
పదమూడేళ్ల వయసులోనే నాటకాల్లో నటించడం మొదలుపెట్టింది అన్నపూర్ణ. చిన్న వయసులోనే వెండితెరపై సందడి చేసింది. కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో రాణిస్తోంది. ప్రస్తుతం బామ్మ పాత్రలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూ అన్నపూర్ణమ్మగా పేరు గడించింది. అయితే ఆమె ఆడవాళ్లను కించపరుస్తూ మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఎక్స్‌పోజింగ్ ఎక్కువైంది
'అర్ధరాత్రి స్వతంత్రం అనగానే ఆరోజుల్లో ఆడవాళ్లు బయటకు వచ్చేవాళ్లా? ఆడదానికి ఎందుకు స్వాతంత్య్రం కావాలి? రాత్రి 12 గంటల తర్వాత ఏం పని? ఇప్పుడు ఎక్స్‌పోజింగ్ ఎక్కువైపోయింది. ఎవరూ మనల్ని ఏమీ అనొద్దు అనుకున్నా.. అందరూ మనల్ని ఏదో ఒకటి అనేట్లుగానే రెడీ అవుతున్నాం. ఎప్పుడూ ఎదుటివాళ్లది తప్పు అనకూడదు. మనవైపు కూడా కొంచెం ఉంటుంది' అని చెప్పుకొచ్చింది. సదరు వీడియో క్లిప్పింగ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ తన వ్యాఖ్యలను ఖండించింది చిన్మయి.
ఆమె అలా మాట్లాడుతుంటే..
'నేను ఆమెకు పెద్ద అభిమానిని. ఆమె ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తపరుస్తుంటే నా గుండె ముక్కలైనట్లు అనిపిస్తోంది. ఫేవరెట్ అనుకున్నవాళ్లు ఇలా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాను. ఆమె చెప్పినదాని ప్రకారం.. ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా, యాక్సిడెంట్ అయినా సూర్యోదయం, సూర్యాస్తమయానికి మధ్యలోనే జరగాలి. ఆ తర్వాత లేడీ డాక్టర్స్, నర్సులు ఉండకూడదు.
అర్ధరాత్రి పిల్లలు పుట్టకూడదు
మనందరికీ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి ఆస్పత్రికి వెళ్లినా ఆమె చెప్పినట్లు రాత్రిపూట మహిళా డాక్టర్లే ఉండొద్దు. రాత్రి 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మగ డాక్టర్లే ఉంటారు. కాబట్టి ఒంట్లో బాగోలేకపోయినా రాత్రి ఆస్పత్రిలో ఉండకూడదు. ఆమె చెప్పిన రూల్ ప్రకారం పిల్లలు కూడా అర్ధరాత్రి పుట్టకూడదు. ఎందుకంటే గైనకాలజిస్టులు ఉండరు, ఉండకూడదు కాబట్టి! జోక్స్ పక్కనపెడితే ఇంట్లో వాష్‌రూమ్స్ లేక సూర్యోదయానికి ముందు పొద్దున్నే 3 గంటలకు లేచి పొలం గట్టుకు వెళ్తున్న ఆడవాళ్లు ఇంకా ఉన్నారు.
అమ్మాయిలుగా పుట్టడం మన కర్మ
ఇప్పటికీ చాలా ఊర్లలో బాత్రూమ్సే లేవు. ఇలాంటి సందర్భాల్లో కూడా ఆడవాళ్లు ఎప్పుడు వస్తారా? వాళ్లపై ఎప్పుడు అఘాయిత్యానికి పాల్పడుదామా? అని ఎదురుచూస్తున్నవాళ్లు ఈ సమాజంలో ఉన్నారు. అయినా అమ్మాయిల వేషధారణ వల్లే ఈ అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. భారత్‌లో అమ్మాయిలుగా పుట్టడం మన కర్మ' అని ఆగ్రహం వ్యక్తం చేసింది చిన్మయి.
చదవండి: తనకెందుకు క్రెడిట్? అని ఆటిట్యూడ్ చూపించా.. తర్వాతి సినిమాల్లో నాకు ఛాన్స్ ఇవ్వలే!
Comments
Please login to add a commentAdd a comment