
చిన్మయి శ్రీపాద.. ఎన్నో హిట్ సాంగ్స్ పాడింది. కొంతమంది హీరోయిన్లకు గొంతు కూడా అరువిచ్చింది. సోషల్ మీడియాలోనూ తన గొంతు బలంగానే వినిపిస్తూ ఉంటుంది. ఎటువంటి వివాదాస్పద గొడవపైనా స్పందించేందుకు వెనుకాడదు, తన సమాధానం బలంగా వినిపిస్తుంది. మరీ ముఖ్యంగా మహిళల హక్కుల కోసం ఎప్పుడూ ప్రశ్నిస్తూ ఉంటుంది.
తాజాగా చిన్మయి ఓ ఆసక్తికర వీడియోను షేర్ చేసింది. రోబో సినిమాలో తను పాడిన కిలిమాంజారో పాటను మళ్లీ పాడింది. అందులో స్పెషల్ ఏముందనుకుంటున్నారా? మాసై తెగల గుంపుతో కలిసి ఈ పాట పాడుతూ వారితో కలిసి డ్యాన్స్ చేసింది. ఇది చూసిన అభిమానులు ఆ పాట మాకు ఇప్పటికీ ఫేవరెట్.. మీరు వారితో కలిసిపోయే విధానం చాలా బాగుంది అని కామెంట్లు చేస్తున్నారు.
Kilimanjaro with Maasai ! pic.twitter.com/uwI5EVTjwi
— Chinmayi Sripaada (@Chinmayi) November 17, 2023
చదవండి: 21 ఏళ్లకే విడాకులు.. జీవితంపై విరక్తి.. డిప్రెషన్.. చనిపోదామనుకున్నా..
Comments
Please login to add a commentAdd a comment