హీరోయిన్‌ని తోసేసిన బాలకృష్ణ.. అందరిముందు మద్యం తాగుతూ! | Balakrishna Inappropriate Behaviour With Actress Anjali In Gangs Of Godavari Pre Release Event, Video Viral | Sakshi
Sakshi News home page

Balakrishna: బాలకృష్ణ అనుచిత ప్రవర్తన.. ఎ‍ప్పుడు మారతాడో ఏంటో?

Published Wed, May 29 2024 11:35 AM | Last Updated on Wed, May 29 2024 2:24 PM

 Balakrishna Behaviour With Anjali In Gangs Of Godavari Pre Release Event

హీరో బాలకృష్ణ మరోసారి అనుచితంగా ప్రవర్తించారు. స్టేజీపై తన పక్కనే నిలబడి ఉన్న హీరోయిన్ అంజలిని తోసేశారు. అయితే ఆమె తమాయించుకుని నిలబడింది. అదే టైంలో లోపల ఇబ్బందిగా ఉన్నప్పటికీ బయటకు నవ్వుతూ కవర్ చేసింది. ఇప్పుడు ఇది కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

(ఇదీ చదవండి: నన్ను వాళ్లు మోసం చేశారు: నటుడు జగపతిబాబు)

విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమా మే 31న థియేటర్లలోకి రాబోతుంది. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్‌గా వచ్చిన బాలకృష్ణ చాలా చీప్‌గా ప్రవర్తించాడు. హీరోయిన్ అంజలిని నెట్టేయడంతో పాటు అందరిముందు వాటర్ బాటిల్‌లో మద్యం సేవించారు. ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

బాలకృష్ణని చేసిన దాన్ని ఆయన ఫ్యాన్స్ సమర్ధించుకుంటారేమో! కానీ ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించడం, నోటీ దురుసుతో ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేయడం గతంలోనూ పలుమార్లు జరిగింది. 

అమ్మాయిలు, నర్సులపై గతంలో చౌకబారు కామెంట్స్.. 'అక్కినేని తొక్కినేని' అని ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో అనడం లాంటివి బాలకృష్ణ ఎలాంటి వాడో చెప్పకనే చెబుతుంటాయి. కొన్నాళ్ల ముందు తమిళ హీరోయిన్ విచిత్ర కూడా ఇతడు పేరు చెప్పకుండా తనని ఓసారి అసభ్యంగా ప్రవర్తించాడని  చెప్పింది. ఇలా చెప్పుకొంటూ పోతే బాలకృష్ణ బాగోతాలెన్నో!

(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement