'అలాంటి వారిని అంటే సమాజమే ఒప్పుకోదు'.. బాలకృష‍్ణ వివాదంపై సింగర్‌ ట్వీట్ | Singer Chinmayi Sripada Responds On Balakrishna Misbehaviour With Anjali | Sakshi
Sakshi News home page

Chinmayi: 'ఆమె నవ్వును చూడండి.. మీకేందుకు ఇదంతా'.. సింగర్‌ చిన్మయి ట్వీట్‌

Published Thu, May 30 2024 9:17 PM | Last Updated on Fri, May 31 2024 9:37 AM

Singer Chinmayi Sripada Responds On Balakrishna Misbehaviour With Anjali

టాలీవుడ్‌ హీరో నందమూరి బాలకృష్ణ.. హీరోయిన్‌ అంజలి పట్ల వ్యవహరించిన తీరు టాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీసింది. మహిళలంటే ఆయననకు ఎంత చులకనో అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియా వేదికగా బాలయ్య తీరుపై నెటిజన్స్ సైతం మండిపడుతున్నారు. అయితే గతంలోనూ బాలయ్య నోటీ దురుసుతో ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేయడం చాలాసార్లు జరిగింది. తాజాగా ఈ వివాదంపై సింగర్, ఫెమినిస్ట్‌ చిన్మయి శ్రీపాద స్పందించారు. ఈ అంశంపై తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు.

చిన్మయి తన ట్వీట్‌లో రాస్తూ.. 'ఈ వీడియోను షేర్ చేస్తున్న వారిలో నేను గమనించిన అతిపెద్ద సమస్యల్లో ఇది ఒకటి. ఆమె నవ్వు వైపు చూడండి. ఆమెకు ఉండాలి కదా.  ఇలాంటివీ చూసినప్పుడు ప్రేక్షకుల రియాక్షన్‌పై స్పందించడం సాధ్యం కాదు. ఎందుకంటే ఇది మోరల్ పోలీసింగ్ కంటే పవిత్రమైంది. హరిశ్చంద్ర, శ్రీరామచంద్రమూర్తి లేదా వారి బంధువుల అవతారాలు అర్థం చేసుకోకపోవడం పొరపాటే అవుతుంది. పవర్‌లో ఉన్న వారిని తప్పుగా చూపేందుకు ఈ సమాజమే ఒప్పుకోదు. ముఖ్యంగా డబ్బు, కులం, రాజకీయ బలం నుంచి వచ్చిన వారిని. అయినా ఇందులో మీకు ఎలాంటి నష్టం లేనప్పుడు.. మహిళలకు ఎలా ప్రవర్తించాలో చెప్పకండి.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్‌ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement