
ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద కవలలకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను అటు చిన్మయితో పాటు అటు ఆమె భర్త రాహుల్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. మా ఇంట్లోకి ద్రిపత్, శ్రావస్ అడుగుపెట్టారంటూ సంతోషం వ్యక్తం చేశారు. అయితే పలువురు నెటిజన్లు చిన్మయి ఇంతకాలం తాను గర్భవతి అన్న విషయాన్ని దాచిపెట్టిందా? లేదా సరోగసి ద్వారా పిల్లలకు జన్మనిచ్చిందా? అని రకరకాలుగా ప్రశ్నిస్తున్నారు. దీంతో వాటన్నింటికీ సమాధానమిస్తూ ఓ పోస్ట్ షేర్ చేసింది సింగర్.
ఇందులో ఆమె ఏం రాసుకొచ్చిందంటే.. చాలామంది నేను సరోగసి ద్వారా కవలలను కన్నానా? అని అడుగుతున్నారు. విషయమేంటంటే.. నేను గర్భవతిగా ఉన్నప్పటి నుంచి నా ఫొటోలను ఏ ఒక్కటి కూడా బయటకు రానివ్వలేదు. చాలాకొద్ది మందికే ఈ విషయం తెలుసు. నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికే ఇలా చేశాను. నా వ్యక్తిగత విషయాలను నేను ఎప్పుడూ బహిర్గతం చేయలేదు. పిల్లల ఫొటోలు కూడా కొంతకాలం వరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేయను. ఇంకో విషయం చెప్పనా.. నాకు సిజేరియన్ చేసేటప్పుడు నేను భజన పాట పాడాను అని చెప్పుకొచ్చింది. కాగా, రాహుల్, చిన్మయిలది ప్రేమ వివాహం. 2014లో వీరి పెళ్లి జరిగింది. ప్లేబ్యాక్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్టుగా పేరు సంపాదించిన చిన్మయి మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటుంది. అటు రాహుల్ వెండితెరపై నటుడిగా అలరిస్తున్నాడు.
చదవండి: పండంటి కవలలకు జన్మనిచ్చిన సింగర్ చిన్మయి
‘కెప్టెన్’ విజయకాంత్ కాలివేళ్లు తొలగింపు, రజనీకాంత్ ట్వీట్
Comments
Please login to add a commentAdd a comment