
నటసింహం నందమూరి బాలకృష్ణ బర్త్‌డే సందర్భంగా అతడి గొప్పదనాన్ని వివరిస్తూ వీడియో రిలీజ్ చేసింది సింగర్ స్మిత. ఆపదలో ఉన్నవారిని బాలయ్య ఎలా ఆదుకుంటాడో చెప్పుకొచ్చింది. "ఈ స్టోరీ చెప్పడానికి ఓ కారణం ఉంది. రెండు నెలల క్రితం ఓ జర్నలిస్టు నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. తన జర్నలిస్టు ఫ్రెండ్ కొడుక్కి ఆరోగ్యం బాగోలేదు. అతడిని బతికించేందుకు ఆ కుటుంబ సభ్యులు ఉన్నవన్నీ అమ్మేసుకుని కష్టాల్లో కూరుకుపోయారు. ఇంకా మెరుగైన చికిత్స చేయాలంటే చాలా డబ్బు అవసరమని వైద్యులు చెప్పారు. ఇదంతా నాకు చెప్పగానే అంత డబ్బు సమకూర్చడం నా వల్ల కాదు అని ఫోన్ పెట్టేయలేకపోయాను. రెండు నిమిషాలు టైం ఇవ్వండి అని చెప్పి ఫోన్ పెట్టేశాను.
"ఆ వెంటనే నేను.. మీకు వీలు దొరికితే రెండు నిమిషాలు మాట్లాడగలరా? అంటూ బాలకృష్ణగారికి మెసేజ్ పెట్టాను. 5 నిమిషాల్లో ఆయన ఫోన్ చేశారు. నేను జరిగిందంతా చెప్పాను. వెంటనే ఆయన రిపోర్ట్స్ పంపించు, మా డాక్టర్స్ ద్వారా వైద్య సాయం చేయగలనేమో చూస్తాను అని చెప్పారు. ఇదే విషయం సదరు జర్నలిస్టుకు చెప్పాను. ఆ తర్వాత సరిగ్గా మూడు గంటల్లో మళ్లీ నాకు ఫోన్ వచ్చింది. హాస్పిటల్ వైద్యులు మాట్లాడుతూ.. మొత్తం మేం చూసుకుంటాం.. పేషెంట్‌ను రేపు హాస్పిటల్‌కు రమ్మని చెప్పండన్నారు. నాకు చాలా సంతోషమేసింది. ఇలా ఎంతోమందికి బాలయ్య సాయం చేశారు. కొన్ని తెలుస్తాయి. కొన్ని తెలియవు అంతే.. అందరి ఆశీర్వాదాలతో ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా" అంటూ బాలయ్యకు బర్త్‌డే విషెస్ చెప్పింది స్మిత.
చదవండి: సింగిల్ అంటూ కన్నుకొట్టిన వనితపై నెటిజన్ ఫైర్, నటి చురకలు
Comments
Please login to add a commentAdd a comment