టీవీల్లోనూ, అడ్వర్టైస్‌మెంట్‌ల్లోనూ భారీ కురులను చూసుంటాం. రియల్ లైఫ్‌లోఎక్కువగా సన్యాసుల్లో చూస్తుంటాం. ఒక వేళ ఉన్నా ఇక్కడున్న మహిళకు ఉన్నంత భారీ కురులను చూసి ఉండే అవకాశమే లేదు. ఎవరామె? ఆమె చుట్టు సంరక్షణ రహస్యం ఏంటీ వంటి వాటి గురించి తెలుసుకుందాం.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన 46 ఏళ్ల స్మితా శ్రీ వాస్తవ అత్యంత పొడవాటి జుట్టుని కలిగి ఉన్న మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది. ఆమె జుట్టు ఏకంగా తొమ్మిది అంగుళాల పొడవుతో ఉంది. ఆమె 14 ఏళ్ల ప్రాయం నుంచి కత్తిరించడం మానేసింది. అంతేగాదు చుట్టును కడగడానికే దాదాపు 45 నిమిషాలు పడుతుందట. తనకు తన జుట్టు అంటే మహా ఇష్టమని, దీనికి గుర్తిపు రావాలని ఎంతగానో కోరుకున్నాని చెప్పుకొచ్చింది. చివరికి దేవుడు తన ప్రార్థనలు ఆలకించి ప్రపంచ రికార్డులో చోటు దక్కేలా చేశాడని అంటోంది శ్రీ వాస్తవ.
ప్రస్తుతం ఆమెకు 46 ఏళ్లు వారానికి రెండు సార్లు జుట్టును కడుగుతుందట. అయితే వాషింగ్, డ్రైయింగ్, డిటాంగ్లింగ్, స్టైలింగ్‌తో సహా మొత్తం ప్రక్రియకు ప్రతిసారీ మూడు గంటల వరకు పడుతుందట. తనకు జుట్టుని సంరక్షించుకోవాలనే విషయంలో ప్రేరణ తన అమ్మేనని చెబుతోంది. తన కుటుంబంలోని ప్రతిఒక్కరికి అందమైన జుట్టు ఉంది. అదీగాక 80ల టైంలోని హిందీ సినిమాల్లో నటీమణులు చాలా అందంగా ఉండేవారు. ఆ కాలల్లోని వాళ్లందరికీ జుట్టు చాలా పొడవుగా ఉండేది. అదే తనను బగా ప్రేరేపించిందని చెబుతోంది శ్రీ వాస్తవ.
మన సమాజంలో పొడవాటి జుట్టు మహిళల అందాన్ని తెలియజేస్తుంది. ఇక శ్రీ వాస్తవ గత 20 ఏళ్లలో వెంట్రుకలను కత్తిరించలేదు. అయితే ఒకనొక సమయంలో కాస్త ఎక్కువగా జుట్టురాలిందని, అందుకోసం శ్రద్ధ తీసుకోవడంతో ఆ సమస్యను నివారించగలిగానని చెప్పింది శ్రీ వాస్తవ. అలాగే ఆమె తన జుట్టు సంరక్షణ కోసం కృత్రిమ షాంపూలు, కండీషనర్లకు దూరంగా ఉంటానని అంటోంది. ఎక్కువగా గుడ్డు, ఉల్లిపాయ రసం, అలోవెరా వంటి సహజమైన పదార్థాలతో జుట్టును సంరక్షించుకుంటానని అదే తన కేశసంపద రహస్యమని చెబుతోంది శ్రీ వాస్తవ. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెమిడీలను తప్పకు ప్రయత్నించండి.
(చదవండి: స్లిమ్‌గా మారిన భూమి పడ్నేకర్!.. జస్ట్ నాలుగు నెలల్లో ఏకంగా..!)
Comments
Please login to add a commentAdd a comment