Who Are The 2000 Non Locals At The Punganur Incident Site On Friday, Details Inside - Sakshi
Sakshi News home page

Punganur Incident: పుంగనూరు అల్లర్లు, ఆ 2 వేల మంది ఎవరు?

Published Thu, Aug 10 2023 4:30 AM | Last Updated on Thu, Aug 10 2023 10:45 AM

A large number of non locals arrived at Punganur for incident - Sakshi

సాక్షి, తిరుపతి: పుంగనూరు ఘటనాస్థలిలో శుక్ర­వారం ఉన్న రెండువేల మంది స్థానికేతరులు ఎవ­రు? వారు ఎందుకోసం వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? అదేరోజు అంతమంది అక్కడికి రావలసి­న అవసరం ఏమిటి? ఈ ప్రశ్నలు చిత్తూరు పోలీసు­ల మదిని తొలుస్తున్నాయి. ప్రాజెక్టుల పరిశీలన పేరుతో చంద్రబాబు ఈ నెల 4, 5వ తేదీల్లో చిత్తూరు, తిరుపతి జిలాల్లో పర్యటించిన విషయం తెలిసిందే.

అన్నమయ్య జిల్లా అంగళ్లులో శుక్రవారం గొడవకు కారణమైన చంద్రబాబు.. కొద్ది గంటలైనా గడవకముందే చిత్తూరు జిల్లా పుంగనూరులో మారణహోమానికి కుట్రపన్నారు. ఆ మారణహో­మంలో టీడీపీ శ్రేణులే కాకుండా అల్లరి మూకలు, గూండాలు కూడా పాలుపంచుకున్నారు. టీడీపీ శ్రేణులు కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన వారు రెండువేల మందికిపైగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఆ రోజు ఘటన స్థలంలో దాదాపు ఐదు వేల సిమ్‌ (సెల్‌ఫోన్లు)లు ఆన్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిలో పోలీ­సులు, టీడీపీ శ్రేణులు, స్థానికులు కలిపి మూడువేల మంది వరకు ఉండొచ్చనే నిర్ణయానికి వచ్చారు. వీరుకాకుండా మిగ­తా రెండువేలమందికిపైగా స్థానికేతరులు అక్క­డు­న్నట్లు వారి సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ను బట్టి తెలు­స్తోంది. స్థానికేత­రులు ఇంత పెద్దసంఖ్యలో పుంగనూరు వద్దకు రావలసిన అవసరం ఏమిటనే కోణంలో విచారణ చేపట్టినట్లు విశ్వసనీయ సమాచారం.

పుంగనూరుపై బాబు అక్కసు
సీఎం జగన్‌ ఆదేశాలతో చంద్ర­బాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో మంత్రి పెద్ది­రెడ్డి పల్లెబాట పేరుతో ఊరూరా.. వీధివీధి తిరుగుతూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది, సంక్షేమపథకాల గురించి ప్రజ­ల్లో అవగాహన కల్పిస్తున్నారు. చంద్రబాబు కుప్పా­ని­కి చేస్తున్న ద్రోహం గురించి వివరి­స్తున్నారు. వాస్త­వా­లను గ్రహించిన కుప్పం వాసుల్లో మార్పు మొద­లైం­ది.

మొన్నటి మున్సిపల్‌ ఎన్నికలే ఇందుకు నిదర్శ­నం. ఈ పరిణామాలను గమనించిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో కుప్పంలో ఓటమి తప్ప­దనే భయంతో సీఎం వైఎస్‌ జగన్‌ను, మంత్రి పెద్దిరెడ్డిని టార్గెట్‌ చేశారు. ఇందులో భాగంగా పుంగనూరులో పర్యటించి అలజడి సృష్టించాలని నిర్ణ­యి­ంచుకున్నా­రు. అయితే స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పోలీసులు అను­మతి ఇవ్వలేదు.

అం­దుకు గల ప్రధాన కారణం.. పడమటి ప్రాంతాల సాగు, తాగునీటి అవసరాల కోసం ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఆవులపల్లి, నేతి­గుంటపల్లి, ముది­వేడు రిజర్వాయర్లను చంద్ర­బాబు అండ్‌ కో అడ్డుకున్నారు. కోర్టు నుంచి స్టే తీసు­కు­రావటంపై స్థానికులు జీర్ణించుకోలేకపోతు­న్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వస్తే నిలదీ­యా­­ల­ని నిర్ణయించుకున్నారు. ఈ విష­యం చంద్ర­బాబు అండ్‌ కోకూ తెలుసు. ఇదే అదనుగా చంద్ర­బాబు మారణ­హోమానికి పథకం వేసినట్లు తెలిసింది.

రైతు వినతితో భగ్గుమన్న బాబు
మూడు రిజర్వాయర్లపై వేసిన కేసును వెనక్కు తీసు­కోమని ఉమాపతిరెడ్డి అనే రైతు అంగళ్లు వద్ద చంద్రబాబుకు వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయ­త్నం చేశారు. ఇదే అవకాశంగా చేసుకున్న చంద్ర­బాబు ఉమాపతిరెడ్డిని నానా బూతులు మాట్లాడి, టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టారు. ‘తరమండిరా.. కొట్టండిరా నా కొడుకులను..’ అంటూ హుకుం జారీచేశా­రు. అధి­నేత ఆదేశాలతో టీడీపీ గూండా­లు రెచ్చి­పోయారు. అక్కడి నుంచే పుంగనూరు వద్ద వేచి ఉన్న టీడీపీ నేతలు, కిరాయి గూండాలకు సమా­చారం ఇచ్చారు. అల్లరిమూకలు బాబు రాగానే రెచ్చిపోయాయి.

ముందు రోజే మదనపల్లిలో తిష్ఠ
విధ్వంసానికి ముందు రోజు రాత్రే అంతే గురు­వారం రాత్రి టీడీపీ గూండాలు మదనపల్లికి చేరు­కు­న్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ రాత్రి నుంచి 4వ తేదీ ఉదయం 9 గంటల వరకు మదన­పల్లిలో టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన షెల్టర్‌­లలో ఉన్నారు. రాత్రి, ఉదయం మద్యం సేవిస్తూ గడిపారు. ఉదయం 9 గంటలకు టీడీపీ నేతల నుంచి సమాచారం రావటంతో మదన­పల్లి నుంచి పుంగనూరు వద్దకు వెళ్లారు.

సాయంత్రం వరకు వేచి చూసి టీడీపీ నేతల ఆదేశాల మేరకు విధ్వంసానికి పూనుకున్నారు. టీడీపీ శ్రేణులు కాకుండా అద్దె గూండాలే రెండు వేల మందికి పైగా ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తు­­న్నారు. వీరంతా కర్ణాటక, తమిళ­నాడుకు చెందిన వారా? ఏపీకి చెందిన వారా? అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలిసింది. ఈ రెండు వేల మంది గురించి ఎక్కడా, ఎవ్వరికీ అనుమా­నం రాకుండా టీడీపీ శ్రేణులు సాయంత్రం వరకు జాగ్రత్తలు తీసుకుని విధ్వంసాన్ని అమలు చేశారు. అయితే పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించటంతో టీడీపీ లక్ష్యం నెరవేరలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement