smita
-
ఎగతాళి నుంచి సంతాలి రుచుల దాకా...
మధుస్మిత సోరెన్ ముర్ము ఓ ట్రెండ్‌సెట్టర్. సంతాలి ఆదివాసీ వంటకాలను, ఇటాలియన్ వంటకాల శైలితో మేళవించి కొత్త రుచులను ఆవిష్కరిస్తోంది. సంతాలి సంప్రదాయ వంటల గురించి బ్లాగ్‌లో రాస్తోంది. కొద్దిరోజుల్లోనే ఓ సెలబ్రిటీ హోదాను సొంతం చేసుకుంది మధుస్మిత. బాల్యంలో ఎదురైన చిన్న చూపు నుంచి ఎదిగిన విజయ కిరణం ఆమె. ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లా, రాయ్‌రంగపూర్ అమ్మాయి మధుస్మిత.పోటీలో విజయంఆదివాసీల ఆహారపు అలవాట్లు నాగరక సమాజానికి భిన్నంగా ఉంటాయి. అడవుల్లో దొరికే చీమలు, నత్తలు, ఇతర కీటకాల వంటలు వారి ఆహారంలో ప్రధానంగా ఉంటాయి. లంచ్ బాక్సులో ఆమె ఆహారాన్ని చూసిన ఇతర విద్యార్థులు ఆమెను తక్కువగా చూసేవారు. అప్పటినుంచి ఆమెలో తమ ఆహారపు అలవాట్లను నాగరకులు ఎందుకు తక్కువగా చూస్తారు... అనే సందేహం కలిగింది. ఆమెతోపాటే ఆమె సందేహం కూడా పెద్దదైంది. ‘ఒడిశా హోమ్‌ఫుడ్ షెఫ్’ పోటీల్లో గెలవడం మధుస్మితలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. తమ సంప్రదాయ వంటకాలను ఇతర ప్రాంతాల వంటకాల శైలితో మేళవించి వండడం అనే ప్రయోగం కూడా విజయవంతమైంది. బీటెక్ చదివేనాటికి ఆమెకు ఒక పరిష్కారం దొరికింది. ఆ పరిష్కారం విజయవంతం అవుతుందా లేదా అనే ప్రశ్నకు కోవిడ్ లాక్డౌన్ చక్కటి సమాధానాన్ని చెప్పింది. లాక్డౌన్ సమయంలో వంటల మీద పరిశోధనలు మొదలుపెట్టింది. లాక్డౌన్ తర్వాత సంతాలి వంటలు ఎన్ని రకాలున్నాయో తెలుసుకోవడానికి ఆ గ్రామాల్లో పర్యటించింది. ఎలా వండుతున్నారో తెలుసుకుంది. తెలుసుకున్న విషయాలను బ్లాగ్‌లో రాయడం మొదలుపెట్టింది.ఇప్పుడామె చెఫ్‌లకు శిక్షణనిస్తోంది. ప్రముఖ రెస్టారెంట్లలో సంతాలి తెగ వంటకాలు ప్రముఖ స్థానంలో కనిపిస్తున్నాయి. 2022లో మాస్టర్ షెఫ్ పోటీల్లో పాల్గొంది. ఆమె చేసిన రెండు వంటలు న్యాయనిర్ణేతల జిహ్వను మైమరిపించాయి. ఇటాలియన్ వంటకం పోలెంతాని మధుస్మిత స్థానిక పద్ధతిలో ఎర్రబియ్యంతో చేసింది. వేయించిన చికెన్‌కు తోడుగా ఎర్ర చీమల చట్నీ వడ్డించింది. అలాగే పాల్వా చట్నీతో పాట్లపీత వంటకం కూడా. ఎండిన చింతాకు ΄పొడితో చేసిన వంటకాలను నగరవాసులు లొట్టలేసుకుని తింటున్నారు.గవర్నమెంట్ ఉద్యోగం కంటే ఎక్కువ‘‘మా తల్లిదండ్రుల ఆలోచనలు చాలా సంప్రదాయబద్ధమైనవి. నేను బాగా చదువుకుని ఇంజినీరింగ్ పూర్తయిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం చేయాలనుకునేవారు. కానీ నేను మాత్రం మా సంతాలి తెగ మీద సమాజంలో నెలకొని ఉన్న తేలిక అభి్రపాయాన్ని తొలగించాలనుకున్నాను. సంతాలి వంటకాలను తెలియచేసే ఫుడ్ బ్లాగర్‌గా ప్రపంచానికి పరిచయమయ్యాను. మా వంటలను పరిచయం చేశాను.ప్రపంచç ³టంలో వంటకాల్లో ఇటలీకున్న స్థానంలో మా సంతాలి వంటకాలను చేర్చగలిగాను. పెద్ద పేరున్న రెస్టారెంట్లు మా వంటకాలకు మెనూ కార్డులో ‘ట్రైబల్ క్విజిన్’ అని ప్రత్యేక కేటగిరీ కల్పిస్తున్నారు. ఇప్పుడు మా సంతాలి వంటకాలు ప్రపంచ ఆహారపట్టికలో ఉన్నాయి. నేను అనుకున్నది సాధించాను’’ అని సంతోషంగా చె΄్తోంది 32 ఏళ్ల మధుస్మిత. బాల్యంలో మనసుకైన గాయంతో తమ సంతాలి తెగకు ప్రపంచస్థాయి గౌరవాన్ని తెచ్చి పెట్టింది మధుస్మిత సోరెన్ ముర్ము. -
వామ్మో ఎంత పొడుగు జుట్టు!..గిన్నిస్ రికార్డులకెక్కింది!
టీవీల్లోనూ, అడ్వర్టైస్మెంట్ల్లోనూ భారీ కురులను చూసుంటాం. రియల్ లైఫ్లోఎక్కువగా సన్యాసుల్లో చూస్తుంటాం. ఒక వేళ ఉన్నా ఇక్కడున్న మహిళకు ఉన్నంత భారీ కురులను చూసి ఉండే అవకాశమే లేదు. ఎవరామె? ఆమె చుట్టు సంరక్షణ రహస్యం ఏంటీ వంటి వాటి గురించి తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 46 ఏళ్ల స్మితా శ్రీ వాస్తవ అత్యంత పొడవాటి జుట్టుని కలిగి ఉన్న మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది. ఆమె జుట్టు ఏకంగా తొమ్మిది అంగుళాల పొడవుతో ఉంది. ఆమె 14 ఏళ్ల ప్రాయం నుంచి కత్తిరించడం మానేసింది. అంతేగాదు చుట్టును కడగడానికే దాదాపు 45 నిమిషాలు పడుతుందట. తనకు తన జుట్టు అంటే మహా ఇష్టమని, దీనికి గుర్తిపు రావాలని ఎంతగానో కోరుకున్నాని చెప్పుకొచ్చింది. చివరికి దేవుడు తన ప్రార్థనలు ఆలకించి ప్రపంచ రికార్డులో చోటు దక్కేలా చేశాడని అంటోంది శ్రీ వాస్తవ. ప్రస్తుతం ఆమెకు 46 ఏళ్లు వారానికి రెండు సార్లు జుట్టును కడుగుతుందట. అయితే వాషింగ్, డ్రైయింగ్, డిటాంగ్లింగ్, స్టైలింగ్‌తో సహా మొత్తం ప్రక్రియకు ప్రతిసారీ మూడు గంటల వరకు పడుతుందట. తనకు జుట్టుని సంరక్షించుకోవాలనే విషయంలో ప్రేరణ తన అమ్మేనని చెబుతోంది. తన కుటుంబంలోని ప్రతిఒక్కరికి అందమైన జుట్టు ఉంది. అదీగాక 80ల టైంలోని హిందీ సినిమాల్లో నటీమణులు చాలా అందంగా ఉండేవారు. ఆ కాలల్లోని వాళ్లందరికీ జుట్టు చాలా పొడవుగా ఉండేది. అదే తనను బగా ప్రేరేపించిందని చెబుతోంది శ్రీ వాస్తవ. మన సమాజంలో పొడవాటి జుట్టు మహిళల అందాన్ని తెలియజేస్తుంది. ఇక శ్రీ వాస్తవ గత 20 ఏళ్లలో వెంట్రుకలను కత్తిరించలేదు. అయితే ఒకనొక సమయంలో కాస్త ఎక్కువగా జుట్టురాలిందని, అందుకోసం శ్రద్ధ తీసుకోవడంతో ఆ సమస్యను నివారించగలిగానని చెప్పింది శ్రీ వాస్తవ. అలాగే ఆమె తన జుట్టు సంరక్షణ కోసం కృత్రిమ షాంపూలు, కండీషనర్లకు దూరంగా ఉంటానని అంటోంది. ఎక్కువగా గుడ్డు, ఉల్లిపాయ రసం, అలోవెరా వంటి సహజమైన పదార్థాలతో జుట్టును సంరక్షించుకుంటానని అదే తన కేశసంపద రహస్యమని చెబుతోంది శ్రీ వాస్తవ. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెమిడీలను తప్పకు ప్రయత్నించండి.(చదవండి: స్లిమ్‌గా మారిన భూమి పడ్నేకర్!.. జస్ట్ నాలుగు నెలల్లో ఏకంగా..!) -
త్రీ సాంగ్మం
ఒక భాషలో మొదలైన పాట ఆ భాషలోనే ఆగిపోతుంది. అయితే ఈ పాట విషయంలో అలా జరగలేదు. మలయాళంలో మొదలైన పాట హిందీలోకి వచ్చింది. ఆ తరువాత బెంగాలీలోకి వచ్చి ఎండ్ అయింది.ఎక్కడా కృత్రిమత్వం అనిపించదు. హాయిగా వినాలనిపిస్తుంది. మ్యాటర్‌లోకి వస్తే... స్మితాదేవ్ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ ‘ఎడక్కడ్ బెటాలియన్’ అనే మలయాళ సినిమాలోని ‘ఎన్ జీవనే’ పాటను మూడు భాషల్లో చక్కగా పాడింది. స్మిత గొంతుకకు, ఆమె మల్టీ లింగ్వల్ టాలెంట్‌కు నెటిజనులు జేజేలు పలికారు.హిందీ సంగతి సరే, మలయాళీ పాటను సహజంగా పాడడం అనేది గొప్ప విషయం. అచ్చం మలయాళీ సింగర్ పాడినట్లుగా ఉంది’ అని ఒక నెటిజన్ స్పందించాడు. ‘ఈ పాట పుణ్యమా అని మళయాళం, బెంగాలీ భాషల ధ్వనిలోని కొన్ని అద్భుతమైన సారూప్యతలను గమనించే వీలు కలిగింది’ అంటూ స్పందించాడు ఒక విశ్లేషకుడు. ‘మీ పాట మ్యూజిక్ స్ట్రీమింగ్ ΄్లాట్ఫామ్లలో ఉండేలా చూడండి’ అని ఒక ఇన్స్టాగ్రామ్ యూజర్ అడిగాడు. -
టీడీపీలో ఆరని మంటలు
సాక్షి నెట్వర్క్: టీడీపీలో టికెట్ల లొల్లి చల్లారేలా లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అసమ్మతి జ్వాలలు చెలరేగుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడినవారు ఒక్కొక్కరిగా రోడ్డెక్కుతున్నారు. పార్టీకి వ్యతిరేకంగా ర్యాలీలు, నిరసనలు చేస్తున్నారు. ఏళ్ల తరబడి పార్టీకోసం కష్టపడి పనిచేసిన వారిని కాదని డబ్బు మూటలతో వచ్చిన వారికి చంద్రబాబు ప్రాధాన్యమిస్తున్నారని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదే జరిగితే ఇండిపెండెంట్‌గానైనా బరిలోకి దిగుతామని పార్టీకి హెచ్చరికలు పంపుతున్నారు. ఏలూరు ఎంపీ అభ్యర్థిగా గారపాటి సీతారామాంజనేయ చౌదరికి టికెట్ కేటాయించాలని బీజేపీ జిల్లా నాయకులు కోరుతున్నారు.సంవత్సరాల తరబడి ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న గారపాటిని కాదని స్థానికేతరుడైన పుట్టాను ఖరారు చేయడం అన్యాయమని ఆ పార్టీ నేతలు ఏలూరు జిల్లా భీమడోలులో వాపోయారు. మరోవైపు ఇదే పార్లమెంట్ నుంచి టీడీపీ టికెట్ ఆశించిన గొర్రుముచ్చు గోపాల్ యాదవ్ చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. సింగపూర్‌లో ఉన్నతస్థితిలో ఉన్న తనను ఏలూరు టికెట్ ఆశ చూపి ఇక్కడికి తీసుకొచ్చారని నిలదీశారు. తనతో కోట్లు ఖర్చు చేయించారని, చివరికి మొండిచేయి చూపారని వీడియో విడుదల చేశారు.ఆదివారం కామవరపుకోటలో ఏర్పాటు చేయబోయే ఆత్మీయ సమావేశంలో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని అల్టిమేటం జారీచేశారు. శ్రీకాకుళం టీడీపీలో అసమ్మతి మంటలు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం సీటు రాకపోవడంతో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కార్యకర్తలతో శనివారం సమావేశం ఏర్పాటు చేసి అభ్యర్థి మామిడి గోవిందరావుపై దుమ్మెత్తిపోశారు. అవసరమైతనే ఇక్కడి నుంచి ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తామని మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ స్పష్టం చేశారు. మరోవైపు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రచారం చేసుకున్న సానా సతీష్ కు చుక్కెదురైంది. జనసేన నుంచి టీటైమ్ అధినేత తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌కు ఈ సీటు ఖరారు చేయడంతో టిక్కెట్టు ఆశించిన సతీష్ వర్గీయులు మండిపడుతున్నారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో టీడీపీ టికెట్ మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడుకు కేటాయించాలని ఆయన వర్గీయులు నిరసనలు కొనసాగిస్తున్నారు. పైలా ప్రసాదరావుకు టీడీపీ టికెట్ కేటాయించడంపై మాడుగుల మండలం కె.జె.పురంలో తెలుగు మహిళ నియోజకవర్గ అధ్యక్షురాలు కర్రి నాగమణి ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేశారు. నాన్ లోకల్ వద్దు, లోకల్ ముద్దు అంటూ గవిరెడ్డి అనుచరులు దేవరాపల్లిలో ర్యాలీ నిర్వహించారు. టీడీపీ ప్రతిసారీ మోసం: దేవినేని స్మిత టీడీపీ తమను ప్రతిసారీ మోసం చేస్తోందని ఆ పార్టీ పెనమలూరు నియోజకవర్గ నాయకురాలు దేవినేని స్మిత ఆరోపించారు. పెనమలూరు టికెట్ తమకెందుకు ఇవ్వలేదని, తమ కుటుంబానికి ఎందుకు అన్యాయం చేస్తున్నారని అధిష్టానాన్ని ఆమె నిలదీశారు. ఆడవాళ్లమైనా నియోజకవర్గం మొత్తం తిరిగి పార్టీ కోసం పనిచేస్తే లాబీయింగ్ చేసుకున్న బోడె ప్రసాద్‌కు టికెట్ ఇచ్చారన్నారు. ముందు బోడెకు ఇవ్వబోమని ప్రకటించిన చంద్రబాబు తర్వాత ఎందుకు మొత్తబడ్డారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ ప్రలోభాలకు తలొగ్గారో ఆయన చెప్పాలని నిలదీశారు. తమకు టికెట్ కేటాయిస్తేనే తన తండ్రి ఆత్మ శాంతిస్తుందన్నారు. త్వరలోనే కార్యకర్తలతో మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. నమ్ముకున్న ప్రజలను, నమ్మి పదవి కట్టబెట్టిన పార్టీని వెన్నుపోటు పొడిచి, పార్టీ మారి టీడీపీ నుంచి మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీలో ఉన్న వసంత వెంకట కృష్ణప్రసాద్‌ను ఓడించడమే లక్ష్యంగా ఇండిపెండెంట్‌గా పోటీ చేయనున్నట్లు జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గ నాయకులు పులిపాక ప్రకాష్ తెలిపారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశానన్నారు. తాను వసంతను ఓడించడానికే పని చేస్తానని స్పష్టం చేశారు. -
నా పెళ్లి కుదిర్చింది అక్కినేని అంకుల్: సింగర్ స్మిత
స్మిత టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. సింగర్‌గా టాలీవుడ్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండేపోయే పేరు. పాడుతా తీయగా అంటూ అభిమానులను గుండెల్లో నిలిచిపోయింది ఆమె. ఆ రోజుల్లోనే 'మసక మసక చీకటిలో.. మల్లెతోట వెనకాల' అంటూ సినీ ప్రేక్షకులను ఊర్రూతలూగించింది పాప్ సింగర్. స్వర్ణకమలం, సాగరసంగమం, స్వాతిముత్యం లాంటి హిట్ చిత్రాలకు ఆమె పాటలు పాడింది. ఇటీవలే నిజం విత్ స్మిత అంటూ ఓటీటీ షోతో ప్రేక్షకుల ముందుకొచ్చింది సింగర్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కెరీర్లో ఎదురైన అనుభవాలను వివరించారు. ఆమె తన పెళ్లి, కెరీర్‌పై పలు విషయాలను వెల్లడించారు. అప్పట్లో మల్లీశ్వరి (2004), ఆట (2007) వంటి చిత్రాలతో పాటు డైయింగ్ టు బి మీ (2015) అనే షార్ట్ ఫిల్మ్‌లో కనిపించింది. స్మిత మాట్లాడుతూ.. 'నేను, నా భర్త వర్క్ విషయంలో చాలా ఫర్ఫెక్ట్. నా ఫ్రెండ్స్ కూడా శశాంక్‌ను బావ అని పిలుస్తారు. ఎందుకంటే మా పెళ్లి అనేది ఒక మిస్టరీ. అది మా స్నేహితుల వల్లే జరిగిందని చెప్పాలి. అతను ఏ అమ్మాయితో మాట్లాడింది లేదు. కానీ మా పెళ్లికి కుదిర్చిన వ్యక్తి మాత్రం నాగార్జున బ్రదర్ వెంకట్ అక్కినేని అంకుల్. పెళ్లి అంటే నాలో చాలా భయం ఉండేది. ఫ్రీడం లేదనిపించేది. కెరీర్ పరంగా నేను హైదరాబాద్‌లోనే ఎక్కువ ఉండాల్సి వచ్చేది. కానీ పెళ్లి తర్వాత కూడా ఎవరి జీవితానికి వారికి ఫుల్ ఫ్రీడం ఉంది. ఏ విషయంలోనూ దేనికి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం రాలేదు. మేం ఇద్దరం ఒకరి పనిలో ఒకరం తలదూర్చం. నేను పాడుతా తీయగా ప్రోగ్రామ్ సీజన్-2 తోనే వచ్చా. మమ్మీ, డాడీకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. పాప్ సింగర్ కావడానికి మా నాన్నే కారణం. ఐడియా మా నాన్నది అయితే.. ముందుకు తీసుకెళ్లింది మాత్రం మా అమ్మే.' అని అన్నారు. -
అతడి కంటే అందగాడివా అని హేళన చేశారు: చిరంజీవి
ప్రముఖ సింగర్ స్మిత వ్యాఖ్యాతగా ‘నిజం విత్ స్మిత’ టాక్ షో ప్రారంభమైంది. ఈ షో ద్వారా సినీ, రాజకీయ ప్రముఖుల జీవితంలోని చోటు చేసుకున్న సంఘటనలు, వ్యక్తిగత విషయాలను చర్చించనున్నారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీలివ్‌లో వేదికగా ప్రసారమయ్యే ఈ షో ప్రోమోలో మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ సాయి పల్లవి, దగ్గుబాటి రానా, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు తదితరులు పాల్గొన్నట్లు చూపించారు. ఇక ఫిబ్రవరి 10న ఈ షో ప్రారంభం కాగా తొలి ఎపిసోడ్‌గా మెగాస్టార్ చిరంజీవి ఇంటర్య్వూను ప్రసారం చేశారు. చదవండి: ఫేం కోసం తప్పుడు ప్రచారం.. సింగర్ యశస్వి చీటింగ్ బట్టబయలు! ఇందులో చిరు తన వ్యక్తిగత, సినీ కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తిర విషయాలను పంచుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్‌గా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న చిరంజీవి తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానంటూ నాటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘నేను నటుడిగా ఈ స్థాయి చేరుకునే క్రమంలో ఎన్నో అవమానాలు పడ్డాను. అవకాశాల కోసం వెళితే హేళన చేశారు. కొన్ని సార్లు అయితే మానసిక క్షోభకు గురయ్యాను. ఆ బాధను ఎవరికి చెప్పుకోలేదు. దేవుడి ముందుకు నిలబడి నాకు నేను ధైర్యం చెప్పుకునేవాడిని. ఆ తర్వాత మళ్లీ అవకాశాల వేట మొదలు పెట్టేవాడిని’ అని చెప్పారు. అయితే ‘‘సినిమాల్లో నటించాలనే ఆశతో ఓ రోజు మద్రాస్‌కు వెళ్లాను. పాండీబజార్‌లోని ఫిలిం ఇన్స్టిట్యూట్కు వెళ్లా. అక్కడ ఓ వ్యక్తి నన్ను చూసి ‘ఏంటి ఫిలిం ఇన్స్టిట్యూట్లోకి వచ్చావా? సినిమాలు ట్రై చేద్దామనే! అతను చూడు ఎంత అందంగా ఉన్నాడో. అతడి కంటే నువ్వు అందగాడివా.. తెలిసిన వాళ్లు లేకపోతే అవకాశాలు దొరకడం కష్టం. ఇండస్ట్రలోకి రావాలంటే ఇక్కడ తెలిసిన వాళ్లు ఉండాలి. చదవండి: ఈసారి బిగ్‌బాస్ హౌజ్‌లోకి యాంకర్ రష్మీ? భారీగా పారితోషికం..! కాబట్టి నీ కల మర్చిపో’ అంటూ నన్ను హేళన చేస్తూ మాట్లాడాడు. ఆ మాటలు నన్ను బాధించాయి. ఇంటికి వెళ్లి దేవుడు ముందు కూర్చోని ఇలాంటి వాటికి బెదిరి వెనకడుగు వేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఇక ఆ తర్వాత ఏడాది పాటు పాండీ బజార్ వైపు వెళ్లలేదు’’ అంటూ చిరు చెప్పుకొచ్చారు. కాగా ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన చిరు మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా మెప్పించారు. అలా అంచెలంచెలుగా హీరోగా స్వయం కృషితో ఎదిగిన చిరు ప్రస్తుతం సినీరంగంలో గాడ్‌ఫాదర్‌గా అభిమానుల గౌరవ, అభిమానాలను అందుకుంటున్నారు. -
స్మిత టాక్ షోకు సాయి పల్లవి.. ఫిజికల్ అబ్యూస్ అంటూ సీరియస్ కామెంట్స్!
తెలుగు హీరోయిన్లలో సాయి పల్లవి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సినిమాల్లో తన పాత్రకు ప్రాధాన్యత ఉండేలా జాగ్రత్త పడుతుంది. అందుకే దర్శకులు కూడా సాయి పల్లవి రోల్‌ను చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దుతారు. ఇక ఆమె గ్లామర్స్ పాత్రలకు దూరమనే విషయం తెలిసిందే. స్కీన్ షో ఉంటే అది స్టార్ హీరో బడా డైరెక్టర్ చిత్రమైన నో చెబుతుంది. అందుకే సినిమా ఫలితాలతో సంబంధంగా లేకుండా వ్యక్తిగతం ఆమెను అభిమానించేవారు చాలా మంది ఉన్నారు. అయితే లవ్‌స్టోరితో కమర్షియల్ హిట్ అందుకున్న సాయి పల్లవి ఆ తర్వాత నటించిన చిత్రాలన్ని బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. చదవండి: బ్రహ్మానందం మొత్తం ఆస్తులు ఎన్ని వందల కోట్లో తెలుసా? తన నటనతో మెప్పించినప్పటికి కమర్షియల్‌గా మాత్రం విజయం సాధించలేకపోతున్నాయి. దాంతో ప్రస్తుతం ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అంతేకాదు మీడియాకు, సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటుంది. దీంతో సాయి పల్లవి పూర్తిగా నటనకు గుడ్‌బై చెప్పిందా? అని ఆమె అభిమానలంతా ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు కొద్ది రోజులు ఇకపై ఆమె నటించదనే ప్రచారం కూడా గట్టిగానే జరుగుతోంది. మరోవైపు ఆమె పెళ్లి చేసుకుబోతుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ పుకార్లపై ఇంతవరకు ఈ న్యాచురల్ బ్యూటీ నుంచి క్లారిటీ రాలేదు. దాంతో అంతా అదే నిజమనుకుంటున్నారు. చదవండి: కత్రినా వచ్చాక నా లైఫ్ మారిపోయింది.. నేను పర్ఫెక్ట్ హస్భెండ్ కాదు..!: విక్కీ కౌశల్ ఈ నేపథ్యంలో సాయి పల్లవి ఓ టాక్ షోలో పాల్గొన్నారు. సోనీ లైవ్‌లో త్వరలో ప్రసారం కానున్న 'నిజం విత్ స్మిత' షోలో ఆమె పాల్గొన్నారు. ఫిబ్రవరి 10న సాయి పల్లవి ఎపిసోడ్ ప్రసారం కానుంది. చూస్తుంటే ఈ ఎపిసోడ్ కొంచెం వాడివేడిగానే సాగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బయటకు వచ్చింది. ఇందులో సాయి పల్లవి కాస్తా గట్టిగా రియాక్ట్ అయినట్లుంది. ఈ వీడియోలో ఆమె ఫిజికల్ అబ్యూస్, వర్బల్ అబ్యూస్ అంటూ సీరియస్ కామెంట్స్ చేస్తూ కనిపించింది. దాంతో సాయి పల్లవి ఎపిసోడ్ ఆసక్తిని సంతరించుకుంది. ఈ షో కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. #NijamWithSmita A thought-provoking talk show With @Sai_Pallavi92 ♥️ n few of the Top Stars Episodes exclusively on @SonyLIV, from February 10th.#SaiPallavi @smitapop pic.twitter.com/ujeoUq9r8t — Sai Pallavi FC™ (@SaipallaviFC) February 2, 2023 -
బిగ్‌బాస్‌పై సింగర్ స్మిత సంచలన వ్యాఖ్యలు.. ‘చచ్చినా ఆ తప్పు చేయను’
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్. ఈ షో అంటే పడిచచ్చేవారు ఎంతమంది ఉన్నారో విమర్శించే వారు కూడా అంతే ఉన్నారు. ఇప్పటికే ఈ రియాలిటీ షోపై సీపీఐ నేత అల్లం నారాయణ ఎన్నోసార్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్‌బాస్ అంటే బూతుల షో అంటూ మండిపడ్డారు. ఆయన మాత్రమే కాదు సినీ సెలబ్రెటీలు సైతం ఈ షో అంటే అసలు పడదని అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ సింగర్ స్మిత చేరారు. చదవండి: సినీ ప్రియులకు ‘ఐబొమ్మ’ బిగ్ షాక్.. ఆ రోజు నుంచి శాశ్వతంగా సేవలు బంద్ ఈ షోపై తాజాగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్‌బాస్ షో అసలు నచ్చదంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించిన ఆమె బిగ్‌బాస్ షోపై స్పందించారు. బిగ్‌బాస్ నుంచి ఎప్పుడైనా పిలుపు వచ్చిందా? అని ఆమెను అడగ్గా.. ‘బిగ్‌బాస్.. నాకస్సలు నచ్చని షో ఇది. ఒకవేళ బిగ్‌బాస్ ఆఫర్ వస్తే పొరపాటున కూడా అంగీకరించి ఆ తప్పు చేయను. అన్ని రోజులు కుటుంబాన్ని వదలి వెళ్లాల్సిన అవసరం ఏముంది. నెలల పాటు సెలబ్రెటీలను లాక్ చేసి తన్నుకొండి.. మేం టీఆర్పీలు పెంచుకుంటాం అనడం ఎంతవరకు కరెక్ట్. అందుకే ఈ షోని అసలు చూడను. చూసినా నాకది అర్థం కాదు. నేను మాత్రం ఈ షోకు చచ్చినా వెళ్లను’ అన్నారు. చదవండి: జూ.ఎన్టీఆర్-కొరటాల చిత్రంలో అలనాటి లేడీ సూపర్ స్టార్? అలాగే ‘నా సన్నిహితులు, స్నేహితులు ఎవరైనా వెళ్తా అన్న కూడా మీకు ఎమోచ్చిందని వారిస్తాను. ఇక వెళ్లిన వాళ్ల గురించి నేను ఏం అనను. అది వారి వ్యక్తిగత నిర్ణయం. ఈ సీజన్లో నాకు తెలిసి వాళ్లు వెళ్లారు. ఇప్పుడు దీని గురించి నేను ఏం మాట్లాడినా అది వారిని విమర్శించినట్లు అవుతుంది. అందుకే ఈ షో గురించి నేను మాట్లాడాలని అనుకోవడం లేదు’ అని అన్నారు. కాగా స్మీత ప్రస్తుతం జీతెలుగులో వస్తున్న సరిగమప సింగర్ ఐకాన్‌కు షోకు జడ్జీగా వ్యవహిరిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే షోలో కంటెస్టెంట్‌కు మెంటర్‌గా ఉన్న రేవంత్ బిగ్‌బాస్ సీజన్ 6లో అడుగుపెట్టిన విషయం విధితమే. -
త్వరలోనే అణుశక్తి విభాగం ఆకృతి కేంద్రం
అశ్వాపురం: ముంబైలోని బాబా అణుశక్తి పరిశోధన కేంద్రం(ఆటమిక్ రీసెర్చ్ స్టేషన్) ఆకృతి విభాగం ఆధ్వర్యాన త్వరలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో ఆకృతి కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ముంబైకు చెందిన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ ఏపీ.తివారి, స్మితా ములె, డాక్టర్ సంజీవకుమార్ సాధ్యాసాధ్యాల పరిశీలనకు శుక్రవారం అశ్వాపురం వచ్చారు. శాస్త్రవేత్తలు అశ్వాపురంలోని భారజల కర్మాగారాన్ని సందర్శించారు. ఆ తర్వాత భద్రాచలంలో సీతారామచంద్రస్వామి ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. అనంతరం గౌతమీనగర్ కాలనీలో ఏఈసీఎస్ స్కూల్‌ను సందర్శించిన వారు ఇక్కడి అధికారులు, స్థానికులు, రైతులతో మాట్లాడారు. భారజల కర్మాగారం పరిసరాల్లోని గ్రామాల్లో సాగవుతున్న పంటల దిగుబడి, భూముల స్వభావం, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. అనంతరం శాస్త్రవేత్తలు మాట్లాడుతూ బాబా అణుశక్తి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో చేస్తున్న నూతన ఆవిష్కరణలు, ప్రయోగాలు, నూతన పరికరాలు, కార్యక్రమాలను అణుశక్తి విభాగం ఆకృతి విభాగం ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో ప్రజలు, రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారజల కర్మాగారం జీఎం సతీశ్, అధికారులు పాల్గొన్నారు. -
బాలయ్య మనసు బంగారం, స్మిత ఆసక్తికర వీడియో
నటసింహం నందమూరి బాలకృష్ణ బర్త్‌డే సందర్భంగా అతడి గొప్పదనాన్ని వివరిస్తూ వీడియో రిలీజ్ చేసింది సింగర్ స్మిత. ఆపదలో ఉన్నవారిని బాలయ్య ఎలా ఆదుకుంటాడో చెప్పుకొచ్చింది. "ఈ స్టోరీ చెప్పడానికి ఓ కారణం ఉంది. రెండు నెలల క్రితం ఓ జర్నలిస్టు నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. తన జర్నలిస్టు ఫ్రెండ్ కొడుక్కి ఆరోగ్యం బాగోలేదు. అతడిని బతికించేందుకు ఆ కుటుంబ సభ్యులు ఉన్నవన్నీ అమ్మేసుకుని కష్టాల్లో కూరుకుపోయారు. ఇంకా మెరుగైన చికిత్స చేయాలంటే చాలా డబ్బు అవసరమని వైద్యులు చెప్పారు. ఇదంతా నాకు చెప్పగానే అంత డబ్బు సమకూర్చడం నా వల్ల కాదు అని ఫోన్ పెట్టేయలేకపోయాను. రెండు నిమిషాలు టైం ఇవ్వండి అని చెప్పి ఫోన్ పెట్టేశాను. "ఆ వెంటనే నేను.. మీకు వీలు దొరికితే రెండు నిమిషాలు మాట్లాడగలరా? అంటూ బాలకృష్ణగారికి మెసేజ్ పెట్టాను. 5 నిమిషాల్లో ఆయన ఫోన్ చేశారు. నేను జరిగిందంతా చెప్పాను. వెంటనే ఆయన రిపోర్ట్స్ పంపించు, మా డాక్టర్స్ ద్వారా వైద్య సాయం చేయగలనేమో చూస్తాను అని చెప్పారు. ఇదే విషయం సదరు జర్నలిస్టుకు చెప్పాను. ఆ తర్వాత సరిగ్గా మూడు గంటల్లో మళ్లీ నాకు ఫోన్ వచ్చింది. హాస్పిటల్ వైద్యులు మాట్లాడుతూ.. మొత్తం మేం చూసుకుంటాం.. పేషెంట్‌ను రేపు హాస్పిటల్‌కు రమ్మని చెప్పండన్నారు. నాకు చాలా సంతోషమేసింది. ఇలా ఎంతోమందికి బాలయ్య సాయం చేశారు. కొన్ని తెలుస్తాయి. కొన్ని తెలియవు అంతే.. అందరి ఆశీర్వాదాలతో ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా" అంటూ బాలయ్యకు బర్త్‌డే విషెస్ చెప్పింది స్మిత. చదవండి: సింగిల్ అంటూ కన్నుకొట్టిన వనితపై నెటిజన్ ఫైర్, నటి చురకలు -
వైరల్ వీడియో: ఒక్క మెసేజ్‌తో ప్రాణం కాపాడిన నటసింహం
-
కరోనా బాధితులకు సింగర్ స్మిత ఆక్సిజన్ సాయం
దేశ వ్యాప్తంగా మహమ్మారి కోరలు చాస్తోంది. కరోనా సెకండ్ వేవ్ మరింత తీవ్రంగా ఉండటంతో ఆస్పత్రుల్లో ఆక్సిజన్ పడకల కొరత ఏర్పడింది. దీంతో ఆక్సిజన్ కోరతతో ఇబ్బందులు పడుతున్న కరోనా బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే నటుడు సోను సూద్ ఫౌండేషన్స్ ఏర్పాటు చేసిన దానికి ద్వారా బాధితులకు మందులు, ఆక్సిజన్, వ్యాక్సిన్ పంపిణి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సైతం ప్రతీ జిల్లాలోనూ ‘చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్’లను నెలకొల్పాలని నిర్ణయం తీసుకున్నారు. తాజాగా పాప్ సింగర్ స్మిత సైతం కరోనా బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. గతంలో తను స్టాపించిన ఏఎల్‌ఏఓతో (ALAO) పాటు పలు స్వచ్చంద సంస్థల ద్వారా ఆమె వివిధ ప్రాంతాల్లోని కోవిడ్ కేర్ సెంటర్లకు 100 ఆక్సిజన్ పడకలను అందించారు. స్వయంగా ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అంతేగాక ఈ కార్యక్రమంలో భాగమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ స్మిత ట్వీట్ చేశారు. Happy to share that Vijayawada now has a very comfortable Covid care center with 100 oxygen beds & medical teams at #VenueConvention by Sujana foundation. Adding another 100 oxygen beds frm team #EOAPforOOPIRI & #ALAIfoundation by this week. Contact: 91 97019 99962 Pls RT & share pic.twitter.com/BEzBQqxrLq — Smita (@smitapop) May 17, 2021 అలాగే దర్శకుడు సూకుమార్ సైతం కోవిడ్ బాధితుల కోసం శాశ్వత ప్రతిపాదికన ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. తన స్వస్థలమైన కాకినాడ దగ్గర రాజోలు గ్రామంలో40 లక్షల రూపాయలతో డీఓసీఎస్ 80 ఆక్సిజన్ జనరేటర్ సిస్టమ్ ప్లాంట్ నిర్మించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. కోనసీమలోని కరోనా బాధితులకు ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందించేందుకు ఆయన ఇప్పటికే ముందుకు వచ్చారు. -
ఇంట్లోనే ఉన్న సింగర్‌కు కరోనా పాజిటివ్
బుల్లితెర నుంచి వెండి తెర మీదకు పాకిన కరోనా వల్ల ఇప్పటికే ఎందరో ప్రముఖులు ఆస్పత్రిపాలయ్యారు. ఈ బాధితుల లిస్టులో దర్శకులు రాజమౌళి, తేజ కూడా ఉన్నారు. తాజాగా పాప్ సింగర్ స్మిత కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. "నిన్నంతా పిచ్చిపిచ్చిగా అనిపించింది. ఒళ్లు నొప్పులు పెడుతుంటే వర్కవుట్ వల్లేమో అనుకున్నా. కానీ ఎందుకైనా మంచిదని పరీక్ష చేయించుకుంటే నా భర్త శశాంక్‌కు, నాకు కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. (రాజమౌళి ఫ్యామిలీకి కరోనా) కానీ కొంచెం కూడా లక్షణాలు లేవు. ఈ వైరస్‌ను తన్ని అవతల పారేసి, ప్లాస్మా దానం చేయడం కోసం ఎదురు చూస్తున్నా. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఇంట్లోనే ఉన్నాను. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాను. అయినా ఆ మాయదారి కోవిడ్ ఇంట్లోకి వచ్చి చేరింది" అని రాసుకొచ్చారు. దీనిపై ఓ అభిమాని కంగారుపడుతూ.. "అదేంటీ! మీరు ఇంట్లోనే ఉన్నానంటున్నారు.. మరి కరోనా ఎలా వచ్చింది?" అని ప్రశ్నించాడు. బహుశా ఇంట్లో విద్యుద్దీపాలు అమర్చేందుకు వచ్చిన వ్యక్తి వల్లే వచ్చి ఉంటుందనుకుంటున్నానని స్మిత సమాధానమిచ్చారు. (డైరెక్టర్ తేజకు కరోనా పాజిటివ్) -
నాటిన ప్రతి మొక్కను బతికించండి
చౌటుప్పల్: హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కకు ముళ్ల కంచెను ఏర్పాటు చేసి బతికించాలని సీఎం అదనపు కార్యదర్శులు స్మితాసబర్వాల్, ప్రియాంకవర్గీస్‌లు అధికారులకు సూచించారు. గురువారం నల్లగొండ జిల్లాలో పర్యటించారు. చౌటుప్పల్‌లోని అటవీ శాఖ కార్యాలయం ఆవరణలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటి, నీళ్లు పోశారు. అనంతరం హరితహారం కార్యక్రమంపై ఆరా తీశారు. హైవే వెంట నాటిన మొక్కలపై నిఘా ఉంచాలని సూచించారు. నాటినవి ఎన్ని, బతికినవి ఎన్ని అని ఆరా తీశారు. ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో 20నుంచి 40వేల మొక్కలు నాటాలని, ఈ నెల 30వ తేదీ వరకు హరితహారం కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరారు. హరితహారంలో ప్రజల భాగస్వామ్యం బాగుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు పెద్దిటి బుచ్చిరెడ్డి, డీఎఫ్ఓ సుదర్శన్‌రెడ్డి, డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి, తహసీల్దార్ షేక్‌అహ్మద్, ఎంపీడీఓ రజిత, సర్పంచ్ బొంగు లావణ్య, ఎం.దయాకరాచారి, ఆల్మాసుపేట కష్ణయ్య, అటవీ శాఖ అధికారిణి సత్యనారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.