించారు. అంగళ్లులో చంద్రబాబు రోడ్‌షో, ప్రసంగం లేదు. కానీ.. మసీదు వద్దకు రాగానే చంద్రబాబు తాను ప్రయాణించే కారుపై రోడ్‌షో నిర్వహించారు. నాయన చెరువుపల్లె, హంద్రీ–నీవా కాలువ పనుల పరిశీలన మినహా షెడ్యూల్ మేరకు మిగతా ఏ కార్యక్రమం లేదు. కానీ.. ఆద్యంతం షెడ్యూల్‌కు భిన్నంగానే చంద్రబాబు పర్యటన కొనసాగించారు. ప్రాజెక్టుల సందర్శన పేరిట చంద్రబాబు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు విధ్వంసక వ్యూహం ప్రకారమే వచ్చినట్లు అర్థమవుతోంది. వాస్తవానికి హంద్రీ–నీవా కాలువ వద్ద రైతులతో చంద్రబాబు సమావేశం కావాల్సి ఉంది. దానిని రద్దు చేసుకుని మరీ అంగళ్లు గ్రామానికి చేరుకున్న చంద్రబాబు మసీదు వద్దకు రాగానే కారుపై నిలబడి రోడ్‌షో ప్రారంభించారు. అంగళ్లులో మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమాపతిరెడ్డి చంద్రబాబుకు వినతిపత్రం ఇవ్వడానికి ప్రయత్నించారు. పిచ్చలవాండ్లపల్లె రిజర్వాయర్‌పై చంద్రబాబు కోర్టులో కేసు వేయించి పనులు అడ్డుకున్నందుకు నల్లకండువాలతో వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోయిన చంద్రబాబు ‘తరమండిరా.. కొట్టండిరా నా కొడుకులను..’ అంటూ గొడవకు ఉసిగొల్పారు. అంతటితో ఆగక ‘పుంగనూరులో ఆ పుడింగి సంగతి తేలుద్దాం.. పదండి’ అంటూ పిలుపునిచ్చారు. దీంతో అప్పటికే ముందస్తు వ్యూహం ప్రకారం పుంగనూరు వద్ద వేచి ఉన్న టీడీపీ మూక, అల్లరి మూక విధ్వంసకాండకు దిగారు. అంగళ్లులో చెలరేగిన టీడీపీ నేతల రౌడీయిజంలో వైఎస్సార్సీపీ నాయకులు, పోలీసులు గాయపడ్డారు. పుంగనూరు వద్ద మారణాయుధాలు, రాళ్లు, కొడవళ్లు, ఇటుకలతో చేసిన దాడిలో పదుల సంఖ్యలో పోలీసులు గాయపడిన విషయం తెలిసిందే. కానిస్టేబుల్ రణ«దీర్ ఒక కంటి చూపును శాశ్వతంగా కోల్పోయారు. డీఎస్పీ బాబుప్రసాద్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. మహిళా ఎస్ఐ కరీమున్నీసా నడవలేని పరిస్థితి. -
రాజకీయాల్లో టీడీపీ హింసను ప్రేరేపిస్తుంది: కొమ్మినేని
సాక్షి, విజయవాడ: రాజకీయాల్లో టీడీపీ హింసను ప్రేరేపిస్తుందని ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్, బెటర్ ఆంధ్రప్రదేశ్ సంయుక్త ఆధ్వర్యంలో ఏపీలో హింసా రాజకీయాలు నివారణా చర్యలు - మీడియా పాత్ర అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ‘‘చంద్రబాబు లోకేష్ తమ మీటింగుల ద్వారా టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. అధికారం కోసం ఎంతకైనా తెగించే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఒక జిల్లా ఎస్పీ పేరు రెడ్ బుక్‌లో రాసుకుని ఆయనను ఏదో చేస్తామని బెదిరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త కంటికి దెబ్బ తగిలితే ఈనాడు మొదటి పేజీలో వేసింది.. చంద్రబాబు వెళ్లి పరామర్శించారు. పుంగనూరులో ఒక కానిస్టేబుల్ కంటి చూపు కోల్పోతే ఈనాడు, చంద్రబాబు ఎలా స్పందిస్తున్నారో చూస్తున్నాం’’ అని కొమ్మినేని పేర్కొన్నారు. ‘‘పుంగనూరు ఘర్షణలో ఒక్క బుల్లెట్ కూడా ఫైర్ చేయొద్దని ఎస్పీ రిషాంత్ రెడ్డి ఆదేశించారు. లేదంటే పోలీసులు ఫైర్ చేసేవాళ్లు.. టీడీపీ కార్యకర్తలు మరింత పేట్రేగిపోయి ఉండేవారు. దెబ్బలు తిన్న పోలీసులపై సానుభూతి కాకుండా వాళ్లే తప్పు చేసినట్టు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు’’ అంటూ కొమ్మినేని తప్పుబట్టారు. చదవండి: మాచర్లలో భరతుడంటా!.. లోకేశ్ మళ్లీ ఏసేశాడు -
పుంగనూరు ఘటనాస్థలిలో ఆ రెండు వేల మంది ఎవరనే దానిపై దర్యాప్తు
-
పుంగనూరు ఘటన వెనుక అసలు నిజాలు..
-
పుంగనూరు అల్లర్లు: ఆ 2 వేల మంది ఎవరు?
సాక్షి, తిరుపతి: పుంగనూరు ఘటనాస్థలిలో శుక్రవారం ఉన్న రెండువేల మంది స్థానికేతరులు ఎవరు? వారు ఎందుకోసం వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? అదేరోజు అంతమంది అక్కడికి రావలసిన అవసరం ఏమిటి? ఈ ప్రశ్నలు చిత్తూరు పోలీసుల మదిని తొలుస్తున్నాయి. ప్రాజెక్టుల పరిశీలన పేరుతో చంద్రబాబు ఈ నెల 4, 5వ తేదీల్లో చిత్తూరు, తిరుపతి జిలాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. అన్నమయ్య జిల్లా అంగళ్లులో శుక్రవారం గొడవకు కారణమైన చంద్రబాబు.. కొద్ది గంటలైనా గడవకముందే చిత్తూరు జిల్లా పుంగనూరులో మారణహోమానికి కుట్రపన్నారు. ఆ మారణహోమంలో టీడీపీ శ్రేణులే కాకుండా అల్లరి మూకలు, గూండాలు కూడా పాలుపంచుకున్నారు. టీడీపీ శ్రేణులు కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన వారు రెండువేల మందికిపైగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ రోజు ఘటన స్థలంలో దాదాపు ఐదు వేల సిమ్ (సెల్ఫోన్లు)లు ఆన్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిలో పోలీసులు, టీడీపీ శ్రేణులు, స్థానికులు కలిపి మూడువేల మంది వరకు ఉండొచ్చనే నిర్ణయానికి వచ్చారు. వీరుకాకుండా మిగతా రెండువేలమందికిపైగా స్థానికేతరులు అక్కడున్నట్లు వారి సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ను బట్టి తెలుస్తోంది. స్థానికేతరులు ఇంత పెద్దసంఖ్యలో పుంగనూరు వద్దకు రావలసిన అవసరం ఏమిటనే కోణంలో విచారణ చేపట్టినట్లు విశ్వసనీయ సమాచారం. పుంగనూరుపై బాబు అక్కసు సీఎం జగన్ ఆదేశాలతో చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో మంత్రి పెద్దిరెడ్డి పల్లెబాట పేరుతో ఊరూరా.. వీధివీధి తిరుగుతూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది, సంక్షేమపథకాల గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. చంద్రబాబు కుప్పానికి చేస్తున్న ద్రోహం గురించి వివరిస్తున్నారు. వాస్తవాలను గ్రహించిన కుప్పం వాసుల్లో మార్పు మొదలైంది. మొన్నటి మున్సిపల్ ఎన్నికలే ఇందుకు నిదర్శనం. ఈ పరిణామాలను గమనించిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో కుప్పంలో ఓటమి తప్పదనే భయంతో సీఎం వైఎస్ జగన్‌ను, మంత్రి పెద్దిరెడ్డిని టార్గెట్ చేశారు. ఇందులో భాగంగా పుంగనూరులో పర్యటించి అలజడి సృష్టించాలని నిర్ణయించుకున్నారు. అయితే స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అందుకు గల ప్రధాన కారణం.. పడమటి ప్రాంతాల సాగు, తాగునీటి అవసరాల కోసం ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఆవులపల్లి, నేతిగుంటపల్లి, ముదివేడు రిజర్వాయర్లను చంద్రబాబు అండ్ కో అడ్డుకున్నారు. కోర్టు నుంచి స్టే తీసుకురావటంపై స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వస్తే నిలదీయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం చంద్రబాబు అండ్ కోకూ తెలుసు. ఇదే అదనుగా చంద్రబాబు మారణహోమానికి పథకం వేసినట్లు తెలిసింది. రైతు వినతితో భగ్గుమన్న బాబు మూడు రిజర్వాయర్లపై వేసిన కేసును వెనక్కు తీసుకోమని ఉమాపతిరెడ్డి అనే రైతు అంగళ్లు వద్ద చంద్రబాబుకు వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నం చేశారు. ఇదే అవకాశంగా చేసుకున్న చంద్రబాబు ఉమాపతిరెడ్డిని నానా బూతులు మాట్లాడి, టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టారు. ‘తరమండిరా.. కొట్టండిరా నా కొడుకులను..’ అంటూ హుకుం జారీచేశారు. అధినేత ఆదేశాలతో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. అక్కడి నుంచే పుంగనూరు వద్ద వేచి ఉన్న టీడీపీ నేతలు, కిరాయి గూండాలకు సమాచారం ఇచ్చారు. అల్లరిమూకలు బాబు రాగానే రెచ్చిపోయాయి. ముందు రోజే మదనపల్లిలో తిష్ఠ విధ్వంసానికి ముందు రోజు రాత్రే అంతే గురువారం రాత్రి టీడీపీ గూండాలు మదనపల్లికి చేరుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ రాత్రి నుంచి 4వ తేదీ ఉదయం 9 గంటల వరకు మదనపల్లిలో టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన షెల్టర్లలో ఉన్నారు. రాత్రి, ఉదయం మద్యం సేవిస్తూ గడిపారు. ఉదయం 9 గంటలకు టీడీపీ నేతల నుంచి సమాచారం రావటంతో మదనపల్లి నుంచి పుంగనూరు వద్దకు వెళ్లారు. సాయంత్రం వరకు వేచి చూసి టీడీపీ నేతల ఆదేశాల మేరకు విధ్వంసానికి పూనుకున్నారు. టీడీపీ శ్రేణులు కాకుండా అద్దె గూండాలే రెండు వేల మందికి పైగా ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరంతా కర్ణాటక, తమిళనాడుకు చెందిన వారా? ఏపీకి చెందిన వారా? అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలిసింది. ఈ రెండు వేల మంది గురించి ఎక్కడా, ఎవ్వరికీ అనుమానం రాకుండా టీడీపీ శ్రేణులు సాయంత్రం వరకు జాగ్రత్తలు తీసుకుని విధ్వంసాన్ని అమలు చేశారు. అయితే పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించటంతో టీడీపీ లక్ష్యం నెరవేరలేదు. -
గుంట నక్కల కుట్రలు సహించం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ పాలనలో శాంతిభద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయని, వాటికి విఘాతం కల్పించడానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వంటి గుంటనక్కలు కుట్రలు చేస్తే సహించే ప్రశ్నే లేదని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు), వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అంగళ్లు, పుంగనూరులలో ఈనెల 4న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు, హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోవడానికి.. పోలీసులపై దాడికి పాల్పడడానికి చంద్రబాబే కారణమనడానికి పక్కా ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన వీడియోలను తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియా ముందు ప్రదర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఘటనపై సీబీఐ, ఎఫ్‌బీఐ విచారణ అవసరం లేదని.. ఇప్పటికే చంద్రబాబు డైరెక్షన్ మేరకు కుట్ర చేసిన వారు పోలీసులకు దొరికారని చెప్పారు. ఇంకా తమ వెనుక చంద్రబాబు ఉన్నాడులే.. మేమేం చేసినా చెల్లుతుంది అనుకునే వారికి ఇక బుద్ధి వస్తుందని ఆశిస్తున్నామన్నారు. రాజకీయ పార్టీగా వైఎస్సార్సీపీ సంయమనం పాటిస్తుందని.. చంద్రబాబు, టీడీపీ అరాచక మూకల ఆగడాలు మితిమీరిపోతే ఎక్కడ ఎలా దెబ్బకొట్టాలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ చూసుకుంటాయని స్పష్టం చేశారు. మీడియాతో సజ్జల ఇంకా ఏం చెప్పారంటే.. గొడవకు కారణం చంద్రబాబే ♦ప్రాజెక్టుల పరిశీలన పేరుతో పులివెందులలో రెచ్చగొట్టేందుకు ప్రయత్నించినా వైఎస్సార్సీపీ కార్యకర్తలు సంయమనం పాటించారు. అంగళ్లు, పుంగనూరు ఘటనలపై దర్యాప్తు సీబీఐకి ఇస్తే అది ఇప్పట్లో తేలదని అనుకున్నాడో ఏమో కానీ బాబు చాలెంజ్ విసిరాడు. కానీ.. ఆ రోజు ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలంతా చూశారు. ఎల్లో మీడియా మొత్తం లైవ్ ఇచ్చింది. ♦తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గాల్లో సాగు, తాగునీటి సమస్యలు తీర్చడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన ముదివేడు, నేతిగుంటపల్లి, ఆవులపల్లి రిజర్వాయర్ల నిర్మాణాన్ని ఎన్జీటీలో టీడీపీ కార్యకర్తలతో కేసులు వేయించి అడ్డుకుంటున్న చంద్రబాబుకు వినతిపత్రం ఇవ్వడానికి అంగళ్లులో శిబిరంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు నల్లకండువాలు వేసుకుని కూర్చున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఉద్దేశించి.. తరమండిరా నా కొడుకులను అంటూ చంద్రబాబు ఆదేశాలు ఇవ్వడంతో.. అప్పటికే చేతుల్లో రాళ్లు, కర్రలు, ఇనుప రాడ్లు పట్టుకున్న టీడీపీ అరాచక మూకలు ఎలా రెచ్చిపోయాయో రాష్ట్రమంతా చూసింది. ♦ చంద్రబాబుపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు నిజంగా దాడి చేయాలనుకుంటే.. శిబిరం వేసుకుని పక్కన కూర్చుంటారా? నాయకుడనేవాడు దాడులను ఆపడానికి ప్రయత్నం చేస్తాడా? తరమండిరా.. కొట్టండిరా.. అంటారా? ♦ వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు వందలసార్లు టీడీపీ కార్యకర్తలు నల్ల జెండాలతో నిరసనలు తెలిపారు. ఇప్పుడు కూడా అమరావతి ప్రాంతం వెళితే ఎక్కడో ఒక చోట నిరసన తెలుపుతూనే ఉన్నారు. దాన్ని ఆసరాగా తీసుకుని సీఎం వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఏనాడూ దాడులకు ప్రయత్నించలేదు. పక్కా ప్రణాళికతోనే పోలీసులపై దాడి ♦ ఈనెల 4న పుంగనూరు బైపాస్ నుంచే చిత్తూరుకు వెళ్తామని చంద్రబాబు పర్యటన షెడ్యూలును ఈనెల 3నే విడుదల చేశారు. దాంతో ఈ నెల 4న పుంగనూరు బైపాస్ వద్దే పోలీసులు భద్రత చర్యలు చేపట్టారు. బట్టలూడదీస్తా అంటూ పోలీసులను చంద్రబాబు దుర్భాషలాడుతూ.. అరాచక మూకను వారిపైకి రెచ్చగొట్టారు. కరుడుగట్టిన నేరగాళ్లు ముందస్తు వ్యూహం ప్రకారం రాళ్లు, కర్రలు, ఇనుప రాడ్లతో పోలీసులపై విచక్షణారహితంగా దాడి చేశారు. ♦ ఒక ఉగ్రవాద, ఉన్మాద ముఠా దాడి చేసినట్లు పోలీసులు టీడీపీ మూక చేసిన దాడిని రాష్ట్ర ప్రజలంతా చూశారు. పెద్ద సంఖ్యలో పోలీసులు గాయపడ్డారు. రణధీర్ అనే కానిస్టేబుల్ కన్ను ఒకటి చూపు కోల్పోవడం దారుణం. మరో కన్ను కూడా చూపును కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పారు. ♦ ఉన్మాదంతో దాడి చేసిన వాళ్లు కార్యకర్తలా? ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలు అని చెప్పుకోడానికి వారికన్నా సిగ్గుండాలి.. వారికి నాయకుడినని చెప్పుకోడానికి బాబుకైనా సిగ్గుండాలి. ఉన్మాది చంద్రబాబు అధ్యక్షుడిగా ఉన్న పార్టీలో శిక్షణ పొంది తయారైన ఉన్మాదుల ముఠా టీడీపీ మూక. ♦ ఈ ఉన్మాద ముఠా దాడులకు నాయకత్వం వహించిన చంద్రబాబుపై 307 కేసు కాకుండా ఇంకేం పెట్టాలి? పోలీసులను బట్టలు ఊడదీయ్ అన్నాక చంద్రబాబు నాయకుడు ఎలా అవుతారు? మామూలుగా మీడియా ఇలాంటి సంఘటనల్లో సంయమనం పాటిస్తుంది. కానీ వాళ్లు లైవ్‌లో అంతా చూపించారు. వారి ఆలోచన చూసి వైఎస్సార్సీపీ కార్యకర్తలు రెచ్చిపోవాలి.. రాష్ట్రం తగులబడాలి అనేది వారి ఆలోచన. మనసులో ఒకటి.. బయటకు మరొకటా? మనసులో ఒకటి పెట్టుకుని.. బయటకు మరోలా మాట్లాడి.. ఎవరికి ప్రయోజనం చేకూర్చాలనుకున్నారని సినీ నటుడు చిరంజీవిని వైఎస్సార్సీపీ ప్రధానకార్యదర్శి సజ్జల ప్రశ్నించారు. మీడియా ప్రతినిధి ఒకరు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బాలకృష్ణ సినిమాకు ఒకలా.. మిగిలిన వారి సినిమాలకు మరోలా వ్యవహరించి వివక్ష చూపారని ఎత్తిచూపారు. చిన్న, పెద్ద నిర్మాతలు అందరికీ న్యాయం చేసేలా పారదర్శకమైన టికెటింగ్ వ్యవస్థను సీఎం వైఎస్ జగన్ తెచ్చారని గతంలో చిరంజీవి ప్రశంసించారని గుర్తు చేశారు. విభజన సమయంలో చిరంజీవి కేంద్ర మంత్రిగా పని చేశారని.. అప్పట్లో ప్రత్యేక హోదాపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. బోడిగుండకు మోకాలికి ముడిసేలా మాట్లాడితే మా నుంచి రాజకీయంగా ప్రతి స్పందన ఉంటుందని స్పష్టం చేశారు. రెండు రోజుల ముందే కుట్ర ♦ తోడల్లుడు దగ్గుబాటి రాసిన పుస్తకంలో చెప్పినట్లుగానే ఇప్పడు చంద్రబాబు వ్యవహరించారు. శాంతిభద్రతల సమస్య రావాలి.. అలాంటి సంక్షోభం నుంచి కూడా ఎన్ని ప్రాణాలు పోయినా తాను లాభపడాలనేదే చంద్రబాబు సిద్ధాంతం. ♦ రెండు రోజుల ముందే పుంగనూరు బైపాస్‌లో పోలీసుల మీద దాడి చేసి.. పుంగనూరులోకి తోసుకుపోవడానికి ప్లాన్ చేసుకున్నారు. ఈ సమయంలో పోలీసులు కాల్పులు జరిపి, నలుగురైదుగురు కార్యకర్తలు చనిపోతే.. దాని నుంచి సానుభూతి పొందాలని ప్రయత్నం చేశాడు. ఒక వేళ పోలీసులను తోసుకుని పుంగనూరులోకి పోగలిగితే.. పుంగనూరు పట్టణాన్ని తగలబెట్టాలని చంద్రబాబు పథకం రచించారు. ఇంతటి దిక్కుమాలిన ఆలోచన, కుట్ర, కుతంత్రం చరిత్రలో ఉండి ఉండదు. ♦పుంగనూరు బైపాస్‌లో టీడీపీ మూక తీవ్ర స్థాయిలో దాడి చేస్తున్నా.. పోలీసులు చాలా సంయమనంతో వ్యవహరించారు. ఫైరింగ్ ఆర్డర్ ఇవ్వకుండా అక్కడి ఎస్పీ వెనక్కి తగ్గారు. పోలీసులు ప్రతిష్టకు పోయి ఉంటే చంద్రబాబు ఆశించిందే జరిగేది. అందుకే పోలీసులు రెచ్చిపోలేదని మీకు రోషం లేదా.. చొక్కాలు విప్పండి అంటూ బాబు తిట్టారు. ♦తన హయాంలో ఫలానా పని చేశానని చంద్రబాబుకు చెప్పుకోవడానికి ఏమీ లేదు. వైఎస్ జగన్ పాలనలో ఎత్తిచూపడానికి లోపాలు ఏమీ లేవు. రూ.2.30 లక్షలకోట్లు డీబీటీ ద్వారా నేరుగా ప్రజల ఖాతాల్లోకి వెళ్లాయి. 87% ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. అందుకే ఏమీ చేయలేక పవన్ కల్యాణ్ వంటి వారికి ప్యాకేజీ ఇచ్చి తిప్పుకుంటున్నాడు. -
ప్లాన్ A కుదరకపోతే..పుంగనూరును వల్లకాడు చేసేలా ప్లాన్ B
-
ముదివేడు పీఎస్ లో చంద్రబాబుపై కేసు నమోదు
-
టీడీపీ మూకల దాడిలో ఒక కంటి చూపు కోల్పోయిన రణధీర్
-
పుంగనూరు ఘటన: పరారీలోనే కీలక సూత్రధారి, టీడీపీ నేత చల్లా బాబు
పుంగనూరు (చిత్తూరు జిల్లా): పుంగనూరులో పోలీసులపై తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల దాడి కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్‌కు తరలించారు. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్‌ల సంఖ్య 74కు చేరింది. పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, పుంగనూరు సీఐ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ అల్లరి మూకలపై ఐదు కేసులు నమోదు చేశారు. వీరిలో ప్రధాన సూత్రధారి అయిన నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి చల్లా బాబు పరారీలో ఉన్నారు. ఆయన పీఏ గోవర్ధన్‌రెడ్డి పోలీసులకు చిక్కాడు. పథకం ప్రకారమే పోలీసులపై దాడులు చేశామని అతడు తెలిపినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. టీడీపీకి చెందిన చిత్తూరు, పలమనేరు, పుంగనూరుకు చెందిన న్యాయవాదులు రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపిన సెక్షన్లు నిందితులకు వర్తించవని కోర్టులో వాదనలు వినిపించారు. ఏపీపీ రామకృష్ణ సాక్ష్యాధారాలను కోర్టుముందు ఉంచి, సుదీర్ఘంగా వివరించారు. దీంతో న్యాయమూర్తి ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవిస్తూ 72 మంది నిందితులను రిమాండ్‌కు తరలించాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో వారిని సోమవారం అర్ధరాత్రి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా, పుంగనూరులో పోలీసులపై టీడీపీ శ్రేణుల దాడికి నిరసనగా మంగళవారం విశాఖపట్నంలోని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల, రాష్ట్ర అదనపు కార్యదర్శి మొల్లి అప్పారావు, కార్పొరేటర్లు అక్కరమాని రోహిణి, కెల్లా సునీత, గేదెల లావణ్య, మువ్వ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. చదవండి: టీడీపీ నేతకు లివర్ వ్యాధి.. సీఎం రిలీఫ్ ఫండ్ రూ.20 లక్షలు మంజూరు -
పోలీసులే ఫస్ట్ టార్గెట్!
సాక్షి, అమరావతి/ చిత్తూరు రూరల్/ నెట్వర్క్:‘చంద్రబాబు పర్యటన సజావుగా సాగేలా బందోబస్తు విధులు నిర్వహించడానికి మేం వచ్చాం. మా అధికారులు, సహోద్యోగులం అంతా బందోబస్తు విధుల్లో ఉన్నాం. ఇంతలో దూరం నుంచే టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మావైపు దూసుకువచ్చారు. అసలు వాళ్లు ఎందుకు అంత ఆగ్రహంతో వస్తున్నారో.. ఏం చేయడానికి వస్తున్నారో కూడా మాకు ఎవరికీ అర్థం కాలేదు. ఏమిటి విషయం అని మేము ఆలోచించే లోగానే వాళ్లు రాళ్లతో మాపై దాడులు చేయడం మొదలు పెట్టారు. పెద్ద పెద్ద రాళ్లు, కర్రలు, పదునైన వస్తువులు పోలీసులపై విసరడం మొదలు పెట్టడంతో అంతా గందరగోళంగా తయారైంది. నా ముందు ఉన్న డీఎస్పీ తలకు ఓ రాయి వచ్చి తగలడంతో రక్తం బొటబొటా కారింది. మా ఎస్.ఐ మేడంపై రాళ్లు, కర్రలు విసరడంతో ఆమె గాయపడ్డారు. ఇంతలోనే నా తల వెనుక భాగాన ఓ రాయి గట్టిగా తగిలింది. కానీ నేను హెల్మెట్ ధరించి ఉండటంతో ఏమీ కాలేదు. తలతిప్పి వెనక్కు చూశాను. నా హెల్మెట్ గ్రిల్స్ మధ్య ఉన్న ఖాళీ నుంచి ఒక రాయి దూసుకొచ్చి బలంగా కంటిపై తగిలింది. దాంతో అమ్మా అని గట్టిగా అరచి నేను కుప్పకూలిపోయాను. రాళ్ల దెబ్బలతో నా ముఖం మొత్తం రక్తసిక్తం అయ్యింది. ఏం జరుగుతోందో అర్థం కాలేదు. మా వాళ్లు ఆస్పత్రికి తీసుకెళ్లారు. తర్వాత పరీక్షించిన వైద్యులు ఒక కంటికి చూపు పోయిందని చెప్పారు. మరో కంటి చూపు కూడా కోల్పోవచ్చని డాక్టర్లు అంటున్నారు’ అని కానిస్టేబుల్ రణధీర్ ఆవేదనగా చెప్పుకొచ్చారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో చంద్రబాబు పర్యటన సందర్భంగా శుక్రవారం టీడీపీ కుట్ర పూరితంగా ముందస్తు పన్నాగంతో పోలీసులపై జరిపిన దాడికి ప్రత్యక్ష సాక్షి అయిన రణధీర్ ఆ సంఘటనను కళ్లకు కట్టినట్టుగా చిత్తూరులో మంగళవారం మీడియాకు వివరించారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా శాంతిభద్రతల సమస్యను సృష్టించేందుకు టీడీపీ నేతలు ఎంత కుట్రపూరితంగా వ్యవహరించారన్నది ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఇది ముందస్తు కుట్రే.. రాయలసీమ జిల్లాల్లో చంద్రబాబు పర్యటనలో ఆశించినంతగా విజయవంతం కాకపోవడంతో టీడీపీ ఆందోళనలో కూరుకుపోయింది. దాంతో ఆయన పర్యటనలకు లేని ఇమేజ్ తీసుకు వచ్చేందుకు అల్లర్ల కుట్రకు పథక రచన చేసింది. ఇందులో భాగంగా పుంగనూరు వద్ద భారీ సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా రౌడీ మూకలను ముందుగానే తెప్పించారు. పుంగనూరు బైపాస్ నుంచి వెళ్లేందుకు ముందుగా టీడీపీ నేతలు అనుమతి కోరితే పోలీసులు సమ్మతించారు. అందుకే బైపాస్ రోడ్డులో తగిన పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. కానీ పోలీసుల అనుమతికి విరుద్ధంగా పుంగనూరు పట్టణంలోకి చంద్రబాబు ప్రవేశించేటట్టుగా చేయాలని టీడీపీ నేతలు భావించారు. అలా పుంగనూరు పట్టణంలో పర్యటన సందర్భంగా భారీ ఎత్తున అల్లర్లు సృష్టించాలన్నది వారి పన్నాగం. ముందస్తు అనుమతికి విరుద్ధంగా పుంగనూరు పట్టణంలోకి చంద్రబాబు పర్యటనను పోలీసులు అనుమతించకపోతే బైపాస్ రోడ్డు వద్దే విధ్వంసకాండ సృష్టించాలని కూడా ప్లాన్ బి రెడీ చేసుకున్నారు. అందుకోసమే భారీ సంఖ్యలో అల్లరి మూకలను బైపాస్ రోడ్డు వద్ద ముందుగానే మోహరించారు. కాగా చంద్రబాబు కాన్వాయ్ ఇక పుంగనూరు బైపాస్కు సమీపిస్తుందనగానే టీడీపీ రౌడీలు రంగంలోకి దిగారు. బందోబస్తు విధుల కోసం అక్కడ ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందిపై హఠాత్తుగా రాళ్లతో దాడి చేశారు. సాధారణంగా పోలీసులు అనుమతి లేకుండా మోహరించిన వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తారు. ఆ సమయంలో కొంత వాగ్వాదం, తోపులాటల అనంతరం పరిస్థితి అదుపు తప్పితే కొందరు పోలీసులకు ఎదురుదిరిగే అవకాశం ఉంటుంది. కానీ పుంగనూరులో అందుకు విరుద్ధంగా టీడీపీ మూకలు కుట్రపూరితంగా పోలీసులపై మూకుమ్మడి దాడికి తెగించడం గమనార్హం. శాంతియుతంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులపై ఒక్కసారిగా రెండు వేల మందికి పైగా ఉన్న టీడీపీ అల్లరి మూకలు దాడికి తెగబడ్డాయి. పోలీసుల నుంచి ఎలాంటి హెచ్చరికలు లేకుండానే.. కవ్వింపు చర్యలు లేకుండానే.. టీడీపీ గూండాలు పోలీసులపై భారీ ఎత్తున రాళ్లదాడికి తెగబడి బీభత్సం సృష్టించారు. ఈ పచ్చ మూకల దాడిలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. కానిస్టేబుల్ రణధీర్ కంటి చూపు కోల్పోవడం బాధాకరం. రణధీర్‌కు అండగా ప్రభుత్వం టీడీపీ గూండాల దాడిలో గాయపడిన కానిస్టేబుల్ రణధీర్‌కు ప్రభుత్వం పూర్తి అండగా నిలిచింది. ‘సాక్షి’ దినపత్రికలో మంగళవారం ‘ఈ దారుణానికి బాధ్యులెవరు?’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందిస్తూ బాధిత కానిస్టేబుల్ రణధీర్‌కు ప్రభుత్వం రూ.10 లక్షల సాయం ప్రకటించింది. ఆయనకు మినిస్టీరియల్ ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది. రణధీర్కే కాదు యావత్ పోలీసు యంత్రాంగానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటామని స్పష్టం చేసింది. ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి, మంత్రులు బొత్స సత్యనారాయణ, అమర్నాథ్, శాసనసభలో ప్రభుత్వ విప్ జి. శ్రీకాంత్‌రెడ్డి తదితరులు వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ పోలీసులపై టీడీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు ఆదేశాలతోనే టీడీపీ గూండాలు అంతగా బరితెగించి పోలీసులపై దాడులకు పాల్పడ్డారని విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి చిత్తూరులో మంగళవారం పర్యటించారు. కానిస్టేబుల్ రణధీర్‌ను పరామర్శించారు. మెరుగైన వైద్యంతో పాటు అతని కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రణధీర్ కుటుంబానికి అండగా ఉంటాం పుంగనూరు రాళ్ల దాడిలో గాయపడ్డ రణధీర్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చిత్తూరు ఎస్పీ రిషాంత్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన చిత్తూరు పోలీసు అతిథి గృహంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, కలెక్టర్ సగిలి షణ్మోహన్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. అల్లరి మూకల దాడిలో ఎస్టీఎఫ్ కానిస్టేబుల్ రణధీర్ ఒక కంటి చూపు పొగొట్టుకున్నారని, మరో కన్ను కూడా చూపును కోల్పోవచ్చని వైద్యులు చెప్పారన్నారు. దాతల సాయంతో అతనికి మళ్లీ కంటి చూపు తెప్పించే ప్రయత్నం చేస్తామన్నారు. రణధీర్‌కు కంటి చూపు పోవడంపై కొందరు విష ప్రచారం చేస్తుండటం తగదన్నారు. అల్లరి మూకలను కట్టడి చేయడంలో పోలీసులు చక్కగా విధులు నిర్వర్తించారని కొనియాడారు. పోలీసు శాఖ నిత్యం నిష్పక్షపాతంగా పనిచేస్తూ శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం పని చేస్తోందనే విషయాన్ని గుర్తించాలన్నారు. ప్రభుత్వ సాయం మరువలేను ఆ రోజు జరిగిన ఘటన ఇంకా నా మదిలో తిరుగుతూనే ఉంది. ఆస్పత్రిలో చేర్చిన మరుసటి రోజు డాక్టర్ వచ్చి ‘నల్లగుడ్డు, తెల్ల గుడ్డు చెదిరిపోయింది. నీకు ఒక కన్ను జీవితాంతం కనబడదు’ అని చెప్పగానే కాళ్ల కింద భూకంపం వచ్చినట్టు అయ్యింది. మా అమ్మా నాన్నకు ఏం చెప్పాలో తెలియలేదు. కట్టుకున్న భార్యకి చెప్పే ధైర్యం ఉన్నా.. ఆరో తరగతి, రెండో తరగతి చదువే నా పిల్లలకు ఏం చెప్పాలని తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నా. కన్ను పోయిన నాకు పోలీసు ఉద్యోగం ఉంటాదో ఊడతాదో తెలియలేదు. ఆ సమయంలో చాలా భయమేసింది. నా బాధను ‘సాక్షి’ పత్రిక తప్ప మరే పేపర్ రాయలేదు. నేను పోలీసుని. రాజకీయ కార్యకర్తను కాదు. నాకు జరిగిన అన్యాయం ఎందుకు రాయలేదో కూడా నాకు తెలియదు. కానీ ఈరోజు సీఎం జగన్ సార్ నా గురించి ఆరా తీసి ప్రభుత్వం తరఫున రూ.10 లక్షలు ప్రకటించారు. నా కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఆఫీసులో మినిస్టీరియల్ స్టాఫ్‌గా ఉద్యోగం ఇస్తామన్నారు. రాష్ట్ర మొత్తం నాకు అండగా నిలబడిందని సంతోషంగా ఉండాది. ఇది చాలు. – రణధీర్, కంటి చూపు కోల్పోయిన కానిస్టేబుల్ దాడులు చేయించింది బాబే పుంగనూరులో దాడులు చేయించింది టీడీపీ అధినేత చంద్రబాబే. బాబుకు కుట్ర రాజకీయాలు వెన్నతో పెట్టిన విద్య. పుంగనూరులో ఆయనలోని టెర్రరిజాన్ని చూపించాడు. రాష్ట్రంలో మరిన్ని అల్లర్లకు వ్యూహాలు రచిస్తున్నారు. పుంగనూరు దాడులపై చంద్రబాబుపై ఏ–1గా కేసు నమోదు చేయాలి. – నారాయణస్వామి, ఉప ముఖ్యమంత్రి చంద్రబాబుపై రౌడీషీట్ తెరవాలి పుంగనూరులో హింసాత్మక ఘటనకు సూత్రధారి చంద్రబాబే. ఆయనపై రౌడీషీట్ తెరవాలి. పుంగనూరులో టీడీపీ వాళ్లు రెక్కీ నిర్వహించి, ఎవరెవరు ఏ విధంగా దాడులు జరపాలో స్కెచ్ వేసుకున్నారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇంతకు ముందెన్నడూ జరగని దుర్మార్గమైన దాడి ఇది. ఈ దాడిలో పోలీసులను చంపాలనుకోవడం దుర్మార్గం. 40 మందికి పైగా పోలీసుల రక్తం కళ్ల చూశారు. సాక్ష్యాధారాలు పక్కాగా ఉన్నందున చంద్రబాబును ఉపేక్షించకూడదు. – గుడివాడ అమర్నాథ్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీడీపీ నేతలూ.. బాబును నమ్మొద్దు పుంగనూరులో హింసకు ప్రధాన కారకుడు ప్రతిపక్షనేత చంద్రబాబే. ఈ కేసులో ఆయన్ను ఏ–1గా చేర్చి రౌడీషీట్ తెరవాలి. ప్రాజెక్టుల యాత్ర పేరిట చంద్రబాబు.. టీడీపీ గూండాలు, రౌడీలతో ప్రజలపై దండయాత్ర చేస్తున్నారు. అల్లర్లు సృష్టిస్తే పోలీసులు కాల్పులు జరుపుతారని, ఆ కాల్పుల్లో టీడీపీ కార్యకర్తలు చనిపోతే రాజకీయంగా వాడుకోవాలన్నది చంద్రబాబు పన్నాగం. ఇలాంటి వ్యక్తి కోసం టీడీపీ కార్యకర్తలు బలికావద్దు. బాబును నమ్మకండి. కందుకూరులో ఇరుకు సందులో మీటింగ్ పెట్టి 8 మంది చనిపోవడానికి కారకుడైన బాబు గురించి ఎవరికి తెలియదు? – గడికోట శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ 72 మందికి రిమాండ్ పరారీలో కీలక సూత్రధారి చల్లా బాబు పుంగనూరు (చిత్తూరు జిల్లా): పోలీసులపై తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల దాడి ఘటనలో 72 మంది నిందితులను సోమవారం రాత్రి కడప సెంట్రల్ జైలుకు తరలిస్తూ అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జి సింధు ఉత్తర్వులు జారీ చేశారు. పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, పుంగనూరు సీఐ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ అల్లరి మూకలపై ఐదు కేసులు నమోదు చేశారు. వీరిలో ప్రధాన సూత్రధారి అయిన నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి చల్లా బాబు పరారీలో ఉన్నారు. ఆయన పీఏ గోవర్ధన్‌రెడ్డి పోలీసులకు చిక్కాడు. పథకం ప్రకారమే పోలీసులపై దాడులు చేశామని అతడు తెలిపినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. టీడీపీకి చెందిన చిత్తూరు, పలమనేరు, పుంగనూరుకు చెందిన న్యాయవాదులు రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపిన సెక్షన్లు నిందితులకు వర్తించవని కోర్టులో వాదనలు వినిపించారు. ఏపీపీ రామకృష్ణ సాక్ష్యాధారాలను కోర్టుముందు ఉంచి, సుదీర్ఘంగా వివరించారు. దీంతో న్యాయమూర్తి ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవిస్తూ 72 మంది నిందితులను రిమాండ్‌కు తరలించాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో వారిని సోమవారం అర్ధరాత్రి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా, పుంగనూరులో పోలీసులపై టీడీపీ శ్రేణుల దాడికి నిరసనగా మంగళవారం విశాఖపట్నంలోని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల, రాష్ట్ర అదనపు కార్యదర్శి మొల్లి అప్పారావు, కార్పొరేటర్లు అక్కరమాని రోహిణి, కెల్లా సునీత, గేదెల లావణ్య, మువ్వ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
పక్కా స్కెచ్చేనా..? అందుకే వాస్తవాలు రాయడానికి చేతులు రాలేదా రామోజీ?
ఎక్కడైనా ఏదైనా ఘర్షణ జరిగితే బాధితుల తరపున అండగా నిలవాలని అనుకుంటాం. కాని దురదృష్టవశాత్తు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలకు కాని, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ఈనాడు, ఆంధ్రజ్యోతి, తదితర మీడియా సంస్థలకు కాని కనీస కరుణ, దయ కొరవడ్డాయి. పుంగనూరులో పాశవికంగా పోలీసులపై టీడీపీ కార్యకర్తలుగా చెప్పుకునే గూండాలు దాడులు చేసి తీవ్రంగా గాయపరిస్తే, సానుభూతి తెలపకపోగా, గూండాలకు మద్దతు ఇచ్చే నీచ సంస్కృతికి వెళుతున్నారంటే దానిని ఏమి రాజకీయం అనుకోవాలి. ఇంత వికృతంగా రాజకీయం, పాత్రికేయం మారిపోవడం ఆంధ్రప్రదేశ్ దురదృష్టం. తెల్లవారి లేస్తే నీతులు చెప్పే ఈనాడు రామోజీరావు ఈ స్థాయిలో అరాచక శక్తులకు మద్దతు ఇవ్వడం అంటే ఇంతకన్నా నీచమైన జర్నలిజం మరొకటి ఉండదేమో! టీడీపీ దాడిలో తలలు పగిలిన పోలీసులు, కన్ను కోల్పోయిన కానిస్టేబుల్ ఇలా ఇరవైఏడు మంది ఆస్పత్రి పాలైనా , ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాక్షసత్వంతో మాట్లాడారంటే ఆయన తత్వం అంతేలే అని సరిపెట్టుకోవచ్చు. కాని వైసీపీవారు అక్కడ దాడిచేశారు.. ఇక్కడ దాడి చేశారు అని అబద్దాలో,సబద్దాలో నిత్యం వండి వార్చే ఈనాడు మీడియాకు టీడీపీ గూండాల విధ్వంసం కనిపించలేదు. గుర్తు తెలియని వ్యక్తులు పుంగనూరులో పోలీసు వాహనాలకు నిప్పంటిచారని రాయడం చండాలపు జర్నలిజానికి పరాకాష్ట. ఇలాంటి ఘటనలను ఉన్నది, ఉన్నట్లు ఇస్తే, ఎవరిది తప్పైతే వారి గురించి రాస్తే మీడియాకు విలువ ఉంటుంది. కాని తాము మద్దతు ఇచ్చే టీడీపీకి నష్టం జరుగుతుందన్న భావనతో వాస్తవాలు రాయడానికి చేతులు రాకపోతే అది విలువలు లేని మీడియానే అవుతుంది. అలాంటప్పుడు ఈనాడు పత్రికపై చంద్రబాబు ఫోటో వేసుకుని వారిష్టం వచ్చినట్లు రాసుకుంటే సరిపోతుంది. చదవండి: కోతల బాబు రోత మాటలు.. ఎక్కడికి వెళ్లి ఏం మాట్లాడుతున్నారో..! పుంగనూరు ఘటన జరిగిన తర్వాత రోజు ఈనాడు పత్రిక మొదటి పేజీలో పోలీసు వాహనాలకు నిప్పు పెడుతున్న టీడీపీ వారి ఫోటోలు ప్రచురించలేదు. పైగా పోలీసులు తప్పు కూడా ఉందన్న అభిప్రాయం కల్పించడానికి, వైసీపీపై ఆరోపణలు చేయడానికి ప్రాధాన్యం ఇచ్చారు. పుంగనూరులో టీడీపీ వారు మొత్తం ప్లాన్ ప్రకారమే విధ్వంసం సృష్టించే యత్నం జరిగినట్లు అనిపిస్తుంది. పుంగనూరులో కాని, అంగళ్లు అనే గ్రామం వద్ద కాని చంద్రబాబు నాయుడు తన కార్యకర్తలను రెచ్చగొట్టిన తీరు ఆయన మానసిక పరిస్థితిని తెలియచేస్తుంది. డెబ్బైనాలుగేళ్ల వయసులో అలాంటి వాటిని ప్రోత్సహించకుండా, ఒకవేళ వైసీపీవారు ఎవరైనా ఎదురైనా, గొడవలకు ఆస్కారం ఇవ్వవద్దని చెప్పగలిగి ఉంటే సంస్కారయుతంగా ఉండేది. కాని ఆయనే బూతులు తిడుతూ టీడీపీ వారిని గూండాయిజం చేయాలని పురమాయించడం దారుణం. పైగా అంతా చేసి తనను కూడా వివేకా మాదిరి చంపుతారా అని ఎదురుదాడి చేయడం ఆయనలోని రాజకీయ పైశాచికత్వానికి పరాకాష్ట అని చెప్పాలి. పుంగనూరులో జరిగినమొత్తం ఘటనను విశ్లేషించి పోలీసు అధికారులు మీడియాకు చెప్తున్నప్పుడు జాగ్రత్తగా వింటే తెలుగుదేశం పార్టీ ఎంత నైచ్యానికి దిగజారింది తెలిసిపోతుంది పోలీసు వాహనాలను దగ్ధం చేయడమే కాకుండా అనేకమంది పోలీసులపై టీడీపీ గుండాలు దాడి చేయడం అంటే అది ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహస్యం పాలు చేయడమే. పుంగనూరు బైపాస్ రోడ్ నుంచి నేరుగా వెళ్లిపోతామని రూట్ ఇచ్చి అనుమతి పొందిన చంద్రబాబు ఆ తరువాత కావాలని పుంగనూరు పట్టణంలోకి వెళ్లడానికి ప్రయత్నించి ,అందుకు టీడీపీ రౌడీలను పురమాయించి పోలీసులపై దౌర్జన్యానికి దిగేలా చేసినట్లుగా అధికారులు గుర్తించారు. చంద్రబాబు వాహనం పైన ఉన్న ఒక టీడీపీ నాయకుడు కిందికి దిగివచ్చి కార్యకర్తలతో ఈ అల్లర్లు చేయించారట.ఇంకా చంద్రబాబుపై కేసు పెట్టలేదు కాని, డెబ్బై రెండు మందిని ఇంతవరకు అరెస్టు చేశారు. కీలక నిందితుడు మాత్రం పరారీలో ఉన్నారు. పెట్రోల్ క్యాన్లు తీసుకురావడం తుపాకీ, తుటాలతో తిరగడం ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని పోలీసు అధికారుల సంఘం నేతలు స్పష్టం చేశారు. తమను రెచ్చగొట్టడం ద్వారా కాల్పుల వరకు పరిస్థితిని తీసుకువెళ్లాలని యోచించారని కానీ తాము సంయమనంతో ఉండడంతో తమ వాళ్లే రాళ్ల దెబ్బలు తినాల్సి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తొలుత ఇదేదో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య జరిగిన గొడవని అనుకున్నారు. అలాగే ప్రచారం కూడా చేసేశారు. తెలుగుదేశం మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి వైసీపీ వారిపై దారుణమైన అసత్యాలు కూడా ప్రచారం చేశాయి. కానీ పోలీస్ ఎస్పీ పరిస్థితిని వివరిస్తూ టీడీపీ కార్యకర్తలు పోలీసులపై దౌర్జన్యానికి దిగారని, పుంగనూరు పట్టణంలోనికి అనుమతించాలని రభస సృష్టించారని తెలిపారు. పొరపాటున ఈ మూకలన్నీ పుంగనూరులో ప్రవేశించి ఉంటే ప్రజల ఆస్తులకు, ప్రాణాలకు చాలా నష్టం ఏర్పడి ఉండేదని ఆయన అన్నారు. ఇది వాస్తవంగానే కనిపిస్తుంది. ఒక నాయకుడి వెంట ఎవరైనా పెట్రోల్ క్యాన్లు తీసుకుని వెళ్తారా, గన్ను పట్టుకుని తిరుగుతారా? ఒక యువకుడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై పుడింగి భాషను వాడటమే కాకుండా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం పలు సందేహాలకు తావిస్తోంది. సంబంధిత వీడియో వైరల్‌గా మారాయి. కుప్పంతో సహా ఆ చుట్టుపక్కల పలు నియోజకవర్గాలపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టు సాధించడంతో ఆయనపై కక్షతోనే ఈ ప్లాన్ చేసినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. దురదృష్టవశాత్తు గౌరవ హైకోర్టు వారు ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకోకుండా రోడ్లపై షోలకు ప్రజాస్వామ్యం పేరుతో అనుమతించడం వల్ల కూడా సమస్యలకు ఆస్కారం ఏర్పడిందనిపిస్తోంది. పుంగనూరు అనేది చిన్న పట్టణం అక్కడ వీధులు చాలా ఇరుగ్గా ఉంటాయి. అక్కడ ఒక మోస్తరు సంఖ్య లో జనం పోగైనా ట్రాఫిక్ ఆగిపోయి చాలా గందరగోళం ఏర్పడుతుంది. అందులోనూ రెండు పార్టీల కార్యకర్తలు ఎదురుపడితే అది చాలా విపరిణామాలకు దారితీస్తుంది.. ఈ విషయం తెలిసి కూడా చంద్రబాబు ముందుగా అనుమతి పొందినట్లుగా బైపాస్ మీదుగా కాకుండా ఊర్లోకి రావాలని అప్పటికప్పుడు అనుకోవడం కచ్చితంగా కుట్ర స్వభావాన్ని తెలియజేస్తుంది కానీ పోలీసులు తాము తీవ్రంగా దెబ్బలు తిన్నప్పటికీ ఆ పరిస్థితిని నివారించగలిగారు. కానీ టీడీపీ కార్యకర్తలు పెట్రోల్ పోసి మరి పోలీస్ వాహనాలు నిప్పంటించడాన్ని ఆపలేకపోయారు. మరో సంగతి ఏమిటంటే వైసీపీ కార్యకర్తలు చంద్రబాబు ప్రాజెక్టు యాత్రకు నిరసనగా ఒక కార్యక్రమం చేపట్టి మధ్యాహ్నానికే పూర్తి చేసేశారు. ఈనాడు వంటి ఎల్లో మీడియా మాత్రం చంద్రబాబు యాత్రకు అడుగడుగునా వైకాపా అడ్డంకులు అంటూ పచ్చి అబద్దాలను ప్రచురించారు, ప్రసారం చేశారు. వైసీపీ నిరసనలకు కారణం ఏమిటంటే చిత్తూరు ఉమ్మడి జిల్లాలో పలు ప్రాంతాలకు ఉపయోగపడే రిజర్వాయర్లను ప్రభుత్వం నిర్మిస్తుంటే తమ కార్యకర్తల ద్వారా చంద్రబాబు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేయించి ఆ పనులను నిలుపుదల చేయించారు.. పైగా ఇప్పుడు ఆ ప్రాజెక్టులు పూర్తి చేయలేదంటూ డబుల్ గేమ్ ఆడుతున్నారన్నది రైతులు విమర్శ. ఎవరైనా ప్రశ్నిస్తే చంద్రబాబు టూర్‌ను అడ్డుకున్నట్టు అట వైసీపీ వారు దానిపై నిరసన చేస్తే ఘోరమట అదే టీడీపీ లేదా మరి ఎవరైనా వైసీపీకి వ్యతిరేకంగా చేస్తే అది ప్రజాస్వామ్యమట.. పోలీసులకు దెబ్బలు తగిలితే, తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైతే చంద్రబాబు కనీసం సానుభూతి ప్రకటించలేదు అలాగే ఆయన దత్తపుత్రుడుగా విమర్శలకు గురవుతున్న పవన్ కళ్యాణ్ సైతం పోలీసులపై దాడిని ఖండించకపోగా చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన విధ్వంసాన్ని సమర్థిస్తూ ప్రకటన చేశారు. ఈనాడు పత్రికలో పుంగనూరు రోడ్ షోకు అనుమతి ఇవ్వని పోలీసులు అంటూ దారుణమైన అసత్యాలని ప్రచురించడానికి సిగ్గుపడలేద. ఎక్కడా టీడీపీ కార్యకర్తలు పోలీసు వాహనాలను దహనం చేసిన ఫోటోలను మొదటి పేజీలో ప్రచురించలేదు. పైగా ఇదంతా కలిపి తెలుగుదేశ కార్యకర్తల విరోచిత చర్యగా తిప్పికొట్టారని, తిరగబడ్డారని తెలుగుదేశం మీడియా దిక్కుమాలిన వాదనను ప్రచారం చేసింది. చంద్రబాబు గారైతే పోలీసులను బట్టలు కూడా ఊడ తీయండి. మీ అంతు చూస్తా మీరు అసలు ఐపీఎస్యేనా మీ సంగతి చూస్తా అంటూ కార్యకర్తలు పెట్రేగి పోయేలా చేశారు.. అదే టైంలో కేంద్రానికి మాత్రం వైసీపీ వారు ఏదో చేసేసారంటూ పచ్చి మోసపు వినతి పత్రాలను కూడా పంపించేశారు అక్కడితో ఆగ లేదు అంటూ వివేకాలాగే నన్ను చంపుతారా అంటూ పిచ్చి ఆరోపణ చేస్తారు. ఇంకోవైపు పెద్దిరెడ్డిని ఉద్దేశించి నా తడాఖా చూపిస్తా అని బెదిరిస్తారు.. ఏకకాలంలో రెండు పాత్రలను పోషించగల సమర్థుడు చంద్రబాబు అని అనుకోవాలి ఆయన వాటిలో పెద్దగా ఫీల్ అవ్వరు ఎలాగైనా సరే ప్రభుత్వాన్ని బదనాం చేయాలని విశ్వయత్నం చేస్తుంటారు.. ఆ క్రమంలోనే పుంగనూరులో అరాచకం సృష్టించబోయి భంగపాటుకు గురై పార్టీ వారిని కేసుల పాలు చేశారు. 74 ఏళ్ల వయసులో తన అధికార దాహం కోసం చంద్రబాబు ఇలాంటి ఘోరాలకు పాల్పడడం అత్యంత శోచనీయం. దీన్ని ప్రభుత్వం కానివ్వండి.. పోలీసుల అధికారులు కానివ్వండి.. లాజికల్ ముగింపునకు తీసుకువెళ్లి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేకుంటే దీన్ని మరింత అలసత్వంగా తీసుకుని వచ్చే ఎన్నికలలో ఇంకెన్ని ఘోరాలైనా చేయడానికి తెగబడతారు. మంత్రి అంబటి రాంబాబు చెప్పినట్లు చంద్రబాబుది ప్రాజెక్టుల యాత్ర కాదు ఆంధ్రప్రదేశ్ విధ్వంసాల యాత్ర చేస్తున్నట్లుగానే అనిపిస్తోంది. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
ఈ దారుణానికి బాధ్యులెవరు?
చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో మూడ్రోజుల క్రితం టీడీపీ నేతల మారణహోమ పథకం బెడిసికొట్టినా.. వాళ్లు చేసిన గాయాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఇప్పటికే ఏఎస్పీ, డీఎస్పీ, సీఐలు, ఎస్ఐలతో సహా 27 మంది గాయపడ్డ ఈ ఘటనలో.. సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన రణధీర్ అనే స్పెషల్ పార్టీ పోలీస్ (ఎస్టీఎఫ్) కానిస్టేబుల్ మాత్రం తన కంటిచూపును కోల్పోయారు. మరో కన్ను కనిపిస్తున్నా చూపు కోల్పోయే ప్రమాదముందని వైద్యులు చెప్పడం కంటనీరు తెప్పిస్తోంది. ప్రస్తుతం తిరుపతి అరవింద కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రణ్‌ధీర్ గురించి ‘సాక్షి’ సేకరించిన వివరాలు.. అనంతపురానికి చెందిన రణధీర్ ఖాకీ యూనిఫామ్‌పై ఉన్న ఆసక్తితో 2013లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. సత్యసాయి జిల్లాలో ఉద్యోగం చేస్తూ ఈనెల 3 నుంచి చంద్రబాబు పర్యటనలో తన సహచరులతో కలిసి పుంగనూరులో బందోబస్తు డ్యూటీకి వచ్చారు. నాలుగో తేదీ శుక్రవారం టీడీపీ కిరాయి సేనలు మద్యం మత్తులో పోలీసులపై చెప్పులు, బాటిళ్లు విసురుతున్నారు. విధుల్లో ఉన్న రణధీర్, ఇతర పోలీసులు తమ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు టీడీపీ కార్యకర్తలను సర్దిచెప్పి పంపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, ఒక్కసారిగా అల్లరిమూకలు రాళ్లతో దాడిచేయడంతో రణధీర్ బృందం వెనక్కు వచ్చేసింది. ఉన్నతాధికారులకు దెబ్బలు తగలకుండా అడ్డుగా నిలిచారు. ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు రాళ్లు, మద్యం బాటిళ్లు, టపాకాయ బాంబులు విసురుతున్నారు. దీంతో ఓ డీఎస్పీకి అడ్డుగా నిలబడి తీసుకెళ్తున్న రణధీర్‌కు ఓ రాయి వచ్చి నేరుగా కంటిని తాకింది. కంటి నుంచి రక్తం ధారలుగా కారిపోతూ, భరించలేని నొప్పిని అనుభవించాడు. రెండు కళ్లు కనిపించలేదు. హుటాహుటిన పోలీసులు రణధీర్‌ను పుంగనూరు ఆసుపత్రికి తీసుకెళ్తే పరిస్థితి బాలేదని, తిరుపతికి వెళ్లాలని సూచించారు. తిరుపతి అరవింద కంటి ఆసుపత్రిలో రణధీర్‌కు ఎంఆర్ఐ స్కాన్ తీశారు. రాయి కంటిని తీవ్రంగా తాకడంతో ఎడమకంటి నల్లగుడ్డు, తెల్లగుడ్డు దెబ్బతిన్నాయి. లోపలున్న సున్నితమైన నరాలు తెగిపోయాయి. ఫలితంగా ఓ కన్ను కనిపించదని వైద్యులు తేల్చిచెప్పేశారు. నరాలు తెగిపోవడంవల్ల కుడి కన్ను సైతం చూపు కోల్పోయే అవకాశముందని.. దీనికి మందులిచ్చి, ఆ ప్రమాదం రాకుండా ప్రయత్నం చేస్తున్నామని వైద్యులు చెప్పారు. రణధీర్ తన దుఃఖాన్ని దిగమింగుకుని.. ‘‘సార్, మా అమ్మ, నాన్న ఇద్దరూ పేషెంట్లు. నేను ఉద్యోగం చేసి, కుటుంబాన్ని పోషించాలి. పోలీసు ఉద్యోగమంటే గౌరవం పెంచాలని ఖాకీ డ్రెస్ వేసుకున్నాను. ఇప్పుడు చూపుపోయింది. ఇప్పుడు నా బాధంతా నాకు కంటిచూపు పోయిందని నా ఇద్దరు పిల్లలకు ఎలా చెప్పాలో అర్థంకావడంలేదు సర్..’’ అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. పోలీసులపై దాడిలో పైశాచిక ఆనందం పొందిన టీడీపీ నేతలు.. రణధీర్ జీవితాంతం అనుభవించే బాధకు ఏం బదులిస్తారు? కళ్లెదుటే పోలీసు వాహనాలను పచ్చమూకలు తగులబెడితే ప్రమాదవశాత్తు కాలిపోయాయని పిచ్చి రాతలు రాసిన ‘ఈనాడు’కు రణధీర్ లాంటి పోలీసుల కన్నీళ్లు కనిపించకపోవడం ఆ కంటికి పచ్చ కామెర్లు వచ్చినట్లే అవుతుంది. -
పుంగనూరు పోలీసులపై దాడి కేసు.. మరో 9 మంది అరెస్ట్
-
పుంగనూరులో పోలీసులపై దాడి కేసులో పోలీసుల పురోగతి
-
మరణహోమమే లక్ష్యం
-
పుంగనూరు ఘటనకు నిరసనగా ప్రొద్దుటూరులో భారీ ర్యాలీ
ప్రొద్దుటూరు: పుంగనూరులో చంద్రబాబు రెచ్చగొట్టే మాటలు మాట్లాడి పోలీసులపై, ప్రజలపై రాళ్లతో దాడులు చేయించినందుకు నిరసనగా ఆదివారం పుట్టపర్తి సర్కిల్లో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అల్లర్ల సందర్భంగా పోలీసులు కాల్పులు జరిపి ఉంటే ఎన్నో కుటుంబాలకు గర్భశోకం మిగిలేదని, సంయమనంతో వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన పోలీసులు గ్రేట్ అని అభినందిస్తూ వారికి సెల్యూట్ చేశారు. -
పథకం ప్రకారమే పోలీసులపై దాడి
పుంగనూరు (చిత్తూరు జిల్లా): చంద్రబాబు పర్యటనలో ఉద్దేశ పూర్వకంగానే తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పోలీసులపై దాడిచేసి గాయపరచి, పోలీస్ వాహనాలకు నిప్పు పెట్టారని చిత్తూరు జిల్లా అడిషనల్ ఎస్పీ కె.శ్రీలక్ష్మి తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆమె పుంగనూరులో పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, ఎస్బీ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సీఐ అశోక్‌కుమార్‌తో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు పర్యటనలో రూట్‌మ్యాప్‌ను కాదని పుంగనూరులోకి దౌర్జన్యంగా వస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలను నివారించినందుకే రాళ్లు, మద్యం బాటిళ్లు, కర్రలతో దాడి చేసి పోలీసులను తీవ్రంగా గాయపరిచారన్నారు. ఈ ఘటనపై ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఆదేశాల మేరకు దర్యాప్తు వేగవంతం చేసి, సీసీ çఫుటేజ్, సాంకేతిక పరిజ్ఞానంతో దాడులు చేసిన వారిలో 62 మందిని అరెస్ట్ చేసి, రిమాండుకు తరలిస్తున్నామన్నారు. పోలీసులను రెచ్చగొట్టి.. తద్వారా కాల్పులు జరిగేలా చేయాలన్నది టీడీపీ ముఖ్య నేతల ఉద్దేశం అని తేలిందన్నారు. అవసరమనిపిస్తే పోలీసులను చంపాలని, ఆ సమయంలో పోలీసులు కాల్పులు జరిపితే టీడీపీ వారు చనిపోతే తద్వారా ఇమేజ్ పొందేలా పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి ఈనెల 2న రొంపిచెర్లలో వ్యూహ రచన చేశారన్నారు. ఆయన పీఏ గోవర్దన్రెడ్డిని అరెస్ట్ చేసి విచారించగా ఈ విషయం వెల్లడైందన్నారు. దీంతో ప్రస్తుతం చల్లా రామచంద్రారెడ్డిని ఏ–1 నిందితునిగా కేసు నమోదు చేశామని చెప్పారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నాడన్నారు. -
‘మరణ’హోమమే లక్ష్యం! కనీసం ఇద్దరు పోలీసులనైనా..?
చిత్తూరు అర్బన్: టీడీపీ అధినేత నేత చంద్రబాబు నాయుడు శనివారం నాటి చిత్తూరు జిల్లా పర్యటనలో మారణహోమమే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు ప్రణాళికలు రూపొందించారు. కనీసం ఇద్దరు పోలీసులను చంపాలని దుర్మార్గపు ఆలోచనలు చేశారు. బాబు పర్యటనకు రెండు రోజుల ముందే ఈ ప్లాన్ మొత్తం రూపొందించారు. పుంగనూరు వద్ద పోలీసులపై దాడులకు తెగబడి అల్లర్లు సృష్టించిన ఘటనకు సంబంధించి పుంగనూరు టీడీపీ ఇన్చార్జ్ చల్లా బాబు అలియాస్ చల్లా రామచంద్రారెడ్డి ఈనెల 2వ తేదీన రొంపిచెర్లలో పార్టీ ప్రధాన వ్యక్తులతో ఈ మారణహోమ వ్యూహాన్ని రచించారు. అతని వ్యక్తిగత కార్యదర్శి గోవర్దన్రెడ్డిని పోలీసులు విచారించగా, పూసగుచ్చినట్లు విషయం అంతా వివరించాడని తెలిసింది. ఇది విన్న పోలీసులు షాక్‌కు గురవ్వడంతోపాటు, ఇదేం రాజకీయం అని కాసేపు ఆందోళనకు గురైనట్లు సమాచారం. టీడీపీ నేతలు రూపొందించిన వ్యూహాలు ఇలా ఉన్నాయి. ప్లాన్–ఎ: పోలీసు కాల్పులు పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రోజు రోజుకు జనాదరణ పెరిగిపోయి హీరో అయిపోతున్నాడని చల్లా బాబు తరచూ పార్టీ నేతల వద్ద అక్కసు వెళ్లగక్కేవారు. ఇదే పుంగనూరులో పెద్దిరెడ్డిని జీరో చేయాలని, అదే సమయంలో రాష్ట్రం మొత్తం పుంగనూరు వైపు చూసేలా మారణహోమం జరగాలని సంకల్పించారు. ఈ మేరకు విషయాన్ని పార్టీ పెద్దకు చేరవేసి, ఆయన ఆశీర్వాదం పొందారని తెలిసింది. ఇందులో భాగంగా చంద్రబాబు నాయుడు పుంగనూరు బైపాస్ రోడ్డు వద్దకు వచ్చినప్పుడు.. పుంగనూరు పట్టణంలోకి రావాలని పార్టీ శ్రేణులు పట్టుపట్టాలని, పోలీసులు దీనికి అంగీకరించరని నిశ్చయించుకున్నారు. అప్పటికే కృష్ణదేవరాయ కూడలికి సమీపంలో సిద్ధంగా ఉంచుకున్న రాళ్లు, మద్యం బాటిళ్లు, బీరు బాటిళ్లు, గుండ్రటి టపాసు బాంబులును పోలీసులే లక్ష్యంగా విసిరేలా కొందరికి బాధ్యత అప్పగించారు. ఇందులో భాగంగా మొత్తం 30 నిమిషాల పాటు దాడి కొనసాగించేందుకు సరిపడా రాళ్లు, ఇతర వస్తువులను పరిసర ప్రాంతాల్లో ఉంచారు. తొలి మూడు నిమిషాల్లో చెప్పులు, వాటర్ బాటిళ్లు విసిరితే పోలీసులు తేలిగ్గా తీసుకుంటారని, ఇదే అదునుగా పోలీసుల ఊహకు అందని విధంగా రాళ్లు, టపాసు బాంబులు, మద్యం బాటిళ్లతో పది నిముషాలు దాడులు చేయాలని, ఇందులో ఒకరిద్దరు పోలీసులు చనిపోయినా పర్లేదనే వ్యూహానికి పదునుపెట్టారు. ఇదే కనుక జరిగితే వెంటనే పోలీసులు కాల్పులు ఓపెన్ చేస్తారని, ఈ కాల్పుల్లో కనీసం 30 మంది వరకు టీడీపీ శ్రేణులు మరణిస్తారు.. అప్పుడు దేశం మొత్తం పుంగనూరు వైపు చూస్తుంది.. రాష్ట్ర వ్యాప్తంగా అల్లకల్లోలం అవుతుంది.. ఎక్కడికక్కడ పార్టీ శ్రేణుల ద్వారా ఆందోళనలతో ప్రభుత్వాన్ని కూల్చేయొచ్చని భారీ కుట్ర పన్నారు. తర్వాత జరిగే ఎన్నికల్లో సానుభూతి వల్ల టీడీపీ ఆటోమేటిక్‌గా గద్దెనెక్కడం ఖాయం అని భావించారు. ప్లాన్–బీ: అల్లకల్లోలం సృష్టించడం ఏ కారణాల వల్లయినా ప్లాన్–ఏ అమలుకాని పక్షంలో టీడీపీ నేతలు ప్లాన్–బీ కూడా రూపొందించుకున్నారు. పోలీసులు చనిపోకపోయినా, వాళ్లు ఫైర్ ఓపెన్ చేయకపోయినా ఆందోళన చేస్తున్న టీడీపీ శ్రేణులు మొత్తం ఒక్కసారిగా పుంగనూరు పట్టణంలోకి చొరబడి ఎక్కడికక్కడ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్లెక్సీలు చింపడం, పెట్రోలు పోసి నిప్పంటించడం చేయాలి. వెంటనే వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రతిస్పందిస్తాయి. దీంతో చెలరేగే అల్లర్లలో వైఎస్సార్సీపీ శ్రేణులను ఒకరిద్దరిని మట్టుబెడితే.. వాళ్లు చేసే దాడుల్లో ఆస్తుల విధ్వంసంతో పాటు కొందరు టీడీపీ కార్యకర్తలూ చనిపోతారు. దీనికంతటికీ కారణం ప్రభుత్వంపై నెట్టేసి, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగాలి. తద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టాలి. రాష్ట్రం మొత్తం ఈ ఘటనలతో హోరెత్తిపోయి శాంతి భద్రతల వైఫల్యాన్ని ఎండగట్టాలని అనుకున్నారు. ఈ రెండు ప్లాన్ల గురించి టీడీపీలోని ప్రధాన వ్యక్తులకు తప్ప, పార్టీ కార్యకర్తల్లో ఒక్కరికి కూడా తెలియడానికి వీల్లేదని తీర్మానం చేశారు. ఎక్కడా ఈ ప్లాన్ల గురించి పల్లెత్తు మాట కూడా మాట్లాడకూడదని అత్యంత గోప్యత పాటించారు. ఈ అల్లర్లకు అవసరమయ్యే వారిని మదనపల్లె, మొలకలచెరువు, సదుం, సోమల నుంచి రప్పించాలని నిర్ణయించుకున్నారు. అదే విధంగా రంగంలోకి దించారు. పోలీస్ ప్లాన్ భళా.. టీడీపీ డీలా.. టీడీపీ నేతలు రూపొందించిన మారణహోమ ఉచ్చులో పోలీసులు చిక్కుకునే ఘటన దాదాపు అమలైపోతుందని టీడీపీ పెద్దలు భావించారు. అయితే అల్లర్ల సమయంలో అక్కడ బందోబస్తులో ఉన్న ఓ పోలీసు అధికారి చిత్తూరు ఎస్పీ రిషాంత్‌రెడ్డికి ఫోన్ చేశారు. పోలీసులు రక్తమోడుతుండటం చూసిన ఆ అధికారి చలించిపోయి.. గద్గద స్వరంతో ఎస్పీతో మాట్లాడుతూ.. ‘సర్, పరిస్థితి చేయి దాటిపోతోంది. డీఎస్పీల తలలు పగిలిపోతున్నాయి. సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు ఇక్కడ ఆర్తనాదాలు పెడుతున్నారు. మనం ఫైర్ ఓపెన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెంటనే మీరు కలెక్టర్‌తో మాట్లాడి ఫైర్ ఓపెన్ చేసేలా ఆర్డర్ ఇవ్వండి ప్లీజ్. లేకుంటే మనవాళ్లు చనిపోతారు..’ అంటూ బతిమిలాడినట్లు సమాచారం. అప్పుడు టీడీపీ మూకలు రాళ్లు, బాటిళ్లు విసురుతున్న తీరు, వాటి నిల్వల వివరాలు ఆరా తీసి.. పోలీసులు వెంటనే 300 మీటర్లు వెనక్కు వచ్చేయాలని ఎస్పీ సూచించినట్లు తెలిసింది. దీంతో టీడీపీ శ్రేణులు రాళ్లు, మద్యం బాటిళ్లు నిల్వ ఉన్న ప్రాంతం నుంచి ముందుకు వస్తారని.. అప్పుడు టీడీపీ శ్రేణులను చెదరగొట్టడానికి స్వల్పంగా లాఠీచార్జ్, బాష్ప వాయువు ప్రయోగించాలని ఆదేశించినట్లు సమాచారం. తాను పుంగనూరుకు బయలుదేరానని, తాను అక్కడికి వచ్చే వరకు ఒక్క బుల్లెట్ కూడా తుపాకీ నుంచి బయటకు రావడానికి వీల్లేదని గట్టిగా చెప్పినట్లు తెలిసింది. దీంతో పోలీసులు రక్తమోడుతున్నప్పటికీ ఎస్పీ ఆదేశాలను అమలు చేశారు. అల్లరి మూకల్ని దగ్గరకు రప్పించి లాఠీలతో చెదరగొట్టారు. దీంతో టీడీపీ నేతల కుతంత్రాలు, కుట్రలు పటా పంచలయ్యాయి. -
పోలీసులపై జరిగిన దాడి పవన్ కు కనిపించట్లేదా ?: YSRCP నేతలు
-
దమ్ముంటే పుంగనూరులో గెలిచి చూపించాలి :వెల్లంపల్లి
-
పోలీసులపై టీడీపీ దాడిని ఖండించిన మంత్రి అంబటి
-
ఒక్కసారి ఇటు చూడు చంద్రబాబూ..
చంద్రబాబు హయాంలో జరగని అభివృద్ధి.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరుగుతోంది. దీంతో మనుగడ కొల్పోతామన్న భయంతో టీడీపీ హింస రాజకీయాలకు తెరతీస్తోంది. ‘ఒళ్లు దగ్గర పెట్టుకోండి. నాతో పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది. తమాషాలు చేస్తున్నారా, చూసుకుందాం రండి రా.. నా కొడకల్లారా.. వాళ్లను తరమండిరా..’ అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు.. పోలీసులపైకి టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి.. రాయలసీమలో రక్తపాతమే లక్ష్యంగా అగ్గి రాజేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు రాక్షస మనస్తత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు పని చేసిన చంద్రబాబు.. రాయలసీమ జిల్లాలకు తీరని ద్రోహం చేశారు. పుంగనూరులో ప్రాజెక్టులపై స్టే ఎందుకు వేశారో సమాధానం లేదు. ఇదిలా ఉండగా, పుంగనూరు అభివృద్ధిపై ఆ ప్రాంత వాసి పేరుతో ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ►పుంగనూరుకి వస్తున్నట్టు ఉన్నావ్.. వచ్చేటప్పుడు అలా నువ్వు నీ బంధువులు, తెలుగుదేశం కార్యకర్తలతో కేసులు వేసి నిలిపివేసిన నేతి గుట్లపల్లి ప్రాజెక్ట్ కనిపిస్తుంది. చూస్తే చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది కావాలంటే కొంత సేవు ఈతకొట్టు.. ►పుంగనూరు శాశ్వత తాగు, సాగునీటి అవసరాల కోసం 95 శాతం పూర్తయిన ప్రాజెక్ట్‌ను అడ్డుకోవాలని చూస్తున్న నీ వక్రబుద్ది తెలుస్తుంది ►అలాగే ముందుకు వస్తే రూ.40 కోట్ల రూపాయలతో పుంగనూరు రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమైంది ఒక్కసారి చూడు ►ఇంకొంచెం ముందుకు వస్తే పెద్దిరెడ్డి గారి సహకారంతో నిర్మించిన డయాలసిస్ సెంటర్ ఉంటుంది తలపైకి ఎత్తి చూడు ►ఇంకొంచెం ముందుకొస్తే ఒక్క కారు బస్సు వెళ్లాలంటే ఇబ్బంది పడే మినీ బైపాస్ ఇప్పుడు ఎంత విశాలంగా సర్వాంగా సుందరంగా ఉందో చూడు ►ఇంకొంచెం ముందుకొస్తే నువ్వు అధికారంలో ఉండగా అడ్డుకున్నా ఆర్టీసీ డిపో.. నేడు రాష్ట్రంలోనే అతిపెద్ద గ్యారేజ్‌తో మా పెద్దాయన నిర్మించిన ఆర్టీసీ డిపో కనిపిస్తుంది చూడు. ►ఇంకొంచెం ముందుకు పోతే ప్రభుత్వ ఆసుపత్రి కనబడుతోంది.. దాని వెనకాల కడుతున్న భవనాలను చూడు.. ఇటీవల 100 పడకల ఆసుపత్రిగా మారి ప్రజల అన్ని సౌకర్యాలు తీర్చడనికి రూపుదిద్దుకున్న తీరును చూడు.. ►ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు సొంత నిధులతో నిర్మించిన ఆక్సిజన్ ప్లాంట్‌ని చూడు ►ఇంకొంచెం ముందుకు వెళ్తే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కనబడుతుంది.. కావాలంటే కొంతసేవు గట్టుపై సేదదీరు ►ఈ మధ్య సమ్మర్ స్టోరేజ్‌లో సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసి పుంగనూరుకి విద్యుత్ అందించనున్నారు ఆ ప్రాజెక్ట్ గురించి తెలుసుకో ►ఇంకొంచెం ముందుకు వెళ్తే ఎంపీ మిథున్ రెడ్డి గారి డ్రీమ్ బైపాస్ రోడ్డు కనబడుతోంది చాలా బాగుంటుంది ►అలా బోయకొండ వెళ్తే కోట్ల రూపాయలతో బోయకొండను బంగారు కొండగా మార్చిన తీరును చూస్తే ఆశ్యర్యం కలగక మానదు.. ►ఇదంతా పుంగనూరు అభివృద్ధిలో కొంత భాగం మాత్రమే కేవలం 4సంవత్సరాల లొనే పెద్దాయన ఇంత చేస్తుంటే.. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు కుప్పానికి ఏమి చేశావు అని మాత్రం ఆలోచించకు చంద్రబాబూ.. -
కఠిన చర్యలు తప్పవు
సాక్షి, అమరావతి: పుంగనూరు ఘటనపై విచారణకు ఆదేశించామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వారందరిపై కఠిన చర్యలు తప్పవని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి హెచ్చరించారు. ఘటన పూర్వాపరాలపై విచారణ జరపాలని డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ రిషాంత్‌లను ఆదేశించామన్నారు. ఈ విషయమై శనివారం ఆయన సాక్షితో మాట్లాడుతూ.. చంద్రబాబు పర్యటన సందర్భంగా టీడీపీ కార్యకర్తలు చేసిన దాడిలో పోలీసులు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. అక్కడ వాహనాలను సైతం టీడీపీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా తగులబెట్టారని చెప్పారు. రాళ్లు రువ్విన, నిప్పు పెట్టిన వారందరినీ గుర్తించామన్నారు. ఘటన స్థలిలో సీసీ కెమెరా పుటేజీలను విశ్లేషస్తున్నామని, ఇప్పటికే పలువురిని గుర్తించామని.. మరికొందరు అనుమానితుల కదలికలపై నిఘా పెట్టామన్నారు. చంద్రబాబు రూట్ ప్లాన్ మార్పు వ్యవహారం కూడా విచారణలో తేలుతుందన్నారు. చంద్రబాబు చేసిన రెచ్చగొట్టే ప్రసంగాలపై కూడా దృష్టి పెట్టామని చెప్పారు. -
చంద్రబాబు ఏ1గా కేసు నమోదు చేస్తాం
రాజమహేంద్రవరం రూరల్: పుంగనూరులో రెచ్చగొట్టేలా మాట్లాడి విధ్వంసానికి కారకుడైన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఏ1గా కేసు నమోదు చేస్తామని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత తెలిపారు. కలెక్టరేట్ ఆవరణలో శనివారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలీసులపై టీడీపీ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలనే ఉద్దేశంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు ముందే నిర్ణయించిన షెడ్యూల్ రూట్లో వెళ్లకుండా, ఎందుకు పుంగనూరులోకి ప్రవేశించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఇది శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలనే కుట్రేనని అన్నారు. బీరు బాటిళ్లు, రాళ్లు, కర్రలు వారికి అప్పటికప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. ఈ ఘటనలో పోలీసులు సహా 50 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయన్నారు. గాయపడిన పోలీసులకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. పోలీసులు సంయమనంతో వ్యవహరించారని చెప్పారు. పోలీసులపై దాడి, పోలీసు వాహనాల విధ్వంసాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 40 మందిని అదుపులోకి తీసుకున్నామని.. సీసీ పుటేజ్, ఇతర ఆధారాలు పరిశీలిస్తున్నామని, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. -
పక్కా ‘ఎల్లో’ స్కెచ్.. ‘పచ్చ’ నేతల కనుసన్నల్లోనే..
చిత్తూరు అర్బన్: పుంగనూరు బైపాస్ రోడ్డు వద్ద విధ్వంసకాండకు టీడీపీ రెండు రోజుల ముందే వ్యూహ రచన చేసిందా? ఇందులో భాగంగానే పలుమార్లు రూట్ మ్యాప్‌ను మార్చారా? కృష్ణదేవరాయ కూడలి వద్ద ముందుగానే రాళ్లు పోగేసుకున్నారా? సమీపంలోని పంట పొలాల్లోకి ఖాళీ మద్యం సీసాలను తీసుకొచ్చి దాచారా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎలాగైనా సరే అల్లర్లు సృష్టించి, రాజకీయ లబ్ధి పొందాలని పన్నాగం పన్నారని స్పష్టమవుతోంది. టీడీపీ పెద్దల సూచన మేరకు కొందరు నేతలు, కార్యకర్తల కనుసన్నల్లో ఈ వ్యూహం రూపొందిందని ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలుస్తోంది. ముందుగా రూపొందించిన వ్యూహం మేరకు చంద్రబాబు నాయుడు నుంచి వచ్చిన అధికారిక పర్యటన రూట్ మ్యాప్‌లో పుంగనూరు పట్టణంలో ఎలాంటి కార్యక్రమం లేదు. అయినప్పటికీ పుంగనూరు పట్టణంలోకి చంద్రబాబు రావడానికి పట్టుపట్టాలని, అందుకు పోలీసులు ఒప్పుకోరని.. అప్పుడు పోలీసులపై రాళ్లు రువ్వాలన్నది ముందస్తు వ్యూహం. ఇందులో భాగంగా ముందురోజు కొన్ని వాహనాల్లో రాళ్లను తీసుకొచ్చి కృష్ణదేవరాయుల కూడలి సమీపంలో అక్కడక్కడ పోసి ఉంచారు. బార్లు, మద్యం షాపుల నుంచి ఖాళీ బీరు సీసాలు, మద్యం బాటిళ్లను తీసుకొచ్చి సమీపంలోని పొలం వద్ద దాచారు. పరిస్థితిని బట్టి ఉపయోగించాలని కొన్ని బాటిళ్లల్లో పెట్రోలు నింపుకొచ్చి అక్కడ ఉంచారు. చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికేందుకు తీసుకొచ్చిన 50కి పైగా పెద్ద సైజు పేలుడు పదార్థాల ఉండలను (బాంబుల్లాంటివి) ఓ ప్రదేశంలో దాచారు. శుక్రవారం సదుం, పులిచెర్ల, సోమల మండలాల నుంచి పలువురిని కిరాయికి తీసుకొచ్చి జన సమూహంలో కలిపేశారు. అంగళ్లలో చంద్రబాబు ఎప్పుడైతే రెచ్చగొట్టే ప్రసంగం చేస్తూ.. ‘పదండి పుంగనూరుకు.. ఆ పుడింగి సంగతి తేలుద్దాం’ అని పిలుపునిచ్చారో ఆ తర్వాత కూడా పలువురు టీడీపీ నేతలు మదనపల్లి నుంచి వస్తూ వస్తూ వారి వాహనాల్లో ఖాళీ మద్యం బాటిళ్లు, రాళ్లు, కర్రలు వేసుకుని వచ్చారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత స్థానిక టీడీపీ ఇన్చార్జ్ చల్లా బాబు బైపాస్ రోడ్డు వద్దకు చేరుకుని, చంద్రబాబును పట్టణంలోకి అనుమతించాలని పట్టుపట్టారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న ప్రతిపక్ష నేత పర్యటనను ఎలా పడితే అలా ఉన్నట్లుండి మార్చడం కుదరదని పోలీసులు చెప్పినా వినిపించుకోలేదు. దీంతో కార్యకర్తల్ని చల్లా బాబు రెచ్చగొట్టాడు. బాటిళ్లు, చెప్పులతో దాడి చల్లా బాబు మాటలతో రెచ్చిపోయిన కార్యకర్తలు.. ఇద్దరు డీఎస్పీలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డారు. గతేడాది కుప్పంలో చంద్రబాబు నాయుడు పర్యటనలో ప్రసంగాలకు ముందస్తు అనుమతిలేదని పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, చిత్తూరు దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ బాబుప్రసాద్ నోటీసులు జారీ చేశారు. ‘నాకే నోటీసులు ఇచ్చే ధైర్యమా? మీ కథ చూస్తా’ అంటూ అప్పుడు చంద్రబాబు సైతం డీఎస్పీలకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు డీఎస్పీలను లక్ష్యంగా చేసుకున్న టీడీపీ శ్రేణులు తొలుత ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, చెప్పులను పోలీసులపైకి విసిరారు. ఇది పద్ధతికాదని పోలీసు అధికారులు నచ్చజెపుతుండగానే ఒక్కసారిగా పక్కనే ఉన్న రాళ్లు విసురుతూ విరుచుకుపడ్డారు. పోలీసులు తేరుకునేలోపే టీడీపీ నేతలు తీసుకొచ్చిన కిరాయి కార్యకర్తలు వందల సంఖ్యలో రాళ్లు, మద్యం బాటిళ్ల వర్షాన్ని కురిపించారు. దీంతో పరిస్థితి అదుపుతప్పింది. పోలీసులు బతిమాలినా వదల్లేదు కొందరు పోలీసులు వద్దని బతిమిలాడుతుంటే వాళ్లను వ్యాను పక్కకు లాక్కెళ్లి పోలీసు లాఠీలు లాక్కుని మరీ చావ బాదారు. టపాకాయ బాంబులను పోలీసులపై విసురుతుంటే ఏం జరుగుతుందో కూడా తెలియని స్థితిలో తమను తాము కాపాడుకునే ప్రయత్నంలో చేతిలో ఉన్న ప్లాస్టిక్ గార్డులను అడ్డుగా పెట్టారు. రాళ్ల దెబ్బకు అవన్నీ ధ్వంసమయ్యాయి. అంతటితో ఆగక పోలీసుల వాహనాలపైకి టపాకాయ బాంబులు విసురుతూ.. ముందుగా తెచ్చుకున్న పెట్రోలును వాటిపై పోసి నిప్పంటించారు. రాళ్ల దెబ్బలతో రక్తమోడుతున్న పోలీసులను చూసి మానవత్వం లేకుండా దాదాపు 40 నిమిషాల పాటు ఏకధాటిగా రాళ్లు, బాటిళ్లను విసురుతూ పచ్చ మూకలు పైశాచిక ఆనందం పొందాయి. కీలకపాత్రధారి చల్లా బాబు – మీడియాతో డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ రిషాంత్ పుంగనూరులో జరిగిన అల్లర్లు, పోలీసులపై దాడులు మొత్తం ముందస్తు ప్లాన్ ప్రకారం జరిగినవేనని రాయలసీమ డీఐజీ అమ్మిరెడ్డి, చిత్తూరు ఎస్పీ రిషాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం చిత్తూరులోని పోలీసు అతిథి గృహంలో వారు మీడియాతో మాట్లాడారు. పుంగనూరులో టీడీపీ మూకలు పోలీసులపై ఎలా దాడులకు పాల్పడ్డాయో వీడియో ద్వారా చూపించారు. కొన్నిచోట్ల పోలీసులు బతిమాలుతున్నా వినిపించుకోకుండా, వాళ్ల లాఠీలు లాక్కుని పోలీసుల్నే కొట్టారని చెప్పారు. వాహనాలపైకి టపాకాయ బాంబులు వేయడంతోపాటు, పెట్రోలు పోసి నిప్పంటించారని చెప్పారు. అసలు చంద్రబాబు నాయుడు ఇచ్చిన షెడ్యూల్ మేరకు పుంగనూరు పట్టణంలో ఆయన పర్యటనే లేదని, స్థానిక టీడీపీ ఇన్చార్జ్ చల్లా బాబు ఉద్దేశ పూర్వకంగా ప్లాన్ చేసి గొడవలు సృష్టించారన్నారు. బాబును పుంగనూరులోకి అనుమతించాలని పార్టీ శ్రేణులను రెచ్చగొట్టి పోలీసులపై దాడులు చేయించారని చెప్పారు. ప్రజల ప్రాణ, మాన, ఆస్తులను కాపాడడమే లక్ష్యంగా పోలీసులు ధైర్యంగా నిలబడి అల్లరి మూకలు పుంగనూరులోకి ప్రవేశించకుండా అడ్డుగా నిలబడ్డారని తెలిపారు. దెబ్బలు తగిలి రక్తం కారుతున్న వేళ, పోలీసుల వద్ద ఆయుధాలు ఉన్నప్పటికీ సంయమనం పాటించారన్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పోలీసులు విధులు నిర్వర్తించి ధైర్య సాహసాలు ప్రదర్శించారని ప్రశంసించారు. ఈ దాడుల్లో పుంగనూరు టీడీపీ ఇన్చార్జ్ చల్లా బాబు కీలక పాత్రధారిగా కేసు నమోదు చేశామన్నారు. విధుల్లో ఉన్న పోలీసులను చంపాలని చూడడం, పోలీసు వాహనాలు ధ్వంసం చేయడం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని చెప్పారు. ప్రస్తుతం 40 మందిని అరెస్టు చేశామని, మరికొందరిని అరెస్టు చేయాల్సి ఉందన్నారు. చివరకు చిల్లర గొడవలే దిక్కా!? ముందస్తు మేనిఫెస్టో, లోకేశ్ పాదయాత్ర.. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా టీడీపీ తేరుకునే అవకాశాలు లేకపోవడంతో చంద్రబాబు చివరకు తనకు అలవాటైన ఘర్షణలనే నమ్ముకున్నారని పుంగనూరు ఘటన స్పష్టం చేస్తోంది. ప్రజాదరణ లేదని తేలిపోవడంతో రోడ్‌షోలతో వీధి గొడవలకు దిగుతున్నారు. ప్రాజెక్టుల సందర్శన ముసుగులో పర్యటిస్తున్న చంద్రబాబు అసలు ఆ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. అంతిమ లక్ష్యం రెచ్చగొట్టి ఘర్షణలకు పురిగొల్పడమేనని స్పష్టమవుతోంది. తన పర్యటనలను యుద్ధభేరిగా మార్చుకోవటాన్ని బట్టే వాస్తవాలు బహిర్గతమవుతున్నాయి. ఇందులో భాగంగానే రాయలసీమలో గొడవలు సృష్టించేందుకు ఒక పథకం ప్రకారం చంద్రబాబు పర్యటనల ద్వారా డిజైన్ చేసినట్లు స్పష్టమవుతోంది. తొలుత పులివెందులలో కూడా ఇలానే రెచ్చగొట్టి గొడవ సృష్టించడానికి విఫలయత్నం చేయడం తెలిసిందే. వాస్తవానికి పులివెందులలో టీడీపీకి దిక్కులేదు. అందుకే కిరాయి జనంతో రోడ్‌షో నిర్వహించి హడావుడి చేశారు. అనుకున్న లక్ష్యం నెరవేరక పుంగనూరుపై దృష్టి సారంచి, గొడవ సృష్టించడంలో సఫలమయ్యారు. -
పుంగనూరులో టీడీపీ శ్రేణుల విధ్వంసంపై నిరసన
-
పుంగనూరు ఘటనకు చంద్రబాబే కారణం: మంత్రి పెద్దిరెడ్డి
-
అధికారం కోసం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు...!
-
సిగ్గులేని రామోజీ, చివరికి ఇందులో కూడా విష ప్రచారమా!
-
రక్తపాతం లక్ష్యంగా చంద్రబాబు స్కెచ్.. రాజంపేట టీడీపీ అభ్యర్థి నరహరి కారులో గన్
చంద్రబాబుది మొదటి నుంచి హింసావాదమే. ప్రాజెక్టుల పర్యటనల ముసుగులో హింసకు స్కెచ్ వేశారు. రెచ్చగొట్టి ప్రజల్లో విభజన తెచ్చి రాజకీయంగా లబ్ధి పొందాలనే వ్యూహం రచించారు. పలమనేర్ బై పాస్‌లో వెళ్లకుండా.. పుంగనూర్కు రూట్ ఎందుకు మార్చాడు.. చంద్రబాబు రూట్ మార్చడం వెనుక భారీ కుట్ర ఉంది. కావాలనే టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి దాడులకు పాల్పడేలా చంద్రబాబు చేశారు. చిత్తూరు అర్బన్/ బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లా రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గంటా నరహరి కారు డ్రైవర్ గుర్మిత్ సింగ్(38)పై ముదివేడు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మదనపల్లె రూరల్ సీఐ శివాంజనేయులు కథనం ప్రకారం.. చంద్రబాబు పర్యటన సమయంలో కడప వైపు నుంచి అంగళ్లుకు నరహరి కారు వేగంగా వచ్చింది. కడప రోడ్డులోని పెట్రోలు బంకు వద్ద తంబళ్లపల్లె మండలం కన్నెమడుగుకు చెందిన ఎంపీటీసీ మహేష్‌పైకి దూసుకొచ్చింది. మహేష్ హెచ్చరికతో కారు ఆగింది. అంత వేగమెందుకని మహేష్ నిలదీయగా.. ఆగ్రహించిన గురుమిత్‌సింగ్ కారులోంచి డబుల్ బ్యారల్ గన్ తీసి కాల్చుతానంటూ బెదిరించారు. దీంతో మహేష్ ముదివేడు పోలీసులకు చెప్పగా వారు కారును తనిఖీ చేశారు. చదవండి: ‘పచ్చ’మూకలకు ఎదురొడ్డి.. పేకాట పెట్టెలు, వెనుకవైపు కింద డబుల్ బ్యారల్ గన్, సీటు కవర్లో ఎనిమిది తూటాలు కలిగిన ప్యాకెట్ లభించాయి. వీటితోపాటు కారును స్వా«దీనం చేసుకుని ముదివేడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాధితుడు మహేష్ ఫిర్యాదు మేరకు డ్రైవర్ గుర్‌మిత్‌సింగ్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. అంతా వ్యూహాత్మకం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్ఎస్జీ కమాండోల రక్షణలో జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న టీడీపీ నేత చంద్రబాబు ఎక్కడైనా పర్యటించాలంటే 24 గంటల ముందుగా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఎస్‌వో) నుంచి ఇంటెలిజెన్స్ విభాగానికి రోడ్ మ్యాప్ ఇవ్వాలి. అప్పుడు జిల్లా పోలీసుశాఖ ముందుగా రూట్ మ్యాప్‌లో ఉన్న కల్వర్టులు, శివారు ప్రాంతాలు, అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతుంది. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్), ఆర్మ్డ్ రిజర్వు దళాలు చంద్రబాబు కార్యక్రమం జరిగే రూట్ మ్యాప్‌లో భద్రతా చర్యలు, ముందస్తు తనిఖీలు చేపడతారు. కానీ చిత్తూరు జిల్లా పర్యటనకు సంబంధించి చంద్రబాబు నుంచి పోలీసులకు అందిన రూట్ మ్యాప్ ఒకలా ఉంటే.. దాన్ని కాదని పుంగనూరులోకి పర్యటనను మారుస్తూ మరో దారిని ఎంచుకోవడం రాజకీయంగా లబ్ధి పొందే వ్యూహమేనని స్పష్టమవుతోంది. మదనపల్లె నుంచి పుంగనూరు బైపాస్ మీదుగా చంద్రబాబు నాయుడు చిత్తూరు శివారుల్లోని బాన్స్ హోటల్‌కు వెళతారని బుధవారం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి నుంచి పోలీసులకు సమాచారం అందింది. గురువారం రాత్రి కూడా పర్యటనలో మార్పులు చేస్తూ.. పుంగనూరు బైపాస్ మీదుగానే వెళ్లిపోతారని చెప్పారు. తీరా శుక్రవారం సాయంత్రం పుంగనూరులోకి ప్రవేశించడానికి విఫలయత్నం చేస్తూ విధ్వంసం సృష్టించారు. -
టీడీపీ...పచ్చ గూండాల ఫ్యాక్టరీగా మారిందా ?
-
పుంగనూరు విధ్వంసానికి చంద్రబాబే కారణం: మంత్రి అంబటి
సాక్షి, అమరావతి: పుంగనూరు విధ్వంసానికి చంద్రబాబే కారణమని జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. సత్తెనపల్లి వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయం నుంచి మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక రాయలసీమకు ద్రోహం చేశారనే దుష్ప్రచారం చేసేందుకు చంద్రబాబు పుంగనూరుకి వెళ్ళారని తెలిపారు. ఆ ప్రాంతంలో హింసను ప్రోత్సహించి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో పుంగనూరు, తంబళ్లపల్లె, మదనపల్లి, పీలేరు ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు రాయలసీమలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రారంభించిందని.. భారీ నీటి ప్రాజెక్టులతో పాటు పలు చిన్న-చిన్న డ్యామ్‌లను కూడా కడుతున్నామని అన్నారు. ఈ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు చంద్రబాబు గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్లి స్టే తెచ్చారు.. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న అక్కడి ప్రజలు ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నించారని చెప్పారు. పోలీసులు కూడా పుంగనూరు రావొద్దని చెప్తే మొదట చంద్రబాబు అంగీకరించారని, పుంగనూరు ఊరిలోకి కాకుండా బైపాస్‌లో వెళ్లేందుకు ఒప్పుకున్నారని అన్నారు. చివరిలో పుంగనూరు వెళ్తానని బాబు పట్టుబట్టడంతో తప్పని పరిస్థితుల్లో పోలీసులు అడ్డుకున్నారని వెల్లడించారు. దీంతో అడ్డుకున్న పోలీసులపై రాళ్ళు, బీరు బాటిల్స్ తో దాడి చేయించారని మండిపడ్డారు. చదవండి: టీడీపీ విధ్వంసాన్ని నిరసిస్తూ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా బంద్ -
చిత్తూరులో టీడీపీ కార్యకర్తల వీరంగం.. పోలీసులనే రక్తం కారేలా..
పుంగనూరు: చిత్తూరు రోడ్ షోలో చంద్రబాబు టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టడంతో వారంతా రెచ్చిపోయి ప్రశాంతంగా ఉండే పుంగనూరులో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు. రోడ్ షోకు బందోబస్తు నిర్వహించి రక్షణ కల్పించడానికి వచ్చిన పోలీసులపైనే విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. ఇష్టమొచ్చినట్టు రాళ్లు రువ్వారు, వాహనాలకు నిపు పెట్టారు, అక్కడున్న వారంతా టీడీపీ కార్యకర్తల వీరంగాన్ని బెంబేలెత్తిపోయి ఇళ్లల్లోకి వెళ్లి దాక్కున్నారు. పాపం పోలీసులు మాత్రం వీధిలో భాగంగా వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారిపై రక్తమోడేలా హింసాత్మక దాడులు చేశారు. అల్లర్ల గురించి పోలీస్ అధికారుల సంఘం ప్రెసిడెంట్ ఉదయ్ మీడియాకు వివరిస్తూ.. టీడీపీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగానే దాడులు చేశారన్నారు. పుంగనూరులో ప్రశాంతతకు విఘాతం కలిగించి విధ్వంసం సృష్టించాలనే లక్ష్యంతోనే అల్లర్లు జరిగాయి. వాస్తవానికి వారికి ఆ మార్గంలో రావడానికి అనుమతే లేదు. అయినా కూడా టీడీపీ కార్యకర్తలు ఇదే మార్గాన్ని ఎంచుకుని ఇక్కడికి చొరబడ్దారు. వారు చేసిన దాడుల్లో సామాన్యులతో పాటు పోలీసులు కూడా తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. చంద్రబాబు రోడ్ షో గురించి ప్రకటించగానే అల్లర్ల సృష్టించాలని వారు ముందే పథకం రచించారు. పథకం ప్రకారమే వారు తమ వెంట ఆయధాలను తెచ్చుకున్నారు. వారు దాడులు చేస్తున్నా ప్రతిదాడి చేయకుండా నచ్చజెప్పే ప్రయత్నం చేసి పోలీసులు సహనాన్ని పాటించారు. ముఖ్యంగా గాయపడిన పోలీసులు ఎంతో సంయమనాన్ని పాటించారన్నారు. తామే దాడి చేసి పోలీసులు తమపై దాడి చేశారంటూ ఎదురు ఆరోపణలు చేస్తుండడం శోచనీయం. పోలీసులు రెచ్చగొట్టారనేది పూర్తిగా అవాస్తవం. మేము పోలీసులం.. మాకు అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా ఒక్కటే. ఎవ్వరికైనా రక్షణ కల్పించడమే మా కర్తవ్యం. మేం చట్టప్రకారం విధులు నిర్వహిస్తున్నాం. శాంతిభద్రతలను కాపాడడమే మా లక్ష్యం. ఎవరి కార్యక్రమాలకైనా విధిగా మేం భద్రతగా కల్పిస్తాం. అది మా బాధ్యతని గుర్తు చేశారు. రక్షణ కల్పించే మాపైనే వారు దాడి చేసి గాయపరిచారు. ఎంతగా అడ్డుకునే ప్రయత్నం చేసినా వినిపించుకోకుండా విధ్వంసం సృష్టించేందుకే ప్రయత్నించారు. తోటి కార్యకర్తలను రెచ్చగొట్టి గొడవ చేసేందుకు ఉసిగొల్పారు. సంఘటన గురించి తెలియగానే డీజీపీ వెంటనే విచారణకు ఆదేశించారన్నారు. గాయపడిన పోలీసుల్లో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ ఘటనలో నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తి లేదు. విధి నిర్వహణలో ఆంధ్ర పోలీసులు ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి ఘటనల్లో కఠినంగా వ్యవహరించాలి. రాజకీయాలకు అతీతంగా అందరూ ఈ ఘటనను ఖండిచాలి. ఈ కేసును ప్రత్యేక కోర్టు ద్వారా విచారించాలని నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చూడాలన్నారు. చట్టం దృష్టిలో అందరూ సమానమే. ఎంతటివారైనా చట్టాన్ని గౌరవించాలి. కిందిస్థాయి వారికి పై స్థాయిలోని వారే చెప్పాలని అన్నారు చిత్తూరు జిల్లా పోలీస్ అధికారుల సంఘం ప్రెసిడెంట్ ఉదయ్. ఇది కూడా చదవండి: పుంగనూరు ఘటనపై విచారణకు డీజీపీ ఆదేశం -
టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వారికి పెద్దిరెడ్డి పరామర్శ