అలాంటి వాళ్లు పనికిమాలిన పని చేసిన తప్పులేదు: బాలకృష్ణపై నటి ఫైర్ | Ridhi Dogra reacts on Nandamuri Balakrishna viral video of pushing Anjali | Sakshi
Sakshi News home page

Balakrishna: అదే పని అంజలి చేసి ఉంటే.. బాలకృష్ణపై నటి ఫైర్

Published Mon, Jun 3 2024 3:19 PM | Last Updated on Mon, Jun 3 2024 3:28 PM

Ridhi Dogra reacts on Nandamuri Balakrishna viral video of pushing Anjali

టాలీవుడ్‌ హీరో నందమూరి బాలకృష్ణ వివాదాస్పద ఎపిసోడ్‌ ఇ‍ప్పట్లో ముగిసిపోయేలా లేదు. ఇప్పటికే ఆయన తీరును పలువురు సినీతారలు సైతం తప్పుబడుతున్నారు. ప్రముఖ సింగర్ చిన్మయి, బాలీవుడ్‌ డైరెక్టర్‌ హన్సల్ మెహతా సోషల్ మీడియా వేదికగా బాలయ్యపై విమర్శలు చేశారు. హన్సల్‌ ఏకంగా ఈ చెత్తమనిషి ఎవరంటూ ట్విటర్‌లో రిప్లై ఇచ్చారు. తాజాగా మరో నటి సోషల్ మీడియా వేదికగా బాలకృష్ణ తీరుపై విరుచుకుపడింది. ఇంతకీ ఆమె ఏమన్నారో ఓ లుక్కేద్దాం.

రిధి డోగ్రా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో బాలకృష్ణపై పోస్ట్‌ చేసింది. ఆ వీడియోను షేర్ చేస్తూ విమర్శలు చేసింది. అతను ఆ మహిళను కించపరిచేలా వ్యవహరించినప్పటికీ ఆమె నవ్వుతోంది. ఎందుకంటే బాగా డబ్బు, పేరున్న మగాళ్లు పనికిమాలిన పని చేసిన ఈ ప్రపంచం తప్పుపట్టదు. ఎందుకంటే అలాంటి పురుషులు ఏం చేసినా పర్వాలేదు అనే స్థాయికి తీసుకొచ్చారు. ఒకవేళ అదే సమయంలో అంజలి కఠినంగా వ్యవహరించి ఉంటే.. ఇప్పటికే విపరీతంగా ట్రోలింగ్‌కు గురయ్యేది అంటూ రిధి డోగ్రా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్ మీడియా వైరల్‌గా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement