![Chinmayi Reveals Samantha Stood By Her On Hard Says During Me Too - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/4/samantha4.jpg.webp?itok=UxXwSiEs)
సింగర్ చిన్మయి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చిన్మయి ఎక్కువగా సమంత నటించిన సినిమాలకు డబ్బింగ్ చెప్పడం ద్వారా పాపులర్ అయ్యింది. తొలి సినిమా ఏ మాయ చేశావే నుంచి సమంతకు-చిన్మయికి మంచి అనుబంధం ఉంది. కష్టకాలంలో ఇద్దరూ ఒకరికొకరు సపోర్ట్‌గా నిలుచున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చిన్మయి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
నేను కష్టాల్లో ఉన్నప్పుడు సమంత నాకు అండగా నిలబడింది. ధైర్యాన్నిచ్చింది. మీటూ సమయంలో నేను పని కోల్పోయాను. ఆ సమయంలో సామ్ నాకు పని కల్పించింది. నాకు అన్నిరకాలుగా మద్దతు పలికింది అని పేర్కొంది. కాగా మీటూ ఉద్యమ సమయంలో తమిళనాడు సీనియర్ రచయిత వైరముత్తుపై చిన్మయి లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
ఆ వివాదంలో కోలీవుడ్ ఇండస్ట్రీ చిన్మయిపై బ్యాన్ విధించింది. మరోవైపు సమంత తన భర్త నాగచైతన్యతో విడిపోయినప్పుడు చిన్మయి ఆమెకు సపోర్ట్‌గా నిలిచింది. విడాకులకు సమంతను టార్గెట్ చేసినప్పుడు చిన్మయి సోషల్ మీడియా వేదికగా సమంతకు మద్దతు పలికింది. ఇక ఇటీవలె సమంత మయోసైటిస్ బారిన పడిన సమయంలో కూడా చిన్మయి, ఆమె భర్త రాహుల్ సమంతకు ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చి ఆమెకు అండగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment