‘తల’కు మించిన భారమైనా... తగ్గని ‘ఆశ’ | Asha Mandela will Never Cut Her 19-Foot-Long Hair | Sakshi
Sakshi News home page

‘తల’కు మించిన భారమైనా... తగ్గని ‘ఆశ’

Published Mon, Aug 19 2013 11:08 PM | Last Updated on Tue, Aug 21 2018 2:34 PM

‘తల’కు మించిన భారమైనా... తగ్గని ‘ఆశ’ - Sakshi

‘తల’కు మించిన భారమైనా... తగ్గని ‘ఆశ’

అమెరికాలోని జార్జియా ప్రాంతానికి చెందిన  ఆశామండులా పాతికేళ్లపాటు జుట్టుని విపరీతంగా పెంచేసింది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుని, ఆ రికార్డుని చాలా కాలమే నిలబెట్టుకుంది. ఇప్పుడు వచ్చిన సమస్యల్లా ఈ జుట్టుతోనే... 19 అడుగుల పొడవున్న ఈ జుట్టువల్ల ఆశాకు శారీరకమైన సమస్యలు తప్పవని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అంత పొడవున్న జుట్టును మోయడం ‘తల’కు మించిన భారమంటున్నారు.

ఇంత పొడవు జడ మూడు పెద్ద బండరాళ్లను తలపై పెట్టుకుని తిరగడంతో సమానమంటున్నారు డాక్టర్లు. అలాగే బ్యాక్టీరియా సమస్య కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఆశాకు కూడా ఈ విషయాలు తెలియనివేమీ కాదు. కాని, ఎన్ని సమస్యలు ఎదురైనా.. జుట్టును కత్తిరించేది మాత్రం లేదంటోంది. జుట్టును కత్తిరించడమంటే ఆత్మహత్యతో సమానమని ఆషా భావిస్తోంది.

పాతికేళ్ల కిందట ‘దేవుడి ఆజ్ఞ’తో జుట్టును పెంచడం మొదలుపెట్టానని చెబుతున్న ఆశాకు, శరీరంలోని హార్మోన్లు కూడా సహకరించడంతో జడ విపరీతంగా పెరిగింది. ఆషా జడపొడవు 55 అడుగులు. అయితే ఆఫ్రికన్ స్టైల్ ఉంగరాల జుట్టుగా మార్చడంతో ఈ పొడవు 19 అడుగులకు తగ్గింది. ఆషా జడను చూసి ఒకరి తర్వాత ఒకరిగా ముగ్గురు యువకులు ఆశాను వివాహం చేసుకున్నారు, విడాకులు తీసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement