Long Hair
-
వామ్మో ఎంత పొడుగు జుట్టు!..గిన్నిస్ రికార్డులకెక్కింది!
టీవీల్లోనూ, అడ్వర్టైస్మెంట్ల్లోనూ భారీ కురులను చూసుంటాం. రియల్ లైఫ్లోఎక్కువగా సన్యాసుల్లో చూస్తుంటాం. ఒక వేళ ఉన్నా ఇక్కడున్న మహిళకు ఉన్నంత భారీ కురులను చూసి ఉండే అవకాశమే లేదు. ఎవరామె? ఆమె చుట్టు సంరక్షణ రహస్యం ఏంటీ వంటి వాటి గురించి తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 46 ఏళ్ల స్మితా శ్రీ వాస్తవ అత్యంత పొడవాటి జుట్టుని కలిగి ఉన్న మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది. ఆమె జుట్టు ఏకంగా తొమ్మిది అంగుళాల పొడవుతో ఉంది. ఆమె 14 ఏళ్ల ప్రాయం నుంచి కత్తిరించడం మానేసింది. అంతేగాదు చుట్టును కడగడానికే దాదాపు 45 నిమిషాలు పడుతుందట. తనకు తన జుట్టు అంటే మహా ఇష్టమని, దీనికి గుర్తిపు రావాలని ఎంతగానో కోరుకున్నాని చెప్పుకొచ్చింది. చివరికి దేవుడు తన ప్రార్థనలు ఆలకించి ప్రపంచ రికార్డులో చోటు దక్కేలా చేశాడని అంటోంది శ్రీ వాస్తవ. ప్రస్తుతం ఆమెకు 46 ఏళ్లు వారానికి రెండు సార్లు జుట్టును కడుగుతుందట. అయితే వాషింగ్, డ్రైయింగ్, డిటాంగ్లింగ్, స్టైలింగ్‌తో సహా మొత్తం ప్రక్రియకు ప్రతిసారీ మూడు గంటల వరకు పడుతుందట. తనకు జుట్టుని సంరక్షించుకోవాలనే విషయంలో ప్రేరణ తన అమ్మేనని చెబుతోంది. తన కుటుంబంలోని ప్రతిఒక్కరికి అందమైన జుట్టు ఉంది. అదీగాక 80ల టైంలోని హిందీ సినిమాల్లో నటీమణులు చాలా అందంగా ఉండేవారు. ఆ కాలల్లోని వాళ్లందరికీ జుట్టు చాలా పొడవుగా ఉండేది. అదే తనను బగా ప్రేరేపించిందని చెబుతోంది శ్రీ వాస్తవ. మన సమాజంలో పొడవాటి జుట్టు మహిళల అందాన్ని తెలియజేస్తుంది. ఇక శ్రీ వాస్తవ గత 20 ఏళ్లలో వెంట్రుకలను కత్తిరించలేదు. అయితే ఒకనొక సమయంలో కాస్త ఎక్కువగా జుట్టురాలిందని, అందుకోసం శ్రద్ధ తీసుకోవడంతో ఆ సమస్యను నివారించగలిగానని చెప్పింది శ్రీ వాస్తవ. అలాగే ఆమె తన జుట్టు సంరక్షణ కోసం కృత్రిమ షాంపూలు, కండీషనర్లకు దూరంగా ఉంటానని అంటోంది. ఎక్కువగా గుడ్డు, ఉల్లిపాయ రసం, అలోవెరా వంటి సహజమైన పదార్థాలతో జుట్టును సంరక్షించుకుంటానని అదే తన కేశసంపద రహస్యమని చెబుతోంది శ్రీ వాస్తవ. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెమిడీలను తప్పకు ప్రయత్నించండి.(చదవండి: స్లిమ్‌గా మారిన భూమి పడ్నేకర్!.. జస్ట్ నాలుగు నెలల్లో ఏకంగా..!) -
కురులతో భారత కుర్రాడు.. గిన్నిస్ బుక్ ఎక్కేశాడు
లండన్: చిన్నప్పుడు స్నేహితులతో ఆడుకుంటుంటే.. అంతా అతన్ని ఏడిపించేవారట. అమ్మాయిలా.. ఆ జుట్టేంట్రా అని టీజ్ చేసేవారట. అది అతన్ని ఎంతో బాధించేదట. ఇంట్లో గోల చేసి మరీ ఆ జుట్టును తొలగించే ప్రయత్నమూ చేశాడట. కానీ, మత సంప్రదాయాలు(సిక్కు) పాటించే ఆ తల్లిదండ్రులు.. అతనికి సర్దిచెప్పారు. అలా 15 ఏళ్లపాటు అతను ఓర్పుగా పెంచుకున్న జుట్టు అతనిప్పుడు పాపులర్‌ని చేసింది. 15 ఏళ్ల సిదక్‌దీప్ సింగ్ చాహల్.. ప్రపంచంలోనే అతిపొడవైన జుట్టు ఉన్న టీనేజర్‌గా(కుర్రాడు) గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సిదక్‌దీప్.. పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా అతను జుట్టు తీసింది లేదట. అలా అదిప్పుడు 146 సెంటీమీటర్లు పెరిగి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ 2024 బుక్‌లో చోటు దక్కేలా చేసింది. Indian teen Sidakdeep Singh Chahal has never cut his hair. It's took him 15 years to grow the longest head of hair on a teenager. — #GWR2024 OUT NOW (@GWR) September 14, 2023 పెరిగేకొద్దీ ఒకానొక టైంలో.. నాకు జుట్టు మీద ఇష్టం పెరిగింది. కానీ, దానిని మెయింటెన్ చేయడం అంత సులువు కాదు. వారానికి రెండు సార్లు తలస్నానం చేస్తాను. కనీసం ఓ గంట పడుతుంది. జుట్టు శుభ్రం చేసుకోవడానికి మా అమ్మ నాకు సాయం చేస్తారు. లేదంటే నాకు ఓ రోజంతా సమయం పడుతుందేమో!.రికార్డు వచ్చిందని చెప్పినప్పుడు మా బంధువులు, నా స్నేహితులు ఎవరూ నమ్మలేదు::: సిదక్‌దీప్ -
కనికట్టు కాదిది.. తలకట్టు! 5 అడుగుల 5 అంగుళాలు.. 1999 నుంచి
అమెరికాకు చెందిన నల్లజాతి మహిళ ఎవిన్ డుగాస్(47) తన 5 అడుగుల 5 అంగుళాల భారీ తలకట్టుతో గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించింది. అతిపెద్ద తలకట్టును కలిగిన ఆఫ్రికా సంతతి మహిళగా గత 13 ఏళ్లలో ఆమె మూడు పర్యాయాలు తన రికార్డులను తానే బద్దలు కొట్టింది. లూసియానాకు చెందిన డుగాస్ 1999 నుంచి కురులను పెంచుతోంది. -
పొడవాటి జుట్టు పోయిందని బోరున విలపించిన మహిళ.. వీడియో వైరల్..
మహిళలకు ఒత్తైన, పొడవాటి జుట్టంటే అమితమైన ఇష్టం. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని శిరోజాలను సంరక్షించుకుంటారు. అప్పుడప్పుడు జుట్టు కాస్త ఎక్కువ జుట్టు ఊడిపోతేనే విలవిల్లాడిపోతారు. అలాంటిది అందమైన జుట్టును మొత్తం క్షణాల్లో షేవ్ చేస్తే ఆ మహిళ పరిస్థితి ఎలా ఉంటుందో ఉహించుకోండి.. ఓ మహిళ విషయంలో సరిగ్గా ఇలాగే జరిగింది. ఆమె అందమైన జట్టును భర్తే దగ్గరుండి ట్రిమ్మర్‌తో షేవ్ చేశాడు. క్షణాల్లో ఆమె జుట్టుమొత్తం మాయమైంది. పొడవాటి జట్టు పోయి తల బోడిగుండులా మారడంతో ఆ మహిళ కన్నీటి పర్యంతమైంది. ఆమెను భర్త తన కౌగిలిలోకి తీసుకుని ఓదార్చే ప్రయత్నం చేశాడు. కానీ ఆమె మాత్రం ఏడుస్తూనే ఉంది. దీంతో చలించిపోయిన భర్త.. భార్య జుట్టు పోయిందని బాధపడటం చూసి తన జుట్టును కూడా ట్రిమ్మర్‌తో క్లీన్ షేవ్ చేసుకున్నాడు. ఆమె వద్దని చెబుతున్నా వినలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. Empathy …👏👏👏pic.twitter.com/Ul8iAi64Jo — Harsh Goenka (@hvgoenka) March 2, 2023 అయితే ఈమె జుట్టును భర్తే షేవ్ చేయడానికి బలమైన కారణమే ఉంది. ఆమె క్యాన్సర్ బారినపడటంతో కీమో థెరపీ చికిత్స కోసం జుట్టును మొత్తం తీసేయాల్సి వచ్చింది. దీంతో భర్తే స్వయంగా ఈ పని చేశాడు. వ్యాపారవేత్త హర్ష గోయెంకా ఈ అందమైన వీడియోను ట్విట్టర్లో షేర్ చేయగా.. నెటిజన్లు చలించిపోయారు. చాలా బ్యూటిఫుల్‌గా ఉందంటూ కొనియాడారు. క్యాన్సర్‌పై పోరాటంలో భార్యకు తోడుగా ఉంటున్న భర్తను అభినందించారు. చదవండి: 48 గంటల్లోనే హైవే కింద సొరంగం.. ఇది కదా మనకు కావాల్సింది.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్.. -
పెళ్లి మండపంలో వధువు అనూహ్య నిర్ణయం.. కుటుంబం కంటతడి..
పెళ్లి అంటే ఓ పండగ. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో జరుపుకునే వేడుక. రెండు జీవితాలను ఒక్కటి చేసే వేదిక. చాలా మంది తమ పెళ్లిని ఎంతో ప్రత్యేకంగా జరుపుకోవాలని కోరుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో పలు జంటలు తమ వివాహాన్ని మంచి పనులకు వేదికగా మలుచుకుంటున్నారు. సమాజం కోసం, భవిష్యత్తు కోసం ఉపయోగపడే పనులకు శ్రీకారం చుడుతున్నారు. తాజాగా ఓ వధువు కూడా ఇలాగే ఆలోచించింది. పెళ్లి రోజు జీవితాంతం గుర్తుండేలా అందమైన, పొడవాటి తన జుట్టును కత్తిరించేందుకు సిద్ధపడింది. వధువు అనూహ్య నిర్ణయంతో మండపంలోని అతిథులందరూ ఆశ్యర్యానికి గురయ్యారు. అనంతరం ఆమె క్యాన్సర్ బాధితులకు జుట్టు డొనెట్ చేసిందుకు ఇలా చేసిందని తెలుసుకొని హర్షం వ్యక్తం చేశారు. పెళ్లిలో వధువు తన జుట్టు కత్తిరించుకుంటున్న ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని ఓ ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో షేర్ చేశారు. విందులో పెళ్లి దుస్తుల్లో ఉన్న వధువు.. వివాహ వేడుక అనంతరం తన పొడవాటి జుట్టును కత్తిరించుకోవడం కనిపిస్తోంది. క్యాన్సర్ రోగులకు సాయం చేసేందుకు ఇలా చేస్తున్నట్లు ఆమె తెలిపింది. వధువు జుట్టు కత్తిరించుకుంటుంటే ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులతో సహా అక్కడున్న వారంతా కంటతడి పెట్టుకున్నారు. ఇక ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. లక్షల్లో వ్యూస్ వచ్చి చేరుతున్నాయి. వధువు తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు సైతం ప్రశంసిస్తున్నారు. View this post on Instagram A post shared by Michigan Wedding Photographer & Videographer | Brianna Eslinger (@theunfilteredcollective) -
అరె జుట్టుతో ఒళ్లంతా చుట్టేసింది.. ‘బికినీ కంటే బాగానే ఉందిలే’!
‘ఓ వాలు జడా.. మల్లెపూల జడా.. ఓ పాము జడా.. సత్యభామ జడా’... అంటూ రాధాగోపాలం సినిమాలో స్నేహ జడను శ్రీకాంత్ అందంగా వర్ణించిన సాంగ్ అందరికి గుర్తుండే ఉంటుంది. అవునండి అమ్మాయిలకు సగం అందం ఆమె జుట్టు వల్లే కలగుతుందంటే అతిశయోక్తి కాదు. చాలా మందికి పొడుగు జుట్టు అంటే ఇష్టం.. కాదు కాదు పిచ్చి. కేశాల పెరుగుదలకు మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు, షాంపులు, కండీషనర్లు, ఆయుర్వేద మూలికలు.. ఇలా అన్నింటిని వాడేస్తుంటారు. అయినా అది అందరికి సాధ్యపడదు. ఇక పొడుగు జుట్టు ఉన్న వారిని చూసి అందరు కుళ్లుకోవడం తెలిసిన విషయమే. చకన్నమ్మ ఏం చేసినా అందమే అన్నట్లు పొడవాటి జుట్టు కలిగిన వారు దానిని ఎలా చేసిన అందంగానే ఉంటుంది. తాజాగా ఓ అమ్మాయి తన జుట్టుతో వినూత్నంగా ఆలోచించింది. తనకున్న తెలివిని ఉపయోగింది ఇంత వరకు ఎవరూ చేయని ఓ వింత పని చేసింది. తన లాంగ్ హెయిర్‌ను అందమైన డ్రెస్‌లా అలంకరించింది. దీనికి సంబంధించిన వీడియోను హెప్గుల్ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఓ యువతి క్యాప్, సన్ గ్లాసెస్ ధరించి డ్రెస్ లాగా తన పొడవాటి జుట్టును చుట్టేసింది.. అది సరిగా ఉండేందుకు నడుం వద్ద ఓ బెల్ట్‌ను ఉపయోగించింది. యువతి జుట్టు పొడుగ్గా, మందంగా ఉండటంతో డ్రెస్ లాగా కరెక్ట్ సెట్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు అమ్మాయి తెలివిని ప్రశంసిస్తున్నారు. బికినీలు, పొట్టి దుస్తులు ధరించే వారికంటే ఇది ఒకింత మంచిగానే ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది యువతి జుట్టు నిజమైనది కాకపోవచ్చని ఆమె హెయిర్ ఎక్స్టెన్షన్స్ని ఉపయోగించిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: జుట్టు బాగా రాలుతోందా.. ఇలా చేస్తే రాలడం తగ్గి, పెరుగుతుంది! View this post on Instagram A post shared by hepgul5 (@hepgul5) -
ఆర్టిస్ట్ అరెస్ట్: పోలీసులు చెప్పిన కారణం వింటే షాక్..
ఇస్లామాబాద్: అప్పుడప్పుడు పోలీసులు చేసే పనులు చూస్తే.. ఆశ్చర్యం, అసహనం వంటి ఫీలింగ్స్ అన్ని ఒకేసారి వ్యక్తం అవుతాయి. ఎందుకంటే వింత వింత కారణాలు చెప్పి సామాన్యులను అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తుంటారు పోలీసులు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి పాకిస్తాన్లో వెలుగు చూసింది. తెల్లవారుజామున రోడ్డు మీద రిక్షా కోసం వెయిట్ చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక వారు చెప్పిన కారణం వింటే ముక్కున వేలేసుకోవాల్సిందే. సదరు వ్యక్తి జుట్టు పొడవుగా పెంచుకున్నందుకు అరెస్ట్ చేశామన్నారు పోలీసులు. ఈ సంఘటనపై నెటిజనులు ఆగ్రహం వ్యక్త చేస్తునారు. ఆ వివరాలు.. పాకిస్తాన్‌కు చెందిన ఆర్టిస్ట్, టీచర్, ప్రదర్శనకారుడైన అబుజర్ మధు ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కల్మా చాక్ ప్రాంతంలో రిక్షా ఎదురు చూస్తున్నాడు. పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న పోలీసులు అబుజర్ని గమనించి అతడి వద్దకు వచ్చి వివరాలు ఆరా తీశారు. ఈ సమయంలో ఇక్కడ ఎందుకున్నావని ప్రశ్నించారు. ఆ తర్వాత అతడి ఐడీ కార్డ్ చూపించమని కోరారు. అబుజర్ తన ఐడెంటిటీ కార్డ్ పోలీసులుకు చూపించాడు. ఆ తర్వాత పోలీసులు అతడిని వ్యాన్‌లో ఎక్కించి స్టేషన్‌కు తీసుకెళ్లారు. రాత్రంతా అబుజర్ జైలులోనే గడిపాడు. తనను ఎందుకు అరెస్ట్ చేశారని పోలీసులను ప్రశ్నించగా.. అతడు జుట్టు పెద్దగా పెంచుకున్నాడని.. అందుకే అరెస్ట్ చేశామని తెలిపారు పోలీసులు. వారు చెప్పిన సమాధానం విన్న అబుజర్కు నవ్వాలో ఏడ్వాలో అర్థం కాలేదు. ఈ సంఘటన గురించి అబుజర్ స్నేహితురాలు, పిల్లల హక్కుల న్యాయవాది నటాషా జావేద్ ట్వీట్ చేయడంతో దీనిపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్ పోలీసులు ఇలా ప్రవర్తించడం కొత్తేం కాదని.. గతంలో తమకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ఈ క్రమంలో అబుజర్ మాట్లాడుతూ.. ‘నేను ఐడీ కార్డ్ చూపించినప్పటికి పోలీసులు నమ్మలేదు. నన్ను పూర్తిగా చెక్ చేశారు. ఇక రాత్రంతా జైలులోనే ఉంచారు. నాలాగే జుట్టు పెంచుకుని కార్లలో తిరిగే వారిని పోలీసులు అరెస్ట్ చేస్తారా’ అని ప్రశ్నించాడు. Last weekend, my friend Abuzar was picked up by Punjab Police in Lahore. He had to spend a night in Model town police station, in a lock up. Reason: his long hair. A thread — Natasha Javed (@natashajaved1) June 7, 2021 ఈ సంఘటనపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో పోలీసులు దీనిపై స్పందించారు. ‘‘అబుజర్ వేషధారణ కాస్త అనుమానాస్పాదంగా ఉంది. అతడు తన పొడవాటి జుట్టును ముడి పెట్టుకుని.. చేతికి ఓ కంకణం ధరించి ఉన్నాడు. పైగా తెల్లవారుజామున ఇలా రోడ్డు మీద ఉండటంతో అనుమానం వచ్చి స్టేషన్‌కు తీసుకెళ్లాం’’ అని తెలిపారు. చదవండి: భారత్‌పై మరోసారి విషం కక్కిన పాక్.. కారణం తెలిస్తే షాక్ కోసి కుట్లేయడమే కదా అనుకున్నాడు.. మహిళ మృతి -
అతిపొడవైన వెంట్రుకలను కత్తిరించుకున్న టీనేజర్
గాంధీనగర్ : అతిపొడవైన వెంట్రుకలతో ప్రత్యేకత చాటుకున్న నిలాంషి పటేల్ ఆ వెంట్రులకను కత్తరించుకుంది. గుజరాత్‌లోని అరవల్లి జిల్లాకు చెందిన 17 ఏళ్ల నిలాంషి 12 ఏళ్లపాటు అపురూపంగా పెంచుకున్న 6 అడుగుల 6.7 అంగుళాల పొడవైన వెంట్రుకలతో ఈ టీనేజర్ ఇటీవల గిన్నిస్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 2018లో 170.5 సెంటీమీటర్ల పొడవు కేశాలతో రికార్డు సృష్టించిన నిలాంషి.. తరువాత 2019లో 190 సెంటీమీటర్లు.. 2020లో 200 సెంటీమీటర్ల పొడవుగా కేశాలను పెంచింది. ఫలితంగా ప్రపంచంలో అతి పొడవైన కేశాలు కల్గిన యువతిగా మరోసారి గుర్తింపు పొందింది. ఈ ఘనత తన తల్లికే చెందుతుందని నిలాంషి తెలిపింది. చిన్నప్పుడు జరిగిన ఓ సంఘటన తనను మార్చేసిందని పేర్కొంది. అయితే, తాజాగా ఆ వెంట్రుకలను కత్తిరించుకొన్న వీడియోను తన ఫేస్బుక్ అకౌంట్లో పెట్టింది. ‘చాలా ఉత్సాహంగా అలాగే కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే ఈ కొత్త హెయిర్‌స్టైల్‌తో ఎలా కనిపిస్తానో నాకు తెలీదు. ఏం జరుగుతుందో చూద్దాం. కానీ అది అద్భుతంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను’ అని పేర్కొంది. ఇక తన వెంట్రుకలను హాలీవుడ్‌లోని గిన్నిస్ వరల్డ్ రికార్డు మ్యూజియానికి అందజేసినట్లు తెలిపింది. -
‘దెయ్యం జుట్టు’ అని కూడా వెక్కిరించారు
టోక్యో(జపాన్)కు చెందిన రిన్ కంబే మోడల్, డ్యాన్సర్. మోడలింగ్, డ్యాన్స్ వల్ల ఆమెకు పెద్దగా పేరేమి రాలేదుగానీ కేవలం జుట్టు వల్ల బోలెడు పేరు వచ్చింది. ఆమె శిరోజాల పొడవు అక్షరాలా ఆరు అడుగుల మూడు అంగుళాలు. పదిహేను సంవత్సరాల నుంచి జుట్టును కత్తిరించడం లేదట. తన జుట్టు గురించి రిన్ కంబే చాలా మురిపెంగా చెప్పుకుంటుంది.. ‘నా జుట్టు భావవ్యక్తీకరణకు బలమైన ఆయుధం’ ‘నా జుట్టు ఆసియా అందానికి ప్రతీక’....ఇలా గొప్పగా చెప్పుకోవడమే కాదు, ‘దెయ్యం జుట్టు’ అనే వెక్కిరింపుల గురించి కూడా ప్రస్తావిస్తుంది. జుట్టు పెంచడం, సంరక్షించడం అంతా వీజీ కాదని, తాను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నది అనర్గళం గా చెబుతుంది. ఆమె కష్టం వృథా పోలేదు. పొడవైన జుట్టు తనకు ప్రత్యేక గుర్తింపు తీసుకు వచ్చింది. -
పొడవు జుట్టు యువకులే అతడి టార్గెట్!
సాక్షి, విశాఖపట్నం/సంగారెడ్డి : తానో పోలీసునని, ఆడవాళ్లలా జుట్టు పెద్దగా పెంచుకుంటే కేసు పెడతానని యువకులపై బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని శుక్రవారం విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. సంగారెడ్డికి చెందిన మచుకూరి పండారి అనే వ్యక్తి తాను సీఐని అంటూ అనకాపల్లి భీముని గుమ్మం ప్రాంతానికి చెందిన మణికుమార్ అనే వ్యక్తికి ఫోన్ చేసి జుట్టు కత్తిరించుకోవాలని బెదిరించాడు. దీంతో మణికుమార్ తన జుట్టును కత్తిరించుకున్నాడు. పండారి అంతటితో ఆగక, గుండు చేయించుకోకపోతే సైబర్ క్రైమ్ నేరంపై కేసు నమోదు చేస్తామని మణికుమార్‌ను వేధించాడు. దీంతో అనుమానం వచ్చిన మణికుమార్ బంధువులు అనకాపల్లి పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల విచారణలో పండారి విషయం వెలుగులోకి వచ్చింది. అతడు ఆంధ్ర, తెలంగాణలో పలువురు యువకులను బెదిరించి జుట్టు కత్తిరించుకునేలా చేస్తున్నట్టు తెలిసింది. ( తల్లిపై దాడి; తండ్రిని హతమార్చిన కూతురు) మణికుమార్ జుట్టు కత్తిరించుకుని నిందితుడికి ఫొటో పెట్టగా.. అతని అన్నను కూడా జుట్టు కత్తిరించుకోమని బెదిరించినట్లు వెల్లడైంది. బాధితులు పోలీసులను ఆశ్రయించగా సదరు వ్యక్తిని ఫేక్ కాలర్గా గుర్తించినట్లు డీఎస్పీ తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు చూసి తలపై జుత్తు ఎక్కువగా ఉంటే వారి ఫోన్ నెంబర్లకి ఫోన్ చేసి బెదిరించడం నిందితుడికి అలవాటని చెప్పారు. గతంలో కూడా అతనిపై పలు కేసులు ఉన్నట్లు గుర్తించామన్నారు. పోలీసులమంటూ ఫేక్ కాల్ చేస్తే ఎవరూ భయపడవద్దని తెలిపారు. -
80 ఏళ్లుగా జుట్టు కత్తిరించలేదు..!
లాక్డౌన్ కాలంలో సెలూన్ షాపులు మూతపడిన నేపథ్యంలో కొంతమంది పురుషులు పెరిగిన జుట్టుతో చికాకు పడుతూ సొంతంగానే కటింగ్ చేసుకున్నారు. సెలబ్రిటీలు మొదలు సామాన్యుల వరకు చాలా మంది స్వయంగా క్షవరం చేసుకుని ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇప్పుడు రిలీఫ్‌గా ఉందని, హెయిర్ కటింగ్ షాపులు ఇంకొన్నాళ్లు మూసి ఉంటే తమ పరిస్థితి ఏమయ్యేదోనంటూ కామెంట్లు చేశారు. అలాంటి వాళ్లు వియత్నాంకు చెందిన 92 ఏళ్ల గుయెన్ వాన్ చిన్ గురించి తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే దాదాపు 80 ఏళ్లుగా చిన్ ఒక్కసారి కూడా తన జుట్టును కత్తిరించుకోలేదు. దీంతో సుమారు ఐదు మీటర్ల పొడవు మేర పెరిగిన జుట్టుతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. మూడో తరగతి చదువుతున్న సమయంలోనే జీవితంలో ఎప్పుడూ హెయిర్‌కట్ చేయకూడదని నిశ్చయించుకున్నారట. అయితే చిన్ ఇలా చేయడం వెనుక ఓ బలమైన కారణం కూడా ఉందని చెబుతున్నారు. (చదవండి: కాలు చూపిస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు) ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘ఒకవేళ నేను నా జట్టు కత్తిరించుకుంటే చనిపోతానని నమ్ముతాను. అందుకే కనీసం ఒక్కసారి కూడా దువ్వెన ఉపయోగించలేదు. ముడివేసి కొప్పులా మార్చి దానిపై ఓ వస్త్రాన్ని చుడతాను. ఎల్లపుడూ పొడిగా, శుభ్రంగా ఉండేలా చూసుకుంటాను. చిన్నప్పటి నుంచి నా జుట్టు ఎంతో బలంగా, నల్లగా, ఒత్తుగా ఉండేది. అప్పుడు చక్కగా దువ్వుకొనేవాడిని. అయితే దేవుడి పిలుపు విన్న తర్వాత అంతా మారిపోయింది. జుట్టుకు, అమరత్వానికి మధ్య బలమైన సంబంధం ఉందని నేను నమ్ముతాను’’ అని రాయిటర్స్‌తో చెప్పుకొచ్చారు.(చదవండి: స్కిన్ ఎలర్జీ.. ఈ అమ్మాయి ఏం చేసిందంటే!) కాగా స్థానికంగా ప్రాచుర్యం పొందిన ‘కొకొనట్’ మత విశ్వాసాన్ని ఆచరిస్తున్నారు. 1963లో స్థాపించిన ఈ మతాచారం ‘దువా’పై ప్రస్తుతం వియత్నాంలో నిషేధం ఉంది. ఇక తాను కేవలం కొబ్బరికాయల వల్లే తమ మనుగడ కొనసాగిందని, వాటి కారణంగానే శారీకరంగా దృఢంగా ఉన్నానని ఈ మత స్థాపకులు బోధించినట్లు స్థానికులు చెప్పుకొంటారు. -
ఆ తప్పిదమే అదృష్టం తెచ్చిపెట్టింది!
గాంధీనగర్: పొడవు జడ కోసం తహతహలాడే యువతులు చాలామందే ఉంటారు. కానీ ప్రస్తుత రోజుల్లో ఉన్న జుట్టు కాపాడుకోవడమే కష్టంగా మారింది. అలాంటిది ఇక వాలుజడకు చోటెక్కడిది. కానీ ఓ భారతీయ యువతి తన జుట్టుతో రికార్డు సృష్టించి అందరి దృష్టినీ ఆకర్షించింది. గుజరాత్‌కు చెందిన నీలాన్షి పటేల్ 190 సెం.మీ(6.2 అడుగులు) జుట్టుతో ప్రపంచంలోనే పొడవాటి జుట్టు కలిగిన యువతిగా గిన్నిస్ రికార్డుకెక్కింది. 2018లో 170.5 సెం.మీ(5.59 అడుగులు) పొడవు జుట్టుతో గిన్నిస్‌లో చోటు దక్కించుకున్న నీలాన్షి తాను నెలకొల్పిన రికార్డును తనే తిరగరాసింది. దీనిపై నీలాన్షి మాట్లాడుతూ.. ‘చిన్నతనంలో హెయిర్ డ్రెస్సర్ సరిగ్గా జుట్టు కత్తిరించలేదు. ఆ కోపంతో మరెప్పుడూ జుట్టు కత్తిరించుకోవద్దని శపథం పూనుకున్నాను. నా నిర్ణయాన్ని మా తల్లిదండ్రులు కూడా స్వాగతించారు. అలా 11 సంవత్సరాలుగా నా జుట్టుకు కత్తెర అవసరం రాలేదు. అతని పొరపాటే నా పాలిట వరంగా మారింది’ అని ఆమె చెప్పుకొచ్చింది. అయితే గతంలో జరిగిన తప్పిదం వల్లే నీలాన్షికి ఇంత అదృష్టం దక్కిందని ఆమె సంతోషం వ్యక్తం చేశాడు. నీలాన్షిని ఆమె స్నేహితులు, బంధువులు ముద్దుగా రపుంజెల్(పొడవాటి జుట్టు ఉండే ఓ కార్టూన్ పేరు) అని పిలుస్తారట. తనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన కురుల కోసం నీలాన్షి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. జుట్టు నేలపై ఆనకుండా పొడవాటి హీల్స్ ధరిస్తుంది. తలస్నానం చేసిన ప్రతిసారి ఎండలో లేదా హెయిర్‌డ్రయర్ ద్వారా కానీ జుట్టును ఆరబెట్టుకుంటుంది. వారానికి ఒకటి, రెండు సార్లు తలకు నూనె రాసుకుంటుంది. కానీ స్విమ్మింగ్ చేసేటప్పుడు మాత్రం ఇబ్బంది తప్పట్లేదంటోంది. ఇక జుట్టును ఎప్పుడూ అల్లుకోవడమే ఇష్టమని, కానీ కొన్ని ప్రత్యేక సమయాల్లో మాత్రం కొప్పు కడుతానని చెప్పుకొచ్చింది. కొప్పున్న అమ్మ ఎన్ని కొప్పులేసినా అందమే అని ఊరికే అనలేదు మరి. చదవండి: గిన్నిస్‌లో 80 మంది భారతీయులు విమానాన్ని నా జుట్టుతో లాగుతా..అదే నా లక్ష్యం -
ఈ మహిళల జుట్టు ఇంత పొడవా!
-
ఈ మహిళల జుట్టు ఇంత పొడవా!
ప్రపంచంలో ఎక్కడైనా ఆదివాసులు చిత్ర విచిత్ర వేషాధారణలో కనిపించడమే కాకుండా వేల సంవత్సరాలపాటు అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తారని మనకు తెలుసు. నాగరికత నీడ పడనంత కాలమే వారు అలా ఉంటారు. ఆధునిక సంస్కతి ప్రభావంతో వారి వేషధారణలోనూ, ఆచారాల్లో మార్పులు వస్తుంటాయి. కానీ చైనాలోని గ్వాగ్జీ రాష్ట్రంలో హాంగ్లో గ్రామానికి చెందిన యహో తెగకు చెందిన మహిళలపై మాత్రం ఆధునిక నాగరికత ప్రభావం కనిపించడం లేదు. రెండు వేల ఏళ్ల నాటి ఈ తెగ మహిళలు జీవితంలో ఒక్కసారి మాత్రమే జట్టును కత్తిరించుకుంటారు. అదీ 18వ ఏట పెళ్లీడుకు వచ్చాకే. మళ్లీ జీవితంలో ఎన్నడూ కత్తిరించుకోరు. పెళ్లీడుకు వచ్చినప్పుడు కత్తిరించిన జుట్టుతోనే వారు పెళ్లయ్యాక హేర్ పిన్నులు తయారు చేసుకొని కొప్పులకు పెట్టుకుంటారు. ఆ హేర్ పిన్నులనుబట్టే వారికి పెళ్లయిందా, లేదా అన్న విషయం ఇతరులకు తెలుస్తుంది. ఎర్రటి ఎంబ్రాయిడరీగల నల్లటి దుస్తులు ధరించడం కూడా అక్కడి మహిళల ప్రత్యేకత. యూనిఫారమ్లాగా అందరు మహిళలు ఒకే రకం దుస్తులు ధరిస్తారు. వారు ఆరోగ్యంగా ఉంటారు. తమ సంపూర్ణ ఆరోగ్యానికి తాము పెంచుతున్న జుట్టే కారణమని వారు భావిస్తారు. వారు జుట్టు సంరక్షణ కోసం బియ్యం కడిగిన నీళ్లతో జుట్టును శుభ్రం చేసుకుంటారు. హాంగ్లో గ్రామంలో 400 మంది ఈ తెగ ప్రజలు నివసిస్తుండగా, వారిలో 60 మంది మహిళలు ఉన్నారు. వారి జుట్టూ మూడు అడుగుల నుంచి ఆరు అడుగుల వరకు పొడుగు ఉంటుంది. వారిలో ఒక మహిళకు అందరికన్నా ఏడు అడుగుల పొడవు జుట్టు ఉంది. వారంతా తమ గ్రామానికి వచ్చే పర్యాటకులకు తమ జుట్టును చూపించి మురిసిపోతుంటారు. 60 మంది మహిళలో 18 ఏళ్ల ప్రాయానికి వచ్చిన ఓ యువతి మాత్రం తన జుట్టును కత్తిరించుకోవడం తనకు ఇష్టం లేదని, జుట్టును పెంచి ప్రపంచ రికార్డు సాధించాలన్నది తన ఆలోచన అని ఆమె చెప్పారు. అయితే తుది నిర్ణయం మాత్రం తన తాత చేతిలో ఉందని ఆమె అన్నారు. ప్రపంచంలో అతి పొడువు జుట్టుగల మహిళగా గిన్నీస్ రికార్డును సాధించినది కూడా చైనా మహిళే. జియా కియాపింగ్కు చెందిన చైనా మహిళ 18 అడుగుల ఐదు అంగుళాల జుట్టుతో వరల్డ్ రికార్డు నెలకొల్పారు. -
ఆమె ఆడవారికి అసూయ పుట్టిస్తోంది!
మాస్కో: జుట్టున్నమ్మ ఏ కొప్పయినా వేస్తుంది అంటారు. అది ముమ్మాటికీ నిజమే అనిపిస్తోంది ఈ రష్యా భామను చూస్తుంటే. గుబనోవ్ ఫ్రెకిల్ అనే యువతి జుట్టు ఇప్పటికే 150 సెంటీ మీటర్లు పెరిగి ఆడవారికి ఆసూయ పుట్టిస్తోంది. ఆ జుట్టుతో రకరకాల డిజైన్లతో అమ్మడు సోషల్ మీడియాలో ఉంచిన ఫోటోలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. తనకు పొడవైన జుట్టంటే ఇష్టమనీ.. అందుకే ఎప్పుడూ హెయిర్ కట్ జోలికి వెళ్లలేదని చెబుతోంది. నుంచున్నా అరికాళ్లను తాకేళా జుట్టు ఎప్పుడు పెరుగుతోందా అని వెయిట్ చేస్తోందట. జుట్టుకు సంబంధించిన సలహాలు కూడా ఇస్తానంటూ ఆఫర్ చేస్తోంది. అయితే.. ఎన్ని సంవత్సరాలు పెంచితే మాత్రం అందరికీ ఆ అదృష్టం ఉండొద్దూ అంటున్నారు సోషల్ మీడియాలో ఆమె జుట్టును చూసిన మహిళలు. -
ఇది ఏడడుగుల ‘తలకట్టు’..
పొడుగాటి జడ ఆడవారికి అలంకారంగా భావించడం కద్దు. కానీ, ఇక్కడ చిత్రంలో కనబడుతున్న వృద్ధుని జుట్టు చూస్తే ఎవరైనా ఔరా అనకమానరు. జడలు కట్టిన ఇతని జుట్టు అరికాళ్ల వరకూ పెరగడంతో ఆగక నేలపై పారాడుతోంది. విశాఖ జిల్లా బుచ్చియ్యపేట మండ లం విజయరామరాజుపేటకు చెందిన ఆడారి సీతారాం బాబా 30 ఏళ్ల క్రితం సన్యాసం తీసుకున్నారు. అప్పటి నుంచి పెరిగిన ఆయన జుట్టు ఇప్పుడు ఏడడుగులకు చేరింది. గురువారం ఆయన తూర్పు గోదావరి జిల్లా తుని వచ్చారు. అయోధ్యలోని బాబా మణిరామ్ దాజీ కా చోటీ చౌవుని ఆశ్రమంలో గురూపదేశం పొంది, సన్యాసిగా మారానని ‘సాక్షి’కి తెలిపారు. - తుని -
అమరాంజనేయస్వామి!
నమ్మకం ఆ బాలుడి పేరు అమర్‌సింగ్. వయసు ఆరు సంవత్సరాలు. ఇతడిది ఉత్తరప్రదేశ్‌లోని నిజ్మాపూర్ అనే ఒక చిన్న పల్లెటూరు. ఐదుమంది తోబుట్టువుల్లో అందరి కన్నా చిన్నవాడు.ఆమర్ ఇప్పుడు వాళ్ల ఊరిలో ప్రత్యేకమైన వాడు. అతడిని ఒక దైవాంశ సంభూతుడిగా చూస్తోంది ఆ గ్రామం మొత్తం. అందుకు కారణం అమర్‌కు వెన్నెముకకు కింది భాగంలో శరీరంపై పొడవాటి రోమాలు ఉండటమే. పొడవుగా పెరిగిన అవాంఛిత రోమాలు అతడు ఆంజనేయస్వామి అంశ అనే నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. గ్రామస్తులే కాదు, అమర్ కుటుంబం కూడా అదే అభిప్రాయంతో ఉంది. తమకు దైవాంశ పుట్టాడని అమర్ తండ్రి అంటున్నాడు. తమ కుమారుడికి ఆ వెంట్రుకలు వరంగా లభించాయని ఆయన అంటున్నాడు. ఇక అమర్‌కు అలా వెంట్రుకలు పెరగడం స్పైనా బిఫిడా ప్రభావమే అంటున్నారు వైద్యులు. వెన్నెముకకు సంబంధించిన చిన్నపాటి సమస్యతో అలా వెంట్రుకలు పెరగడం జరుగుతుందని వైద్యుల అభిప్రాయం. అయితే ఇలా వెంట్రుకలు పెరగడం వల్ల అసౌకర్యం ఉండవచ్చునేమో కానీ ఆరోగ్యంపై ఎలాంటి దుష్ర్పభావం ఉండదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. -
‘తల’కు మించిన భారమైనా... తగ్గని ‘ఆశ’
అమెరికాలోని జార్జియా ప్రాంతానికి చెందిన ఆశామండులా పాతికేళ్లపాటు జుట్టుని విపరీతంగా పెంచేసింది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుని, ఆ రికార్డుని చాలా కాలమే నిలబెట్టుకుంది. ఇప్పుడు వచ్చిన సమస్యల్లా ఈ జుట్టుతోనే... 19 అడుగుల పొడవున్న ఈ జుట్టువల్ల ఆశాకు శారీరకమైన సమస్యలు తప్పవని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అంత పొడవున్న జుట్టును మోయడం ‘తల’కు మించిన భారమంటున్నారు. ఇంత పొడవు జడ మూడు పెద్ద బండరాళ్లను తలపై పెట్టుకుని తిరగడంతో సమానమంటున్నారు డాక్టర్లు. అలాగే బ్యాక్టీరియా సమస్య కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఆశాకు కూడా ఈ విషయాలు తెలియనివేమీ కాదు. కాని, ఎన్ని సమస్యలు ఎదురైనా.. జుట్టును కత్తిరించేది మాత్రం లేదంటోంది. జుట్టును కత్తిరించడమంటే ఆత్మహత్యతో సమానమని ఆషా భావిస్తోంది. పాతికేళ్ల కిందట ‘దేవుడి ఆజ్ఞ’తో జుట్టును పెంచడం మొదలుపెట్టానని చెబుతున్న ఆశాకు, శరీరంలోని హార్మోన్లు కూడా సహకరించడంతో జడ విపరీతంగా పెరిగింది. ఆషా జడపొడవు 55 అడుగులు. అయితే ఆఫ్రికన్ స్టైల్ ఉంగరాల జుట్టుగా మార్చడంతో ఈ పొడవు 19 అడుగులకు తగ్గింది. ఆషా జడను చూసి ఒకరి తర్వాత ఒకరిగా ముగ్గురు యువకులు ఆశాను వివాహం చేసుకున్నారు, విడాకులు తీసుకున్నారు.