'ప్రభుత్వ జూనియర్ కళాశాల' ట్యాగ్‌లైన్ పుంగనూరు. ఈ పేరుతోనే సినిమాను యూత్ ఆడియన్స్‌కు కనెక్ట్ చేశారు మేకర్స్. ఓ యదార్థ సంఘటన ఆధారంగా, ఆసక్తికరంగా తెరకెక్కిన ఈ చిత్రం తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు శ్రీనాథ్ పులకురం దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇది వరకు విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా అందరినీ ఆకట్టుకుంది.
నిర్మాతగా భువన్ రెడ్డి కొవ్వూరి ఈ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులోని నటీనటులు కొత్తవారు అయినా వారి నుంచి మంచి నటనను రాబట్టుకున్నట్లు టీజర్‌ను చూస్తుంటే అర్థం అవుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ రోడ్రిగ్జ్ అద్భుతమైన మ్యూజిక్‌ను అందించారు. ఇందులో ఒకపాటను ప్రముఖ గాయని చిన్మయి పాడారు. యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా టీనేజ్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థం అవుతుంది.
ఈ సినిమా ఆడియో హక్కులను ఫాన్సీ రేటుకు టీ సిరీస్ తెలుగు సంస్థ దక్కించుకుంది. దీంతోనే చెప్పవచ్చు సినిమాకు మంచి స్కోప్ ఉందని. కార్తీక్ రోడ్రీగుజ్ స్వరాలను అందించగా కమ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించారు. శ్రీ సాయి కిరణ్ లిరిక్స్ రాశారు. నిఖిల్ సురేంద్రన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment